
పెదగాడి సర్పంచ్ భర్తపై దాడి!
జనసేన నాయకులపై పోలీసులకు ఫిర్యాదు
పెందుర్తి: తనపై జనసేన నాయకులు దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నం చేశారని పెదగాడి సర్పంచ్ కేసుబోయిన లావణ్య భర్త కేసుబోయిన త్రినాథ్ పెందుర్తి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. తనకు చెందిన లేఅవుట్‌లోని ప్లాట్‌లోకి అక్రమంగా చొరబడిన జనసేన నాయకులను అడ్డుకున్నందుకు తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో తనను తీవ్రంగా గాయపరిచిన జనసేన నాయకులు నీటిపల్లి రమేష్, గళ్లా అప్పలరాజు సహా వారి అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఇక్కడి సర్వే నంబర్ 96/3లోని లేఅవుట్‌లో ఓ ప్లాట్ విషయంలో కొద్ది రోజులుగా సర్పంచ్ లావణ్య భర్త త్రినాథ్, జనసేన నాయకుల మధ్య తగాదా ఉంది. దీనిపై ఇరుపక్షాల ఫిర్యాదుల మేరకు రెండు రోజుల కిందట కేసులు నమోదు చేసినట్లు సీఐ కె.వి.సతీష్‌కుమార్ తెలిపారు. తాజాగా వివాదంపై కూడా సమగ్ర విచారణ చేపడతామని సీఐ వెల్లడించారు.

పెదగాడి సర్పంచ్ భర్తపై దాడి!