క్రూయిజ్‌లో సదుపాయాలు | - | Sakshi
Sakshi News home page

క్రూయిజ్‌లో సదుపాయాలు

Jun 30 2025 7:30 AM | Updated on Jun 30 2025 7:30 AM

క్రూయ

క్రూయిజ్‌లో సదుపాయాలు

● కార్డేలియా ఎంప్రెస్‌ క్రూయిజ్‌ నౌక ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది.

● మొత్తం 11 అంతస్తులతో ఉండే ఈ క్రూయిజ్‌ మొదటి ఫ్లోర్‌లో ఇంజిన్‌, రెండో ఫ్లోర్‌లో కార్గో ఉంటుంది.

● మూడో ఫ్లోర్‌ నుంచి పాసింజర్‌ లాంజ్‌ మొదలవుతుంది.

● అక్కడి నుంచి ఎలివేటర్‌ ద్వారా పదో అంతస్తు వరకు చేరుకోవచ్చు.

● పదో ఫ్లోర్‌లో డెక్‌ లాంటి పెద్ద టెరరస్‌ ఉంటుంది.

● 11వ అంతస్తులో ఉండే ప్రత్యేక సెటప్‌ ద్వారా సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతిని కలిగిస్తుంది.

● లగ్జరీ సూట్‌(8వ ఫ్లోర్‌) మినహా మిగిలిన అన్ని రకాల రూమ్స్‌ దాదాపుగా అన్ని ఫ్లోర్లలో ఉంటాయి.

● ఫుడ్‌కోర్టులు, మూడు స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్‌ అందుబాటులో ఉన్నాయి.

● చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫన్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఈ నౌకలో కార్డేలియా కిడ్స్‌ అకాడమీ పేరుతో విశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.

● జిమ్‌, ఫిట్‌నెస్‌ సెంటర్‌, స్విమ్మింగ్‌ పూల్‌, కేసినో, డ్యాన్సులు, కామెడీ, మ్యాజిక్‌ షోల కోసం ఆడిటోరియం, కొత్త సినిమాలను వీక్షించడానికి థియేటర్‌, నైట్‌ క్లబ్‌, 24 గంటల సూపర్‌ మార్కెట్‌, ల్రైబరీ ఇలా క్షణం కూడా బోర్‌ కొట్టకుండా అనేక సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

● డీజే ఎంటర్‌టైన్‌మెంట్‌, లైవ్‌ బ్యాండ్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు.

● అడ్వెంచర్‌ యాక్టివిటీస్‌, షాపింగ్‌మాల్స్‌, లైవ్‌ షోలు కూడా అలరిస్తాయి.

● టికెట్‌ తీసుకున్న ప్రతీ ఒక్కరికీ క్యాసినోలో ఎంట్రీ ఉచితం.

● లిక్కర్‌, ఇతర సర్వీసులకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

క్యాసినో ఆడాలంటే..

రాష్ట్రంలో క్యాసినో ఆడేందుకు ప్రభుత్వం అనుమతి లేదు. ఇందుకు కొంత సమయం వేచి ఉండాల్సిందే. నౌక ప్రయాణం ప్రారంభమై 20 మైళ్లు వెళ్లిన తరువాత క్యాసినో ఆడేందుకు అవకాశం ఉంటుంది.

క్రూయిజ్‌లో సదుపాయాలు 
1
1/1

క్రూయిజ్‌లో సదుపాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement