
పీజీఆర్‌ఎస్‌కు 383 వినతులు
మహారాణిపేట: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వివిధ సమస్యలపై ప్రజల నుంచి 383 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు 115, పోలీసు శాఖకు 28, జీవీఎంసీకి 94, ఇతర విభాగాలకు సంబంధించి 146 వినతులు వచ్చాయి.
జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, డిప్యూటీ కలెక్టర్లు శేషశైలజ, మధుసూధన రావు, చీఫ్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ ప్రభాకర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కలెక్టర్ కార్యాలయం, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తారని, అర్జీదారులు 1100 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి తమ ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవచ్చని, సందేహాలు అడగవచ్చని, కొత్త ఫిర్యాదులు కూడా నమోదు చేయవచ్చని డీఆర్వో తెలిపారు. కార్యక్రమంలో వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.