
సర్వేయర్ల ఆందోళన
మహారాణిపేట : సచివాలయ సర్వేయర్లు గ్రేడ్–2 బదిలీల్లోనూ కూటమి ఎమ్మెల్యేల సిఫార్సులకు పెద్దపీట వేశారంటూ సర్వేయర్లు ఆందోళనకు దిగారు. ఆదివారం కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సర్వే డిపార్టుమెంటులో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికి ఆదివారం బదిలీ కౌన్సెలింగ్ చేపట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 354 మంది బదిలీ కౌన్సెలింగ్ కోసం వచ్చారు. సర్వే అసిస్టెంట్ డైరెక్టర్లు సూర్యరావు(విశాఖ), గోపాలరావు(అనకాపల్లి) బదిలీ కౌన్సెలింగ్ చేపట్టారు. బదిలీల్లో పైరవీలకు పెద్ద పీట వేస్తున్నారని, సిఫార్సుల వల్ల తాము నష్టపోతున్నామని, జాబితా ప్రకారం బదిలీలు చేయడం లేదని సర్వేయర్లు ఆందోళనకు దిగారు. కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల వల్ల నిజాయితీపరులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
బదిలీల్లో సిఫార్సులకు
పెద్దపీట వేశారని ఆవేదన