
దేశ నిర్మాణంలో యువత కీలకం
ఆరిలోవ: యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖ వ్యాలీ స్కూల్‌లో శుక్రవారం సీఐఐ యువ విభాగం యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో ‘యంగ్ ఇండియన్ పార్లమెంట్ 2.0’ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని సుమారు 100 మంది ప్రతిభావంతులైన పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వారంతా ఆసక్తికరమైన అంశాలతోపాటు వాస్తవిక చర్చలు, వాదనలు, శాసన ప్రక్రియల అనుకరణ తదితర వాటి గురించి చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎంపీ మాట్లాడుతూ యువ పార్లమెంటేరియన్లతో తన అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో విశాఖ వ్యాలీ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఈశ్వరి ప్రభాకర్, యంగ్ ఇండియన్ వైజాగ్ చైర్మన్ డాక్టర్ శ్రావణి, కో చైర్మన్ దీప, సుప్రియ పాల్గొన్నారు.