అడవి దున్నకు దూడ జననం | - | Sakshi
Sakshi News home page

అడవి దున్నకు దూడ జననం

Jun 27 2025 4:07 AM | Updated on Jun 27 2025 4:07 AM

అడవి దున్నకు దూడ జననం

అడవి దున్నకు దూడ జననం

ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో మరో బుల్లి జంతువు జన్మించింది. రెండు రోజుల కిందట ఒక ఆడ అడవి దున్న, ఒక ఆడ దూడకు జన్మనిచ్చిందని క్యూ రేటర్‌ జి.మంగమ్మ గురువారం తెలిపారు. ఈ దూడ ఆరోగ్యంగా ఉందని, తల్లి దున్న పక్కన ఎన్‌క్లోజర్‌లో ఉత్సాహంగా తిరుగుతోందని పేర్కొన్నారు. ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్‌–1కు చెందిన జంతువు. ఈ జననంతో జూలో అడవి దున్నల సంఖ్య పెరిగిందని క్యూరేటర్‌ తెలిపారు. జూలోని నవజాత జంతువులకు అవసరమైన టీకాలు, వైద్య సేవలు అందిస్తున్నట్లు వెటర్నరీ వైద్యుడు భాను వివరించారు. ఈ ఏడాది మార్చిలో కూడా ఒక అడవి దున్నకు దూడ పుట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement