మెగా హీరో వరుణ్ తేజ్ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరియన్ కనకరాజుతో పాటు బరి అనే చిత్రంలో నటిస్తున్నారు. బరి మూవీ కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా మోకాలికి తీవ్రమైన గాయ అయిందని నిహారిక కొణిదెల వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం గాయానికి సర్జరీ జరిగిందని తెలిపారు. వరుణ్ తేజ్ గాయం నుంచి కోలుకుంటున్నారని ఇన్‌స్టాలో పంచకుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తమ హీరో త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.
కాగా.. ఈ ప్రాజెక్ట్‌ను నిహారిక కొణిదెల తన బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘కమిటీ కుర్రోళ్లుతో భారీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ యుదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. తన సొంత ఫ్యామిలీ బ్యానర్‌లో వరుణ్ తేజ్ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగనుందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. మరోవైపు వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తోన్న హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ కొరియన్ కనకరాజు చిత్రంలోనూ నటిస్తున్నారు.


