వైజాగ్‌ టు చైనా | - | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ టు చైనా

Jun 26 2025 6:05 AM | Updated on Jun 26 2025 6:05 AM

వైజాగ

వైజాగ్‌ టు చైనా

అక్రమంగా రేషన్‌ బియ్యం రవాణా

8లో

గురువారం శ్రీ 26 శ్రీ జూన్‌ శ్రీ 2025

జగన్‌తో జిల్లా నేతల భేటీ

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :

రాష్ట్రంలోని రేషన్‌ బియ్యం విశాఖ నుంచి చైనాకు ఎగుమతి అవుతోంది. చైనాలో రైస్‌ వైన్‌గా పిలిచే సంప్రదాయ మద్యపానీయం హువాంగ్జియు తయారీలో విరివిగా బియ్యాన్ని ఉపయోగిస్తారు. అక్కడి డిమాండ్‌కు అనుగుణంగా ఎగుమతి చేసేందుకు విశాఖలోని పలు షిప్పింగ్‌ కంపెనీలు రేషన్‌ బియ్యాన్ని మార్గంగా ఎంచుకున్నాయి. రేషన్‌ మాఫియా ద్వారా సేకరించి చైనాకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన 473 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని విశాఖలోని పలు కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్‌ (సీఎఫ్‌టీ)ల్లో ఈ నెల 23, 24 తేదీల్లో దాడులు చేసి పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇందులో శ్రావణ్‌ షిప్పింగ్‌ సర్వీసెస్‌ వద్ద 150 మెట్రిక్‌ టన్నుల బియ్యం, గేటు వే ఈస్ట్‌ ఇండియా సీఎఫ్‌టీలో 156 మెట్రిక్‌ టన్నులు, పంచవటి టోల్‌గేట్‌ వద్ద 167 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని గుర్తించినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారమంతా ప్రధానంగా టీడీపీకి చెందిన కార్గో వ్యాపారే నడిపిస్తున్నట్టు విమర్శలున్నాయి. పట్టుకున్నవి రేషన్‌ బియ్యం కాదంటూ ల్యాబ్‌ల ద్వారా నివేదికలు తెచ్చుకునేందుకు వ్యవహారం నడుస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మొదటి దఫా ల్యాబ్‌ నివేదికల్లో రేషన్‌ బియ్యం కాదంటూ నివేదిక రాగా.. రెండో నివేదిక కూడా అదేవిధంగా వచ్చేలా వివిధ రకాల ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. రెండో శాంపిల్‌పై వచ్చే ల్యాబ్‌ నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.

అంతా అమ్యామ్యాలే...!

కొన్నాళ్ల క్రితం కాకినాడ నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం నానా హంగామా చేసింది. దీంతో సాధారణ బియ్యం ఎగుమతి కూడా అక్కడి నుంచి చేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అనేక మంది విశాఖ నుంచి ఎగుమతులకు తమ మకాం మార్చారు. రేషన్‌ బియ్యం మాఫియా కూడా వారితో పాటు విశాఖ నుంచి చైనాకు బియ్యం ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రచించింది. తాజాగా రేషన్‌ డిపోలు కూడా ఏర్పాటు కావడంతో రేషన్‌ మాఫియా మరింత రెచ్చిపోతోంది. ప్రధానంగా భీమిలి నియోజకవర్గంలోని రేషన్‌ మిల్లులతో పాటు పెందుర్తి, సబ్బవరం ప్రాంతాల్లోని రేషన్‌ మిల్లుల కేంద్రంగా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. సేకరించిన రేషన్‌ బియ్యాన్ని అక్కడ సన్న బియ్యంగా మలుస్తున్నారు. వివిధ దేశాల ఎగుమతులకు సంబంధించిన అన్ని అనుమతులను కస్టమ్‌ హౌస్‌ బ్రోకరేజీ సంస్థలు తీసుకుంటున్నాయి. అనంతరం కస్టమ్స్‌ నుంచి అనుమతులు పొందుతున్నాయి. తరువాత రేషన్‌ మిల్లుల నుంచి తీసుకొచ్చి విశాఖలో ఉన్న పలు కంటైనర్‌ టెర్మినల్‌ ఫ్రైట్‌ స్టేషన్ల (సీఎఫ్‌టీ)లో నిల్వ ఉంచి.. కంటైనర్ల ద్వారా ఎగుమతులు చేపడుతున్నారు. టీడీపీకి చెందిన కార్గో వ్యాపారి స్టేషన్‌ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి పీడీఎస్‌ బియ్యాన్ని సీజ్‌ చేయాల్సిన అధికారులు.. కూడా ఈ రేషన్‌ మాఫియాతో చేతులు కలుపుతున్నారు. ఒక్క కంటైనర్‌ లోడ్‌ చేస్తే అధికారులకు రూ.50 వేల చొప్పున చెల్లింపులు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచిత్రమేమింటే గత ఏడాది డిసెంబర్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్‌ తనిఖీలు నిర్వహించిన గేట్‌ వే వద్ద ఈ రేషన్‌ బియ్యం పట్టుబడటం గమనార్హం.

