breaking news
Visakhapatnam
-
మనవడిని అమ్మేసిన తాత
తాటిచెట్లపాలెం(విశాఖపట్నం): కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని తండ్రి, తన కుమార్తెకు పుట్టిన మగబిడ్డను ఆమెకు తెలియకుండానే దత్తత ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు నేరుగా పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. అరకు ప్రాంతానికి చెందిన పెట్టెల దివ్య (23) అదే ప్రాంతానికి చెందిన జాన్‌బాబును ప్రేమించి వివాహం చేసుకుంది. దివ్య తండ్రి పి. శుక్రకు ఈ వివాహం మొదటి నుంచి ఇష్టం లేదు. వారిద్దరినీ విడదీయడానికి అతను పలు ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో దివ్య, జాన్‌బాబు మధ్య మనస్పర్థలు రావడంతో వారు విడివిడిగా ఉంటున్నారు. ఈ సమయంలో దివ్య గర్భవతి కావడంతో, ప్రసవం కోసం ఆమె తండ్రి శుక్ర విశాఖలోని కై లాసపురం ప్రాంతానికి తీసుకువచ్చి, అద్దె ఇంట్లో ఉంచాడు. దివ్యకు కేజీహెచ్‌లో మగబిడ్డ జన్మించాడు. బిడ్డకు పచ్చకామెర్లు ఉన్నాయని, అనారోగ్యంగా ఉన్నాడని, వైద్యం చేయించాలని చెప్పి, దివ్యతో పలు పత్రాలపై సంతకాలు చేయించాడు. అనంతరం తల్లికి తెలియకుండా ఆ బిడ్డను దత్తత పేరుతో విక్రయించాడు. రెండు నెలలు గడిచినా బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో దివ్య తన తండ్రిని నిలదీసింది. సరైన సమాధానం రాకపోవడంతో, దివ్య మొదట కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో, ఆపై నేరుగా పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి బిడ్డ ఆచూకీని కనుగొన్నాయి. బిడ్డను మొదట ఆర్అండ్బీ వద్ద గల శిశుగృహకు అప్పగించారు. సోమవారం పోలీసుల సమక్షంలో ఆ బిడ్డను తల్లిదండ్రులైన దివ్య, జాన్బాబులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
వైఎస్సార్సీపీ నాయకుల అరెస్ట్..స్టేషన్ బెయిల్‌పై విడుదల
అల్లిపురం(విశాఖ జిల్లా): వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గత నెల 23న జరిగిన యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్న 13 మంది నాయకులపై విశాఖ మహారాణిపేట పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ అధ్యక్షుడు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, కోలా గురువులు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు తదితర నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మహారాణిపేట పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. దీంతో వారంతా స్టేషన్‌కు వెళ్లి, ష్యూరిటీలు సమరి్పంచి, స్టేషన్ బెయిల్‌పై వచ్చారు. నిరసన తెలిపినా తప్పేనా? కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, నిరుద్యోగ భృతి అందించకుండా మోసగించిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హామీలు అమలు చేయనందుకు నిరసనగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద ‘యువత పోరు‘పేరిట నిరసన తెలిపినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంతో జీరి్ణంచుకోలేని కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు.పోలీసులు జారీ చేసిన నోటీసులను గౌరవించి స్టేషన్‌కు స్వయంగా వచ్చి ష్యూరిటీలు సమర్పించామన్నారు. కూటమి ప్రభుత్వ తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ పేరిట కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. కేకే రాజు వెంట డిప్యూటీ మేయర్ కటుమూరి సతీశ్ , పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, ఉరుకూటి అప్పారావు, ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు పి.వి.సురేష్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు సేనాపతి అప్పారావు, రాయపురెడ్డి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ అసిస్టెంట్ల పడిగాపులు
● ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ సాయంత్రానికి.. ● కూటమి నేతల సిఫార్సుల కారణంగానే ఆలస్యం ● ఉద్యోగుల ఆగ్రహం, ఆందోళన మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పంచాయతీరాజ్ డిజిటల్ అసిస్టెంట్ల (గ్రేడ్–6) బదిలీల కౌన్సెలింగ్ సోమవారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఉదయం 9 గంటల నుంచి డీపీవో కార్యాలయం వద్దకు డిజిటల్ అసిస్టెంట్లు చేరుకున్నారు. 11 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం 6 గంటలకు ప్రక్రియ ప్రారంభించారు. భోజనం లేకుండా పడిగాపులు కాయడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన సిఫార్సు లేఖలే బదిలీల కౌన్సెలింగ్ జాప్యానికి కారణమని తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు కోరిన పోస్టింగ్‌లు, ఇతర వ్యవహారాలపై అధికారులు సాయంత్రం వరకు చర్చలు జరపడం వల్ల కౌన్సెలింగ్ ఆలస్యమైంది. పోస్టుల ఖాళీల జాబితాను బయట పెట్టకుండానే కౌన్సెలింగ్ చేపట్ట డంపై పారదర్శకత లేదని అసిస్టెంట్లు ఆరోపించారు. పైరవీలకు పెద్దపీట? మొత్తం 549 మంది డిజిటల్ అసిస్టెంట్లలో 95 శాతం మంది ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారే. స్థాన చలనం తప్పదని తెలియడంతో, తమకు నచ్చిన స్థానాల కోసం పోటీ పడ్డారు. డీపీవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొదట దివ్యాంగులు, స్పౌజ్, అనారోగ్యంతో ఉన్నవారికి పోస్టింగ్‌లు కేటాయించారు. ఆ తర్వాత కూటమి ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే జనరల్ బదిలీలు జరిగాయని ఆరోపణలు వినిపించాయి. బదిలీల్లో పైరవీలకు పెద్దపీట వేశారని ఆరోపణలు రావడంతో, కొందరు అసిస్టెంట్లు నిరసన వ్యక్తం చేస్తూ, తమకు సరైన పోస్టింగ్ కావాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ల బదిలీలపై విమర్శలు మధురవాడ: జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో శని, సోమవారాల్లో జరిగిన సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ బదిలీల కౌన్సెలింగ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. కౌన్సెలింగ్‌లో కూటమి ఎమ్మెల్యేలు, నాయకుల సిఫార్సులకే ప్రాధాన్యత ఇచ్చారని పలువురు ఆరోపించారు. ప్రిఫరెన్షియల్ కేటగిరి, సీనియారిటీ, కోర్టు మార్గదర్శకాలను పక్కన పెట్టి, అస్తవ్యస్తంగా బదిలీలు చేశారని ఉద్యోగులు వాపోతున్నారు. రేషనలైజేషన్ పేరుతో ఐదేళ్లు నిండని, శారీరక సవాళ్లు ఎదుర్కొంటున్న ఉద్యోగులను కూడా కౌన్సెలింగ్‌కు పిలిచి ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరగనివారు కోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
5న వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 5వ తేదీన ఉదయం 9.30 గంటలకు వెంకోజిపాలెం సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు తెలిపారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బాబు ష్యూరిటీ–మోసాలు గ్యారెంటీ’ పేరిట కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడతామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ విధంగా ఎగనామం పెడుతుందో ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ సమావేశానికి పార్టీ శ్రేణులంతా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ కుమార్, చింతలపూడి వెంకట రామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లవరపు జాన్‌వెస్లీ, పేర్ల విజయచందర్, పోతిన శ్రీనివాసరావు, మహంతి, పార్టీ ముఖ్య నాయుకులు కోలా గురువులు, ఉరుకూటి అప్పారావు, పివిఎస్ఎన్ రాజు (వుడా రవి), డాక్టర్ సిఎంఎ జహీర్ అహ్మద్, బాణాల శ్రీనివాసరావు, గొలగాని శ్రీనివాస్, నడింపల్లి కృష్ణంరాజు, జి.శ్రీనివాస్, మువ్వల సురేష్, ద్రోణంరాజు శ్రీ వాస్తవ తదితరులు పాల్గొన్నారు. -
నో
కళాశాలలకునేటి నుంచి అమల్లోకి పెరిగిన రైలు చార్జీలుసర్టిఫికెట్లు మంగళవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2025తాటిచెట్లపాలెం: సామాన్య, మధ్య తరగతి ప్రయాణికుల ప్రధాన రవాణా సాధనం రైలు. ఇతర ప్రయాణ సాధనాలతో పోల్చుకుంటే తక్కువ చార్జీలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో రైల్వే కీలకం. రైల్వే చార్జీలు స్వల్పంగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పెంచిన చార్జీలు నేటి(జూలై 1) నుంచి అమల్లోకి రానున్నాయి. సబర్బన్(సింగిల్ జర్నీ), సీజన్ టికెట్స్(సబర్బన్, నాన్ సబర్బన్), రిజర్వేషన్ చార్జీలు, సూపర్‌ఫాస్ట్ చార్జీలు, ఇతర చార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవు. ఆర్డినరీ నాన్ ఏసీ(నాన్–సబర్బన్) సెకండ్ క్లాస్ మొదటి 500 కి.మీ.లకు మార్పులేదు. ఆపై కి.మీ.కు 0.5(అర) పైసా చొప్పున పెంచారు. 501 నుంచి 1500 కి.మీ. వరకు రూ.5, 1501 నుంచి 2500 కి.మీ. రూ.10, 2501 నుంచి 5 వేల కి.మీ. వరకు రూ.15 చొప్పున చార్జీలు పెరగనున్నాయి. స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్‌కు కి.మీ.కు అర పైసా చొప్పునే పెరుగుదల ఉంది. మెయిల్ ఎక్స్‌ప్రెస్(నాన్–ఏసీ): సెకండ్ క్లాస్, స్లీప్ క్లాస్, ఫస్ట్ క్లాస్ కేటగిరీలో కిలో మీటర్‌కు పైసా చొప్పున చార్జీలలు పెరిగాయి. ఏసీ క్లాస్‌లు: ఏసీ చైర్‌కార్, 3 టైర్, 2 టైర్, ఫస్ట్ క్లాస్/ఈసీ/ఈఏ కిలో మీటర్‌కు 2 పైసలు చొప్పున పెంచిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. నలిగిపోతున్న కాలేజీ యాజమాన్యాలు ఏడాదిగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని ప్రభుత్వం ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని 335కి పైగా డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఇదే పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. సర్టిఫికెట్లు కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని యూనివర్సిటీ యంత్రాంగం తేల్చి చెబుతోంది. మరోవైపు ఫీజులు చెల్లించలేదన్న కారణంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు పెడతామంటూ ఉన్నత విద్యాశాఖ హెచ్చరికలు జారీచేస్తోంది. ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వబోమని ఏయూ తెగేసి చెబుతుంటే పట్టించుకోని ఉన్నత విద్యాశాఖ... తమ విషయంలో మాత్రం కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగడం దారుణమని కాలేజీ యాజమాన్యాలు వాపోతున్నాయి. న్యూస్‌రీల్– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
గిరి ప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించండి
డాబాగార్డెన్స్: ఈ నెల 9న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.త్రినాథరావు అభ్యర్థించారు. జీవీఎంసీ కమిషనర్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, బీచ్‌లో స్నానపు గదులు, మరుగుదొడ్లు, రోడ్ల అభివృద్ధి వంటి ఏర్పాట్లు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ను ఆలయ ప్రధాన అర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, స్వామి ప్రసాదం, చందనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్, అర్చకులు పాల్గొన్నారు. -
తండ్రి బాటలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠంపై..
● ఒక్క నామినేషనే దాఖలు కావడంతో మాధవ్ ఎన్నిక లాంఛనమే.. ● తండ్రి పీవీ చలపతిరావు బీజేపీ కురువృద్ధుల్లో ఒకరుఎంవీపీకాలనీ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పోకల వంశీ నాగేంద్ర మాధవ్ (పీవీఎన్ మాధవ్) నియామకం దాదాపు ఖరారైంది. కొన్ని రోజులుగా అధ్యక్ష పదవిపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకులతో పాటు కేంద్ర పెద్దల మద్దతు పీవీఎన్ మాధవ్‌కు పుష్కలంగా ఉండటంతో ఆయన ఎన్నిక లాంఛనంగా మారింది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికలకు సంబంధించి సోమవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడమే ఇందుకు స్పష్టమైన నిదర్శనం. పార్టీ ఎన్నికల పరిశీలకుడు పీసీ మోహన్, ఎన్నికల అధికారి పాక వెంకట సత్యనారాయణలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో పాటు విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు మాధవ్ నామినేషన్ పత్రాలను అందజేశారు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనం కాగా, మంగళవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని... పీవీఎన్ మాధవ్.. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుల్లో ఒకరిగా నిలిచిన దివంగత పీవీ చలపతిరావు తనయుడు. బీజేపీ ఆవిర్భవించిన తొలినాళ్లలో పీవీ చలపతిరావు రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరుగా విశేష సేవలందించారు. ఆంధ్ర ఉద్యమంతో పాటు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1945లోనే ఆర్ఎస్ఎస్లో చేరి, 1974, 1980లో ఎమ్మెల్సీగా సేవలు అందించి 87వ ఏట మరణించారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న పీవీఎన్ మాధవ్, తండ్రి బాటలోనే పయనించి ఆర్ఎస్ఎస్లో సభ్యుడయ్యారు. తొలి నుంచి బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషించారు. విశాఖలో అనేక బీజేపీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి అగ్ర నాయకుల మన్ననలు అందుకున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేవైఎంలో (భారతీయ జనతా యువ మోర్చా) పలు కీలక పదవులు నిర్వహించారు. 2017లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై పార్టీకి విలువైన సేవలు అందించారు. శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొన్నేళ్లుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక దాదాపు ఖరారైనందున విశాఖలోని బీజేపీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
35 మంది ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ
మద్దిలపాలెం: జిల్లాలోని ఆర్టీసీ డిపోలలో పనిచేస్తున్న 35 మంది సూపర్వైజర్లు, సిబ్బంది సోమవారం పదవీ విరమణ చేశారు. విశాఖ డిపోలో సోమవారం నిర్వహించిన పదవీ విరమణ సత్కార కార్యక్రమంలో ఆర్టీసీ విశాఖ రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన వాల్తేరు, మద్దిలపాలెం, విశాఖ స్టీల్ సిటీ, గాజువాక, మధురవాడ డిపోల కార్మికులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరలో అందజేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
విలాసాల నౌక వచ్చేస్తోంది!
విశాఖ సిటీ : సాగర విహార ప్రపంచానికి విశాఖ మరోసారి స్వాగతం పలుకుతోంది. సముద్ర జలాల్లో తేలియాడే అద్భుత సౌధం మళ్లీ నగరానికి వచ్చేస్తోంది. అలలపై ఆహ్లాదకర ప్రయాణాన్ని అందించనుంది. విలాసవంతమైన సముద్ర విహార నౌకను చెన్నై–విశాఖపట్నం–పుదుచ్చేరి–చెన్నైల మధ్య నడపడానికి కార్డేలియా క్రూయిజ్ సంస్థ మళ్లీ ముందుకొచ్చింది. విశాఖ నుంచి జూలై 2, 9, 16 తేదీల్లో మూడు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది.2022 జూన్‌లో ఇదే సంస్థ విశాఖ నుంచి క్రూయిజ్ నౌకను నడిపింది. ఈ నౌకలో విహరించేందుకు విశాఖ ప్రజలే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాల పర్యాటకులు పోటీ పడ్డారు. దీంతో 85 శాతం మేర ఆక్యుపెన్సీతో ఆ ఏడాది సెపె్టంబర్ వరకు నడిచింది. ఈసారి విశాఖ పోర్టులో కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెరి్మనల్ నుంచి ఈ విహార నౌక రాకపోకలు సాగించనుంది. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల విక్రయాలను సైతం ప్రారంభించింది. విహార యాత్ర ఆరంభం ఇలా.. సెవెన్ స్టార్ హోటల్‌కు మించి విలాసవంతమైన నౌకలో విహారం.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 24 గంటలు వినోదం.. విభిన్న వంటకాలతో రుచికరమైన ఆహారం.. ఆరోగ్యానికి జిమ్, ఫిట్నెస్ సెంటర్ల సౌకర్యం.. స్విమ్మింగ్ పూల్స్‌లో జలకాలాటలు.. రాక్ క్లైంబింగ్ విన్యాసాలు.. ఆహ్లాదపరిచే డ్యాన్స్ షోలు.. అబ్బురపరిచే మ్యాజిక్ ప్రదర్శనలు.. సినిమా థియేటర్లు.. ఇలా ఎటువంటి ఒత్తిడి లేకుండా.. సమయం తెలియకుండా 24/7 ఎంజాయ్ చేసే లగ్జరీ విహార యాత్ర విశాఖ నుంచి ప్రారంభమవుతోంది.జూన్ 30న చెన్నైలో బయల్దేరిన ఈ క్రూయిజ్ నౌక జూలై 2వ తేదీ ఉదయం విశాఖకు వస్తుంది. అదే రోజు సాయంత్రం ఇక్కడ నుంచి బయలుదేరి 4వ తేదీన పుదుచ్చేరికి చేరుకుంటుంది. మళ్లీ అదే రోజు అక్కడి నుంచి బయలుదేరి 5వ తేదీన చెన్నై వెళుతుంది. దీంతో ఒక ట్రిప్పు పూర్తవుతుంది. ఆ తరువాత జూలై 7న చెన్నైలో మరో ట్రిప్పు ప్రారంభమై.. 9వ తేదీన విశాఖకు చేరుకుని.. మళ్లీ ఇక్కడి నుంచి బయలుదేరి 12వ తేదీన చెన్నైలో ముగుస్తుంది. మూడో ట్రిప్పు జూలై 14న చెన్నైలో మొదలై 16వ తేదీకి విశాఖకు చేరుకుంది. తిరిగి అదే రోజు ఇక్కడి నుంచి ప్రారంభమై 19వ తేదీన చెన్నైలో ముగుస్తుంది. క్రూయిజ్‌లో సదుపాయాలు ⇒ కార్డేలియా ఎంప్రెస్ క్రూయిజ్ నౌక ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. ⇒ మొత్తం 11 అంతస్తులతో ఉండే ఈ క్రూయిజ్ మొదటి ఫ్లోర్లో ఇంజిన్, రెండో ఫ్లోర్లో కార్గో ఉంటుంది. ⇒ మూడో ఫ్లోర్ నుంచి పాసింజర్ లాంజ్ మొదలవుతుంది. ⇒ అక్కడి నుంచి ఎలివేటర్ ద్వారా పదో అంతస్తు వరకు చేరుకోవచ్చు. ⇒ పదో ఫ్లోర్లో డెక్ లాంటి పెద్ద టెరస్ర్ ఉంటుంది. ⇒ 11వ అంతస్తులో ఉండే ప్రత్యేక సెటప్ ద్వారా సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతిని కలిగిస్తుంది. ⇒ లగ్జరీ సూట్(8వ ఫ్లోర్) మినహా మిగిలిన అన్ని రకాల రూమ్స్ దాదాపుగా అన్ని ఫ్లోర్లలో ఉంటాయి. ⇒ ఫుడ్‌కోర్టులు, మూడు స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్ అందుబాటులో ఉన్నాయి. ⇒ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఈ నౌకలో కార్డేలియా కిడ్స్ అకాడమీ పేరుతో విశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ⇒ జిమ్, ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, కేసినో, డ్యాన్సులు, కామెడీ, మ్యాజిక్ షోల కోసం ఆడిటోరియం, కొత్త సినిమాలను వీక్షించడానికి థియేటర్, నైట్ క్లబ్, 24 గంటల సూపర్ మార్కెట్, ల్రైబరీ ఇలా క్షణం కూడా బోర్ కొట్టకుండా అనేక సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ⇒ డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ⇒ అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్‌మాల్స్, లైవ్ షోలు కూడా అలరిస్తాయి. ⇒ టికెట్ తీసుకున్న ప్రతీ ఒక్కరికీ క్యాసినోలో ఎంట్రీ ఉచితం. ⇒ లిక్కర్, ఇతర సర్విసులకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.గత ప్రభుత్వ చొరవతో విశాఖకు క్రూయిజ్ విశాఖలో క్రూయిజ్ రాక దీర్ఘకాల కలగా ఉండేది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. విలాసవంతమైన క్రూయిజ్ నౌక ప్రయాణం విశాఖలో అందుబాటులో ఉంటే.. ఇక్కడకు పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుందని భావించింది. ఇందుకోసం కార్డేలియా సంస్థతో సంప్రదింపులు జరిపింది. వాస్తవానికి కార్డేలియా క్రూయిజ్ సర్విసు విశాఖకు లేదు. ముంబయి, చెన్నై, గోవా, అండమాన్, లక్షద్విప్ వంటి ప్రాంతాల్లో ఉండేది.రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో విశాఖ నుంచి సర్విసు నడిపేందుకు అంగీకరించింది. అది కూడా ముందుగా మూడు సర్విసులు నడిపి డిమాండ్‌ను బట్టి నిర్ణయం తీసుకోవాలని భావించింది. కానీ విశాఖవాసులే కాకుండా పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు విశాఖ నుంచి క్రూయిజ్ విహార యాత్రకు పోటీ పడ్డారు. దీంతో ఆ సర్విసును సెపె్టంబర్ వరకు పొడిగించింది.క్యాసినో ఆడాలంటే.. రాష్ట్రంలో క్యాసినో ఆడేందుకు ప్రభుత్వం అనుమతి లేదు. ఇందుకు కొంత సమయం వేచి ఉండాల్సిందే. నౌక ప్రయాణం ప్రారంభమై 20 మైళ్లు వెళ్లిన తరువాత క్యాసినో ఆడేందుకు అవకాశం ఉంటుంది. -
ఒంట్లో బాలేదు.. కొంతసేపు ఉండి వస్తాను
ఆరిలోవ: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్నేహితులతో కలిసి కొంత సమయం గడిపిన తర్వాత అతను మరణించినట్లు తెలుస్తోంది. ఎస్ఐ రాందాస్ తెలిపిన వివరాలివి.. కాకినాడకు చెందిన కుక్కల లోకనాథ్(34) ఎంవీపీ కాలనీలోని సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య కూడా సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో కాంట్రాక్టు పద్ధతిలో అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేటలో ఉద్యోగం చేస్తోంది. అతని అత్తగారిల్లు నగరంలోని దసపల్లా ప్రాంతంలో ఉంది. వారాంతంలో వారు నగరంలోని అత్తవారింటికి వస్తుంటారు. సోషల్ వెల్ఫేర్ విభాగంలో జరుగుతున్న బదిలీలకు సంబంధించి లోకనాథ్ మరో నలుగురు స్నేహితులతో కలిసి శనివారం నగరానికి వచ్చాడు. హనుమంతవాక వద్ద పారామౌంట్ లాడ్జిలో వారంతా రూమ్ తీసుకున్నారు. ఆదివారం అందరూ కలిసి డ్యూటీకి వెళ్లాల్సి ఉండగా.. లోకనాథ్ ‘ఒంట్లో బాలేదు.. కొంతసేపు ఉండి వస్తాను’అని మిగిలిన స్నేహితులకు చెప్పాడు. దీంతో మిగిలిన నలుగురు స్నేహితులు లాడ్జి నుంచి బయలుదేరి డ్యూటీకి వెళ్లిపోయారు. కొంతసేపటికి లోకనాథ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ‘కడుపులో మంటగా ఉంది’అని ఓ షాపులో గ్యాస్ట్రిక్‌కు సంబంధించిన ప్యాకెట్ కొన్నాడు. తిరిగి రూమ్‌కి వెళ్లిపోయాడు. ‘కడుపు నొప్పిగా ఉంది. కొంత సేపటి తర్వాత వస్తాను’ అని ఆఫీసు హెడ్‌కు ఫోన్లో చెప్పాడు. ఎంతసేపటికీ లోకనాథ్ డ్యూటీకి రాకపోవడంతో తోటి ఉద్యోగులు మళ్లీ ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో లాడ్జి నిర్వాహకులకు ఫోన్ చేసి చెప్పగా.. స్పందించిన సిబ్బంది రూమ్ తలుపులు తెరిచి చూసేసరికి మంచంపై విగతజీవిగా పడి ఉన్నాడు. లాడ్జి నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐ రాందాస్, సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్ఐ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటస్థలం పేరుతో ఆక్రమణ?
తగరపువలస: ఆనందపురం మండలం గిడిజాల పంచాయతీలోని దిబ్బడిపాలెం సర్వే నంబర్ 258లో పెద్ద కొండను ఆనుకుని ఉన్న సుమారు 2 ఎకరాలకు పైగా స్థలం ఆటస్థలం పేరుతో కబ్జా చేసేందుకు స్కెచ్ రెడీ అయింది. దీని విలువ రూ.25 కోట్ల పైమాటే. ఈ ప్రాంత యువకుల క్రీడా అవసరాల పేరుతో కబ్జాల్లో ఘనుడైన కూటమి ప్రభుత్వానికి చెందిన ఒక వ్యక్తి దీని వెనుక ఉన్నట్టు టీడీపీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ కొండ భాగాన్ని తవ్వి వేలాది లారీల గ్రావెల్‌ను తరలించి లక్షల రూపాయలు వెనకేసుకున్నాడు. గతంలో కూడా పంచాయతీలో సర్వే నంబర్ 310/5లో 2 ఎకరాలు, 311/14లో 2.04 ఎకరాలు కలిపి రూ.40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రిసార్ట్స్ పేరుతో నడుపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై రెండు నెలల కిందట ఆనందపురం మండలానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో.. మరో విలువైన స్థలాన్ని ఆక్రమించేందుకు జోరుగా పావులు కదుపుతున్నాడు. దీని పై ఎవరూ నోరు మెదపకుండా ఇప్పటి నుంచే నోట్ల కట్టలతో ప్రభావితం చేస్తున్నాడు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిని తీసుకువచ్చి రాజమార్గం ద్వారా ఈ స్థలాన్ని కొట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు టీడీపీ నాయకులే చెబుతున్నారు. గతంలో ఈ స్థలం పీహెచ్‌సీకి కేటాయింపు 2014–19 టీడీపీ హయాంలో ఈ స్థలాన్ని అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్సీ) కేటాయించారు. నెలరోజుల కిందట ఎమ్మెల్యే గంటా వద్దకు కబ్జాల్లో ఆరితేరిన ఈ వ్యక్తి 50 మంది స్థానిక యువకులను తీసుకువెళ్లి చదును చేసిన 2 ఎకరాల స్థలాన్ని ఆటస్థలానికి ఇవ్వాలని కోరగా ఆయన నిరాకరించారు. మండలంలో టీడీపీ నాయకులంతా నిన్ను వ్యతిరేకిస్తున్నారని ముఖం మీదే కుండబద్దలు కొట్టడంతో ఆ వ్యక్తి విసురుగా వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆనందపురం తహసీల్దార్ లేకపోవడంతో ఇదే అదనుగా మళ్లీ ఈ స్థలంలో పాగా వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. గత ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ఇక్కడి రిసార్ట్‌లో పేకాట క్లబ్ నిర్వహించకుండా ఆనందపురం పోలీ సులు గట్టిగా కాపలా కాశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పోలీసులు ఈ కబ్జా రాయుడితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. సీపీ శంఖబ్రత బాగ్చి బదిలీపై వెళ్లిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన అధికారితో మాట్లాడుకుని తిరిగి పేకాట క్లబ్ నిర్వహించాలని ప్రణాళిక రచిస్తున్నాడు. ప్రస్తుతం తహసీల్దార్ లేనందున ఇదే అదనుగా 2 ఎకరాల స్థలాన్ని క్రీడా మైదానం పేరుతో చేజిక్కించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. రూ.25 కోట్ల విలువైన భూమి కబ్జాకు యత్నం -
ఇంజినీరింగ్ అసిస్టెంట్ల పడిగాపులు
● సాయంత్రం వరకు ప్రారంభంకాని బదిలీల కౌన్సెలింగ్ ● భారీగా సిఫార్సు లేఖలు.. పైరవీలకే పెద్దపీట మహారాణిపేట : బదిలీల కౌన్సెలింగ్ కోసం ఆదివారం ఉదయాన్నే జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్న సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు సాయంత్రం వరకు పడిగాపులు పడ్డారు. తిండితిప్పలు లేకుండా జిల్లా పరిషత్ ఆవరణలో గట్లు మీద, ఖాళీ ప్రాంతాల్లో నిరీక్షించారు. కౌన్సెలింగ్‌కు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 442 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇందులో 95 శాతం మంది ఐదేళ్లు సర్వీసు పూర్తయిన వారు ఉన్నారు. పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు ఆదివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉదయాన్నే కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకోగా సాయంత్రం వరకు పిలవలేదు. అసలు ఏమి జరుగుతుందో తెలియక ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఆందోళన చెందారు. కూటమి ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు పెద్ద సంఖ్యలో రావడంతో పంచాయతీరాజ్ ఎస్ఈ కె.శ్రీనివాసరావు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు తర్జనభర్జన పడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు అడిగిన పోస్టింగ్‌లు, ఇతర వ్యవహారాల వల్ల కౌన్సెలింగ్ జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఖాళీల జాబితా చివరి నిమిషం వరకు బయట పెట్టకపోవడంపై ఆందోళన వ్యక్తమైంది. కాగా సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ రాత్రి వరకు కొనసాగింది. తొలుత దివ్యాంగులు, స్పౌజ్, అనారోగ్య పీడితులకు కౌన్సెలింగ్ చేపట్టారు. ఆ తర్వాత కూటమి ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు బదిలీలు నిర్వహించారన్న ఆరోపణలు వచ్చాయి. -
సర్వేయర్ల ఆందోళన
మహారాణిపేట : సచివాలయ సర్వేయర్లు గ్రేడ్–2 బదిలీల్లోనూ కూటమి ఎమ్మెల్యేల సిఫార్సులకు పెద్దపీట వేశారంటూ సర్వేయర్లు ఆందోళనకు దిగారు. ఆదివారం కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సర్వే డిపార్టుమెంటులో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికి ఆదివారం బదిలీ కౌన్సెలింగ్ చేపట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 354 మంది బదిలీ కౌన్సెలింగ్ కోసం వచ్చారు. సర్వే అసిస్టెంట్ డైరెక్టర్లు సూర్యరావు(విశాఖ), గోపాలరావు(అనకాపల్లి) బదిలీ కౌన్సెలింగ్ చేపట్టారు. బదిలీల్లో పైరవీలకు పెద్ద పీట వేస్తున్నారని, సిఫార్సుల వల్ల తాము నష్టపోతున్నామని, జాబితా ప్రకారం బదిలీలు చేయడం లేదని సర్వేయర్లు ఆందోళనకు దిగారు. కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల వల్ల నిజాయితీపరులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీల్లో సిఫార్సులకు పెద్దపీట వేశారని ఆవేదన -
మళ్లీ సముద్రంలో సందడే సందడి
● వైఎస్సార్సీపీ హయాంలో ప్రారంభమైన కార్డేలియా క్రూయిజ్ యాత్ర ● విశాఖ నుంచి జూలై 2, 9, 16 తేదీల్లో ప్రారంభం ● చైన్నె–విశాఖపట్నం–పుదుచ్చేరి–చైన్నె మధ్య సర్వీసు ● ఇప్పటికే ఆన్లైన్లో ప్రారంభమైన టికెట్ల విక్రయాలువిశాఖ సిటీ : సాగర విహార ప్రపంచానికి విశాఖ మరోసారి స్వాగతం పలుకుతోంది. సముద్ర జలాల్లో తేలియాడే అద్భుత సౌధం మళ్లీ నగరానికి వచ్చేస్తోంది. అలలపై ఆహ్లాదకర ప్రయాణాన్ని అందించనుంది. విలాసవంతమైన సముద్ర విహార నౌకను చైన్నె–విశాఖపట్నం–పుదుచ్చేరి–చైన్నెల మధ్య నడపడానికి కార్డేలియా క్రూయిజ్ సంస్థ మళ్లీ ముందుకొచ్చింది. విశాఖ నుంచి జూలై 2, 9, 16 తేదీల్లో మూడు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. 2022 జూన్‌లో ఇదే సంస్థ విశాఖ నుంచి క్రూయిజ్ నౌకను నడిపింది. ఈ నౌకలో విహరించేందుకు విశాఖ ప్రజలే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాల పర్యాటకులు పోటీ పడ్డారు. దీంతో 85 శాతం మేర ఆక్యుపెన్సీతో ఆ ఏడాది సెప్టెంబర్ వరకు నడిచింది. ఈసారి విశాఖ పోర్టులో కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి ఈ విహార నౌక రాకపోకలు సాగించనుంది. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల విక్రయాలను సైతం ప్రారంభించింది. విహార యాత్ర ఆరంభం ఇలా.. సెవెన్ స్టార్ హోటల్‌కు మించి విలాసవంతమైన నౌకలో విహారం.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 24 గంటలు వినోదం.. విభిన్న వంటకాలతో రుచికరమైన ఆహారం.. ఆరోగ్యానికి జిమ్, ఫిట్నెస్ సెంటర్ల సౌకర్యం.. స్విమ్మింగ్ పూల్స్‌లో జలకాలాటలు.. రాక్ కై ్లంబింగ్ విన్యాసాలు.. ఆహ్లాదపరిచే డ్యాన్స్ షోలు.. అబ్బురపరిచే మ్యాజిక్ ప్రదర్శనలు.. సినిమా థియేటర్లు.. ఇలా ఎటువంటి ఒత్తిడి లేకుండా.. సమయం తెలియకుండా 24/7 ఎంజాయ్ చేసే లగ్జరీ విహార యాత్ర విశాఖ నుంచి ప్రారంభమవుతోంది. ఈ క్రూయిజ్ నౌక జూన్ 30న చైన్నెలో బయలుదేరి జూలై 2వ తేదీ ఉదయం విశాఖకు వస్తుంది. అదే రోజు సాయంత్రం ఇక్కడ నుంచి బయలుదేరి 4వ తేదీన పుదుచ్చేరికి చేరుకుంటుంది. మళ్లీ అదే రోజు అక్కడి నుంచి బయలుదేరి 5వ తేదీన చైన్నె వెళుతుంది. దీంతో ఒక ట్రిప్పు పూర్తవుతుంది. ఆ తరువాత జూలై 7న చైన్నెలో మరో ట్రిప్పు ప్రారంభమై.. 9వ తేదీన విశాఖకు చేరుకుని.. మళ్లీ ఇక్కడి నుంచి బయలుదేరి 12వ తేదీన చైన్నెలో ముగుస్తుంది. మూడో ట్రిప్పు జూలై 14న చైన్నెలో మొదలై 16వ తేదీకి విశాఖకు చేరుకుంది. తిరిగి అదే రోజు ఇక్కడి నుంచి ప్రారంభమై 19వ తేదీన చైన్నెలో ముగుస్తుంది. -
కూర్మావతారంలో జగన్నాథుడు
డాబాగార్డెన్స్: టర్నర్ చౌల్ట్రీలో జగన్నాథస్వామి కూర్మావతారంలో ఆదివారం దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు స్వామికి మేలుకొలుపు, నాదస్వరం, 6 నుంచి 7 గంటల వరకు నిత్యపూజ, 7 నుంచి 9.30 గంటల వరకు జగన్నాథస్వామి ప్రార్థనా సంఘంచే ప్రార్థనా తరంగిణి, 9.30 నుంచి 10.30 వరకు సామూహిక లలితా సహస్రనామ పారాయణ, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సామూహిక భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. రథయాత్రలో భాగంగా సోమవారం జగన్నాథ స్వామి వరహావతారంలో భక్తులకు దర్శనమిస్తారని ఈవో తెలిపారు. -
ఉపాధ్యాయులకు సర్దు‘పోటు’
● పెరిగిన విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తి ● మిగిలిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ● ప్రాథమిక పాఠశాలలకు సర్దుబాటు ● మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల చేరికలు ఆరిలోవ : జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల ఉపాధ్యాయ పోస్టులకు భారీగా కోత పడింది. కూటమి ప్రభుత్వం విద్యా విధానంలో చేపట్టిన మార్పులు, ముఖ్యంగా విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తిని మార్చడంతో విద్యాబోధనకు, విద్యార్థుల భవిష్యత్తుకు తీవ్రంగా నష్టం కలిగిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిష్పత్తి పెంపుతో పోస్టులకు కోత ఇటీవల ప్రభుత్వం విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తిని 40:1 నుంచి 49:1కి పెంచింది. అంటే ఒక తరగతి గదిలో విద్యార్థుల సంఖ్యను 40 నుంచి 49కి పెంచారు. ఈ నిర్ణయం వల్ల ఉన్నత పాఠశాలల్లో అవసరమైన స్కూల్ అసిస్టెంట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు మందకొడిగా ఉన్నాయి. ఒక వైపు విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా, మరోవైపు నిష్పత్తిని పెంచడంతో ఉపాధ్యాయ పోస్టులు మిగులుగా(సర్ ప్లస్) తేలాయి. ఈ పరిణామాలు డీఎస్సీ–2025లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదే పరిస్థితి ప్రాథమిక పాఠశాలల్లోనూ నెలకొంది. అక్కడ కూడా విద్యార్థుల సంఖ్య తగ్గడం, నిష్పత్తి పెరగడంతో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల(ఎస్జీటీ) పోస్టుల అవసరం కూడా గతంతో పోలిస్తే తగ్గిపోయింది. వందకు పైగా పోస్టులు మిగులు విశాఖ జిల్లా పరిధిలోని ఏడు మండలాల్లో 56 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌లో కొత్త నిష్పత్తి కారణంగా సుమారు 100కి పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగులుగా తేలాయి. ఈ మిగులు ఉపాధ్యాయులను ఏ ఖాళీల్లో సర్దుబాటు చేయాలో తెలియక జిల్లా విద్యాశాఖాధికారులకు కత్తిమీద సాములా మారింది. చివరికి ఉన్నత పాఠశాలల్లో మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్లను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా నియమించాల్సి వచ్చింది. దీని వల్ల ఇప్పటివరకు 6 నుంచి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులు బోధించిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. ఇప్పుడు 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అక్షరాలు నేర్పించాల్సిన విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. -
విశాఖ అగ్రపీఠాధిపతికి పాల్లియం ప్రదానం
డాబాగార్డెన్స్: సెయింట్ పీటర్, సెయింట్ పాల్ మహోత్సవ దివ్య బలి పూజ సందర్భంగా సెయింట్ పీటర్ బసిలికాలో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నియమితులైన 54 మంది మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్‌లకు 14వ లియో పోప్ పాల్లియంను దీవించి అందజేశారు. ఈ మహోత్సవంలో భారతదేశం నుంచి ముగ్గురు అగ్రపీఠాధిపతులకు ఈ గౌరవం లభించింది. వారిలో విశాఖపట్నం అగ్రపీఠాధిపతిగా పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉడుముల బాల కూడా ఉన్నారు. కాగా.. పాల్లియం అనేది తెల్లని గొర్రె ఉన్నితో తయారు చేసిన దైవార్చన వస్త్రం. ఇది మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్కు అధికారిక చిహ్నంగా పరిగణిస్తారు. స్థానిక అగ్రపీఠ పరిధిలోని ఇతర మేత్రాసనములతో పోప్‌కు ఉండే సమైక్యతను ఇది ప్రతిబింబిస్తుంది. ఉడుముల బాల విశాఖపట్నం అగ్రపీఠాధిపతిగా నియమితులై ఈ గొప్ప గౌరవాన్ని పొందడం అగ్రపీఠానికే కాకుండా, యావత్ భారతదేశానికి గర్వకారణమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. -
క్రూయిజ్‌లో సదుపాయాలు
● కార్డేలియా ఎంప్రెస్ క్రూయిజ్ నౌక ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. ● మొత్తం 11 అంతస్తులతో ఉండే ఈ క్రూయిజ్ మొదటి ఫ్లోర్లో ఇంజిన్, రెండో ఫ్లోర్లో కార్గో ఉంటుంది. ● మూడో ఫ్లోర్ నుంచి పాసింజర్ లాంజ్ మొదలవుతుంది. ● అక్కడి నుంచి ఎలివేటర్ ద్వారా పదో అంతస్తు వరకు చేరుకోవచ్చు. ● పదో ఫ్లోర్లో డెక్ లాంటి పెద్ద టెరరస్ ఉంటుంది. ● 11వ అంతస్తులో ఉండే ప్రత్యేక సెటప్ ద్వారా సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతిని కలిగిస్తుంది. ● లగ్జరీ సూట్(8వ ఫ్లోర్) మినహా మిగిలిన అన్ని రకాల రూమ్స్ దాదాపుగా అన్ని ఫ్లోర్లలో ఉంటాయి. ● ఫుడ్‌కోర్టులు, మూడు స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్ అందుబాటులో ఉన్నాయి. ● చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఈ నౌకలో కార్డేలియా కిడ్స్ అకాడమీ పేరుతో విశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ● జిమ్, ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, కేసినో, డ్యాన్సులు, కామెడీ, మ్యాజిక్ షోల కోసం ఆడిటోరియం, కొత్త సినిమాలను వీక్షించడానికి థియేటర్, నైట్ క్లబ్, 24 గంటల సూపర్ మార్కెట్, ల్రైబరీ ఇలా క్షణం కూడా బోర్ కొట్టకుండా అనేక సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ● డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ● అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్‌మాల్స్, లైవ్ షోలు కూడా అలరిస్తాయి. ● టికెట్ తీసుకున్న ప్రతీ ఒక్కరికీ క్యాసినోలో ఎంట్రీ ఉచితం. ● లిక్కర్, ఇతర సర్వీసులకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్యాసినో ఆడాలంటే.. రాష్ట్రంలో క్యాసినో ఆడేందుకు ప్రభుత్వం అనుమతి లేదు. ఇందుకు కొంత సమయం వేచి ఉండాల్సిందే. నౌక ప్రయాణం ప్రారంభమై 20 మైళ్లు వెళ్లిన తరువాత క్యాసినో ఆడేందుకు అవకాశం ఉంటుంది. -
కూటమిలో ‘వైన్ షాపు వార్’
మధురవాడ: కూటమిలోని అంతర్గత లుకలుకలు బయటపడుతున్నాయి. జీవీఎంసీ 5వ వార్డు, మారికవలస జంక్షన్, శారదానగర్ వద్ద వైన్ షాపు ఏర్పాటుకు వ్యతిరేకంగా మహిళలు రోడ్డెక్కారు. దీనికి జనసేన, సీపీఎం నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా జనసేన 5వ వార్డు అధ్యక్షుడు దేవర శివ మాట్లాడుతూ మారికవలస జంక్షన్ సర్వీస్ రోడ్డులో ఇప్పటికే ఒక వైన్ షాపు నివాసాలను ఆనుకొని ఉందని, ఇప్పుడు నివాసాల మధ్య, దానికి అత్యంత దగ్గరలో మరో దుకాణం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఉన్న ఒక్క షాపుతోనే అనేక ఇబ్బందులు పడుతుంటే, రెండో షాపు ఏర్పాటుతో అవస్థలు రెట్టింపు అవుతాయని చెప్పారు. దీనిని ఆపకపోతే ఎటువంటి పోరాటానికై నా తాము సిద్ధంగా ఉంటామని శివ స్పష్టం చేశారు. సీపీఎం నాయకురాలు భారతి మాట్లాడుతూ ఉన్న షాపు వల్లనే ఇక్కడ మహిళలు తిరగలేకపోతున్నారన్నారు. తమకు మద్యం వద్దు, మంచి నీళ్లు కావాలని నినాదాలు చేశారు. అధికారులు తక్షణమే స్పందించి మద్యం షాపు ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఇక్కడ రెండో వైన్ షాపు ఏర్పాటు చేస్తున్న షెడ్ టీడీపీ మాజీ కార్పొరేటర్‌కు చెందినది కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జనసేన నాయకుడు రోడ్డెక్కి ధర్నాకు దిగడం గమనార్హం. -
ఆకట్టుకున్న చతుర్గుణిత అష్టావధానం
మద్దిలపాలెం: చతుర్గుణిత అష్టావధానం ప్రక్రియ డాక్టర్ బులుసు అపర్ణ ఆధ్వర్యంలో సాహిత్య శ్రావ్యనందకరంగా జరిగింది. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విశ్వనాథ సాహిత్య పీఠం అధ్యక్షుడు పేరాల బాలకృష్ణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యద్భుతంగా సాగింది. నిషిద్ధాక్షరి, సమస్య దత్తపది, వర్ణన, ఆశువు, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, వారగణనం, అనువాదం, పురాణం అనే అంశాలపై 32 మంది పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ బులుసు అపర్ణ అసాధారణ రీతిలో.. ఏకధాటిగా పద్యరూపంలో పూరణ చేసి సభికులను రంజింపజేశారు. దీంతో సభికులు తమ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలుపగా కళాభారతి మార్మోగిపోయింది. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ రాజు, కార్యదర్శి డాక్టర్ గుమ్మూలూరి రాంబాబు, శ్రీ విశ్వనాథ సాహిత్య పీఠం అధ్యక్షుడు పేరాల బాలకృష్ణ, కార్యదర్శి పేరాల సీతారాం ప్రభుతో కలిసి ముఖ్య అతిథి మధుర కవి డాక్టర్ బులుసు వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలనతో అవధాన ప్రక్రియను ప్రారంభించారు. ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ పేరి రవికుమార్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, డాక్టర్ దాడి వీరభద్రరావు, ఆచార్య రామవరపు శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
వైభవం.. వరదపాయస సేవ
సింహాచలం: సింహగిరిపై వైకుంఠవాసుడి సన్నిధిలో ఆదివారం వరదపాయసం సేవ విశేషంగా నిర్వహించారు. దేశంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఏటా సింహగిరిపై ఉన్న వైకుంఠవాసుడి మెట్టపై కొలువుదీరిన వైకుఠవాసుడి సన్నిధిలో పాయసం వండి, సమీపంలో ఉన్న పొర్లు బండపై నుంచి జారవిడవడం ఆచారంగా వస్తోంది. దీనినే వరదపాయసం సేవగా పేర్కొంటారు. అప్పన్న ఆలయ అర్చకులు ఉదయం 8 నుంచి పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడై కొలువుదీరిన వైకుంఠవాసుడి సన్నిధిలో విష్వక్సేణపూజ, పుణ్యాహవచనం, పంచకలశ ఆవాహనం, పంచకలశ స్నపనం, విశేష ఆరాధన ఘనంగా జరిపారు. విరాట్పర్వ పారాయణం చేశారు. అనంతరం అక్కడే వండిన పాయసాన్ని స్వామికి నివేదించి, సమీపంలో ఉన్న పొర్లు బండపై జారవిడిచారు. భక్తులు పొర్లు బండపై నుంచి జారే పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధాన అర్చకుడు కరి సీతారామాచార్యులు, అర్చకులు, పారాయణదారులు, వేదపండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. వైకుంఠవాసుడికి విశేషంగా అభిషేకాలు విరాట్పర్వ పారాయణం, పాయసం నివేదన -
సీనియర్ జర్నలిస్ట్ దివాకర్ మృతికి సంతాపం
మహారాణిపేట: సీనియర్ జర్నలిస్టు పైల దివాకర్ కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో గాయత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దివాకర్ పార్థివదేహాన్ని అక్కయ్యపాలెంలోని ఆయన నివాసంలో సందర్శనార్థం ఉంచారు. సోమవారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పని చేసిన దివాకర్.. వైజాగ్ జర్నలిస్టు ఫోరం కార్యవర్గ సభ్యుడిగానూ సేవలందించారు. 2010 నుంచి వైఎస్సార్ సీపీ పీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతి తీరని లోటని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
రైలు నుంచి జారిపడిన యువకులు
గోపాలపట్నం: ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ నుంచి ఇద్దరు యువకులు జారిపడగా, వారిలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన సింహాచలం రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో పవిత్రా దాస్, సగ్రామ్ దాస్ ప్రయాణిస్తున్నారు. సింహాచలం రైల్వేస్టేషన్లో ఈ రైలుకు హాల్ట్ లేదు. అయితే రైలు స్టేషన్లో నెమ్మదిగా వెళ్తున్న సమయంలో వారు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది గమనించి వారిని కాపాడారు. వారిలో ఒకరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించారు. ఈ యువకులు ఒడిశా రాష్ట్రం డెంకనాల్ జిల్లా కుకట గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. బెంగళూరు వెళ్తున్న వీరు ఫుట్‌బోర్డుపై కూర్చోవడం వల్ల కళ్లు తిరిగి పడిపోయి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తు ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై పడటం వల్ల ప్రాణాపాయం తప్పిందని ఆర్పీఎఫ్ ఎస్ఐ సూరజ్ కుమార్, ఏఎస్ఐ జి.శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ డి.జగదీష్ తెలిపారు. ఒకరికి గాయాలు -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు విశాఖ విద్య: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు అన్నారు. జిల్లా యూటీఎఫ్ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం ఎన్డీఏలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జీవో 19 ద్వారా 9 రకాల పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. దీని వల్ల కొన్ని పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 9,652 మోడల్ ప్రాథమిక పాఠశాలలు, 1,552 ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసిన 779 ఉన్నత పాఠశాలలు, 5 వేల ఫౌండేషన్ పాఠశాలలు, 19 వేల బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదం ఉందని, వీటిని బలమైన పాఠశాలలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల పనివేళల్లో బోధనేతర పనులు, శిక్షణ తరగతులు లేకుండా చూడాలని కోరారు. అదే విధంగా ఆర్థిక బకాయిలు చెల్లించాలని, పీఆర్సీ కమిషన్ నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, డీఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఆర్.అంబేడ్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు జూలై 5వ తేదీ వరకు డ్రైవ్ చేపట్టాలని, ఇందులో యూటీఎఫ్ కేడర్ పాల్గొనాలని కోరారు. కనీసం మండల స్థాయిలో 10 మంది పిల్లలను, జిల్లా స్థాయిలో 20 మంది పిల్లలను చేర్పించిన వారికి అభినందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షులు ఎన్.ప్రభాకర్, రొంగలి ఉమాదేవి, కోశాధికారి కె.రాంబాబు, జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి టి.అప్పారావు, జిల్లా కార్యదర్శులు చుక్క సత్యం, రిజ్వాన్, రియాజ్, సీనియర్ నాయకులు బి.జనార్ధన్‌తో పాటు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
అట్టహాసం.. ముణ్నాళ్ల ముచ్చటే.!
● దుర్వినియోగమైన ప్రజాధనం ● బయటపడ్డ నాణ్యత డొల్లతనం ● బీచ్‌రోడ్డులో మొక్కుబడిగా సాగిన ‘యోగాంధ్ర’ పనులు ఏయూక్యాంపస్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘యోగాంధ్ర’ పనులు ముణాళ్ల ముచ్చటగా మిగిలాయి. ప్రజాధనంతో చేపట్టిన సుందరీకరణ పనుల్లోని నాణ్యతలోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో మొక్కుబడిగా పనులు చేసి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకోగా.. ప్రజాధనం నీళ్లపాలైన తీరు నగరవాసులను విస్మయానికి గురి చేస్తోంది. బట్టబయలైన నాణ్యత లోపం నెల రోజుల పాటు హడావుడి చేసి.. బీచ్ రోడ్డుకు వేసిన రంగులు కేవలం వారం రోజుల్లోనే వెలిసిపోవడం పనుల నాణ్యతకు అద్దం పడుతోంది. ప్రధానమంత్రి పాల్గొన్న ఆర్.కె.బీచ్ వేదిక వద్ద నుంచి వీఎంఆర్డీఏ స్మార్ట్ సిటీ పార్క్ వరకు ఫుట్‌పాత్‌లకు వేసిన తెలుపు, నలుపు రంగులు పూర్తిగా వెలిసిపోతున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనంతో చేపట్టిన పనులు కనీసం నెల రోజులైనా నిలవకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పనులు జరుగుతున్నప్పుడే నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. అయినప్పటికీ అధికారులు ఒత్తిడిలో వాటిని పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు నాసిరకం పనులతో సరిపెట్టారు. కార్యక్రమం జరిగి వారం రోజులకే రంగులు వెలిసిపోవడం, ప్రజాధనం ఎలా దుర్వినియోగమైందో చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. మొక్కల సంరక్షణ ఎక్కడ? రంగుల విషయంలోనే కాక మొక్కల పెంపకంలోనూ ఇదే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. యోగా విలేజ్, జీవీఎంసీ స్విమ్మింగ్ పూల్, ఏయూ కన్వెన్షన్ సెంటర్ వంటి కీలక ప్రాంతాల్లో నాటిన మొక్కలు నీళ్లు లేక ఎండిపోయి చనిపోతున్నాయి. పాండురంగాపురం వద్ద ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్‌లోని మొక్కల్లో చాలా వరకు జీవం కోల్పోయాయి. కొన్ని మొక్కలను కనీసం మట్టిలో నాటకుండా కుండీలతో సహా వదిలేయడం గమనార్హం. ప్రజాధనం దుర్వినియోగంపై ప్రజల ఆగ్రహం ప్రతిష్టాత్మక కార్యక్రమం పేరుతో కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువ కాలంలోనే పనులు పాడైపోతుంటే, ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి జరిగిన పనుల నాణ్యతపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాలని, బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని, బిల్లుల చెల్లింపును నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే, ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఒక మార్గంగా మారిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
హార్బర్లో చేపల జాతర
మహారాణిపేట: విశాఖ సాగర తీరంలో వేట మళ్లీ ఊపందుకుంది. 61 రోజుల వేట నిషేధాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని సముద్రంలోకి అడుగుపెట్టిన మత్స్యకారుల వలలకు ఇప్పుడు సిరుల పంట పడుతోంది. భారీ ఎత్తున పట్టుబడిన మత్స్య సంపదతో ఆదివారం విశాఖ ఫిషింగ్ హార్బర్ కోలాహలంగా మారింది. ఈ సీజన్ ఆరంభం మత్స్యకారులకు శుభసూచకంగా మారింది. ముఖ్యంగా రొయ్యలు భారీ పరిమాణంలో లభించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాణ్యమైన రొయ్యలతో పాటు పీతలు, వంజరాలు, ట్యూనా, చందువాలు, మెత్తని పారలు వంటి రకరకాల చేపలు కూడా పుష్కలంగా దొరికాయి. వేట నిషేధం సత్ఫలితాలనిచ్చిందని, సముద్రంలో మత్స్య సంపద పెరిగిందని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం కావడంతో ఫిషింగ్ హార్బర్ కొనుగోలుదారులు, వ్యాపారులతో కిటకిటలాడింది. పడవలు ఒడ్డుకు చేరగా.. తాజా చేపల కోసం జనం ఎగబడ్డారు. ఈ చేపలను స్థానిక మార్కెట్లలో విక్రయించడంతో పాటు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు మత్స్యకారులు ఏర్పాట్లు చేశారు. -
వీఆర్ఎస్పై అయోమయం
● ముందుకురాని స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు ● ఇప్పటివరకు కేవలం 850 దరఖాస్తులుఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం రెండో విడత ప్రకటించిన వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) దరఖాస్తు విషయంలో ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. మూడో బ్లాస్ట్‌ఫర్నేస్ ప్రారంభించినందున ప్లాంట్ పరిస్థితులు బాగుపడే అవకాశం ఉందని ఉద్యోగులు ఒకవైపు ఆశావాహంగా ఆలోచిస్తుండగా.. రానున్న రోజుల్లో మరింత పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్న భయం మరోవైపు వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ వీఆర్ఎస్ పట్ల ఉద్యోగులు ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, ఆర్థిక సదుపాయాల కోత వంటి కారణాల వల్ల ఈ ఏడాది మార్చి నెలలో వచ్చిన మొదటి వీఆర్ఎస్కు స్పందన లభించింది. అప్పట్లో కూడా వీఆర్ఎస్ పరిహారం, పీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ శాలరీ మొత్తం ఇస్తారా... లేదా అనే సందేహాలతో 1,613 మంది మాత్రమే దరఖాస్తు చేస్తున్నారు. యాజమాన్యం వారికి సకాలంలో అన్ని చెల్లించడంతో అప్పుడు దరఖాస్తు చేయనివారు తప్పు చేశామన్న భావన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో పెరిగిన పని ఒత్తిడి, పూర్తి జీతాలు ఇప్పటికీ చెల్లించకపోవడం వంటి కారణాల వల్ల ఈసారి వీఆర్ఎస్ వస్తే కనీసం మూడు వేల మంది దరఖాస్తు చేస్తారని అందరూ ఊహించారు. అయితే అంత స్పందన లేకపోవడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత బడ్జెట్లో మిగిలిన సొమ్ము మేరకు మాత్రమే ఈసారి వీఆర్ఎస్ ఇస్తారని తద్వారా 500 మందికి మించరని ఊహాగానాలు వినిపించడం, ఇప్పటికే సిబ్బంది బాగా తగ్గిన నేపథ్యంలో చాలా విభాగాల్లో విభాగాధిపతులు వచ్చిన దరఖాస్తులను అంగీకరించేది లేదని చెబుతుండటంతో చాలా మంది ఆశావాహులు ఢీలా పడి దరఖాస్తు చేయనట్టు తెలుస్తుంది. అందువల్లే ఇప్పటివరకు సుమారు 850 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలుస్తుంది. జూలై 15 వరకు గడువు ఉన్నందున చివరలో ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తున్నది. ఏమైనా గడువు ముగిస్తే కాని వీఆర్ఎస్పై స్పష్టత వచ్చే అవకాశం లేదు. -
● అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ, విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు ● విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ఇక వేగవంతం ● దువ్వాడ–పలాస మధ్య రైల్వే లైన్ల వెంట ఫెన్సింగ్ ● మల్లివీడు వద్ద పీపీపీ పద్ధతిలో గతిశక్తి టెర్మినల్ ఏర్పాటు ● దక్షిణ కోస్తా రైల్వే జీఎం కార్యా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : వందేభారత్ రైళ్ల నిర్వహణ కోసం విశాఖలో కోచింగ్ డిపో ఏర్పాటు చేయనున్నట్లు వాల్తేరు డివిజన్ రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం) లలిత్ బోహ్రా తెలిపారు. రైల్వే యార్డులో అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ, విశాలమైన ప్రాంగణంలో డిపో నిర్మాణం జరగనుందని పేర్కొన్నారు. రైళ్ల నిర్వహణ పనుల విషయంలో జాప్యం లేకుండా ఉండేందుకు 24 గంటలు ఈ డిపో పనిచేస్తోందన్నారు. దువ్వాడలో వందేభారత్ రైళ్ల స్టాప్ పాయింట్ కోసం వచ్చే వారం ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు వివరించారు. అలాగే విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జనరల్ మేనేజర్ నియామకం జరిగిందని, వారి కార్యాలయం కోసం 3, 4 ప్రాంతాలను తాత్కాలికంగా పరిశీలిస్తున్నామన్నారు. విశాఖ నుంచి దువ్వాడ వరకు కొత్త రైల్వే లైను పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పనులకు ఉన్న కోర్టు కేసుల అడ్డంకి తొలగిపోయిందని, ఇక పనులు వేగవంతం చేస్తామన్నారు. రైల్వే ప్రయాణికులకు సౌకర్యాలు మరింతగా మెరుగుపరిచే లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. మల్లివీడు వద్ద గతి శక్తి టెర్మినల్..! కొత్తవలస రైల్వే స్టేషన్ దాటిన తర్వాత గల మల్లివీడు రైల్వే స్టేషన్ వద్ద గతిశక్తి టెర్మినల్ (జీసీటీ) ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ మెకానికల్ హ్యాండ్లింగ్, వేర్ హౌసింగ్, ట్రక్ రిపేర్ సెంటర్, ఫ్యూయలింగ్ సెంటర్ ఏర్పాటుకానున్నాయి. మెకానికల్ హ్యాండ్లింగ్ ద్వారా రేకుల లోడింగ్, అన్లోడింగ్ వేగవంతం అవుతుంది. తద్వారా రేకుల అందుబాటు సమయం కూడా పెరుగుతుంది. తద్వారా రేకుల కొరత కూడా కొద్ది మేర తగ్గే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించాం. ఆగస్టులో టెండర్ దాఖలుకు గడువు ఉంది. ఇది పూర్తిగా రైల్వే స్థలంలోనే ఏర్పాటు కానుంది. శాటిలైట్ స్టేషన్లగా మరింత అభివృద్ధి..! విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రస్తుతం రోజూ 50 వేల మంది వరకూ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వే లైన్లు తక్కువగా ఉండటం వల్ల రైళ్ల వేగం కూడా దువ్వాడ నుంచి తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొత్త రైల్వే లైన్ల పనులు సాగుతున్నాయి. 3, 4 రైల్వే లైన్ల పనులు జరుగుతున్నప్పటికీ.. భవిష్యత్ అవసరాల నేపథ్యంలో దువ్వాడ, పెందుర్తి శాటిలైట్ స్టేషన్లుగా మరింత అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. తద్వారా విశాఖ రైల్వే స్టేషన్‌పై భారం తగ్గుతుంది. ఇప్పటికే దువ్వాడ స్టేషన్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. పెందుర్తి స్టేషన్లోనూ అభివృద్ధి పనులు చేపడతాం. డీఆర్ఎం లలిత్ బోహ్రావందేభారత్ మెయింట్‌నెన్స్ డిపోదువ్వాడ నుంచి పలాసకు రయ్ రయ్! దువ్వాడ నుంచి పలాస వరకు రైల్వే లైన్ల వెంట ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే ఈ పనులకు టెండర్లు పూర్తయ్యాయి. సదరు కాంట్రాక్టరుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) కూడా జారీచేశాం. రానున్న 12 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించాం. ఈ ఫెన్సింగ్ ఏర్పాటుతో రైళ్ల రాకపోకల సందర్భంగా ఎటువంటి ప్రమాదాలకు... రైల్వే లైన్ల క్రాసింగ్‌కు అవకాశం ఉండదు. తద్వారా రైళ్ల వేగాన్ని గంటకు 160 కిలోమీటర్ల వరకూ తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఈ మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచడం ద్వారా ప్రయాణికులు గమ్యాన్ని వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు..! కోర్టు కేసుతో రైల్వే స్టేషన్లో పనులు ముందుకు సాగలేదు. చివరకు కోర్టు కేసు గెలిచాం. పనులు ప్రారంభిస్తాం. మొత్తం 14 ఫ్లాట్‌ఫారంలను ప్రధాన బిల్డింగ్‌ను ప్రయాణికులు చేరేందుకు వీలుగా 72 మీటర్ల పొడవైన కాంకోర్స్ ఏర్పాటవుతుంది. ఇక్కడ ప్రయాణికులు సేదతీరేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్న ఫ్లాట్‌ఫారం సైజు కూడా పెరుగుతుంది. ఇక జ్ఞానాపురం వైపు స్టేషన్ నుంచి నేరుగా బయటకు వెళ్లేందుకు వీలుగా ఫ్లాట్‌ఫారంల నిర్మాణం ఉంటుంది. మల్టీ లెవల్ కారు పార్కింగ్ సదుపాయంతో పాటు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. గత 8 నెలలుగా నిలిచిన పనులు పట్టాలెక్కనున్నాయి. దువ్వాడలో వందేభారత్ స్టాప్ కోసం ప్రతిపాదనలు ప్రస్తుతం వైజాగ్–సికింద్రాబాద్ మధ్య రెండు వందేభారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి. ప్రయాణికుల నుంచి వీటికి మంచి డిమాండ్ ఉంది. ఈ రెండు రైళ్ల నిర్వహణ సికింద్రాబాద్‌లోని డిపోలో జరుగుతోంది. విశాఖలో ఈ రైళ్ల నిర్వహణ కోసం డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో ఈ డిపో పనులు ప్రారంభించాలని నిర్ణయించాం. అదేవిధంగా ఈ రైళ్లును దువ్వాడ స్టేషన్లోనూ నిలపాలనే డిమాండ్ ప్రయాణికుల నుంచి ఉంది. దీనిపై వచ్చే వారం ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదనలు పంపుతాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. -
సిఫార్సులతో బదిలీలా?
● సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం ● బదిలీ ప్రక్రియలో పాల్గొనకుండా నిరసన జగదాంబ: జీవీఎంసీ పరిధిలోని సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఐదేళ్లు దాటిన సచివాలయ మౌలిక సదుపాయాల కార్యదర్శులకు బదిలీ చేయడానికి కూటమి ప్రభుత్వం ఆమోదం తెలపగా, శనివారం జీవీఎంసీ జోన్–4 సూర్యాబాగ్ కార్యాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు ముందుగా చెప్పినట్లు మూడు ఆప్షన్ల ప్రక్రియ కాకుండా, కూటమి నేతల సిఫార్సుల ప్రకారం బదిలీలు జరుగుతున్నాయని సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కూటమి నేతల సిఫార్సులకు అధికారులు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్షన్లో ఇచ్చిన మూడు సచివాలయాల మాట మరచి అధికారులు నేతలకు తొత్తులుగా వ్యవహరించడంతో సీనియర్ కార్యదర్శులకు అన్యాయం జరిగిందని వారు వాపోయారు. బదిలీల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు. పారదర్శకంగా బదిలీలు చేయాలంటూ బదిలీల ప్రక్రియ నుంచి బయటకు వచ్చేశారు. అర్హులకు అన్యాయం మరికొందరికి బదిలీ కౌన్సెలింగ్‌లో ఆప్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుని వెళ్లిపోవాలని సూచించినట్లు చెబుతున్నారు. దీనివల్ల అర్హులైన కార్యదర్శులకు అన్యాయం జరుగుతుందని వారు వాపోయారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, బదిలీల ప్రక్రియను సక్రమంగా జరిపించాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. -
పీలా వర్సెస్ గండి బాబ్జీ
పెందుర్తి : పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత కుమ్ములాటల మెగా సీరియల్ కొనసాగుతుంది. పార్టీ సమావేశాల్లో టీడీపీలో ఉన్న విబేధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పార్టీ కీలక నాయకులే రోడ్డెక్కి రచ్చకు దిగుతున్నారు. అధికారంలో ఉండడంతో ఆధిపత్యం కోసం చోటామోటా నాయకుల నుంచి నియోజకవర్గంలోని కీలక నేతలు సైతం కీచులాడుకుంటున్నారు. తాజాగా శనివారం పెందుర్తిలో జరిగిన టీడీపీ నియోజకవర్గస్థాయి సంస్థాగత ఎన్నికల సన్నద్ధ సమావేశంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుటే పరస్పరం దూషణలకు దిగారు. ‘పిలుపు’ల విషయంలో ఇద్దరి మధ్య మాటలు తూటాలు పేలాయి. అసలేం జరిగిందంటే.. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో పెందుర్తిలో ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న గండి బాబ్జీ దాదాపు 2 గంటలు ఆలస్యంగా సమావేశానికి వచ్చారు. అదే సమయంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, గండి బాబ్జీ చిరకాల ప్రత్యర్థి అయిన మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు తన వర్గీయులతో కలిసి సమావేశానికి వచ్చారు. ఈ క్రమంలో గండి బాబ్జీ ప్రసంగిస్తూ ‘నేను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిని. రాష్ట్ర స్థాయిలో ఓ కార్పోరేషన్‌కు చైర్మన్ హోదాలో ఉన్నాను. కానీ నన్ను నియోజకవర్గ పరిధిలో ఉన్న జీవీఎంసీ వార్డుల్లోని ముఖ్య కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. అంతా నువ్వే చేసుకుంటున్నావ్’ అంటూ మేయర్ పీలాను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. దీంతో పీలా వెంటనే మైక్ అందుకుని ‘పెందుర్తి పట్టణం నా అడ్డా. నాకు ఇక్కడ తిరుగులేదు. బండారు సత్యనారాయణమూర్తి లాంటి వ్యక్తే నా అనుమతి లేకుండా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేసేవారు కాదు. నువ్వు మాత్రం పార్టీ కార్యక్రమాలకు కూడా మేయర్ హోదాలో ఉన్న నన్ను పిలవడం లేదు. అయినా అధికారిక కార్యక్రమాలకు నిన్ను ఎందుకు పిలవాలి’ అంటూ అంతే ఘాటుగా బదులిచ్చారు. ఈ క్రమంలో వేదిక మీద నుంచే పీలా, గండి పరస్పరం మాటలు విరుసుకున్నారు. ఇక పరిస్థితి చేదాటిపోతుందన్న సమయంలో కోరాడ, ఇతర నాయకులు కలగజేసుకుని ఇద్దరినీ సముదాయించారు. అందుకేనా.. టీడీపీ ఇన్చార్జిగా ఉన్న గండి బాబ్జీపై ప్రత్యర్థుల కంటే స్వపక్షంలోనే ఎక్కువ మంది గిట్టనివారు ఉన్నా రు. జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మేయర్ పీలా శ్రీనివాసరావు అనేకసార్లు గండి బాబ్జీని కౌంటర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బహిరంగంగానే బాబ్జీపై విమర్శలు దిగుతున్నారు. ఈ క్రమంలో శనివారం సమావేశానికి బాబ్జీకి చిరకాల ప్రత్యర్థి అయిన బండారు కుమారుడు అప్పలనాయుడు, ఇతర నాయకులతో పీలా కలిసి రావడం బాబ్జీకి చిర్రెత్తుకొచ్చినట్లు తెలుస్తుంది. అదే సమయంలో బాబ్జీపై చాలాకాలంగా గుర్రుగా ఉన్న పీలా సైతం సందర్భం చూసి విరుచుకుపడ్డారు. మొత్తానికి పెందుర్తి టీడీపీ కుక్కలు చింపిన విస్తరిగా మారిందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. టీడీపీ అంతర్గత సమావేశంలో పరస్పరం దూషించుకున్న మేయర్, టీడీపీ ఇన్చార్జి నువ్వు నన్ను ఎందుకు కార్యక్రమాలకు పిలవడం లేదని నిలదీసిన గండి అధికారిక కార్యక్రమాలకు నిన్నెందుకు పిలుస్తానంటూ పీలా కౌంటర్ పెందుర్తిలో కొన్ని కార్యక్రమాలకు నాకు ఆహ్వానం ఇవ్వడం లేదు: మేయర్ పెందుర్తిలో టీడీపీ కుమ్ములాటలు -
ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే..
కూటమి నేతలకు లబ్ధి చేకూరేలా మాస్టర్ ప్లాన్‌లో మార్పులకు కసరత్తు ● వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన షురూ.. ● అభ్యంతరాల కోసం జూలై 17 వరకు గడువు పొడిగింపు ● వాటిపై నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల సమక్షంలోనే పరిశీలన ● రేపటి నుంచి జూలై 17 వరకు సమీక్షలు విశాఖ సిటీ : అంతా అనుకున్నట్లే చేస్తున్నారు. విశాఖ బృహత్తర ప్రణాళిక–2041లో మార్పులు, చేర్పులకు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల సమక్షంలోనే ఈ తంతు పూర్తి చేసేందుకు ముహూర్తం పెట్టేశారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల పరిశీలన పేరుతో తమ వారికి లబ్ధి చేకూర్చేందుకు పూనుకుంటున్నారు. ఇందుకోసం ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు నియోజకవర్గాల వారీ ఆయా ఎమ్మెల్యేల సమక్షంలోనే అభ్యంతరాలపై సమీక్షించాలని నిర్ణయించారు. ఒకవైపు ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు తేదీలు ఖరారు చేసినప్పటికీ.. అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగించడం విశేషం. ఇందులో కూటమి ‘రియల్ వ్యాపారానికి’ అనుగుణంగా ప్లాన్‌లో సవరణలు చేసే అవకాశం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తోంది. అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగింపు వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్–2041లో పునఃపరిశీలన పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మే 22వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో కేవలం 755 మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. వాస్తవానికి వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తాయని కూటమి ప్రజాప్రతినిధులు భావించారు. ఆ సంఖ్యను అడ్డుపెట్టుకుని ఇప్పటికే సిద్ధమైన మాస్టర్‌ప్లాన్–2041పై ఆరోపణలు గుప్పించాలని నిర్ణయించారు. కానీ నామమాత్రంగానే అభ్యంతరాలు రావడంతో కూటమి నేతలు కంగుతిన్నారు. దీంతో ఈ అభ్యంతరాల స్వీకరణ గడువు మరోసారి పొడిగించారు. జూలై 17వ తేదీ వరకు ఫిర్యాదులు చేయవచ్చని తాజాగా ప్రకటించారు. వీఎంఆర్డీఏ కార్యాలయానికి, ఆన్లైన్లో ఫిర్యాదులు ఎక్కువగా రాకపోవడంతో ఆయా జిల్లాల రెవెన్యూ కార్యాలయాల్లో కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట తదితర ప్రాంతాల వారి సౌలభ్యం కోసమంటూ అనకాపల్లి ఆర్డీవో కార్యాలయంలో అభ్యంతరాలను ఈ నెల 30, జూలై 1వ తేదీల్లో స్వీకరించనున్నారు. అలాగే ఎస్.కోట, చీపురుపల్లి, విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల ప్రాంతాల వారు విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో జూలై 14, 15 తేదీల్లో ఫిర్యాదులను అందించే అవకాశం కల్పించారు. పరిశీలనలో సిఫార్సులకే పెద్ద పీట? మాస్టర్‌ప్లాన్ కోసం వచ్చిన అభ్యంతరాల పరిశీలనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేల సమక్షంలోనే వీటి పరిశీలనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా అభ్యంతరాలను పరిశీలించనున్నారు. నిర్ణీత తేదీ, సమయాల్లో ఎమ్మెల్యేలతో పాటు ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెబుతున్నప్పటికీ.. ఆ పరిస్థితి ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూలై 16, 17 తేదీల్లో వీఎంఆర్డీఏ కార్యాలయం 3వ అంతస్తులో మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ అభ్యంతరాలను స్వీకరించనున్నారు. కేవలం కూటమి ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల రియల్ వ్యాపారానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంతో మాస్టర్‌ప్లాన్‌లో సవరణకు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నీటికి కటకట
సమ్మె తాత్కాలిక విరమణ ● 2వ తేదీ వరకు డెడ్‌లైన్ విధించిన కార్మికులు ● లేదంటే 3వ తేదీ నుంచి సమ్మె ● మేయర్‌తో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ చర్చలు డాబాగార్డెన్స్: జీవీఎంసీ తాగునీటి విభాగం ఔట్సోర్సింగ్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించారు. మేయర్ పీలా శ్రీనివాసరావుతో యూనియన్ నాయకులు జరిపిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల జీతాల పెంపు విషయమై బుధవారం లోపల పరిష్కరించేందుకు మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు కార్మికులు సమ్మెను తాత్కాలికంగా విరమించినట్టు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం.ఆనందరావు సాక్షికి తెలిపారు. బుధవారంలోపు ( వచ్చే నెల 2వ తేదీ) హామీ అమలు కాకపోతే 3వ తేదీ నుంచి తిరిగి సమ్మె బాట తప్పదని ఆయన స్పష్టం చేశారు. పెందుర్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ నాయకులతో మేయర్ చర్చలు జరిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 50 శాతం తాగునీటి సరఫరా చేయగా, మిగిలిన 50 శాతం సాయంత్రానికి పూర్తిగా పునరుద్ధరించినట్టు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం ప్రజలకు తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేప ట్టారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సిటీ ఆపరేషన్ సెంటర్లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు తమ సమస్యల కోసం హెల్ప్‌లైన్ నెంబరు 0891–2507225ను సంప్రదించవచ్చన్నారు. చుక్క నీటి కోసం తాపత్రయంనీరు దొరక్క దిగాలుగా...జీవీఎంసీ తాగునీటి విభాగం ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెతో నగరంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. రెండు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బిందెలతో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.‘గుక్కెడు నీరివ్వలేని వారు పాలన ఎలా సాగించగలరు?’ అంటూ జీవీఎంసీ 7వ వార్డులోని వాంబేకాలనీ, 6వ వార్డులోని పీఎం పాలెం జేఎన్ఎన్యూఆర్ఎం బీ–2 కాలనీ, వైఎస్సార్ కాలనీ, వాంబేకాలనీల్లో మహిళలు బిందెలతో నిరసన తెలిపారు. మంచి నీరు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని వార్డుల్లో ప్రజలు బోరు బావుల వద్ద బారులు తీరారు. ఆరిలోవ కొండవాలు ప్రాంతాలైన దీన్‌దయాల్‌పురం, చినగదిలి, పెదగదిలి, సంజయ్‌గాంధీ కాలనీ, హనుమంతవాక, ఆదర్శనగర్, బీసీ కాలనీ, సింహగిరి కాలనీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మున్సిపల్ నీరు అందక, బోర్లు పనిచేయక దైనందిన కార్యకలాపాలకు కూడా నీరు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. తాగునీటి కోసం ప్రజలు బోరింగ్‌లను ఆశ్రయించాల్సి వచ్చింది. –ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
సమాచార శాఖ మంత్రి దృష్టికి జర్నలిస్టుల సమస్యలు
మహారాణిపేట: రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు కోరారు. శనివారం ఆయన నాయకత్వంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.నారాయణ్, జి.శ్రీనివాస్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, మదన్లతో కలిసి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి జర్నలిస్టులకు త్వరలో హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని, వాటి ప్రీమియంలో 50 శాతం ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల పింఛన్ల విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి తగు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలు లేదా ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, త్వరలో దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చినట్టు శ్రీనుబాబు తెలిపారు. అనంతరం న్యూస్‌పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రామచంద్రరావు తదితరులు మంత్రిని కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించారు. -
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి
సీతంపేట: జీవీఎంసీ తాగునీటి విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె వల్ల నగరంలో తలెత్తుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కే.కే. రాజు ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులు వేతనాల పెంపు కోరుతూ ఎప్పటికప్పుడు సమ్మెలు చేయడం వల్ల నగరంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందన్నారు. రెండు రోజులుగా విశాఖ ప్రజలు, ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల వారు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని, ప్రజలు తాగునీటి కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా పర్మినెంట్ ఉద్యోగులతో నీటి సరఫరాను చేపట్టాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలి
డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని, ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించడమే సరైన పరిష్కారమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. బ్లాస్ట్ ఫర్నేస్–3 తిరిగి ఉత్పత్తి ప్రారంభించడాన్ని కమిటీ అభినందించింది. శనివారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు, కమిటీ కో కన్వీనర్స్ డి.ఆదినారాయణ, రామచంద్రరావు, వి.శ్రీనివాసరావుతో కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే సొంత గనులు ఇవ్వకుండా ప్లాంట్‌ను నష్టాల్లోకి నెడుతోందని ఆరోపించారు. దీనివల్ల ఏటా రూ. 4 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. కనీసం స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్లోనైనా విలీనం చేయాలని వారు కోరారు. కేంద్రం స్టీల్‌ప్లాంట్‌లోని ఉత్పత్తి విభా గాల ఆపరేషన్, మెయింటెనెన్స్ పనులను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించిందని, సింటర్ ప్లాంట్, రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ విభాగాలకు జూలై 12 నాటికి టెండర్లు ఆహ్వానించిందని తెలిపారు. ఈ విధంగా మొత్తం 13 విభాగాలను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇది పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చే ప్రయత్నమని మండిపడ్డారు. 1583 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయని, గత మూడు నెలల్లో సుమారు 5 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఎటువంటి నోటీసులు లేకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది నిర్వాసితులను ఉద్యోగాల నుంచి తొలగిస్తుంటే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాజమాన్యంతో కుమ్మకై ్క మోసగిస్తున్నారని ఆరోపించారు. -
విదేశాల్లో పూర్వ విద్యార్థుల సంఘాలు
● ఎగ్జిట్ ఎంగేజ్మెంట్ ఈవినింగ్ కార్యక్రమంలో ఏయూ వీసీ రాజశేఖర్ మద్దిలపాలెం: విదేశాలలో ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ ప్రకటించారు. శనివారం బీచ్ రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్), ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘ఎగ్జిట్ ఎంగేజ్మెంట్ ఈవినింగ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశీ విద్యార్థులతో ఏయూ ప్రయాణం విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిందని అన్నారు. ఏయూ పూర్వ విద్యార్థులుగా విదేశాల్లో విశ్వవిద్యాలయం ఖ్యాతిని పెంచే విధంగా పనిచేయాలని ఆయన సూచించారు. విదేశీ విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఐసీసీఆర్ స్కాలర్షిప్ విభాగం డైరెక్టర్ సంజీవ్ వేది మాట్లాడుతూ, ఏయూలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు తమతో పాటు భారతీయతను తీసుకువెళుతున్నారని అన్నారు. ఐసీసీఆర్ అందించే స్కాలర్‌షిప్‌ల గురించి ఇతర దేశాల్లోని విద్యార్థులకు వివరించి, మరింత మందికి ఉపయోగపడాలని సూచించారు. ఏయూ అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయరావు మాట్లాడుతూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 59 దేశాల నుంచి 1,100 మందికి పైగా విదేశీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నా రని తెలిపారు. వారికి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ఏయూతో తమ అనుబంధాన్ని, విశాఖ నగరం, తెలుగు ప్రజల అభిమానాన్ని గుర్తు చేసుకుంటూ తమ అనుభూతులను పంచుకున్నారు. అనంతరం వారికి అల్యూమ్ని కార్డులు అందజేశారు. వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు తమ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఐసీసీఆర్ జోనల్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల విభాగం అసోసియేట్ డీన్ ఆచార్య ఎన్.ఎం. యుగంధర్ ప్రిన్సిపాల్స్ ఆచార్య ఏ. నరసింహారావు, ఎంవీఆర్ రాజు, జి. గిరిజ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
మానవ మృగానికి ఉరే సరైన శిక్ష
విశాఖపట్నం: పెందుర్తి మండలం వి.జుత్తాడలో నాలుగేళ్ల క్రితం(2021 ఏప్రిల్ 15న) జరిగిన దారుణ హత్యల కేసులో నిందితుడు బత్తిన అప్పలరాజుకు జిల్లా కోర్టు శుక్రవారం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో బాధిత కుటుంబం, స్థానికులు న్యాయం లభించిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పసిపిల్లలతో సహా ఆరుగురు నిద్రమత్తులోనే ప్రాణాలు కోల్పోగా, అప్పటి నుంచి న్యాయం కోసం నిరీక్షిస్తున్న కుటుంబానికి ఈ తీర్పు కొంత ఊరటనిచ్చింది. అనుమానమే ఆరుగురి ప్రాణాలు తీసింది 2021 ఏప్రిల్ 15 తెల్లవారుజామున జుత్తాడ గ్రామం రక్తసిక్తమైంది. నిందితుడు బత్తిన అప్పలరాజు కుమార్తెకు, అదే గ్రామానికి చెందిన బమ్మిడి విజయ్‌కిరణ్‌కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఇరు కుటుంబాల మధ్య దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పగతో రగిలిపోయిన అప్పలరాజు.. విజయ్‌కిరణ్ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆ రోజు ఉదయం వారింట్లోకి ప్రవేశించి నిద్రలో ఉన్న బమ్మిడి రమణ(63), బమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నక్కెళ్ల అరుణ(40), బమ్మిడి ఉదయ్‌నందన్ (2), బమ్మిడి ఉర్విష విజయ్‌కిరణ్(6 నెలలు)లను కత్తితో అత్యంత పాశవికంగా హతమార్చాడు. అభంశుభం తెలియని పసికందులను కూడా వదలకుండా చంపడం అందరినీ కలచివేసింది. రక్తపు మడుగులో మృతదేహాల దృశ్యం చూసిన వారందరినీ కన్నీరు పెట్టించింది. న్యాయం దిశగా ... ఈ దారుణ ఘటన అనంతరం అప్పలరాజు పోలీసులకు లొంగిపోయాడు. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి, బాధిత కుటుంబానికి అండగా నిలబడింది. నష్టపరిహారం చెల్లించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చింది. పోలీసులు ఈ కేసును అత్యంత పకడ్బందీగా విచారించి కోర్టులో నివేదించారు. నాలుగేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం, ఈ రోజు విశాఖ కోర్టు అప్పలరాజుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల ఆనందం ఈ తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు నాటి ఘటనను తల్చుకుని కన్నీరు పెట్టుకుంటూనే తమ ఆనందం వ్యక్తం చేశారు. ‘మానవ మృగానికి ఉరే సరైన శిక్ష. మా కుటుంబానికి న్యాయం జరిగింది’అని తెలిపారు. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ.. తాత్కాలికంగా సమ్మె విరమణ
విశాఖ వాటర్ ఎమర్జెన్సీ అప్డేట్స్.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో నగర ప్రజలు, పరిశ్రమలు నీటి కోసం అల్లాడుతున్నాయి. తాత్కాలికంగా సమ్మె విరమణ..తాత్కాలికంగా సమ్మె విరమించిన జీవీఎంసీ వాటర్ సప్లై ఉద్యోగులు..మేయర్ విజ్ఞప్తి మేరకు బుధవారం వరకు సమయం ఇచ్చిన వాటర్ సప్లై సిబ్బంది..జీవీఎంసీ పరిధిలో మంచి నీరు అందించేందుకు మరో 7-8 గంటలు సమయం పట్టే అవకాశం..ఇప్పటికే అన్ని ట్యాంకుల్లో నిండుకున్న నీటి నిల్వలు..ట్యాంకులు నింపడానికి 4-5 గంటలు సమయం పట్టే అవకాశం..ఆ తరువాత పంపిణీకి మరో మూడు గంటల సమయం పట్టే ఛాన్స్..ఈరోజు రాత్రికి కేవలం 25 శాతం మంచి నీరు మాత్రమే పంపిణీ అయ్యే సూచనలు..మహిళల ఆందోళన..విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ..బక్కన్నపాలెంలో ఖాళీ బిందెలతో నిరసనకు దిగిన మహిళలు..మంచి నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నామంటున్న మహిళలు..మేయర్‌తో ఇంకా ప్రారంభం కానీ వాటర్ సప్లై ఉద్యోగుల చర్చలు..చర్చలు సఫలమైనా నీటి విడుదలకు సమయం పట్టే అవకాశం..👉ఆప్కాస్ కార్మికులు సమ్మె బాట పట్టడమే దీనికి కారణం. ఫలితంగా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులతో పాటు పరిశ్రమలకు తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. తాగునీటి విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో అధికారులు, మేయర్ పీలా శ్రీనివాసరావు ఆసక్తి చూపకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్లు కార్మికులు తెలిపారు.👉దీంతో, మూడు లక్షల ఇంటి కులాయిలు, ఆసుపత్రులు సహా పలు కీలక పరిశ్రమలకు మంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఉదయం ఐదు గంటల నుంచి కులాయిలు రావాల్సి ఉన్నప్పటికీ నీటి సరఫరాకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో పలు కాలనీల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హెచ్‌పీసీఎల్, కోరమండల్, ఎస్సార్, ఆర్సీఎల్, పోర్ట్ మొదలగు పరిశ్రమలకు కూడా నీటి సరఫరా ఆగిపోయింది. దాదాపు 30 గంటలుగా పంపింగ్ ప్రక్రియ స్థంభించిపోయింది. ఏలేరు, తాటిపూడి, గోస్తని, గంభీరం, రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే నీటిని ఉద్యోగులు నిలిపివేశారు. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని ట్యాంకులు ఖాళీ అయినట్టు సమాచారం. తిరిగి ట్యాంకులను నింపాలంటే సుమారు 10 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. సచివాలయ ఉద్యోగులతో ట్యాంకులు నింపాలని జీవీఎంసీ యోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే సాంకేతిక సమస్యలు తప్పవని వాటర్ సప్లై ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.👉ఇక, నిన్న రాత్రి వరకు జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగుతోంది. మంచి నీళ్ళు లేక గ్రేటర్ విశాఖ జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో మేయర్‌తో మరోసారి చర్చలకు వెళ్ళనున్నారు వాటర్ సప్లై ఎంప్లాయిస్ యూనియన్ నేతలు. చర్చలు సఫలం అయితేనే నీటిని విడుదల చేస్తామంటున్న ఉద్యోగులు చెబుతున్నారు. జీవీఎంసీ చరిత్రలో మంచి నీటి సరఫరా ఆగిపోవడం ఇదే మొదటిసారి..👉ఇదిలా ఉండగా.. ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మెతో నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పర్మినెంట్ ఉద్యోగులతో కొంతమేర నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ, అది అరకొరగానే ఉండటంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.కార్మికుల డిమాండ్.. 👉ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల్లో పదేళ్లు అనుభవం ఉండి, టెక్నికల్ విధులు నిర్వహిస్తున్న సుమారు 900 మందిని సెమీ స్కిల్ కేటగిరీలో చేర్చి, ఆ మేరకు వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో జీవీఎంసీ కౌన్సిల్ వేతనాల పెంపునకు ఆమోదం తెలపగా, అధికారులు మే నెల నుంచి నెలకు రూ.6 వేలు పెంచుతూ ఆప్కాస్ వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే ఆచరణలో పాత వేతనాలే చెల్లించడంతో పాటు, జూన్ నెల జీతాలు కూడా పాత పద్ధతిలోనే అప్లోడ్ చేయడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన పెంపు అమలు చేయాలంటూ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో నగరంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.చర్యలు చేపట్టండి👉తాగునీటి విభాగం ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ, ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మేయర్, అసౌకర్యానికి సహకరించాలని కోరారు. -
ఇళ్ల నిర్మాణాలకు రూ.3,200 కోట్లు
సంజనకు ‘శోభానాయుడు యువ పురస్కార్’ అమెరికాలో నివసిస్తున్న ప్రముఖ కూచిపూడి నర్తకి సంజనా పుట్టాకు జూలై 4న విశాఖపట్నంలో ‘పద్మశ్రీ డా. శోభానాయుడు యువ పురస్కార్ – 2025’ ప్రదానం చేయనున్నట్లు నటరాజ్ మ్యూజిక్ – డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు బి.ఆర్. విక్రమ్ కుమార్ ప్రకటించారు. ఈ పురస్కారాన్ని భారతీయ శాసీ్త్రయ నృత్య కళలలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి అందజేస్తారు. సంజన 12 సంవత్సరాలుగా గురువు శ్రీలత సూరి శిక్షణలో కూచిపూడి నృత్యంలో సాధన చేసి, అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె 2024లో రంగప్రవేశం పూర్తి చేసి, ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఆస్టిన్‌లో ప్రీ–మెడ్ విద్యార్థినిగా ఉన్నారు. క్యాంపస్‌లో భారతీయ కూచిపూడి నృత్యాన్ని పరిచయం చేయడంలో ఆమె విశేష కృషి చేస్తున్నారు. – మద్దిలపాలెంమహారాణిపేట : రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం రూ. 3,200 కోట్ల అదనపు ఆర్థిక సాయం అందించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మంజూరైన 1.89 లక్షల ఇళ్లలో 43 వేలు పూర్తయ్యాయని, మిగిలినవి 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. ఎస్సీ, బీసీలకు రూ. 50 వేలు, ఎస్టీలకు రూ. 75 వేలు, గిరిజన ప్రాంతాల్లోని ఎస్టీలకు రూ. 1 లక్ష అదనపు సాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నాణ్యత, మౌలిక సదుపాయాలపై దృష్టి పెడతామని, పనులు వదిలేసిన గుత్తేదారులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. పేదలందరికీ ఇళ్లు : పేదలందరికీ ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే నాలుగేళ్లలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందిస్తామని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటికే లేఅవుట్లపై కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని ఆయన వివరించారు. మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా విద్యుత్, తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తాగునీటి కోసం జీవీఎంసీ నుంచి నిధులతో పాటు ప్రభుత్వం నుంచి కూడా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో భవానీ శంకర్, ఆర్డీవో సంగీత్, హౌసింగ్ సీఈ రామ్మోహన్రావు, హౌసింగ్ పీడీ సత్తిబాబు, సంబంధిత హౌసింగ్ ఈఈలు, డీఈలు, పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. -
జైలులో సౌకర్యాలపై ఆరా
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని శుక్రవారం న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి సన్యాసినాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన జైలులోని ఖైదీల బ్యారక్‌లను పరిశీలించారు. ఖైదీలతో నేరుగా మాట్లాడిన సన్యాసినాయుడు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, భోజనం, వైద్య సేవలు, పరిశుభ్రత వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జైలులో ప్రస్తుతమున్న ఖైదీల సంఖ్య, వారి ప్రవర్తన గురించి జైలు అధికారుల నుంచి సమాచారం సేకరించారు. అనంతరం కారాగారం న్యాయ సహాయ కేంద్రంలో రిమాండ్ ఖైదీలతో మాట్లాడి, వారికి అవసరమైన న్యాయ సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో జైలు డిప్యూటీ సూపరింటెండెంట్లు కె. జవహర్ బాబు, సి. ప్రవీణ్ కుమార్, ఇతర జైలర్లు పాల్గొన్నారు. -
నేటితో ముగియనున్న పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
మురళీనగర్: పాలిటెక్నిక్ కాలేజీల్లో టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న పాలిసెట్ కౌన్సెలింగ్ శనివారంతో ముగియనుంది. శుక్రవారం మొత్తం 386 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. జీఐఈటీఎస్ లో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ పర్యవేక్షణలో, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ సిహెచ్. జయప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో 104001 నుంచి 112000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో 152 మందికి సర్టిఫికెట్లు పరిశీలించగా, వారిలో 112 మంది బీసీ, 17 మంది ఓసీ, 23 మంది ఎస్సీ విద్యార్థులు ఉన్నారు.పాలిటెక్నిక్ కాలేజీలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్ పర్యవేక్షణలో, జనరల్ హెడ్, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ డాక్టర్ పి.ఎం. భాషా, లెక్చరర్ నాగరాజు ఆధ్వర్యంలో 112001 నుంచి 120000 ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ జరిగింది. ఇక్కడ 234 మందికి సర్టిఫికెట్లు పరిశీలించగా, 166 మంది బీసీ, 26 మంది ఓసీ, 30 మంది ఎస్సీ, 12 మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నారు. శనివారం జీఐఈటీఎస్లో 1,20,001 నుంచి 1,27,000 ర్యాంకు వరకు ఉన్న విద్యార్థులు హాజరు కావాలి. పాలిటెక్నిక్ కాలేజీలో 1,27,001 నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న విద్యార్థులు హాజరు కావాలి.ఎస్టీ విద్యార్థులందరూ పాలిటెక్నిక్ కాలేజీకి హాజరు కావాల్సి ఉంటుంది. -
జీవో 7 ప్రకారం వేతనాలు అమలు చేయాలి..
జీవీఎంసీ మంచినీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు జీవో 7 ప్రకారం వేతనాలు అమలు చేయాలి. కార్పొరేషన్ తీర్మానం (2024 డిసెంబర్ 11) ప్రకారం వేతనాలు పెంచేందుకు ఐదు నెలల క్రితం ఆప్కాస్ పోర్టల్‌లో ప్రక్రియ పూర్తై, బిల్లులు కూడా జనరేట్ అయ్యాయి. అయితే, కొన్ని కారణాలతో పాత వేతనాల బిల్లులనే తిరిగి వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ విషయంపై 15 రోజుల క్రితం అధికారులు, మేయర్‌కు ఫిర్యాదు చేయగా, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో సమ్మెకు సిద్ధమయ్యాం. – మహాదేవ్ ఆనందరావు, గౌరవ అధ్యక్షుడు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ -
కట్..!
గ్రేటర్‌కు వాటర్గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో నగర ప్రజలు, పరిశ్రమలు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఆప్కాస్ కార్మికులు సమ్మె బాట పట్టడమే దీనికి కారణం. టౌన్ సర్వే రిజర్వాయర్, నరవ హెడ్ వాటర్ వర్క్స్, పద్మనాభంతో పాటు పలు జోనల్ కార్యాలయాల వద్ద కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఫలితంగా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులతో పాటు పరిశ్రమలకు తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. తాగునీటి విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో అధికారులు, మేయర్ పీలా శ్రీనివాసరావు ఆసక్తి చూపకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్లు కార్మికులు తెలిపారు. డాబాగార్డెన్స్: ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మెతో నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పర్మినెంట్ ఉద్యోగులతో కొంతమేర నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ, అది అరకొరగానే ఉండటంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారంటే.. ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల్లో పదేళ్లు అనుభవం ఉండి, టెక్నికల్ విధులు నిర్వహిస్తు న్న సుమారు 900 మందిని సెమీ స్కిల్ కేటగిరీలో చేర్చి, ఆ మేరకు వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో జీవీఎంసీ కౌన్సిల్ వేతనాల పెంపునకు ఆమోదం తెలపగా, అధికారులు మే నెల నుంచి నెలకు రూ.6 వేలు పెంచుతూ ఆప్కాస్ వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే ఆచరణలో పాత వేతనాలే చెల్లించడంతో పాటు, జూన్ నెల జీతాలు కూడా పాత పద్ధతిలోనే అప్లోడ్ చేయడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన పెంపు అమలు చేయాలంటూ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో నగరంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టండి తాగునీటి విభాగం ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ, ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మేయర్, అసౌకర్యానికి సహకరించాలని కోరారు. ఆప్కాస్ కార్మికులు సమ్మె బాట పట్టించుకోని అధికారులు, మేయర్ ప్రజలకు నీటి కష్టాలు -
మానవ మృగానికి ఉరే సరైన శిక్ష
● ఆరుగుర్ని హత్య చేసిన నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ● నాలుగేళ్ల క్రితం జుత్తాడలో ఘోర సంఘటన పెందుర్తి: పెందుర్తి మండలం వి.జుత్తాడలో నాలుగేళ్ల క్రితం(2021 ఏప్రిల్ 15న) జరిగిన దారుణ హత్యల కేసులో నిందితుడు బత్తిన అప్పలరాజుకు జిల్లా కోర్టు శుక్రవారం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో బాధిత కుటుంబం, స్థానికులు న్యాయం లభించిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పసిపిల్లలతో సహా ఆరుగురు నిద్రమత్తులోనే ప్రాణాలు కోల్పోగా, అప్పటి నుంచి న్యాయం కోసం నిరీక్షిస్తున్న కుటుంబానికి ఈ తీర్పు కొంత ఊరటనిచ్చింది. అనుమానమే ఆరుగురి ప్రాణాలు తీసింది 2021 ఏప్రిల్ 15 తెల్లవారుజామున జుత్తాడ గ్రామం రక్తసిక్తమైంది. నిందితుడు బత్తిన అప్పలరాజు కుమార్తెకు, అదే గ్రామానికి చెందిన బమ్మిడి విజయ్‌కిరణ్‌కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఇరు కుటుంబాల మధ్య దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పగతో రగిలిపోయిన అప్పలరాజు.. విజయ్‌కిరణ్ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆ రోజు ఉదయం వారింట్లోకి ప్రవేశించి నిద్రలో ఉన్న బమ్మిడి రమణ(63), బమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నక్కెళ్ల అరుణ(40), బమ్మిడి ఉదయ్‌నందన్ (2), బమ్మిడి ఉర్విష విజయ్‌కిరణ్(6 నెలలు)లను కత్తితో అత్యంత పాశవికంగా హతమార్చాడు. అభంశుభం తెలియని పసికందులను కూడా వదలకుండా చంపడం అందరినీ కలచివేసింది. రక్తపు మడుగులో మృతదేహాల దృశ్యం చూసిన వారందరినీ కన్నీరు పెట్టించింది. న్యాయం దిశగా ... ఈ దారుణ ఘటన అనంతరం అప్పలరాజు పోలీసులకు లొంగిపోయాడు. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి, బాధిత కుటుంబానికి అండగా నిలబడింది. నష్టపరిహారం చెల్లించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చింది. పోలీసులు ఈ కేసును అత్యంత పకడ్బందీగా విచారించి కోర్టులో నివేదించారు. నాలుగేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం, ఈ రోజు విశాఖ కోర్టు అప్పలరాజుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల ఆనందం ఈ తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు నాటి ఘటనను తల్చుకుని కన్నీరు పెట్టుకుంటూనే తమ ఆనందం వ్యక్తం చేశారు. ‘మానవ మృగానికి ఉరే సరైన శిక్ష. మా కుటుంబానికి న్యాయం జరిగింది’అని తెలిపారు. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
నిమిషానికి ఒకటిన్నర అంశం.. ఇదేం చర్చో?
● నాలుగు గంటల్లో 299 అంశాలపై చర్చ ● జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశంపై విమర్శలుడాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం సమావేశంలో కేవలం నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా 299 అజెండా అంశాలపై జరిగిన చర్చ.. చర్చనీయాంశంగా మారింది. సగటున ఒక్కో అంశానికి నిమిషం కన్నా తక్కువ సమయం కేటాయించడంపై, కీలకమైన నగర సమస్యలపై తూతూమంత్రంగా జరిపిన చర్చపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు మూడు నెలలు తర్వాత మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం తొలి స్థాయీ సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారుల తీరు మొక్కుబడిగా ఉందని మేయర్ చిర్రుబుర్రులాటారు. ‘ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ ఆ మాత్రం పనిచేయకపోతే ఎలా? జీవీఎంసీ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మీపై లేదా? పూర్తి సమాచారం లేకుండా సమావేశానికి రావొద్దు’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, అధికారులకు ఇంతటి క్లాస్ తీసుకున్న మేయర్ అధ్యక్షతన జరిగిన సమావేశం తుఫాన్ వేగంతో ముగియడం విమర్శలకు తావిస్తోంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం గంట ఆలస్యంగా 12 గంటలకు మొదలైంది. అప్పటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. అంటే కేవలం నాలుగు గంటల పాటు మాత్రమే సమావేశం జరిగింది. ఈ సమయంలోనే 286 సాధారణ, 13 టేబుల్ అజెండాతో కలిపి మొత్తం 299 అంశాలను సభ్యులు చర్చించారు. వీటిలో 239 అంశాలను ఆమోదించగా, 60 అంశాలను వాయిదా వేశారు. ఇంజినీరింగ్, రెవెన్యూ, కాంట్రాక్టులు, పరిపాలన, ప్రజారోగ్యం వంటి అత్యంత కీలకమైన, అంశాలపై నిమిషాల వ్యవధిలో ఎలా కూలంకషంగా చర్చించి ఉంటారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల అలసత్వంపై మండిపడి.. ఇలా నామమాత్రంగా సమావేశం ముగించడం ఎంతవరకు సమంజసమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సమావేశంలో జోనల్ కమిషనర్లు ఇప్పినాయుడు, కె.శివప్రసాద్, మల్లయ్యనాయుడు, బి.రాము, బీఆర్.ఎస్.శేషాద్రి, హేమావతి, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్కుమార్, యూసీడీ పీడీ పీఎం సత్యవేణి, సెక్రటరీ బీవీ రమణ, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, పరిపాలనాధికారి పద్మజ, పర్యవేక్షక ఇంజనీర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎమర్జెన్సీ కాలం చీకటి అధ్యాయం
బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సీతంపేట: బంగ్లాదేశ్ విమోచనతో శక్తివంతమైన నాయకురాలిగా ఎదిగిన ఇందిరా గాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీతో ప్రజల స్వేచ్ఛను హరించారని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు ఎల్.ఎస్.తేజస్వి సూర్య ఆరోపించారు. ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎం.ఎం.ఎన్.పరశురామ్ అధ్యక్షతన ’చీకటి అధ్యాయానికి 50 ఏళ్లు’ అనే అంశంపై పోర్టు కళావాణి స్టేడియంలో శుక్రవారం సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమయంలో ఎంతో మందిని జైలు పాలు చేశారని, సుమారు కోటి మందికి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ దేశ ప్రజలకు చేసిన ద్రోహాలని తేజస్వి విమర్శించారు. ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన పరిస్థితులు, ప్రజలు పడ్డ కష్టాలను ఆయన వివరించారు. ఈ చీకటి అధ్యాయాన్ని నేటి యువత తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం అనుభవించిన పలువురిని ఘనంగా సన్మానించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ధోని నాగరాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.దయాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశీ కృష్ణ, బీజేపీ సోషల్ మీడియా ఇన్చార్జి ఎ.కేశవకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ నిర్మాణంలో యువత కీలకం
ఆరిలోవ: యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖ వ్యాలీ స్కూల్లో శుక్రవారం సీఐఐ యువ విభాగం యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో ‘యంగ్ ఇండియన్ పార్లమెంట్ 2.0’ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని సుమారు 100 మంది ప్రతిభావంతులైన పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వారంతా ఆసక్తికరమైన అంశాలతోపాటు వాస్తవిక చర్చలు, వాదనలు, శాసన ప్రక్రియల అనుకరణ తదితర వాటి గురించి చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎంపీ మాట్లాడుతూ యువ పార్లమెంటేరియన్లతో తన అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో విశాఖ వ్యాలీ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఈశ్వరి ప్రభాకర్, యంగ్ ఇండియన్ వైజాగ్ చైర్మన్ డాక్టర్ శ్రావణి, కో చైర్మన్ దీప, సుప్రియ పాల్గొన్నారు. -
హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో..
ఎంవీపీ కాలనీ: హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన రథయాత్రకు భక్తులు పోటెత్తారు. స్వామి రథాన్ని లాగేందుకు ఉత్సాహం చూపారు. ఎంవీపీ కాలనీలోని ఐఐఏఎం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర డబుల్ రోడ్డు, టీటీడీ కూడలి, ఇసుకతోట, వెంకోజిపాలెం, క్యాన్సర్ హాస్పిటల్, అప్పుఘర్ బీచ్‌రోడ్డు మీదుగా సాగి తిరిగి ఐఐఏఎంకు చేరుకుంది. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథం, యాత్రలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక, మంగళహారతి కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు డాక్టర్ నిష్కించిన భక్తదాస తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కదిలిన జగన్నాథ రథం
కదిలొచ్చిన జనం ● వైభవంగా రథయాత్ర ప్రారంభం ● హరేకృష్ణ నామస్మరణతో భక్తుల నృత్యాలు ● నగరంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత కదిలిన జగన్నాథ రథచక్రాలతో నగరంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. హరే కృష్ణ నామస్మరణలు, సంకీర్తనల హోరు.. రథచక్రాల గిరగిరలు.. భక్తుల కోలాహలం మధ్య భక్తి పారవశ్యంలో మునిగితేలింది. నగరంలో పలుచోట్ల జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా, కనుల పండువగా జరిగాయి. జై జగన్నాథ నినాదాలతో వీధులు మార్మోగాయి. ఈ ఆధ్యాత్మిక సందడిలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చి, స్వామి రథాన్ని లాగి తరించారు. – డాబాగార్డెన్స్/ఎంవీపీకాలనీ /బీచ్‌రోడ్డు టౌన్ కొత్తరోడ్డులో.. 185 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన టౌన్‌కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయంలో రథయాత్ర శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. వేదమంత్రాలు, గీతా పారాయణం, మేళతాళాలు, కోలాటం నడుమ టౌన్ కొత్తరోడ్డు, ఏవీఎన్ కాలేజ్ డౌన్‌రోడ్డు, పూర్ణామార్కెట్, ఆంజనేయస్వామి ఆలయం మీదుగా టర్నర్ చౌల్ట్రీ వరకు రథయాత్ర సాగింది. అనంతరం బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడిని టర్నర్ చౌల్ట్రీలోని కల్యాణ మండపంలోకి ఆహ్వానించారు. ఆలయ ఈవో టి.రాజగోపాల్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ యాత్రలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీష, ఆలయ ప్రధాన అర్చకులు పాణంగిపల్లి రంగానాథాచార్యులు, జగన్నాథాచార్యులు, యేడిద సురేష్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. టర్నర్ చౌల్ట్రీ వేదికగా శనివారం నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు స్వామి దశావతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శనివారం మత్స్యావతారంలో స్వామిని అలంకరిస్తామని ఈవో తెలిపారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో.. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. సాగర్‌నగర్ ఇస్కాన్ శాఖ అధ్యక్షుడు సాంబదాస్, మాతాజీ నితాయి సేవిని సారథ్యంలో సాయంత్రం 4 గంటలకు నాలుగు రథాలతో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యాత్ర ప్రారంభమైంది. ఎల్ఐసీ, అంబేడ్కర్ కూడలి, డాబాగార్డెన్స్, ప్రెస్‌క్లబ్ జంక్షన్, జగదాంబ జంక్షన్, గ్రీన్‌పార్కు, వాల్తేర్ అప్రోడ్డు మీదుగా సిరిపురం గురజాడ కళాక్షేత్రం వరకు యాత్ర సాగింది. అక్కడ ప్రత్యేక వేదికపై స్వామి వార్లను అధిష్టింపజేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబదాస్ జగన్నాథుడి ఔన్నత్యాన్ని వివరించగా, మాతాజీ నితాయి సేవిని స్వామి లీలలను ప్రవచించారు. భక్తులు తయారు చేసిన 1,008 రకాల ప్రసాదాలను స్వామికి నివేదించి, అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. మహానగరంలో వరుసగా 18వ సారి ఈ యాత్రను వైభవంగా నిర్వహించినట్టు సాంబదాస్, మాతాజీ నితాయి సేవిని తెలిపారు. కో–ఆర్డినేటర్ ఎంవీ రాజశేఖర్, ఇస్కాన్ జీవితకాల సభ్యులు పాల్గొన్నారు. ఉత్కళ్ సమాజ్ ఆధ్వర్యంలో.. ఉత్కళ్ సాంస్కృతిక సమాజ్ ఆధ్వర్యంలో దసపల్లాహిల్స్లోని జగన్నాథ ఆలయం నుంచి రథయాత్ర ప్రారంభమైంది. సమాజ్ అధ్యక్షుడు జె.కె.నాయక్ రథం ముందు కొబ్బరికాయ కొట్టి, మార్గాన్ని శుభ్రం చేసి యాత్రను ప్రారంభించారు. పుష్పాలతో అలంకరించిన రథంపై సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు అధిష్టించాడు. భక్తుల కోలాహలం నడుమ ఆల్ ఇండియా రేడియో, సిరిపురం, ఏయూ అవుట్గేట్, చినవాల్తేరు, వీఎంఆర్డీఏ పార్క్ మీదుగా లాసన్స్ బే కాలనీ వరకు యాత్ర సాగింది. ఈ యాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. -
‘కలెక్టర్ కారు, ఫర్నీచర్ అటాచ్ చేయండి’.. విశాఖ కోర్టు సంచలన తీర్పు
సాక్షి,విశాఖ: విశాఖ 7వ అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రభుత్వ న్యాయవాదికి గౌరవ వేతనం చెల్లించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖ జిల్లా కలెక్టర్ కుర్చీ,కారు, ఫర్నిచర్ అటాచ్ చెయ్యండి అంటూ ఆదేశాలు జారీ చేసింది.2015 ఏప్రిల్ నుంచి 2021 వరకు విశాఖ కోర్టులో రవి కుమార్ ప్రభుత్వ ప్లీడర్‌గా పని చేశారు. కానీ అతని వేతనాన్ని కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేయలేదు. సుమారు రూ. 54 లక్షల రూపాయల వేతన బకాయిలు పెండింగ్‌లో ఉంది. ఇదే విషయంపై రవికుమార్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు కలెక్టర్ ఆఫీస్ సామాగ్రిని అటాచ్మెంట్ చేయాలని అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. వడ్డీతో సహా న్యాయవాది రవికుమార్‌కు బకాయిలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీన రవికుమార్‌కు చెల్లించాల్సిన 72 నెలల వేతన బకాయిలను 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలి కోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తి ఆదేశాలతో కోర్టు వారెంట్ తీసుకుని కోర్టు అమీన్ కలెక్టర్ ఆఫీసుకు వచ్చింది. వారెంట్ ఎగ్జిక్యూటివ్ చేయడానికి వచ్చిన సిబ్బందికి కలెక్టరేట్ సిబ్బంది సహకరించలేదు. కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి కోర్టు సిబ్బందిని వెళ్ళిపోవాలని మహారాణిపేట సీఐ భాస్కర్ ఇబ్బంది పెట్టారు. -
జీవీఎంసీ.. వాటర్ సప్లై ఉద్యోగుల సమ్మె తీవ్రతరం.. 18 గంటలుగా నో వాటర్
విశాఖ : వాటర్ సప్లై ఉద్యోగులు చేస్తున్న సమ్మె విశాఖలో తీవ్రరూపం దాల్చింది. నగరంలోని జీవీఎంసీ(గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్) పరిధిలో 18 గంటలుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తాయి. ప్రధానంగా పరిశ్రమలు, ఆసుపత్రులకు నీటి సరఫరా లేకపోవడంతో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తమ డిమాండ్‌ను తీర్చే వరకూ సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగులు హెచ్చరికలు చేస్తుండగా, మరొకవైపు మీ ఉద్యోగాలు పీకేస్తాం అంటూ మేయర్ బెదిరింపులతో సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. తమను ఉద్యోగాల నుంచి తీసేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉద్యోగులు మరో అడుగు ముందుకేసి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం కావడంతో ఇప్పటికీ నీటి సరఫరా సమస్యను ఎదుర్కొంటున్నారు విశాఖ వాసులు.తమ జీతాలు పెంచలేదంటూ ఉద్యోగులు సమ్మెకు దిగారు. జీవీఎంసీ పరిధిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 1250 మంది వాటర్ సప్లై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. నిన్నటి నుంచి నీటి సరాఫరాను జీవీఎంసీ నిలిపివేసింది. ఇప్పటికే కేజీహెచ్, ఎయిర్ పోర్ట్‌కు నీటి సరాఫరా నిలిచిపోయింది. 11వ తేదీ నుంచి సమ్మె చేస్తామని నీటి సరఫరా ఉద్యోగులు హెచ్చరించిన కానీ అధికారులు పట్టించుకోలేదు. దాంతో వారంతా సమ్మె బాట పట్టారు. -
Juttada case : విశాఖ కోర్టు సంచలన తీర్పు.. అప్పలరాజుకు ఉరిశిక్ష
సాక్షి: విశాఖ: 2021లో ఒకే కుటుంబంలో ఆరుగురిని హత్య చేసిన కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు బత్తిన అప్పలరాజుకు మరణ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021 ఏప్రిల్ 15న విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో (Juttada case) జరిగిన ఈ హత్యాకాండ నాడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. నిందితుడు బత్తిన అప్పలరాజు.. బమ్మిడి రమణ కుటుంబానికి చెందిన ఆరుగురిని అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అప్పలరాజు ఈ దారుణానికి ఒడిగట్టడానికి బమ్మిడి రమణ కుమారుడు విజయ్ కిరణ్ కారణమేనని పోలీసులు నిర్ధారించారు.కుమార్తెను లైంగికంగా వేధించిన విజయ్ కిరణ్ కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే.. జుత్తాడ గ్రామంలో బత్తిన అప్పలరాజు.. బమ్మిడి రమణ ఇరుగు పొరుగు కుటుంబాలే. అయితే, బత్తిన అప్పలరాజు కుమార్తెను బమ్మిడి రమణ కుమారుడు విజయ్ కిరణ్ ప్రేమించాడు. ఇదే విషయంపై అప్పలరాజు .. బమ్మిడి రమణ కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018లో తన కుమార్తెపై విజయ్ కిరణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మత్తు మందు కలిపిన పానీయాలు ఇచ్చి ఆమెను మోసం చేసి, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడంటూ అప్పలరాజు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయ్ను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో తన కుమార్తె జీవితం నాశనం కావడానికి, ఊళ్లో తన పరువు పోవడానికి బమ్మిడి రమణ కుటుంబమేనని నిందితుడు అప్పల రాజు భావించాడు. ఎలాగైనా రమణ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని కుట్రకు పాల్పడ్డాడు. నరమేధానికి పాల్పడ్డ అప్పలరాజుమరోవైపు విజయ్.. ఉషారాణిని వివాహం చేసుకుని విజయవాడలో సెటిల్ అయ్యాడు. విజయ్ మేనత్త నక్కెళ్ల అరుణ బంధువు కుమారుడు సాయి వివాహం ఏప్రిల్ 17న,2021లో శివాజీపాలెంలో జరగనుంది. పెళ్లి కబురు చెప్పేందుకు శివాజీపాలెం నుంచి బుధవారం (ఏప్రిల్ 14) ఉదయం అరుణ జుత్తాడకు చేరుకుంది. పెళ్లికి హాజరయ్యేందుకు విజయవాడ నుంచి విజయ్ కిరణ్ భార్య ఉషారాణి, ఇద్దరు పిల్లలు, తల్లి రమాదేవితో కలిసి బుధవారం మధ్యాహ్నం గ్రామానికి చేరుకుంది. విజయ్ మాత్రం తన పెద్ద కుమారుడు అఖిల్‌తో విజయవాడలోనే ఉండిపోయాడు. తన ఇంటికి వెళ్తున్న సమయంలో అప్పలరాజు తారసపడగా.. విజయ్ భార్య నవ్వుతూ పలకరించిందని సమీప బంధువులు చెబుతున్నారు. అప్పటికే కక్ష పెంచుకున్న అప్పలరాజు వారి రాకతో మరింత రగిలిపోయి.. ఈ నరమేధానికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో ఊహించేలోపే సరిగ్గా ఏప్రిల్ 15 ఉదయం 5.45 గంటల సమయంలో వాకిలి కడిగేందుకు బయటికి వచ్చిన విజయ్ అత్త అల్లు రమాదేవి (63)పై అక్కడే మాటువేసి ఉన్న అప్పలరాజు ఒక్క ఉదుటున వచ్చి ఈత కల్లు కత్తితో దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామం నుంచి కోలుకోకముందే మెడపై వేటు పడటంతో ఆమె కుప్పకూలిపోయింది. చేతిని నరికేసి.. ఇంటి లోపలికి వెళ్లి నిద్రలో ఉన్న విజయ్ భార్య బొమ్మిడి ఉషారాణి (35), ఆమె ఇద్దరు పిల్లలు బొమ్మిడి ఉదయనందన్(02), బొమ్మిడి రిషిత (06 నెలలు)ను కిరాతకంగా హత్య చేశాడు. పిల్లలిద్దరి మెడపై బలంగా కత్తితో వేటేశాడు. ఉషారాణి పొట్టపై విచక్షణారహితంగా నరికి పేగులు బయటికి తీసేశాడు. ఈ హఠాత్పరిణామానికి నిద్రలేచిన విజయ్ మేనత్త నెక్కళ్ల అరుణ (45) బాత్రూమ్లో ఉన్న విజయ్ తండ్రి బమ్మిడి రమణ (63) వద్దకు పరుగులు తీసింది. బాత్రూమ్ డోర్ కొట్టింది. అంతలో ఆమె మెడపై దాడి చెయ్యడంతో రమణ డోర్ తీసిన వెంటనే అరుణ కుప్పకూలిపోయింది. ఏం జరుగుతుందో ఊహించేలోపే రమణపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇష్టం వచ్చినట్లు నరకడంతో ఇల్లంతా రక్తపు మడుగులా మారిపోయింది.చంపేశా.. తీసుకెళ్లండి..కుటుంబంలో అందర్నీ కత్తితో అతి కిరాతకంగా నరికేసి, అందరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత.. బయటకు వచ్చిన అప్పలరాజు.. రమాదేవి మృతదేహం పక్కనే అరగంట సేపు కూర్చున్నాడు. ఆ తర్వాత 100 నంబర్‌కు డయల్ చేశాడు. ‘జుత్తాడ గ్రామంలో ఆరుగురిని చంపేశాను. నేను ఇక్కడే ఉన్నాను. లొంగిపోతాను’ అంటూ తాను చేసిన నరమేధం గురించి చెప్పగా.. అక్కడి నుంచి పెందుర్తి పోలీసులకు సమాచారం అందడంతో వారు హుటాహుటిన వచ్చి అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు. తాజాగా,ఇదే కేసులో విశాఖ కోర్టు తీర్పును వెలువరించింది. అమానుషంగా ఆరుగురి ప్రాణాలు తీసిన నిందితుడు బత్తిన అప్పల రాజుకు ఉరిశిక్షను ఖరారు చేసింది. -
విశాఖ: జీవీఎంసీలో నిలిచిపోయిన మంచినీటి సరఫరా
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖలో మంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఆందోళన బాట పట్టిన జీవీఎంసీ నీటి సరఫరా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. జీతాలు పెంచలేదంటూ ఉద్యోగులు సమ్మెకు దిగారు. జీవీఎంసీ పరిధిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 1250 మంది వాటర్ సప్లై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. నిన్నటి నుంచి నీటి సరాఫరాను జీవీఎంసీ నిలిపివేసింది. ఇప్పటికే కేజీహెచ్, ఎయిర్ పోర్ట్‌కు నీటి సరాఫరా నిలిచిపోయింది. 11వ తేదీ నుంచి సమ్మె చేస్తామని నీటి సరఫరా ఉద్యోగులు హెచ్చరించిన కానీ అధికారులు పట్టించుకోలేదు.తాడేపల్లి: మరో వైపు, ఏపీ సీడీఎంఏ కార్యాలయం ముట్టడికి మునిసిపల్ ఇంజనీరింగ్, వాటర్, లైట్స్, టౌన్ ప్లానింగ్, పార్కింగ్ ఇతర సిబ్బంది పిలుపునిచ్చారు. ముట్టడికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. మున్సిపల్ కమిషనరేట్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముట్టడికి పూనుకుంటే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరించారు. గత 50 రోజులుగా మునిసిపల్ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ఆందోళన చేపట్టారు. -
వైజాగ్ టు చైనా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోని రేషన్ బియ్యం విశాఖ నుంచి చైనాకు ఎగుమతి అవుతోంది. చైనాలో రైస్ వైన్‌గా పిలిచే సంప్రదాయ మద్యపానీయం హువాంగ్జియు తయారీలో విరివిగా బియ్యాన్ని ఉపయోగిస్తారు. అక్కడి డిమాండ్‌కు అనుగుణంగా ఎగుమతి చేసేందుకు విశాఖలోని పలు షిప్పింగ్ కంపెనీలు రేషన్ బియ్యాన్ని మార్గంగా ఎంచుకున్నాయి.రేషన్ మాఫియా ద్వారా సేకరించి చైనాకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన 473 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విశాఖలోని పలు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎఫ్‌టీ)ల్లో ఈ నెల 23, 24 తేదీల్లో దాడులు చేసి పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇందులో శ్రావణ్ షిప్పింగ్ సర్విసెస్ వద్ద 150 మెట్రిక్ టన్నుల బియ్యం, గేటు వే ఈస్ట్ ఇండియా సీఎఫ్టీలో 156 మెట్రిక్ టన్నులు, పంచవటి టోల్గేట్ వద్ద 167 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గుర్తించినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారమంతా ప్రధానంగా టీడీపీకి చెందిన కార్గో వ్యాపారే నడిపిస్తున్నట్టు విమర్శలున్నాయి. పట్టుకున్నవి రేషన్ బియ్యం కాదంటూ ల్యాబ్‌ల ద్వారా నివేదికలు తెచ్చుకునేందుకు వ్యవహారం నడుస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతా అమ్యామ్యాలే...! కొన్నాళ్ల క్రితం కాకినాడ నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం హంగామా చేసింది. దీంతో సాధారణ బియ్యం ఎగుమతి కూడా అక్కడి నుంచి చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అనేక మంది విశాఖ నుంచి ఎగుమతులకు తమ మకాం మార్చారు. రేషన్ బియ్యం మాఫియా కూడా వారితో పాటు విశాఖ నుంచి చైనాకు బియ్యం ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రచించింది.తాజాగా రేషన్ డిపోలు కూడా ఏర్పాటు కావడంతో రేషన్ మాఫియా మరింత రెచ్చిపోతోంది. ప్రధానంగా భీమిలి నియోజకవర్గంలోని రేషన్ మిల్లులతో పాటు పెందుర్తి, సబ్బవరం ప్రాంతాల్లోని రేషన్ మిల్లుల కేంద్రంగా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్కడ సన్న బియ్యంగా మలుస్తున్నారు. వివిధ దేశాల ఎగుమతులకు సంబంధించిన అన్ని అనుమతులను కస్టమ్ హౌస్ బ్రోకరేజీ సంస్థలు తీసుకుంటున్నాయి. అనంతరం కస్టమ్స్ నుంచి అనుమతులు పొందుతున్నాయి.తరువాత రేషన్ మిల్లుల నుంచి తీసుకొచ్చి విశాఖలో ఉన్న పలు కంటైనర్ టెరి్మనల్ ఫ్రైట్ స్టేషన్ల (సీఎఫ్‌టీ)లో నిల్వ ఉంచి.. కంటైనర్ల ద్వారా ఎగుమతులు చేపడుతున్నారు. టీడీపీకి చెందిన కార్గో వ్యాపారి స్టేషన్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేయాల్సిన అధికారులు.. కూడా ఈ రేషన్ మాఫియాతో చేతులు కలుపుతున్నారు.ల్యాబ్ నివేదిక పేరుతో...! పట్టుకున్న బియ్యం నమూనాలను ల్యాబ్‌కు పంపించామని.. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు అంటున్నారు. మరోవైపు మొదటి దాడుల్లో పట్టుకున్న 150 మెట్రిక్ టన్నుల బియ్యంలో పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపగా.. రేషన్ బియ్యం కాదని నివేదిక వచ్చినట్టు సమాచారం. ఇక మిగిలిన బియ్యం నమూనాల నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఈ నివేదికలు కూడా రేషన్ బియ్యం కాదని వస్తాయా? అవునని వస్తాయా అనేది చూడాల్సి ఉంది. దాడుల్లో పట్టుకున్న బియ్యం అనుమానిత ప్రజా పంపిణీ బియ్యం అని స్పష్టంగా ప్రకటనల్లో పేర్కొన్న అధికారులు.. ప్రజా పంపిణీ బియ్యం అక్రమంగా రవాణా, నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొనడం విశేషం.చైనా డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకే...! వాస్తవానికి చైనాలో సంప్రదాయ రైస్ వైన్‌కు డిమాండ్ ఉంది. చైనీస్ రైస్ వైన్ అని కూడా పిలువబడే హువాంగ్జియును ప్రధానంగా చైనాలోని జియాంగ్నాన్ ప్రాంతంలో ఉడికించిన బియ్యాన్ని పులియబెట్టడం ద్వారా తయారుచేస్తారు. దీనికి ఉండే ప్రత్యేకమైన రుచితో పాటు తక్కువ ఆల్కహాల్ (8 నుంచి 20) శాతం, మంచి పోషక విలువలు ఉండటంతో చైనీయులు ఎంతో ఇష్టంగా సేవిస్తారు. ఇందులో అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఉంటాయి.దీనికి 5 వేల సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగి ఉంది. ఈ నేపథ్యంలో చైనాలో ఉండే ఈ రైస్ వైన్ డిమాండ్‌కు అనుగుణంగా వివిధ దేశాల నుంచి బియ్యాన్ని ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది. అక్కడి డిమాండ్ ఇక్కడి రేషన్ బియ్యం మాఫియాకు కలిసివస్తోంది. ఇక్కడి నుంచి భారీగా రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేయడంలో టీడీపీకి చెందిన కార్గో వ్యాపారి చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. -
అడవి దున్నకు దూడ జననం
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో మరో బుల్లి జంతువు జన్మించింది. రెండు రోజుల కిందట ఒక ఆడ అడవి దున్న, ఒక ఆడ దూడకు జన్మనిచ్చిందని క్యూ రేటర్ జి.మంగమ్మ గురువారం తెలిపారు. ఈ దూడ ఆరోగ్యంగా ఉందని, తల్లి దున్న పక్కన ఎన్‌క్లోజర్‌లో ఉత్సాహంగా తిరుగుతోందని పేర్కొన్నారు. ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్–1కు చెందిన జంతువు. ఈ జననంతో జూలో అడవి దున్నల సంఖ్య పెరిగిందని క్యూరేటర్ తెలిపారు. జూలోని నవజాత జంతువులకు అవసరమైన టీకాలు, వైద్య సేవలు అందిస్తున్నట్లు వెటర్నరీ వైద్యుడు భాను వివరించారు. ఈ ఏడాది మార్చిలో కూడా ఒక అడవి దున్నకు దూడ పుట్టిన విషయం తెలిసిందే. -
70 కేసుల్లో 65 మంది అరెస్ట్
రూ.1.04 కోట్ల చోరీ సొత్తు స్వాధీనం విశాఖ సిటీ: నగరంలో నేర నియంత్రణకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. పోలీస్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో మే నెలలో 82 చోరీ కేసు లు నమోదైనట్లు చెప్పారు. వాటిలో 70 కేసులను ఛేదించి 65 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి రూ.1,04,97,450 చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో 1.04 కిలోల బంగారం, 6.06 కిలోల వెండి, రూ.9,09,900 నగదు, 14 ద్విచక్ర వాహనాలు, 392 మొబైల్ ఫోన్లు, పొక్లెయినర్, కారు, ల్యాప్‌టాప్, ఇతర వస్తువులను రికవరీ చేసినట్లు వివరించారు. నగరంలో నేర నియంత్రణకు, నిందితులను గుర్తించేందుకు వీలుగా మేలో 610 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటుపై ఎప్పటికప్పుడు ప్రజలు, వ్యాపారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో పగలు, రాత్రుళ్లు ప్రత్యేక బృందాలతో పాటు డ్రోన్ల ద్వారా కూడా నిఘా పెట్టినట్లు చెప్పా రు. అనంతరం రికవరీ చేసిన సొత్తును బాధితులకు అందజేశారు. సమావేశంలో డీసీపీ(క్రైం) లతా మాధురి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రూ.1.5 లక్షల డిఫెన్స్ మద్యం స్వాధీనం
కొమ్మాది: జీవీఎంసీ 4వ వార్డు పరిధి చిన ఉప్పాడ వద్ద గురువారం ఎన్ఫోర్స్మెంట్ విభాగం రూ.1.50 లక్షలు విలువ చేసే 95 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. ముందుగా ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిబ్బంది ఎం.హేమంత్ అనే వ్యక్తి వద్ద 5 డిఫెన్స్ మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై విచారించగా.. అదే గ్రామంలో ఎల్లారావు అలియాస్ యల్లాజీ అనే వ్యక్తికి చెందిన పాడుబడిన ఇంటిని చూపించాడు. ఈ క్రమంలో వీరిని చూసిన యల్లాజీ పారిపోగా.. సిబ్బంది ఆ ఇంటిని తనిఖీ చేశారు. 86 డిఫెన్స్ మద్యం బాటిళ్లతో పాటు 4 బీరు బాటిళ్లు లభించాయి. యల్లాజీ పరారీలో ఉండగా హేమంత్‌ను అరెస్ట్ చేశారు. మొత్తం 91 మద్యం బాటిళ్లు, 4 బీరు బాటిళ్లను భీమిలి ఎకై ్సజ్ సిబ్బందికి అప్పగించారు. సిబ్బంది సీహెచ్ రాజేశ్వరి, ఎస్.శ్రీనివాస్, ఎల్.అరుణకుమారి, కె.వెంకటరావు, కె.వీరభద్రరావు, ఎన్.తిరుపతిరావు జి.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మను తిట్టాడని... కర్రతో కొట్టి చంపేశాడు!
పెదగంట్యాడ: తోటి కార్మికుడు తన తల్లిని, అక్కలను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, నిద్రిస్తున్న తనను కాలితో తన్నాడన్న తీవ్ర ఆగ్రహంతో ఓ వ్యక్తి అతడిని కర్రతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆటోనగర్‌లో ఇటీవల కలకలం రేపిన ఈ హత్య కేసును న్యూపోర్టు పోలీసులు ఛేదించారు. నిందితుడిని గురువారం అరెస్ట్ చేశారు. న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో గాజువాక ఏసీపీ త్రినాథ్ హత్య కేసు వివరాలను వెల్లడించారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తార్ జిల్లా జగదల్పూర్ తాలుకా నియానార్కు చెందిన నరేష్ కశ్యప్, బిలోరికి చెందిన మహాదేవ్ భగేల్(28) ఇద్దరూ పెదగంట్యాడ ఆటోనగర్‌లోని శ్రీకృష్ణ ఇంజినీరింగ్ యార్డులో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ నెల 22న సెలవు దినం కావడంతో వారిద్దరూ యార్డులోనే ఉన్నారు. ఆ సమయంలో నరేష్ గదిలో నిద్రపోతుండగా, మహాదేవ్ వచ్చి అతడిని కాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా నరేష్ తల్లిని, సోదరీమణులను దుర్భాషలాడాడు. ఈ అనూహ్య పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నరేష్.. పక్కనే ఉన్న చపాతీ కర్రతో మహాదేవ్ వీపుపై, తలపై బలంగా కొట్టడంతో అది విరిగిపోయింది. ఆ తర్వాత పక్కనే ఉన్న మరో చెక్క బల్లతో మెడపై రెండుసార్లు బలంగా మోదడంతో మహాదేవ్ అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. అనంతరం మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి సమీపంలోని పొదల్లో పడేసి, తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఒకే ఒక్క ఫోన్ కాల్.. హత్య చేసిన తర్వాత యార్డ్ నుంచి బయటకు వచ్చిన నరేష్, సమీపంలోని ఓ వ్యక్తి ఫోన్ తీసుకుని తన బంధువులకు కాల్ చేశాడు. తాను మహాదేవ్‌ను చంపేశానని, ఇంటికి తిరిగి వస్తున్నానని చెప్పాడు. ఈ కేసును సవాలుగా తీసుకున్న న్యూపోర్టు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు తన స్వగ్రామానికి వెళ్తున్నాడని భావించి ఒక బృందాన్ని చత్తీస్‌గఢ్‌కు పంపారు. అయితే నిందితుడు చేసిన ఆ ఒక్క ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు కేసు చిక్కుముడిని విప్పారు. కాల్ చేసిన నంబర్‌ను ట్రేస్ చేసి, ఆ ఫోన్ యజమానిని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడు ఇంకా పెదగంట్యాడలోనే ఉన్నాడని నిర్ధారించుకున్న పోలీసులు.. వెంకన్నపాలెం జంక్షన్ వద్ద అతడిని చాకచక్యంగా అరెస్టు చేశారు. ఈ హత్య కేసును ఛేదించిన న్యూపోర్టు పోలీసులను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అభినందించారు. సమావేశంలో న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు, ఎస్ఐ శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు. ఆటోనగర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు ఫోన్‌కాల్‌తో దొరికిన హంతకుడు -
వీటిని రోడ్లంటారా?
స్మార్ట్ సిటీలోని వీధుల్లో రహదారులు ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఎక్కడికక్కడ తవ్వకాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ రోడ్లపై ప్రయాణించడమంటే ప్రాణాలతో చెలగాటమాడటమేనని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలపైనే కాదు కనీసం కాలి నడకన వెళ్లేందుకు కూడా వీల్లేకుండా కొన్ని చోట్ల రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. కొద్ది రోజులుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 24/7 మంచినీటి సరఫరా, ఇతర అభివృద్ధి పనుల పేరుతో వీధుల్లో రహదారులను విచక్షణారహితంగా తవ్వేస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత ఆ గోతులను పటిష్టంగా పూడ్చకుండా నామమాత్రంగా మట్టి, కంకర వేసి వదిలేస్తున్నారు. దీనికి తోడు ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆ ప్రాంతాలన్నీ ప్రమాదకరంగా మారాయి. వర్షం నీటితో గోతులు నిండిపోయి, ఏది రోడ్డో.. ఏది గొయ్యో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ద్విచక్ర వాహనదారులు తరచూ అదుపుతప్పి కిందపడుతూ గాయాలపాలవుతున్నారు. కొన్ని చోట్ల మ్యాన్‌హోల్స్ రోడ్డు కంటే ఎత్తుగా ఉండటం, మరికొన్ని చోట్ల లోపలికి కుంగిపోవడం వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా కేఆర్ఎం కాలనీ, సీతమ్మధార, కృష్ణా కాలేజ్, ఎంవీపీ సెక్టార్–9 ఫిషర్మెన్ కాలనీ, శివాజీపాలెం తదితర ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ సమస్యపై నగరవాసులు జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండటం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా ఈ దుస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగాక స్పందించడం కంటే.. ముందుగానే తగిన చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం శివాజీపాలెంలో పైకి వచ్చిన మ్యాన్‌హోల్ ఫిషర్మెన్ కాలనీలో రోడ్ల దుస్థితి ఇది -
ఆస్పత్రుల్లో అవయవదానం బోర్డుల ఏర్పాటు
ఆరిలోవ: ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవయవదానంపై అవగాహన కలిగించే బోర్డులను ఏర్పాటు చేయాలని అవయదాన రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపారు. విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో ఈస్ట్ జోన్ జిల్లాల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు, అధికారులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. అవయదానం విధివిధానాలపై చర్చించారు. వైద్యుల నుంచి సూచనలు, సలహాలు సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 73 ఆస్పత్రులను జీవనదాన్ కింద నమోదుచేసినప్పటికీ వాటిలో సుమారు 50 శాతం ఆస్పత్రుల్లో ఒక్క బ్రెయిన్ డెడ్ కేసు కూడా నమోదుకాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో బ్రెయిన్ డెడ్ కేసులు జరుగుతున్నప్పటికీ, వాటిని నమోదుచేసి ప్రకటించడంలో ఆయా ఆస్పత్రుల వైద్యాధికారులు ఆసక్తి చూపడంలేదన్నారు. అవయదానంపై రోగి బంధువులకు సరైన అవగాహన లేకపోవడంతోపాటు, అవయవాలను శరీరం నుంచి బయటకు తీయడానికి సరైన వైద్యులు అందుబాటులో లేకపోవడం కూడా కారణమన్నారు. అందుకే ప్రతి ఆస్పత్రిలో తప్పనిసరిగా అవయదానంపై హెల్ప్ డెస్క్, అవగాహన కోసం బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ ఆస్పత్రిలోనైనా బ్రెయిన్ డెడ్ శరీరం నుంచి భాగాలు తీసేందుకు వైద్యులు అందుబాటులో లేకపోతే, తన దృష్టికి తీసుకురావాలన్నారు. విమ్స్‌లో ఇంత వరకు మూడు బ్రెయిన్ డెడ్ కేసులను ప్రకటించి అవయవాలు స్వీకరించామన్నారు. ఆస్పత్రుల నిర్వాహకులు మానవతా దృక్పథంతో ఆలోచిస్తే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. పలు ఆస్పత్రుల వైద్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు. వైద్యుల సమావేశంలో అవయవదాన రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె.రాంబాబు -
నగరాభివృద్ధి, సుందరీకరణే లక్ష్యం
కమిషనర్ కేతన్ గార్గ్ డాబాగార్డెన్స్: నగరాభివృద్ధి, సుందరీకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లు ఒప్పందం ప్రకారం నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి చేసేలా చూడాలని, ఈ పనుల్లో వార్డు ఎమినిటీ కార్యదర్శులను భాగస్వాములను చేయాలని స్పష్టం చేశారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జోన్ల వారీగా చేపట్టిన పనులు, పూర్తయిన పనుల పురోగతి, ఖర్చు చేసిన నిధులపై ఆరా తీశారు. అన్ని జోన్లలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర నివేదిక అందించాలని పర్యవేక్షక ఇంజినీర్లను ఆదేశించారు. నగరంలో చేపట్టిన బీటీ, సీసీ రోడ్లు, కాలువలు, తాగునీటి పైప్లైన్లు, భూగర్భ కేబుల్ పనుల వివరాలను ఇంజినీర్లు కమిషనర్‌కు వివరించారు. అనంతరం మధురవాడలో చేపట్టబోయే భూగర్భ మురుగునీటి పారుదల ప్రాజెక్టు పనులపై ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతినిధులతో కమిషనర్ సమీక్షించారు. సింహాచలం గిరి ప్రదక్షిణ మార్గం, బీచ్ నుంచి ఎండాడకు అనుసంధాన మార్గం, అనకాపల్లి పెరుగు బజార్ రోడ్డు, పలు మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులు, తగరపువలస–చిల్లపేట పైప్‌లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి వీఐపీ రోడ్డు వరకు ఉన్న సెంట్రల్ మీడియన్‌లో పచ్చదనం పెంచాలని, రోడ్లపై జీబ్రా క్రాసింగ్‌లు, కూడళ్ల వద్ద అవసరమైన పెయింటింగ్ పనులు చేపట్టాలని, వీటికి సంబంధించిన అంచనాలు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో పర్యవేక్షక ఇంజినీర్లు గోవిందరావు, కేవీఎన్ రవి, పీవీవీ సత్యనారాయణరాజు, సంపత్‌కుమార్, కె.శ్రీనివాసరావు, వై.కృష్ణారావులతో పాటు పలువురు కార్యనిర్వాహక ఇంజినీర్లు పాల్గొన్నారు. -
మృత్యువుతో పోరాడి ఓడారు
● లంకెలపాలెంలో లారీ బీభత్సం ● ఐదుకు చేరిన మృతుల సంఖ్య పరవాడ: లంకెలపాలెం కూడలిలో మార్కెట్ లారీ సృష్టించిన బీభత్సంలో విషాదం కొనసాగుతోంది. ఈ నెల 23న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. వేర్వేరు ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్న మరో ఇద్దరు గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరినట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. మృతులను కంటైనర్ డ్రైవర్ రేఖ అప్పలరాజు(విజయరాంపుర అగ్రహారం, రాంబిల్లి మండలం), వాహనచోదకుడు సాలాపు రాంకుమార్ (కొత్తకోట, రావికమతం మండలం)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి అప్పలరాజు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో, రాంకుమార్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించారు. కాగా, ప్రమాదం జరిగిన రోజే అనకాపల్లికి చెందిన కొణతాల అచ్చెంనాయుడు, రేబాకకు చెందిన పచ్చికూర గాంధీ, అగనంపూడి వాసి ఎర్రప్పడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొంత మంది ఇంకా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని సీఐ మల్లికార్జునరావు వెల్లడించారు. -
దేశంలో అనధికారిక ఎమర్జెన్సీ
సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాద్ సీతంపేట: నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటిస్తే.. నేడు దేశంలో అనధికారిక ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్ అన్నారు. ఎమర్జెన్సీ డే సందర్భంగా విశాఖ, విజయనగరం జిల్లాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏది జరిగినా ముస్లింలే కారణమంటూ పాలకులు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నేడు రాజకీయ నిరంకుశత్వంతో పాటు ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక సైన్యం ఉందని, ఇది హిట్లర్ ప్రైవేట్ ఆర్మీలా తయారైందని ఆరోపించారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులు మోదీ ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయని, ఆర్ఎస్ఎస్, కార్పొరేట్ శక్తుల కలయికతో దేశం అంధకారంలోకి వెళ్తోందని మండిపడ్డారు. ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, మైనారిటీలను తప్పుదోవ పట్టించే ప్రమాదకర అజెండాను బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కశ్మీర్లో జరుగుతున్న నరమేధాన్ని బయటకు రానివ్వడం లేదన్నారు. మానవహక్కుల వేదిక తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త వి.ఎస్.కృష్ణ మాట్లాడుతూ బీజేపీ ఎమర్జెన్సీని రాజ్యాంగ ధ్వంసంగా అభివర్ణిస్తుందని, కానీ అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగించి, ప్రభుత్వ వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. గత ఎమర్జెన్సీకి కార్పొరేట్ల మద్దతు లేదని, నేటి అనధికార ఎమర్జెన్సీకి వారి మద్దతు ఉందన్నారు. మీడియా పూర్తిగా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు టి. శ్రీరామమూర్తి మాట్లాడుతూ దేశంలో పేదరికం, నిరుద్యోగం సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వాలు అణచివేత విధానాలను అనుసరిస్తున్నాయన్నారు. 2014 నుంచి దేశంలో అనధికార ఎమర్జెన్సీ కొనసాగుతోందని, ప్రభుత్వ విధానాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ప్రతినిధి కె.పద్మ, ఇఫ్టూ నాయకులు ఎం. వెంకటేశ్వర్లు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
లిక్విడ్ గంజాయి పట్టివేత
పెందుర్తి: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖ నగరానికి తరలిస్తున్న 1.6 కిలోల లిక్విడ్ గంజాయిని టాస్క్‌ఫోర్స్, పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. సీఐ కె.వి.సతీష్‌కుమార్ తెలిపిన వివరా లివి. పెదబయలుకు చెందిన గుళ్లేలి చిన్నంనాయు డు, పురుష్కారి సోమేష్, గెమ్మిలి ప్రసాదరావు, అర్బాబు మత్స్యలింగం కలిసి నగరానికి లిక్విడ్ గంజాయిని తరలిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు సమాచారం అందుకున్నారు. సరిపల్లి వద్ద కాపుకాసి వారిని పట్టుకుని పెందుర్తి పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు జరుగుతోంది. -
జోలికి పోవద్దు
మాదక ద్రవ్యాలప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులుబీచ్రోడ్డులో వాక్‌థాన్ మహారాణిపేట: డ్రగ్స్‌కు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి యువతకు పిలుపునిచ్చారు. ‘నషా ముక్త్ అభియాన్’లో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని గురువారం బీచ్‌రోడ్‌లో వాక్‌థాన్ నిర్వహించారు. ఎన్సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో), ఎస్బీఐ, ఈగల్ టీం, విభిన్న ప్రతిభావంతులు, పోలీస్, ఎకై ్సజ్ తదితర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు జరిగిన ఈ వాక్‌థాన్‌లో వేలాది మంది పోలీసులు, ఎన్సీసీ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, ఇతర విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు యువతకు అందుబాటులో లేకుండా చూడాలన్నారు. డ్రగ్స్, గంజాయి సరఫరాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టాలని పోలీసు, రెవెన్యూ యంత్రాంగానికి సూచించారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ డ్రగ్స్ సరఫరాను అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనుకోకుండా మాదక ద్రవ్యాల ఉచ్చులో పడిన వారు పునరావాస కేంద్రాలను(కేజీహెచ్‌లో ఒకటి, మానసిక వైద్యశాల పరిధిలో మరొకటి) సంప్రదించవచ్చన్నారు. నషా ముక్త్(14446), ఈగల్ (1972), టెలీ మానస్ సెంటర్(1933) టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా సహాయం పొందవచ్చని, డ్రగ్స్ సమాచారం తెలపవచ్చని సూచించారు. సీపీ బాగ్చి మాట్లాడుతూ డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకుని జీవితాలను చీకటిమయం చేసుకోవద్దని యువతకు హితవు పలికారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, డీసీపీ అజిత, ఎన్సీబీ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కవిత, ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్రమూర్తి, అసిస్టెంట్ కమిషనర్ మహేశ్ కుమార్, సూపరింటెండెంట్ ప్రసాద్, పలు శాఖల అధికారులు, యువత, వలంటీర్లు పాల్గొన్నారు. -
తుస్!
కూటమి మాస్టర్ ప్లాన్పునః పరిశీలనలో కేవలం 755ఫిర్యాదులు విశాఖ సిటీ : కూటమి ప్రభుత్వ ‘మాస్టర్ ప్లాన్’ బెడిసికొట్టింది. వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళికపై చేసిన ఆరోపణలు తప్పని తేటతెల్లమైంది. కేవలం కూటమి నేతల రియల్ వ్యాపారానికి వీలుగా ప్రణాళికలో మార్పులు చేసుకోవడానికే పునఃపరిశీలన హడావుడి చేసినట్లు స్పష్టమవుతోంది. తమ వారికి లబ్ధి చేకూర్చడానికి బూటకపు ప్రకటనలు చేసి నెల రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ చేపడితే కేవలం 755 ఫిర్యాదు అందాయి. అవి కూడా గతంలో వచ్చిన విజ్ఞప్తులే కావడం గమనార్హం. కూటమి నేతల పాచిక పారకపోయినప్పటికీ.. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి బృహత్తర ప్రణాళికలో పలు సవరణలు చేసి ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసేందుకు అడుగులు వేస్తోంది. 2021లోనే మాస్టర్ ప్లాన్ పూర్తి వీఎంఆర్డీఏ పరిధిలో ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో బృహత్తర ప్రణాళిక–2041కు ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి 2011లో ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఏళ్లు గడిచినా అది పూర్తి కాకపోవడంతో 2016లో ప్రైవేట్ కన్సల్టెంట్ సంస్థ లీ అసోసియేట్స్‌కు రూ.10 కోట్లకు ఆ బాధ్యతను అప్పగించారు. 2019కి కూడా అది పూర్తి కాలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్టర్‌ప్లాన్‌పై దృష్టి సారించింది. దీని రూపకల్పన సమయంలో వీఎంఆర్డీఏ పరిధిలో 46 మండలాలు, 1,312 గ్రామాలున్నాయి. ప్రణాళికను రూపొందించేందుకు విశాఖలోని 45 రెవెన్యూ గ్రామాలు, 55 మత్స్యకార గ్రామాలు, 13 వార్డులను పరిగణనలోకి తీసుకొని.. సలహాలు, సూచనలు ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించారు. అలాగే విజయనగరం జిల్లాలోని 48 రెవెన్యూ గ్రామాలు, 19 మత్స్యకార గ్రామాలు, 5 వార్డులు, రెండు వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందుకోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మొత్తంగా 17,460 అభ్యంతరాలు, సలహాలు వచ్చాయి. వీఎంఆర్డీఏ, రెవెన్యూ, ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సంయుక్త తనిఖీలు, సందర్శనలు నిర్వహించి వాటిన్నింటినీ పరిశీలించారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులను అనుసరించి విభిన్న కోణాల్లో ఆలోచన చేసి ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేశారు. దానికి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో 2021 నవంబర్ 8న వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్–2041కు అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్‌పై భూటకపు ప్రకటనలు వైఎస్సార్సీపీ హయాంలో అశాసీ్త్రయంగా ప్రణాళిక సిద్ధం చేశారని ఆరోపణలు పునఃపరిశీలన పేరుతో నెల రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ కేవలం 755 ఫిర్యాదుల రాక.. అవి కూడా పాత విజ్ఞప్తులే.. కూటమి ప్రజాప్రతినిధుల చేసిన ఆరోపణలు అవాస్తవమని నిరూపణ అయినా తమ వారికి లబ్ధి చేకూర్చేందుకు ప్లాన్‌లో మార్పులకు ఒత్తిళ్లుతప్పుడు ఆరోపణలు పటాపంచలు ఈ బృహత్తర ప్రణాళిక–2041పై కూటమి నేతలు ఎన్నికల ముందు నుంచి ఆరోపణలు గుప్పించారు. పాలకులకు అనుకూలంగా మాస్టర్‌ప్లాన్‌ను అశాసీ్త్రయంగా తయారు చేశారని నానా యాగీ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాస్టర్‌ప్లాన్‌పై మళ్లీ అభ్యంతరాలు స్వీకరించి కొత్త ప్లాన్‌ను రూపొందిస్తామని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లికి జరగాలి పెళ్లి.. మళ్లీ మళ్లీ.. అన్నట్లు.. బృహత్తర ప్రణాళికపై పునఃపరిశీలనకు పూనుకున్నారు. ఇందులో గతంలో కంటే అధికంగా ఫిర్యాదులు వస్తాయని భావించారు. వాటి ద్వారా మాస్టర్‌ప్లాన్ అవకతవకలు జరిగాయని నిరూపించడానికి విశ్వప్రయత్నాలు చేశారు. మే 22 నుంచి ఈ నెల 21 వరకు నెల రోజుల పాటు మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలను స్వీకరించారు. ఇందులో కేవలం 755 ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రజాప్రతినిధులు అవాక్కయ్యారు. ఇవి కూడా గతంలో వచ్చిన ఫిర్యాదులుగానే తెలుస్తోంది. ఈ ఫిర్యాదుల బూచితో తమ అనుచరుల రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌ను పూర్తిగా మార్చాలని ఆశపడ్డారు. కానీ అందుకు విరుద్ధంగా జరగడంతో కూటమి నేతలు ఏం చేయాలో పాలుపోక మాస్టర్‌ప్లాన్‌పై నోరెత్తలేక సైలెంట్ అయిపోయారు. ‘కూటమి’కి లబ్ధి చేకూరేలా? కూటమి ప్లాన్ పారకపోయినప్పటికీ.. మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయాలని గట్టి నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులకు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనతో ఈ ప్రణాళికలో సవరణ చేయాలని అధికారులపై ఒత్తిళ్లకు దిగుతున్నట్లు సమాచారం. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాల పేరుతో కూటమి నేతలు సూచించిన విధంగా ప్లాన్‌లో మార్పులు, చేర్పులు చేపట్టాలని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలు, వారి అనుచరుల స్థిరాస్తి వ్యాపారాలు, వ్యక్తిగత ఆస్తుల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రహదారుల ప్రణాళికలను మార్పులు చేసుకునే ప్లాన్ చేస్తున్నట్లు కూటమిలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా మధురవాడ నుంచి ఆనందపురం మధ్యలోను, అలాగే అనకాపల్లిలో పలు చోట్ల మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. -
నేడు వెలుగులు
నాడు ప్రణాళికలు..● ఇంధన ఆదాకు రోల్ మోడల్‌గా ‘ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్’ భవనం ● వైఎస్సార్సీపీ హయాంలో 2023 మేలో సాగర్‌నగర్‌లో పనుల ప్రారంభం ● 50 శాతానికి పైగా ఇంధనం పొదుపయ్యేలా రూ.14 కోట్లతో భవన నిర్మాణం ● పర్యావరణ సవాళ్ల పరిష్కారం, ఇంధన డిమాండ్ తీర్చడంలో ముఖ్య భూమిక ● నేడు మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా భవనం ప్రారంభం సాగర్‌నగర్‌లో ఈసీబీసీ భవనంవిశాఖ సిటీ : వెలుతురు ప్రసరణ ఉంటుంది. సూర్యుడి వేడి నియంత్రిస్తుంది.. విద్యుత్ ఆదా అవుతుంది. పునరుత్పాదక శక్తితో నడుస్తుంది. ఇదీ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నిర్మించిన (ఏపీఈపీడీసీఎల్) సూపర్ ‘ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్’ (ఈసీబీసీ) భవనం ప్రత్యేకత. స్వయం సమృద్ధి విధానంలో విద్యుత్ పొదుపునకు నమూనాగా సాగర్‌నగర్‌లో నిర్మించిన ఈ భవనం దక్షిణాది నగరాలకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన ప్రణాళికలు నేడు వెలుగులు పంచుతోంది. రాష్ట్రంలోనే మొదటి సారిగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) రూపొందించిన ఈసీబీసీ నిబంధనలను అనుసరించి రూ.14 కోట్లతో భవనాన్ని నిర్మించింది. ఇది దేశంలోనే ఇతర రాష్ట్రాల్లో కమర్షియల్ భవనాలకు నమూనాగా నిలుస్తోంది. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు 11 జిల్లాలకు విస్తరించిన ఏపీఈపీడీసీఎల్‌లో ఆపరేషన్ అండ్ మెయింటెనన్స్ అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు శిక్షణ కోసం ఈ అధునాతన జీ+2 భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ భవన నిర్వహణకు ఖర్చు లేకుండా.. తిరిగి రూ.లక్షల్లో ఆదాయార్జన చేసేలా తీర్చిదిద్దారు. ఇంధన పొదుపుపై వైఎస్సార్ సీపీ దృష్టి విద్యుత్, ఇంధన రంగాల్లో దక్షిణాది నగరాలకు ధీటుగా విశాఖను రోల్ మోడల్‌గా నిలిపేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ప్రధానంగా రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో(వాణిజ్య భవనాల్లో) విద్యుత్ డిమాండ్‌ను తగ్గించే అంశంపై దృష్టి పెట్టింది. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా కమర్షియల్ భవనాల నిర్మించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చని భావించింది. ఈ దిశగా విశాఖలో ఏపీఈపీడీసీఎల్ శిక్షణ కేంద్ర భవనాన్ని ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించాలని ఆదేశించింది. దీంతో 2023, మే నెలలో సాగర్‌నగర్ ప్రాంతంలో ఎకరన్నర విస్తీర్ణంలో జీ+2 భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి భారత ప్రభుత్వ సంస్థ బీఈఈ రూ.5 కోట్లు ప్రోత్సాహంగా మంజూరు చేసింది. పగలు విద్యుద్దీపాల అవసరం లేకుండా, ఏసీ వినియోగానికి తక్కువ విద్యుత్ వినియోగం ఉండేలా, విద్యుత్ బిల్లుల భారం తగ్గేలా, 50 శాతం విద్యుత్ ఆదా అయ్యేలా భవన నిర్మాణాన్ని చేపట్టింది. సూపర్ ఈసీబీసీ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో విద్యుత్ శాఖ శిక్షణాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన అంతస్తులను ప్రైవేటు సంస్థలకు లీజులకు ఇవ్వనున్నారు. ఈ బాధ్యతలను ఇప్పటికే వీఎంఆర్డీఏకు అప్పగించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ భవన నిర్మాణం పూర్తయింది. శుక్రవారం రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించేందుకు ఏపీఈపీడీసీఎల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా.. ఈసీబీసీ నిబంధనలను అనుసరించి జీ+2 భవనం ఒక్కో అంతస్తు 14,400 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. ఈ భవన నిర్మాణానికి నాలుగు ప్రమాణాలను అనుసరించారు. సూర్యుని వెలుతురుని నియంత్రించేలా 24 మి.మీ మందం కలిగిన మూడు పొరల గ్లాసులను వినియోగించారు. సాధారణ భవన నిర్మాణాల కిటికీలకు ఒక్క పొర ఉండే గ్లాసులు మాత్రమే వాడతారు. కానీ సూపర్ ఈసీబీసీ నిర్మాణానికి మూడు పొరల గ్లాసులు వినియోగించడంతో భవనంలోకి వేడి తక్కువగా ప్రసరిస్తుంది. గోడలను కావిటీ వాల్స్‌తో కట్టారు. బయట గోడ 8 అంగుళాలు, లోపల 4 అంగుళాలు, మధ్యలో ఎయిర్ గ్యాప్ 4 అంగుళాలు మొత్తంగా 16 అంగుళాలు గోడల నిర్మాణంలో ట్రిపుల్ ఏసీ బ్రిక్స్ ఉపయోగించారు. దీంతో వేడి లోపలకు రాదు. శ్లాబు పై నుంచి వేడి కూడా రాకుండా 100 డెకింగ్ సీలింగ్ చేశారు. 50 మి.మీ. మందం రాక్ వుడ్‌తో శ్లాబ్‌కి టచ్ అవుతూ ఒక సీలింగ్ వేసి, తర్వాత ఎయిర్ గ్యాప్ ఇచ్చి ఫాల్స్ సీలింగ్ చేశారు. దీంతో శ్లాబ్ నుంచి వేడి కిందకు దిగే అవకాశం ఉండదు. విద్యుత్ ఆదా చేయడానికి ఎయిర్ కండిషన్ సిస్టం హెచ్‌వీఏసీ విధానాన్ని అనుసరించారు. హీట్ వెంటిలేటివ్ ఎయిర్ కండిషన్ సిస్టమ్ పద్ధతిలో సెన్సార్ ద్వారా ఆక్యుపెన్సీ బట్టీ కంప్రెషర్ ఆన్, ఆఫ్ వాల్యూం త్రో చేయడం ద్వారా విద్యుత్ ఆదా అవుతుంది. విద్యుత్ బిల్లు భారం లేకుండా పునరుత్పాదక విద్యుత్ కోసం 50 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్‌ను నిర్మించారు. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన భవనాల్లో 50 శాతానికి పైగా విద్యుత్ అవుతుంది. -
‘కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల దృష్టికి తీసుకెళతాం’
విశాఖ: కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల దృష్టికి తీసుకెళతామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాత్ స్పష్టం చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని ఆయన విమర్శించారు. ‘ బాబు మోసాలను 6 వారాలు పాటు ప్రజల్లోకి తీసుకువెళ్తాము.. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ వార్డు స్తాయి వరకు తెలియజేస్తాము.చంద్రబాబు హామీలను QR కోడ్ ద్వారా ప్రజలకు వివరిస్తాము. వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు చంద్రబాబు ఇవ్వద్దంటున్నారు. టిడిపి వాళ్లకు వైఎస్ జగన్ ప్రభుత్వ పథకాలు అందించారు. గతంలో మేనిఫెస్టో ను వెబ్ సైట్ నుంచి తీసివేసిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబుకు రాజ్యాంగం, ప్రజలన్న భయం లేదు. ప్రభుత్వ పథకాలు అందిస్తామని గ్యారెంటీ వారంటీ కార్డులు ఇచ్చారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి గ్యారెంటీ, వారంటీ కార్డులు ఇచ్చారు. చంద్రబాబు మోసం చేస్తారని మొదటి నుంచి చెపుతున్నాము. నిరుద్యోగ భృతి అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డకు నెలకు రూ. 1500, 20 లక్షల ఉద్యోగాలు ఏమి అమలు చేయలేదు. తల్లికి వందనంకు సవా లక్ష ఆంక్షలు పెట్టారు.. ఉచిత గ్యాస్ ఎవరికి అందుతుంధో ఎవరికి తెలియదు. ప్రజల్లోకి వెళ్లడానికి టీడీపీ నేతలు యపడుతున్నారు..టిడిపి నాయకులు మాస్కులు వేసుకొని ప్రజలు దగ్గరకు వెళ్ళాలని చూస్తున్నారు. టిడిపి నేతలను ప్రజలు నిలదీయాలి. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ప్రయారిటీ ఏమీ కనిపించలేదు. చంద్రబాబు లోకేష్ పెత్తనం ప్రభుత్వంలో కనిపిస్తుంది..‘సన్’ స్ట్రోక్ వలన పవన్న చంద్రబాబు పక్కనపెడుతున్నారు’ అని గుడివాడ అమర్నాత్ విమర్శించారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం: కోస్తాలో విస్తారంగా వర్షాలు
విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తరకోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం పడే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని, గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని నాగంపల్లెలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్‌లో 3.7, ఎనీ్టఆర్ జిల్లా మునకుళ్లలో 3.6, అల్లూరి జిల్లా కూనవరంలో 3.5, విశాఖ జిల్లా ఎండాడ, సీతమ్మధారలో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు, నాలుగు రోజుల పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, ఇప్పటికే ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో రైతులకు మేలు జరగనుంది.బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశంఉందని #apsdma ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు,40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. pic.twitter.com/b65VwqYbHE— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 25, 2025ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.మరోవైపు.. తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.What a Day & Night (Yesterday) in TG 🌧️🌧️Adilabad, Karimnagar, Siddipet, Nizamabad, Nirmal, Medak, Warangal, Hanumakonda, Sircilla districts was observed Heavy to Very Heavy Rains. Still Adilabad district continuing Rains‼️Hyd got light rains at few places in the Overnight— Weatherman Karthikk (@telangana_rains) June 26, 2025 -
కొనసాగుతున్న పాలిసెట్ కౌన్సెలింగ్
మురళీనగర్: పాలిటెక్నిక్ కళాశాలల్లో సాంకేతిక కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి బుధవారం కూడా పాలిసెట్ కౌన్సెలింగ్ జరిగింది. వర్షం పడుతున్నప్పటికీ.. ఇబ్బందులు పడుతూనే విద్యార్థులు అత్యధిక సంఖ్యలో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ● గైస్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ పర్యవేక్షణలో, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ సీహెచ్ జయప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో 68,001 నుంచి 77,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో 250 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ● పాలిటెక్నిక్ కళాశాలలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్ పర్యవేక్షణలో, జనరల్ హెడ్, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ డాక్టర్ పీఎం భాషా, లెక్చరర్ నాగరాజుతో కూడిన అధికారుల బృందం 77,001 నుంచి 86,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించింది. 298 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించింది. వీరిలో 209 మంది బీసీ, 37 మంది ఓసీ, 39 మంది ఎస్సీ, 13 మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నారు. ● గురువారం గైస్ కళాశాలలో 86,001 నుంచి 95, 000 ర్యాంకు వరకు, పాలిటెక్నిక్ కళాశాలలో 95,001 నుంచి 1,04,000 ర్యాంకు వరకు విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఎస్టీ విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలకు హాజరు కావాలి. వెబ్ ఆప్షన్ల ఎంపిక వాయిదా పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించిన వెబ్ ఆప్షన్ల ఎంపిక వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 27 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కావాల్సి ఉంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30 వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించి, జూలై 1న ఆప్షన్ల మార్పిడి, 3న సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది. అయితే ఆప్షన్ల ఎంపికను ఈ నెల 30కి వాయిదా వేశారు. ఇందుకు సంబంధించి ర్యాంకుల వారీగా కొత్త షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. -
రేపటి నుంచి కనెక్ట్ ఏపీ ఎక్స్పో టెక్ సెమినార్
డాబాగార్డెన్స్: విశాఖలో ఈనెల 27 నుంచి 29 వరకు కనెక్ట్ ఏపీ ఎక్స్పో టెక్ 4వ సెమినార్ నిర్వహించనున్నట్టు నిర్వాహకుడు బండారు కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో సెమినార్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాసన్స్ బే కాలనీ గాదిరాజు ప్యాలెస్‌లో జరగనున్న ఈ సెమినార్‌ను కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్, డిజిటల్ మార్కెటింగ్ ప్రతినిధులు, డిజిటల్ సాంకేతిక రంగ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఇది మంచి వేదిక కానుందన్నారు. ప్రపంచ దేశాల్లో మారుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించి, ప్రతి ఒక్క పరికరం వినియోగదారులకు ఈ ఎక్స్‌పోలో లభ్యం కానుందని, ప్రముఖ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. సమావేశంలో కేబుల్ ఆపరేటర్లు సుభద్రరాజు, గుంటూరు ప్రసాద్, చింతాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక విధానాలతో విపత్తుల నిర్వహణ
మహారాణిపేట: ‘ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. భవిష్యత్ అవసరాలు, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని పాత విధానాలను నవీకరించాలి.’ అని జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) ప్రతినిధులు నావల్ ప్రకాష్, అభిషేక్ బిశ్వాస్, అభినవ్ వాలియా అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనం కోసం విశాఖకు విచ్చేసిన వీరు.. ముందుగా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌ను తన చాంబర్లో కలిశారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా సమగ్ర ప్రణాళికలు, విపత్తుల నిర్వహణలో అంతర్ జిల్లాల సహకారం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. విపత్తుల నిర్వహణలో జపాన్ అనుసరించిన సాండియా ఫ్రేమ్‌వర్క్, ప్రధాన మంత్రి పది సూత్రాల అజెండా, డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్లో అనుసరించాల్సిన విధానాలపై సమీక్షించారు. ఎన్డీఎంఏ రూపొందించిన పీపీటీని ప్రజెంట్ చేసి, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ నిబంధనలను వివరించారు. ఈ సందర్భంగా సంస్థ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్ మాట్లాడుతూ జిల్లా ప్రణాళికలను ఆధునికీకరించాలని సూచించారు. విపత్తుల నిర్వహణలో సాచేత్ యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ వ్యవస్థలను వినియోగించుకోవాలని చెప్పారు. ప్రమాదాలు సంభవించినప్పుడు అంతర్ జిల్లాలు పరస్పరం సహకరించుకోవాలని హితవు పలికారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను సందర్శించాలని, భవిష్యత్తు కార్యాచరణ, ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. సాచేత్ యాప్‌ను వినియోగించడం ద్వారా ప్రమాద హెచ్చరికలను మెసేజ్‌ల రూపంలో పొందవచ్చన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉండే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బెటాలియన్ల సంఖ్యను పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. దేశంలోనే మొదటిగా జాతీయ సైక్లోన్ మిటిగేషన్ కేంద్రాన్ని ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో నెలకొల్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశాఖ లాంటి ప్రాంతంలో అన్ని రకాల విపత్తులు సంభవించడానికి ఆస్కారం ఉందని, అన్ని రకాలుగా ప్రణాళికలు రూపొందించుకొని సన్నద్ధంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ సమావేశంలో ఎస్డీఎంఏ ప్రతినిధి సీహెచ్ పీటర్, డీపీఎం రాము, సివిల్ డిఫెన్స్ అధికారి మధుసూదన్ రావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
