Chittoor
-
మొత్తం చెల్లిస్తేనే రెన్యూవల్ అంటూ వేధింపులు
● బ్యాంకు అధికారుల కొర్రీలు ● వ్యవసాయ, బంగారు రుణాలకు రెన్యూవల్ కష్టాలు ● పూర్తిగా డబ్బులు చెల్లించాలంటూ మెలిక ● అవస్థల్లో అన్నదాతలు ● ప్రభుత్వ తీరుపై మండిపాటు వ్యవసాయ రుణం రణంగా మారింది. బ్యాంకర్లు రైతులకు అనేక కొర్రీలు పెడుతున్నారు. వ్యవసాయం, బంగారు ఆభరణాల పేరుతో రైతులు, రుణదారులు తీసుకున్న రుణాలకు రెన్యూవల్ కష్టాలను తెచ్చి పెట్టారు. పూర్తిగా డబ్బులు చెల్లిస్తేనే రెన్యూవల్ అంటూ మెలిక పెడుతున్నారు. పూర్తిగా చెల్లించి రెన్యూవల్ చేసుకోవాలని చెబుతుండడంతో రైతులు, రుణదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దీంతో కొందరు రైతులు అప్పులు చేసి రెన్యూవల్ చేస్తే..మరికొందరు పరేషాన్ అవుతున్నారు. ఈ విధానంపై పలువురు రైతులు మండిపడుతున్నారు. 35 లక్షల ఖాతాలు జిల్లాలో 232 బ్యాంకులున్నాయి.. వీటికి కింద సుమారు రూ.35 లక్షల ఖాతాలున్నట్లు అధికారుల అంచనా. వీరు కొన్ని వేల కోట్లు అప్పులు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో వ్యక్తిగత, వ్యవసాయం, బిజినెస్, గృహ, వాహన సంబంధిత వాటి కోసం బ్యాంకుల్లో రుణాలు పొందారు. వీటి చెల్లింపులో వ్యకిగత రుణాలకు మినహాయింపులు ఇస్తున్నారు. అయితే వ్యవసాయ ఆధారిత రుణాల విషయంలో బ్యాంకర్లు చిన్నచూపు చూస్తున్నారు. రెన్యూవల్ పేరుతో వేధిస్తున్నారు. గతంలో రెన్యూవల్ ఇలా.. గతంలో బ్యాంకుల్లో వ్యవసాయ, బంగారు రుణాలకు రెన్యూవల్‌కు వెళ్తే ఇబ్బందులు పెట్టేవారు కాదు. వడ్డీ వరకు చెల్లించుకుని రెన్యూవల్ చేసేవారు. లేకుంటే భూ విలువ, బంగారు విలువ ప్రకారం తీసుకున్న బ్యాంకు రుణానికి ఏటా 5 నుంచి 10 శాతం వరకు పెంచుతూ వడ్డీ జమ చేసుకునే వారు. ఇలా రైతులకు ఇబ్బందులు లేకుండా రెన్యూవల్ సదుపాయం కల్పించేవారు. ఈ ఫలితంగా బ్యాంకర్లకు రుణదారుల నుంచి రెన్యూవల్ చేయించే విషయంలో సమస్యలు తల్తెతేవి కావు. ఈ ప్రక్రియ గంట, గంటన్నర వ్యవధిలోనే జరిగిపోయేది. ఇప్పుడు అలా కాకుండా వ్యవసాయ రైతులు, రుణదారులకు సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు. ఏటా నష్టాలు.. అప్పులే వ్యాపార లావాదేవీలు, వ్యవసాయం పేరుతో తక్కువ వడ్డీకి బ్యాంకుల్లో రుణాలు తీసుకుని వడ్డీ వ్యాపారులు చేసుకుంటున్నవారు 30 శాతం మంది ఉన్నారని అంచనా. అలాగే 70 మంది మాత్రం వ్యవసాయ పనులు నిమిత్తం, బతుకు తెరువు కోసం పట్టాపాసు పుస్తకాలు, బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో కుదవపెట్టి రుణాలు తీసుకుంటున్నారు. ఆ రుణాల ద్వారా వ్యవసాయ వృద్ధి చేసుకుంటున్నారు. బోరు వేసుకోవడం, కొత్త రకం పంటలు పండించడం, మామిడి మొక్కలు పెట్టించడం, వరి, లేకుంటే ఏటా మామిడికి సాగుకు అవసరమ్యే ఖర్చులను భరించేందుకు బ్యాంకుల్లో అప్పులు చేస్తున్నారు. ఆపై వాటిని విడిపించేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. పంట బాగా పండి..మంచి ధర ఉంటే రైతు వాటిని విడిపించుకునేందుకు వెనకడుగువేయడంలేదు. ప్రకృతి కాటేయడంతో ఏటా కష్టాలు,..కన్నీళ్లు మిగలడం లేదు. దీనిపై ప్రభుత్వం స్పందించి రెన్యూవల్ విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. రైతు భరోసా కేంద్రానికి విత్తనాల కోసం వచ్చిన రైతులు (ఫైల్) వ్యవసాయ రుణ వివరాలు ఇలా.. సీజన్ రుణ లక్ష్యం ఇచ్చిన రుణం (రూ. కోట్లలో) (రూ. కోట్లలో) ఖరీఫ్–2024 4,072 4,435 రబీ–2024–25 2,830 3,120 మొత్తం 9,602 7,555 టర్మ్లోన్లు 3,284 3,341 రైతన్నలకు రుణాల రెన్యూవల్ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఏటా బ్యాంకుల్లో రుణాలకు వడ్డీ చెల్లించుకొని రెన్యూవల్ చేసేవారు. కొత్త నిబంధనల పేరుతో బ్యాంకర్లు రుణాలు మొత్తం చెల్లిస్తేనే రెన్యూవల్ అంటూ మెలిక పెట్టడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిలో రుణాలు మొత్తం ఎలా చెల్లించాలో తెలియక .. ఇలా అయితే ఆత్మహత్యలే శరణ్యం అంటూ తీవ్ర నైరాశ్యం చెందుతున్నారు. జిల్లాలోని ఏ రైతును కదిలించినా కన్నీటి వెతలే వినిపిస్తున్నాయి. రుణాల విషయంలో మినహాయింపులు ఇవ్వాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. – కాణిపాకంమినహాయింపు ఇవ్వాలి ఆటో కొనుగోలు చేసేందుకు గతేడాది జీడీ నెల్లూరు మండల కేంద్రంలోని ఓ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ. లక్ష వరకు రుణం తీసుకున్నా. రెన్యూవల్‌కు సంబంధించి మెసేజ్ రావడంతో బ్యాంకు వద్దకు వెళ్లా. అక్కడ బ్యాంకర్లు అసలు, వడ్డీ చెల్లించాలని మొండికేశారు. వడ్డీ చెల్లించి రెన్యూవల్ చేస్తాను.. అంటే వాళ్లు ఒప్పుకోలేదు. అవస్థలు పడి మొత్తం డబ్బులు చెల్లించి ఏప్రిల్ 10వ తేదీన రెన్యూవల్ చేశా. ప్రభుత్వం రెన్యూవల్ విషయంలో మినహాయింపు ఇచ్చేలా చూడాలి. – బాబు, జీడీనెల్లూరు కొత్త విధానం అమల్లో ఉంది రెన్యూవల్ కొత్త విధానం 2024 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇకపై పూర్తి నగదు చెల్లించి రెన్యూవ ల్ చేయించుకోవాలి. ఇకపై వడ్డీ చెల్లించి రెన్యూవల్ చేయించుకునే పద్ధతి లేదు. దీనిపై సమస్యలు వస్తున్నాయి. కొంత మంది మంత్రులు ఈ విషయంపై చర్చిస్తున్నారు. ఇది ఉన్నత స్థాయిలో జరగాల్సిన విషయం. – హరీష్, ఎల్డీఎం, చిత్తూరు చిత్తూరు మండలానికి చెందిన రాజు అనే రైతు 2021లో వ్యవసాయ పనుల నిమిత్తం ఓ బ్యాంకులో బంగారు ఆభరణాలు పెట్టి రూ.60 వేల వరకు రుణం తీసుకున్నాడు. ఏటా రెన్యూవల్ చేస్తూ వస్తున్నాడు. రెండు రోజుల కిందట బ్యాంకు రెన్యూవల్ కోసం బ్యాంకుకు వెళ్లిన రైతు రాజుకు బ్యాంకు అధికారులు షాక్ ఇచ్చారు. మొత్తం డబ్బు చెల్లించి రెన్యూవల్ చేసుకోవాలని.. ఇప్పుడు కొత్త రూల్స్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో చేసేదీ లేక రాజు అప్పు చేసి రూ.లక్ష చెల్లించి రెన్యూవల్ చేయించుకున్నాడు. ఇలా ఈ రైతు ఒక్కరే పరిస్థితి కాదు. లక్షల మంది అన్నదాతల సమస్య ఇదే. 10 శాతం బ్యాంకులు మినహా..మిగిలిన బ్యాంకులన్నీ రెన్యూవల్ విషయంలో రుణదారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. రెన్యూవల్ పేరుతో వేధిస్తున్నాయి. తీసుకున్న రుణానికి ఏడాది గడువు తీరిందని మెసేజ్‌లు రావడంతో బ్యాంకులకు రుణదారులు పరుగులు పెడుతున్నారు. అక్కడికి వెళ్లాక బ్యాంకర్లు రెన్యూవల్ చేసుకోవాలంటే తీసుకున్న మొత్తం డబ్బులు చెల్లిస్తేనే రెన్యూవల్ చేస్తామని మెలిక పెడుతున్నారు. వడ్డీ చెల్లింపుతో..రెన్యూవల్ చేయడం ఇకపై కుదరదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. దీంతో వడ్డీ భారం పడుతుందని చాలా మంది అష్టకష్టాలు పడి రెన్యూవల్ చేయించుకుంటున్నారు. కొన్ని బ్యాంకులు తీసుకున్న రుణాలను పూర్తి స్థాయిలో చెల్లించినా.. మళ్లీ రుణాలు ఇవ్వడంలో రైతులు, రుణదారులను ఇబ్బందులు పెడుతున్నారు. రేపు రమ్మని చెప్పి వాళ్లను తిప్పించుకుంటున్నారు. సీ–బిల్, కేవైసీ, ఇతర వివరాల సాకు చూపి జాప్యం చేస్తున్నారు. గట్టిగా తిరగబడితే ఆర్బీఐ రూల్స్ అంటూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ పోరు పడలేక రెన్యూవల్ చేసుకునేందుకు చాలా మంది ముందుకు రావడంలేదు. -
విశ్వరూపం.. దివ్యతేజం
● అమ్మవారిని దర్శించుకున్న సీఎం దంపతులు ● విచిత్ర వేషధారణలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు ● జనసంద్రంగా మారిన ఆలయ ప్రాంగణం కుప్పం : శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర సందర్భంగా బుధవారం అమ్మవారి విశ్వరూప దర్శనం కనులపండుగగా జరిగింది. శిరస్సు ఊరే గింపు ముగించుకుని అమ్మవారి ఆలయంలో విశ్వరూప దర్శనం ఏర్పాటు చేశారు. ఏడాదికి ఒక్కసా రి మాత్రమే జరిగే విశ్వరూప దర్శనాన్ని తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆ లయ ప్రాంగణం కిక్కిరిసింది. పొంగళ్లు, పిండితో తయారు చేసిన దీపాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని వజ్ర కిరీటం, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది ప్రత్యేక దర్శ నం కోసం రూ.100, రూ.200 టికెట్లు పెట్టి వీ ఐపీలకు దర్శన సౌకర్యం కల్పించారు. అమ్మవారిని దర్శించుకున్న సీఎం దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి బుధవారం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దర్శనం చేసుకున్నారు. బుధవారం ఉదయం చంద్రబాబు 12.30 గంటలకు బెంగళూరు నుంచి కుప్పంలోని ద్రవిడ వర్సిటీ హెలీప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి దేవస్థానానికి చేరుకున్నారు. అనంతరం 2 గంటలకు బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. -
ప్రైవేటు కళాశాలలపై నిఘా
ఎంత కట్టడి చేసినా ఏటా అనుమతులు లేని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మరో 11 రోజుల్లో ఇంటర్మీడియట్ కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అడ్మిషన్ల పెంపుపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న ప్రభుత్వ కళాశాలల కసరత్తుపై ఇంటర్మీడియట్ ఆర్జేడీ, డీఐఈవో డా.ఆదూరు శ్రీనివాసులతో సాక్షి ముచ్చటించింది.. వివరాలు ఆయన మాటల్లోనే.. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గతేడాది కంటే రానున్న విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల పెంపునకు పకడ్బందీగా కసరత్తు చేపడుతున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాలు, వసతులు, కోర్సులు, మధ్యాహ్న భోజనం, అనుభవం ఉన్న అధ్యాపకులు తదితర సౌకర్యాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం జరుగుతోంది. ప్రభుత్వ కళాశాలల్లోని ప్రతి ప్రిన్సిపల్ తమ వంతు బాధ్యతగా అడ్మిషన్ల పెంపుపై ప్రత్యేక ఫోకస్ చేయాలని ఆదేశించాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు పోటీ పరీక్షలకు పోటీ పడేలా ఈ విద్యా సంవత్సరం నీట్, జేఈఈ, ఎంసెట్, తదితర పరీక్షలకు మెటీరియల్, ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తొలిరోజే పాఠ్యపుస్తకాలు ఇచ్చేలా.. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పరిధిలో ఉన్న ప్రతి కళాశాలలో తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే మండలాలకు పాఠ్యపుస్తకాలు, మెటీరియల్‌లు చేరాయి. కొన్ని కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థుల చెంత పాఠ్యపుస్తకాలు లేవు అనే మాట రాకుండా పంపిణీకి చర్యలు చేపడుతున్నాం. జిల్లాలోని ఏ ప్రభుత్వ కళాశాలలోనూ పాఠ్యపుస్తకాలు నిల్వ పెట్టుకోకుండా నిబంధనల ప్రకారం విద్యార్థులకు పంపిణీ చేసేయాలని ఆదేశాలిచ్చాం. 68 మంది ప్రిన్సిపల్స్, 400 అధ్యాపకులు బదిలీ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు బదిలీల కసరత్తు పకడ్బందీగా చేపడుతున్నాం. ప్రస్తుతం అంతర్గతంగా కసరత్తు చేపడుతున్నాం. బదిలీ ఉత్తర్వులు విడుదలైన తర్వాత ప్రిన్సిపల్స్, అధ్యాపకులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్లో ఖాళీలు, పోస్టుల వివరాలను నమోదు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 68 మంది ప్రిన్సిపల్స్, 400 మంది అధ్యాపకులు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. ఉత్తర్వులు జారీ అయ్యాక ఖాళీలను ఆన్లైన్లో పొందుపరుస్తాం. వాటి ప్రకారం ఆన్లైన్ విధానంలో బదిలీలు నిర్వహించడం జరుగుతుంది. అనుమతుల్లేని కళాశాలలుంటే సీజ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి కృషి పకడ్బందీగా బదిలీల ప్రక్రియ పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ జూన్ 2న జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం సాక్షి ఇంటర్వ్యూలో ఇంటర్మీడియట్ ఆర్జేడీ, డీఐఈవో డా.ఆదూరు శ్రీనివాసులు మేనేజ్మెంట్ల వారీగా కళాశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 31 హైస్కూల్ ప్లస్ 24 కేజీబీవీ 08 సోషల్ వెల్ఫేర్ గురుకులాలు 04 బీసీ వెల్ఫేర్ గురుకులాలు 01 ఏపీ మోడల్ స్కూల్స్ 07 ప్రైవేట్ , కార్పొరేట్ 65 మొత్తం కళాశాలలు 140 జూన్ 2న పునఃప్రారంభం జూన్ 2 వ తేదీన కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో అన్ని యాజమాన్యాలకు సంబంధించి 140 కళాశాలలుండగా, అందులో 65 ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలున్నాయి. కళాశాలలు ప్రారంభం అయ్యాక ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలపై ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా ఎక్కడైనా కళాశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు తమ పిల్లలను అడ్మిషన్లు చేసే సమయంలో కళాశాలకు అనుమతులున్నాయా లేవా అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత కళాశాలల్లో చేర్పించాలి. -
పార్టీలకతీతంగా పనిచేయండి
చిత్తూరు కార్పొరేషన్ : ప్రజల సొమ్ముతో చేసే పనులకు పార్టీల ముద్ర వేసి అడ్డుపడవద్దని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల ఏఓలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మండల స్థాయిలో సక్రమంగా పనిచేయకపోవడంతో గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు చేయించడం వదిలేసి రాజకీయముద్ర వేసుకోవద్దని హితువు పలికారు. మండల స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్‌లో సమస్యలు వచ్చిన వాటిని నమోదు చేయకుండా ఏఓలు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. దీంతో అక్కడ పట్టించుకోవడం లేదని జిల్లా స్థాయిలో ఫిర్యాదులు ఇస్తున్నారన్నారు. పనులను క్షేత్ర స్థాయిలో కనీసం పరిశీలించడం లేదని తెలుస్తోందన్నారు. ఇంత అధ్వానంగా పనిచేస్తే ఎలా అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మండలాల్లో దాదాపు 10–15 పనులను పరిశీలిస్తారని వాటిని చూడటానికి మీకు ఓపిక లేదా అని సీఈఓ ప్రశ్నించారు. తూర్పు మండలాల్లో 500 అడుగులు లోతులో బోరు వేస్తున్నట్లు బిల్లులు పెట్టడం చూసి విస్తుపోతున్నామన్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద దళితవాడల్లో వసతుల కల్పన పై ఎందుకు శ్రద్ధపెట్టడం లేదన్నారు. పంచాయతీరాజ్ పరిధిలో 5 ఏళ్లు దాటిన ప్రతి ఉద్యోగిని బదిలీ చేస్తామని సృష్టం చేశారు. రెండేళ్లు దాటిన వారు రిక్వెస్టు, మ్యూచువల్ మేరకు మార్పు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ జుబేదా తదితరులు పాల్గొన్నారు. ● ఏఓలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జెడ్పీ సీఈఓ -
సర్వర్ పరేషాన్
● రేషన్‌కార్డు దరఖాస్తుకు మొరాయిస్తున్న సర్వర్ ● సచివాలయ సిబ్బంది సతమతం ● గందరగోళంగా దరఖాస్తుల ప్రక్రియ ● మ్యారేజ్ సర్టిఫికెట్ వద్దన్నా..పలుచోట్ల వేధింపులు ● పట్టించుకోని పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్‌కార్డుకు సంబంధించిన దరఖాస్తుల వివరాలు రకం సంఖ్య చిరునామా మార్పు 235 ఆధార్ సీడింగ్ కరెక్షన్ 287 సభ్యుల చేర్పు 13769 సభ్యుల తొలగింపు 301 కొత్త రేషన్‌కార్డు 1939 కార్డు విభజనకు 1528 సరెండర్ కార్డు 41చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కొత్త రేషన్‌కార్డుల సర్వర్లు పనిచేయకపోవడంతో సచివాలయ సిబ్బంది సతమతం అవుతున్నారు. దరఖాస్తు కోసం కార్డుదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షిస్తున్నారు. తొలి నుంచి సర్వర్ సమస్య వెంటాడుతున్నా పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలున్నాయి. కొత్తగా రేషన్‌కార్డు కావాలని దరఖాస్తు చేసుకునేవారికి ప్రభుత్వం వద్దన్నా.. పలుచోట్ల సచివాలయ సిబ్బంది మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలని నిబంధన పెడుతున్నారు. దీంతో కార్డుదారుల దరఖాస్తు ప్రక్రియ ప్రహసనంగా మారింది. 18,100 దరఖాస్తులు కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల ప్రక్రియకు ఈనెల 7వతేదీ నుంచి ప్రారంభమైంది. ఏడాది కాలంగా కొత్త రేషన్ కార్డుల జారీ లేకపోవడం, రేషన్ కార్డులు చేర్పులు, తొలగింపులు వంటివి పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రేషన్‌కార్డుల జారీకి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అర్జీదారులు గ్రామవార్డు సచివాలయ సిబ్బంది చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి. ఈనెల 15వ తేదీ నుంచి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం చెప్పినా..అమల్లోకి రాలేదు. దీంతో రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు అవస్థలు పడుతున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుకు సంబంధించి ఇప్పటి వరకు 18,100 దరఖాస్తులు వచ్చాయి. ఒంటరి మహిళల దరఖాస్తులపై ఆంక్షలు సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో జిల్లాలో అర్జీదారులు సచివాలయాల చుట్టూ తిరగడమే సరిపోతుంది. సర్వర్ సరిగ్గా పనిచేస్తే ఈపాటికి రేషన్ కార్డులు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి ఉండేది. సర్వర్ సమస్య తట్టుకోలేక కొన్ని ప్రాంతాల్లో త్వరపడి సచివాలయ సిబ్బంది దరఖాస్తులను తీసుకోవద్దని వీఆర్వోలు ఆదేశాలు జారీ చేశారు. జూన్‌లో కొత్త రేషన్ కార్డులు మంజూరు ఉంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రకటించారు. సర్వర్ సమస్యతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ సాగుతూ ఉండటంతో ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తున్నా నిరాశే ఎదరువుతోంది. ముఖ్యంగా వివాహమై భర్తకు ఏళ్ల తరబడి దూరంగా ఉంటున్న ఒంటరి మహిళలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జరగడం లేదు. విడాకులకు సంబంధించిన వివరాలు ఉండాలంటూ చెబుతున్న పరిస్థితి నెలకొంది. భర్త నుంచి దూరమమై అనేక మంది మహిళలు ఒంటరిగా పిల్లలతో జీవిస్తున్నారు. విడాకుల కోసం తిరగలేక ఆర్థిక స్తోమత లేక అలాగే ఉండిపోయారు. ఇలాంటి ఒంటరి మహిళలకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించకుండా ఆంక్షలు విధించటం ఏమిటని విమర్శలు వెల్లువెత్తున్నాయి. వివాహ పత్రానికి మినహాయింపు ఏదీ.. రేషన్‌కార్డుదారులకు దరఖాస్తు చేసుకుంటున్న కొత్త జంటలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇప్పటి వరకు తల్లిదండ్రుల కార్డుల్లో సభ్యులు కొనసాగుతున్న వారు కొత్తకార్డుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీనికి మొదట్లో ప్రభుత్వం ఆధార్, పాతరేషన్కార్డుల నకలు, వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేసింది. దీంతో అనేక మంది ప్రస్తుతం వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకునేందుకు నానా పాట్లు పడ్డారు. నోటరీ, పెళ్లి శుభలేక, పెళ్లి సమయంలోని ఫొటోలు, వంటి తదితర వివరాలు కచ్చితంగా ఉండాలని కోరడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుభలేఖలు లేనివారు ప్రింటింగ్ ప్రెస్‌లకు పరుగులు పెట్టారు. ఆ తర్వాత పెళ్లి పత్రాలు రావడానికి ఆలస్యమవుతుందని గుర్తించిన ప్రభుత్వం వివాహ ధ్రువీకరణ పత్రం విషయంలో మినహాయింపు ఇచ్చింది. అయితే పలు చోట్ల సచివాలయ సిబ్బంది పెళ్లి పత్రాల తప్పనిసరి అంటూ మెలిక పెడుతున్నారు. ఇబ్బందులు కలిగించొద్దు కొత్తగా వివాహం అయిన జంటలకు వివాహ పత్రం అవసరం లేదు. దీనిపై పూర్తి స్థాయిలో సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇస్తాం. వాళ్లను ఇబ్బంది పెట్టవద్దని చెబుతున్నాం. ఎక్కడైనా అలాంటి సమస్యలు వస్తే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చు. రేషన్ కార్డు మంజూరు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మి మోసపోవద్దు. అర్హత ఉంటే కచ్చితంగా కార్డులు వస్తాయి. సర్వర్ సమస్య త్వరలో పరిష్కారమవుతుంది. – శంకరన్ డీఎస్ఓ, చిత్తూరు అవగాహన లేక.. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రారంభ సమయంలోనే ఆయా సచివాలయాల సిబ్బందికి అవగాహన శిబిరాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. అలా జరిగి ఉంటే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు దరఖాస్తులు వచ్చేవి. కొన్ని ప్రాంతాలలో కులం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్, కోరుతున్నారు. అదే సమయంలో గతంలో రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులను తొలగిస్తేనే, వారు పెళ్లి అనంతరం వారి ప్రత్యేక కుటుంబంతో దరఖాస్తు చేసుకోవటానికి వెసులుబాటు జరుగుతుంది. అలా చేర్పులు, మార్పులు తొలగింపులకు, సర్వర్ల ప్రక్రియ సక్రమంగా పనిచేయక అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సచివాలయ సిబ్బందికి అర్జీదారులకు వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగంలో ప్రత్యేక సిబ్బంది లేకపోవడంతో ప్రారంభంలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. కొత్తగా సభ్యుల చేరిక మొదలుకుని ఇప్పటికే మృతి చెందిన, వివాహమై వెళ్లిపోయిన సభ్యుల వివరాలను మార్చడం లేదు. దరఖాస్తు దారులకు సమయం పొడిగించాలని, సర్వర్ల సమస్యను పరిష్కరించాలని, దరఖాస్తుకు జత పరచాల్సిన వివరాలను సచివాలయాల వద్ద అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. -
పలమనేరుకు చేరుకున్న కుంకీ ఏనుగులు
పలమనేరు : కర్ణాటక ప్రభుత్వం నుంచి పలమనేరు మండలంలోని కాలువపల్లి వద్ద నిర్మించిన ఎలిఫెంట్ క్యాంపునకు నాలుగు ఏనుగులు వచ్చినట్లు స్థానిక ఎఫ్ఆర్వో నారాయణ బుధవారం తెలిపారు. ఆ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలో వీటిని స్వీకరించారు. ఈ కుంకీ ఏనుగుల పేర్లు రంజని, దేవా, కృష్ణా, అభిమన్యు ఉన్నాయి. వీటి సంరక్షణకు ఇక్కడి క్యాంపులో అవసరమైన మేతను అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల కర్ణాటక మావటీలు స్థానిక రేంజిలో శిక్షణ పొందిన మావటీలు వీరి పర్యవేక్షణలో ఉంటారని అధికారులు తెలిపారు. మామిడి దిగుబడిపై నివేదిక ఇవ్వాలి తవణంపల్లె : మామిడి దిగుబడిపై అంచనా వేసి నిర్ధిష్టమైన నివేదిక ఉంచాలని జిల్లా ఉద్యాన అధికారి మధుసూదన్‌రెడ్డి రైతు సేవా కేంద్రం సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మండలంలోని పుణ్యసముద్రం రైతు సేవా కేంద్రంలో మామిడి దిగుబడి అంచనాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సేవా సిబ్బంది పరిధిలోని రైతులను కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి మామిడి దిగుబడి ఎన్ని టన్నులు వస్తుందని అంచనా వేసి నివేదిక తయారు చేయాలని సూచించారు. సీజన్ ప్రారంభం కాక ముందే ప్రణాళిక తయారు చేసే నివేదిక చాలా ఉపయోగపడుతోందని వివరించారు. అనంతరం ఫీల్ ఫ్రెష్ ఫుడ్ ఫ్యాక్టరీని తనిఖీ చేశారు. నిల్వ ఉన్న మామిడి కాయలను, ఫ్యాక్టరీని పరిశీలించి ఫల్ప్ తయారీపై ఆరా తీశారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి సాగరిక, మండల వ్యవసాయాధికారి జి. ప్రవీణ్, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండాయి. క్యూలైన్ ఏటీజిహెచ్ వద్దకు చేరింది. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,000 మంది స్వామివారిని దర్శించుకోగా 31,766 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.07 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
డీసీహెచ్ఎస్లో వర్గపోరు
● జిల్లా ఆస్పత్రిని తాకిన సెగ ● అంతా తానై వ్యవహరిస్తున్న ఇద్దరు అధికారులు ● ఇష్టానుసారంగా డెప్యూటేషన్లు రద్దు ● కలెక్టర్, కమిషనర్ ఉత్తర్వులు బేఖాతరు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : డీఎసీహెచ్ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు వర్గపోరు పుంజుకుంటోంది. ఈ ప్రభావం డీహెచ్ (జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి) కార్యాలయంపై పడింది. ఆ ఇద్దరు అధికారులు కలిసి అంతా తామై చక్రం తిప్పుతున్నారు. ఇష్టానుసారంగా డెప్యుటేషన్లు రద్దు చేయడం..ఆ తప్పులను డీసీహెచ్ఎస్, కమిషనర్ మీదకు నెట్టేస్తున్నారు. కలెక్టర్, కమిషనర్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ...ఉద్యోగులు, సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారు. భయపడుతున్న అధికారులు, సిబ్బంది.. జిల్లా వైద్యవిధాన పరిఽషత్ పరిధిలో ఒక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, నాలుగు ఏరియా ఆస్పత్రులు, 8 సీహెచ్‌సీలున్నాయి. ఈ పరిధిలో సుమారు 500 మందికి పైగా పనిచేయగా డెప్యుటేషన్‌లో 40 మంది ఉన్నారు.. వీరిలో వర్గపోరు తారస్థాయి చేరుకుంది. ప్రధానంగా ఏఓ, ఏడీ పోస్టులు ఖాళీ అయిన దగ్గర నుంచి ఈ వర్గపోరు ఉధృతమైంది. డీసీహెచ్ఎస్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి అంతా తాను చెప్పినట్లే జరగాలని ఈ పోరుకు ఆజ్యం పోస్తున్నారు. రాష్ట్ర కమిషనర్ శాఖలో పనిచేశానని గొప్పలు చెప్పకుంటూ..రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అందరూ తనకు సుపరిచితులే అంటూ భయపెడుతున్నాడని కార్యాలయ సిబ్బంది, పలువురు అధికారులు వాపోతున్నారు. ఇటీవల డీసీహెచ్ఎస్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఏఓ పోస్టుకు ఇద్దరు అధికారులు పోటీ పడ్డారు. కానీ ఆ అధికారి పుంగనూరులో పనిచేస్తున్న ఓ అధికారిని ఏఓ పోస్టుకు తెచ్చుకోవాలని గట్టి ప్రయత్నాలు చేశారు. తొలుత ఏడీ కుర్చీలో కూర్చోబెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇది ఫలించకపోగా..ఏఓ కుర్చీకి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఇటీవల డీసీహెచ్ఎస్కు అనుకూలమైన ఓ అధికారి ఏఓ బాధ్యతలను చేపట్టారు. ఇది గిట్టక కార్యాలయంలో గందరగోళం సృష్టించాలని, డీసీహెచ్ఎస్కు చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ అధికారుల వర్గం పావులు కదుపుతోంది. ఎలాంటి ఆర్డర్లు లేకుండానే.. కుటుంబ, ఆరోగ్య పరమైన కారణాలతో కలెక్టర్, కమిషనర్ అనుమతితో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. వారిని పనిచేస్తున్న స్థానం నుంచి రిలీవ్ చేయాలన్న రాష్ట్ర అధికారుల ఉత్తర్వులు ఉండాలి. అయితే డీసీహెచ్ఎస్, డీహెచ్ కార్యాలయంలో అవేవీ చెల్లుబాటు కావడంలేదు. ఓ వర్గం అధికారి చెబితేనే జిల్లాలోని ఆస్పత్రుల్లోని సూపరింటెండెంట్లంతా వణుకుతున్నారు. లేకుంటే ఆ అధికారి రాష్ట్ర కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తారనే భయం ప్రతి ఒక్కరిలోనూ వెంటాడుతోంది. కమిషనర్ ఆర్డర్లు లేకపోయినా..జిల్లాలో ఆ అధికారే జిల్లాకు డీసీహెచ్ఎస్, కమిషనర్ లెక్క పనిచేస్తున్నారని కార్యాలయ అధికారులు వాపోతున్నారు. ప్రధానంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిని టార్గెట్ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కార్యాలయంలోని మరో అధికారితో చేతులు కలిపి ఈ డెప్యుటేషన్లు రద్దుకు పూనుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అది కూడా వాళ్ల వర్గానికి మాత్రమే ఆ డెప్యుటేషన్లను పరిమితం చేశారని పలు విమర్శలకు తావిస్తోంది. వీటిపై విచారణ చేపడితే ఆ అధికారి అక్రమ బాగోతాలు బయట పడుతున్నాయని చెబుతున్నారు. వీరిపై రాష్ట్ర, జిల్లా అధికారులకు కూడా పలు ిఫిర్యాదులు వెళ్లాయి. డెప్యూటేషన్ల రద్దుపై అధికారులను ప్రశ్నిస్తే మాకేం సంబంధం లేదంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. డీసీహెచ్ఎస్ నోటి మాటగా చెప్పడంతో చేశామని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అధికారి బదులిచ్చారు. డెప్యుటేషన్ రద్దు తెలియదు డెప్యుటేషన్ రద్దు ఎప్పడు చేయమన్నాను. నేను ఎప్పుడూ చెప్పలేదు. ఏవైనా ఆర్డరు పెట్టండి కనుక్కుంటా. ఈ ఆర్డర్‌తో నాకు సంబంధం లేదు. అది ఆస్పత్రి వాళ్లు ఇచ్చుకున్నారు. విచారిస్తాను. చర్యలు తీసుకుంటా. – పద్మాంజలి, డీసీహెచ్ఎస్, చిత్తూరు -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
గుడిపాల : డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. బెంగుళూరు నుంచి గుడిపాల మండలంలోని కొత్తకోట గ్రామానికి కారులో అదే గ్రామానికి చెందిన వారు వెళ్తున్నారు. బుధవారం తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కుప్పిగానిపల్లె గ్రామం సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న 33 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాకుండా క్షేమంగా భయటపడడంతో ఊపిరిపీల్చుకున్నారు. -
మృగరాజుపై వేణుగోపాలుడు
కార్వేటినగరం : కార్వేటినగరం టీటీడీ అనుబంధ వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి కాళ సర్పంపై నృత్య వేణుగోపాలుడుగా ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీరారు. ఉదయం సింహ వాహనంపై వేణుగోపాలుడు భక్తులను అనుగ్రహించారు. తెల్లవారు జామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు నరసింహ అవతారంలో స్వామివారు సింహ వాహనంపై కొలువుదీరి పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం 10 గంటల నుంచి 11 గంటల మధ్య రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులకు వేదపండితులు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం శ్రీకృష్ణ అవతారంలోని శ్రీవేణుగోపాలుడికి ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో టీటీడీ బృందం గాత్ర కచేరి తో కనులపండువగా ఊంజల్‌సేవ నిర్వహించారు. ఉభయ నాంచార్లుతో వేణుగోపాలుడు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి రుక్మిణీ సత్యభామ సమేతుడై శ్రీవేణుగోపాలుడు ముత్యపు పందిరి వాహనంపై కొలువుదీరి చిన్నారుల కోలాటాలు, మహిళల చెక్కభజనల, మంగళ వాయిద్యాలు, నడుమ అత్యంత వైభవంగా పురవీధుల్లో ఊరేగారు. భక్తులు ఇంటింటా కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవతో స్వామి వారిని పవళింప జేశారు. కార్యక్రమంలో ఏఈఓ రవి, సూపరింటెండెంట్ సోమశేఖర్, ఆలయ అధికారి సురేష్‌కుమార్, షరాబ్ బాబు సురేష్, కంకణభట్టర్ తరుణ్‌కుమార్, వేద పండితులు నారాయణదాసరథి, గోపాలాచార్యులు, రమేష్, శభరీష్, అలంకార పండితులు మోహన్బట్టాచార్యులు టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. నేడు కల్యాణోత్సవం కార్వేటినగరంలో జరుగుతున్న రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై స్వామి ఊరేగనున్నారు. ఈ క్రమంలో ఆలయంలో సాయంత్రం 5 గంటల నుంచి 6.30 వరకు ఆర్జిత కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి సురేష్‌కుమార్ చెప్పారు. రాత్రి 7 గంటల నుంచి సర్వభూపాల వాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
● నల్లబెల్లం పేరిట అన్నదాతల అరెస్టులు ● సారా తయారీకి బెల్లం విక్రయిస్తున్నారని సంకెళ్లు ● జిల్లా వ్యాప్తంగా రైతుల అరెస్టులు.. నోటీసులు ● రైతులకు ‘కూటమి సర్కారు’ ఝలక్ ● ట్రేడర్లకే విక్రయించాలంటున్న ఎకై ్సజ్ పోలీసులు
చిత్తూరు అర్బన్ : జిల్లాలో రైతులు పండించే ప్రధాన పంటల్లో చెరకు ఒకటి. ఇక్కడి నల్లరేగడి భూముల కారణంగా చాలా వరకు బెల్లం నలుపు రంగులో తయారవుతుంది. కొన్ని రకాల రసాయనాలు, ప్రాసెసింగ్ చేస్తే బెల్లం రంగు మారుతుంది. కానీ గిట్టుబాటు ధర దక్కదు. దీంతో చాలా మంది నల్లబెల్లాన్ని తయారు చేసి మండీలు, అవసరం ఉన్న వాళ్లకు, ట్రేడర్లకు అమ్ముతున్నారు. ఇదే ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. నల్లబెల్లం తయారీ, విక్రయాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆంక్షలు అతిక్రమిస్తున్న అన్నదాతలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి జైలుకు పంపుతోంది. ప్రభుత్వ చర్యలపై రైతులు, రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు. నవోదయంలో చీకట్లు నాటుసారా తయారీ, విక్రయాలను అరికట్టడానికి కూటమి ప్రభుత్వం నవోదయం 2.0ను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా సారా తయారు చేస్తున్న కుటుంబాలను ఆ ఊబి నుంచి బయటపడేసి, వాళ్ల జీవన ప్రమాణాలు మార్చడానికి రుణాలు, ఇతర ప్రత్యామ్నాయ పనులను కల్పించాల్సిన ప్రభుత్వం రైతులపై పడింది. నాటు సారా తయారీకి నల్లబెల్లం తప్పనిసరిగా వాడతారని, నల్లబెల్లం తయారు చేస్తున్న రైతులపై నిఘా ఉంచాలని, ఎవరెవరికి నల్లబెల్లం విక్రయిస్తున్నారు..? కొనుక్కునే వ్యక్తి ఆధార్ తీసుకున్నారా..? కిలో ఎంతకు అమ్ముతున్నారు..? అయిదు కిలోలకు పైబడి ఎవరికి అమ్ముతున్నారు..? అని వివరాల సేకరిస్తున్నారు. వాస్తవానికి బెల్లం తయారు చేసిన రైతులు దాన్ని మార్కెట్‌కు తరలించాలంటే తన రవాణాకు కిలో కు రూ.3, మార్కెట్లో కమిషన్ రూ.3 అదనపు సుంకంగా చెల్లించాలి. తీరా బెల్లాన్ని విక్రయించిన తరువాత తన పెట్టుబడి దక్కని పరిస్థితి. దీంతో కొందరు రైతులు బెల్లాన్ని మార్కెఫెడ్‌లో విక్రయించడంతో పాటు గ్రామాల్లో అమ్ముతుంటారు. రైతు ల నుంచి బెల్లాన్ని కొన్నవాళ్లు దాన్ని ఫ్యాక్టరీలకు వాడతారో.. పశువులకు దాణాగా ఉపయోగిస్తారో అన్నదాతలకు తెలియదు. కానీ ఎవరైనా సారా తయారు చేస్తూ పట్టుబడితే, నిందితులు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుని బెల్లం విక్రయించారనే నెపంతో రైతులను అరెస్టు చేయడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. బెల్లం తయారీలో రైతులు‘ఈ చిత్రంలో భార్య, బిడ్డలతో తన చెరకు తోట, ట్రాక్టర్‌తో కలిసి ఉన్న రైతు పేరు పెరుమాల్. గతేడాది ఆయుధపూజ నేపథ్యంలో చెరకు పంట ఓ మోస్తరుగా వస్తుండడంతో ఇలా ఫొటో తీసుకున్నాడు. కానీ ఇప్పుడు పెరుమాల్ చిత్తూరు జిల్లా జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు.. కారణం.. పెరుమాల్ రైతు కావడం, తన వద్ద నల్లబెల్లం కొన్న వ్యక్తులు సారా తయారు చేశారంట.’ సారాకు బెల్లం విక్రయిస్తే అరెస్టు తప్పదు సారా తయారీకి నల్లబెల్లాన్ని విక్రయిస్తే చట్టపరంగా ముందుకు వెళతాం. సారా తయారీ వాళ్లకు బెల్లం అమ్మారని తెలిసాకే అరెస్టు చేశాం. నవోదయంలో భాగంగా నాటు సారా తయారీ అరికట్టడానికి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి, బెల్లం వ్యాపారులు, రైతులకు అవగాహన కల్పించాం. ఫ్యాక్టరీలు, పశువుల కోసం నల్లబెల్లం అమ్మితే పర్లేదు. సారా కోసం అమ్మితే మాత్రం అరెస్టు తప్పదు. – శ్రీనివాస్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, చిత్తూరు గిట్టుబాటు ధర ఎక్కడ ? జిల్లాలో దాదాపు 5 వేల హెక్టార్లలో చెరకు పంట సాగువుతోంది. ఇందులో చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల, రూరల్, నగరి, నిండ్ర, విజయపురం, గంగాధర నెల్లూరు, కార్వేటినగరం, పెనుమూరు, పుంగనూరు, పులిచెర్ల, ఎస్.పురం, వెదురుకుప్పం మండలాల్లో చెరకు పంట ఎక్కువగా పండిస్తున్నారు. వీటిల్లో 4500 హెక్టార్లలో పండే పంటను ఫ్యాక్టరీలకు విక్రయిస్తుండగా మిగిలిన 500 హెక్టార్ల నుంచి బెల్లం తయారీ చేస్తున్నారు. ఒక హెక్టారుకు 70 టన్నుల వరకు బెల్లం తయారు చేస్తున్నారు. ఇందులో దాదాపు 5 వేల టన్నుల వరకు నల్లబెల్లం ఉత్పత్తి అవుతోంది. కిలో నల్లబెల్లాన్ని మార్కెట్లో ట్రేడర్లకు విక్రయిస్తే రూ.24–27 మధ్య ధర వస్తుంది. ఇందులోనే రవాణా చార్జీలు, దళారుల కమీషన్లు పోనూ చేతికి రూ.15 దక్కడం గగనంగా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో నల్లబెల్లానికి గిట్టుబాటు ధర కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం.. మార్కెఫెడ్ ద్వారా బెల్లాన్ని కొనుగోలు చేయిస్తూ రైతులను ఆదుకుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యింది. అరెస్టులపై ఉద్యమిస్తాం ఎక్కడైనా సారా తయారు చేసే వాళ్లను అరెస్టు చేస్తారు. కానీ ఇక్కడ బెల్లం తయారు చేసే రైతులను అరెస్టు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం.? నాటుసారా పేరిట రైతులను అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నారు. పొలాన్ని నమ్ముకున్న కుటుంబం రోడ్డున పడుతోంది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రభుత్వం ఇలాంటి చర్యలు ఆపకపోతే ఉద్యమం తప్పదు. – నాగరాజన్, సీపీఐ, జిల్లా కార్యదర్శి ప్రభుత్వానికి దమ్ముంటే పంటను కొనుగోలు చేయాలి వైఎస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు మార్క్‌ఫెడ్ ద్వారా నల్లబెల్లాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. సారాను నివారించడానికి పీడీ యాక్టులు పెట్టాం. కానీ టీడీపీ అధికారంలోకి వస్తేనే బెల్లం రైతులపై పడుతారు. గతంలోనూ అంతే, ఇప్పుడూ అదే కొనసాగుతోంది. మా నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులను అరెస్టు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే జిల్లాలో బెల్లం రైతులకు ఇబ్బందులు తప్పవు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే నల్లబెల్లానికి గిట్టుబాటు ధర కల్పించి, పంటను కొనుగోలు చేయాలి. – ఎంిసీ.విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, చిత్తూరు -
ద్రవిడ వర్సిటీకి రూ.5.20 కోట్ల రుణం
కుప్పం : ద్రవిడ వర్సిటీకి రూ.5.20 కోట్లు రుణాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ జీఓ విడుదల చేసింది. అయితే ఈ నిధులను వర్సిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెల్లించుకోమని గానీ ఎక్కడా చెప్పలేదు. పైగా ఈ నిధులను 10 ఏళ్లలోపు మళ్లీ చెల్లించాలని జీఓలో పొందుపరిచారు. కాగా మూడేళ్లలోపు అదనపు బడ్జెట్ కింద నిధులు మంజూరు చేస్తామని.. వీటిని సైతం 10 ఏళ్లలోపు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ నిధులను వర్సిటీలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ జీతాలు చెల్లించేందుకే అని వర్శిటీ అధికారులు స్పష్టం చేశారు. వేతనాలు నేరుగా అందించకుండా అప్పుగా ఇవ్వడంపై ఒప్పంద ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ద్రావిడ విశ్వవిద్యాలయంలో గత సంవత్సర కాలానికి పైగా తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వర్శిటీని ప్రక్షాళన చేసి వీరి జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశగా ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశే మిగులుతోంది. మొదట్లో ఆరు నెలల జీతాలు మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం ఏడాదికి పైగా జీతాలు రావాల్సి ఉండగా వర్సిటీ అధికారులు ఉన్నత విద్య శాఖ అధికారులకు నివేదికలు పంపారు. అయితే 235 మందికి ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వడం కుదరదని ఇప్పటికే చేతులెత్తేశారు.ముఖ్యమంత్రి కుప్పం పర్యటన సందర్భంగా..రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం కుప్పంకు విచ్చేస్తున్న నేపథ్యంలో వర్సిటీలోని హెలీప్యాడ్‌కు చేరుకుని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. వర్సిటీలో గత సంవత్సర కాలంగా జీతాలు అందక అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఉద్యోగుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉండకూడదన్న భావనతో వర్సిటికీ రూ.5.20 కోట్లు రుణాన్ని మంజూరు చేస్తూ జీఓను విడుదల చేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కనీస వేతనాలు అందకకూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వర్సిటీని అభివృద్ధి చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశగా ఎదురు చూస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వీరికి ఎలాంటి అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పడంతో పాటు కనీసం జీతాలను వారికి నేరుగా అందించకుండా వర్సిటీకి అప్పుగా ఇవ్వడంతో ఆందోళనకు గురవుతున్నారు. వర్సిటీ ఏర్పాటుకు భూములు అందించినా కనీస వేతనాలను తమకు అందించకుండా చేస్తుండండంతో తమ భవిష్యత్తు అంధకారం నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏం సాధించారని వాయిదా!
సంస్కరణల పేరుతో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న అశాసీ్త్రయ విధానాలను క్షేత్రస్థాయిలో టీచర్లు ఎండగడుతున్నారు. టీచర్ల సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కాకపోయే సరికి ఈనెల 21వ తేదీన ఉమ్మడి చిత్తూరు డీఈఓ కార్యాలయాలు ముట్టడిస్తామంటూ ఇటీవల అన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. మంగళవారం ప్రభుత్వం తరపున మరోమారు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోనా శశిధర్ సంఘం నాయకులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో డిమాండ్లు ఏ మాత్రం పరిష్కారం కాకపోయినప్పటికీ ముట్టడి వాయిదా వేస్తున్నట్లు సంఘాల నాయకులు ప్రకటించారు. దీంతో జిల్లాలోని టీచర్లు ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం సాధించారని ముట్టడి వాయిదా వేశారంటూ ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : కూటమి టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెలుగులు జిమ్ముతున్న విద్యావ్యవస్థను కారుచీకటిగా మార్చేసింది. తాజాగా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పేరుతో తొమ్మిది రకాల బడులను తెరపైకి తెచ్చింది. ఈ విధానం వల్ల క్షేత్రస్థాయిలో విద్యార్థులకు, టీచర్లకు తీరని నష్టం కలుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పేరుతో విలీనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి పేద విద్యార్థులు తమ గ్రామాల నుంచి కి.మీ దూరం నడిచి మరొక పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న వింత ధోరణిపై టీచర్లు, తల్లిదండ్రులు, పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఈడీ చదివిన అభ్యర్థులు ఎస్జీటీ పరీక్ష రాసేందుకు అవకాశం లేదు. అలాంటప్పుడు బీఈడీ చదివి స్కూల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న టీచర్లు ప్రాథమిక పాఠశాలల్లో ఎలా బోధిస్తారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ముట్టడి వాయిదాపై తీవ్ర విమర్శలు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక సంఘం నాయకులు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో నిర్వహించిన చర్చలతో ఒరిగిందేమి లేదు. అయినప్పటికీ బుధవారం నిర్వహించాల్సిన డీఈఓ కార్యాలయాల ముట్టడిని వెనక్కి తీసుకోవడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. క్షేత్రస్థాయిలో టీచర్ల సంఘ నాయకుల తీరుపట్ల భగ్గుమంటున్నారు. సంఘం నేతలపై టీచర్ల మండిపాటు చర్చలతో ఒరిగిందేమి లేదంటున్న టీచర్లు మోడల్ ప్రైమరీ హెచ్ఎంలుగా ఎస్ఏల నియామకం అశాసీ్త్రయం డీఈఓ కార్యాలయాల ముట్టడి వాయిదాపై టీచర్ల ఆగ్రహం 19 డిమాండ్లలో కొన్నే పరిష్కారం ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు 19 రకాల డిమాండ్లను కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టారు. అయితే ఈనెల 20 న నిర్వహించిన చర్చల్లో కొన్ని మాత్రమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవి కూడా కపట హామీలే. కీలక డిమాండ్లైన ఇంగ్లీష్ కు సమాంతరంగా తెలుగు, ఇతర మైనర్ మీడియంలను కొనసాగించి టీచర్ల ను అలాగే కొనసాగించాలన్న డిమాండ్ ను తిరస్కరించారు. ఉన్నత పాఠశాలల్లో 1:35 నిష్పత్తిని అమలు చేయాలని, 45 మంది విద్యార్థులు దాటాక రెండో సెక్షన్ ఏర్పాటు పైనా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మోడల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించడం అశాసీ్త్రయం. అయితే ఆ డిమాండ్‌ను పరిష్కరించలేదు. చర్చలు సాగింది వీటిపైనే.. క్షేత్ర స్థాయిలో టీచర్లు మ్యాన్యువల్, వెబ్ కౌన్సిలింగ్ అంటూ రెండు గ్రూపులుగా విడిపోయారు. ఈ విధానం కొందరికి నష్టం కానుంది. 49 తర్వాత 50 రోల్ ఉంటేనే రెండవ సెక్షన్ అని అన్నారు. దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే అలాంటి స్కూల్స్ చాలా తక్కువగా ఉంటాయి. దీంతో ఉపయోగమేమి లేదు. 1,2 తరగతులతో ఉండే ఫౌండేషన్ స్కూల్ లో సంఖ్య 20 దాటిన స్కూల్స్ భూతద్దం పెట్టి వెతికితే మండలానికి ఒకటి, రెండు ఉంటాయి. కొన్ని మండలాల్లో అయితే ఒక్కటీ ఉండే అవకాశం లేదు. ప్రైమరీ స్కూల్ హెచ్ఎంల విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య ఇప్పట్లో తేలే అంశం కాదు.. దీంతో ఎన్ని హామీలు ఇచ్చినా నమ్మే ప్రసక్తి లేదని టీచర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉద్యోగోన్నతుల మాట ఎక్కడా ప్రస్తావించ లేదు. ఎస్జీటీలకు మాత్రమే మ్యాన్యువల్ కౌన్సెలింగ్ మిగిలిన వారికి వెబ్ కౌన్సెలింగ్ ఇదెక్కడి న్యాయం. తాత్కాలికంగా వాయిదా ఈనెల 21న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేపట్టాల్సిన ముట్టడిని తాత్కాలికంగా వాయిదా వేశాం. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన చర్చల్లో కొన్ని డిమాండ్లు పరిష్కరిస్తామన్నారు. దీంతో తాత్కాలికంగా వాయిదా వేశాం. – జీవీ, రమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, చిత్తూరు జిల్లా. ప్రభుత్వం మొండి వైఖరి ప్రస్తుత కూటమి ప్రభుత్వం టీచర్లపై మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. గత ప్రభు త్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తె లుగు మాధ్యమం, మాతృభాష తప్పనిసరిగా ఉండాలని అప్పట్లో గగ్గోలు పెట్టారు. ప్రభుత్వం ప్రస్తుతం స్కూల్స్‌లో తెలుగు మీడియం పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. – రెడ్డిశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌టీఏ రాష్ట్ర ట్రెజరర్, చిత్తూరు జిల్లా -
మార్కులు కాదు.. మార్పు తేవాలి!
● జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో 11 అంశాలపై సర్వే ● నాలుగు రోజుల క్రితం రాష్ట్రశాఖ మార్కుల వెల్లడి ● 76.36 మార్కులతో జిల్లా వెనకడుగు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో 50 పీహెచ్‌సీలున్నాయి. ఏడాది క్రితం వరకు రోజువారీగా ఒక్కో పీహెచ్‌సీకి 100 నుంచి 150 వరకు ఓపీలొచ్చేవి. ఇప్పుడు ఈ సంఖ్య తగ్గుముఖం పట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య ఆరోగ్య సేవలు గాలిలో దీపంలా మారాయి. క్షేత్ర స్థాయిలో తూతూమంత్రంగా వైద్య సేవలు అందుతున్నాయి. వదలని నిర్లక్ష్యపు జబ్బు మాతా శిశు సంక్షేమ కార్యక్రమాల విషయాన్ని జిల్లాలోని వైద్యులు, సిబ్బంది పూర్తిగా గాలికొదిలేశారు. గర్భిణుల గుర్తింపులో నిర్లక్ష్యం చేస్తున్నారు. హైరిస్క్ కేసుల విషయంలో చూసీచూడనట్లు ఉండిపోతున్నారు. ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్య సేవలందించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. పీహెచ్సీలో సుఖ ప్రసవాలు చేయాలనే లక్ష్యాన్ని అలక్ష్యం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ముఖం చాటేస్తున్నారు పీహెచ్‌సీకి వచ్చే రోగులపై వైద్యులు, సిబ్బంది ముఖం చాటేస్తున్నారు. మధ్యాహ్నంపైగా పలు చోట్ల డాక్టర్లు ఉండడం లేదు. మీటింగ్‌ల పేరుతో డుమ్మా కొడుతున్నారు. కొందరు యూనియన్ పేర్లు చెప్పుకుని కాలయాపన చేస్తున్నారు. దీంతో పీహెచ్‌సీల్లో అరకొర వైద్య సేవలందుతున్నాయి. వచ్చిన వారికి కొన్ని మందు బిల్లలు ఇచ్చి పంపించేస్తున్నారు. చాలా చోట్ల వైద్య సేవలు కనుమరుగవుతున్నాయి. సీజనల్ వ్యాధుల సమయంలో అధికారులు, సిబ్బంది చోద్యం చూస్తున్నారు. పనితీరుకు ఒక మార్కు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో అందించే సేవలు, పనితీరు ఆధారంగా జిలాల్లకు మార్కులు కేటాయించారు. సీజనల్ వ్యాధుల కట్టడి నుంచి మాతాశిశు ఆరోగ్యం వరకు 11 అంశాల్లో సంతృప్తి స్థాయి, లోటుపాట్లను లెక్కించారు. జిల్లా వారీగా మార్కులను ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో చిత్తూరు జిల్లా 76.36 మార్కులతో వెనకబడింది. కొన్ని సేవల్లో పర్వాలేదనిపించింది. 11 అంశాల వారీగా కేటాయించిన మార్కులు అంశం మార్కులు గర్భవతుల సేవలు – 12.07 శిశు సంక్షేమం, రొటీన్ టీకాలు – 8.15 కుటుంబ నియంత్రణ – 2.06 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు – 9.87 సంక్రమిత, అసంక్రమిత వ్యాధులు – 5.70 ఆర్బీఎస్కే – 3.53 జాతీయ ఆరోగ్య మిషన్ – 8.20 ఆస్పత్రుల నాణ్యత, సేవలు – 1.86 అభ(ఆయుష్మాన్ భారత్), అటెండెన్స్ – 4.95 సీజనల్ వ్యాధులు – 9.14 నిధుల కేటాయింపు – 4.35నిర్లక్ష్యమంటే కుదరదు పీహెచ్సీలో వైద్య సేవలు పక్కాగా అమలు చేస్తున్నాం. విధుల్లో అలసత్వం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. కచ్చితంగా నిర్ణీ త సమయంలో వైద్యు లు అందుబాటులో ఉండాలి. ఆరోగ్య, వైద్యసేవలను పల్లెల్లో విస్తృతం చేయాలి. గర్భవతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సీజనల్ వ్యాధుల కట్టడికి చ ర్యలు తీసుకుంటాం. అధికారులు, సిబ్బంది మారాలి. సేవల్లో మెరుగైన మార్పులు కనబరచాలి. – సుధారాణి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, చిత్తూరు తప్పుల తడక వైద్య, ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వీటిని ఫొటోలతో సరిపెట్టేస్తున్నారు. చాలాచోట్ల ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు విదులకు పంగనామాలు పెడుతున్నారు. సర్వేలను సాకుగా చూపించి వైద్య ఆరోగ్య సేవలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎన్సీడీ సర్వేలన్నీ కూడా తప్పుల తడకగా ఉన్నాయి. ఇష్టానుసారంగా ఇంట్లోనే కూర్చుని సర్వేలను పూర్తి చేస్తున్నారు. అసంక్రమిత వ్యాధిగ్రస్తులను, అనుమానిత కేసులను గుర్తించడంలో విఫలమవుతున్నారు. సర్వేలో బతికున్నవాళ్లను కూడా చంపేస్తున్నారు. దీంతో ఈ సర్వే తప్పుల తడకగా ఉందని రాష్ట్ర స్థాయి అధికారులు గుర్తించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంటికొచ్చి వైద్య సేవలందిస్తున్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మార్కులతో సరిపెట్టొద్దని..మార్పు తీసుకోరావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
‘కుంకీల’తో కట్టడయ్యేనా!
● రేపు జిల్లాకు కుంకీ ఏనుగులు ● క్యాంపులో పూర్తిస్థాయిలో జరగని పనులు ● రవాణాకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ● 22వ తేదీకి పలమనేరు క్యాంపు చేరేలా ఏర్పాట్లు మేతపై తప్పని గుబులు ● సాధారణంగా ఓ కుంకీ ఏనుగు రోజుకి 900 లీటర్ల నీరు, 10 హెక్టార్లలో మేత అవసరం ఉంది. ఆహారం తిన్నాక ఇవి రోజుకు 5 మైళ్ల దాకా సంచరిస్తుంటాయి. వీటికి మేతగా రావి, మర్రి, జువ్వి, వెదరు, నేపియర్ గడ్డి, చెరుకు, అరటి మేతగా కావాలి. కానీ ఇవన్నీ ఇక్కడ ఇంకా సిద్ధం కాలేదు. మరోవైపు వంద ముద్దల రాగి సంగటి, బెల్లంతో కలిపిన వరిధాన్యం, వరిగడ్డి ఉండలను పొద్దున పెట్టాలి. ఈ నాలుగు ఏనుగుల మేత కోసమే నెలకు రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ● జిల్లాకు రానున్న కుంకీలను పలమనేరు మొసళ్లమడుగు ఎలిఫెంట్ క్యాంపులో పెట్టనున్నారు. ఇందుకోసం అటవీ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎఫ్ఓ భరణి తెలిపారు. కొద్ది రోజులు కర్ణాటక మావటిలు జిల్లా వాతావరణం ఏనుగులు అలవాటు పడే వరకు ఇక్కడ ఉంటారు. ఏనుగులను మచ్చిక చేసుకొని వాటికి తగిన శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపనున్నట్లు డీఎఫ్ఓ భరణి తెలిపారు. పలమనేరు/చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య దశాబ్దాలుగా ఉంది. అడవిని దాటుతున్న ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని మొసలిమడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టు పనులను చేపడుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఆరు కుంకీ ఏనుగులు గురువారం పలమనేరు ఎలిఫెంట్ క్యాంపునకు చేరుకోనున్నాయి. కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల కోసం కర్ణాటక రాష్ట్రంతో ఎంఓయూ చేసుకొంది. అందులో భాగంగా బుధవారం సాయంత్రం కర్ణాటక నుంచి మన రాష్ట్రానికి కుంకీలను అందించనున్నారు. అక్కడ నుంచి సాయంత్రం అవి ప్రత్యేక వాహనంలో బయలుదేరనున్నాయి. విద్యుత్ లైన్లు తగలకుండా రవాణా సమయంలో సరఫరా ఆపివేయాలని అటవీ అధికారులు ట్రాన్స్‌కో అధికారులను కోరారు. గురువారం సాయంత్రంలోపు పలమనేరు ఎలిఫెంట్ క్యాంప్‌కు వీటిని తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. 6 ఏనుగుల పేర్లు ఇలా.. 6 కుంకీ ఏనుగులను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంలు..ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బుధవారం ఏనుగులను అందజేయనున్నారు. మాస్తి, దేవ, రంజన్, కరుణా, కృష్ణ, అభిమన్యు అనే పేర్లు గల కుంకీ ఏనుగులను ఏపీకి పంపనున్నారు. ఏనుగుల గుంపు వచ్చినప్పుడు.. ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. ఏనుగులను తరిమికొట్టడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. కొన్ని సార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగునే రక్షించడానికి వీటిని ఉపయోగిస్తారు. -
పిడుగుపాటుకు ఆవులు మృతి
శ్రీరంగరాజపురం : పిడుగుపడి రెండు పాడి ఆవులు మృతి చెందిన సంఘటన మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు కృష్ణమూర్తి కథనం మేరకు అకాల వర్షం కారణంగా ఇంటి పరిసరాలలో చెట్టుకింద రెండు పాడి ఆవులను కట్టి వేయగా వర్షం కారణంగా పిడుగు పడి ఆవులు మృతి చెందాయన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు.ఐసెట్‌లో తిరుపతి విద్యార్థుల హవాతిరుపతి సిటీ: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు నిర్వహించిన ఐసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్‌కు తిరుపతి జిల్లా వ్యాప్తంగా 2,759 మంది విద్యార్థులు హాజరుకాగా 2,627 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో పురుషులు 1296 మంది, 1331 మంది మహిళలు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది జిల్లాలో మహిళలదేపైచేయిగా నిలిచింది.7, 10 ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులుఐసెట్ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా టాప్‌టెన్‌లో 7వ, 10వ ర్యాంకులను తిరుపతి జిల్లాకు చెందిన విద్యార్థులు కై వసం చేసుకున్నారు. ఇందులో తిరుపతి నగరం సమీపంలోని వేదాంతపురానికి చెందిన వి అజయ్‌కుమార్ 7వ ర్యాంకు సాధించారు. ఈయన శ్రీసిటీ ఐఐఐటీలో బీటెక్ పూర్తి చేశారు. అజయ్‌కుమార్ తండ్రి వి మదనమోహన్ గాజులమండ్యం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. సూళ్లూరు పేట, మన్నూర్పోలూరుకు చెందిన మహిళా రైతు లక్ష్మీ కుమారుడు మహేంద్ర సాయి 10వ ర్యాంక్ సాధించాడు. ఈ విద్యార్థి ఆంధ్ర యూనివర్సిటీలో ఇటీవల బీటెక్ పూర్తి చేశాడు. -
నా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నా కుమారుడిది సహజ మరణం కాదు. అతని మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నా కుమారుడు నివాసముంటున్న నివాసంలోనే అతని భార్య స్నేహితుడు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని నా కోడలు చెప్పలేదు. దీనిపై విచారణ చేపట్టండి’ అంటూ శ్రీకాకుళానికి చెందిన మృతుడి తండ్రి పీ.నరసింహమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. శీకాకుళం ప్రాంతానికి చెందిన పూతల గణేష్ కుమార్(34), అతని భార్య అమృత, వారి బాబుతో కలిసి నాయుడుపేట పట్టణంలోని మంగపతినాయుడు నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గణేష్‌కుమార్ మేనకూరు సెజ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గణేష్‌కుమార్ ఇంట్లో నిద్రలేచి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్య శాలకు తీసుకెళ్తుండగా గణేష్‌కుమార్ మృతి చెందినట్లుగా భార్య అమృత పేర్కొన్నారు. అయితే కోడలు అమృత చెప్పిన విషయాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తన కుమారుడు నివాసముంటున్న ఇంట్లో కోడలు అమృత స్నేహితుడు కూడా ఉంటున్నాడు. ఆ విషయం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది.. అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు గణేష్‌కుమార్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు శ్రీకాకుళం నుంచి నాయుడుపేటకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
మితిమీరిన వేగం.. పోయిందో ప్రాణం
చౌడేపల్లె: ఎవరబ్బా ఈ యువకుడు..!? ఎంత స్పీడుగా పోతున్నాడో చూడు అని అందరూ అలా చూస్తుండగానే క్షణాల వ్యవధిలో ఆ యువకుడిని ఆ స్పీడే బలిగొంది. సోమవారం ఈ సంఘటన సోమల మండలం ఇరికిపెంట సమీపంలోని చెన్నపట్నం వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. చౌడేపల్లె మండలం లద్దిగంకు చెందిన సందీప్(25) కోళ్లఫారాల వద్ద కోళ్లను టెంపోలకు, లోడింగ్ చేసే పనులకు కూలీగా వెళ్లేవాడు. బైక్‌లో సోమల వద్దకు కూలీ పనుల నిమిత్తం వెళ్లి స్వగ్రామానికి తిరుగుప్రయాణంలో మృత్యువాత పడ్డాడు. వేగంగా వెళ్తూ చెన్నపట్నం చెరువు వద్ద మలుపులో అదుపుతప్పి పడ్డారు. తలకు తీవ్రగాయమైంది. 108లో అతడిని చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడి తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురిని కలచివేశాయి. సోమల పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరుకు తరలించారు. -
న్యాయం అందేది ఎప్పుడో మరి..?
