
హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో..
ఎంవీపీ కాలనీ: హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన రథయాత్రకు భక్తులు పోటెత్తారు. స్వామి రథాన్ని లాగేందుకు ఉత్సాహం చూపారు. ఎంవీపీ కాలనీలోని ఐఐఏఎం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర డబుల్ రోడ్డు, టీటీడీ కూడలి, ఇసుకతోట, వెంకోజిపాలెం, క్యాన్సర్ హాస్పిటల్, అప్పుఘర్ బీచ్‌రోడ్డు మీదుగా సాగి తిరిగి ఐఐఏఎంకు చేరుకుంది. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథం, యాత్రలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక, మంగళహారతి కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు డాక్టర్ నిష్కించిన భక్తదాస తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో..