
దాంపత్యం అనే పదానికి ప్రస్తుతం విలువ లేకుండా పోతున్న రోజులివి. ఇలాంటి తరుణంలో ఓ వృద్ధ జంట భార్యభర్తల బంధానికి ప్రతీకగా నిలిచి ఎందరికో కనువిప్పుకలిగించారు. మలిసంధ్యలో ఉన్న ఆ దంపతులు మధ్య అనురాగానికి సంబంధించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్‌లో సాంప్రదాయ తెల్లటి ధోతి కుర్తా టోపి ధరించి 93 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి ఒక ఆభరణాల దుకాణం వద్దకు వచ్చాడు. సిబ్బంది అతడి ఆహార్యాన్ని చూసి ఏదో డబ్బు సాయం అడగడానికి వచ్చాడేమో అనుకున్నారు. అయితే అతడు తన భార్య కోసం మంగళసూత్రం కొనుగోలు చేయడానికి వచ్చినట్లు చెప్పడంతో దుకాణ యజామని ఆశ్చర్యపోయాడు.
అతడిని సాదరంగా ఆహ్వానించి తనకు నచ్చిన మంగళ సూత్రాన్ని అతి తక్కువ ధరకే ఇచ్చి పెద్దమనసు చాటుకున్నాడు ఆ ఆభరణాల యజమాని. ఆ వృద్ధుడికి తన భార్యపై ఉన్న ప్రేమ అనురాగానికి వెలకట్టకూడదనే ఇలా చేశానంటూ ఆ ఘటనకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశాడు.
నిజానికి ఆ వృద్ధుడు ఆ మంగళ సూత్రం కోసం దుకాణం యజమానికి రూ. 1,120 ఇచ్చాడు. అయితే తన భార్యకు బహుమతిగా ఇవ్వాలనే ఆ వృద్ధుడి తాపత్రయం ఆ దుకాణం యజామనిని మంత్రముగ్దుడిని చేసింది. దాంతో ఆ యజమాని కేవలం రూ.20లకే ఆ ఆభరణాన్ని ఆ దంపతలుకు ఇచ్చేశాడు.
కాగా, ఆ వృద్ధ దంపతుల పేర్లు నివృత్తి షిండే, శాంతబాయిలు. ఆ జంట జల్నా జిల్లా, అంభోరా జహాగీర్ గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. అక్కడి స్థానికుల సమాచారం ప్రకారం..ఇద్దరు ప్రస్తుతం ఆషాఢ ఏకాదశి వేడుక కోసం కాలినడకన పంఢర్‌పూర్‌కు తీర్థయాత్ర చేస్తున్నారట.
అలాగే ఆ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడట. అయితే ఆ వృద్ధ దంపతులు అతడిపై ఆధారపడకుండా జీవిస్తాని, తరుచుగా తీర్థయాత్రలు చేస్తుంటారని చెబుతున్నారు గ్రామస్థులు. నెటిజన్లు సైతం వారి మధ్య ఉన్న అనురాగానికి ఫిదా అవ్వుతూ.. మలిసంధ్యాలో కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: అమ్మాయిలూ.. బహుపరాక్!)