
నేటితో ముగియనున్న పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
మురళీనగర్: పాలిటెక్నిక్ కాలేజీల్లో టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న పాలిసెట్ కౌన్సెలింగ్ శనివారంతో ముగియనుంది. శుక్రవారం మొత్తం 386 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. జీఐఈటీఎస్ లో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ పర్యవేక్షణలో, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ సిహెచ్. జయప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో 104001 నుంచి 112000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో 152 మందికి సర్టిఫికెట్లు పరిశీలించగా, వారిలో 112 మంది బీసీ, 17 మంది ఓసీ, 23 మంది ఎస్సీ విద్యార్థులు ఉన్నారు.పాలిటెక్నిక్ కాలేజీలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్ పర్యవేక్షణలో, జనరల్ హెడ్, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ డాక్టర్ పి.ఎం. భాషా, లెక్చరర్ నాగరాజు ఆధ్వర్యంలో 112001 నుంచి 120000 ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ జరిగింది. ఇక్కడ 234 మందికి సర్టిఫికెట్లు పరిశీలించగా, 166 మంది బీసీ, 26 మంది ఓసీ, 30 మంది ఎస్సీ, 12 మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నారు. శనివారం జీఐఈటీఎస్‌లో 1,20,001 నుంచి 1,27,000 ర్యాంకు వరకు ఉన్న విద్యార్థులు హాజరు కావాలి. పాలిటెక్నిక్ కాలేజీలో 1,27,001 నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న విద్యార్థులు హాజరు కావాలి.ఎస్టీ విద్యార్థులందరూ పాలిటెక్నిక్ కాలేజీకి హాజరు కావాల్సి ఉంటుంది.