ప్రభుత్వానికి ఖర్చు.. మాకు సమయం వృథా | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి ఖర్చు.. మాకు సమయం వృథా

Jun 22 2025 3:14 AM | Updated on Jun 22 2025 3:14 AM

ప్రభు

ప్రభుత్వానికి ఖర్చు.. మాకు సమయం వృథా

విశాఖ బీచ్‌లోనే యోగాసనాలు వేయాలనుకోవడం వ్యయప్రయాస తప్ప మరొకటి కాదు. శుక్రవారం రాత్రి 8 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరి నిద్ర లేకుండా డొక్కు బస్సుల్లో శనివారం ఉదయం ఇక్కడకు చేరుకున్నాం. ప్రభుత్వానికి వృథా ఖర్చు, మాకు సమయం వృథా. ఇక్కడకు వచ్చి మేము చేసింది ఏమీ లేదు. సరదాగా వచ్చినట్టయింది.

–పెంట మధు, బూర్జ, శ్రీకాకుళం

ఇబ్బందులు పడ్డాం

విజయనగరం నుంచి తెల్లవారుజామున వచ్చేశాం. బీచ్‌రోడ్డులో మాకు ఓ స్థలం చూపించారు. అక్కడే ఉండమని చెప్పారు. అయితే దగ్గరలో మరుగుదొడ్లు లేకపోవడంతో మేమంతా చాలా ఇబ్బందులు పడ్డాం. చుట్టూ కర్రలతో కట్టివేయడంతో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎందుకు వచ్చామా అనిపించింది. – లక్ష్మి, విజయనగరం

ప్రభుత్వానికి ఖర్చు.. మాకు సమయం వృథా 
1
1/1

ప్రభుత్వానికి ఖర్చు.. మాకు సమయం వృథా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement