
అర్జీలు స్వీకరించిన మేయర్
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా సాగింది. మేయర్ పీలా శ్రీనివాసరావు, అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తితో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 77 ఫిర్యాదులు అందాయి. వాటిలో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 49, ఇంజినీరింగ్ విభాగానికి 10, జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 4, రెవెన్యూ విభాగానికి 6, ప్రజారోగ్య విభాగానికి 4, మొక్కల విభాగానికి 1, యూసీడీకి 3 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అధికారులు స్వీకరించిన అర్జీలు, ఫిర్యాదులను ప్రతిరోజూ పరిశీలిస్తూ, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అదనపు కమిషనర్ రమణమూర్తి ఆదేశించారు. ప్రజలు ఒకే సమస్యపై మళ్లీ మళ్లీ ఫిర్యాదు చేయడానికి రాకుండా, వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.