
రూ.1.5 లక్షల డిఫెన్స్ మద్యం స్వాధీనం
కొమ్మాది: జీవీఎంసీ 4వ వార్డు పరిధి చిన ఉప్పాడ వద్ద గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రూ.1.50 లక్షలు విలువ చేసే 95 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. ముందుగా ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిబ్బంది ఎం.హేమంత్ అనే వ్యక్తి వద్ద 5 డిఫెన్స్ మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై విచారించగా.. అదే గ్రామంలో ఎల్లారావు అలియాస్ యల్లాజీ అనే వ్యక్తికి చెందిన పాడుబడిన ఇంటిని చూపించాడు. ఈ క్రమంలో వీరిని చూసిన యల్లాజీ పారిపోగా.. సిబ్బంది ఆ ఇంటిని తనిఖీ చేశారు. 86 డిఫెన్స్ మద్యం బాటిళ్లతో పాటు 4 బీరు బాటిళ్లు లభించాయి. యల్లాజీ పరారీలో ఉండగా హేమంత్‌ను అరెస్ట్ చేశారు. మొత్తం 91 మద్యం బాటిళ్లు, 4 బీరు బాటిళ్లను భీమిలి ఎకై ్సజ్ సిబ్బందికి అప్పగించారు. సిబ్బంది సీహెచ్ రాజేశ్వరి, ఎస్.శ్రీనివాస్, ఎల్.అరుణకుమారి, కె.వెంకటరావు, కె.వీరభద్రరావు, ఎన్.తిరుపతిరావు జి.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.