మెగా తనయుడు రామ్ చరణ్ బర్త్ డే వేళ మెగాస్టార్ తన గొప్ప మనసును చాటుకున్నారు. కుమారుడి పుట్టినరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ బహుమతి పురస్కారం రూ.10 లక్షల నగదు మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళమిచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పలువురు అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న సర్వ్ ఫౌండేషన్, అంధుల కోసం పని చేస్తున్న దేవనార్ ఫౌండేషన్, చిన్నారులను సంరక్షిస్తున్న వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లతోపాటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి కూడా మెగాస్టార్ విరాళంగా ఇచ్చారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్‌ను కలిసిన వృద్ధులను మెగాస్టార్ తన బ్లడ్ బ్యాంక్‌కు ఆహ్వానించారు. వారందరికీ బర్త్ డే గిఫ్ట్‌గా కొత్త దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం తానే స్వయంగా వారందరికీ భోజనాలు పెట్టించారు.


