
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో ప్రథమ స్థానంలో నిలపాలి
జెడ్పీ సీఈవో నారాయణమూర్తి
మహారాణిపేట: స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి కోరారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్–2025లో భాగంగా మెరుగైన పారిశుధ్యం కోసం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానానికి తీసుకువెళ్లడానికి అందరి సహకారం అవసరమన్నారు. గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ బృందాలు పర్యటించి, కేటగిరీల వారీగా పరిశీలించి మార్కులు వేస్తాయన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచడమే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ఎం.వి.శ్రీనివాసరావు, జిల్లా రూరల్ వాటర్ సప్లై సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.వి.వి.చౌదరి, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, ఏఈ ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.