
మన దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)కు నాయకత్వం వహించిన తొలి మహిళ ఆమె. దేశంలోని అత్యున్నత వైద్య సంస్థల్లో ఒకటి. పైగా దాదాపు 70 సంవత్సరాల చరిత్రలో ఆ ప్రతిష్టాత్మక సంస్థకు నాయకత్వం వహించిన ఏకైక మహిళ కూడా ఆమెనే కావడం విశేషం. అంతేగాదు హత్యకు గురైనా నాటి ప్రధాని ఇంధిరాగాంధీని శతవిధాల కాపాడేందుకు ప్రయత్నించిన మహిళా వైద్యురాలు కూడా ఆమెనే. ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా అంతటి గౌరవనీయ హోదాలో పనిచేసిన ఆ మహిళా వైద్యురాలికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..!.
తొలి మహిళా రేడియాలజిస్టు అయిన డాక్టర్ భారవ్ 1984లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టరు. ఆమెను ఆమె పదవికి ఎంపిక చేసింది నాటి ప్రధాని ఇందిరా గాంధీనే. నిజానికి 1940ల భారతదేశంలో రేడియాలజీ అభివృద్ధి చెందుతున్న దశలో ఉండగానే..దానినే ఆమె ఎంచుకుని, అందులోని వైద్యురాలిగా కొనసాగి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేగాదు 95 ఏళ్ల వయసులో ఉన్నా ఆమె ఇప్పటికీ ఆ విభాగంలో ప్రొఫెసర్ కొనసాగుతుండటం విశేషం.
ఆమెను డైరెక్టర్‌గా ఎవరైతే ఎంపిక చేశారో ఆమేకే వైద్యం అందిచాల్సిన విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నారామె. చెప్పాలంటే అత్యున్నత హోదా ఖరారయ్యే సమయంలోనే ఈ విషాదాన్ని హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. అంటే..బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే సవాళ్లును ఎదుర్కొంటు వచ్చారామె. వాటన్నింటి జ్ఞాపకాలు "ది ఉమెన్ హూ రన్ ఎయిమ్స్" అనే పుస్తకంలో పొందుపర్చారామె. అందులోని కొన్ని ఆసక్తికర విషయాలు ప్రేరణ కలిగించడమే కాకుండా ధైర్యంగా సవాళ్లను ఎలా ఫేస్ చేయాలో నేర్పిస్తాయి. అవేంటంటే..
AIIMS డైరెక్టర్‌గా ఆమె ఉద్యోగంలో చేరిన మొదటి రోజు అక్టోబర్ 31, 1984 ఉదయం ఆమె నియమాకాన్ని ధృవీకరించడంపై సమావేశ జరుగుతోంది. అయితే భర్గవ ఆ సమావేశంలో పాలుపంచుకోలేదు. ఆ రోజు ఆమె కొన్ని క్రిటికల్ వైద్య కేసులను పర్యవేక్షిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే సహోద్యోగి ఎమర్జెన్సీ కేసు వచ్చిదంటూ ఆమెను హుటాహునా క్యాజువాలిటీ వార్డుకి తీసుకుపోయారు. అక్కడ స్ట్రెచ్చర్‌పై ప్రధాని ఇందిరా గాంధీ రక్తంతో తడిసి ముద్దై పడి ఉన్నారు.
మరోవైపు పెద్ద సంఖ్యలో జనంలో ఆస్పత్రి ప్రాంగణంలోకి దూసుకొస్తుంది. ఈ ఘర్షణల నడుమ ఎయిమ్స్ డైరెక్టర్‌గా నాటి ప్రధాని ఇంధిరాగాంధీకి చికిత్స అందించాల్పి ఉంది. ఉగ్రవాదులను తరిమికొట్టడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ జూన్‌లో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై సైనిక దాడి నిర్వహించడంతో ఇద్దరు సిక్కు అంగరక్షకులే ఆమెపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
ఆ నేపథ్యంలోనే ఆమెను హుటాహుటినా ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు బార్గవ తన పుస్తకంలో రాసుకొచ్చారు. దురదృష్టం ఏంటంటే ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చేటప్పటికే ఆమె చనిపోయారు. అయితే తాము ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే వరకు కాపాడటానికి ప్రయత్నిస్తున్నామనే కథ కొనసాగించాల్సి వచ్చిందని చెప్పారు.
అంతేగాదు నాలుగు గంటల వరకు ఇందిరా శరీరాన్ని పాడవ్వకుండా ఎంబామింగ్ చేసే బాధకరమైన ప్రక్రియను గురించి కూడా అందులో వివరించారు. ఇలాంటి ఎన్నో ఉత్కంఠ పరిస్థితులను తన కెరీర్‌లో ఎన్నో ఎదుర్కొన్నారామె. అలాగే సోనియా గాంధీ కుమారుడు రాహుల్‌ని ఎయిమ్స్‌కి తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఆ పుస్తకంలో పంచుకున్నారు. ఆయన తలకు బాణం తగలడంతో ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు తెలిపారు.
పలు రాజకీయ ఒత్తుడులు..
అలాగే రాజకీయ ఒత్తిడిని కూడా ఎదర్కొన్నారు. ఒక ఎంపీ తన అల్లుడిని ఎయిమ్స్‌లో ఉద్యోగం కోసం ఎంపిక చేయలేదని బెదిరించిన అనుభవాలను కూడా ప్రస్తావించారు. ఇదేగాక ఫెడరల్ హెల్త్ సెక్రటరీతో సహా ఇద్దరు అగ్ర రాజకీయ నాయకులు ఎయిమ్స్ డీన్‌ను స్వయంగా ఎంచుకోవడానికి ప్రయత్నించే సాహసం చేసినప్పుడూ కూడా ఆమె దాన్ని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టారు.
ఆమె నేపథ్యం..
లాహోర్‌లోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన భార్గవకు చిన్నతనం నుంచే వైద్యవృత్తి అంటే మహా మక్కువ. సరిగ్గా పాకిస్తాన్ విభజన సమయంలో, డాక్టర్ భార్గవ కుటుంబం భారతదేశానికి వచ్చి స్థిరపడింది. చిన్నతనంలో తన తండ్రితో కలిసి శరణార్థి శిబిరాల్లోని ప్రజలకు సహాయం చేయడంలో పాలుపంచుకునేది. అంతేగాదు భారతదేశంలో స్త్రీలు ఉన్నత విద్యను అభ్యసించని సమయంలోనే లండన్‌లో రేడియాలజీని పూర్తిచేశారామె.
ఆమె తన క్లాస్‌లోనూ ఆస్పత్రిలోనూ వైద్య చదువుని అభ్యసించిన చివరగా ఆమె తన కలను సాధించడంలో సహాయపడిన తన కుటుంబాన్ని, తన భర్తను ప్రశంసలతో కొనియాడారు. ఇక భార్గవ కేవలం కొడుకులకే గాక, కూతుళ్లకు కూడా మద్దుత ఇవ్వమని తల్లిదండ్రులకు సూచించారు.
(చదవవండి: అందం ముఖ్యమే.. కానీ, ఆ బలహీనతకు లొంగిపోకూడదు!)