
35 మంది ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ
మద్దిలపాలెం: జిల్లాలోని ఆర్టీసీ డిపోలలో పనిచేస్తున్న 35 మంది సూపర్‌వైజర్లు, సిబ్బంది సోమవారం పదవీ విరమణ చేశారు. విశాఖ డిపోలో సోమవారం నిర్వహించిన పదవీ విరమణ సత్కార కార్యక్రమంలో ఆర్టీసీ విశాఖ రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన వాల్తేరు, మద్దిలపాలెం, విశాఖ స్టీల్ సిటీ, గాజువాక, మధురవాడ డిపోల కార్మికులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, వారికి రావాల్సిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ త్వరలో అందజేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డిపో మేనేజర్లు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.