
ప్రేమ సమాజం నూతన అధ్యక్షుడిగా మట్టపల్లి
డాబాగార్డెన్స్: ప్రేమ సమాజం కమిటీ నూతన అధ్యక్షుడిగా సంఘ సేవకుడు మట్టపల్లి చలమయ్య కుమారుడు మట్టపల్లి హనుమంతరావు నియమితులయ్యారు. డాబాగార్డెన్స్ ప్రేమసమాజం ఆడిటోరియంలో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో వార్షిక కార్యదర్శి నివేదిక, జమాఖర్చులు, వార్షిక బడ్జెట్ నివేదికను సభ్యులు ఆమోదించారు. అనంతరం ప్రముఖ న్యాయవాది పి.నారాయణరావు చీఫ్ ఎన్నికల అధికారిగా 2025–27 కాలానికి ఏకగ్రీవంగా ఎన్నికై న 20 మంది కార్యవర్గ సభ్యుల పేర్లు ప్రకటించారు. ఎన్నికల అధికారి పీవీ నారాయణరావు సమక్షంలో నూతన కార్యవర్గ తొలి సమావేశం ఏర్పాటు చేస్తూ, నూతన కమిటీని వెల్లడించారు. అధ్యక్షుడిగా మట్టపల్లి హనుమంతరావు, ఉపాధ్యాక్షుడు–1గా కేశప్రగడ నరసింహమూర్తి, ఉపాధ్యక్షుడు–2 కంకటాల మల్లిఖార్జునరావు, కార్యదర్శిగా వి.మోహన్‌రావు, కోశాధికారిగా ఎంవీవీకే గుప్తా, సంయుక్త కార్యదర్శులుగా పి.లక్ష్మీగుప్తా, ఎస్.నాగేశ్వరరావు, ఎల్.వెంకట్రావు, అడ్వైజరీ సభ్యుడిగా డాక్టర్ పి.విశ్వేశ్వరరావు, ప్రేమ పాఠశాల కరస్పాండెంట్‌గా కోన జగదీశ్వరరావు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ప్రేమసమాజం పూర్వ అధ్యక్షుడు బుద్ద శివాజీ, పూర్వ కార్యదర్శి కె.హరిమోహన్‌రావు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవీ రాజశేఖర్, పలువురు ప్రముఖులు పాల్గొని నూతన కమిటీని అభినందించారు.