
ఉద్యోగం ఇవ్వండి
ఏపీ ట్రాన్స్‌కోలో సబ్ ఇంజినీర్ పోస్టుకు అన్ని అర్హతలు ఉన్నా తనకు ఉద్యోగం ఇవ్వడం లేదని గాజువాకకు చెందిన జలుమూరి శ్రీలక్ష్మి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించింది. డిప్లొమో (ఎలక్ట్రికల్), బీఈ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణురాలినైనప్పటికీ, ఎన్నోసార్లు దరఖాస్తు చేసినా ఉద్యోగం రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకంటే తక్కువ అర్హతలు ఉన్నవారికి ఉద్యోగాలు ఇస్తున్నారని, రోస్టర్ విధానాన్ని, మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం లేదని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం చేసి ఉద్యోగం కల్పించాలని ఆమె వేడుకుంది.