చోరీ ఘటనలో ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది అరెస్ట్
ఎంవీపీకాలనీ : ఆర్టీసీ బస్సులో ఈ నెల 22న జరిగిన చోరీకి సంబంధించి ఆ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎంవీపీ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఎంవీపీ పోలీసు స్టేషన్లో ద్వారకా క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మాధవధార సచివాలయం ఉద్యోగి కమలకుమారి (55) ఈ నెల 22న ఫంక్షన్ నిమిత్తం విజయవాడ వెళ్లి తిరిగి వస్తూ బస్సులో బ్యాగ్ మర్చిపోయారు. తన తమ్ముడి ఇంటికి వెళ్లే క్రమంలో ఆమె గాజువాకలో బస్సు దిగిపోయారు. అనంతరం ఇంటికి వెళ్లాక చూసుకోగా తన బ్యాగ్ కనిపించలేదు. దీంతో మద్దిలపాలెం ఆర్టీసీ డిపోకు వెళ్లి చూడగా బ్యాగ్ ఉన్నప్పటికీ అందులోని 3 బంగారు గొలుసులు, 2 గాజులు, రూ.50,000 నగదు కనిపించలేదు. దీంతో ఆమె ఎంవీపీ కాలనీ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ద్వారకా క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు, సీఐ చక్రధర్‌రావు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించిన ఎంవీపీ క్రైమ్ ఎస్ఐ అప్పలరాజు మద్దిలపాలెం ఆర్టీసీ డిపో కాంట్రాక్ట్ హెల్పర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మొల్లి వెంకటేష్, సూపర్వైజర్ భరటం వెంకటరమణలను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి బంగారు అభరణాలతో పాటు రూ.50 వేలు నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీఐ చక్రధర్‌రావు, ఎస్ఐ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
జనసేన నాయకుల నుంచి కాపాడండి
● అధికార బలంతో తమ ప్లాట్లను దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారు ● తాము ఎమ్మెల్యే పంచకర్ల మనుషులం అంటూ బెదిరిస్తున్నారు ● పెదగాడిలో జనచైతన్య ప్లాట్ల ఓనర్ల అసోసియేషన్ ప్రతినిధుల వేడుకోలు పెందుర్తి: ‘మేం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తాలూకా.. ఈ ప్లాట్లు మావి.. మీరు ఎప్పుడు కొనుక్కున్నారో.. ఎలా కొనుక్కున్నారో మాకు అనవసరం.. ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం.. మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామంటూ’ పెదగాడిలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అనుచరులు, జనసేన నాయకులు తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారంటూ పెదగాడిలోని జనచైనత్య లేఅవుట్ ప్లాట్ల ఓనర్ల అసోషియేషన్ ప్రతినిధులు వాపోయారు. తమను, తమ ప్లాట్లను అధికారులే కాపాడాలని విన్నవించారు. పెందుర్తి మండలం పెదగాడిలో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1993లో జనచైతన్య రియల్ ఎస్టేట్ సంస్థ పెదగాడిలో 47 ఎకరాల్లో లేఅవుట్ వేయగా అందులో 475 ప్లాట్లు తమతో పాటు పలువురు కొనుగోలు చేశారని చెప్పారు. దాదాపు 30 ఏళ్ల పాటు తమ క్రయ, స్వాధీనానుభవంలో ఉన్న ప్లాట్లను తమవి అంటూ స్థానిక జనసేన నాయకులు గత రెండు మూడు రోజులుగా దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు చూస్తున్నారన్నారు. తమ తాత ముత్తాతల భూములు కొనడానికి మీరెవరు అంటూ దాడులకు పాల్పడుతున్నారంటూ వాపోయారు. మాకు ఎమ్మెల్యే ఉన్నారు.. ప్రభుత్వం ఉంది ఏదైనా చేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. తమకు జిల్లా ఉన్నతాధికారులు రక్షణ కల్పించాలని విన్నవించారు. -
సామాజిక కార్యక్రమాలతో గ్రంధి మనోజ్ జయంతి
విశాఖ సిటీ: మనోజ్ వైభవ్ జెమ్స్ అండ్ జ్యుయలర్స్ లిమిటెడ్(వైభవ్ జ్యుయలర్స్) వ్యవస్థాపక అధ్యక్షుడు మనోజ్‌కుమార్ గ్రంధి 59వ జయంతి సందర్భంగా పలు సంక్షేమ, సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 100 మందికి పైగా ఉద్యోగులు రక్తదానం చేశారు. ఓమ్నీ ఆర్కే ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 250 మందికి, మాక్సీ విజన్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐ క్యాంప్‌లో 100 మందికి ఉచిత పరీక్షలు నిర్వహించారు. హెల్త్ యూనివర్సిటీ విశ్రాంత వైస్‌చాన్సలర్ డాక్టర్ రవిరాజ్, గైనకాలజిస్ట్ డాక్టర్ రాధ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థ చైర్పర్సన్ భారత మల్లికా రత్నకుమారి గ్రంధి, సంస్థ హోల్‌టైమ్ డైరెక్టర్ అండ్ సీఎఫ్ఓ సాయి కీర్తన, సీఓఓ రఖాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింధూరి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, కంకటాల టెక్స్టైల్స్ సంస్థ చైర్మన్ మల్లిక్, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. -
కమిషనర్‌ను కలిసిన కాంట్రాక్టర్లు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను మహా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. అనంతరం కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయాన్ని కమిషనర్ వద్ద ప్రస్తావించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పీవీపీ నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎం.సంజీవరెడ్డి, ఉపాధ్యక్షుడు గుర్రం సింహాచలం, నిర్వాహక కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి బూటు కృష్ణ, కె.అప్పలనాయుడు, కోశాధికారి శ్రీనివాసరావు, సహాయ కోశాధికారి ఎం.రవికుమార్ పాల్గొన్నారు. కోస్ట్‌గార్డ్ మాక్ డ్రిల్ విశాఖ సిటీ: సముద్రంలో చమురు కాలుష్యాన్ని నిరోధించేందుకు ఇండియన్ కోస్ట్‌గార్డ్ ప్రధాన కార్యాలయంలో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. నౌకల ప్రమాదాలు, ఇతర కారణాలతో చమురు లీకై సముద్రంలో కలిసిన సమయంలో చేపట్టాల్సిన చర్యలను ప్రదర్శించారు. సముద్రంపై తేలియాడే కృత్రిమ గోడను నిర్మించి చమురు విస్తరణను శోధించారు. స్కిమర్ అనే పరికరం ద్వారా సముద్రంలో ఆయిల్‌ను సేకరించి పొల్యూషన్ కంట్రోల్ వెసల్‌లో ఉన్న ట్యాంకుల్లో నింపారు. దాన్ని తీర ప్రాంతానికి తరలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు పాల్గొన్నాయి. గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంఆరిలోవ: విశాఖ, అనకాపల్లి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలల్లో మిగులు సీట్ల భర్తీకి సంబంధించి శ్రీకృష్ణాపురం గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆయా గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. తొలుత ఈ పరీక్ష కోసం అన్ని తరగతులకు 589 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష సమయంలో మరికొందరు విద్యార్థులు దరఖాస్తులతో చేరుకోవడంతో.. అధికారులు వారికి కూడా అవకాశం కల్పించారు. దీంతో మొత్తం 647 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు గురుకులం ప్రిన్సిపాల్ రత్నవల్లి తెలిపారు. -
క్యాంపస్‌లో కొలువుల్లేవు
ఆంధ్రా యూనివర్సిటీలో నారాయణ (పేరు మార్చాం) అనే విద్యార్థి 2024–25 విద్యా సంవత్సరంలో బీటెక్ (సీఎస్) పూర్తి చేశాడు. ప్రముఖ కంపెనీలేవీ ప్లేస్‌మెంట్స్ కోసం రాకపోవడంతో గాయత్రీ కాలేజీలో జరిగే ఆఫ్–క్యాంపస్ సెలక్షన్స్‌కు వెళ్లి టీసీఎస్‌లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఈ విధంగా ఒక్క నారాయణే కాదు 20 మంది ఏయూ విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. ఈ అమ్మాయి పేరు రేపాక ఈశ్వరి. 2022–23 విద్యా సంవత్సరంలో ఏయూలో సీఎస్ పూర్తి చేసిన ఈ అమ్మాయికి అట్లాసియన్ కంపెనీలో రూ.84.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. ఆఫర్ లెటర్‌ను అప్పటి ఏయూ వీసీ ప్రసాదరెడ్డి అందించారు. ఆ ఏడాది ఈ అమ్మాయికే కాదు 1,001 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఆఫర్ లెటర్స్ అందించారు. 2023 మే 1వ తేదీన బీచ్‌రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ‘అచీవర్స్ డే’ ఘనంగా నిర్వహించి 1,001 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆఫర్ లెటర్స్‌ను అందించారు. ఆ ఏడాది వచ్చిన అత్యధిక ప్యాకేజీ రూ.84.5 లక్షలు!2025లో ఏయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారిలో పట్టుమని 20 శాతం మందికి కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లేని పరిస్థితి. ఆఫ్–క్యాంపస్‌లో గాయత్రీ కాలేజీకి వెళ్లి అక్కడ సెలక్షన్స్‌లో 20 మంది ఏయూ విద్యార్థులు టీసీఎస్‌లో ఉద్యోగం సంపాదించుకున్నారు. ఈ ఏడాది వచ్చిన అత్యధిక ప్యాకేజీ రూ.12 లక్షలు! ఇదీ గత ప్రభుత్వ హయాంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు... కూటమి ప్రభుత్వంలో ఏయూలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు మధ్య ఉన్న తేడా. 20 లక్షల ఉద్యోగాల పేరుతో...! వాస్తవానికి ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని... లేనిపక్షంలో నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి నేతలు ప్రకటించారు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు. వాస్తవానికి ఏయూలో ఇంజినీరింగ్ సీటు మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకే సాధ్యమవుతుంది. అటువంటి విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం సంపాదించడం కష్టమేమీ కాదు. కూటమి ప్రభుత్వం క్యాంపస్ ప్లేస్మెంట్స్పై కనీస శ్రద్ధ వహించక పోవడంతో వేరే ప్రాంతాలకు వెళ్లి ఇంటర్వ్యూలో పాల్గొని ఉద్యోగాలు సంపాదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉద్దేశపూర్వకంగానే...! వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు సంస్కరణలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఏయూలో గణనీయ అభివృద్ధి జరిగింది. నూతన పోకడలకు అనుగుణంగా ఏయూలో కొంగొత్త మార్పులకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. ఎన్నడూ లేని విధంగా స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా ఏ–హబ్‌ను ఏర్పాటు చేశారు. పేటెంట్ల కోసం ఏకంగా వందకుపైగా దరఖాస్తుల చేయడం ద్వారా రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలకు మార్గదర్శకంగా నిలిచింది. మేథో సంపత్తి హక్కులను (పేటెంట్స్) పొందేందుకుగానూ ప్రత్యేకంగా మేథో సంపత్తి హక్కుల కేంద్రం (ఐపీటీ)ని గత ప్రభుత్వ హయాంలో అప్పటి వీసీ ప్రసాద్‌రెడ్డి 2020 సెపె్టంబరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా వందకిపైగా దరఖాస్తులను పంపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే ఏయూ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం జరుగుతుందన్న ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏదో జరిగిందనే రీతిలో ప్రచారం చేస్తూ... విచారణ పేరుతో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ కంపెనీలను పిలిచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ను నిర్వహించడం లేదు. -
ముడిసరకు లేకుండానే మూడో ఫర్నేసా..
స్టీల్‌ప్లాంట్‌లోని బ్లాక్ ఫర్నేస్–3గాజువాక : గతంలో ఒకసారి బీఎఫ్–3ని ప్రారంభించినా, కేవలం రెండు నెలలకే ముడిసరకు కొరత కారణంగా మూసివేయాల్సి వచ్చింది. ఆ అనుభవాల దృష్ట్యా తగినన్ని ముడిసరకు నిల్వలు లేకుండానే మళ్లీ ఫర్నేస్‌ను ప్రారంభించాలని తాజాగా నిర్ణయించడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.11,440 కోట్లను బ్యాంకుల అప్పులు తీర్చడానికే వినియోగించి స్టీల్ ఉత్పత్తికి అవసరమైన ముడి సరకు సమకూర్చలేదు. స్టీల్‌ప్లాంట్ లాంటి ఇంటిగ్రేటెడ్ పరిశ్రమలో కనీసం 45 రోజులకు సరిపడా ముడి సరకు నిల్వలు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మూడు నెలలకు సరిపడా ముడి సరకును సమకూర్చిన తర్వాతే బీఎఫ్–3ను ప్రారంభిస్తామని గతంలో స్టీల్ జాయింట్ సెక్రటరీ ప్రకటించారు. కానీ ప్రస్తుతం ప్లాంట్‌కు అవసరమైన ముడిసరకు అందుబాటులో లేదని కంపెనీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫర్నేస్‌ను ప్రారంభిస్తే ప్లాంట్ నష్టాల బారిన పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూలింగ్ ప్లేట్ల సమస్య.. అదనపు భారం గతంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బీఎఫ్–3ని ప్రారంభించి, ఆ తర్వాత మూసివేశారు. ఈ కారణంగా ఫర్నేస్లోని కీలకమైన కూలింగ్ ప్లేట్లు దెబ్బతిన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల కూడా స్టీల్ ఉత్పత్తిలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన ఈ ప్లేట్ల కోసం ప్లాంట్ యాజమాన్యం అదనంగా ఖర్చు చేసింది. ఇతర దేశాల నుంచి కూలింగ్ ప్లేట్లు ఇక్కడికి చేరాలంటే సుమారు రెండు నెలల సమయం పడుతుంది. కానీ అత్యవసరంగా వాయు రవాణా ద్వారా తెప్పించడం వల్ల ప్లాంట్‌పై అదనపు ఆర్థిక భారం పడిందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. గతంలో జరిగిన అనుభవం నుంచి పాఠాన్ని తీసుకోని ప్రభుత్వం బీఎఫ్–3ని పునఃప్రారంభించాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు చెబుతున్నారు. మూడో బ్లాస్ట్ ఫర్నేస్ చుట్టూ సందేహాలు సరిపడినంత ముడిసరకు లేదంటున్న కంపెనీ వర్గాలు సింటర్, బ్యాటరీల సామర్థ్యంసరిపోదంటున్న ఉద్యోగులు స్టీల్‌ను రోల్ చేయగలిగే సామర్థ్యంపైనా అనుమానాలు కంపెనీపై ఆర్థిక భారంపెరుగుతుందంటున్న కార్మికవర్గం విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మూడో బ్లాస్ట్ ఫర్నేస్(బీఎఫ్–3)ను ఈ నెల 27న పునఃప్రారంభించేందుకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా బీఎఫ్–3ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. బీఎఫ్–3ని ప్రారంభించాలనుకోవడం మంచి విషయమే.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయంపై పరిశ్రమ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారింది. సామర్థ్యంపై సందేహాలు సింటర్ ప్లాంట్ బీఎఫ్–3 సమర్థంగా పని చేయాలంటే సింటర్ ప్లాంట్‌లో తగినంత సింటర్ అందుబాటులో ఉండాలి. ఇక్కడ ప్రస్తుతం మూడు మిషన్లు అందుబాటులో ఉన్నాయి. మూడో బ్లాస్ట్ ఫర్నేస్ సమర్థంగా పని చేయాలంటే అదనంగా మరో సింటర్ మిషన్ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న మిషన్లను పూర్తిస్థాయిలో వాడితే మూడు మిషన్లు సరిపోతాయని యాజమాన్యం చెబుతోంది. అయితే ఏ చిన్నపాటి సాంకేతిక సమస్య వచ్చినా ఉత్పత్తిని ఆపుకోవాల్సి వస్తుందని, అందువల్ల నాలుగో సింటర్ మిషన్ అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోక్ ఒవెన్ కోక్ ఒవెన్ విభాగంలో ఆరో బ్యాటరీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇది లేకపోవడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి నష్టాలు వస్తాయని అంచనా. ప్రస్తుతం దీన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కానందున, దీని నిర్వహణను ప్రైవేట్‌కు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పెల్లెట్స్ ఉత్పత్తిలో కీలకమైన పెల్లెట్లను బయట నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల ఒక్కో టన్ను ఉత్పత్తికి రూ.4,000 అధిక ఖర్చు అవుతోందని లెక్కలు చెబుతున్నాయి. ఇది కూడా ప్లాంట్‌పై అదనపు భారమే. రోలింగ్ మిల్స్ ప్రస్తుతం ప్లాంట్‌లో 5.5 మిలియన్ టన్నుల స్టీల్‌ను మాత్రమే రోల్ చేయగలిగే సామర్థ్యం ఉంది. బీఎఫ్–3 ప్రారంభమైతే ఉత్పత్తి 7.5 మిలియన్ టన్నులకు చేరుతుంది. ఆ అదనపు స్టీల్‌ను రోల్ చేసే సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇన్ని సవాళ్ల మధ్య బీఎఫ్–3ని పునఃప్రారంభించి, దాన్ని సమర్థంగా నిర్వహించగల సత్తా యాజమాన్యానికి ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా, ప్లాంట్‌కు అవసరమైన సొంత గనులను కేటాయించాలని నిపుణులు, కార్మికులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. లేదా సెయిల్‌లో ఈ ప్లాంట్‌ను విలీనం చేస్తే కొంతమేరకై నా పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. -
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజా విశాఖ లీగల్: బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యతని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవ ప్రాధికార సంస్థ అధ్యక్షుడు చెన్నం శెట్టి రాజా అన్నారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవ ప్రాధికార సంస్థ భవనంలో రాష్ట్ర న్యాయ సేవ ప్రాధికార సంస్థ పిలుపు మేరకు బాలల స్నేహపూర్వక న్యాయ సేవలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. 2015–2021 సంవత్సరాల మధ్య చిన్నారుల సామాజిక ఆర్థిక ఇతర కోణాలను పరిశీలించి, వారికి ఉత్తమ సేవ అందించడానికి కొత్త చట్టాలను తీసుకొచ్చారన్నారు. బాలల ఉత్తమ ప్రయోజనాలను గుర్తించి వారికి న్యాయపరమైన సేవలు అందించడానికి రెండు పథకాలు అమలు జరిపినట్లు చెప్పారు. న్యాయపరమైన రక్షణ, బాలల హక్కుల పరిరక్షణ ఈ సేవల్లో అంతర్భాగం అన్నారు. అన్ని విధాలైన ఆరోగ్య సేవలతో పాటు వినికిడి, శారీరక వైకల్యం వంటి అంశాలను పరిశీలించి తగిన విధంగా ఆదుకోవాలని చట్టం వివరిస్తున్నట్లు చెప్పారు. బాలల ఆనందమయ జీవితానికి కొత్త చట్టాలు ఎంతో ఉపకరిస్తాయని విశాఖ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రామలక్ష్మి అన్నారు. జిల్లా వైద్య విద్యాధికారి కె.నాగేశ్వరరావు, కార్మిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.సునీత, జిల్లా బాలల సంక్షేమ శాఖ పీడీ ఎంఆర్ఎల్ రాధా, జీవీఎంసీ అధికారులు, అన్ని మండలాల అధికారులు, అనాధాశ్రమాల ప్రతినిధులు, నిరాశ్రయుల సేవా సంస్థల ప్రతినిధులు, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన అధికారులు, దృశ్య శ్రావణ మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. -
వైజాగ్ టు చైనా
అక్రమంగా రేషన్ బియ్యం రవాణా8లోగురువారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2025జగన్‌తో జిల్లా నేతల భేటీసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : రాష్ట్రంలోని రేషన్ బియ్యం విశాఖ నుంచి చైనాకు ఎగుమతి అవుతోంది. చైనాలో రైస్ వైన్‌గా పిలిచే సంప్రదాయ మద్యపానీయం హువాంగ్జియు తయారీలో విరివిగా బియ్యాన్ని ఉపయోగిస్తారు. అక్కడి డిమాండ్‌కు అనుగుణంగా ఎగుమతి చేసేందుకు విశాఖలోని పలు షిప్పింగ్ కంపెనీలు రేషన్ బియ్యాన్ని మార్గంగా ఎంచుకున్నాయి. రేషన్ మాఫియా ద్వారా సేకరించి చైనాకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన 473 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విశాఖలోని పలు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ (సీఎఫ్‌టీ)ల్లో ఈ నెల 23, 24 తేదీల్లో దాడులు చేసి పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇందులో శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ వద్ద 150 మెట్రిక్ టన్నుల బియ్యం, గేటు వే ఈస్ట్ ఇండియా సీఎఫ్టీలో 156 మెట్రిక్ టన్నులు, పంచవటి టోల్గేట్ వద్ద 167 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గుర్తించినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారమంతా ప్రధానంగా టీడీపీకి చెందిన కార్గో వ్యాపారే నడిపిస్తున్నట్టు విమర్శలున్నాయి. పట్టుకున్నవి రేషన్ బియ్యం కాదంటూ ల్యాబ్‌ల ద్వారా నివేదికలు తెచ్చుకునేందుకు వ్యవహారం నడుస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మొదటి దఫా ల్యాబ్ నివేదికల్లో రేషన్ బియ్యం కాదంటూ నివేదిక రాగా.. రెండో నివేదిక కూడా అదేవిధంగా వచ్చేలా వివిధ రకాల ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. రెండో శాంపిల్‌పై వచ్చే ల్యాబ్ నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. అంతా అమ్యామ్యాలే...! కొన్నాళ్ల క్రితం కాకినాడ నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం నానా హంగామా చేసింది. దీంతో సాధారణ బియ్యం ఎగుమతి కూడా అక్కడి నుంచి చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అనేక మంది విశాఖ నుంచి ఎగుమతులకు తమ మకాం మార్చారు. రేషన్ బియ్యం మాఫియా కూడా వారితో పాటు విశాఖ నుంచి చైనాకు బియ్యం ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రచించింది. తాజాగా రేషన్ డిపోలు కూడా ఏర్పాటు కావడంతో రేషన్ మాఫియా మరింత రెచ్చిపోతోంది. ప్రధానంగా భీమిలి నియోజకవర్గంలోని రేషన్ మిల్లులతో పాటు పెందుర్తి, సబ్బవరం ప్రాంతాల్లోని రేషన్ మిల్లుల కేంద్రంగా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్కడ సన్న బియ్యంగా మలుస్తున్నారు. వివిధ దేశాల ఎగుమతులకు సంబంధించిన అన్ని అనుమతులను కస్టమ్ హౌస్ బ్రోకరేజీ సంస్థలు తీసుకుంటున్నాయి. అనంతరం కస్టమ్స్ నుంచి అనుమతులు పొందుతున్నాయి. తరువాత రేషన్ మిల్లుల నుంచి తీసుకొచ్చి విశాఖలో ఉన్న పలు కంటైనర్ టెర్మినల్ ఫ్రైట్ స్టేషన్ల (సీఎఫ్‌టీ)లో నిల్వ ఉంచి.. కంటైనర్ల ద్వారా ఎగుమతులు చేపడుతున్నారు. టీడీపీకి చెందిన కార్గో వ్యాపారి స్టేషన్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేయాల్సిన అధికారులు.. కూడా ఈ రేషన్ మాఫియాతో చేతులు కలుపుతున్నారు. ఒక్క కంటైనర్ లోడ్ చేస్తే అధికారులకు రూ.50 వేల చొప్పున చెల్లింపులు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచిత్రమేమింటే గత ఏడాది డిసెంబర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు నిర్వహించిన గేట్ వే వద్ద ఈ రేషన్ బియ్యం పట్టుబడటం గమనార్హం. మహారాణిపేట: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సమన్వయకర్తలు మజ్జి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్ కుమార్, మళ్ల విజయప్రసాద్, తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.హెచ్‌పీసీఎల్ రూ.8.75 కోట్ల విరాళం న్యూస్రీల్వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో పలువురికి చోటు విశాఖ సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో విశాఖకు చెందిన నేతలకు చోటు కల్పించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలను చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులుగా మళ్ల దేవి విశాలాక్షి (విశాఖ ఉత్తర), బెందాళం పద్మావతి(భీమిలి), రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా యెల్లిపోగుల వరలక్ష్మిని నియమించారు. అలాగే రాష్ట్ర బూత్ కమిటీల వింగ్ ప్రధాన కార్యదర్శిగా రవికాంత్ శివలంక(భీమిలి), రాష్ట్ర ఆర్టీఐ వింగ్ జాయింట్ కార్యదర్శిగా దశమంతుల వేణుగోపాల్(విశాఖ దక్షిణ)లను నియమించారు. రైస్ వైన్‌లో బియ్యాన్ని వినియోగిస్తున్న చైనా అక్కడి డిమాండ్‌ను సొమ్ముచేసుకుంటున్న మాఫియా రేషన్ షాపుల ఏర్పాటుతో చెలరేగిపోతున్న ముఠా తాజా దాడుల్లో 473 టన్నుల బియ్యం పట్టివేత కీలక సూత్రధారి టీడీపీ కార్గో వ్యాపారే..! రేషన్ బియ్యం కాదంటూ ల్యాబ్ నివేదికలు? చైనా డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకే...! వాస్తవానికి చైనాలో సంప్రదాయ రైస్ వైన్‌కు డిమాండ్ ఉంది. చైనీస్ రైస్ వైన్ అని కూడా పిలువబడే హువాంగ్జియును ప్రధానంగా చైనాలోని జియాంగ్నాన్ ప్రాంతంలో ఉడికించిన బియ్యాన్ని పులియబెట్టడం ద్వారా తయారుచేస్తారు. దీనికి ఉండే ప్రత్యేకమైన రుచితో పాటు తక్కువ ఆల్కహాల్ (8 నుంచి 20) శాతం, మంచి పోషక విలువలు ఉండటంతో చైనీయులు ఎంతో ఇష్టంగా సేవిస్తారు. ఇందులో అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఉంటాయి. దీనికి 5 వేల సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగి ఉంది. ఈ నేపథ్యంలో చైనాలో ఉండే ఈ రైస్ వైన్ డిమాండ్‌కు అనుగుణంగా వివిధ దేశాల నుంచి బియ్యాన్ని ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది. అక్కడి డిమాండ్ ఇక్కడి రేషన్ బియ్యం మాఫియాకు కలిసివస్తోంది. ఇక్కడి నుంచి భారీగా రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేయడంలో టీడీపీకి చెందిన కార్గో వ్యాపారి చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. ల్యాబ్ నివేదిక పేరుతో...! పట్టుకున్న బియ్యం నమూనాలను ల్యాబ్‌కు పంపించామని.. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు అంటున్నారు. మరోవైపు మొదటి దాడుల్లో పట్టుకున్న 150 మెట్రిక్ టన్నుల బియ్యంలో పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపగా.. రేషన్ బియ్యం కాదని నివేదిక వచ్చినట్టు సమాచారం. ఇక మిగిలిన బియ్యం నమూనాల నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఈ నివేదికలు కూడా రేషన్ బియ్యం కాదని వస్తాయా? అవునని వస్తాయా అనేది చూడాల్సి ఉంది. దాడుల్లో పట్టుకున్న బియ్యం అనుమానిత ప్రజా పంపిణీ బియ్యం అని స్పష్టంగా ప్రకటనల్లో పేర్కొన్న అధికారులు.. ప్రజా పంపిణీ బియ్యం అక్రమంగా రవాణా, నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొనడం విశేషం. -
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో ప్రథమ స్థానంలో నిలపాలి
జెడ్పీ సీఈవో నారాయణమూర్తిమహారాణిపేట: స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి కోరారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్–2025లో భాగంగా మెరుగైన పారిశుధ్యం కోసం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానానికి తీసుకువెళ్లడానికి అందరి సహకారం అవసరమన్నారు. గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ బృందాలు పర్యటించి, కేటగిరీల వారీగా పరిశీలించి మార్కులు వేస్తాయన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచడమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ఎం.వి.శ్రీనివాసరావు, జిల్లా రూరల్ వాటర్ సప్లై సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.వి.వి.చౌదరి, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, ఏఈ ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే విజయం సాధించాం
యోగాంధ్ర అభినందన సభలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం సమష్టి కృషి, ప్రజాప్రతినిధుల సహకారంతో యోగాంధ్ర విజయవంతమైందని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించగలిగామని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. వీఎంఆర్డీఏ చిల్ట్రన్ ఎరీనాలో బుధవారం నిర్వహించిన అభినందన సభలో కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమ నిర్వహణలో అన్ని విభాగాల అధికారులు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. వారి సేవలను కొనియాడారు. పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు ప్రశంసనీయ పాత్ర పోషించాయన్నారు. జేసీ కె.మయూర్ అశోక్ రాముడికి లక్ష్మణుడిలా అండగా నిలిచారన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తూ.. విలువైన సూచనలిచ్చారన్నారు. అనంతరం కలెక్టర్‌ను జిల్లా అధికారులు సత్కరించారు. డీసీపీ అజిత, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, డీసీపీ(అడ్మిన్) కృష్ణకాంత్ పటేల్, డీఆర్వో భవానీ శంకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణి పేట (విశాఖ): బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని నాగంపల్లెలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్‌లో 3.7, ఎనీ్టఆర్ జిల్లా మునకుళ్లలో 3.6, అల్లూరి జిల్లా కూనవరంలో 3.5, విశాఖ జిల్లా ఎండాడ, సీతమ్మధారలో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: ఐఎండీ సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆదే ప్రాంతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీంతో పాటుగా మరోక ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు.వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40-60కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు. రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.గురువారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శుక్రవారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శనివారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.ఆదివారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.కాగా, బుధవారం సాయంత్రం 5గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లెలో 49 మిమీ, విశాఖ రూరల్ 37.7మిమీ, ఎన్టీఆర్ జిల్లా మునకుళ్ళలో 36.5మిమీ, అల్లూరి జిల్లా కూనవరంలో 35.7మిమీ, విశాఖ జిల్లా ఎండాడలో 35.7మిమీ, సీతమ్మధారలో 35.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని ఒత్తిడి
రెండో రోజు కొనసాగిన ఎంటీఎస్ టీచర్ల నిరసన బీచ్‌రోడ్డు: దూర ప్రాంతాలకు, రవాణా సౌకర్యం లేని మారుమూల పాఠశాలలకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం తమపై ఒత్తిడి తెస్తోందని 1998, 2008 ఎంటీఎస్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయిన ఖాళీలను తమతో భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారని తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రెండో రోజైన మంగళవారం తమ నిరసనను కొనసాగించారు. మారుమూల పాఠశాలలను ఎంచుకోవాలని ఒత్తిడి చేయడం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. తమలో చాలా మంది 55 ఏళ్లు పైబడిన వారని, 70 శాతం మంది మహిళలే ఉన్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతాలకు పంపి పని చేయాలనడం బాధాకరమని వాపోయారు. ప్రస్తుతం ఇస్తున్న రూ. 32 వేల వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటూ.. మారుమూల ప్రాంతాల్లో పనిచేయడం తమ శక్తికి మించిన భారం అవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఆర్.సి.నంబర్ 39 ఉత్తర్వుల ప్రకారం తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని లేదా మైదాన ప్రాంతాల్లోని ఏకోపాధ్యాయ పాఠశాలలో రెండవ ఉపాధ్యాయునిగా నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం మొత్తం మీద విశాఖ పరిస్థితి ప్రత్యేకమైనదని, తమకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
తాటిచెట్లపాలెం: డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ(డీఆర్‌యూసీసీ) 2025 తొలి సమావేశం మంగళవారం దొండపర్తిలోని డీఆర్ఎం కా ర్యాలయంలో జరిగింది. డీఆర్ఎం కార్యాలయం వద్ద గల కాన్ఫరెన్స్ హాల్లో డీఆర్ఎం లలిత్‌బోరా అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు, కల్చరల్ అసోసియేషన్, ప్రయాణికుల అసోసియేషన్ ప్రతినిధులు, నామినేటెడ్ సభ్యులు మొత్తం 11 మంది ఈ సమావేశంలో పాల్గొని ప్రయాణికుల సౌకర్యాలు, సమస్యల గురించి చర్చించారు. పలు స్టేషన్ల్లో దివ్యాంగులకు మెరుగైన సదుపాయాలు, ప్రత్యేక రైళ్లు నడపాలని, రైళ్లు ఫ్రీక్వెన్సీ మరింత పెంచాలని, అదనపు ప్లాట్‌ఫారాలను నిర్మించాలని ప్రతినిధులు కోరారు. వీటికి స్పందించిన డీఆర్ఎం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను అందించడంలో భారతీయ రైల్వే నిరంతర కృషి చేస్తుందని తెలిపారు. -
ఉచిత సీట్ల కేటాయింపులో ‘ప్రైవేటు’ నిర్లక్ష్యం
శ్రీ ప్రకాష్ స్కూల్ ఎదుట తల్లిదండ్రుల నిరసన కొమ్మాది: జీవీఎంసీ 4వ వార్డు కాపులుప్పాడ ప్రాంతంలోని శ్రీ ప్రకాష్ పాఠశాలలో ఉచిత సీట్ల కేటాయింపులో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ.. మంగళవారం ఆ స్కూల్ ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కేటాయించిన ఉచిత సీట్లను మంజూరు చేయడంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. మొదటి విడతలో 8 మంది, రెండవ విడతలో 5 గురు విద్యార్థులకు శ్రీప్రకాష్ పాఠశాలలో ఉచిత ప్రవేశాలకు ప్రభుత్వం సీట్లు కేటాయించింది. మే 29న తమ పిల్లలకు సీట్లు వచ్చిన వెంటనే తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి సీట్లు కేటాయించకపోవడంతో దాదాపు నెల రోజులుగా పాఠశాల చుట్టూ తిరుగుతున్నామని తల్లిదండ్రులు వాపోయారు. ఈ విషయంపై డీఈవో, ఎంఈవో కార్యాలయాలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తాము ఆందోళనకు దిగినట్లు తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో తరగతులు ప్రారంభమై, అడ్మిషన్లు పూర్తయిన తరుణంలో ఉచిత సీట్లు లేవని చేతులెత్తేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పాఠశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా.. వారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఆందోళన సమాచారం అందుకున్న డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు, ఎంఈవో శివరాణి పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులకు ఉచిత సీట్లు అందిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. -
ఏయూలో ఆస్ట్రేలియా కార్నర్?
మద్దిలపాలెం: యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన ప్రతినిధుల బృందం మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీని సందర్శించింది. ఈ సందర్భంగా ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్‌తో వారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి ఇంజినీరింగ్ కోర్సులను సంయుక్తంగా నిర్వహించడంపై ప్రాథమిక చర్చలు జరిపారు. అదేవిధంగా ఏయూ ప్రాంగణంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా కార్నర్ ఏర్పాటు చేసే దిశగా కూడా చర్చలు సాగాయి. సంయుక్త కోర్సుల నిర్వహణకు అవసరమైన విధివిధానాలు, నియమావళిని రూపొందించిన తర్వాత మరోసారి చర్చలు జరపాలని ఇరువర్గాలు నిర్ణయించాయి. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయ్‌రావు, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా గ్లోబల్ గ్రోత్ అండ్ అడ్వకసీ విభాగం డైరెక్టర్ నషీద్ చౌదరి, గ్లోబల్ ఎంగేజ్మెంట్ మేనేజర్ బ్రోడెరిక్ మైకోప్, ఏయూ ఆర్ అండ్ డీ విభాగం డీన్ ఆచార్య వి.వల్లికుమారి, ఆచార్య డి.లలిత భాస్కర్ పాల్గొన్నారు. -
మరణించి.. మరో ఇద్దరికి వెలుగునిచ్చి..
పెందుర్తి: మరణంలోనూ ఓ ‘అమ్మ’ఇద్దరికి కంటి వెలుగునిచ్చింది. పెందుర్తి మండలం చింతలగ్రహారం గ్రామానికి చెందిన బీశెట్టి కనకమ్మ(52) అక్కయ్యపాలెం రైతుబజార్లో ఆకుకూరలు విక్రయిస్తుంటుంది. మంగళవారం ఉదయం రైతుబజార్‌కు వెళ్లిన కనకమ్మకు గుండెపోటు వచ్చింది. వెంటనే తోటి రైతులు స్పందించి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం మరణించింది. కనకమ్మ మృతదేహాన్ని చింతలగ్రహారానికి తరలించారు. ఈ క్రమంలో మృతురాలి బంధువు సంతోష్ ద్వారా సమాచారం అందుకున్న పెందుర్తి సాయి హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ కనకమ్మ కుమారులు జగదీష్, ఈశ్వరరావులను నేత్రదానానికి ఒప్పించారు. వారు అంగీకారం తెలపడంతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి చెందిన మొహిషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు కనకమ్మ కార్నియాలను సేకరించారు. తల్లి మృతి చెందిన దుఃఖంలోనూ కుమారులు ఇద్దరూ చూపిన మానవత్వానికి గ్రామస్తులు ప్రశంసించారు. -
గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నేడు
సబ్బవరం: విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీకి బుధవారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాల సమన్వయాధికారి ఎన్. రామకృష్ణ తెలిపారు. బాలికలకు అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలోని బి.ఆర్.అంబేడ్కర్ గురుకులంలో, బాలురకు విశాఖ జిల్లా శ్రీకృష్ణాపురంలోని బి.ఆర్.అంబేడ్కర్ గురుకులంలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 6, 7వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, 8, 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సమన్వయాధికారి రామకృష్ణ సూచించారు. -
అదివో జగన్నాథుడు.. అల్లదివో రథోత్సవం..
8లో2025లో ఏయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారిలో పట్టుమని 20 శాతం మందికి కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లేని పరిస్థితి. ఆఫ్–క్యాంపస్‌లో గాయత్రీ కాలేజీకి వెళ్లి అక్కడ సెలక్షన్స్‌లో 20 మంది ఏయూ విద్యార్థులు టీసీఎస్‌లో ఉద్యోగం సంపాదించుకున్నారు. ఈ ఏడాది వచ్చిన అత్యధిక ప్యాకేజీ రూ.12 లక్షలు! 2023 మే 1వ తేదీన బీచ్‌రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ‘అచీవర్స్ డే’ ఘనంగా నిర్వహించి 1,001 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆఫర్ లెటర్స్‌ను అందించారు. ఆ ఏడాది వచ్చిన అత్యధిక ప్యాకేజీ రూ.84.5 లక్షలు! ఇదీ గత ప్రభుత్వ హయాంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు... కూటమి ప్రభుత్వంలో ఏయూలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు మధ్య ఉన్న తేడా. -
ఏయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ కష్టాలు
ఈ అమ్మాయి పేరు రేపాక ఈశ్వరి. 2022–23 విద్యా సంవత్సరంలో ఏయూలో సీఎస్ పూర్తి చేసిన ఈ అమ్మాయికి అట్లాసియన్ కంపెనీలో రూ.84.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. ఆఫర్ లెటర్‌ను అప్పటి ఏయూ వీసీ ప్రసాదరెడ్డి అందించారు. ఆ ఏడాది ఈ అమ్మాయికే కాదు 1,001 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఆఫర్ లెటర్స్ అందించారు. ఆంధ్రా యూనివర్సిటీలో నారాయణ (పేరు మార్చాం) అనే విద్యార్థి 2024–25 విద్యా సంవత్సరంలో బీటెక్ (సీఎస్) పూర్తి చేశాడు. ప్రముఖ కంపెనీలేవీ ప్లేస్‌మెంట్స్ కోసం రాకపోవడంతో గాయత్రీ కాలేజీలో జరిగే ఆఫ్–క్యాంపస్ సెలక్షన్స్‌కు వెళ్లి టీసీఎస్‌లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఈ విధంగా ఒక్క నారాయణే కాదు 20 మంది ఏయూ విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. -
ఉద్రిక్తత నడుమ ‘ఎంటీఎస్’ కౌన్సెలింగ్
ఆరిలోవ: మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లకు మంగళవారం ఆందోళనల నడుమ కౌన్సెలింగ్ జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖాళీలను చూపించి బదిలీ ప్రక్రియ చేపడుతున్నారని, తమను మైదాన ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారులు వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కౌన్సెలింగ్‌కు ఎవరూ హాజరు కావద్దని ఎంటీఎస్ ఉపాధ్యాయులు మరోసారి డీఈవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన జరుగుతుండగానే 1998, 2008 డీఎస్సీ బ్యాచ్‌లకు చెందిన కొందరు ఉపాధ్యాయులు ‘మేం కౌన్సెలింగ్‌కు హాజరవుతాం’ అంటూ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో మిగిలిన వారు వారిని అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్ ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డీఈవో కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడంతో అధికారులు సుమారు 50 మందికి పైగా ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మిగిలిన వారు బుధవారం జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. ఇదిలావుండగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం విశాఖ ఎంపీ శ్రీభరత్, ఇతర ఎమ్మెల్యేలను కలవనున్నట్లు ఎంటీఎస్ ఉపాధ్యాయ యూనియన్ నాయకులు తెలిపారు. -
లోక్ అదాలత్‌తో తక్షణ పరిష్కారం
విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజా విశాఖ లీగల్ : న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులను రాజీ చేసుకోవడానికి మెగా లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజా కోరారు. జూలై 5వ తేదీన జరిగే మెగా లోక్ అదాలత్ విజయవంతం చేసే దిశగా అధికారులు, పోలీసు యంత్రాంగం, బీమా కంపెనీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, బ్యాంక్ అధికారులు, వివిధ కంపెనీల న్యాయ సలహాదారులతో ఆయన మంగళవారం నూతన న్యాయస్థానాల సముదాయంలోని సమావేశంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా లోక్ అదాలత్ విజయవంతం చేయాలన్నారు. బీమా కంపెనీలు, పోర్ట్ ట్రస్టు, స్టీల్ ప్లాంట్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, రాజీ కాగలిగిన క్రిమినల్ కేసులు రాజీ చేసుకోవాలన్నారు. రాజీమార్గమే రాజీమార్గమన్నారు. కార్యక్రమంలో కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి రాధారత్నం, రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి సి.కె.గాయత్రి, లోక్ అదాలత్ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, నగర పోలీస్ నేర విభాగం డిప్యూటీ పోలీసు అధికారి మాధవీలత, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, వివిధ కంపెనీల న్యాయ సహాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
సరదాతో పాటు మొక్కు
పురాణ పురుషుల వేషాలు ధరించడం వెనుక మొక్కు, సరదా, ఆనందం దాగి ఉంది. పూర్వం నుంచి మా గ్రామంలో వస్తున్న ఆనవాయితీ. –షిణగం అప్పలస్వామి, ముని వేషధారి మా గ్రామానికే పరిమితం మా గ్రామంలో తప్ప ఇంకా ఎక్కడా ఈ వేషాలు కట్టం. కొందరు మాత్రం బయట గ్రామాలకు వెళ్తుంటారు. మేకప్, అలంకరణ ఖర్చులు భరిస్తుంటారు. – షిణగం అప్పలరాజు, చిత్రగుప్తుడు వేషధారి -
వేట సాఫీగా సాగాలని.. గంగమ్మకు పూజలు
మహారాణిపేట: ‘గంగమ్మ తల్లీ కాపాడు’అంటూ మత్స్యకార మహిళలు సముద్రుడికి భక్తితో ప్రణమిల్లారు. చేపల వేటలో తమ వారికి విస్తారంగా మత్స్య సంపద దొరకాలని, వేటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ మంగళవారం ఫిషింగ్ హార్బర్లో గంగమ్మ మారువారం పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీ గంగా భవానీ చేపల వేట సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుక కనులపండువగా సాగింది. ఇందులో భాగంగా హార్బర్లోని గంగమ్మ తల్లి ఆలయంలో మహిళలు పెద్ద సంఖ్యలో పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం డ్రై ఫిష్ మహిళా సంఘం సభ్యులు, ఇతర మహిళలు కలశాలతో ఊరేగింపుగా బయలుదేరి సముద్రుడికి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కులు చెల్లించారు. మరపడవల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.సి.అప్పారావు, అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు, నాయకులు మున్నం బాలాజీ, ఎం.సోములమ్మ, డి.ఎర్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం
సింధియా: ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్.. హైడ్రోగ్రఫీ ప్రాముఖ్యతను వివరించారు. ఇటీవల అత్యాధునిక సర్వే నౌకలను ప్రారంభించిన రెండు రాష్ట్రాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో గీతం, ఆంధ్ర విశ్వవిద్యాలయాలు, వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (విస్టమ్), నేవీ చిల్డ్రన్స్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు కలిపి మొత్తం 300 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరు నావికాదళంలోని వివిధ నౌకలు, హైడ్రోగ్రాఫిక్ సర్వే యూనిట్లు, నావల్ చార్ట్ డిపోలను సందర్శించారు. సముద్ర గర్భ డేటాను సేకరించే అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ పరికరాలను, అవి సముద్ర, జాతీయ భద్రతకు ఏ విధంగా ఉపయోగపడతాయో నౌక సిబ్బంది విద్యార్థులకు వివరించారు. అనంతరం కమొడోర్ ఎ.మురళీధర్ నావికాదళ సిబ్బందికి హైడ్రోగ్రఫీ, సముద్ర సరిహద్దులపై అవగాహన కల్పించారు. విదేశీ సహకార సర్వేల ద్వారా హిందూ మహాసముద్రంలో భారత నావికాదళ హైడ్రోగ్రాఫిక్ కార్యకలాపాల పరిధిని విస్తరించినట్లు నేవీ వర్గాలు ఈ సందర్భంగా వెల్లడించాయి. -
ఈ ఏడాది 60 మంది ముందుకు..
పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి మొక్కుకునేవారు ఈ వేషాలు వేయడానికి ముందుకు వస్తారు. అభినయం అక్కరలేకపోయినప్పటికీ కేవలం వేషం ద్వారా గ్రామస్తులు, బంధువులను మెప్పిస్తుంటారు. వేసిన పౌరాణిక పాత్రలో ఒదిగిపోతారు. కళాకారులు ఎక్కువైతే పలువురు ఒకే పాత్రలో అలరిస్తుంటారు. ఈ ఏడాది ముచ్చర్ల ఉత్సవ కమిటీ ఈ నేలవేషాలకు రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తుంది. ఎండ్లబండ్ల స్థానంలో ట్రాక్టర్లు ప్రవేశించినా గత వైభవానికి తగ్గకుండా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం జరిగిన అనుపోత్సవంలో 60 మంది వరకు నేలవేషగాళ్లు అలరించారు. వీరిని చూడటానికే చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ముచ్చర్ల తరలివచ్చారు. ● -
సింహాద్రిపురం దొంగతనం కేసు ఛేదన
రూ. 9.25 లక్షల బంగారం రికవరీ ఎంవీపీకాలనీ: సింహాద్రిపురంలో జరిగిన దొంగతనం కేసును ఎంవీపీకాలనీ క్రైం పోలీసులు ఛేదించారు. రూ.9.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. మంగళవారం ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో ద్వారకా జోన్ క్రైం ఏసీపీ లక్ష్మణరావు ఈ వివరాలను వెల్లడించారు. రామభక్త రామలక్ష్మి తన కుటుంబ సభ్యులతో కలిసి సింహాద్రిపురం స్టీల్‌ప్లాంట్ క్వార్టర్స్‌లో నివాసముంటోంది. ఈ ఏడాది ఏప్రిల్ 24న ఓ ఫంక్షన్‌కు వెళ్లేందుకు సిద్దమవుతున్న తరుణంలో ఇంట్లోని బీరువా తెరచి చూడగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. దొంగతనం జరిగిందని గుర్తించి, ఆమె ఎంవీపీ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ద్వారకా క్రైం సీఐ చక్రధర్‌రావు, ఎంవీపీ క్రైం ఎస్ఐ అప్పలరాజు, ఏఎస్ఐ కిశోర్‌బాబు తదితరులతో కూడిన బృందం రెండు నెలలపాటు దర్యాప్తు చేపట్టింది. ఎట్టకేలకు ఈ కేసును ఛేదించి, రామలక్ష్మి ఇంటికి సమీపంలోనే నివాసముంటున్న కనకాల భవానీ మరో ఇద్దరు మైనర్లతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. రామలక్ష్మి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాను పరిశీలించగా, ఇద్దరు మైనర్లు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు కనిపించింది. వారిని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా.. భవానీ ప్రమేయం వెలుగులోకి వచ్చింది. మహిళా పోలీసులు తమదైన శైలిలో భవానీని విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఆమె నుంచి రూ. 9.25 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను (45 తులాల బంగారు హారం, ఉంగరం, పాపిడిబిళ్ల) పోలీసులు రికవరీ చేశారు. కేసును ఛేదించిన బృందాన్ని క్రైం ఏసీపీ లక్ష్మణరావు అభినందించారు. సమావేశంలో సీఐ చక్రధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
పెదగాడి సర్పంచ్ భర్తపై దాడి!
జనసేన నాయకులపై పోలీసులకు ఫిర్యాదు పెందుర్తి: తనపై జనసేన నాయకులు దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నం చేశారని పెదగాడి సర్పంచ్ కేసుబోయిన లావణ్య భర్త కేసుబోయిన త్రినాథ్ పెందుర్తి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. తనకు చెందిన లేఅవుట్లోని ప్లాట్‌లోకి అక్రమంగా చొరబడిన జనసేన నాయకులను అడ్డుకున్నందుకు తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో తనను తీవ్రంగా గాయపరిచిన జనసేన నాయకులు నీటిపల్లి రమేష్, గళ్లా అప్పలరాజు సహా వారి అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఇక్కడి సర్వే నంబర్ 96/3లోని లేఅవుట్లో ఓ ప్లాట్ విషయంలో కొద్ది రోజులుగా సర్పంచ్ లావణ్య భర్త త్రినాథ్, జనసేన నాయకుల మధ్య తగాదా ఉంది. దీనిపై ఇరుపక్షాల ఫిర్యాదుల మేరకు రెండు రోజుల కిందట కేసులు నమోదు చేసినట్లు సీఐ కె.వి.సతీష్‌కుమార్ తెలిపారు. తాజాగా వివాదంపై కూడా సమగ్ర విచారణ చేపడతామని సీఐ వెల్లడించారు. -
20 ఏళ్ల నరకానికి తెర
అరుదైన శస్త్రచికిత్సతో యువకుడికి పునర్జన్మ! మహారాణిపేట: వెన్నెముక లోపంతో ఇరవై ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న ఓ యువకుడికి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో కొత్త జీవితాన్ని ప్రసాదించారు. మూత్ర విసర్జనపై నియంత్రణ లేకపోవడం, మూత్రం లీకేజీ కారణంగా తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న అతనికి శస్త్రచికిత్స చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ కుచ్చర్లపాటి అభిరామ్ వెల్లడించారు. పాడిరైతు కుటుంబానికి చెందిన 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థి పుట్టుకతోనే ‘స్పైనల్ మైలోమెనింగోసీల్’అనే వెన్నెముక సమస్యతో బాధపడుతున్నా డు. దీని వల్ల నరాలు దెబ్బతిని, మూత్రాశయం పూర్తిగా కుచించుకుపోయింది. ఫలితంగా అతడు సొంతంగా మూత్ర విసర్జన చేయలేని దుస్థితి ఏర్పడింది. నిరంతరం మూత్రం లీకవుతుండటంతో నలుగురిలోకి వెళ్లలేక తీవ్రమైన మానసిక వేదన అనుభవించేవాడు. ఈ సమస్య అతని కిడ్నీలను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ఈ సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపేందుకు కిమ్స్ ఐకాన్ యూరాలజిస్టులు డాక్టర్ పి.మురళీకృష్ణ, డాక్టర్ కె.అభిరామ్, డాక్టర్ కె. సందీప్ రెడ్డిల బృందం ముందుకొచ్చింది. రెండు దశల పునర్నిర్మాణ శస్త్రచికిత్సకు ప్రణాళిక రచించారు. మొదటి దశలో రోగి పేగులోని కొంత భాగాన్ని తీసుకుని, కుచించుకుపోయిన మూత్రాశయాన్ని విస్తరించారు. రెండో దశలో కాలువ ద్వా రా రోగి ఒక సన్నని క్యాథెటర్ ట్యూబు సహాయంతో తనకు తానుగా, పూర్తి నియంత్రణతో మూత్ర విసర్జన చేయగలుగుతున్నాడు. శస్త్రచికిత్స అనంతరం యువకుడి జీవితం పూర్తిగా మారిపోయింది. మూత్రం లీకేజీ సమస్య పూర్తిగా ఆగిపోయింది. దెబ్బతిన్న కిడ్నీల పనితీరు మెరుగుపడి, సాధారణ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు అతను రోజుకు మూడు, నాలుగు సార్లు సులభంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మూత్ర విసర్జన చేసుకోగలుగుతున్నాడు. సామాజికంగా తలదాచుకోవాల్సిన అవసరం లేకుండా, తోటి వారితో కలిసి సాధారణ జీవితం గడుపుతున్నాడని డాక్టర్ అభిరామ్ తెలిపారు. -
అదివో జగన్నాథుడు.. అల్లదివో రథోత్సవం
డాబాగార్డెన్స్: నగరంలో ఈ నెల 27న అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర జరగనుంది. టౌన్‌కొత్తరోడ్డులోని జగన్నాథస్వామి ఆలయంతో పాటు సాగర్‌నగర్‌లోని ఇస్కాన్ టెంపుల్, హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఈ వేడుకల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. టౌన్ కొత్తరోడ్డులో.. టౌన్‌కొత్తరోడ్డులో వెలసిన జగన్నాథస్వామి ఆలయంలో ఈ నెల 24 నుంచి జూలై 8 వరకు రథయాత్ర మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఈవో టి.రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. ఆలయ అర్చకులు పాణంగిపల్లి జగన్నాథాచార్యులు, రంగనాథాచార్యులు, కేశవాచార్యులు, యేడిద సురేష్‌బాబుతో కలిసి మంగళవారం రథయాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. కాగా.. మంగళవారం సాయంత్రం ప్రతిష్టా ప్రారంభ సంకల్పంతో ఉత్సవాలు మొదలయ్యాయి. బుధవారం ఉదయం జలాధివాసములు, క్షీరాధివాసములు, రాత్రి విశేష హోమాలు, పంచశయ్యాది వాసములు, 26న ఉదయం పూర్ణాహుతి నేత్రోత్సవం, సాయంత్రం 6.30 గంటలకు ధ్వజారోహణం, సుభద్రాదేవి శాంతి కల్యాణం జరపనున్నారు. 27న ఉదయం 9.10 గంటలకు స్వామిని రథంపైకి ఆహ్వానిస్తారు. సాయంత్రం 5 గంటలకు జగన్నాథస్వామి తొలి రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది. 28 నుంచి జూలై 6 వరకు టర్నర్ చౌల్ట్రీ కల్యాణ మండపంలో స్వామి దశావతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 7న ఉదయం 9.45 గంటలకు స్వామి తిరుగు రథయాత్ర నిర్వహిస్తారు. 8న ఉదయం సంప్రోక్షణ, పీఠారోహణం అనంతరం స్వామిని యథాస్థానంలో ప్రతిష్టిస్తారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో.. నగరంలో ఈ నెల 27న ఇస్కాన్ ఆధ్వర్యంలో 18వ జగన్నాథ రథయాత్ర వైభవంగా జరగనుంది. పూరీ జగన్నాథస్వామి రథయాత్ర పద్ధతిలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఇస్కాన్ విశాఖ శాఖ అధ్యక్షుడు సాంబదాస్, నితాయి సేవినీ మాతాజీ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఓ హోటల్లో రథయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. ఏటా మాదిరి గానే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల కోసం మూడు వేర్వేరు రథాలను సిద్ధం చేశారు. శ్రీల ప్రభుపాదుల విగ్రహాన్ని ఒక చిన్న రథంపై ఉంచి ఊరేగిస్తారు. ఒడిశాలోని పిప్పిలి నుంచి ప్రత్యేక అలంకరణ సామగ్రిని తెప్పించారు. 37 అడుగుల ఎత్తైన రథ గోపురాలు ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ఎత్తును తగ్గించుకునే, పెంచుకునే వెసులుబాటు కలిగి ఉండటం విశేషం. 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు పాతజైలు రోడ్డులోని విశాఖ ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా ఉన్న పార్కింగ్ ఏరియా నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎల్ఐసీ అంబేడ్కర్ కూడలి, డాబాగార్డెన్స్, ప్రెస్‌క్లబ్ జంక్షన్, ప్రకాశరావుపేట జంక్షన్ మీదుగా జగదాంబ జంక్షన్‌కు చేరుకుని, అక్కడి నుంచి వాల్తేర్ అప్రోడ్డు మీదుగా సిరిపురం జంక్షన్, గురజాడ కళాక్షేత్రం వరకు రథయాత్ర సాగుతుంది. రథయాత్ర పొడవునా రాష్ట్రం నలుమూలల నుంచి, బెంగాల్, ఒడిశా నుంచి వచ్చిన భక్తుల నృత్య కీర్తనలు, కోలాటాలు ప్రదర్శించి రథయాత్రకు శోభను చేకూర్చనున్నారు. గురజాడ కళాక్షేత్రం చేరుకున్న తర్వాత స్వామి వారి లీలా విశేషాలను వివరించి, భక్తులు ప్రేమతో సిద్ధం చేసిన 1008 రకాల ప్రత్యేక వంటకాలను స్వామికి సమర్పిస్తారని సాంబదాస్ వివరించారు. హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో.. హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 27న జగన్నాథ స్వామి రథయాత్రను వైభవంగా నిర్వహించనున్నారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం హరేకృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి యదురాజ దాస ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 27 సాయంత్రం 5 గంటలకు సంప్రదాయ పద్ధతిలో ఎంవీపీ కాలనీలోని ఐఐఏఎం కళాశాల నుంచి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎంవీపీ డబుల్ రోడ్డు, ఇసుకతోట జాతీయ రహదారి, వెంకోజీపాలెం, క్యాన్సర్ హాస్పిటల్, బీచ్ రోడ్డు, అప్పుఘర్ మీదుగా తిరిగి ఐఐఏఎం కళాశాల వరకు యాత్ర సాగుతుంది. ఈ ఉత్సవం జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రల దివ్య ప్రయాణాన్ని గుర్తు చేస్తుందని, భారతీయ సంస్కృతిలో పాతుకుపోయిన ఈ కార్యక్రమం సార్వత్రిక సౌభ్రాతృత్వం, ప్రేమ, భక్తిని సూచిస్తుందని యదురాజ దాస తెలిపారు. రథయాత్రలో ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. డాక్టర్ నిష్క్రించిన భక్త దాస అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. 27న జగన్నాథ స్వామి రథయాత్ర దేవదాయ శాఖ, ఇస్కాన్, హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు -
క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదు
పరవాడ: లంకెలపాలెం కూడలిలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 10 మంది క్షతగాత్రులు నగరంలోని కేజీహెచ్, కిమ్స్ తదితర ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారని పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు చెప్పారు. ప్రస్తుతం గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. రోడ్డు ప్రమాదంలో అనకాపల్లికి చెందిన కొణతాల అచ్చెంనాయుడు, రేబాకకు చెందిన పచ్చికూర గాంధీ, ఫార్మా ఉద్యోగి ఎర్రప్పడు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి మృతదేహలకు మంగళవారం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన తీరుపై అన్ని కోణాల్లో విచారణ జరిపి.. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంట్లోకి చొరబడి యువతి, ఆమె తల్లిని కొట్టిన వైనం తగరపువలస: వివాహ బంధంలోకి అడుగు పెట్టకముందే కట్నం వేధింపులకు పాల్పడి.. ఏకంగా ఇంట్లోకి చొరబడి తల్లీకూతుళ్లపై దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. విజయనగరానికి చెందిన ముల్లు సాయి కిశోర్ మంగళవారం రాత్రి జీవీఎంసీ భీమిలి జోన్ రెండో వార్డు జీరుపేటలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. నెల రోజుల కిందట సాయి కిశోర్‌కు ఆ గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి రూ.6 లక్షల కట్నం డబ్బులు ఇవ్వాలని సాయికిశోర్తో పాటు అతని కుటుంబ సభ్యులు యువతిని వేధించడం మొదలుపెట్టారు. తరచూ ఖర్చులకు డబ్బులు కావాలని డిమాండ్ చేశా రు. ఆమె క్రెడిట్ కార్డును కూడా కిశోర్ వాడేశాడు. ఈ వేధింపులు తారస్థాయికి చేరడంతో అమ్మాయి తరపు కుటుంబం నిందితుడి నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే మంగళవారం రాత్రి సాయి కిశోర్.. విజయనగరానికి చెందిన తన స్నేహితులైన కోరాడ హరనాథ్, చెల్లూరు పవన్‌కుమార్, తాళాడ శ్రవణ్‌లను కారులో వెంటబెట్టుకుని జీరుపేటలోని ఆమె ఇంటికి వచ్చాడు. దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి తల్లి, కూతుళ్లను జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టాడు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా సాయి కిశోర్.. యువతి తల్లి మెడలో ఉన్న బంగారు హారాన్ని లాక్కొని కారుతో పరారయ్యాడు. గ్రామ స్తులు మిగిలిన ముగ్గురిని పట్టుకుని భీమిలి పోలీసులకు అప్పగించారు. బుధవారం ఉదయం స్టేషన్‌కు రావాలని ఇరువర్గాలను పోలీసులు ఆదేశించారు. పెళ్లికి ముందే దారుణం -
నేలవేషాలు C/o ముచ్చర్ల
తగరపువలస : గ్రామదేవతల ఉత్సవాలు, వినాయక నిమజ్జనం, శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రముఖంగా కనిపించే నేలవేషాలు ప్రస్తుతం దాదాపు కనుమరుగైపోయాయి. అప్పట్లో పురాణ పురుషుల వేషాలు కట్టిన కళాకారులను దేవుని ముందు ఊరేగింపుగా ఎడ్లబండ్లపై తీసుకువెళ్లేవారు. వాళ్లను కూడా ప్రజలు భక్తిభావంతో చూసేవారు. ప్రస్తుతం నేలవేషాల స్థానంలో డీజే, కోలాటం, కాళికా నృత్యాలు వంటివి ప్రదర్శిస్తున్నారు. గ్రామాల్లో ఎడ్ల బండ్లు కూడా కనిపించకుండా పోయాయి. ఆనందపురం మండలం ముచ్చర్ల పంచాయతీవాసులు మాత్రం ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. గ్రామదేవత బంగారమ్మ పండగలో చిన్నారులు మొదలుకుని యువకుల వరకు రామాయణం, మహాభారతం, భాగవతంలో పాత్రలతో పాటు అమ్మవార్లు, చాకలి తిప్పడు, షావుకారు, భైరవుడు, చిత్రగుప్తుడు తదితర వేషాలతో అలరిస్తున్నారు. అనకాపల్లి నుంచి మేకప్ కళాకారులు, డ్రస్సులు, కిరీటాలు, మేకప్ కిట్లు పట్టుకుని వచ్చారు. ఒక్కో నేలవేషానికి అలంకరణ బట్టి మేకప్‌తో కలిపి రూ.1000 నుంచి రూ.2000 ఖర్చు అవుతుంది. దీనిని ఉత్సవ కమిటీయే భరిస్తుంది. -
విశాఖ ఉక్కుకు కూటమి సర్కార్ వెన్నుపోటు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కుకు కూటమి సర్కార్ వెన్నుపోటు పొడుస్తూ.. ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. స్టీల్ ప్లాంట్‌లో రెండు విభాగాలు ప్రైవేటు పరం చేసేందుకు నిర్ణయించింది. రా మెటీరియల్ హ్యాండ్లింగ్, సింటర్ ప్లాంట్లను ప్రైవేటపరం చేసేందుకు రంగం సిద్ధమైంది. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం దరఖాస్తులకు ఆహ్వానించింది ఇప్పటికే పలు అనుబంధ విభాగాలను ప్రభుత్వం అమ్మేసింది.స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని చెప్పిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ నోరెత్తడం లేదు. కూటమి ప్రభుత్వ వైఖరిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపకపోగా అనుబంధ విభాగాల ప్రైవేటుపరం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
లంకెలపాలెం జంక్షన్లో ఘోర ప్రమాదం
పరవాడ/అనకాపల్లి టౌన్ : లంకెలపాలెం ప్రధాన జంక్షన్లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాజువాక నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న మార్కెట్ లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. ఫార్మాసిటీలో విధులు ముగించుకుని వస్తున్న ఉద్యోగుల కారును ఢీకొనగా అందులో ఉన్న ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. అనంతరం ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా.. దానిపై ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలపాలయ్యాడు. తరువాత బొలేరా వాహనం, కంటైనర్, మరో రెండు ద్విచక్రవాహనాలను ఢీకొనగా ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో అనకాపల్లికి చెందిన కొణతాల అచ్చన్నాయుడు (52), అనకాపల్లి మండలం రేబాకకు చెందిన పచ్చికూర గాంధీ (47), అగనంపూడికి చెందిన ఫార్మా ఉద్యోగి ఎర్రప్పడు (35) ఉన్నారు. మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రుల్లో చేర్పించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. -
విశాఖలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకిన తల్లి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తు కారణంగా మరో కుటుంబం చిన్నాభిన్నమైంది. మద్యం సేవించి రోజు భార్య పిల్లలను భర్త పవన్ చితకబాదటంతో ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకింది.పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కుమారుడు మణికంఠ, తల్లి గీత మృతి చెందగా.. కుమార్తె యొక్షితని స్థానికులు కాపాడారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎంటీఎస్ టీచర్స్ ఆగ్రహం
బీచ్‌రోడ్డు: మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లు తమకు నివాస స్థలాలకు దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కనీస వేతనంపై సేవలు అందిస్తున్న తమకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సొంత ప్రాంతాలకు దగ్గరలోనే పోస్టింగ్ ఇవ్వాలని పేర్కొన్న జీవో నంబర్ 39ను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందని టీచర్లు ఆరోపించారు. అతి తక్కువ వేతనంతో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న తమ పట్ల కూటమి ప్రభుత్వం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. జీవో 39కు విరుద్ధంగా 60–70 కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్ ఇవ్వడం దారుణమన్నారు. అతి తక్కువ జీతంతో అంతదూరం వెళ్లి పనిచేయలేమని, తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో పోస్టింగ్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఎంటీఎస్ టీచర్లు హెచ్చరించారు. -
ఏఎన్ఎంల ఆందోళన
మహారాణిపేట : పదోన్నతుల జాబితా ప్రకటించడంలో జరుగుతున్న ఆలసత్వాన్ని ఖండిస్తూ రేసపువానిపాలెంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ఏఎన్ఎంలు సోమవారం ఆందోళనకు దిగారు. యునైటెడ్ గ్రామ వార్డు హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అసోసియేషన్ నాయకురాలు పి.మణి మాట్లాడుతూ సచివాలయ ఏఎన్ఎంలకు పదోన్నతులు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, డీఎంహెచ్‌వో ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆరోపించారు. పదోన్నతుల విషయమై డీఎంహెచ్‌వోకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌వో వైఖరి వల్ల ఏఎన్ఎంలు తీవ్రంగా నష్టపోతున్నారని, తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఆందోళనకు దిగామని స్పష్టం చేశారు. అసోసియేషన్ రాష్ట్ర నాయకురాలు దేవకి మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఏఎన్ఎంల పదోన్నతుల ప్రక్రియ పూర్తయిందని, విశాఖలో మాత్రం జాబితాలు తయారు చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు రత్నం, పద్మ, కృష్ణవేణి, సుభాషిని, కుమారి, అలాగే యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు చుక్కల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయ ఉద్యోగుల నిరసన
బీచ్‌రోడ్డు : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఉద్యోగుల ఐక్య వేదిక జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాన సమస్యలతోపాటు, ఆర్థికేతర అంశాలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం 75వ శాఖగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ శాఖకు నేటికీ చట్టబద్ధత కల్పించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించి వదిలేసిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఈ అంశాన్ని క్యాబినెట్లో చర్చించలేదని విమర్శించారు. తమకు నిర్దిష్టమైన సర్వీస్ రూల్స్ లేవని, అలాగే పదోన్నతి మార్గం కూడా లేదని ఉద్యోగులు వాపోయారు. అన్ని ప్రభుత్వ శాఖల విధులు నిర్వర్తిస్తున్నా తమకు ప్రమోషన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగాలను రద్దు చేసి, ఎక్కడకు పంపిస్తారో చెప్పకుండానే బదిలీలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా మహిళా పోలీసులు బదిలీల వల్ల నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లు నిండని వారికి, కొత్తగా బదిలీపై వచ్చిన వారికి బదిలీ ఆప్షన్ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, తొమ్మిది నెలల ఎరియర్స్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలకు న్యాయం చేయకపోతే రానున్న రోజుల్లో నిరసనలను వివిధ రూపాల్లో కొనసాగిస్తామని, ప్రజా స్పందన కార్యక్రమాల్లోనూ తమ అర్జీలను ప్రభుత్వానికి తెలిసేలా సమర్పిస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. ‘ఉయ్ వాంట్ జస్టిస్’, ‘ప్రమోషన్ ఫస్ట్ – ట్రాన్స్ ఫర్ నెక్ట్స్ వంటి నినాదాలతో వారు ఆందోళనను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డు సచివాలయాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. -
వర్షంలోనూ యువత పోరులో భారీగా పాల్గొన్న నిరుద్యోగులు, విద్యార్థులు చంద్రబాబు, పవన్ అబద్ధపు హామీలపై పెల్లుబికిన యువత ఆగ్రహం జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఇప్పుడు జూన్ నెల ముగుస్తోంది కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా.. మూడు లక్షల మందిని తీసేశారు ఫీజు రీయింబ
మహారాణిపేట : కూటమి ప్రభుత్వ అబద్ధపు హామీలపై యువత కదం తొక్కింది. వర్షానికి సైతం వెరవకుండా గర్జించింది. పెల్లుబికిన యువ గర్జనను అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ చేసిన నినాదాలతో కలెక్టరేట్ జంక్షన్ మార్మోగిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన యువత పోరు కార్యక్రమం హోరెత్తిపోయింది. ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతిగా రూ.3 వేలు ఇస్తామని, ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని అమలు చేయకపోవడంపై వైఎస్సార్సీపీ యువత పోరు పేరుతో ఆందోళనకు పిలుపునిచ్చింది. దీనికి జిల్లాలో ఉన్న యువత, నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి భారీ స్పందన వచ్చింది. వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది నిరుద్యోగులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఒకవైపు వర్షం పడుతున్నా వెరవలేదు. భారీ సంఖ్యలో జనాలు రాకుండా పోలీసులు బారికేడ్లు, రోప్‌పార్టీలతో పద్మవ్యూహం పన్నినా వాటిని బద్దలు కొట్టుకుంటూ వచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల అబద్ధపు హామీలను ఎండగట్టారు. నిరుద్యోగ భృతి ఎక్కడంటూ నిగ్గదీసి అడిగారు. చంద్రబాబుది మేనిఫెస్టో కాదని, మాయఫెస్టో అని తూర్పారబెట్టారు. అడ్డుకోవడానికి ప్రయత్నించినా.. యువత పోరులో భాగంగా ముందుగా జిల్లా పరిషత్ నుంచి ర్యాలీ చేపట్టారు. ఉదయం నుంచి వర్షం పడుతున్నప్పటికీ.. ఈ నిరసన కార్యక్రమానికి భారీగా యువత, నిరుద్యోగులు వస్తుండడంతో వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. జెడ్పీ నుంచి కలెక్టరేట్ లైన్లో బారికేడ్లు, రోప్ పార్టీలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు తప్పించుకుంటూ కలెక్టర్ వరకు ప్రభుత్వానికి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఎస్సార్సీపీ నేతలతో కలిసి ర్యాలీగా తరలివచ్చారు. కూటమి ప్రభుత్వంలో ముగ్గురికే జాబ్‌లు వచ్చాయి.. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎంగా చంద్రబాబుకు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌కు, మంత్రిగా లోకేష్‌లకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా.. 2.6 లక్షల మంది వలంటీర్లను, ఎండీయూ వాహనాల్లో పనిచేసే 20 వేల మందిని, లిక్కర్ షాపుల్లో పనిచేసే 15 వేల మందిని తొలగించి వారి పొట్టకొట్టిందని గుర్తు చేశారు. జనసేన ప్లీనరీలో ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువత స్వయం ఉపాధికి ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు ఇస్తామని చెప్పిన పవన్ కల్యాణ్ ఒక్కరికి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా ఇవ్వలేదన్నారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని లోకేష్ హామీ ఇచ్చారని, ఇప్పుడు జూన్ కూడా దాటిపోతోందని, జాబ్ క్యాలెండర్ ఎక్కడని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. అనంతరం డీఆర్వో భవానీ శంకర్‌కు వినతిపత్రం అంజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు, నియోజకవర్గ సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, మళ్ల విజయ్‌ప్రసాద్, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్, యువజన విభాగం ఆధికార ప్రతినిధి మహ్మద్ ఇమ్రాన్, యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొండా రెడ్డి, నాగేంద్ర, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర మాజీ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కువ మంది వచ్చారని కేసు అల్లిపురం : వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన యువత పోరుకు అనుమతి కంటే ఎక్కువ మంది హాజరయ్యారని.. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు మహారాణిపేట సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పబ్లిక్ సర్వెంట్ విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు, దాడి చేసినందుకు సెక్షన్ 132, 121(1), ఎక్కువ మంది గుమిగూడినందుకు 189(2), 191(2), 190 బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
పాము కాటుతో స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి మృతి
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ టౌన్షిప్ క్వార్టర్లో నిద్రిస్తున్న ఉద్యోగిని పాము కాటు వేయడంతో మృతి చెందాడు. స్టీల్‌ప్లాంట్ ట్రాఫిక్ విభాగం జనరల్ ఫోర్‌మెన్ తగరంపూడి శ్రీనివాస్(59) టౌన్షిప్లో సెక్టార్–11 గ్రౌండ్ క్వార్టర్లో కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఆయన హాల్లో పడుకున్నాడు. తెల్లవారు సమయంలో పాము కుట్టినట్టు తెలిసింది. నిద్రిస్తున్న కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదని ఆయన ఒక్కరే ఉక్కు జనరల్ ఆస్పత్రిలోని క్యాజువాల్టీకి వెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి నగరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని ఉక్కు ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. స్నేక్ క్యాచర్ కిరణ్ మార్చురీలోని మృతదేహాన్ని పరిశీలించి పాము కాటు అని నిర్ధారించారు. శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరు విదేశాల్లో ఉన్నారు. స్టీల్‌ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్జీలు స్వీకరించిన మేయర్
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా సాగింది. మేయర్ పీలా శ్రీనివాసరావు, అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తితో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 77 ఫిర్యాదులు అందాయి. వాటిలో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 49, ఇంజినీరింగ్ విభాగానికి 10, జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 4, రెవెన్యూ విభాగానికి 6, ప్రజారోగ్య విభాగానికి 4, మొక్కల విభాగానికి 1, యూసీడీకి 3 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అధికారులు స్వీకరించిన అర్జీలు, ఫిర్యాదులను ప్రతిరోజూ పరిశీలిస్తూ, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అదనపు కమిషనర్ రమణమూర్తి ఆదేశించారు. ప్రజలు ఒకే సమస్యపై మళ్లీ మళ్లీ ఫిర్యాదు చేయడానికి రాకుండా, వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
వీధి విక్రయదారుల నిరసన
బీచ్‌రోడ్డు: వీధి విక్రయదారుల చట్టం, 2014లోని 39 సెక్షన్లు, 18 సౌకర్యాలతో కూడిన నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డి వేంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేంకటేశ్వరరావు మాట్లాడుతూ, వీధి విక్రయదారుల సంక్షేమం కోసం సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, మెమోలను జీవీఎంసీ అధికార యంత్రాంగం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. 2013 నుంచి 2025 వరకు జరిగిన ఆర్థిక అవినీతిపై, ఫైళ్ల తారుమారుపై జిల్లా కలెక్టర్‌తో సహా జీవీఎంసీ అధికార యంత్రాంగంపై జ్యుడిషియల్ విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర గెజిట్ 7 ఆఫ్ 2014, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఎంఎస్ 137లో పొందుపరిచిన వీధి విక్రయదారుల చట్టంపై వీధి విక్రయదారుల యూనియన్లతో జాయింట్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. జీవీఎంసీ పరిధిలోని 8 జోన్లలో టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులను బ్యాలెట్ ద్వారా ఎన్నుకునే హక్కును ప్రతి వీధి విక్రయదారుడికి కల్పించాలన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం జీవీఎంసీ 8 జోన్ల పరిధిలోని 2 లక్షల మంది వీధి విక్రయదారులకు వ్యక్తిగత ఫొటో గుర్తింపు కార్డులు, వ్యాపార భద్రతతో కూడిన కుటుంబ ఫొటోతో వెండింగ్ సర్టిఫికెట్లను ఆన్లైన్ చేసి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వీధి విక్రయదారుల సంక్షేమం కోసం జీవీఎంసీ పరిధిలోని జనసంచార స్థలాల్లో హాకర్ జోన్లు, షెడ్లు, సంతలు, మొబైల్ మార్కెట్లు, వెండింగ్ మార్కెట్లను నిర్మించాలని కూడా పిలుపునిచ్చారు. ఈ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
ఏయూ లా విద్యార్థి సోమశేఖర్ అరుదైన రికార్డు
ఏడు సెంట్రల్ యూనివర్సిటీల్లో టాప్ ర్యాంకులువిశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీ లా కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్న కొండేటి సోమశేఖర్ దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీ పరీక్షల్లో అసాధారణమైన ప్రతిభ చూపించాడు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సంయుక్తంగా నిర్వహించిన కామన్(సెంట్రల్) యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష– పీజీ (సీయూఈటీ–పీజీ 2025)లో సోమశేఖర్ నాయశాస్త్ర విభాగంలో 155 మార్కులు సాధించి రాష్ట్రంలో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ ఫలితంతో దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల మెరిట్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రక్రియలో సోమశేఖర్ ఏడు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో జనరల్ కేటగిరీలో టాప్ ర్యాంకులు దక్కించుకున్నాడు. కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ జనరల్ కేటగిరీలో 4వ ర్యాంక్, కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో 6వ ర్యాంక్, తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీలో 8వ ర్యాంక్, కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో 8వ ర్యాంక్, పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీలో 14వ ర్యాంక్, మధ్యప్రదేశ్ డాక్టర్ హరిసింగ్ గౌర్ సెంట్రల్ యూనివర్సిటీలో 42వ ర్యాంక్, సౌత్ బిహార్ సెంట్రల్ యూనివర్సిటీలో మెరిట్ లిస్టులో స్థానం సంపాదించాడు. ఈ ర్యాంకులతో కొండేటి సోమ శేఖర్‌కు 7 సెంట్రల్ యూనివర్సిటీల నుంచి ఎల్ఎల్ఎమ్ ప్రవేశానికి అవకాశం లభించింది. అయితే సోమశేఖర్ యూనివర్సిటీల మెరిట్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఆధారంగా పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీని ఎంపిక చేసుకుని ఎల్ఎల్ఎంలో ప్రవేశం పొందాడు. -
కాలుష్యంలో కలిసిన లక్ష్యం
● కాలుష్య నియంత్రణకు కూటమి మేయర్ మంగళం ● సెల్లార్లో ఉద్యోగులు..సిబ్బంది ద్విచక్ర వాహనాలు ● గత మేయర్ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణకు చర్యలు డాబాగార్డెన్స్: కాలుష్య రహిత నగరంగా విశాఖను మార్చాలనే సంకల్పంతో మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి చేపట్టిన కార్యక్రమానికి ప్రస్తుత కూటమి మేయర్ పీలా శ్రీనివాసరావు మంగళం పాడారు. గతంలో ప్రతి సోమవారం వ్యక్తిగత వాహనాలను వదిలి, ప్రజా రవాణాను ఉపయోగించడం ద్వారా కాలుష్య నియంత్రణకు ఆమె ప్రయత్నించారు. దీనికి జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులు కొంతమేర సహకరించేవారు. అయితే అవిశ్వాస తీర్మానం ద్వారా గత మేయర్‌ను గద్దె దించిన కూటమి కార్పొరేటర్లు, కాలుష్య నియంత్రణపై ఆమె తీసుకున్న నిర్ణయాలను విస్మరించారు. కూటమి మేయర్‌గా ఎన్నికై న పీలా శ్రీనివాసరావు ప్రతి సోమవారం వ్యక్తిగత వాహనంలోనే జీవీఎంసీకి వస్తున్నారు. కేవలం మేయర్ మాత్రమే కాకుండా, జీవీఎంసీ ఉద్యోగులు, సిబ్బంది కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. గతంలో జీవీఎంసీ ప్రధాన ద్వారం వరకు మాత్రమే వాహనాల్లో వచ్చిన అధికారులు, ఇప్పుడు నేరుగా కార్యాలయం లోపలికి వాహనాలను తీసుకువస్తున్నారు. గత మేయర్ హరి వెంకట కుమారి కాలుష్య నియంత్రణకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వారంలో ఒక్క రోజు ప్రజా రవాణాను లేదా సైకిళ్లను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆమె నగర ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలకు వివరించారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కాలుష్య నియంత్రణకు చేపట్టిన ప్రయత్నాలకు అడ్డుకట్ట పడినట్లు కనిపిస్తోంది. కాలుష్య నియంత్రణకు కృషి చేశా నగరంలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్య నియంత్రణకు..నగర మేయర్(నాలుగేళ్ల పాటు)గా..నగర పౌరురాలిగా తన వంతు కృషి చేశా. ప్రజల్లో అవగాహన పెంచాం. కాలుష్య నియంత్రణకు ప్రజల్ని భాగస్వాముల్ని చేశాం. ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. కాలుష్య నియంత్రణ గాడిన పడతున్న సమయంలో కూటమి మేయర్ మంగళం పాడడం బాధాకరం. అధికారులు,ఉద్యోగులు,సిబ్బంది కూడా కాలుష్య నియంత్రణ గాలికొదిలేయడం బాధాకరం. –గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మేయర్, -
పీజీఆర్ఎస్కు 383 వినతులు
మహారాణిపేట: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వివిధ సమస్యలపై ప్రజల నుంచి 383 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు 115, పోలీసు శాఖకు 28, జీవీఎంసీకి 94, ఇతర విభాగాలకు సంబంధించి 146 వినతులు వచ్చాయి. జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, డిప్యూటీ కలెక్టర్లు శేషశైలజ, మధుసూధన రావు, చీఫ్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ ప్రభాకర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కలెక్టర్ కార్యాలయం, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తారని, అర్జీదారులు 1100 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి తమ ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవచ్చని, సందేహాలు అడగవచ్చని, కొత్త ఫిర్యాదులు కూడా నమోదు చేయవచ్చని డీఆర్వో తెలిపారు. కార్యక్రమంలో వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
జీవీఎంసీ ఉద్యోగి ఆకస్మిక మృతి
తాటిచెట్లపాలెం: జీవీఎంసీ జోన్–3 పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పి. కిరణ్‌బాబు (50) సోమవారం ఉదయం ఆకస్మికంగా మృతిచెందాడు. ద్వారకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాటాకీస్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ కంటి ఆస్పత్రి సమీపంలోని సులభ్ కాంప్లెక్స్‌కు కిరణ్‌బాబు ఉదయం 11 గంటల సమయంలో మలమూత్ర విసర్జనకు వెళ్లారు. చాలాసేపటి వరకు ఆయన బయటకు రాకపోవడంతో, సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులు లోపల పరిశీలించమని అక్కడున్న ఒక వ్యక్తికి చెప్పారు. ఆ వ్యక్తి పైనుంచి చూడగా, కిరణ్‌బాబు లోపల పడిపోయి ఉన్నా డు. వెంటనే సులభ్ కాంప్లెక్స్ సిబ్బంది ద్వారకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గేటును తొలగించి చూడగా, అప్పటికే కిరణ్‌బాబు మృతిచెందాడు. కిరణ్‌బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ద్వారకా స్టేషన్ సీఐ రమణ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సమాచార శాఖ డీడీగా సదారావు
మహారాణిపేట : సమాచార పౌర సంబంధాల శాఖ రెగ్యులర్ డిప్యూటీ డైరెక్టర్(డీడీ)గా కె.సదారావు సోమ వారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇప్పటి వరకు నెల్లూరు డీడీగా సేవలందించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా విశాఖ ఉప సంచాలకులుగా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇన్చార్జిగా డీడీగా వ్యవహరించిన డి.రమేశ్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు వి.మణిరామ్‌ను మురళీనగర్‌లోని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించండి
మహారాణిపేట: జర్నలిస్టుల పిల్లలకు గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ కల్పించాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) భవానీ శంకర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో ఇప్పటికే జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీపై ఉత్తర్వులు జారీ అయ్యాయని, విశాఖ జిల్లాలోనూ వంద శాతం రాయితీ కల్పించాలని జర్నలిస్టు నాయకులు గంట్ల శ్రీనుబాబు, పి.నారాయణ్‌లు డీఆర్వోను కోరారు. గతంలో కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కొన్ని పాఠశాలలు ఫీజు రాయితీని నిరాకరించాయని తెలిపారు. జర్నలిస్టుల వినతిపై డీఆర్వో సానుకూలంగా స్పందించి, డీఈవో ప్రేమ కుమార్‌ను పిలిచి ఉత్తర్వులు పరిశీలించి తక్షణమే కలెక్టర్‌కు ఫైల్ పంపాలని ఆదేశించారు. అలాగే జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షల విషయం కలెక్టర్ దృష్టిలో ఉందని, త్వరలో చర్యలు తీసుకుంటారని డీఆర్వో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్రాడ్కాస్ట్ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. -
ఉద్యోగం ఇవ్వండి
ఏపీ ట్రాన్స్‌కోలో సబ్ ఇంజినీర్ పోస్టుకు అన్ని అర్హతలు ఉన్నా తనకు ఉద్యోగం ఇవ్వడం లేదని గాజువాకకు చెందిన జలుమూరి శ్రీలక్ష్మి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించింది. డిప్లొమో (ఎలక్ట్రికల్), బీఈ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణురాలినైనప్పటికీ, ఎన్నోసార్లు దరఖాస్తు చేసినా ఉద్యోగం రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకంటే తక్కువ అర్హతలు ఉన్నవారికి ఉద్యోగాలు ఇస్తున్నారని, రోస్టర్ విధానాన్ని, మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం లేదని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం చేసి ఉద్యోగం కల్పించాలని ఆమె వేడుకుంది. -
శాన్ఫ్రాన్సిస్కోలో ‘సెంచూరియన్’ ప్రదర్శన
భువనేశ్వర్: సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ–మేనేజ్మెంట్ (సీయూటీఎం) అరుదైన ఘనత సాధించింది. శాన్ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన 62వ డిజైన్ ఆటోమేషన్ కాన్ఫరెన్స్ (డీఏసీ)లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా తన సామర్థ్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ఈ కాన్ఫరెన్స్ ఈ నెల 22న ప్రారంభమైంది, 25 వరకు కొనసాగనుంది. సెమీకండక్టర్, డిజైన్ ఆటోమేషన్ పరిశ్రమ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో సెంచూరియన్ ప్రాతినిధ్యం వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘చిప్స్ టు సిస్టమ్స్’ అనే శీర్షికతో నిర్వహిస్తున్న డీఏసీ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ), సెమీకండక్టర్ టెక్నాలజీలు, సిస్టమ్ ఇన్నోవేషన్ రంగంలో దిగ్గజాలు హాజరు కావడం విశేషం. వర్సిటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్ రావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ దాస్, లక్ష్మీకాంత్ సుతార్‌లతో కూడిన బృందం సెంచూరియన్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డీఎన్ రావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వేదికపై సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి వర్సిటీగా సెంచూరియన్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. వర్సిటీలో సెమీకండక్టర్ టెక్నాలజీ పాఠ్యాంశాలు మెరుగుపరచడానికి మార్క్యూ సెమీ కండక్టర్స్‌తో ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రపంచ స్థాయిలో సెంచూరియన్ తన ఉనికి చాటుకుంటుందని ఆశాభవం వ్యక్తం చేశారు. -
‘ ఎస్పీ ముందు ఒకటి చెప్పి.. తర్వాత మాట మార్చారు’
విశాఖ : సింగయ్య మృతిపై టీడీపీ, ఎల్లో మీడియా అనవరసర రాద్దాంత సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసలు సింగయ్యను వైఎస్ జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టలేదని తొలుత చెప్పిన ఎస్పీ.. ఆపై మాట మార్చారన్నారు. ఎస్పీ ఇలా ఎందుకు చేశారో అందరికీ తెలుసని బొత్స పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం జిమ్మిక్కులు పక్కన పెట్టి.. ప్రజా సమస్యలపై ఇచ్చిన హామీలపై దృష్టి పెడితే మంచిదన్నారు. ఈరోజు( సోమవారం,. జూన్ 23) విశాఖలో ప్రెస్‌మీట్ నిర్వహించిన బొత్స.. కూటమి ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. ‘రెంటచింతలకు వైఎస్ జగన్ వెళ్ళినప్పుడు భారీగా అభిమానులు తరలి వచ్చారు.. సత్తెనపల్లి జగన్ వెళ్ళినప్పుడు పోలీసుల వైఫల్యం కనిపించింది.. పోలీసులు మాజీ సీఎంకు ఇవ్వాల్సిన భద్రత కల్పించలేదు. పోలీసులు ముందు ఒకమాట.. తరువాత మరో మాట మాట్లాడారు. ఎల్లో మీడియాలో కధనాలు వచ్చాక పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. రాష్ట్రంలో దిక్కుమాలిన, దిగజారిన పాలన సాగుతుంది. సింగయ్యను కాన్వాయ్ వాహనం ఢీ కొట్టలేదని ఎస్పీ చెప్పారు..మళ్ళీ ఆయన మాట మార్చారు. మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఇవ్వాల్సిన బాఫ్యత ఉందా లేదా..? రాష్ట్రంలో వ్యవస్థలు దిక్కుమాలిపోయాయి.. పాలన దిగజారిపోయింది. గాయలతో ఉన్న సింగయ్యను ప్రైవేటు వాహనంలో తరలిద్దాం అంటే 108 లోనే పంపిద్దాం అని పోలీసులు చెప్పిన మాట వాస్తవం కాదా?, పాలన వైఫల్యం కారణంగా పెద్ద ఎత్తున జగన్ పర్యటనలకు ప్రజలు తరలి వస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ సహా ఇతర పక్షాలు మూడేళ్లు కనపడలేదు. గురివింద గింజలా ఉంది మంత్రుల శైలి. మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఇవ్వాల్సిన బాఫ్యత ఉందా లేదా..? సూటిగా ప్రశ్నిస్తున్నా. గతంలో బాబు, పవన్ లకు ఎప్పుడైనా భద్రతా ఇబ్బందులు ఉన్నాయా..?, ఇది ప్రజాస్వామ్యం ఎవరి సొత్తు కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయి. ప్రభుత్వ దయా దాక్షిణ్యాలు అవసరం లేదు. జగన్ వాహనం దగ్గర ఉండాల్సిన రోప్ పార్టీ ఎక్కడ ఉంది. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదునిజంగా ఘటన జరిగితే మీ పోలీసు వ్యవస్థ ఎక్కడుంది.. జగన్ పర్యటనలపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారంతో రాద్దాంతం చేస్తుంది. సింగయ్య మరణం మమ్మల్ని చాలా బాధించింది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా చనిపోయిన కార్యకర్తలను ఏనాడైనా ఆధుకున్నారా..?, ప్రభుత్వం వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తున్నారు. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. సత్యసీలుల్లా మాట్లాడుతున్న మంత్రులు వెనక్కి తిరిగి చూసుకోవాలి. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు. రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగం వచ్చింది..చంద్రబాబు తాబెదారులకు ఉద్యోగాలు వచ్చి ఉంటాయి. ఆడ బిడ్డ నిధి ఎక్కడిచ్చారు..?, P4 కాన్సెప్ట్ ఏమిటి..?, P4 వలన ఒరిగింది ఏమిటి..? సమాధానం చెప్పాలి. చంద్రబాబుని ఎప్పుడు గెలిపించినా మోసం, ధగా తప్పదు. యోగా డే కోసం ఇంత ఖర్చు అవసరమా..?, యోగా డే వలన ఏమిటి..?విశాఖకు ఏం మంచి జరిగింది..?, మనకు జరిగిన ప్రయోజనం ఏంటి..? సమాధానం చెప్పాలి. ఒక కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేస్తే ఆ ప్రాంతానికి ఏదో మేలు జరగాలి. ఋషికొండ భవనాలను ఒక మాన్యుమెంట్ లా తయారు చేసాం. ఋషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే బిల్స్ ఎందుకు ఇచ్చారు.. యోగా డే వైఫల్యం కావడంతో సింగయ్య మరణంపై తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. సింగయ్య మరణం బాధాకరం.. యువతపై లాటీ ఛార్జ్ చేయడం ధర్మమేనా?ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. పల్నాడు లాటీ ఛార్జ్ ఎందుకు చేశారు. యువతపై లాటీ ఛార్జ్ చేయడం ధర్మమేనా?, ప్రభుత్వాన్ని ఇలాగే నడుపుతారా?, చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. మీరెవరు ప్రశ్నించడానికి అని బాబు అడుగుతున్నాడు. ప్రభుత్వ మెడలు వంచి తల్లికి వందనం ఇప్పించాం. మేం మాట్లాడకపోతే మరో మూడేళ్లు ప్రజలకు పథకాలు వచ్చేవి కాదు. మేం ప్రజల తరఫున పోరాడటానికే ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ పోరాడుతాం. బలహీన వర్గాల తరఫున పోరాడుతాం. బాబు మాట్లాడితే తాట తీస్తా అంటున్నాడు.. ఎవడి తాట తీస్తావ్. భూ స్థాపితం చేస్తాను అని చంద్రబాబు అంటున్నాడు.. ఏంటి ఆ మాటలు. ఇలాంటి మాటలు మాట్లాడి సీఎం కుర్చీ స్థాయిని దిగజార్చద్దు’ అని బొత్స హెచ్చరించారు. -
ఈ ఉద్యోగానికి ఓ దండం
విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోయి నిర్వహించిన ‘యోగాంధ్ర–2025’కార్యక్రమం జీవీఎంసీ పరిధిలోని రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ)కు తీవ్ర ఆవేదనను, అవమానాన్ని మిగిల్చింది. అధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు, సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం కారణంగా తాము ప్రజల చేత మాటలు పడాల్సి వచ్చిందని, ఈ ఉద్యోగమే వద్దనుకునేంతగా మానసిక క్షోభ అనుభవించామని ఆర్పీలు వాపోతున్నారు.ప్రధాని మోదీ పాల్గొన్న ‘యోగాంధ్ర’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో అధికారులు జన సమీకరణ బాధ్యతను పూర్తిగా ఆర్పీల మీద పెట్టారు. ప్రతి ఆర్పీ వందల మందిని కార్యక్రమానికి తీసుకురావాలని లక్ష్యాలు నిర్దేశించారు. ఉదయం 6.30 గంటలకల్లా కార్యక్రమం ముగిసి, 8 గంటలకంతా అందరూ ఇళ్లకు వెళ్లిపోవచ్చని, అక్కడ అల్పాహారం, మంచినీటి సౌకర్యాలు ఉంటాయని జనాలకు నచ్చజెప్పి ఆర్పీలు వారిని తీసుకువచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా మారింది. గంటల తరబడి ప్రజలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నిర్వాహకులు కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా అందించలేకపోయారు. మ్యాట్ల కోసం కొట్టుకున్నారు. స్నాక్స్ కోసం తోపులాటలు జరిగాయి. దీంతో ఆర్పీలు తీసుకువచ్చిన జనం, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాహంతో, ఆకలితో అలమటించారు. చివరకు తమను తీసుకువచ్చిన ఆర్పీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం కోసం ఎంతో కష్టపడితే అన్ని వైపుల నుంచి తిట్లు..చీవాట్లు మిగిలాయంటూ ఆర్పీలు వాట్సాప్ గ్రూపుల్లో ఆవేదన చెందుతున్నారు.అధికారుల నిర్లక్ష్యం, ఆర్పీల ఆవేదన‘వేకువ జామున 2 గంటల నుంచి ఇంటింటికి వెళ్లి వారి తలుపులు తట్టి జనాన్ని యోగాంధ్రకు తీసుకెళ్లాం. గుండె జబ్బు ఆపరేషన్ చేయించుకున్న ఓ ఆర్పీ యోగాంధ్రకు 100 మందిని తీసుకెళ్లారు. అయితే ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యాం. ఒకవైపు అధికారుల నుంచి ఒత్తిడి, మరోవైపు స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రజల నుంచి చీదరింపులు ఎదుర్కొన్నాం. పని పూర్తయ్యాక అధికారులు చల్లగా జారుకున్నారు. కానీ మేం మాత్రం ప్రజల చేత తిట్లు తినాల్సి వచ్చింది. మమ్మల్ని నమ్మి వచ్చినవారికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోయాం. తీసుకెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిరిగి వస్తే చాలు అనుకునేంత నరకాన్ని చూశాం’ అని ఆర్పీలు తమ గ్రూపుల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ‘కేవలం రూ.10వేల జీతానికి ఇంతటి అవమానమా? 20 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాం, కానీ ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. గతంలో ఏ కార్యక్రమం జరిగినా ఆహారం, నీళ్ల బాధ్యత మాకే అప్పగించేవారు. కానీ ఇప్పుడు మమ్మల్ని కేవలం జన సమీకరణకే వాడుకుని, తర్వాత బలిపశువులను చేశారు’ అని వాపోయారు. ఈ మానసిక వేదనతో ఉద్యోగాలకు రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పలువురు ఆర్పీలు పేర్కొన్నారు. -
బాయ్‌కాట్
బదిలీ కౌన్సెలింగ్డీఈవో కార్యాలయాన్ని ముట్టడించిన ఎంటీఎస్ టీచర్లు● గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.39ను పట్టించుకోవట్లేదని ఆవేదన ● సర్వీసంతా ఏజెన్సీలోనే పనిచేయాలనడంపై ఆక్షేపణ ● మైదాన ప్రాంతంలోని ఖాళీల్లో బదిలీ చేయాలని డిమాండ్ ఆరిలోవ : విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) కార్యాలయాన్ని మినిమం టైం స్కేల్(ఎంటీఎస్) ఉపాధ్యాయులు ఆదివారం ముట్టడించారు. బదిలీ కౌన్సెలింగ్‌ను బాయ్‌కట్ చేశారు. 1998, 2008 డీఎస్సీల ఎంటీఎస్ ఉపాధ్యాయులకు బదిలీల కౌన్సెలింగ్ విశాఖ వ్యాలీ స్కూల్లో ఆదివారం నిర్వహించేందుకు విద్యాశాఖాధికారులు సన్నద్ధమయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుసుకున్న ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదాన ప్రాంతాల్లో ఖాళీలు చూపించడం లేదంటూ కౌన్సెలింగ్‌ను బాయ్‌కాట్ చేశారు. వారికి పలు ఉపాధ్యాయ సంఘాలు సంఘీభావం తెలిపాయి. డీఈవో కార్యాలయాన్ని ముట్టడించి, తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. డీఈవో కార్యాలయం నుంచి విశాఖ వ్యాలీ స్కూల్ వద్దకు వెళ్తున్న డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్‌ను చుట్టుముట్టారు. తమకు న్యాయం చేయాలని, మైదాన ప్రాంతంలోని పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యా శాఖాధికారులు బలవంతంగా తమను కొండలపైకి పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జీవో నంబరు 39 ద్వారా ఎంటీఎస్ ఉపాధ్యాయులకు నివాసముంటున్న ప్రాంతాలకు దగ్గరలో ఉద్యోగం చేసుకునే సౌలభ్యం కల్పించిందన్నారు. ఇటీవల విద్యాశాఖా మంత్రి లోకేష్‌ను కలిస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మాట మార్చి మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర జీతాలతో ఉన్న తమపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. కౌన్సెలింగ్‌కు ఎవరూ హాజరుకాకపోవడంతో విద్యాశాఖాధికారులు సాయంత్రం వరకు వేచిచూడాల్సి వచ్చింది. జీవో అమలుచేయాలి 1998, 2008 ఎంటీఎస్ ఉపాధ్యాయుల కోసం 2023లో అప్పటి ప్రభుత్వం జీవో నెం.39ను విడుదల చేసింది. దాని ప్రకారం ఎంటీఎస్ ఉపాధ్యాయులను నివాసాలకు దగ్గరగా ఉండేలా బదిలీలు జరగాలి. ఇప్పుడు ఆ జీవో ప్రకారం జరగట్లేదు. ప్రస్తుతం ఖాళీలన్నీ పాడేరు, ముంచంగిపుట్టు, కొయ్యూరు, పెదబయలు, అరకు, అనంతగిరి తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే అక్కడ రెండేళ్ల పాటు వారంతా ఉద్యోగాలు చేశారు. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో బదిలీ చేయాలని కోరుతున్నాం. – డి.గోపీనాథ్, పీఆర్టీయూ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడుఖాళీలన్నీ ఏజెన్సీలోనే చూపిస్తున్నారు.. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఖాళీలన్నీ ఏజెన్సీ ప్రాంతంలోనే చూపిస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లు కొండలపై ఉద్యోగాలు చేశాం. ఇప్పుడు కూడా కొండ ప్రాంతాలకే బదిలీపై వెళ్లాలి. ఇప్పుడు వెళ్తే రిటైర్మెంట్ వరకు అక్కడ పనిచేయాల్సిందే. మాకు వచ్చే జీతం రూ.32 వేలు. ఎలాంటి అలవెన్సులు ఉండవు. అయినా కొండ ప్రాంతాల్లోనే సర్వీసంతా పనిచేయాలంటున్నారు. –టి.లింగమూర్తి, 2008 ఎంటీఎస్ ఉపాధ్యాయుడుక్లస్టర్ల ద్వారా భర్తీ చేయాలి ఉమ్మడి విశాఖ జిల్లాలో 220 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ల పరిధి మైదాన ప్రాంతాల్లో ఖాళీ పోస్టులు ఉంటాయి. ఆ ఖాళీల్లో మమ్మల్ని భర్తీ చేస్తే కొందరికై నా మైదాన ప్రాంతాల్లో పనిచేసే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం మమ్మల్ని చిన్నచూపు చూస్తోంది. మాకు న్యాయం జరిగే వరకు బదిలీ కౌన్సెలింగ్‌కు హాజరుకాము. – లక్ష్మి, 2008 బ్యాచ్సర్వీసంతా అక్కడే చేయాలా.. 1998, 2008 డీఎస్సీ బ్యాచ్‌ల్లో 425 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులం ఉన్నాం. ఇటీవల రెగ్యులర్ ఉపాధ్యాయులను మైదాన ప్రాంతాల్లో నింపేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలు చూపిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అక్కడకు వెళ్తే సర్వీసంతా అక్కడే ఉద్యోగం చేయాలి. మాకొచ్చే జీతాలతో అక్కడ గడపడం ఎంత కష్టమో తెలియని కాదు. విద్యాశాఖాధికారులు న్యాయం చేయాలి.. – రాజు, 2008 బ్యాచ్ -
సంక్షేమం లేదు గానీ.. మద్యం దుకాణాలా?
జగదాంబ: ప్రశాంతంగా ఉండే తమ నివాస ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ జీవీఎంసీ 39వ వార్డు మహిళలు ముక్తకంఠంతో నినదించారు. ఆదివారం ఉదయం దుకాణం ఏర్పాటుకు ప్రయత్నించిన వారిని స్థానిక మహిళలు, నేతలు అడ్డుకుని వెనక్కి పంపారు. కూటమి ప్రభుత్వం గతంలో నిర్వహించిన మద్యం దుకాణాల వేలంలో ఓ వ్యక్తి లైసెన్సు దక్కించుకున్నారు. మొదటగా జీవీఎంసీ 37వ వార్డు జబ్బర్తోటలో, ఆ తర్వాత 34వ వార్డు కొబ్బరితోటలో దుకాణం తెరిచేందుకు ప్రయత్నించగా అక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో 39వ వార్డు పరిధి వాడవీధిలో దుకాణం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు యజమాని మద్యం సరకుతో కూడిన వాహనంతో వాడవీధికి చేరుకున్నారు. ఈ ప్రాంతం జనవాసాలు, ఆసుపత్రి, దేవాలయం ఉన్న ప్రశాంతమైన ప్రదేశం కావడంతో, విషయం తెలుసుకున్న మహిళలంతా ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. తమ నివాసాల మధ్య మద్యం దుకాణం పెట్టడానికి ససేమిరా ఒప్పుకోమని తేల్చిచెప్పారు. యజమాని పట్టుబట్టడంతో కొందరు మహిళలు కర్రలతో ముందుకు వచ్చి మద్యం సీసాలను పగలగొడతామని హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, యజమాని చేసేదేమీ లేక మద్యం సరకుతో సహా వెనుదిరిగారు. ఈ సందర్భంగా మహిళలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం.. ప్రజల జీవితాలను నాశనం చేసే మద్యం దుకాణాలను మా వీధుల్లోకి పంపుతారా?’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా ఏకమైన స్థానికులు ఈ నిరసనలో రాజకీయాలకు అతీతంగా స్థానిక నేతలు పాల్గొనడం విశేషం. వైఎస్సార్సీపీ వార్డు అధ్యక్షుడు ముజిబ్ ఖాన్, జనసేన నాయకురాలు కొల్లి సింహాచలం మహిళలకు మద్దతుగా నిలిచి, దుకాణం ఏర్పాటును అడ్డుకున్నారు. ‘ప్రభుత్వ నిబంధనలను విస్మరించి గుడులు, బడులు, ఆసుపత్రులు, నివాస గృహాల మధ్య మద్యం దుకాణాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు?’ అని వారు ప్రశ్నించారు. అనంతరం స్థానికులతో కలిసి అక్కడే బైఠాయించి, తమ ప్రాంతంలో మద్యం దుకాణం వద్దంటూ నినాదాలు చేశారు. నివాసాల మధ్య వైన్ షాపు వద్దు అడ్డుకున్న 39వ వార్డు మహిళలు -
జాబ్ లేదు.. భృతి రాదు
● ఫీజు రీయింబర్స్మెంట్,వసతి దీవెనకు దిక్కే లేదు.. ● నేటి ‘యువత పోరు’ను విజయవంతం చేయండి ● వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపు సాక్షి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఇంటికొక ఉద్యోగం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేస్తోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. ఆదివారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీకి తూట్లు పొడిచిందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన ఇవ్వకుండా అడుగడుగునా దగా చేసిందన్నారు. యువతకు, నిరుద్యోగులకు ఇస్తానన్న హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసనగా.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 23వ తేదీన వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ‘యువత పోరు’ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న యువత, విద్యార్థులు, వైఎస్సార్ సీపీ అభిమానులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద గల కృష్ణమందిర్ జంక్షన్ నుంచి పాదయాత్రగా బయలుదేరి కలెక్టరేట్ వరకు ర్యాలీగా చేస్తామన్నారు. అక్కడ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. -
భీమిలి అర్చకుడు తిరుపతిలో అదృశ్యం
58 రోజులుగా ఆచూకీ లేదు తగరపువలస: భీమిలి పట్టణంలోని భ్రమరాంబికా సహిత చోడేశ్వరస్వామి ఆలయ అర్చకుడు ఏడిద గణేష్ సుబ్రహ్మణ్య శాస్త్రి (49) 58 రోజుల కిందట తిరుపతిలో అదృశ్యం కాగా.. ఇప్పటి వరకు ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. భీమిలి ప్రధాన రహదారిలో తన భార్య మాధురి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి ఆయన అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. గత ఏప్రిల్ 24న కుటుంబ సభ్యులకు చెప్పి తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన అర్చకుడు, ఏప్రిల్ 26న తన భార్య మాధురికి ఫోన్ చేసి దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆయన ఆచూకీ తెలియరాలేదు. అక్కడి పోలీసుల సాయంతో ఈ నెల 13న భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్తో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఈ మిస్సింగ్ కేసుపై ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు. ఇటీవల భీమిలికి చెందిన వివాహిత బంగారు కవిత కూడా ఇదే విధంగా అదృశ్యమైన తర్వాత బంధువులు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు ఆమె మృతదేహం పూర్తిగా శిథిలమైన పరిస్థితిలో ఎర్రమట్టి దిబ్బల వద్ద ఉన్న జీడితోటలో కనిపించింది. అర్చకుడి మిస్సింగ్ విషయంలో పోలీసులు గానీ, బంధువులు గానీ ఎలాంటి ఆతృత కనబరచకపోవడంతో.. దీని ముగింపు ఏమవుతుందోనని పట్టణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
మరణించి.. మరో ఇద్దరికి వెలుగునిచ్చి..
పెందుర్తి: అనారోగ్యంతో మరణించిన వ్యక్తి నేత్రాలు దానం చేసి మానవత్వం చాటుకుంది ఓ కుటుంబం. పెందుర్తి సాయినగర్‌కు చెందిన రాపేటి నగేష్(45) ఆరోగ్యం క్షీణించి శనివారం రాత్రి మృతి చెందారు. ఈ నేపథ్యంలో స్థానిక సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి దాడి శ్రీనివాస్, స్థానిక పెద్దలు శరగడం మధు, పెంటకోట రమణ అక్కడకు వెళ్లి నగేష్ కళ్లు దానం చేస్తే మరో ఇద్దరికి కంటి చూపు ఇచ్చినవారు అవుతారని కుటుంబ సభ్యులను ఒప్పించారు. వెంటనే భర్త నేత్రాలు దానం ఇచ్చేందుకు నగేష్ భార్య హిమబిందు అంగీకరిస్తూ సంతకం చేశారు. అక్కడకు చేరుకున్న ఎల్వీ ప్రసాద్ సారథ్యంలోని మోషన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు నగేష్ నేత్రాలను సేకరించి సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు. పుట్టెడు దుఃఖంలోనూ నగేష్ కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చూపిన తీరుపై స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. పెందుర్తిలో మృతి చెందిన వ్యక్తి నేత్రాలు దానం చేసిన కుటుంబసభ్యులు -
ప్రేమ సమాజం నూతన అధ్యక్షుడిగా మట్టపల్లి
డాబాగార్డెన్స్: ప్రేమ సమాజం కమిటీ నూతన అధ్యక్షుడిగా సంఘ సేవకుడు మట్టపల్లి చలమయ్య కుమారుడు మట్టపల్లి హనుమంతరావు నియమితులయ్యారు. డాబాగార్డెన్స్ ప్రేమసమాజం ఆడిటోరియంలో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో వార్షిక కార్యదర్శి నివేదిక, జమాఖర్చులు, వార్షిక బడ్జెట్ నివేదికను సభ్యులు ఆమోదించారు. అనంతరం ప్రముఖ న్యాయవాది పి.నారాయణరావు చీఫ్ ఎన్నికల అధికారిగా 2025–27 కాలానికి ఏకగ్రీవంగా ఎన్నికై న 20 మంది కార్యవర్గ సభ్యుల పేర్లు ప్రకటించారు. ఎన్నికల అధికారి పీవీ నారాయణరావు సమక్షంలో నూతన కార్యవర్గ తొలి సమావేశం ఏర్పాటు చేస్తూ, నూతన కమిటీని వెల్లడించారు. అధ్యక్షుడిగా మట్టపల్లి హనుమంతరావు, ఉపాధ్యాక్షుడు–1గా కేశప్రగడ నరసింహమూర్తి, ఉపాధ్యక్షుడు–2 కంకటాల మల్లిఖార్జునరావు, కార్యదర్శిగా వి.మోహన్‌రావు, కోశాధికారిగా ఎంవీవీకే గుప్తా, సంయుక్త కార్యదర్శులుగా పి.లక్ష్మీగుప్తా, ఎస్.నాగేశ్వరరావు, ఎల్.వెంకట్రావు, అడ్వైజరీ సభ్యుడిగా డాక్టర్ పి.విశ్వేశ్వరరావు, ప్రేమ పాఠశాల కరస్పాండెంట్‌గా కోన జగదీశ్వరరావు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ప్రేమసమాజం పూర్వ అధ్యక్షుడు బుద్ద శివాజీ, పూర్వ కార్యదర్శి కె.హరిమోహన్రావు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవీ రాజశేఖర్, పలువురు ప్రముఖులు పాల్గొని నూతన కమిటీని అభినందించారు. -
కేజీహెచ్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీ సేవలు బంద్
● మూలనపడ్డ సీపీబీ(కార్డియాలజీ– ఫల్మనరీ బైపాస్) మిషన్ ● వైఎస్సార్సీపీ హయాంలో నిరంతరాయంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్‌లో గుండె (ఓపెన్ హార్ట్) శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. ఈ సర్జరీలు నిర్వహించే పరికరం కార్డియాలజీ ఫల్మనరీ బైపాస్ మిషన్(సీపీబీ) మరమ్మతులకు గురవడంతో.. కొద్ది రోజులుగా ఈ సేవలకు బ్రేక్ పడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన వైద్య పరికరాలను ఎప్పటికప్పుడు సమకూర్చేది. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదల ఆరోగ్యంపై నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. కేజీహెచ్‌కు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచీ పేద రోగులు ఎక్కువగా వస్తుంటారు. ప్రైవేట్/కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఇలాంటి వారికి కేజీహెచ్ పెద్ద దిక్కుగా మారింది. కేజీహెచ్ కార్డియాలజీ విభాగం రెండో అంతస్తులో కార్డియోథోరసిక్ విభాగంలో వైద్యులు ఈ శస్త్రచికిత్సలు అందిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో సీపీబీ మిషన్ తెప్పించి, శస్త్ర చికిత్సలకు ఆటంకం లేకుండా చూశారు. ఓపెన్ హార్ట్ సర్జరీలు, స్టంట్లు, గుండెలో బ్లాక్‌లకు అవసరమైన వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. ఇప్పుడీ సేవలకు అంతరాయం కలగడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్జరీ సమయంలో హార్ట్‌కు పంపింగ్ చేసేందుకు సాయపడే ఈ పరికరం లేకపోతే సర్జరీలు చేయడం చాలా కష్టం అని వైద్యులు చెబుతున్నారు. -
వండర్ పార్క్
వైజాగ్లోనగర జీవితంలోని కాంక్రీట్ జంగిల్‌కు భిన్నంగా, స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో సేదతీరాలని ఉందా? అరుదైన మొక్కల గురించి తెలుసుకుంటూ, వాటి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా పెదవాల్తేరులోని బయోడైవర్సిటీ పార్క్‌ను సందర్శించాలి. రాణి చంద్రమణి దేవి ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని ఈ ఉద్యానవనం.. ఎన్నో వింతలు, విశేషాలతో ప్రకృతి ప్రియులను, విద్యార్థులను ఆకట్టుకుంటోంది. – బీచ్రోడ్డుపార్క్ను సందర్శించిన విద్యార్థులు (ఫైల్) పార్కులో పెంచుతున్న అరుదైన మొక్కలు విజ్ఞానం, వినోదం పంచే బయో డైవర్సిటీ పార్క్ బయాలజీ విద్యార్థులతో నిత్యం కళకళప్రకృతి అద్భుతాలకు చిరునామా ఈ పార్క్ కేవలం చెట్ల సమాహారం కాదు.. జీవ వైవిధ్యానికి ఓ నిలువుటద్దం. అంతరించిపోతున్న జాతుల నుంచి విదేశీ వింతల వరకు ఇక్కడ కొలువుదీరిన ప్రతి మొక్కకూ ఓ ప్రత్యేక కథ ఉంది. పార్క్ సమన్వయకర్త డాక్టర్ ఎం. రామమూర్తి పర్యవేక్షణలో ఈ మొక్కల విశిష్టతలను విద్యార్థులకు, సందర్శకులకు వివరిస్తుండటం ఇక్కడి అదనపు ఆకర్షణ. ఈ పార్కులోని కొన్ని మొక్కల గురించి తెలుసుకుందామా? విద్యార్థులకు ప్రయోగశాల ఈ బయోడైవర్సిటీ పార్క్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని బయాలజీ విద్యార్థులకు ఒక సజీవ ప్రయోగశాలగా మారింది. తమ పరిశోధనలు, ప్రాజెక్టుల కోసం విద్యార్థులు తరచూ ఇక్కడికి వస్తుంటారు. డాక్టర్ రామమూర్తి వారికి మొక్కల చరిత్ర, వాటి పెంపకం, వైద్య, పర్యావరణ ప్రయోజనాలను వివరిస్తూ వారిలో ప్రకృతిపై ఆసక్తిని పెంచుతున్నారు.ప్రేమను పంచే మొక్కలు ప్రేమకు గుర్తు గులాబీ పువ్వు మాత్రమే కాదు. అనేక అరుదైన మొక్కలు, వాటి పువ్వులు, ఆకులు కూడా ఉన్నాయి. బయోడైవర్సిటీ పార్కులో ఇటువంటి ప్రత్యేకమైన మొక్కలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా ప్రేమికులు తమ ప్రేమకు గుర్తుగా చెట్లపై పేర్లు రాస్తుంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ‘వాలెంటైన్స్ ప్లాంట్’అనే ఒక మొక్క ఉంది. ఈ మొక్క ఆకులు చాలా మందంగా ఉండటం వల్ల వాటిపై పేర్లు రాసుకోవచ్చు. ఇలా రాసిన పేర్లు ఎప్పటికీ చెరిగిపోవు. అలాగే ‘వాలెంటైన్స్ హార్ట్’అనే మరో అరుదైన మొక్క కూడా ఈ పార్కులో ఉంది. ఎడారి ప్రాంతాల్లో కనిపించే ఈ మొక్క చూడటానికి లవ్ సింబల్ ఆకారంలో ఉంటుంది. ఈ ప్రత్యేకత ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మొక్కను ‘స్వీట్ హార్ట్’అని కూడా పిలుస్తారు. ఇంకా ‘మిలియన్స్ హార్ట్స్’మొక్క పార్కుకు వచ్చే యువతీ యువకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఒకే మొక్కకు వందల సంఖ్యలో గుండె ఆకారపు ఆకులు ఉండటం దీని ప్రత్యేకత. ఇది చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండటంతోనే దీనికి ‘మిలియన్స్ హార్ట్స్’అనే పేరు వచ్చింది. కృత్రిమ హౌస్‌లో ఆర్కిడ్ల సోయగం ప్రపంచంలోనే అత్యంత అందమైన పూల జాతుల్లో ఆర్కిడ్లు ఒకటి. వీటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి అద్భుతమైన మొక్కలు జీవ వైవిధ్య ఉద్యానవనంలో సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ‘ఈ మొక్కలు సాధారణంగా చల్లని ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి మట్టిలో కాకుండా చెట్ల కాండాన్ని అల్లుకుని పెరుగుతూ, గాలిలోని తేమను పీల్చుకుంటూ జీవిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఇవి అధికంగా పుష్పిస్తాయి. ఆర్కిడ్ల ఆకారాలు, రంగులు విభిన్నంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఆర్కిడ్లు జీవించడానికి చల్లని వాతావరణం అవసరం.’అని సమన్వయకర్త రామమూర్తి తెలిపారు. అందుకే జీవ వైవిధ్య ఉద్యానవనంలో ప్రత్యేకంగా ఒక కృత్రిమ ఆర్కిడ్ హౌస్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక్కడ తొట్టెల్లో బొగ్గు, కొబ్బరి పీచులను ఉపయోగించి మొక్కలను సంరక్షిస్తున్నారు. డ్యాన్సింగ్ లేడీ, ఎరైడ్స్ మల్టీఫోర, డెండ్రోబియం ఎఫిల్లా, సింబిడియం వంటి అనేక రకాల ఆర్కిడ్ మొక్కలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. వాటికి పూసే పువ్వులు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. మన దేశంలో మేఘాలయ, సిమ్లా ప్రాంతాల్లో ఇవి అధికంగా కనిపిస్తాయి. షేవింగ్ బ్రష్ ట్రీ పేరుకు తగ్గట్టే దీని పువ్వులు అచ్చం షేవింగ్ బ్రష్‌ను పోలి ఉంటాయి. ఇది ఒక ఎడారి మొక్క. చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. దీని పూల కేశాలు సన్నటి తీగల్లా ఉంటాయి. లావుగా ఉండే దీని కాండం నీటిని నిల్వ చేసుకుంటుంది. వేసవిలో నీటి కొరత ఏర్పడినప్పుడు, ఆ నీటినే వాడుకుని జీవిస్తుంది. ప్రకృతి ఎంత గొప్ప ఇంజినీరో చెప్పడానికి ఈ మొక్క ఒక ఉదాహరణ. కొండగోగు అంతరించిపోతున్న మొక్కల్లో ఇదొకటిగా చెబుతారు. ఈ మొక్క చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. దీని పచ్చి కొమ్మలకు మంటపెడితే భగ్గున మండుతాయి. పక్షులు, తేనెటీగలు, సీతాకోకచిలుకలను అధికంగా ఆకర్షించే దీని పువ్వులు కప్పు ఆకారంలో ఉండటం మరో విశేషం. -
మద్యం మత్తులో ఒకరి హత్య
● హంతకుడు పరారీ ● గాలిస్తున్న న్యూపోర్టు పోలీసులు పెదగంట్యాడ : మండలంలోని ఏిపీఐఐసీ (ఐలా) ఆటోనగర్‌లో మహాదేవ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్‌లో గల భవానీయార్డ్ అనే స్టీల్ ట్రేడర్స్‌లో ఛత్తీస్‌గఢ్ జగదల్పూర్కి చెందిన మహాదేవ్ (28), నరేష్ (29) కొన్నాళ్లగా రాడ్ బెండింగ్ పనులు చేస్తున్నారు. ఇద్దరూ ఆ యార్డ్‌లోనే ఓ షెడ్లో ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇద్దరూ ఉదయం నుంచి మద్యం సేవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మధ్య ఏమి జరిగిందో గానీ మహాదేవ్ తలపై నరేష్ కర్రతో బలంగా కొట్టి హత్య చేశాడు. ఆ పై మృతదేహన్ని పక్కనున్న తుప్పల్లో పడేశాడు. అక్కడ నుంచి జారుకున్నాడు. ఆదివారం రాత్రి అటుగా వెళ్తున్న కార్మికులు తుప్పల్లో మృతదేహాన్ని చూసి న్యూపోర్టు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ తోటాడ కామేశ్వరరావు సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నరేష్ పరారీ కావడంతో అతని కోసం గాలిస్తున్నారు. -
ఉద్యోగుల కృషితోనే షిప్‌యార్డ్ అభివృద్ధి
కమొడోర్ హేమంత్ ఖత్రి సింథియా: హిందూస్తాన్ షిప్‌యార్డ్ 85వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. వేడుకల్లో భాగంగా సంస్థ ఆవరణలోని వాల్చంద్ హీరాచంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉద్యోగుల మౌలిక సదుపాయాలను పెంచే లక్ష్యంతో చేపట్టిన వాల్వ్ టెస్టింగ్ బే, డిజిటల్ కియోస్క్, పునరుద్ధరించిన డైనింగ్ హాల్, కొత్త పవర్ రూమ్ వంటి పలు సౌకర్యాలను సంస్థ సీఎండీ కమొడోర్ హేమంత్ ఖత్రి ప్రారంభించారు. అలాగే షిప్‌యార్డ్‌లో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను తెలిపే బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హేమంత్ ఖత్రి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి తమ విధి నిర్వహణలో మానసిక ప్రశాంతతను కలిగి ఉంటేనే సంస్థ ఉత్పత్తిలో మెరుగైన ఉత్పాదకతను సాధించగలదన్నారు. సంస్థ చిన్న టగ్‌లను నిర్మించే స్థాయి నుంచి ఐఎన్ఎస్ ధ్రువ్, నిస్టార్ వంటివి నిర్మించే స్థాయికి ఎదిగిందన్నారు. ఇందులో ఉద్యోగుల కృషి ఎంతో ఉందని కొనియాడారు. కార్యక్రమంలో షిప్‌యార్డ్ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. -
పాలిసెట్ కౌన్సెలింగ్‌కు విశేష స్పందన
మురళీనగర్: పాలిటెక్నిక్ కాలేజీల్లో టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆదివారం నిర్వహించిన పాలిసెట్ కౌన్సెలింగ్‌కు విశేష స్పందన లభించింది. అత్యధిక సంఖ్యలో విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్ (గైస్), కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సందడిగా కనిపించాయి. వాతావరణం చల్లగా ఉండటంతో కౌన్సెలింగ్ సజావుగా సాగింది. తల్లిదండ్రులు విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కౌన్సెలింగ్ సాగిందిలా.. ● పాలిటెక్నిక్ కాలేజీలో రెండో రోజు 23,501 నుంచి 32,000 ర్యాంకు వరకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 340 మంది సర్టిఫికెట్లను పరిశీలించారు. వీరిలో 263 మంది బీసీ, 36 మంది ఓసీ, 32 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె.రత్నకుమార్ పర్యవేక్షణలో చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ డాక్టర్ పీఎం భాషా, లెక్చరర్ నాగరాజు కౌన్సెలింగ్ చేపట్టారు. సోమవారం 40,001 నుంచి 50,000 ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ● గైస్‌లో ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణ పర్యవేక్షణలో 15,001 నుంచి 23,500 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో 290 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. సోమవారం 32,001 నుంచి 40,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
పీఆర్ఎస్ఐ కార్యవర్గంలో విశాఖకు కీలక పదవులు
మహారాణిపేట: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్ఎస్ఐ) జాతీయ కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో విశాఖకు చెందిన ఇద్దరు ప్రముఖులకు స్థానం లభించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం వివిధ రాష్ట్రాల నుంచి పీఆర్ఎస్ఐ ప్రతినిధులు హాజరై ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. పీఆర్ఎస్ఐ జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ అజిత్ పాథక్ ఎన్నిక కాగా, విశాఖకు చెందిన స్వచ్ఛ భారత్ నిపుణుడు, రోటరీ జిల్లా–3020 మాజీ కార్యదర్శి, రోటరీ బ్లడ్ సెంటర్ మాజీ కార్యదర్శి, పీఆర్ఎస్ఐ విశాఖ శాఖ మాజీ అధ్యక్షుడు డాక్టర్ పి.ఎల్.కె.మూర్తి వరుసగా రెండవసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలాగే కోరమాండల్ సంస్థ మీడియా సలహాదారు, హెచ్.పి.సి.ఎల్. మాజీ అధికారి, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు యు.ఎస్.శర్మను దక్షిణాది రాష్ట్రాలకు పీఆర్ఎస్ఐ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలాగే 2025–2027 కాలానికి పలువురు కార్యనిర్వాహక సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికై న నాయకత్వ బృందం పీఆర్ఎస్ఐ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తుందని,, పబ్లిక్ రిలేషన్స్ మెరుగుదలకు, వృత్తిపరమైన అభివృద్ధికి కృషిచేయడానికి, సభ్యుల మధ్య నెట్ వర్కింగ్‌ను ప్రోత్సహించడం వంటి పనులను కొనసాగించడానికి కృషి చేస్తుందని జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.ఎల్.కె.మూర్తి పేర్కొన్నారు. పీఆర్ఎస్ఐ జాతీయ కార్యవర్గాన్ని విశాఖ శాఖ అధ్యక్షుడు ఎం.కె.వి.ఎల్.నరసింహం, కార్యదర్శి ఎ.గోవిందరావు, కోశాధికారి ఎన్.వి.నరసింహం, ఉపాధ్యక్షుడు, స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ (పీఆర్) ఆర్.పి.శర్మ, శంకర ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పబ్లిక్ రిలేషన్స్ కె.బంగారు రాజు, విశాఖ శాఖ పూర్వ అధ్యక్షుడు కె.రామారావు తదితరులు అభినందించారు. -
రారండోయ్.. వేడుక చూద్దాం..
● రేపటి నుంచి జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాలు ● 27న తొలి రథయాత్ర ● 28 నుంచి స్వామి దశావతారాలు డాబాగార్డెన్స్: టౌన్‌కొత్తరోడ్డులో వెలసిన చారిత్రక జగన్నాథస్వామి ఆలయంలో వార్షిక రథయాత్ర మహోత్సవాలు ఈ నెల 24 నుంచి జూలై 8 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 185 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో జరిగే ఈ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 24న మంగళవారం జ్యేష్ట బహుళ చతుర్దశి నాడు ప్రతిష్టా ప్రారంభ సంకల్పం, 25న అమావాస్య నాడు ఉదయం జలాధివాసములు, క్షీరాధివాసములు, రాత్రి విశేష హోమాలు, 26న ఆషాడ శుద్ధ పాడ్యమి నాడు ఉదయం పూర్ణాహుతి, నేత్రోత్సవం, సాయంత్రం 6.30 గంటలకు ధ్వజారోహణం, సుభద్రాదేవి శాంతి కల్యాణం జరపనున్నారు. 27న ఉదయం 9.10 గంటలకు స్వామిని రథంపైకి ఆహ్వానిస్తారు. సాయంత్రం 5 గంటలకు భక్తుల జయజయధ్వానాల మధ్య తొలి రథయాత్ర వైభవంగా ప్రారంభమవుతుంది. టర్నర్ చౌల్ట్రీలో దశావతారాల దర్శనం ఈ నెల 28 నుంచి జూలై 6వ తేదీ వరకు టర్నర్ చౌల్ట్రీ కల్యాణ మండపంలో జగన్నాథస్వామి భక్తులకు పది దివ్య అవతారాల్లో నయనానందకరంగా దర్శనమిస్తారు. 28న మత్స్యావతారం, 29న కూర్మావతారం, 30న వరాహావతారం, జూలై 1న నృసింహావతారం, 2న వామనావతారం, 3న పరశురామావతారం, 4న శ్రీరామావతారం, 5న బలరామ, శ్రీకృష్ణావతారం, 6న తొలి ఏకాదశి సందర్భంగా శేషపాన్పు అవతారంలో స్వామిని అలంకరిస్తారు. తిరుగు రథయాత్ర జూలై 7 న ఉదయం 9.45 గంటలకు స్వామి వారిని రథంపైకి ఆహ్వానిస్తారు. సాయంత్రం 5.10 గంటలకు టర్నర్ చౌల్ట్రీ నుంచి మేళ తాళాలు, బాణసంచా వెలుగుల మధ్య జై జగన్నాథ్ నామస్మరణతో తిరుగు రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 8న సంప్రోక్షణ అనంతరం స్వామిని యథాస్థానంలో పీఠారోహణం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులకు సూచనలు ● ఈ నెల 28 నుంచి జూలై 6 వరకు ప్రతి రోజూ ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, లలితా సహస్రనామ పారాయణం, సామూహిక భగవద్గీత, విష్ణు పారాయణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ● తొమ్మిది రోజుల పాటు తమ గోత్రనామాలతో పూజలు జరిపించుకోవాలనుకునే భక్తులు రూ. 500 చెల్లించి దేవస్థానం కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చు. ● దశావతార అలంకరణలు చేయించదలచిన భక్తులు ఆలయ ఈవో టి.రాజగోపాలరెడ్డిని కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరారు. -
‘ఖర్చు రూ.300 కోట్లు.. కానీ గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేకపోయారా? చంద్రబాబు’
సాక్షి,విశాఖ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు ఏం చేసిందో చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. యోగా కార్యక్రమాన్ని చంద్రబాబు పబ్లిసిటీకి వాడుకున్నారు. యోగాకు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించలేదు.డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు దిట్ట.హామీల అమలును ప్రజలు ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారు. విద్యార్థులకు అండగా వైఎస్సార్సీపీ యువతపోరు కార్యక్రమం చేపడుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదు.రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ యువత పోరు నిర్వహిస్తున్నాం. చంద్రబాబును ప్రజల్ని నమ్మి నట్టేటా ముంచారు. విశాఖకు ప్రధాని మోదీని ఆహ్వానించి పెద్ద డ్రామా చేశారు. గిరిజన పిల్లల్ని యోగా పేరుతో ఇబ్బంది పెట్టారు. 300 కోట్లు ఖర్చు చేసి కనీసం బోజనాలు, మ్యాట్స్, టిఫిన్స్, మంచి నీళ్ళు ఇవ్వలేక పోయారు. ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు యోగా డ్రామాలు. తక్కువ సమయంలో ఎక్కువ అప్పలు చంద్రబాబు రికార్డ్ సృష్టించారు. వైఎస్సార్సీపీ హాయాంలో జరిగిన అభివృద్ధి తమ హాయంలోనే జరిగిందని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది’అని మండిపడ్డారు. -
రోడ్డెక్కిన టీచర్లు.. చంద్రబాబు సర్కార్ తీరుపై నిరసన
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు సర్కార్ తీరుకి నిరసనగా టీచర్లు వరుస ఆందోళనలు చేస్తున్నారు. మొన్న ఎస్జీటీలు.. నేడు ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. విశాఖలో మినిమమ్ టైమ్ స్కేల్ ఉపాధ్యాయులు రోడ్కెక్కారు. నేడు జరగాల్సిన కౌన్సిలింగ్‌ను టీచర్లు బహిష్కరించారు. డీఈవో కార్యాలయం వద్ద ఎంటీఎస్ ఉపాధ్యాయులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ఏజెన్సీ వేకెన్సీలు మాత్రమే చూపడంపై టీచర్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారుకాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను బదిలీలు చేయొద్దని డిమాండ్ చేస్తూ చేశారు. సింగిల్ టీచర్ పోస్టులను నిరాకరిస్తున్న ఉపాధ్యాయులు.. మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ఒక ఎంటీఎస్ టీచర్‌ను నియమించాలని డిమాండ్ చేసూ.. డీఈవో కార్యాలయం వద్ద బైఠాయించారు. -
ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది: ప్రధాని మోదీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది. నేను అనే భావన నుంచి మనం అనే భావనను యోగా పెంపొందిస్తుంది’అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద అంతర్జాతీయ యోగా డే వేడుకల సందర్భంగా నిర్వహించిన ‘యోగాంధ్ర అభియాన్’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి 45 నిమిషాలపాటు యోగాసనాలు వేసి.. వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘భారతీయుల జీవన విధానంలో యోగా అంతర్భాగం. దివ్యాంగులు బ్రెయిలీ లిపి ద్వారా యోగ సూత్రాలు చదవడం, శాస్త్రవేత్తలు అంతరిక్షంలో యోగా చేయడం, యోగా ఒలింపియాడ్‌లో గ్రామీణ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి’ అని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించాలని తాను చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇస్తాయని ప్రధాని గుర్తు చేశారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఈ స్థాయిలో ప్రపంచ దేశాలు మద్దతు ఇచ్చాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎక్కడైనా.. సిడ్నీ ఒపెరా హౌస్ మెట్లపై, ఎవరెస్ట్ శిఖరంపై, గగనతలంపై ఎక్కడైనా ‘యోగా అందరికీ’అనే నినాదమే వినిపిస్తుందన్నారు. యోగాను వైద్య కళాశాలల్లో ప్రవేశపెట్టడంతో పాటు కామన్ యోగా ప్రొటోకాల్‌ను తయారు చేస్తున్నామన్నారు. వంటల్లో నూనె వాడకాన్ని 10 శాతం తగ్గించాలని సూచించారు. ప్రపంచాన్ని స్థూలకాయం అనే సమస్య వేధిస్తోందని, యోగా చేయడంతో పాటు వంట నూనెల వాడకాన్ని తగ్గించడం ద్వారా స్థూలకాయ సమస్యను పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు. చికిత్సలకు యోగా దోహదం గుండె, నరాలకు సంబంధించిన వ్యాధుల చికిత్సతో పాటు మహిళల ఆరోగ్యాన్ని కాపాడటంలో యోగా ఎంతో దోహదపడుతుందని ఢిల్లీలోని ఎయిమ్స్ పరిశోధనలో తేలిందని ప్రధాని మోదీ చెప్పారు. భారతదేశంలోని ఆయుర్వేద వైద్యాన్ని, యోగా, యునాని వంటి ప్రాచీన వైద్య పద్ధతులను పొందేందుకు ప్రపంచ ప్రజల కోసం ప్రత్యేకంగా ఈ–ఆయుష్ వీసా కల్పిస్తామన్నారు. విశాఖ నగరం ప్రకృతికి, ప్రగతికి నిలయమైన నగరమని కొనియాడారు. ఈ సందర్భంగా యోగా స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని విడుదల చేశారు. విశాఖ బీచ్ రోడ్లో యోగా ఆసనాలు వేస్తున్న ప్రజలు సెప్టెంబర్‌లో యోగా లీగ్ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో యోగా లీగ్ ప్రారంభిస్తున్నామని చెప్పారు. 2036లో జరిగే ఒలింపిక్స్‌తో పాటు కామన్వెల్త్ క్రీడల్లోనూ యోగాను చేర్చేందుకు కృషి చేయాలని ప్రధాని మోదీని కోరారు. రాష్ట్రంలో మొత్తం 1.44 లక్షల మందికి యోగాలో శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పారన్నారు. వికసిత్ భారత్‌లో భాగంగా ‘విజన్ స్వర్ణ ఆంధ్ర–2047’ప్రణాళికను అనుసరించి హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జయదేవ్ మాట్లాడుతూ యోగాంధ్ర అభియాన్‌లో ఏకంగా 10 లక్షల మంది పాల్గొంటున్నారని పేర్కొన్నారు. యోగా విశిష్టతను రుగ్వేదంలో మహానుభావులు తెలియజేస్తే... ప్రపంచవ్యాప్తం చేసిన దార్శనికులు ప్రధాని మోదీ అని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కొనియాడారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. గిన్నిస్‌బుక్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని చూపిస్తున్న ప్రధాని మోదీ,గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు తదితరులు రెండు గిన్నిస్ రికార్డ్స్విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ 26 కిలోమీటర్ల మేర జరిగిన ఈ కార్యక్రమంలో 3.03 లక్షల మంది పాల్గొనడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు లభించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో సూరత్ వేదికగా 2023లో జరిగిన కార్యక్రమంలో 1.47 లక్షల మంది పాల్గొన్న కార్యక్రమం పేరిట ఇప్పటివరకు గిన్నిస్ రికార్డు ఉందని తెలిపాయి. మరోవైపు ఆంధ్రా యూనివర్సిటీలో ఈ నెల 20న (శుక్రవారం) 22,122 మంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాల కార్యక్రమానికి కూడా గిన్నిస్ రికార్డు లభించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆర్కే బీచ్ వద్ద లంగరేసిన 11 నౌకల్లో కూడా తూర్పు నావికాదళ సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌పై టీడీపీ కుట్ర
● ఇందులో భాగంగానే గోరంట్ల వ్యాఖ్యలు ● ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ మద్దిలపాలెం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని, ఆయనపై కుట్రలకు పాల్పడటమే ఏకై క అజెండాగా టీడీపీ పనిచేస్తోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆరోపించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ తల నరుకుతామంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు అధికార మదంతో అన్నవి కావని.. అది ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్న కుట్రలో భాగమేనని రాజు ఆరోపించారు. ‘పుష్ప–2’ సినిమా డైలాగ్‌తో ఫ్లెక్సీ వివాదాన్ని సృష్టించడం, ఆ వెంటనే గోరంట్ల చేత ఈ వ్యాఖ్యలు చేయించడం టీడీపీ, ఎల్లో మీడియా వేసిన పథకమని విమర్శించారు. బుచ్చయ్య చౌదరిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే.. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ ఇలాంటి డైవర్షన్, క్రిమినల్ రాజకీయాలకు పాల్పడుతోందని రాజు ఆరోపించారు. ‘ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తా, రెడ్ బుక్ అంటూ చంద్రబాబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముందు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు?’ అని ప్రశ్నించారు. ఏడాదిలోనే ఒక ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైన వ్యతిరేకత రావడం.. దేశ చరిత్రలోనే కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. సూపర్ సిక్స్, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆడబిడ్డ నిధి, ఉచిత పంటల బీమా వంటి హామీలను గాలికొదిలేశారని విమర్శించారు. దిగజారిన శాంతిభద్రతలు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఇసుక, మట్టి, లిక్కర్ మాఫియాలు పెచ్చుమీరాయని కె.కె.రాజు ఆరోపించారు. 390 మంది హత్యకు గురయ్యారని, 376 మందిపై హత్యాయత్నాలు జరిగాయన్నారు. 203 మంది చిన్నారులపై దాడులు, లైంగిక దాడులు జరిగాయన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 కేసులు పెట్టారని, సోషల్ మీడియా కార్యకర్తలపై 729 అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. ఏడాది కాలంలోనే రూ.1.61 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. తమ ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులో ఇది 48.5 శాతం అని గుర్తుచేశారు. రాష్ట్ర ఆదాయం పెరగకపోగా, 0.44 శాతం తగ్గిందని, ఆ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోందో చెప్పాలని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగానే జగన్‌కు భద్రత తగ్గించి, ఆయన పర్యటనల్లో హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజాభిమానం ఉన్నంత వరకు ఎలాంటి కుట్రలు పన్నినా జగన్‌ను ఏమీ చేయలేరని కె.కె.రాజు స్పష్టం చేశారు. -
హైవే జామ్
క్రికెట్ స్టేడియం వద్ద వాహనాల రద్దీస్తంభించిన ప్రజా రవాణా ● ప్రయాణికులకు నరకయాతన ఎంవీపీకాలనీ: విశాఖపట్నం వేదికగా జరిగిన ‘యోగాంధ్ర’ కార్యక్రమం నగరవాసులకు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రయాణికులకు తీవ్ర అవస్థలు మిగిల్చింది. కార్యక్రమం కోసం ప్రభుత్వం సుమారు 9,995 ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. శనివారం తెల్లవారుజాము నుంచే మద్దిలపాలెం, ఇసుకతోట, హనుమంతవాక, మధురవాడ, ఆనందపురం కూడళ్లలో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. గ్రామీణ నియోజకవర్గాల నుంచి వచ్చిన వాహనాలను తగరపువలస, ఆనందపురం, మధురువాడ, ఎండాడ, జూపార్క్ కూడళ్ల మీదగా బీచ్‌లోకి పంపించడంతో ఆయా కూడళ్లలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో యోగా కార్యక్రమానికి వెళ్లేవారితో పాటు, సాధారణ ప్రజలు గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యోగాంధ్రకు వెళ్లే వారంతా ఆయా ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై దిగి బీచ్‌రోడ్డుకు నడుచుకుంటూ వెళ్లాల్సివచ్చింది. ఇక విశాఖ నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక, ప్రైవేటు వాహనాలు దొరక్క ద్వారకా, మద్దిలపాలెం బస్స్టేషన్ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాశారు. ఇదే అదనుగా కొన్ని ఆటోలు, ప్రైవేటు వాహనాలు ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేసి వారిని మరింత ఇబ్బందికి గురిచేశాయి. మొత్తం మీద యోగాంధ్ర కార్యక్రమం నగరంలో ట్రాఫిక్ గందరగోళాన్ని, ప్రయాణికులకు నరకయాతనను మిగిల్చింది. -
విశాఖ అభివృద్ధి నా బాధ్యత
● మెట్రో, ఫ్లైఓవర్ ప్రాజెక్టులు వేగవంతం చేస్తా.. ● పాతనగరం ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి ● జీవీఎంసీ నూతన కమిషనర్ కేతన్ గార్గ్ డాబాగార్డెన్స్: విశాఖ నగర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని జీవీఎంసీ నూతన కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘నగరంలో పారిశుధ్యం, సుందరీకరణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తా. పౌరులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పిస్తా. తాగునీరు, వీధి దీపాలు, కాలువలు, రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జీవీఎంసీకి అందే నిధులను సక్రమంగా వినియోగించి, విశాఖను మరింత అభివృద్ధి చేస్తా. ఇందుకోసం మేయర్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకుంటా. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖకు ఉత్తమ ర్యాంకు సాధించేందుకు అందరి సహకారంతో కృషి చేస్తా. డీపీఆర్ ప్రకారం ప్రతిపాదించిన మెట్రో, ఫ్లైఓవర్ ప్రాజెక్టులకు జీవీఎంసీ తరఫున పూర్తి సహకారం అందిస్తా. ఆ పనులు వేగవంతమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటా..’ అని చెప్పారు. నగరంలోని ఖాళీ స్థలాలను సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తానని నూతన కమిషనర్ తెలిపారు. పార్కులు, కూడళ్లను అభివృద్ధి చేస్తానని చెప్పారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన కాలువల్లోని పూడికను తొలగిస్తామన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులపై సర్వే నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. దక్షిణ నియోజకవర్గం పాతనగరంలో సమస్యలున్నాయని, వాటిని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రోడ్ల అభివృద్ధిపై సర్వే నిర్వహించి, అడ్డంకులుంటే న్యాయపరంగా వాటిని పరిష్కరిస్తామని, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. నగరంలోని సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను పోలీస్ శాఖ, జీవీఎంసీ సమన్వయంతో నిర్వహిస్తామన్నారు. తీర నగరమైన విశాఖను ఇతర నగరాలతో ‘సిస్టర్ సిటీ’లుగా అనుసంధానించేందుకు ప్రయత్నిస్తామని, నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని కేతన్ గార్గ్ పేర్కొన్నారు. -
ఆరోగ్యవంతమైన సమాజంతో సుస్థిర అభివృద్ధి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజావిశాఖ లీగల్: ఆరోగ్యవంతమైన సమాజంతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజా అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ, విశాఖ న్యాయవాదుల సంఘం సంయుక్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ, యోగ ధ్యానం తప్పనిసరి అని తెలిపారు. విశాఖలో తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినందుకు పలువురిని అభినందించి, భారత ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
మరుగుదొడ్లు లేవు
మేము అనకాపల్లి జిల్లా సీతానగరం నుంచి వచ్చాం. శుక్రవారమే బయలుదేరించారు. భోజనం, నిద్ర అంతంత మాత్రమే. ఇక్కడకు వేకువ జామునే వచ్చాం. కనీసం మరుగుదొడ్ల సదుపాయం లేక బాటిల్స్ పట్టుకుని తుప్పల్లోకి వెళ్లాం. –ధర్మతేజ, విద్యార్థి, అనకాపల్లి జిల్లా యోగాసనాలు వేయనేలేదు.. ఇక్కడ యోగా ఎలాగూ చేయించలేదు. కనీసం చూసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఉదయం 4 గంటలకు గాజువాకలో బయలుదేరాం. ట్రాఫిక్‌తో ఇక్కడకి వచ్చేసరికే 8 అయిపోయింది. ఇన్ని కష్టాలు పడి ఇక్కడకు వస్తే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. –ప్రియాంక, అగనంపూడి కాంట్రాక్టర్ వైఫల్యం చేపలుప్పాడ వద్ద తొక్కిసలాటలు, తోపులాటల్లో కాంట్రాక్టర్ వైఫల్యం స్పష్టంగా కనిపించంది. 2 వేలకు పైగా మందిని తాత్కాలిక కంపార్ట్మెంట్లోకి తోసేశారు. కనీసం రెండో స్క్రీన్ కూడా ఏర్పాటు చేయలేదు. జీవీఎంసీ అధికారులకు చెప్పినా వసతులు సమకూర్చలేదు. – దోని నాగరాజు, బీజేపీ జిల్లా యూత్ అధ్యక్షుడు -
ప్రభుత్వానికి ఖర్చు.. మాకు సమయం వృథా
విశాఖ బీచ్‌లోనే యోగాసనాలు వేయాలనుకోవడం వ్యయప్రయాస తప్ప మరొకటి కాదు. శుక్రవారం రాత్రి 8 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరి నిద్ర లేకుండా డొక్కు బస్సుల్లో శనివారం ఉదయం ఇక్కడకు చేరుకున్నాం. ప్రభుత్వానికి వృథా ఖర్చు, మాకు సమయం వృథా. ఇక్కడకు వచ్చి మేము చేసింది ఏమీ లేదు. సరదాగా వచ్చినట్టయింది. –పెంట మధు, బూర్జ, శ్రీకాకుళం ఇబ్బందులు పడ్డాం విజయనగరం నుంచి తెల్లవారుజామున వచ్చేశాం. బీచ్‌రోడ్డులో మాకు ఓ స్థలం చూపించారు. అక్కడే ఉండమని చెప్పారు. అయితే దగ్గరలో మరుగుదొడ్లు లేకపోవడంతో మేమంతా చాలా ఇబ్బందులు పడ్డాం. చుట్టూ కర్రలతో కట్టివేయడంతో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎందుకు వచ్చామా అనిపించింది. – లక్ష్మి, విజయనగరం -
కారాగారంలో వినూత్న యోగా
ఆరిలోవ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ కేంద్ర కారాగారంలో అధికారులు వినూత్నంగా నిర్వహించారు. జైలు లోపల 1000 మంది ఖైదీలతో కలిసి అధికారులు, సిబ్బంది నల్ల రంగు ప్యాంట్లు, పలు రంగుల టీషర్టులు ధరించి యోగాసనాలు వేశారు. రంగురంగుల యోగా మ్యాట్లపై భారతదేశం మ్యాప్ ఆకారంలో నిలబడి యోగా చేస్తూ స్వదేశంపై ఉన్న అభిమానం చాటుకున్నారు. దీంతో పాటు జైల్ ప్రధాన ద్వారం బయట గాంధీ విగ్రహం వద్ద సిబ్బందితో కలిసి అధికారులు వృత్తాకారంలో నిలబడి యోగాసనాలు వేశారు. క్రమశిక్షణతో యోగాసనాలు వేసిన ఖైదీలు, సిబ్బందిని జైల్ పర్యవేక్షణాధికారి ఎం.మహేష్‌బాబు అభినందించారు. -
మ్యాట్ల కోసం కొట్లాట.. టాయిలెట్ల కోసం తోపులాట
● యోగాంధ్రలో ప్రజలు అవస్థలు ● ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3.03 లక్షలకు పైగా జనసమీకరణ ● సగం మందికే యోగా మ్యాట్లు.. అల్పాహారం కిట్లు.. ● యోగాసనాల తర్వాత బస్సుల కోసం కిలోమీటర్లు నడక విశాఖ సిటీ: యోగాంధ్ర కార్యక్రమం ప్రజల సహనానికి పరీక్ష పెట్టింది. యోగాభ్యాసకులకు సైతం ముచ్చెమటలు పట్టించింది. అర్ధరాత్రి ప్రజలను తరలించడం.. అందుబాటులో టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడం.. యోగాసనాల తర్వాత బస్సుల కోసం కిలోమీటర్ల మేర నడిపించడంతో విసిగెత్తిపోయారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి విద్యార్థులకు అర్ధరాత్రి 12 గంటలకే రుషికొండకు తరలించారు. దీంతో వారు రోడ్ల మీదే నిద్రపోయారు. అలాగే తరలించిన వారిని నిర్ణీత కంపార్ట్మెంట్ల వద్దే దించి.. తిరిగి అక్కడే ఎక్కించుకుని ఇళ్లకు తరలిస్తామని చెప్పిన ప్రభుత్వం.. కార్యక్రమం ముగిసిన తర్వాత పట్టించుకోలేదు. యోగాంధ్ర వేదికకు తరలించడానికి పెట్టిన శ్రద్ధ.. తిరిగి వారిని తీసుకెళ్లే విషయంపై పెట్టలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యోగాంధ్రకు వచ్చిన 3.03 లక్షలకు పైగా జనాలు కూటమి ప్రభుత్వంపై పెదవి విరిచారు. టాయిలెట్ల కోసం అవస్థలు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలను యోగాంధ్ర వేదికకు పెద్ద ఎత్తున తరలించారు. అర్ధరాత్రి 2 గంటలకే ప్రత్యేక బస్సుల్లో లక్షల మంది జనాలను నిర్ణీత కాంపార్ట్మెంట్ల వద్దకు తీసుకొచ్చారు. వీరిలో అత్యధిక శాతం మహిళలే ఉన్నారు. డ్వాక్రా మహిళలు తప్పనిసరిగా యోగాంధ్ర కార్యక్రమానికి హాజరుకావాలని హెచ్చరించడంతో మెజార్టీ మహిళలు తప్పనిసరి పరిస్థితుల్లో తరలివచ్చారు. అయితే ఉదయం కాలకృత్యాలు తీర్చుకోడానికి మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతి వంద మందికి ఒక టాయిలెట్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జోడుగుళ్లపాలెం నుంచి భీమిలి వరకు వేసిన కంపార్ట్మెంట్లకు దూరంగా టాయిలెట్లు ఏర్పాటు చేశారు. కొన్ని చోట ఏకంగా అర కిలోమీటరు దూరంగా బయో టాయిలెట్లను ఉంచారు. దీంతో కాంపార్ట్మెంట్ల నుంచి ప్రజలు అక్కడికి వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. అక్కడ కూడా పెద్ద క్యూలు ఉండడంతో ఎటు వెళ్లాలో తెలియక నరకయాతన అనుభవించారు. కొన్ని చోట్ల టాయిలెట్లకు వెళుతున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ బయో టాయిలెట్లను సైతం శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం భరించలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మ్యాట్ల కోసం కొట్లాట ఒకవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేస్తుంటే.. మరోవైపు యోగా మ్యాట్ల కోసం కొందరు ముష్టి యుద్ధాలు చేసుకున్నారు. స్నాక్ ప్యాకెట్ల కోసం దుస్తులు చింపుకున్నారు. ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ వరకు యోగాసన కార్యక్రమం సజావుగా జరిగింది. ఎంవీపీ కాలనీ నుంచి భీమిలి వరకు, అలాగే పీఎం పాలెం, మిథిలాపురి వుడా కాలనీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో తోపులాటలు, కొట్లాటలు జరిగాయి. ఈ యోగాసనాలకు వచ్చే 5 లక్షల మందికి ఉచితంగా యోగా మ్యాట్లు, టీషర్ట్, స్నాక్స్, పళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే సగం మందికి కూడా వీటిని అందించలేదు. వీఐపీలు, అధికారులు యోగాసనాలు వేసే ప్రాంతాల్లో మ్యాట్లు, స్నాక్ ప్యాకెట్లు కంపార్ట్మెంట్లలోనే అందుబాటులో ఉంచారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాటిని అందించలేదు. పీఎం పాలెం డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో వాటర్ బాటిళ్లు, యోగా మ్యాట్లు, స్నాక్స్ కోసం జనాలు ఎగబడ్డారు. ఈ క్రమంలో తోపులాటలు జరిగి కొట్లాటకు దిగారు. ఇందులో గాజువాకకు చెందిన కూటమి నాయకుడు కారులో వచ్చి పోలీసుల సాయంతో జనాన్ని పక్కకు నెట్టి స్నాక్స్, యోగా మ్యాట్ల బస్తాలను బలవంతంగా కారులో ఎక్కించుకుని ఉడాయించాడు. దీనిపై అక్కడున్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తిమ్మాపురంలో స్నాక్ ప్యాకెట్ల కోసం, చేపలుప్పాడలో టీషార్టుల కోసం తోపులాటలు జరిగాయి. కిలోమీటర్లు నడక యోగాసనాలు ముగిసిన తర్వాత ప్రజలందరూ ఒకేసారి బయలుదేరారు. కాంపార్ట్మెంట్ల వద్ద దించిన బస్సులను ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంగా నిలిపారు. అవి బీచ్ రోడ్డులోకి వచ్చే పరిస్థితి లేదని, అందరూ ఆ బస్ పాయింట్ల వద్దకు రావాలని సూచించారు. దీంతో యోగాకు వచ్చిన వారు కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి నిద్రలేక, కాలకృత్యాలు తీర్చుకునే అవకాశం లేక విసిగెత్తిపోయారు. దీనికి తోడు కిలోమీటర్లు నడవాల్సి రావడంతో ప్రభుత్వంపై మండిపడ్డారు. బలవంతంగా తీసుకురావడమే కాకుండా అవస్థలకు గురిచేయడాన్ని తప్పుబట్టారు. కాలకృత్యాల కోసం విద్యార్థుల పాట్లుతెన్నేటి పార్కు వద్ద మ్యాట్ల కోసం తోపులాట -
రికార్డు యోగా
యోగాంధ్రకు రెండు గిన్నిస్ రికార్డులు విశాఖ సిటీ: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. అట్టహాసంగా ‘యోగా ఫర్ వన్ ఎర్త్–ఎన్ హెల్త్’ నినాదంతో చేపట్టిన యోగాంధ్ర వేడుకల్లో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం యోగా విశిష్టతలపై ప్రసంగించారు. అనంతరం 3.03 లక్షల మంది ప్రజలతో కలిసి 45 నిమిషాల పాటు యోగాసనాలు వేశారు. రెండు గిన్నిస్ రికార్డులు సొంతం ఈ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా రెండు గిన్నిస్ రికార్డులు సొంతమయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో 25 వేల మంది గిరిజన విద్యార్థులు యోగాసనాలు వేశారు. 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించారు. అలాగే శనివారం ఉదయం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన 326 కంపార్ట్మెంట్లకు 3.03 లక్షల మంది జనాలు వచ్చారు. ఏకకాలంలో సామూహిక యోగాసనాలు వేసినందుకు గాను మరో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సొంతమైంది. గతంలో సూరత్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 1.47 లక్షల మంది పాల్గొనగా.. విశాఖ జరిగిన కార్యక్రమానికి 3.03 లక్షల మంది ప్రజలు భాగస్వాములయ్యారు. ఈ రెండు గిన్నిస్ రికార్డు ధ్రువపత్రాలను మంత్రులు లోకేష్, సత్యకుమార్‌లకు అందజేశారు. యుద్ధ నౌకల్లో నేవీ సిబ్బంది విన్యాసాలు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో తూర్పు నావికాదళం కూడా భాగస్వామ్యమైంది. ఈఎన్సీకి చెందిన 11 యుద్ధనౌకలను శనివారం ఉదయం సాగర తీరంలో మోహరించారు. అందులో నేవీ అధికారులు, సిబ్బంది కూడా యోగాభ్యాసాలు చేశారు. వీరితో పాటు 11 వేల మంది నేవీ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు శనివారం ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన వేదికల్లో కూడా యోగాసనాలు వేశారు. ఊపిరిపీల్చుకున్న అధికారులు యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు కొన్ని నెలలుగా శ్రమిస్తున్నాయి. జిల్లాలో అన్ని శాఖల అధికారులు సమన్వయంగా అహర్నిశలు కష్టపడ్డారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 5 లక్షల మందిని తరలించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని ఇచ్చింది. అందుకు తగ్గట్లుగానే అధికారులు ప్రయత్నాలు చేశారు. అయితే లక్ష్యానికి చేరుకోలేకపోయినప్పటికీ.. 3.03 లక్షల మందిని తీసుకువచ్చి గిన్నిస్ రికార్డు సొంతమయ్యేలా చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, గవర్నర్, సీఎం, ఇతర ప్రముఖులు హాజరవడంతో ఒకవైపు వారి భద్రత, వసతితో పాటు మరోవైపు జనాల తరలింపు, వారికి ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. లోటుపాట్లు ఉన్నప్పటికీ.. యోగాంధ్ర కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఏయూ గ్రౌండ్ దిక్కయింది.. యోగాంధ్రలో గిన్నిస్ రికార్డుకు వేదికై న ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ గ్రౌండ్‌ను అభివృద్ధి చేశారు. ఆ సమయంలో అస్తవ్యస్తంగా ఉన్న గ్రౌండ్లో గ్రావెల్ వేసి ఎత్తు పెంచారు. అలాగే దాని ఎదురుగా దశాబ్దాలుగా తుప్పలు, పిచ్చి మొక్కలతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ప్రాంతాన్ని సైతం చదును చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఏయూ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని తప్పుడు ప్రకటనలు చేశారు. ఇప్పుడు 25 వేల మంది గిరిజన విద్యార్థులు యోగాసనాలకు వేదికై ంది. గిన్నిస్ రికార్డును చేరువ చేసేందుకు పరోక్షంగా కారణమైంది. పాల్గొన్న పీఎం మోదీ, గవర్నర్, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు 25 వేల గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలు 3 లక్షలకు పైగా ప్రజలు యోగాసనాలతో సూరత్ రికార్డు బ్రేక్