
జీవీఎంసీ ఉద్యోగి ఆకస్మిక మృతి
తాటిచెట్లపాలెం: జీవీఎంసీ జోన్–3 పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పి. కిరణ్‌బాబు (50) సోమవారం ఉదయం ఆకస్మికంగా మృతిచెందాడు. ద్వారకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాటాకీస్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ కంటి ఆస్పత్రి సమీపంలోని సులభ్ కాంప్లెక్స్‌కు కిరణ్‌బాబు ఉదయం 11 గంటల సమయంలో మలమూత్ర విసర్జనకు వెళ్లారు. చాలాసేపటి వరకు ఆయన బయటకు రాకపోవడంతో, సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులు లోపల పరిశీలించమని అక్కడున్న ఒక వ్యక్తికి చెప్పారు. ఆ వ్యక్తి పైనుంచి చూడగా, కిరణ్‌బాబు లోపల పడిపోయి ఉన్నా డు. వెంటనే సులభ్ కాంప్లెక్స్ సిబ్బంది ద్వారకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గేటును తొలగించి చూడగా, అప్పటికే కిరణ్‌బాబు మృతిచెందాడు. కిరణ్‌బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ద్వారకా స్టేషన్ సీఐ రమణ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.