మహారాణిపేట: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సమన్వయకర్తలు మజ్జి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్‌ కుమార్‌, మళ్ల విజయప్రసాద్‌, తిప్పల దేవన్‌ రెడ్డి, మొల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

హెచ్‌పీసీఎల్‌

రూ.8.75 కోట్ల విరాళం

న్యూస్‌రీల్‌

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో పలువురికి చోటు

విశాఖ సిటీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో విశాఖకు చెందిన నేతలకు చోటు కల్పించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలను చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులుగా మళ్ల దేవి విశాలాక్షి (విశాఖ ఉత్తర), బెందాళం పద్మావతి(భీమిలి), రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా యెల్లిపోగుల వరలక్ష్మిని నియమించారు. అలాగే రాష్ట్ర బూత్‌ కమిటీల వింగ్‌ ప్రధాన కార్యదర్శిగా రవికాంత్‌ శివలంక(భీమిలి), రాష్ట్ర ఆర్‌టీఐ వింగ్‌ జాయింట్‌ కార్యదర్శిగా దశమంతుల వేణుగోపాల్‌(విశాఖ దక్షిణ)లను నియమించారు.

రైస్‌ వైన్‌లో బియ్యాన్ని

వినియోగిస్తున్న చైనా

అక్కడి డిమాండ్‌ను

సొమ్ముచేసుకుంటున్న మాఫియా

రేషన్‌ షాపుల ఏర్పాటుతో

చెలరేగిపోతున్న ముఠా

తాజా దాడుల్లో 473 టన్నుల

బియ్యం పట్టివేత

కీలక సూత్రధారి టీడీపీ కార్గో వ్యాపారే..!

రేషన్‌ బియ్యం కాదంటూ

ల్యాబ్‌ నివేదికలు?

చైనా డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకే...!

వాస్తవానికి చైనాలో సంప్రదాయ రైస్‌ వైన్‌కు డిమాండ్‌ ఉంది. చైనీస్‌ రైస్‌ వైన్‌ అని కూడా పిలువబడే హువాంగ్జియును ప్రధానంగా చైనాలోని జియాంగ్నాన్‌ ప్రాంతంలో ఉడికించిన బియ్యాన్ని పులియబెట్టడం ద్వారా తయారుచేస్తారు. దీనికి ఉండే ప్రత్యేకమైన రుచితో పాటు తక్కువ ఆల్కహాల్‌ (8 నుంచి 20) శాతం, మంచి పోషక విలువలు ఉండటంతో చైనీయులు ఎంతో ఇష్టంగా సేవిస్తారు. ఇందులో అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఉంటాయి. దీనికి 5 వేల సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగి ఉంది. ఈ నేపథ్యంలో చైనాలో ఉండే ఈ రైస్‌ వైన్‌ డిమాండ్‌కు అనుగుణంగా వివిధ దేశాల నుంచి బియ్యాన్ని ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది. అక్కడి డిమాండ్‌ ఇక్కడి రేషన్‌ బియ్యం మాఫియాకు కలిసివస్తోంది. ఇక్కడి నుంచి భారీగా రేషన్‌ బియ్యాన్ని ఎగుమతి చేయడంలో టీడీపీకి చెందిన కార్గో వ్యాపారి చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలున్నాయి.

ల్యాబ్‌ నివేదిక పేరుతో...!

పట్టుకున్న బియ్యం నమూనాలను ల్యాబ్‌కు పంపించామని.. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు అంటున్నారు. మరోవైపు మొదటి దాడుల్లో పట్టుకున్న 150 మెట్రిక్‌ టన్నుల బియ్యంలో పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపగా.. రేషన్‌ బియ్యం కాదని నివేదిక వచ్చినట్టు సమాచారం. ఇక మిగిలిన బియ్యం నమూనాల నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఈ నివేదికలు కూడా రేషన్‌ బియ్యం కాదని వస్తాయా? అవునని వస్తాయా అనేది చూడాల్సి ఉంది. దాడుల్లో పట్టుకున్న బియ్యం అనుమానిత ప్రజా పంపిణీ బియ్యం అని స్పష్టంగా ప్రకటనల్లో పేర్కొన్న అధికారులు.. ప్రజా పంపిణీ బియ్యం అక్రమంగా రవాణా, నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొనడం విశేషం.

వైజాగ్‌ టు చైనా1
1/2

వైజాగ్‌ టు చైనా

వైజాగ్‌ టు చైనా2
2/2

వైజాగ్‌ టు చైనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement