'అలా చేయడం చాలా అసహ్యాంగా ఉంది'.. మంచు విష్ణు పోస్ట్ వైరల్ | Manchu Vishnu Tweet On Tamilnadu Politics Over Vijay and trisha episode | Sakshi
Sakshi News home page

Manchu Vishnu: 'అలా చేయడం చాలా అసహ్యాంగా ఉంది'.. మంచు విష్ణు ట్వీట్

Mar 18 2026 3:04 PM | Updated on Mar 18 2026 3:19 PM

Manchu Vishnu Tweet On Tamilnadu Politics Over Vijay and trisha episode

తమిళనాడు రాజకీయాలపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆసక్తికర పోస్ట్ చేశారు. పాలిటిక్స్‌లోకి హీరోయిన్లను లాగడం చాలా అసభ్యకరంగా ఉంటుందని అన్నారు.  ఇది కేవలం తమిళనాడులో మాత్రమే  కాదని.. ఎక్కడ జరిగినా సమంజసం కాదన్నారు. నటులు ఉంటే కేవలం రాజకీయాల్లో  పావుగా  వాడుకునే వస్తువులు   కాదని  ట్వీట్  చేశారు.  వారికి   కుటుంబం, గౌరవం, పర్సనల్‌ లైఫ్‌ అనేవి  కూడా ఉంటాయన్నారు.  

ప్రజా చర్చ అనేది ప్రాథమిక గౌరవానికి, ముఖ్యంగా మహిళల పట్ల గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదని సూచించారు. మన భారతీయ సంస్కృతి, దాని మూలాల్లోనే మహిళలను  శక్తిగా గౌరవిస్తామని  రాసుకొచ్చారు. అలాంటి శక్తిగా భావించే మహిళలను వారిని వార్తా శీర్షికల  కోసం అవమానించేలా ఉండకూడదని  పోస్ట్ చేశారు. ఇక నుంచేనా మనం మంచిగా ప్రవర్తిద్దామని హితవు పలికారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

విజయ్- త్రిష ఎపిసోడ్‌పైనే..

ఇటీవల కోలీవుడ్‌లో  విజయ్-త్రిష వ్యవహారం అనూహ్యంగా తెరపైకొచ్చింది. విజయ్ భార్య  సంగీత  విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో త్రిష గురించి చర్చ నడుస్తోంది. త్రిష- విజయ్‌ల మధ్య రిలేషన్ ఉందని ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరు ఓ పెళ్లికి హాజరు కావడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిషకు అండగా పలువురు కోలీవుడ్ నటీనటులు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. అది వారి వ్యక్తిగత జీవితమని.. మనం కేవలం సినిమాల గురించి మాత్రమే చర్చించాలని ఓ సీనియర్ నటుడు అన్నారు. తాజాగా మంచు విష్ణు సైతం ఈ విషయంతో త్రిషకు మద్దతుగా ట్వీట్‌ చేసినట్లు తెలుస్తోంది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement