
జోలికి పోవద్దు
మాదక
ద్రవ్యాల
ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు
బీచ్‌రోడ్డులో వాక్‌థాన్
మహారాణిపేట: డ్రగ్స్‌కు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి యువతకు పిలుపునిచ్చారు. ‘నషా ముక్త్ అభియాన్’లో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని గురువారం బీచ్‌రోడ్‌లో వాక్‌థాన్ నిర్వహించారు. ఎన్‌సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో), ఎస్‌బీఐ, ఈగల్ టీం, విభిన్న ప్రతిభావంతులు, పోలీస్, ఎకై ్సజ్ తదితర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు జరిగిన ఈ వాక్‌థాన్‌లో వేలాది మంది పోలీసులు, ఎన్‌సీసీ విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, ఇతర విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాను మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు యువతకు అందుబాటులో లేకుండా చూడాలన్నారు. డ్రగ్స్, గంజాయి సరఫరాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టాలని పోలీసు, రెవెన్యూ యంత్రాంగానికి సూచించారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ డ్రగ్స్ సరఫరాను అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనుకోకుండా మాదక ద్రవ్యాల ఉచ్చులో పడిన వారు పునరావాస కేంద్రాలను(కేజీహెచ్‌లో ఒకటి, మానసిక వైద్యశాల పరిధిలో మరొకటి) సంప్రదించవచ్చన్నారు. నషా ముక్త్(14446), ఈగల్ (1972), టెలీ మానస్ సెంటర్(1933) టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా సహాయం పొందవచ్చని, డ్రగ్స్ సమాచారం తెలపవచ్చని సూచించారు. సీపీ బాగ్చి మాట్లాడుతూ డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకుని జీవితాలను చీకటిమయం చేసుకోవద్దని యువతకు హితవు పలికారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, డీసీపీ అజిత, ఎన్‌సీబీ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కవిత, ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్రమూర్తి, అసిస్టెంట్ కమిషనర్ మహేశ్ కుమార్, సూపరింటెండెంట్ ప్రసాద్, పలు శాఖల అధికారులు, యువత, వలంటీర్లు పాల్గొన్నారు.

జోలికి పోవద్దు