
5న వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 5వ తేదీన ఉదయం 9.30 గంటలకు వెంకోజిపాలెం సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు తెలిపారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బాబు ష్యూరిటీ–మోసాలు గ్యారెంటీ’ పేరిట కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడతామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ విధంగా ఎగనామం పెడుతుందో ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ సమావేశానికి పార్టీ శ్రేణులంతా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, మొల్లి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ కుమార్, చింతలపూడి వెంకట రామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లవరపు జాన్‌వెస్లీ, పేర్ల విజయచందర్, పోతిన శ్రీనివాసరావు, మహంతి, పార్టీ ముఖ్య నాయుకులు కోలా గురువులు, ఉరుకూటి అప్పారావు, పివిఎస్‌ఎన్ రాజు (వుడా రవి), డాక్టర్ సిఎంఎ జహీర్ అహ్మద్, బాణాల శ్రీనివాసరావు, గొలగాని శ్రీనివాస్, నడింపల్లి కృష్ణంరాజు, జి.శ్రీనివాస్, మువ్వల సురేష్, ద్రోణంరాజు శ్రీ వాస్తవ తదితరులు పాల్గొన్నారు.