
పాము కాటుతో స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి మృతి
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్ క్వార్టర్‌లో నిద్రిస్తున్న ఉద్యోగిని పాము కాటు వేయడంతో మృతి చెందాడు. స్టీల్‌ప్లాంట్ ట్రాఫిక్ విభాగం జనరల్ ఫోర్‌మెన్ తగరంపూడి శ్రీనివాస్(59) టౌన్‌షిప్‌లో సెక్టార్–11 గ్రౌండ్ క్వార్టర్‌లో కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఆయన హాల్లో పడుకున్నాడు. తెల్లవారు సమయంలో పాము కుట్టినట్టు తెలిసింది. నిద్రిస్తున్న కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదని ఆయన ఒక్కరే ఉక్కు జనరల్ ఆస్పత్రిలోని క్యాజువాల్టీకి వెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి నగరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని ఉక్కు ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. స్నేక్ క్యాచర్ కిరణ్ మార్చురీలోని మృతదేహాన్ని పరిశీలించి పాము కాటు అని నిర్ధారించారు. శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరు విదేశాల్లో ఉన్నారు. స్టీల్‌ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.