అనుకున్నదే జరిగింది.. పెద్ది మరోసారి వాయిదా | Raam charan Peddi MOvie Postponed again | Sakshi
Sakshi News home page

Peddi Movie: అనుకున్నదే జరిగింది.. పెద్ది మరోసారి వాయిదా

Apr 15 2026 5:31 PM | Updated on Apr 15 2026 7:21 PM

Raam charan Peddi MOvie Postponed again

రామ్ చరణ్ పెద్ది విషయంలో అనుకున్నదే జరిగింది. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది మూవీ టీమ్. ఈ చిత్రాన్ని జూన్‌కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దీంతో మెగా ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మార్చి 19న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఏప్రిల్ 30న రానుందని ముందుగా ప్రకటించారు. తాజాగా మరోసారి వాయిదా వేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ నోట్ రిలీజ్ చేసింది.

నిర్మాణ సంస్థ తమ నోట్‌లో రాస్తూ.. 'మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. గ్లింప్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పెద్ది మూవీ పట్ల మీ ప్రేమకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పటికే సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. కేవలం ఓ సాంగ్ షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడే ఎడిట్ కాపీని చూశాం. అద్భుతంగా వచ్చింది. కానీ మీకు మరింత అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించడం కోసం కృషి చేస్తున్నాం. మరింత ఫర్‌ఫెక్షన్‌తో మీ ముందుకొస్తాం. జూన్‌లో పెద్దిని మీ ముందుకు తీసుకొస్తాం. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. మీ సపోర్ట్, ఓపికకు మరోసారి ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు.

పెద్ది మరోసారి వాయిదా...రామ్ చరణ్ అనుకున్నదే జరిగింది.

కాగా.. ఈ సినిమాకు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో గ్లోబల్ స్టార్ చెర్రీ రెజ్లర్‌ లుక్‌లో అభిమానులను ఆకట్టుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement