అడివి శేష్ డెకాయిట్.. చిచ్చుబుడ్డి ఫుల్ వీడియో వచ్చేసింది..! | Adivi Sesh Dacoit MOvie Chichubuddi Video Song out now | Sakshi
Sakshi News home page

Dacoit Movie: అడివి శేష్ డెకాయిట్.. చిచ్చుబుడ్డి ఫుల్ సాంగ్ వచ్చేసింది..!

Apr 24 2026 9:22 PM | Updated on Apr 24 2026 9:22 PM

Adivi Sesh Dacoit MOvie Chichubuddi Video Song out now

టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.  మొదటిరోజు అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ రూ. 15 కోట్లతో రికార్డ్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీ..  వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ రిలీజ్ చేశారు. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్‌ విడుదల చేశారు. ఈ పాటలో సింగర్ జోనితా గాంధీ ఆకట్టుకుంది. ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. రామ్ మిరియాల, జోనితా గాంధీ ఆలపించారు. ఈ సాంగ్‌ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి.

 

Advertisement
 
Advertisement
Advertisement