
ముచ్చర్ల నేలవేషాలు
తగరపువలస : గ్రామదేవతల ఉత్సవాలు, వినాయక నిమజ్జనం, శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రముఖంగా కనిపించే నేలవేషాలు ప్రస్తుతం దాదాపు కనుమరుగైపోయాయి. అప్పట్లో పురాణ పురుషుల వేషాలు కట్టిన కళాకారులను దేవుని ముందు ఊరేగింపుగా ఎడ్లబండ్లపై తీసుకువెళ్లేవారు. వాళ్లను కూడా ప్రజలు భక్తిభావంతో చూసేవారు. ప్రస్తుతం నేలవేషాల స్థానంలో డీజే, కోలాటం, కాళికా నృత్యాలు వంటివి ప్రదర్శిస్తున్నారు. గ్రామాల్లో ఎడ్ల బండ్లు కూడా కనిపించకుండా పోయాయి.
ఆనందపురం మండలం ముచ్చర్ల పంచాయతీవాసులు మాత్రం ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. గ్రామదేవత బంగారమ్మ పండగలో చిన్నారులు మొదలుకుని యువకుల వరకు రామాయణం, మహాభారతం, భాగవతంలో పాత్రలతో పాటు అమ్మవార్లు, చాకలి తిప్పడు, షావుకారు, భైరవుడు, చిత్రగుప్తుడు తదితర వేషాలతో అలరిస్తున్నారు. అనకాపల్లి నుంచి మేకప్ కళాకారులు, డ్రస్సులు, కిరీటాలు, మేకప్ కిట్లు పట్టుకుని వచ్చారు. ఒక్కో నేలవేషానికి అలంకరణ బట్టి మేకప్‌తో కలిపి రూ.1000 నుంచి రూ.2000 ఖర్చు అవుతుంది. దీనిని ఉత్సవ కమిటీయే భరిస్తుంది.

కిరీటాలు, పూలదండలు

ముచ్చర్ల