● ప్రజాసమస్యల పరిష్కార వేదికలో బాధితుల ని‘వేదన’ ● అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రదక్షిణలతో సరి.. చిత్తూరు కలెక్టరేట్ : న్యాయం చేస్తారనే ఆశతో ప్రతి వారం కలెక్టరేట్ లో అర్జీ ఇస్తున్నాం..ఇంకెన్ని సార్లు తిరగాలి సారూ? అని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు సమస్యలపై అర్జీలు ఇచ్చారు. అర్జీలిస్తున్నా పరిష్కారం కావడం లేదని పలువురు వాపోయారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్వో మోహన్‌కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుపమ, విజయలక్ష్మి, ఆర్డీవో శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 256 అర్జీలు వివిధ సమస్యలపై 256 అర్జీలు అధికారులకు అందాయి. రెవెన్యూ, సర్వే శాఖకు 198, పోలీసు శాఖ 13, డీఆర్డీఏ 11, ట్రాన్స్‌కో 7, ఆర్అండ్బీ 1, పౌర సరఫరాల శాఖ 7, పశుసంవర్థక శాఖ 2, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ 4, వాటర్ రిసోర్స్ 4, దేవదాయశాఖ 1, విద్యాశాఖ 2, కలెక్టరేట్ ఏఓ 2, డీసీసీ బ్యాంక్ 1, ఎంపీడీఓ పాలసముద్రం 1, హౌసింగ్ 2 అర్జీలు వచ్చినట్లు కలెక్టరేట్ ఏఓ కులశేఖర్ వెల్లడించారు. మామిడి చెట్లను జేసీబీతో తొక్కించేశారు తాము నాటి పెంచిన మామిడి చెట్లను అగ్ర కులస్తులు జేసీబీతో తొక్కించి నాశనం చేశారనిచౌడేపల్లె మండలం దిగువపల్లె మొట్లపల్లె యానాదులు వరలక్ష్మి, శారద, వెంకటలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. తమ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 193/5, 193/6 సర్వే నంబర్లో 7 ఎకరాల డీకేటీ భూమి ఉందని, ఆ భూమిని చదును చేసి ఐదేళ్ల నుంచి మామిడి మొక్కలు పెంచుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం అగ్ర కులస్తులు వాటిని జేసీబీతో పూర్తిగా నేలమట్టం చేశారని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.వినతులు స్వీకరిస్తున్న జాయింట్ కలెక్టర్ విద్యాధరి గ్రామసభకు విలువ లేదా? కాలువలు నిర్మించాలని గ్రామసభలో తీర్మానిస్తే టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని జీడీనెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె ఎంపీటీసీ భారతి, సర్పంచ్ పార్థసారథి రెడ్డి జేసీ కి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లా డుతూ, తమ గ్రామంలోని ఒక ప్రాంతంలో వర్షపునీరు, మురుగునీరు నిల్వ లేకుండా చేయడానికి కాలువ నిర్మించాలని తీర్మానిస్తే, గ్రామస్తుడు రుషేంద్రరెడ్డి తాను వేలంలో పొందిన గుడిమాన్యం భూమికి సీసీ రోడ్డు వేసుకునేందుకు కాలువ నిర్మించకూడదని అ డ్డుపడుతున్నారని, కొందరు కూటమి నాయకులు సైతం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటు న్నారని నివేదించారు. ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరారు. బుగ్గపట్నం సర్పంచ్ మునిరాజారెడ్డి, వైస్ ఎంపీపీ హరిబాబు, గ్రామస్తులు సుధాకర్‌రెడ్డి, రఘునాథరెడ్డి, బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.నెలలు గడుస్తున్నా ఇవ్వని సదరం సర్టిఫికెట్ నెలలు గడుస్తున్నా సదరం సర్టిఫికెట్ ఇవ్వడం లేదని యాదమరి మండలం షికారికాలనీకి చెందిన దివ్యాంగురాలు నందిని వాపోయారు. ఆమె మాట్లాడుతూ, సదరన్ సర్టిఫికెట్‌కు కొన్ని నెలల క్రితం బంగారుపాళ్యం ప్రభుత్వాస్పత్రికి వెళ్లానని చెప్పారు. తల్లిదండ్రులు లేని తనకు జీవనాధారం ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ కోసం అవసరమైన సదరన్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఇవ్వలేదని వాపోయారు. ప్రతి పనికీ రేటు ఫిక్స్..! – కోసలనగరం సొసైటీ బ్యాంకు ఇన్చార్జి సీఈఓ రూటే వేరు విజయపురం మండలం కోసలనగరం సొసైటీ బ్యాంకు ఇన్చార్జి సీఈఓ బ్యాంకును తన జేబు సంస్థగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని బాధితులు వేలు, కుమార్ తదితరులు జేసీకి వినతి పత్రం ఇచ్చారు. రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన సొసైటీలో ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి ఇన్చార్జి సీఈఓ రైతులకు అన్యాయం చేస్తోందని, సొసైటీ బ్యాంకు నిధులను తన సొంత ప్రయోజనాలకు వినియోగించుకుంటోందని ఆరోపించారు. సీఈఓగా అర్హత లేకున్నా దొడ్డిదారిలో ఇన్చార్జిగా కొనసాగుతున్నారన్నారు. బ్యాంకు రుణాలు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని, తన కుటుంబ సభ్యులకు, కావాల్సిన వారికి మాత్రం రుణాలు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. రైతులతో అమర్యాదకరంగా మాట్లాడుతున్నారని, రిటైర్డ్ సీఈఓ మురుగయ్య, ప్రస్తుత ఇన్చార్జి సీఈఓ రాధ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, సమగ్ర విచారణ చేసి చేయాలని కోరారు. దీనిపై జేసీ వెంటనే విచారణకు ఆదేశించారు. -
పత్రం ఎప్పుడిస్తారు సారూ!
జిల్లాలో పీఎంఏవై 2.0 వివరాలు నియోజకవర్గం పీఎంఏవై గృహాల మంజూరు వివరాలు చిత్తూరు 828 కుప్పం 575 నగరి 516 పలమనేరు 438 పుంగనూరు 115 మొత్తం 2472‘చిత్తూరు అర్బన్‌లో గిరింపేటకు చెందిన రమణమ్మ సొంతింటి కోసం అర్జీ ఇచ్చారు. పీఎంఏవై– 2.0 కింద మంజూరవుతుందని అధికారులు చెప్పడంతో పునాది వరకు సొంత డబ్బులతో నిర్మించారు. అయితే ఇప్పటి వరకు అధికారులు ఇంటి మంజూరు పత్రం ఇవ్వలేదు. ఆందోళనకు గురైన ఆమె నిర్మాణ పనులు ఆపేశారు’. చిత్తూరు కలెక్టరేట్ : వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో జిల్లా వ్యాప్తంగా లక్షలాది మందికి సొంతిళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించారు. సొంతిళ్లను, ఇళ్ల పట్టాలనూ మంజూరు చేసింది. ఇళ్లు కాదు; ఊళ్లు నిర్మిస్తామని ఇచ్చిన మాటను సైతం ఆచరణలో సాకారం చేసింది. వందలాది లేఔట్లలో ఇళ్లు నిర్మించి ఊర్లకు ఊర్లనే సృష్టించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పీఎంఏవై 2.0 కింద గృహ నిర్మాణానికి కేంద్రం వాటాలో రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాలో రూ.లక్ష చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది. మరోవైపు చిత్తూరు జిల్లాలో ఈ పథకానికి వేలాది మంది అర్జీలు ఇచ్చారు. ఇళ్ల మంజూరుకు అధికారులు డీపీఆర్‌లు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. అర్హులంతా ఇళ్ల మంజూరు పత్రం కోసం జనవరి నుంచి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకూ రూపాయి కూడా ఇచ్చిన పాపానపోలేదు. హౌసింగ్ శాఖాధికారులు కూడా నోరు మెదపడం లేదు. ఫలితంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు నిరాశకు లోనవుతున్నారు. ముందస్తుగా ఆర్భాట సర్వే జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లోని పేదలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఐదు నెలల ముందే ఆర్భాటంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) 2.0 పథకం కింద సర్వే చేసింది. జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో సొంత స్థలం ఉండి, ఏడాదికి రూ.3 లక్షల ఆదాయంలోపు ఉన్న వారికి పీఎంఏవై 2.0 పథకం మంజూరు చేసే నిమిత్తం సర్వేకు పూనుకుంది. ముందస్తుగా వార్డు సచివాలయ ఉద్యోగులతో డిమాండ్ సర్వే మాత్రం అట్టహాసంగా చేయించినా ఆపై గృహాలు మంజూరు చేయకుండా చేతులెత్తేసింది. ఈ సర్వేలో ఇంటి స్థలం లేని వారు, ఇంటి నివాస స్థలంతోపాటు ఇల్లు మంజూరు చేయాలని మరికొందరు, పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలాలున్నాయని..తమకు హౌసింగ్ స్కీమ్‌లో గృహాలు మంజూరు చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు. ఇలా జిల్లాలో 42,347 దరఖాస్తులు అందాయి. వాటిలో కోతల అనంతరం, కూటమి ప్రజాప్రతినిధులు చెప్పిన వారికి 2,472 మందిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. మంజూరు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు నెలల కాలంగా ప్రదక్షిణలు పట్టించుకోని హౌసింగ్ శాఖ అధికారులు అనుమతుల కోసం నిరీక్షణ పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉండి, హౌసింగ్ స్కీమ్‌లో మంజూరు చేస్తే ఇల్లు నిర్మించుకుంటామనే ఆసక్తితో 2472 మంది పేదలు దరఖాస్తులు చేసుకున్నారు. అందిన దరఖాస్తులను పరిశీలించిన హౌసింగ్ శాఖ అధికారులు డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను ప్రభుత్వానికి నివేదించారు. పీఎంఏవై 2.0 పథకానికి జిల్లా వ్యాప్తంగా కార్పొరేషన్, మున్సిపల్ ప్రాంతాల్లో 2,024 డిసెంబర్లో దరఖాస్తులు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇళ్ల మంజూరుపై అతీగతి లేదు. మంజూరు పత్రాలిస్తే పనులు ప్రారంభిస్తామని పలువురు లబ్ధిదారులు నిత్యం హౌసింగ్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కొందరైతే బేస్మెంట్ వరకు నిర్మించారు. మరోవైపు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు మొదలయ్యాయి. వర్షాల కారణంగా ఇబ్బందులు తప్ప వని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. -
కరెంట్ షాక్‌తో ఒకరి గాయాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కరెంట్ షాక్‌కు గురై ఓ వ్యక్తికి గాయాలైన సంఘటన సోమవారం చిత్తూరు మండలం తాళంబేడు క్రాస్‌లో చోటు చేసుకుంది. వివరాలు..కొల్‌కత్తాకు చెందిన నారాయణదేవ్ తాళంబేడు క్రాస్‌లో కాంక్రీట్ పనులు చేస్తున్నాడు. ఈక్రమంలో చేతిలోని కమ్మీ కరెంటు తీగలకు తగిలి ఆ వ్యక్తి కొంత దూరం పడిపోయాడు.అక్కడ పనిచేస్తున్న వారి సాయంతో అతని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణపాయం లేదని పోలీసులు చెప్పారు. స్వీపర్ల పెండింగ్ జీతాల కోసం ఆందోళన చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు పెండింగ్ జీతాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. దీనికి నేతృత్వం వహించిన ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లోని స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలని ఎన్నోసార్లు కోరినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షురాలు రాధ మాట్లాడుతూ, 2018 నుంచి 2021 వరకు ఉమ్మడి జిల్లాలోని 350 మంది స్వీపర్లకు 36 నెలల జీతాలు ఇవ్వలేదన్నారు. మిగిలిన కొంత మందికి 18 నెలల జీతాలు ఇచ్చి 14 నెలల వరకు పెండింగ్‌లో పెట్టారన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జయకుమారి, సంఘ సభ్యులు కోకిల, లక్ష్మి, హసీనా, తులసి, రోజా, మమత తదితరులు పాల్గొన్నారు. స్కానింగ్ సెంటర్‌పై కోర్టులో కేసు చిత్తూరు రూరల్ (కాణిపాకం): నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్థారణ చేస్తుండటంపై ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి తెలిపారు. ఈనెల 14న చిత్తూరులోని భరత్ నగర్లో స్కానింగ్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో నిబంధనలను ఉల్లంఘించి లింగ నిర్థారణ చేస్తున్నట్లు ఓ ముఠా గుట్టును రట్టు చేయడం విదితమే. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ పూర్తి చేసి పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం కేసు వేశారు. డాక్టర్లు కానివాళ్లు లింగ నిర్థారణ చేస్తున్నారని, కొన్నేళ్లుగా రూ.15వేల ఫీజుతో స్కానింగ్ చేస్తున్నట్లు తేలిందని ఆమె చెప్పారు. -
కన్నీటి సంద్రమే.. ఊరంతా దుఃఖమే
● అశ్రునయనాలతో చిన్నారులకు అంత్యక్రియలు కుప్పం రూరల్: నీటి కుంటలో పడి దుర్మరణం పాలైన ముగ్గురు చిన్నారులకు కుటుంబ సభ్యు లు, బంధువులు అశ్రునయనాలతో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు కుప్పం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. 10.30 – 11 గంటల మధ్య మృతదేహాలు దేవరాజపురానికి చేరుకున్నాయి. మృతదేహాలు గ్రామ పొలిమేరల్లోకి చేరగానే ఆర్తనాదాలతో.. ‘‘పోయిటియ్యా... కన్నా... ఇనిమే యారికిట్టె పేసిరిదీ... యార్కిట్టె వెలియాడిరిదీ...’’ ( వెళ్లిపోయావా కన్నా! ఇకపై ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఆడుకోవాలి? ) అంటూ కుటుంబ సభ్యులతో పాటు గ్రామం అంతా కన్నీటి సంద్రమైంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు తమ మధ్యనే ఉన్న అశ్విన్ (7) గౌతమి (6), శాలిని (7)ల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సోమవారం మధ్యాహ్నం మృతదేహాలను గ్రామ శ్మశాన వాటికకు తరలిస్తుంటే చిన్నారుల తల్లిదండ్రులు రోదనలు అందరినీ విచలితుల్ని చేశాయి. తీసుకెళ్లొద్దంటూ పిల్లల ముఖాలను ముద్దాడుతూ వారు పడిన వేదన అంతా ఇంతా కాదు. అంత్యక్రియలకు తండోపతండాలుగా హాజరై పిల్లలకు అంతిమ వీడ్కోలు పలికారు. ఒక్కొక్కరికీ రూ.లక్ష పరిహారం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒకొక్కరికీ రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేసింది. ఈ మొత్తాన్ని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, ఆర్డీఓ శ్రీనివాసరాజు, డీఎస్పీ పార్థసారథి సోమవారం బాధిత కుటుంబాలకు అందజేశారు. -
సారా తయారీ.. అన్నదమ్ముల అరెస్ట్
● నల్లబెల్లం విక్రయించిన రైతు కూడా అరెస్ట్ చిత్తూరు అర్బన్: సారా తయారు చేస్తున్న వై.కిషోర్ (36), వై.నవీన్ (41) అనే ఇద్దరు అన్నదమ్ములను చిత్తూరు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అర్బన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ శ్రీహరిరెడ్డి కథనం.. గుడిపాల మండలంలో సారా తయారీ ఎక్కువగా ఉందని పోలీసులకు సమాచారం అందడంతో ఆదివారం పాపిశెట్టి గ్రామ పరిసరాల్లో విస్తృత దాడులు చేశారు. ఇక్కడున్న అడవుల్లో సారా కాస్తున్న కిషోర్, నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 40 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని 500 లీటర్ల బెల్లపు ఊటలను ధ్వంసం చేశారు. నిందితులకు నల్లబెల్లం విక్రయించాడని కొండేపల్లెకు చెందిన రైతు పెరుమాల్ (54)ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి నుంచి 50 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ మోహన్‌కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
కుప్పంలో తమిళ పోలీసుల హల్చల్
● అంతర్రాష్ట్ర దొంగల కోసం గాలింపు ● ఓ వ్యక్తిని పట్టుకుపోయిన వైనం కుప్పం రూరల్: కుప్పంలో సోమవారం తమిళ పోలీసులు హల్చల్ చేశారు. తమిళనాడులోని చైన్నె, కోయంబత్తూరు, ఈరోడ్ తదితర పట్టణాల్లో చోరీలకు పాల్పడిన వ్యక్తుల మూలాలు కుప్పంలో ఉన్నట్లు నిర్థారించుకుని ఇక్కడ వేట ప్రారంభించారు. పట్టణంలోని మర్రిమానువీధికి చెందిన అలిగిరి అనే వ్యక్తిని అనుమానితునిగా గుర్తించి పట్టుకెళ్లారు. తమిళ పోలీసుల చూపంతా కుప్పం వైపే..! తమిళనాడు రాష్ట్రంలో ఏవైనా దొంగతనాలు చోటు చేసుకుంటే అక్కడి పోలీసులు కుప్పం వైపు అనుమానంగా చూడటం కొత్తేమీ కాదు. మూడు దశాబ్దాల క్రితం ఓ తెగకు చెందిన కొన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చి కుప్పం చుట్టుపక్కల స్థిరపడ్డాయి. దొంగతనాలు, దోపిడీలు చేయడమే వారి వృత్తి. స్థానికంగా ఉండటం మూలాన ఇక్కడ మాత్రం దొంగతనాలకు పాల్పడకపోవడం గమనార్హం! అదే తమిళనాడులోని దూర ప్రాంతాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేసి కుప్పంలో వచ్చి దాక్కుకుంటున్నారు. అక్కడ కేసులు నమోదైతే పోలీసులు దొంగల కోసం గాలిస్తూ కుప్పం వస్తారు. ఇప్పటికే పలుమార్లు తమిళ పోలీసులు కుప్పం వచ్చి ఆ తెగకు సంబంధించిన వారిని పట్టుకుని వెళ్లారు కూడా. ఇదే క్రమంలో సోమవారం సైతం వేలూరు ప్రాంతంలో జరిగిన ఓ దొంగతనం దర్యాప్తు కోసం తమిళ పోలీసులు కుప్పం వచ్చారు. 40 తులాల వరకు చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనానికి పాల్పడింది కుప్పంలో నివాసం ఏర్పాటు చేసుకున్న ఆ ప్రత్యేక తెగకు చెందిన మహిళలుగా గుర్తించారు. మర్రిమానువీధికి చెందిన వ్యక్తిని తమ వెంట పట్టుకెళ్లారు.కూటమి నేతల రాజీయత్నాలు! ఎప్పుడు తమిళ పోలీసులు కుప్పం వచ్చినా కూటమి నేతలు పోలీసులు, దొంగల నడుమ మధ్యవర్తిత్వం చేస్తూ ప్రతిఫలంగా పెద్దమొత్తంలో పుచ్చుకుంటున్నారనే విమర్శలు మూటకట్టుకుంటున్నారు. దొంగలు సైతం కేసులకు భయపడి వారు అడిగినంత సమర్పిస్తున్నారు. దీంతో ఎప్పుడు తమిళ పోలీసులు కుప్పం వచ్చినా కూటమి నేతల పంట పండినట్లేనని ఇక్కడి ఘటనలు చెబుతున్నాయి. -
జైళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
పోలీసు, న్యాయ వ్యవస్థలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందనే విమర్శలొస్తున్నాయి. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జిల్లా కారాగారంతో పాటు మొత్తం 10 జైళ్లు ఉండగా ప్రస్తుతం అవి ఆరుకే పరిమితమయ్యాయి. పుత్తూరు, చంద్రగిరి, పలమనేరు, వాల్మీకిపురంలోని జైళ్లు శిథిలావస్థకు చేరడంతో వాటిని తొలగించారు. వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తామని శిలాఫలకాలు వేసిన పాలకులు నిర్మాణ పనులను దశాబ్దాలుగా గాలికి వదిలేశారు. పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 10 జైళ్లు ఉండగా ఇందులో తిరుపతి, మదనపల్లె, పీలేరులోని సబ్‌జైళ్లు మాత్రం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిర్మించినవి. మిగిలినవన్నీ బ్రిటీష్ కాలంలో నిర్మించినవే. వీటిలో కొన్ని శిథిలావస్థకు చేరుతుండడంతో వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని భావించిన జైళ్లశాఖ అధికారులు పుత్తూరు, పలమనేరు, వాల్మీకిపురం, చంద్రగిరి సబ్‌జైళ్లను మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జైళ్ల సంఖ్య ఆరుకే పరిమితమయ్యాయి. మూసివేసిన పుత్తూరులో సబ్‌జైల్ స్థానంలో నూతన భవన నిర్మాణానికి నందిమంగళం రెవెన్యూ లెక్క దాఖలాలోని సర్వే నంబర్ 242/22లో 2 ఎకరాల భూమిని రాష్ట్ర జైళ్ల శాఖకు స్థానిక రెవెన్యూ శాఖ కేటాయించింది. ఈ మేరకు 2010 జూన్ 18న అప్పటి జైళ్ల శాఖ ఐజీ గోపీనాఽథ్‌రెడ్డి నూతన జైలు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. పలమనేరులోని జైలును సైతం మూసివేసిన అధికారులు ఆ స్థలంలో పెట్రోల్ బంకు నిర్మాణ పనులు ప్రారంభించారు. అలాగే వాల్మీకిపురంలోని జైలును మూసివేసి తిరుపతి–మదనపల్లె మార్గంలో రూ.4 కోట్ల అంచనాతో జైలు నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఈ భవన నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తయిన తర్వాత అర్థాంతరంగా ఆగిపోయి ఏళ్లు గడుస్తుండడంతో కొత్త భవనం సైతం శిథిలావస్థకు చేరుతోంది. అలాగే చంద్రగిరిలోని కారాగారం శిథిలావస్థకు చేరడంతో దానినీ మూసివేశారు. ఇలా ఉన్న జైళ్లను తొలగించడంతో పుత్తూరు సబ్‌కోర్టు ద్వారా శిక్షలు పడిన ఖైదీలను 70 కిలోమీటర్ల దూరంలోని సత్యవేడు సబ్‌జైలుకు, అలాగే పలమనేరు, వాల్మీకిపురం కోర్టుల్లో శిక్షలు పడిన ఖైదీలను పీలేరులోని సబ్‌జైలుకు తరలిస్తున్నారు. ఇది పోలీసులతో పాటు ఖైదీలకు, వారి కుటుంబీకులకు వ్యయ ప్రయాసలతో కూడుకుంటోంది. అలాగే జైళ్లలోని గదులు చాలక ఖైదీలను ఎక్కువ మందిని ఒకే సెల్లో నిర్బంధించాల్సిన పరిస్థితి. ఈ దుస్థితి 15 ఏళ్లుగా ఉంటున్నా పాలకులు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. ప్రతిపాదనలు పంపించాం వాల్మీకిపురంలో జైలు నిర్మాణానికి 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రూ.4 కోట్లు మంజూరైంది. తొలిదశలో రూ.2 కోట్లు విడుదల కాగా అంత వరకు పనులు జరిగి ఆగిపోయాయి. ఇటీవలే కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. పలమనేరులోని జైలును 15 ఏళ్ల క్రితమే మూసివేశారు. 40 సెంట్లు మాత్రమే ఉన్న ఆ స్థలంలో నూతన జైలు నిర్మాణానికి అవకాశం లేదు. ఇక్కడ స్థలాన్ని ఐఓసీ పెట్రోల్ బంకుకు కేటాయించాం. పలమనేరులోనే మరోచోట జైలు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కావాలని జిల్లా కలెక్టర్‌ను నివేదిక సమర్పించాం. అది పరిశీలనలో ఉంది. పుత్తూరులో జైలు నిర్మాణానికి నిధులు మంజూరు కావల్సి ఉంది. వాల్మీకిపురంలో నూతన జైలు భవన నిర్మాణ దుస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జైళ్ల కేంద్రాలు చిత్తూరు (జిల్లా కారాగారం) పుత్తూరు తిరుపతి పలమనేరు మదనపల్లె చంద్రగిరి మూసివేసిన కేంద్రాలు పీలేరు వాల్మీకిపురం శ్రీకాళహస్తి సత్యవేడు పుత్తూరు, చంద్రగిరి, పలమనేరు, వాల్మీకిపురం జైళ్లు మూసివేత దశాబ్దాలు గడుస్తున్నా ఊసేలేని కొత్త జైళ్ల నిర్మాణం పట్టించుకోని పాలకులు ఖైదీలకు మెరుగైన సేవలు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న జైళ్లలో 306 మంది ఖైదీలు ఉన్నారు. ఒక్క చిత్తూరు జిల్లా కారాగారంలోనే 130 మంది ఖైదీలు ఉన్నారు. ఇక్కడ ఓపెన్ స్కూల్ నడుపుతున్నాం. గత ఏడాది 11 మంది, ఈ ఏడాది ఐదుగురు పదవ తరగతి పరీక్షలు రాసి ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారు. అన్ని జైళ్లలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పొందిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశాం. శిక్షణ పొందిన వారు జైలు నుంచి విడుదల అయ్యాక బ్యాంకు రుణాలు పొంది కొత్త జీవితం ప్రారంభించవచ్చు. రోజూ అన్ని జైళ్లలో ఖైదీలతో యోగా, వ్యాయామం చేయిస్తున్నాం. మహిళా ఖైదీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. – ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా జైలు అధికారి, చిత్తూరు. -
తవణంపల్లె రెండో వైస్ ఎంపీపీగా అనసూయమ్మ ఏకగ్రీవం
పోలీస్ గ్రీవెన్స్‌కు ఫిర్యాదులు పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 36 వినతులు అందాయి.ప్రదక్షిణలతో సరి.. తాము నాటి పెంచిన మామిడి చెట్లను అగ్ర కులస్తులు నేలమట్టం చేశారని యానాదులు కన్నీటి పర్యంతమయ్యారు.మంగళవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2025వైఎస్సార్సీపీకి పూర్వ వైభవంతవణంపల్లె: వైఎస్సార్సీపీకి మండలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పని చేసి పూర్వవైభవం తీసుకురావాలని పూతలపట్టు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ పిలుపునిచ్చారు. రెండవ వైస్ ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రానికి సునీల్‌కుమార్ విచ్చేశారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో సమాలోచనల అనంతరం పార్టీ తరఫున రెండవ వైస్ ఎంపీపీగా ఎంపిక చేసిన అభ్యర్థికి బీ–ఫాం అందజేశారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు కలసికట్టుగా చెర్లోపల్లె ఎంపీటీసీ అనసూయమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. మండలంలోని పార్టీ నాయకులు సమన్వయంతో పని చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని పిలుపు నిచ్చారు. అనంతరం నూతనంగా ఎంపికై న రెండవ వైస్ ఎంపీపీ అనసూయమ్మను సత్కరించారు. రెండవ వైస్ ఎంపీపీగా అవకాశం కల్పించి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీటీసీలకు, ప్రతి ఒక్కరికీ, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ హరిరెడ్డి, ఎంపీపీ ప్రతాప్ సుందర్రాయల్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ గీతారెడ్డి, ధనంజయరెడ్డి, రవిరెడ్డి, రాజశేఖర్, మధుసూదన్ రెడ్డి, శివాజిరెడ్డి, మణిరాజ్, సుధాకర్, రమేష్ పాల్గొన్నారు. ● ఎన్నికలకు హాజరైన 8 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు తవణంపల్లె: తవణంపల్లె మండలం రెండో వైఎస్ ఎంపీపీగా వైఎస్సార్సీపీకి చెందిన చెర్లోపల్లె ఎంపీటీసీ సభ్యురాలు అనసూయమ్మ సోమవారం ఏకగ్రీకవంగా ఎన్నికైనట్టు మండల ఎన్నికల అధికారి, డీపీఓ సుధాకర్ ప్రకటించారు. తవణంపల్లె రెండో వైస్ ఎంపీపీ పదవి ఖాళీ కావడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు రిటర్నింగ్ అధికారి సుధాకర్ తవణంపల్లె ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించారు. మండలంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు సభ్యులు 14 మంది, టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు ఒకరు ఉన్నారు. ఇందులో వైఎస్సార్సీపీకి చెందిన 8 మంది ఎంపీటీసీ సభ్యులు మాత్రం ఎన్నికల హాల్లోకి హాజరుకాగా మిగిలిన వారు హాజరుకాలేదు. ఎన్నికల నియమావళికి మేరకు కోరం ఉన్నందున ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఆలస్యంగా వచ్చిన ఇద్దరు ఎంపీటీసీల సభ్యులను రిటర్నింగ్ అధికారి రిజిస్టర్లో సంతకం చేయలేదు కాబట్టి వెళ్ళిపోవచ్చని స్పష్టం చేశారు. 8 మంది ఎంపీటీసీల్లో ఒకరు చెర్లోపల్లె ఎంపీటీసీ అనసూయమ్మను మండల రెండో వైస్ ఎంపీపీగా ప్రతిపాదించగా, మరొకరు బలపరచడంతో రిటర్నింగ్ అధికారి సుధాకర్ అనసూయమ్మను రెండో వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎంపికై నట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీటీసీలతోపాటు పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్‌కు, పలువురు నేతలకు అనసూయమ్మ ధన్యవాదాలు తెలిపారు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ -
దేశ సేవలో తరిస్తున్న యువత ● సరిహద్దులో పహారా కాస్తున్న పూతలపట్టు వాసులు ● గర్వంగా ఉందంటున్న సైనిక కుటుంబాలు ● మళ్లీ యుద్ధమంటే సిద్ధమే అంటున్న మాజీ సైనికులు
కాణిపాకం: సాంకేతిక యుగంలో యువత సాఫ్ట్వేర్ వైపు చూస్తోంది. కొద్దోగొప్పో సంపాదించి జీవితంలో త్వరగా స్థిరపడాలని ఉబలాటపడుతోంది. అయితే పూతలపట్టులోని పలు గ్రామాలకు చెందిన యువకులు దేశ సేవకు అంకితమవుతున్నారు. దేశ రక్షణలో దగ్గరగా ఉంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. డబ్బుకన్నా దేశ రక్షణకు తమ తొలి ప్రాధాన్యమని చాటి చెబుతున్నారు. ఏ ఇంట చూసినా స్వాతంత్య్ర సమరవీరుల చిత్రపటాలే కనిపిస్తాయి. ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు భారత సైన్యంలో ఉండటం విశేషం! యాదమరి మండలం, దళవాయిపల్లిలో దాదాపు నలభై కుటుంబాల నుంచి 80 మంది వరకు భారత సైన్యంలో పనిచేస్తున్నారు. 30 మంది వరకు దేశ సేవలో అలుపెరగని పోరాటం చేసి ఉద్యోగ విరమణ చెందారు. వయస్సు పైపడినా దేశ భక్తి నరనరాన జీర్ణించుకుపోయి.. ఇప్ప టికీ తమలో చేవ తగ్గలేదని చెబుతున్నారు. దేశానికి సేవ చేయడం గర్వకారణమని, అదో గొప్ప అనుభూతి అని అభిప్రాయపడుతున్నారు. దేశానికి సేవ చేసే భాగ్యం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. దేశానికి అందించిన సేవ తమతోనే ఆగిపోకూడదనే భావనతో తమ తరువాతి తరం వారిని సైతం భారత సైన్యంలోకి పంపుతున్నారు. యువత కూడా ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. హవాల్దార్లుగా, నాయక్, లాన్స్ నాయక్, జేసీఓ, సుబేదార్‌గా వివిధ హోదాల్లో దేశ రక్షణలో పాలుపంచుకున్నారు. ఇలా యాదమరిలోని పలు గ్రామాల్లో ఉద్యోగ విరమణ పొందిన, ప్రస్తుతం పనిచేస్తున్న వారు 120 మంది వరకు ఉన్నారు. అలాగే పూతలపట్టు మండలం, చిన్నబండపల్లెలో 75 మంది ఆర్మీ ఉద్యోగులున్నారు. దీంతో పాటు మండల వ్యాప్తంగా వంద మందికిపైగా జవాన్లు ఉంటారని అధికారులు అంచనా వేశారు. అలాగే బంగారుపాళ్యంలో 150 మంది, తవణంపల్లెలో 30 మంది, ఐరాల మండలంలో మాజీ సైనికులతో పాటు 60 మంది ఉన్నారు. నిద్రలేని రాత్రుల్లో... తాటిపైకి తీసుకొచ్చిన పదం. ఉగ్రమూకలు చెలరేగుతున్న వేళ.. అమాయకులను పొట్టన పెట్టుకుంటున్న తరుణంలో సైన్యం ఎక్కుపెట్టి న తుపాకీ ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిల్చింది. మనమంతా గుండెల మీద చేయి వేసుకుని హా యిగా నిద్రపోతున్నామంటే.. సరిహద్దులో సైనికులు నిద్రలేని రాత్రులు గడుపుతుండడంతోనే సాధ్యమవుతోంది. అక్కడ ఏం జరుగుతుందో.. వాళ్లు ఎలా ఉంటున్నారో.. ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటో.. కదనరంగం దృశ్యాలను చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. బుల్లెట్ల మోత.. విరుచుకుపడే మిసైళ్లు.. దూసుకొ చ్చే డ్రోన్లు.. అత్యాధునిక ఆయుధాలకు ఎదురొడ్డి నిలుస్తున్న సైనికులను చూస్తే కన్నీళ్లతో సె ల్యూట్ చేయాలనిపిస్తోంది. సరిహద్దులో ఉద్రిక్తతల వేళ పూతలపట్టులోని పలు గ్రామాలు నిద్రలేని రాత్రులను గడిపాయి. -
న్యాయం కోసం అంధుడి పోరాటం
● కలెక్టరేట్ ఎదుట ఆందోళన చిత్తూరు కలెక్టరేట్ : మెరిట్ ప్రకారం ఎంపికై నా ఇంటర్వ్యూలో తనకు అన్యాయం చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ అంధుడైన రమేష్ ప్లకార్డు చేతబట్టి సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశాడు. ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ ఎంపికలో మెరిట్లో ఎంపికై న విభిన్న ప్రతిభావంతుడైన తనను వైద్య ఆరోగ్య శాఖ నిరాకరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పోస్టుమార్టం అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తాను మెరిట్ ప్రకారం ఎంపికయ్యానని, అయితే ఇంటర్వ్యూ దశలో డీసీహెచ్ఎస్ అధికారులు తనకు కళ్లు కనబడటం లేదనే కారణంతో ఎంపిక ప్రక్రియను రద్దు చేశారన్నారు. దివ్యాంగుల కోటాలో సంబంధిత డిజబులిటీ సర్టిఫికెట్, మెరిట్ ఆధారంగా తనకు ఉద్యోగం రావాల్సి ఉన్నప్పటికీ నిష్కారణంగా తొలగించారని పేర్కొన్నారు. తన సమస్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇంత వరకు న్యాయం చేయలేదని, ఇకనైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వరసిద్ధుని సేవలో జైళ్ల శాఖ డీజీపీ కాణిపాకం: కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామిని సోమవారం రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ అంబానీకుమార్ తన కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనాంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికారు. శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో సీఐ శ్రీధర్‌నాయుడు, ఎస్ఐ ధరణీధర, సిబ్బంది చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
● రేపు ప్రసన్న తిరుపతికి గంగమ్మకు పట్టువస్త్రాల సమర్పణ కుప్పం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21న కుప్పం పర్యటనకు రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం ద్రవిడ వర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి కుప్పం వరకు రూట్ మ్యాప్ పరిశీలించారు. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో విశ్వరూప దర్శనం పురస్కరించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు బుధవారం సీఎం కుప్పం వస్తున్నట్లు తెలిపారు. సెక్యూరిటీకి సంబంధించి వర్సిటీ గ్రౌండ్ హెలిప్యాడ్‌లో బ్యారికేడ్లు, శానిటేషన్ నిర్వహణపై అధికారులకు సూచనలు ఇచ్చారు. బుధవారం ఉదయం సీఎం విజయవాడ నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ద్రవిడ వర్సిటీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కుప్పం తిరుపతి గంగమ్మ దేవాలయం చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు.అనంతరం 2.30 గంటలకు విజయవాడకు తిరుగుప్రయాణం అవుతారని అధికారులు చెప్పారు. రైఫిల్ షూటింగ్‌పై క్యాడెట్లకు శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : క్రమశిక్షణకు మారుపేరు ఎన్సీసీ అని క్యాంప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ నోయల్ వివేక్ మోనిస్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు మైదానంలో నిర్వహిస్తున్న 10 రోజుల శిక్షణా కార్యక్రమంలో క్యాడెట్లకు రైఫిల్ షూటింగ్‌పై శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, లక్ష్యంపై దృష్టి, శ్వాసపై నియంత్రణ, ఆయుధంపై పట్టు మంచి ఫైరర్‌కు ఉండాల్సిన లక్షణాలు అని అన్నారు. డిప్యూటీ క్యాంప్ కమాండెట్ మేజర్ లోకనాథం మాట్లాడుతూ, ఎన్సీసీ శిక్షణ పూర్తి చేసి అందుకునే సర్టిఫికెట్లు క్యాడెట్లకు ఉన్నత విద్య, ఉద్యోగాలను సాధించేందుకు ఉపయోగపడుతాయన్నారు. అనంతరం ఎన్సీసీ ఆఫీ సర్ ప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. రైఫిల్ షూటింగ్, డ్రిల్, సరిహద్దుల్లో ఆర్మీ శిబిరాలు ఏ విధంగా ఉంటాయో క్యాడెట్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు కార్తీక్, చిరంజీవి, ధనంజయులు, యుగంధర్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యత లేదా?
● ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారు ? ● లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుంటే సమాచారం ఎందుకు చేరలేదు ● శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా తెలుస్తోంది ● ఆడ పిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత ● వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ శాఖలపై కలెక్టర్ ఆగ్రహం సరిహద్దు మండలాల్లో ఎక్కువ జిల్లాలో ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న నగరి, పలమనేరు, పుంగనూరు, వి.కోట మండలాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనుమతి లేకుండా జరుగుతున్న అబార్షన్ల శాతం ఎక్కువగా ఉందన్నారు. డివిజన్ల వారీగా ఆర్ఎంపీ డాక్టర్లతో సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలివ్వాలన్నారు. మెడికల్ షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదనే విషయాన్ని తెలియజేయాలని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. అనధికారికంగా స్కానింగ్ మిషన్లు అమ్ముతున్న వారిపై నిఘా పెట్టాలన్నారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి రమేష్, డీఎఅండ్‌హెచ్‌వో సుధారాణి, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, డీఐవో హనుమంత రావు, జిల్లా ప్రధాన వైద్య శాఖ సూపరింటెండెంట్ ఉషశ్రీ, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కీర్తన, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మహేశ్వర్, ఎస్ఐ నాగసౌజన్య పాల్గొన్నారు.చిత్తూరు కలెక్టరేట్ : లింగ నిర్ధారణ పరీక్షలు అరికట్టడంలో అధికారులకు బాధ్యత లేదా..? అంటూ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో శనివారం పీసీపీఎన్డీటీ యాక్ట్ 1994 జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం ఎందుకు తెలియలేదని మండిపడ్డారు. శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా తెలుస్తోందన్నారు. జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉండడంతో పీసీపీఎన్డీటీ యాక్ట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుంటే ఎందుకు తెలుసుకోలేక పోయారని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఆశా, ఏఎన్ఎంలు స్థానికంగా ఉన్నప్పటికీ మొదటి, రెండు సంతానాలలో ఆడపిల్లలు ఉండి మూడవ సారి గర్భం దాల్చిన విషయం ఎందుకు తెలుసుకోలేక పోతున్నారన్నారు. సమావేశాలు ఎప్పుడైనా నిర్వహించారా? జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు కలసి సీడీపీఓలు, మెడికల్ ఆఫీసర్లతో కలసి గత పదేళ్లలో ఎప్పుడైనా సమన్వయ సమావేశాలు నిర్వహించారా..? అని ప్రశ్నించారు. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. జిల్లాస్థాయి అధికారులు ఇద్దరు వ్యక్తిగతంగా ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడితే క్షేత్రస్థాయి పరిస్థితులు కొంత వరకు అర్థమవుతాయన్నారు. అబార్షన్లతో ఆడపిల్లలు చనిపోతే, ఆడపిల్లల నిష్పత్తి మరింత తగ్గుతుందన్నారు. జిల్లాలో 2024 నివేదికల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 947 మంది సీ్త్రలు ఉన్నట్లు తెలిపారు. -
పాఠశాల స్థలంలో నిర్మాణాలొద్దు
● అడ్డుకున్న గ్రామస్తులు శ్రీరంగరాజపురం : పాఠశాల స్థలంలో ఆ పాఠశాలతో సంబంధం లేని నిర్మాణాలు చేపట్టరాదంటూ.. స్థానిక సర్పంచ్ విజయ, గ్రామాస్తులు అడ్డుకున్నారు. స్థానుకుల కథనం.. మండలంలోని వెంకటాపురం రెవెన్యూ పరిధిలోని పోదలపల్లి గ్రామంలో సర్వే నం.213/16లో ఎకరం 13 సెంటు భూమిని ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. ప్రస్తు తం ఇక్కడ ప్రాథమిక పాఠశాల నడుస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలను మరింత అభివృద్ధి చేశారు. మిగిలిన ఖాళీ స్థలంలో అప్పటి తహసీల్దార్ షబ్బీర్‌బాషా 05 సెంటు భుమిని అంగన్వాడీ కేంద్రానికి కేటాయించారు. పక్కా భవనం కూడా మంజూరైంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాగానే శనివారం ఎమ్మెల్యే వ్యక్తిగత పీఏ దాము పొదలపల్లి గ్రామానికి కమిటీ హాలు మంజూరైందంటూ పనులు ప్రారంభించారు. స్థానిక సర్పంచ్, గ్రామస్తులు ఆ పనులను అడ్డుకున్నారు. పాఠశాల స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని పేర్కొన్నారు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే పీఏ ‘నాకు అనుతులు ఉన్నాయి.. ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నాయి.. ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు పెట్టిస్తా’నాంటూ రెచ్చిపోయారు. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందిచి పాఠశాల స్థలాన్ని రక్షించాలని కోరారు. -
అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలు
తవణంపల్లె: గ్రామీణ ప్రాంత ప్రజలకు అరగొండ అపోలో హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలతో సరసమైన ధరలకు మోకాళ్ల కీళ్లు, తుంటి మార్పిడి (ఆర్థోపెడిక్) శస్త్ర చికిత్సలు చేయడమే లక్ష్యమని ఆర్థోపెడిక్ చీఫ్ కన్సల్టెంట్, సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ మదన్మోహన్ రెడ్డి డైరెక్ట్ యాంటీరియర్ వెల్లడించారు. శనివారం మండలంలోని అరగొండ అపోలో హాస్పిటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యాధునిక ఇమేజింగ్, స్పెషల్జ్డ్ ఇన్స్ట్రుమెంట్లతో శిక్షణ పొందిన ఆర్థోపెడిక్ సర్జన్లచేత శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్(డీఏఏ), వైద్య నిపుణులచేత చైన్నె అపోలో హాస్పిటల్లో శస్త్ర చికిత్సలు నిర్వహించి అద్భుతమైన ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అరగొండ అపోలో హాస్పిటల్లో హిప్ రీప్లేస్మెంట్ కోసం డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ అనే అత్యాధునిక, మిరిమల్లి ఇన్వేసివ్ టెక్నిక్‌ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. కండరాలకు(మజిల్స్‌కు) హాని కాకుండా శస్త్ర చికిత్స అనంతరం నొప్పి తక్కువగా ఉంటుందని వివరించారు. ఆస్టియోఆర్ర్థెటిస్ రుమటాయిడ్ ఆర్ర్థెటిస్, హిమ ప్రాక్చర్ వంటి సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఇది మంచి అవకాశమన్నారు. అరగొండ అపోలో హాస్పిటల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్(డీఏఏ)ని జిల్లాలోని గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఆర్థోపెడిక్ సర్జన్ నిపుణులు డాక్టర్ కార్తీక్‌రెడ్డి, డాక్టర్ ప్రవీణ్, అనస్టీయాలజీ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీనివాసన్ సోమసుందరమ్, పీఆర్ఓ కమ్రుద్దీన్ పాల్గొన్నారు. -
కాణిపాక ఆలయ హుండీ ఆదాయం రూ.1.75 కోట్లు
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీ ఆదాయం రూ.1.75 కోట్లు వచ్చినట్టు ఈఓ పెంచలకిషోర్ తెలిపా రు. గోసంరక్షణ హుండీ ద్వారా రూ.10,569, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.41,660 వచ్చింది. యూఎస్ఏ 208 డాలర్లు, సింగపూర్ 112 డాలర్స్, మలేషియా 32 రింగిట్స్, యూఏఈ 170 దిర్హామ్స్ వచ్చాయి. బంగారం 49 గ్రాములు, వెండి 1.425 కిలోలు వచ్చింది. ఏఈవోలు రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, నాగేశ్వరరావు, కోదండపాణి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. యువకుడి అరెస్ట్ చౌడేపల్లె: బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. శనివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆమినిగుంట పంచాయతీ, నూనెముద్దనపల్లెకు చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన నాగేంద్ర మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడన్నారు. ఈ విషయమై గ్రామంలో పంచాయితీ నిర్వహించి విఫలం కావడంతో బాధితురాలు పోలీసులను ఏప్రిల్ 8న ఆశ్రయించిందని, గర్భవతిని చేయడంతోపాటు ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తామని, కులం పేరుతో దూషించినట్లు పేర్కొందని తెలిపారు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అరెస్ట్ చేసిన యువకుడిని పుంగనూరు కోర్టుకు తరలించారు. ఎస్ఐ నాగేశ్వరరావు పాల్గొన్నారు. తప్పిన పెను ప్రమాదం పలమనేరు: మండలంలోని బేలుపల్లి క్రాస్ వద్ద శుక్రవారం రాత్రి ఓ కంటైనర్, కారు ఢీకొన్న ప్రమాదంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ వైపు వర్షం కురుస్తుండగా తమిళనాడు నుంచి భారీ పరికరంతో కంటైనర్ పలమనేరుకు వస్తోంది. ముందుగా వెళుతున్న కారు ఆగడంతో వెనుకనున్న కంటైనర్ ఉన్నట్టుండి ఆపే ప్రయత్నం చేయగా.. భారీ వాహనం ఆగకుండా కారును ఢీకొంది. కంటైనర్ ముందున్న క్యాబిన్ నుజ్జునుజ్జయ్యింది. కారు వెనుక వైపు భాగం దెబ్బతింది. లారీ డ్రైవర్ కంటైనర్‌లోంచి దూకి ప్రాణాలను కాపాడుకోగా కారులోని వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
కార్పొరేషన్ కమిషనర్‌కు ప్రమాదం
పాకాల : కారు వెనుక టైరు పంక్చర్ కావడంతో చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ కారు ఫల్టీలు కొట్టింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం సాయంత్రం చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళుతుండగా పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిపై మండల పరిధిలోని గాదంకి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో కమిషనర్‌తో పాటు సీసీ అమర్నాథ్రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. వేగంగా వెళుతున్న కారు టైరు ఒక్కసారిగా పంక్చర్ కావడంతో కారు మూడు ఫల్టీ లు కొట్టి ప్రయాణిస్తు న్న మెయిన్ రోడ్డు నుంచి సర్వీసు రోడ్డుకు చేరుకుంది. అదే మార్గంలో పూతల పట్టు ఎమ్మెల్యే మురళి కారులో ప్రయాణిస్తున్న ఆయన పీఏ భాను ప్రమాదాన్ని గమనించి చికిత్స నిమిత్తం ఇద్దర్నీ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం పాఠశాలలో శనివారం సైనిక్, నవోదయ పోటీ పరీక్షల అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్సీ ఎంవీ.రామచంద్రారెడ్డి, అపుస్మా రాష్ట్ర అడకమిక్ కోఆర్డినేటర్ వీఆర్.రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ సైనిక్, నవోదయ, మిలటరీ స్కూల్స్ తదతర పోటీ పరీక్షల్లో విశ్వం విద్యార్థులు సీట్లు సాధిస్తుండడం గర్వకారణమని తెలిపారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న విశ్వం విద్యాసంస్థను అభినందించారు. విశ్వం విద్యాసంస్థ అధినేత ఎన్.విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ గత 34 ఏళ్లుగా అనుభజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యా బోధన అందిస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత సమాచారానికి 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో విశ్వం విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
మొక్కలు సంరక్షించాలి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్క లు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్, వివిధ శాఖల కార్యాలయాల్లో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టరేట్లోని ప్రాంగణంలో కలెక్టర్, జేసీ విద్యాధరి, డీఆర్వో మోహన్‌కుమార్ మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ ఆధ్వర్యంలో మొక్కలు నాటా రు. కలెక్టరేట్ ఏవో కులశేఖర్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ వాసుదేవన్, డీఈవో కార్యాల యం ఏడీ–2 వెంకటేశ్వరరావు, సిబ్బంది మురళి, గో పాల్, కుమార్, చైతన్య, జయప్రకాష్, పాల్గొన్నారు. -
కష్టపడేవారికే గుర్తింపు
బాధ్యత లేదా..? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థానికంగా గర్భస్రావం చేసుకుంటుంటే ఎవరికీ బాధ్యత లేదా..? అంటూ కలెక్టర్ మండిపడ్డారు. ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025కూటమి నేతలు భూ కుబేరులవుదామని స్కెచ్ వేశారు. ఇదే అదునుగా విలువైన భూములపై కన్నేశారు. అప్పన్నంగా దోచేయాలని పావులు కదిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోయారు. ప్రభుత్వ భూములను ఇబ్బడిముబ్బడిగా కబ్జాచేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బినామీ పేర్లపై ఎక్కించుకుని ఆ భూమి మాదే అంటూ మెలిక పెడుతున్నారు. బాస్ వెనుకున్నారని మరింత రెచ్చిపోతున్నారు. ఇది ముమ్మాటికి ఆక్రమణే అని తెలిసినా.. అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా జంకుతున్నారు. ఇంతకీ ఈ కుబే రుల భూదందా ఎక్కడో మీరే చదవండి..! సాక్షిటాస్క్‌ఫోర్స్: చిత్తూరు మండలం, అనుపల్లి నుంచి బండపల్లి, 194.వెంకటాపురం, ఎగువమాసాపల్లి ప్రాంతం మీదుగా తచ్చూరు నేషనల్ హైవే రోడ్డు ఉంది. దీనిపక్కనే భూములకు రెక్కలొచ్చాయి. ఎకరా భూమి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలకు చేరింది. ఇదే అదునుగా భూకుబేరులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ముడుపులకు ఆశపడిన కొందరు సర్వేయర్లను రంగంలోకి దింపారు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయోనని గాలించారు. మేత బీడు, వంక భూములు, డీకేటీ భూములు, అటవీశాఖ భూములను వరుసగా దోచుకునేందుకు పక్కా స్కెచ్చేశారు. సర్వేయర్‌తో స్కెచ్ గీయించుకుని వీర్వోలను బుట్టలో వేసుకున్నారు. భూకుబేరుల కుటుంబీకులు, వాళ్లకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను బినామీగా మలుచుకున్నారు. వాళ్లకే తెలియకుండా 25 నుంచి 30 మంది వరకు ఎకరా నుంచి రెండు ఎకరాల మేర పలు సర్వే నంబర్లలో భూములు కేటాయించారు. ఎగువమాసాపల్లి వద్ద ఏం చేశారంటే.. 194. వెంకటాపురానికి చెందిన కూటమి నేత, భూకుబేరుడు ఒక పార్టీకి చెందిన వారే. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. దూరపు బంధువులు కూడా. ఈ నేపథ్యంలో 194 వెంకటాపురం వద్ద ఎందుకు భూ సమస్య అంటూ వదలిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రూట్ మార్చుకుని ఎగువమాసాపల్లి ప్రాంతంలో 20 ఎకరాల భూములున్నాయని తెలుసుకున్నారు. అక్కడి అటవీశాఖ, డీకేటీ భూములను ఆక్రమించే పనిలో పడ్డారు. అనుచరులను రంగంలోకి దింపి జేసీబీలతో చదును చేయించారు. మూడో రోజు ముచ్చటగా ఎగువమాసాపల్లికి చెందిన కూటమి నేత, గ్రామస్తులు కలిసి అటవీశాఖ అఽధికారులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీశాఖ అధికారులు రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రెవెన్యూ అధికారులతో సర్వే చేయిస్తే అది అటవీ భూమి అని తేలింది. బాస్ ఉన్నారనే.. అధికారం ఉంది.. బాస్(తిరుపతి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే) అండ ఉంది.. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భూకుబేరులు ప్రభుత్వ భూములను ఆక్రమించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఆక్రమిత భూముల జోలికి ఎవరు అడ్డొచ్చినా బాస్ పేరుతో బెదిరిస్తున్నారు. ‘భూములు నావి కావు.. మా బాస్‌వే... మీ వల్లయ్యింది చేసుకోండి’ అంటూ భూకుబేరులు బహిరంగంగా చెబుతున్నారు. మేమంతా బినామీలే.. .. టచ్ చేస్తే ఎలికాప్టర్లోనే దిగుతారని భయపెడుతున్నారు. కాగా ఈ భూమి పక్కాగా చేతుల్లోకి వస్తే బినామీలు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇచ్చేలా డీల్ సెట్ చేశారని సమాచారం. అందుకే ఆ బినామీలు కూడా భూ కుబేరుల వెనుక బ్రహ్మస్తంలా పనిచేస్తున్నారు. ఆక్రమణకు గురైన అటవీ భూమిబీపీ హరిస్తోంది చిత్తూరు రూరల్ (కాణిపాకం): సరైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల బీపీ వెంటాడుతూ మనుషులను హరిస్తోందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి తెలిపారు. చిత్తూరులోని తన కార్యాలయంలో శనివారం ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో బీపీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. ప్రజలు సరైన ఆహార నియమావళి పాటించకపోవడంతో ఈ బీపీ అల్లుకుపోతుందని తెలిపారు. జంక్ ఫుడ్స్, మద్యం, మాంసాహారం అతిగా తీసుకోవడం వల్ల బీపీ సమస్యలు తలెత్తుతాయన్నారు. అలాగే మానసిక ఒత్తిడిలు కూడా బీపీ వ్యాప్తికి ప్రధాన కారణమన్నారు. ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం చేయాలన్నారు. వైద్యాధికారులు హనుమంతరావు, గిరి, అనిల్, కుమార్, ప్రవీణ, అనూష పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత బైరెడ్డిపల్లె: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రజలందరి బాధ్యత అని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. మండల పరిధిలోని బైరెడ్డిపల్లె, పాతపేట, పాతురునత్తం గ్రామ సచివాలయాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రం చేయడంలో ప్రజలను భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలను విరివిగా పెంచినప్పుడే వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు సంమృద్ధిగా కురుస్తాయన్నారు. ఎంపీడీఓ రాజేంద్ర బాలాజీ, స్వచ్చభారత్ ఎంసీఓ సురేష్‌బాబు, సర్పంచులు వెంకటేష్, రోజా, పంచాయతీ కార్యదర్శులు సదాశివయ్య, మోహన్, రాంప్రసాద్, పాల్గొన్నారు. ఆధునిక డిజిటల్ నైపుణ్యం కలిగి ఉండాలి గుడిపాల: ప్రతి రైతూ ఆధునిక డిజిటల్ నైపుణ్యం కలిగి ఉండాలని వ్యవసాయశాఖ ఏడీఏ ఉమ, వ్యవసాయాధికారి మాధవి తెలిపారు. శనివారం మండలంలోని పాపసముద్రం సచివాలయంలో రైతులకు స్కిల్ ఆఫ్ చిత్తూరు, డిజిటల్ ట్రైనింగ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రైతులకు ఆధునిక డిజిటల్ నైపుణ్యం కలిగించి సాంకేతిక వ్యవసాయ పరిజ్ఞానం, వ్యవసాయ యాప్‌లు, డిజిటల్ ఫేమెంట్స్, యూట్యూబ్ చానల్స్ నిర్వహణ, వాతావరణం, మార్కెట్ ధరల గురించి అవగాహన కల్పించారు. వ్యవసాయశాఖ సిబ్బంది తులసీరాంరెడ్డి పాల్గొన్నారు. ఆర్డీఎస్ఎస్ పనులు త్వరగా చేయండి చిత్తూరు కార్పొరేషన్: గ్రామీణ ప్రాంతాలకు 3 ఫేజ్ విద్యుత్ సరఫరాను అందించే ఆర్డీఎస్ఎస్ పనులు త్వరగా చేయాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. శనివారం విజయవాడ నుంచి అన్ని జిల్లాల ట్రాన్స్‌కో ఎస్ఈలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పలు జిల్లాల్లో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదన్నారు. ఫీడర్ల వారీగా పను లు వేగవంతం చేయాలన్నారు. అవసరమైన మెటీరియల్స్ సి ద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే పల్లెలకు మెరుగైన విద్యుత్ అందించవచ్చొన్నారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గాలీవాన వచ్చినప్పుడు ఎక్కువ గా సమస్యలు వస్తున్నాయని, పలు ప్రాంతాల్లో విద్యుత్ శాఖకు నష్టంతో పాటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందన్నారు. ఆ సమయాల్లో వెంటనే విద్యుత్ స్తంభాలు, లైన్, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో లోడ్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచాలన్నారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ట్రాన్స్‌కో కార్యాలయం నుంచి ఎస్ఈ ఇస్మాయిల్‌అహ్మద్ పాల్గొన్నారు. ఏపీ ఈఏపీ సెట్‌కు 7,849 దరఖాస్తులు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఏపీ ఈఏపీ సెట్ 2025 (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షకు 7,849 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలకు ఈ ఏడాది మార్చి 12వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో స్వీకరించారు. ఈ నెల 12వ తేదీన పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. చిత్తూరు, పలమనేరు పరిధిలో 7,849 మంది ఈఏపీ సెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్ పరీక్షకు 6,103, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 1,716, రెండు పరీక్షలకు 30 మంది మొత్తం 7,849 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు ప్రవేశ పరీక్షలు ఈనెల 19, 20 తేదీల్లో, ఇంజినీరింగ్ పరీక్షలకు ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ● ఎమ్మెల్సీ భరత్ కుప్పంరూరల్: వైఎస్సార్ సీపీలో కష్టపడేవారికే గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ, కుప్పం ఇన్ చార్జి భరత్ అన్నారు. శనివారం కుప్పం పట్టణంలోని తన నివాసంలో కుప్పం మండల నాయకులతో మాట్లాడారు. ఇటీవల చా లా మంది పార్టీని వీడారని, వారి కి పార్టీ ఎంతో చేసిందని, అలాంటి వారు మనస్సా క్షి లేకుండా వెళ్లిపోవడం దారుణమన్నారు. మరికొంత మంది పార్టీలోనే ఉంటూ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. మరింత మందిని సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమన్నారు. నీతి, నిజాయితీ గల కార్యకర్తలు కొంత మంది ఉన్నా, తాము రాజకీయాలు చేసుకోగలమని, ఏ ఒక్కరిపైనో మాధారపడి నడవడం లేదన్నారు. కష్టకాలంలో ఎవరు పార్టీకి అండగా ఉంటారో రేపు అధికారం వచ్చిన తరువాత వారికే ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఇప్పటికే అధికార పార్టీ పట్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, ఎందుకు కూటమి ప్రభుత్వానికి ఓటు వేశామా..? అని మదనపడుతున్నారని తెలిపారు. మండల కన్వీనర్ హెచ్ఎం మురుగేష్ మాట్లాడుతూ, అక్ర మ కేసులు, తాటాకు చప్పుళ్లకు ఎవరూ బయపడొద్దని, మన ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని కేసులు పోతాయన్నారు. అధైర్యపడొద్దు ... అండగా అంటామనిభరోసా ఇచ్చారు. అన ంతరం ఇటీవల పార్టీ పదవులు అలంకరించిన వారిని సత్కరించారు. కార్యక్రమంలో నాయక లు వనితాశీను, భాగ్యరాజ్, జీవీ.రమేష్, చిన్న దొరై, నాయకులు పాల్గొన్నారు. నివేదిక సిద్ధం! సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు రూరల్ మండలం ఎగువమాసపల్లె ప్రాంతంలో అటవీ ప్రాంతం ఆక్రమణ పర్వం పై నివేదిక దాదాపు సిద్ధమైంది. తిరుపతి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులు గురువారం అటవీ ప్రాంతంలో జేసీబీలను పెట్టి చదును చేసి కబ్జాకు యత్నించారు. అటవీశాఖాధికారులకు క్షేత్ర స్థాయిలో రెండు జేసీబీలను సీజ్ చేసి డ్రైవర్లను అదుపులో తీసుకున్నారు. శుక్రవారం రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా ఆ స్థలంలో సర్వే చేశారు. అది అటవీ భూమి అని తేలింది. ఇందులో భాగంగా డ్రైవర్లను విచారించారు. ఇది తమ భూమి అని ఆక్రమణదారులు నమ్మబలికి చదును చేయించారు. ఆక్రమణదారుల నివాసాల వద్దకు వెళ్లి అటవీ సిబ్బంది విచారించగా వారు అక్కడ లేనట్లు గుర్తించారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాల ఆధారంగా డీఎఫ్ఓ భరణికి నివేదికను సోమవారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.– 8లో– 8లోన్యూస్రీల్ 194.వెంకటాపురం, ఎగువమాసాపల్లిలో భూకుంభకోణం 40 ఎకరాల మేర మేత బీడు, వంక భూముల ఆక్రమణ బినామీ పేర్లతో కాజేసిన కూటమి నేత బాస్ వెనకున్నారని బరితెగింపు చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు 194 వెంకటాపురంలో... బండపల్లి రెవెన్యూలో తచ్చూరు రోడ్డు ఆను కుని ఉన్న 194 వెంకటాపురంలో 30 ఎకరాల దాకా మేత బీడు ఉంది. ఇందులో 20 ఎకరాల భూమి తనదే అంటూ అదే గ్రామానికి చెందిన కూటమి నేత జేసీబీతో చదును చేశాడు. విషయం తెలుసుకున్న భూకుబేరులు తమదే భూమి అంటూ ఏకంగా మామిడి మొక్కలు పెట్టేశారు. ఈ భూ వ్యవహారంపై గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టర్ మండల రెవెన్యూ అధికారులను విచారణ చేపట్టి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. నాటిన మొక్కలను తొలగించాలని హుక్కుం జారీ చేశారు. అధికారులు మామిడి మొక్కలను తొలగించి.. మేత బీడుగా ప్రభుత్వానికి నివేదికలిచ్చారు. కొన్ని నెలల తర్వాత స్థానికంగా ఉన్న నేత మళ్లీ ఆ భూమి తనదే అంటూ బోర్డు పెట్టారు. ఈ బోర్డును భూకుబేరులు కొట్టిపడేశారు. ఇది వివాదంగా మారడంతో భూకుబేరులు ఇప్పుడు రూటు మార్చారు. సర్వేలో అటవీ భూమిగానే గుర్తించాం ఎగువమాసాపల్లిలో ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుపై స్పందించాం. రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నాం. జేసీబీలను సీజ్ చేయడంతో పాటు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. వారు ఇచ్చిన సమాచారం మేరకు నివేదికలు సిద్ధం చేస్తున్నాం. వీటిని సోమవారం డీఎఫ్‌కు అందిస్తాం. ఆక్రమణదారులపై తదిపరి చర్యలు ఉంటాయి. రెవెన్యూ అధికారులతో సర్వే చేయగా ఆక్రమిత భూమి అటవీ భూములని తేలింది. –థామస్, ఎఫ్ఆర్ఓ, చిత్తూరు ఈస్ట్ కబ్జా చేశారనేది వాస్తవం భూ ఆక్రమణపై ఫిర్యాదులొచ్చాయి. ఇప్పుడు చదును చేసిన భూమి అటవీశాఖ భూమి అని తేలింది. రెవెన్యూ భూముల విషయానికి సంబంధించి తహసీల్దార్ కూడా నోటీసులు ఇచ్చారు. తప్పు అని తేలితే తదుపరి చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాసులు, ఆర్డీఓ, చిత్తూరుఆక్రమణలపై చర్యలేవి? ఇక అటవీశాఖ అధికారులు ఆక్రమణదారులపై కేసు పెట్టేందుకు జంకుతున్నారు. కూటమి నేతల ఒత్తిడి ఉండడంతో అటవీశాఖ అధికారులు నోరువిప్పలేక పోతున్నారు. భూ ఆక్రమణదారులు పరారీలో ఉన్నారని సాకుచూపుతున్నారు. దీనికితోడు రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల కనుసన్నల్లో మునిగి తేలుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందుకే భూ ఆక్రమణల జోలికి రెవెన్యూ అధికారులు వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమణలపై గ్రామస్తులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
పొట్టేళ్ల చర్మాన్నీ తినేశారు!
● వ్యాపారస్తుడి నుంచి రూ.20 లక్షలు డిమాండ్ ● రూ.15 లక్షలు తీసుకున్న తెలుగు తమ్ముళ్లు ● అక్రమాలకు నిలయంగా బోయకొండ సాక్షి టాస్క్ఫోర్సు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బోయకొండలో తెలుగు తమ్ముళ్లకు కాసుల పంట పండుతోంది. అక్రమార్జనతోపాటు దౌర్జన్యకాండ సాగుతోంది. గంగమ్మ సొమ్ము అప్పనంగా మింగేయడం.. అధికారులు సైతం తమ్ముళ్లకు తలొగ్గి ఆలయ ఆదాయానికి గండికొట్టడం రివాజుగా మారుతోంది. టెండర్లు, వేలం పాటల్లో ఏకపక్షంగా వ్యవహరించి ఆలయ ఆదాయాన్ని కొల్లగొట్టిన తమ్ముళ్లు.. ఇప్పుడు భక్తులు జంతు బలులిచ్చిన పొటేళ్లు, మేకపోతులు, దున్నపోతుల చర్మాలను సైతం మింగేయడం విమర్శలకు తావిస్తోంది. జరిగేది ఇలా.. సాధారణంగా ఒక్క ఆదివారం మాత్రమే సుమారు 300 నుంచి 400 పొట్టేళ్లు అమ్మవారికి బలిస్తారు. ఒక వారంలో కనీసం 500కుపైగా బలిచ్చి మొక్కులు చెల్లిస్తుంటారు. వీటి చర్మాలను ఒక్కొక్కటి రూ.250 నుంచి రూ.350 వరకు గతంలో భక్తుల నుంచి వ్యాపారస్తులు కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఉచితం పేరుతో లాగేసుకుంటున్నారు! భక్తులు అమ్మవారికి పొటేళ్లు, మేకపోతులు బలిచ్చిన తర్వాత తలకాయను దేవస్థానం వద్ద వేలం పాటలో కై వసం చేసుకున్న లీజుదారుడికి ఇవ్వాలి. ఆ తర్వాత ఆలయ సమీపంలో మటన్ కటింగ్ షాపుల నిర్వహకులు భక్తుడు తీసుకెళ్లిన జంతువులకు చర్మాన్ని తీసి, మటన్ కట్ చేసి ఇస్తాడు. ఆ సమయంలో తీసిన చర్మాన్ని అతనే దేవస్థానానికి ఇచ్చేయాలని నమ్మబలుకుతున్నాడు. అలా సేకరించిన చర్మాన్ని తమ్ముళ్ల అండతో సొంతం చేసుకున్న వ్యాపారికి అప్పజెబుతున్నారు. దోచిపెట్టేస్తారా? బోయకొండ గంగమ్మ ఆలయంలో ఎలాంటి టెండర్లు, వేలం పాటలు నిర్వహించాలన్నా, దేవదాయశాఖ కమిషనర్ అనుమతి ఉండాలి. పత్రికా ప్రకటనలు, కరపత్రాల ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలి. ఆ తర్వాత బహిరంగంగా వేలం పాటలు చేపట్టాలి. అయితే ఈఓ ఏకాంబరం అండదండలతో నింబంధనలేవీ పాటించకుండా తమ్ముళ్లకు దోచిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. వాళ్లు చెప్పినవన్నీ తలూపి అక్రమార్జనకు దాసోహమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ్ముళ్ల దాదాగిరి చౌడేపల్లె మండలం, పెద్దూరు గ్రామానికి చెందిన ఓ వ్యాపారి బోయకొండలో జంతు వుల చర్మాన్ని ఉచితంగా సేకరించి విక్ర యించుకునేందుకు తమ్ముళ్ల నుంచి అను మతి పొందాడు. దీనికి ప్రతిఫలంగా త మ్ముళ్లు రూ.20 లక్షలు డిమాండ్ చేయగా.. ఇప్పటివరకు ఆ వ్యాపారి రూ.15 లక్షలు ముట్టజెప్పినట్టు సమాచారం. ఈ మొత్తాన్ని దేవస్థానానికి సైతం చెల్లించక తమ్ముళ్లు తమ జేబులు నింపుకోవడం గమనార్హం. గంగమ్మ సొమ్ము తినేస్తున్నారు బోయకొండ గంగమ్మ సొమ్మును అక్రమంగా తినేస్తున్నారు. ఆలయ ఆదాయానికి గండి పడకుండా కలెక్టర్, దేవదాయశాఖ కమిషనర్ స్పందించి అడ్డుకట్ట వేయాలి. – భక్తులు, స్థానికులు -
మొక్కలను సంరక్షించాలి
మొక్కలు నాటడంతోపాటు వాటిని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ సూచించారు.ముగిసిన ఇంటర్ ప్రధాన పరీక్షలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా నిర్వహిస్తున్న ఇంటర్ సప్లిమెంటరీ ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఈ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల్లో నిర్వహించారు. ప్రధాన పరీక్షల్లో చివరి రోజు శనివారం ఉదయం నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షల్లో జనరల్, వొకేషనల్‌లో 5,600 మందికి గాను 510 మంది, మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 1,467 మందికి గాను 115 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని పాలసముద్రం, నగరి బాలురు, బాలికలు, పుత్తూరు బాలురు, బాలికలు, వడమాలపేట కేంద్రాలను ఆర్జేడీ, చిత్తూరు డీఐఈఓ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైస్ ఎంపీపీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి తవణంపల్లె: ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకు తవణంపల్లె మండల వైస్ ఎంపీపీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డీపీఓ సుధాకర్ తెలిపారు. తవణంపల్లె మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామన్నారు. మండలంలోని 15 ఎంపీటీసీలు ఎన్నికల్లో పాల్గొని చేతులు ఎత్తే పద్ధతిలో ఎంపిక జరుగుతుందని వివరించారు. – 8లో -
తీవ్ర విషాదం.. నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
చిత్తూరు జిల్లా: కుప్పం మండలం దేవరాజపురంలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలోపడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులను శాలిని (5), అశ్విన్ (6), గౌతమి (8)గా గుర్తించారు. ఇంటి పునాది కోసం తవ్విన కుంటలో వర్షపు నీరు చేరగా.. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆడుకుంటూ అటువైపుగా వెళ్లిన చిన్నారులు.. కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.మరో ఘటనలో నలుగురు చిన్నారులు మృతి..మరో ఘటనలో కారు లాక్ పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. విజయనగరం జిల్లాలోని ద్వారపూడి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు కారు లాక్ పడి మరణించారు. ఆదివారం ఉదయం ఈ నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. తల్లిదండ్రులంతా ఉదయం నుంచి వెతికినప్పటికీ కనిపించలేదు. అయితే గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులోకి నలుగురు చిన్నారులు సరదాగా కూర్చునేందుకు వెళ్లి కారు డోర్ వేశారు. దీంతో కారు డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక ఉదయ్, చారుమతి, చరిష్మా, మనస్విని మృతి చెందారు. -
కట్టుదిట్టంగా పది సప్లిమెంటరీ
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు పదో తరగతి సప్లిమెంటరీ, మే 19 నుంచి 24వ తేదీ వరకు ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పదవ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 36 కేంద్రాల్లో 8,765 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు తెలిపారు. ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 9 కేంద్రాల్లో 2,182 మంది, పది పరీక్షలకు 12 కేంద్రాల్లో 670 మంది హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయాలని ఆదేశించారు. మూడో శనివారం మొక్కలు నాటే కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో స్వర్ణాంద్ర–స్వచ్ఛాంధ్రాలో మొక్కలు నాటే కార్యక్రమం తప్పనిసరిగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మూడవ శనివారం పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాల పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయి కార్యాలయాల పరిధిలో 5 నుంచి 10 మొక్కలు నాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా కనీసం 2 వేల మొక్కలు నాటాలని ఆదేశించారు. -
లైనింగ్‌తో 2.86 లక్షల ఎకరాలు బీళ్లు
ప్రాజెక్టుల అనుసంధానం, కాలువ వెడల్పు పనులు పూర్తయ్యాక జిల్లాలో 2.86 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కూటమి ప్రభుత్వం కాలువలకు లైనింగ్ పనులు చేపట్టిన కారణంగా ఒక్క చుక్కనీరు కూడా పొలాలకు పారించే అవకాశం లేదు. మనం వాడుకోవాల్సిన 25 టీఎంసీలలో కనీసం రెండు టీఎంసీలైనా తరలించుకోలేని పరిస్థితి దాపురించింది. ఈ లైనింగ్ కారణంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో 41,150 ఎకరాలు, పుంగనూరు నియోజకవర్గంలో 17,800, పలమనేరులో 8,100, చిత్తూరులో 6,200, చంద్రగిరిలో 6,400, పీలేరులో 76,200, జీడీనెల్లూరులో 4,050, పూతలపట్టులో 16,100 ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి తెలెత్తింది. కొత్త నిర్మాణం మొదలై అడ్డంకులతో ఆగిపోయిన ముదివేడు రిజర్వాయర్ కింద 35 వేల ఎకరాలు, నేతికుంటపల్లె రిజర్వాయర్ కింద 15వేల ఎకరాలు, ఆవులపల్లె రిజర్వాయర్ కింద 60వేల ఎకరాల ఆయకట్టు భూమికి చుక్క సాగునీరు కూడా అందే అవకాశం లేదు. -
మానవత్వానికి మరో పేరు జగన్
కార్వేటినగరం: దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాన్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వానికి మరో పేరుగా మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి నిలిచారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. శుక్రవారం పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి తన గొప్పతనాన్ని చాటుకున్నారని తెలిపారు. గతంలోనూ పలు ఘటనల్లో ఉదారంగా బాధిత కుటుంబాలకు సాయం అందించారని గుర్తుచేశారు. కాపాడుతారా.. వత్తాసు పలుకుతారా! – అటవీభూమి కబ్జా కేసు నీరుగార్చే కుట్ర సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి నేతల అటవీ భూ కబ్జా వ్యవహారం తప్పుదారి పట్టేలా ఉంది. ఆక్రమణదారులను వదిలి పెట్టాలనే ప్రయత్నం జోరుగా సాగుతోంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు మండలం, ఎగువమాసాపల్లి ప్రాంతంలో అటవీ భూమి కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు గురువారం అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు జేసీబీలను సీజ్ చేయగా.. ఇద్దరు డ్రైవర్లను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆక్రమిత భూమి పై అటవీ, రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. ఇది అటవీశాఖ భూమి అని తేల్చారు. అయితే కూటమి బడా నేతలు ఆక్రమణదారులను ఈ కేసు నుంచి తప్పించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని విషయాలు గోప్యంగా ఉంచుతుండడం పలు విమర్శలకు తావిస్తోంది. కాగా ఈ విషయంపై గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. -
రసవత్తరంగా కుస్తీ పోటీలు
– జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి పోటీలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో పాల్గొన్న వివిధ జిల్లాల క్రీడాకారులు నువ్వా...నేనా అన్నట్టు తలబడ్డారు. ఈ పోటీలకు రాష్ట్ర స్థాయిలోని వివిధ జిల్లాల నుంచి అండర్–17, అండర్–23 విభాగాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. మొదటి రోజు ప్రారంభమైన ఈ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన అండర్ 17 బాల, బాలికల కుస్తీ క్రీడాకారులు తలబడ్డారు. ఈ నెల 17న నిర్వహించే పోటీల్లో అండర్ 23 బాల, బాలికల జట్ల క్రీడాకారులు పాల్గొననున్నారు. కుస్తీ పోటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కే పురుషోత్తం, రాష్ట్ర సెక్రటరీ భూషణం, కోచ్ రఫి పాల్గొన్నారు. -
వినాయకుడి సన్నిధిలో ఐఆర్ఎస్ అధికారులు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని శుక్రవారం పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి స్వామి దర్శనం కల్పించారు. వేద ఆశీర్వచన మండపంలో పండితుల చేతుల మీదుగా ఆశీర్వచనాలు అందజేశారు. ఏఈవో రవీంద్రబాబు వారికి ప్రసాదం, స్వామి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో సిబ్బంది కోదండపాణి, బాలాజీ పాల్గొన్నారు. హంద్రీ–నీవా కాలువ పనుల పరిశీలన వి.కోట: హంద్రీ–నివా సుజల స్రవంతి రెండో దశ కుప్పం ఉప కాలువ పనులను శుక్రవారం రాష్ట్ర జలవనరుల అభివృద్ధిశాఖా మంత్రి నిమ్మల రా మానాయుడు పరిశీలించారు. మండలంలోని దా సార్లపల్లి గ్రామం వద్ద జరుగుతున్న పనులను ప లమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, మండల అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కూటమి నేతలు ఆయనకు ఘన స్వా గతం పలికారు. అనంతరం ఆయన కాలువ పను లు పరిశీలించి పలు సూచనలు చేసి మాట్లాడారు. నాణ్యతతో త్వరతగతిన పనులను పూర్తి చేయా లని కాంట్రాక్టర్లను కోరారు. పలమనేరు ఆర్డీఓ భవాని, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు. -
31 కిసాన్ డ్రోన్లు మంజూరు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాకు కిసాన్ డ్రోన్లు 31 దాకా మంజూరైనట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఐదుగురు రైతులు ఒక గ్రూపుగా ఏర్పడి డ్రోన్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆ ఐదుగురిలో ఒకరిని డ్రోన్ఫైలెట్గా ఎంపిక చేసి ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. డ్రాగో కంపెనీ డ్రోన్ మొత్తం ధర రూ.9.5 లక్షలు, విహంగ కంపెనీ ధర రూ.9.81 లక్షలు ఉందన్నారు. వీటిని 80 శాతం రాయితీతో ఇస్తామన్నారు. కావాల్సిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యుత్ అధికారుల నోటీసులు గంగాధర నెల్లూరు : మండలంలోని అగర మంగళం పంచాయతీ పరిధిలోని దళిత వాడల్లో విద్యుత్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆపై గ్రామస్తులకు నోటీసులు అందజేశారు. దళిత గ్రామాలలో తనిఖీలు నిర్వహించి మీటర్లు లేని ఇండ్ల యజమానులకు నోటీసులిచ్చి జరిమానాలు విధించినట్లు గ్రామస్తులు తెలిపారు. అగర మంగళం గ్రామంలో దాదాపు 17 కుటుంబాలకు నోటీసులు అందించినట్టు పేర్కొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఇద్దరు డిబార్ చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల్లో మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడ్డ ఇద్దరు విద్యార్థులను అధికారులు డిబార్ చేశారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షను నిర్వహించారు. ప్రథమ సంవత్సర పరీక్షకు జనరల్, ఒకేషనల్‌లో కలిపి 5,854 మందికి 331 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్‌లో కలిపి 1,554 మందికి 95 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలోని సదుం, సోమల, పుంగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, మదర్ థెరీసా జూనియర్ కళాశాల, పలమనేరు ప్రభుత్వ జూనియర్, శ్రీ వాణి జూనియర్ కళాశాల, బంగారుపాళ్యం ప్రభుత్వ కళాశాలలను డీఐఈవో డా.ఆదూరు, శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. -
పెద్దిరెడ్డి చేసిన కృషిని చూసి ఓర్వలేక
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాను సాగునీటితో సస్యశ్యామలం చేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి చేసిన కృషి మరువలేనిది. వైఎస్సార్సీపీని ఆదరిస్తున్న ప్రజలు, రైతుల కోసం ప్రత్యేకంగా మూడు రిజర్వాయర్లు, పీబీసీ వెడల్పు, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల అనుసంధాన పథకం మంజూరుకు చేసిన కృషి ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. దీంతో రాజకీయంగా టీడీపీ బలహీన పడుతుందని ఈ పథకాలపై పెద్దిరెడ్డి కుటుంబ ముద్ర ఉండకూదడన్న కక్ష్యతో కూటమి ప్రభుత్వం వాటిని పక్కనపెట్టిందని రైతులు చర్చించుకుంటున్నారు. -
ప్రారంభోత్సవంలో అధికార దర్పం
● యథేచ్ఛగా ప్రొటోకాల్ ఉల్లంఘన ● ప్రజాప్రతినిధులకు అవమానం ● ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన వ్యక్తికి శిలాఫలకంలో చోటు ● తెలిసి తప్పు చేసిన అధికారులు సాక్షి టా్స్క్ఫోర్సు: ఎన్నికై న ప్రజాప్రతినిధులకు లేని గౌరవాన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన ఓ నేతకు అఽధిక ప్రాధాన్యతతో ప్రొటోకాల్ కల్పించారు జిల్లా స్థాయి అఽధికారులు. అధికార పార్టీ నేతలకు తలొగ్గి ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి ప్రజాప్రతినిధులను అవమానపరిచిన ఘటన శుక్రవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆధ్వర్యంలో వ్యవసాయ పాలటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవంలో చోటు చేసుకుంది. వివరాలు.. పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలం, కాటిపేరి వద్ద వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కలిసి రూ.3 కోట్లతో 58 ఎకరాల్లో పాలటెక్నిక్ కళాశాలను మంజూరు చేయించారు. తక్షణం అద్దె భవనాలను ఏర్పాటు చేసి అప్పట్లో అడ్మిషన్లను నిర్వహించి పనులను వేగవంతం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. భవన నిర్మాణ పనులు పూర్తయ్యాక శుక్రవారం రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ సుమిత్‌కుమార్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి కలిసి ప్రారంభించారు. అయితే ఆహ్వాన పత్రికలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ అధికారులు శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఆ ప్రాంత సర్పంచ్ సరితా సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతమ్మ తోపాటు ఎంపీపీ రామమూర్తి, జెడ్పీటీసీ సభ్యుడు దామోదరరాజుకి ప్రాధాన్యం ఇవ్వకుండా అవమానపరిచారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన చల్లా రామచంద్రారెడ్డికి మాత్రం అగ్రతాంబూళం వేశారు. మండల స్థాయి ప్రజాప్రతినిధుల పేర్ల పైన ఆయన పేరును ప్రత్యేక అతిథిగా ముద్రించి అధికారులు స్వామి భక్తిని చాటుకున్నారు. ఇదిలావుండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చల్లా రామచంద్రారెడ్డి అధికారులతో వరుస సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిపై టీడీపీ నాయకులే సోషల్ మీడియా వేదికగా పలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. -
పలమనేరులో భారీ వర్షం
పలమనేరు: పలమనేరులో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. కొలమాసనపల్లి పంచాయతీ, దిగువమారుమూరు గ్రామానికి చెందిన రామచంద్ర ఇంటి పక్కనే ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఇంట్లో నిద్రిస్తున్న వారు హడలిపోయారు. భారీ వర్షం కారణంగా పలు పంటలకు నష్టం వాటిల్లింది. మామిడి కాయలు నేలరాలాయి. తీగ పంటలు సైతం నేలవాలిపోయాయి. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మొరవెత్తిన బొమ్మిదొడ్డి చెరువు మండలంలోని బొమ్మిదొడ్డి చెరువు వర్షాలతో మొరవెత్తింది. మిగిలిన చెరువులకు కొంత మేర వర్షపునీరు చేరింది. కౌండిన్య నదిలోని చెక్‌డ్యామ్‌లకు సైతం వరదనీరు చేరింది. ఇదేవిధంగా మరో రెండ్రోజులు వర్షాలు పడితే మరిన్ని చెరువులకు నీరు చేరే అవకాశం ఉంది. -
అత్యవసరమైనా ఉండరే?
కుప్పం: శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవం సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో సుమంగళి సౌభాగ్య మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి జాతరలో ఈ ఏడాది నూతనంగా సుమంగళి సౌభాగ్య మహోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ప్రారంభించింది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం ముత్తైదువులు సారె సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టింది. మహళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, వస్త్రాలు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి తరలివచ్చిన మహిళలకు కమిటీ సారెను అందజేసింది. ఆలయ ప్రాంగణం నుంచి చెరువు కట్టపై ఉన్న బావి దగ్గరకు వెళ్లి శిరస్సు, కళ్లు తెర తొలగించే చోట ఈ మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టింది. అనంతరం ర్యాలీగా ఆలయానికి తరలివచ్చారు. 20 వేల మందికి అన్నదానం జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. 19 రకాల వంటకాలతో భోజనాలు వడ్డించారు. ఆలయం ఎదురుగా ఉన్న రోడ్డు ప్రాంగణంలో సంపక్తి భోజనాలను వడ్డించారు. సుమారు 20 వేల మందికిపైగా భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పురవీధుల్లో ఊరేగింపు గంగ జాతర సందర్భంగా ముత్తుమారెమ్మ ఉత్సవ విగ్రహాలను శేష వాహనంపై పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. పలకవాయిద్యాల మధ్య పాతపేట, కొత్తపేట, రైల్వేగేటు వరకు అమ్మవారి ఉత్సవ ఊరేగింపును చేపట్టారు. చౌడేపల్లె: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్‌తో సహా సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావడం లేదు. ఒకవేళ వచ్చినా రోగులను సక్రమంగా పట్టించుకోవడం లేదు. ఇలాంటిదే శుక్రవారం ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండలంలోని పందిళ్లపల్లెకు చెందిన పీ.రెడ్డిప్రసాద్(33) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి అపస్మారిస్థితికి చేరాడు. కుటుంబ సభ్యులు పవన్, మనోహర్ అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆస్పత్రిలో సిబ్బంది ఎవరూ లేరు. బిగ్గరగా అరుస్తూ అత్యవసర కేసు వచ్చింది.. ఎవరూ లేరే.. రండి డాక్టర్, నర్సు ఎక్కడ అంటూ కేకలు వేశారు. సుమారు అర్ధగంట అయినా ఎవరూ రాలేదు. తరువాత సిబ్బంది ఒకరు వచ్చి స్టాఫ్ ఎవరూ లేరని చెప్పారు. తర్వాత 108 ద్వారా మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి డాక్టర్లు శుక్రవారం అతన్ని తిరుపతి స్విమ్స్‌కు రెఫర్ చేశారు. -
ఒప్పించి కాదు నొప్పించి!
● అయ్యోర్లను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం ● బదిలీలు, ఉద్యోగోన్నతుల సమస్యలను పరిగణనలోకి తీసుకోని వైనం ● 21న ఉమ్మడి జిల్లా డీఈఓ కార్యాలయం ముట్టడికి పిలుపు చిత్తూరు కలెక్టరేట్ : అధికారంలోకి రాక ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాటను అమలు చేయడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికలకు ముందు టీచర్లకు అనేక హామీలు గుప్పించింది. తీరా అధికారంలోకి వచ్చాక హామీల అమలు విషయం దేవుడెరుగు.. క్షేత్ర స్థాయిలో టీచర్ల సమస్యలు, డిమాండ్లను పరిష్కరించకుండా చుక్కలు చూపిస్తోంది. త్వరలో నిర్వహించే ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ అన్యాయం చేస్తోంది. దీనిపై ఉపాధ్యాయ లోకం నిప్పులు చెరుగుతోంది. ఏకపక్ష జీవోలు సరికాదు కూటమి ప్రభుత్వం ఏక పక్షంగా తీసుకొస్తున్న జీవోలను టీచర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. గత 30 వారాలుగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన యూనియన్లతో సమావేశాలు నిర్వహించి డిమాండ్లను సేకరించినప్పటికీ అమల్లోకి తీసుకొకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకుండా అమల్లోకి తీసుకొచ్చిన 19, 20, 21 జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు తేల్చిచెబుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలను ఒప్పించి చేస్తున్నామంటూ అపోహలు సృష్టించి.. నొప్పించే ధోరణితో వ్యవహరిస్తున్నారని దుయ్యబడుతున్నారు. 21న డీఈఓ కార్యాలయం ముట్టడి డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 21న ఉమ్మడి జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. కూటమిపై పోరాటానికి అన్ని సంఘాలు కలిసి వచ్చినట్టు పేర్కొన్నాయి. డిమాండ్లను పరిష్కరించాలి డిమాండ్లను తప్పనిసరిగా పరిష్కరించాల్సిందే. టీచర్లకు అన్యాయం చేస్తే సహించేది లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాల విద్యాశాఖలో నెలకున్న సమస్యలు, ఇబ్బందులను గుర్తించి తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలి. – గిరిప్రసాద్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తాం విద్యాశాఖ అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 21న ఉమ్మడి చిత్తూరు జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధమవుతున్నాం. కూటమి ప్రభుత్వం విద్యారంగ సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీన పరుస్తోంది. – జీవీ రమణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తీరని అన్యాయం సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం టీచర్లకు తీరని అన్యాయం చేస్తోంది. సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన్నా ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. టీచర్ల పట్ల అంత అలుసు ఎందుకు చూపుతున్నారో. – రెడ్డిశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌టీఏ రాష్ట్ర ట్రెజరర్. డిమాండ్లు ఇవే ఉన్నత పాఠశాలల్లో 1:30 నిష్పత్తి ప్రకారం 45 మంది విద్యార్థులు దాటిన తర్వాత రెండో సెక్షన్‌ను ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ప్రతి 40 మందికి మరో సెక్షన్‌ను ఏర్పాటు చేయాలి. మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించడం అశాసీ్త్రయం. బదిలీల్లో స్టడీ సెలవులో ఉన్న టీచర్ల స్థానాలను ఖాళీగా చూపరాదు. ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక పాఠశాలల్లో 41 వద్ద 3వ పోస్టు ఇవ్వాలి. ఏప్రిల్ 23వ తేదీ రోల్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. పోస్టులను బ్లాక్ చేస్తుండడం సరైన పద్ధతి కాదు. 2023లో రేషనలైజేషన్ చేసి 2023లో ఉద్యోగోన్నతి పొంది 2025లో రేషనలైజేషన్ అవుతున్న టీచర్లకు బదిలీల్లో అన్యాయం జరుగుతోంది. అటువంటి వారికి బదిలీల్లో 8 సంవత్సరాల పాయింట్లు కేటాయించాలి. పీహెచ్సీ కోటా టీచర్లను రేషనలైజేషన్ చేయడం సరైన పద్ధతి కాదు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ సర్వీస్ రూల్స్ సమస్య తేలకుండా 8 ఏళ్లుగా లాంగ్ స్టాండింగ్ అయిన టీచర్లను సొంత యాజమాన్యానికి వెళ్లమని చెప్పడం భావ్యం కాదు. ఎంఈవోలకు బదిలీలు నిర్వహించి కోరుకున్న ఎంఈఓ 1, ఎంఈవో 2లకు హెచ్ఎం కన్వర్షన్ ఇవ్వాలి. ఎందుకు మోసగిస్తున్నారు డిమాండ్లను పరిగణలోకి తీసుకుంటున్నామంటూ టీచర్లను ఎందుకు మోసగిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. టీచర్లకు బదిలీల్లో, ఉద్యోగోన్నతుల్లో అన్యాయం జరిగితే సహించేది లేదు. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ సమావేశాన్ని బహిష్కరించి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికగా ఒక్కటయ్యాం. పోరాటాలకు సిద్ధమవుతున్నాం. – బాలాజీ, ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు -
ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి!
పలమనేరులో భారీ వర్షం పలమనేరు నియోజకవర్గంలో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. – IIలోవైభవంగా సుమంగళి సౌభాగ్య మహోత్సవం రసవత్తరంగా కుస్తీపోటీలు చిత్తూరులోని మెసానికల్ మైదానంలో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు శుక్రవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025మదనపల్లె: ఆసియా ఖండంలో అతిపెద్ద, 31 ఎత్తిపోతలు కలిగిన ప్రాజెక్టు హాంద్రీ–నీవా. ఈ ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఆవులపల్లె. 3.5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో చేపట్టిన ఈ రిజర్వాయర్ కింద 20 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి, కొత్తగా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. ఇంత గొప్ప రిజర్వాయర్ నిర్మాణం చేపట్టలేని టీడీపీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేపట్టడాన్ని జీర్ణించుకోలేక పోయింది. అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గంలో 120 చెరువులకు నీటినందించి, 15 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి, కొత్తగా 20 వేల ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంతో రెండు టీఎంసీల సామర్థ్యంతో ముదివేడు రిజర్వాయర్ పనలు చేపట్టారు. చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో నేతికుంటపల్లె రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి దీనికింద 5 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి, కొత్తగా 10 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఈ పనులు పూర్తయితే వీటి నిర్మాణం కోసం కృషి చేసిన పెద్దాయన పేరు చిర స్థాయిగా నిలిచిపోతుందని భావించారు. వైఎస్సార్సీపీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరగుతుందని కుట్రపన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని భయపడిపోయారు. అందుకే దీన్ని జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు కేసులు వేసి అడ్డుపుల్ల వేశారు. టెండర్లో రూ.64 కోట్ల ఆదా మూడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.2,144.50 కోట్లు మంజూరు చేయగా టెండర్ల నుంచి ఒప్పందం వరకు అన్ని పారదర్శకంగానే జరిగాయి. ఇందులో నిర్మాణాలకు రూ.1,529.37 కోట్లు, భూసేకరణ, ఇతరా పనులకు రూ.615.13 కోట్లు కేటాయించారు. మూడు రిజర్వాయర్లను ఒకేపనిగా రూ.1,554,21,60,649 అంచనా వ్యయంతో నిర్వహించిన టెండర్లలో ఎన్‌ఈసీఎల్, ఆర్ఆర్సీఐఐపీఎల్ జాయింట్ వెంచర్, మేఘా ఇంజినీరింగ్ వర్క్, హెఈఎస్ ఇన్ఫ్రా ప్రైయివేట్ లిమిటెడ్ సంస్థలు పాల్గొన్నాయి. అంచనా కంటే అధికంగా రూ.1,618.72 కోట్లకు టెండర్లు వేయగా, దీనిపై ప్రభుత్వం రివర్స్ టెండర్ నిర్వహించగా జాయింట్ వెంచర్ సంస్థ రూ.1,553.96 కోట్లతో టెండర్ వేయడంతో ప్రభుత్వానికి రూ.64.76 కోట్ల వరకు ఆదా అయ్యింది. అప్పుడు ఎన్జీటీతో..ఇప్పుడు విజిలెన్స్‌తో మూడు రిజర్వాయర్ల నిర్మాణ పనులు మొదలయ్యాక టీడీపీ నేతలు అడ్డంకులు సృష్టించడం మొదలు పెట్టారు. ఎన్జీటీలో కేసు వేసి పనులు నిలిపివేయించారు. 2023 ఆగస్టు 4న ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగళ్లుకు వచ్చిన చంద్రబాబుకు విన తిపత్రం ఇవ్వాలని ప్రయత్నించిన వారిపై టీడీపీ శ్రేణులు దాడులు చేశాయి. ఇప్పుడు అధికారంలోకి రావడంతో విజిలెన్స్ విచారణ పేరుతో రిజర్వాయర్లకు సమాధి కట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారు. శుక్రవారం మదనపల్లె, తంబళ్లపల్లెల్లో పర్యటించిన జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ రిజర్వాయర్లను ఉద్దేశించి చేసిన ఆరోపణలు చేయడంపై రైతులు మండిపడుతున్నారు. ఆగిపోయిన ఆవులపల్లె రిజర్వాయర్ పనులు (ఫైల్) ఘనంగా సంకటహర చతుర్థి కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. చతుర్థి సందర్భంగా ఉదయం ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతర్థి గణపతి వ్రతాన్ని చేపట్టారు. రాత్రి ఆలయ మాడ వీధుల్లో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఈవో పెంచలకిషోర్ తదితరులు పాల్గొన్నారు. నేటితో రేషన్ పంపిణీ ఆఖరు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో రేషన్ పంపిణీ శనివారంతో ముగియనుందని డీఎస్ఓ శంకరన్ తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి జిల్లాలో రేషన్ పంపిణీ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 88శాతం పంపిణీ పూర్తియిందన్నారు. మిగిలిన కార్డుదారులు సాయంత్రంలోపు రేషన్ తీసుకోవాలని ఆయన సూచించారు. బాధ్యతగా పనిచేయాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ బాధ్యతగా పనిచేయాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆమె శిశు మరణాల టాస్క్‌ఫోర్స్ కమి టీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏడాది లోపు చనిపోయే పిల్లలు కూడా శిశు మరణాల కిందకే వస్తారన్నారు. గత నెల రోజుల వ్యవధిలో 8 శిశుమరణాల సంభవించాయని చెప్పారు. ఇవన్నీ కూడా ఆస్పత్రుల్లోనే నమోదైనట్టు పేర్కొన్నారు. డీఐఓ హనుమంతరావు, అధికారులు లత, అనిల్‌కుమార్, సింధూర, వెంకటేశ్వరి, మోహన్‌బాబు, ఉషశ్రీ, అనూష పాల్గొన్నారు. సబ్సిడీ రుణాలు ఇవ్వాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం): గొర్రెల పెంపకందారులకు ఉచితంగా రుణాలు ఇవ్వాలని చిత్తూరు జిల్లా గొర్రెల పెంపకందారుల సొసైటీ అధ్యక్షుడు గంగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం సహకార జిల్లా యూనియన్ కార్యాలయంలో లక్ష్మీ వెంకటేశ్వర గొర్రెల పెంపకందారుల సొసైటీ అధ్యడి ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ అధ్యక్షులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, యాభై ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు.గంగాధర నెల్లూరు : మండలంలోని వింజం పంచాయతీ వీఆర్వో ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వైఖరి పట్ల స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట ఎంపీటీసీ హనీఫ్ బాషా, గ్రామస్తులు, రైతులు, విద్యార్థులు శుక్రవారం నిరసనకు దిగారు. వీఆర్వో గ్రామంలోని రైతులు, విద్యార్థులకు అందుబాటులో ఉండడం లేదని, ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని, సర్టిఫికెట్ల కోసం 20 రోజులుగా విద్యార్థులు కార్యాలయాల చుట్టూ చక్కెర్లు కొడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై మండల రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుపోగా.. వారి ముందే గ్రామస్తులపై వీఆర్వో చిందులేశారు. ‘నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. ఏ అధికారి ఏమీ చేయలేడు.. నాకు రాజకీయ అండదండలున్నాయి.. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ చెలరేగిపోయాడు. వైఎస్సార్సీపీ నాయకుడు యువరాజు మాట్లాడుతూ వీఆర్వో ప్రవీణ్ కుమార్ వైఖరి వివాదాస్పదంగా ఉందని, ధనికలు, కూటమి నాయకుల సేవలోనే తరిస్తున్నాడని తెలిపారు. అదే పేద, మధ్యతరగతి రైతులకు సేవలందించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాడని ఆరోపించారు. జిల్లా అధికారులు స్పందించి సదరు వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని కోరారు. న్యూస్‌రీల్ రూ.2,144 కోట్లతో ముదివేడు, నేతికుంటపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్ల నిర్మాణం హంద్రీ–నీవా ప్రాజెక్టులోనే ఆవులపల్లె అతిపెద్ద రిజర్వాయర్ టీడీపీకి మనుగడ ఉండదన్న కక్షతో ఎన్జీటీలో కేసు అర్ధంతరంగా ఆగిపోయిన రిజర్వాయర్ల పనులు పనులు చేసినా రూ.800 కోట్ల బిల్లులు పెండింగ్ ఇప్పుడు విజిలెన్స్ విచారణ పేరుతో కొత్త నాటకం 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం తప్పా? నన్ను ఎవరూ ఏమీ చేయలేరు రెవెన్యూ అధికారుల ముందే సవాల్ విసిరిన వీఆర్వో సచివాలయం ముందు గ్రామస్తుల నిరసన కరువును పారద్రోలి..బీడు భూములు సస్యశ్యామలం చేయాలన్న సంకల్పానికి టీడీపీ నేతలు గండికొట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో మంజూరైన ముదివేడు, నేతికుంటపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్ల నిర్మాణ పనులను అడ్డుకుని కేసులు వేశారు. ఇది చాలదన్నట్టు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా వేధింపులకు దిగుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విజిలెన్స్ విచారణ పేరుతో కొత్త నాటకానికి తెరదీశారు. రాయలసీమలోనే పెద్దాయనగా పేరుగడించిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కక్షగట్టి ప్రాజెక్టులకు శిక్ష వేశారు. ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అవిరాళ కృషిని నీరుగార్చారు. దీనిపై రైతులు రగిలిపోతున్నారు. రూ.800 కోట్లు పెండింగ్ ఈ మూడు రిజర్వాయర్లకు సంబంధించి పనులు నిలిపివేసిన 2023 మే 11 నాటికి ముదివేడు రిజర్వాయర్ 33 శాతం, నేతికుంటపల్లె 86 శాతం, ఆవులపల్లె 5.8 శాతం పనులు జరిగాయి. మొత్తం టెండర్ వ్యయంలో జరిగిన పని విలువ రూ.800 కోట్లకు పైనే. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చెల్లించింది రూ.30 కోట్లని సమాచారం. చేసిన పనులకు ప్రస్తుత ప్రభుత్వం రూ.800 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే రిజర్వాయర్లకు శాశ్వత సమాధి కట్టడం కోసం కూటమి ప్రభుత్వం పైద్దాయనపై కక్షతో కరువు రైతాంగానికి శిక్ష విధిస్తోంది. సాగునీరు అందించడం తప్పా మూడు రిజర్వాయర్ల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న మహత్తర లక్ష్యం తప్పా అని రైతాంగం ప్రశ్నిస్తోంది. సాగునీటి రంగంలో దశాబ్దాలుగా వెనుకబడిన తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో రైతాంగ సంక్షేమానికి పెద్దాయన పెద్దపీట వేయడం నేరమా అని నిలదీస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దాయనను ఎదుర్కొనే వ్యూహం లేని టీడీపీ ఆయన చేపట్టిన అభివృద్ధిపై ఇలా అక్కసు వెళ్లగక్కడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ఈ రిజర్వాయర్ల పరిస్థితిపై రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పాటికే పూర్తి కావాల్సిన పనులను అడ్డుకుని నిలిపివేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
రేణిగుంటలో 24.5 కిలోల గంజాయి స్వాధీనం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): ఒడిశా నుంచి కేరళకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పశ్చిమ బెంగాల్ మహిళలను రేణిగుంట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రేణిగుంట లాడ్జిలో ఉన్న వారి వద్ద నుంచి 24.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం తిరుపతి జిల్లా ఏఎస్పీ రవిమనోహరాచారి తెలిపిన వివరాల మేరకు.. పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు రైల్వేస్టేషన్ సమీపంలోని ఎస్బీఎస్ లాడ్జిలోని 207 గదిలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జయచంద్ర, ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో సోదాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమోని మొండాల్ (31), నమితా మొండాల్ (37) లను అదుపులోకి తీసుకుని, రెండు సూట్‌కేస్‌లలో ఉన్న రూ.2.45 లక్షల విలువ చేసే 24.5 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి రైల్లో కేరళ తీసుకెళుతుండగా వారి సంబం«దీకుల నుంచి సూచన రావడంతో రేణిగుంటలో దిగి లాడ్జిలో బస చేశారు.వారిద్దరినీ అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో వారు చెప్పిన ఇద్దరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి సీఐ జయచంద్ర, సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు. -
వసతుల కల్పనలో అలసత్వం వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాకు విచ్చేసే పర్యాటకుల వసతుల కల్పన విషయంలో అలసత్వం వద్దని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో ఆయన వరుస సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారితో చర్చించాలన్నారు. అందుకు అవసరమైన ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. నిర్మాణాలు పరిశీలించాలి జిల్లాలోని సచివాలయాల్లో పనిచేస్తున్న ప్రతి ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఇంటి నిర్మాణాల పురోగతిని తప్పనిసరిగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. హౌసింగ్ శాఖ అధికారుల సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకంలో జిల్లాలో మంజూరు చేసిన గృహాలను వేగవంతంగా చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు రూఫ్ లెవెల్, రూఫ్ లెవెల్ కాస్ట్ లో ఉన్న గృహాల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణాలకు రెండు రోజుల్లో 10 గ్రామాలను పరిశీలించి మెటీరియల్ కాంపొనెంట్ లో చేపట్టే పనుల వివరాల నివేదికను డ్వామా పీడీ సమర్పించాలన్నారు. సమీక్షల్లో డీఎఫ్ఓ భరణి, పర్యాటకశాఖ రీజినల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, పీఆర్ ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి గౌరి, జిల్లా దేవదాయశాఖ అధికారి చిట్టెమ్మ, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, డ్వామా పీడీ రవికుమార్ పాల్గొన్నారు.మొగిలి దేవస్థానం అభివృద్ధికి ప్రణాళికలు జిల్లాలో మొగిలి దేవస్థానం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కుప్పంలోని ననియాల ఎకో టూరిజం, కంగుంది, పాలారు రివర్ ప్రాంతాల్లో అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. కాణిపాకం, బోయకొండ దేవస్థానాల్లో పర్యాటక రంగం అభివృద్ధికి, ప్రసాదం స్కీంకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్టు వెల్లడించారు. -
500 గ్రాముల గంజాయి స్వాధీనం
నగరి : మండలంలోని వెంగన్నకండ్రిగ వద్ద 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు సీఐ విక్రమ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. గురువారం ఉద యం గంజాయి తరలిస్తున్నట్టు సమా చారం అందింది. సిబ్బంది శేఖర్, గజేంద్ర, సత్యతో పాటు, డిప్యూటీ తహసీల్దారు మేఘవర్ణం, రెవెన్యూ సిబ్బందిని వెంటబెట్టుకొని వెంగన్నకండ్రిగ వద్ద కాపుగాసి తనిఖీలు చేపట్టగా ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్లో నగరి టౌన్ నుంచి పొదటూరు పేట వైపుగా వెళ్తున్నారు. వారిని ఆపి తనిఖీ చేయగా.. వారి వద్ద 500 గ్రాముల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. విచారణలో తమిళనాడు పొదటూరుపేట, విలాసపురం చెందిన ధనుష్(21), అతనితో పాటు ఇద్దరు మైనర్లు కరకంటాపురం గ్రామానికి చెందిన పాత నేరస్తుడు మణికంఠ అనే వ్యక్తి దగ్గర తక్కువ డబ్బులకు గంజాయి కొనుక్కొని పొదటూరు పేటకి తీసుకెళ్లి ఎక్కువ డబ్బులకు అమ్ముతున్నట్లు కనుగొన్నారు. ఈ మేరకు వారిని అదుపులోనికి తీసుకొని, వారి వద్ద నుంచి సుమారు 500 గ్రాముల గంజాయి, మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మణికంఠ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
టీడీపీ నాయకుడి తీరుపై నిరసన
గంగాధర నెల్లూరు: ఓ టీడీపీ నాయకుడి తీరుపై నిరసనకు దిగిన ఘటన మండలంలోని పాపిరెడ్డిపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. గురువారం గ్రామంలోని ఓంశక్తి ఆలయానికి అనుబంధంగా మురుగునీటి కాలువ నిర్మాణానికి సర్పంచ్, ఎంపీటీసీ సభ్యురాలు శ్రీకారం చుట్టారు. ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నేత రుషేంద్రరెడ్డి కాలువ ఏర్పాటును అడ్డుకున్నారు. దీనిపై గ్రామస్తులు నిరసనకు దిగారు. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు గ్రామంలో అభివృద్ధి పనుల చేపట్టడాన్ని ఓర్వలేక సదరు నేత ప్రభుత్వ అధికారులను అడ్డుపెట్టుకుని కాలువ పనులను అడ్డుకుంటున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. వేలంలో ఆలయ మాన్యం భూమిని దక్కించుకున్న సదరు నేత ఉద్దేశపూర్వకంగా కాలువ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషయంపై ఎంపీటీసీ సభ్యురాలు భారతి మాట్లాడుతూ తక్షణం కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి స్పందిస్తూ రెండు మూడు రోజుల్లో గ్రామసభ పెట్టి తీర్మానం చేస్తామన్నారు. అలాగే వంక పోరంబోకు భూమి అన్యాక్రాంతం అయిందని, కూటమి నాయకులు ఇచ్చిన ఫిర్యాదులను సైతం పరిశీలించి రెవెన్యూ అధికారుల డిక్లరేషన్‌తో నిర్మాణ పనులు చేపట్టకోవచ్చని తెలిపారు. -
రోగులకు మెరుగైన వైద్యం
బంగారుపాళెం: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధారాణి ఆదేశించారు. గురువారం బంగారుపాళెం సీహెచ్‌సీ, తుంబకుప్పం పీహెచ్‌సీని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని ఆదేశించారు. రోగులకు అందించే సేవల వివరాలను ఈహెచ్‌ఆర్(ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్)లో నమోదు చేయాలని సూచించారు. సస్పెక్ట్ కేసులను వైద్యాధికారి ధ్రువీకరించి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స అందించి పర్యవేక్షించాలని తెలిపారు. చంటి బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే అందించాలని తెలిపారు. డీపీఎంఓ డాక్టర్ ప్రవీణ, డాక్టర్ అనుషా పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలే లక్ష్యం ● ఏపీఈసెట్‌లో 8వ ర్యాంకు సాధించిన జీవ వెదురుకుప్పం: కొత్త ఆవిష్కరణల వైపు దృష్టి సారిస్తానని ఏపీఈసెట్ 8వ ర్యాంకర్ జీవ స్పష్టం చేశాడు. మండలంలోని సీఆర్‌కండ్రిగ దళితవాడకు చెందిన మరకాలకుప్పం దేవరాజులు, సత్తెమ్మది వ్యవసాయ కుటుంబం. వీరికి ముగ్గురు సంతానం. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరి రెండవ కుమారుడు ఎం.జీవ తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో 2024లో డీఫార్మసీ పూర్తిచేశాడు. ఈనెల 6న జరిగిన ఏపీ ఈసెట్‌లో ఫార్మసీ మెడిసిన్‌లో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. భవిష్యత్‌లో ఫార్మా ఇండస్ట్రీస్‌లో కొత్త ఆవిష్కరణలు(రీసెర్చ్) చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నట్లు జీవ పేర్కొన్నాడు. బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ చేసి పీహెచ్‌డీతో డాక్టరేట్ సాధించలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్టు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చిత్తూరు అర్బన్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. శాంతమ్మ జార్ఖండ్‌కు చెందిన గోపి(64) చిత్తూరు నగరంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. గురువారం సాంబయ్యకండ్రిగ సచివాలయ పరిసరాల్లోని ముళ్లపదల్లో ఓ వ్యక్తి స్ఫృహ తప్పి పడిపోయి ఉండడంతో స్థానికులు గుర్తించారు. పరిశీలించగా అప్పటికే ఆ వ్యక్తి చనిపోయి ఉన్నట్టు తెలుసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మహిళ అదృశ్యం పాలసముద్రం : మండలంలోని పాలసముద్రం పంచాయతీకి చెందిన ఓ మహిళ అదృశ్యమైనట్టు ఆమె కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం నుంచి కనబడడం లేదని పేర్కొన్నట్టు ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు 9440900687 నంబర్‌కి ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆయన కోరారు. -
చిత్తూరులో మెడికల్‌షాపు సీజ్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ మెడికల్ షాపును సీజ్ చేసి.. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన గురువారం చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. అక్రమంగా లింగ నిర్థారణ చేస్తున్న ముఠాను కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అక్రమ నిర్వాహకులను పోలీసులకు అప్పగించారు. ఆపై పోలీసు విచారణను ముమ్మరం చేశారు. విచారణలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా డ్రగ్స్ కంట్రోల్ ఏడీ హరిప్రసాద్ రంగంలోకి దిగారు. పొన్నియమ్మ గుడివీధిలోని మెడికల్ షాపులపై మెరుపుదాడులు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టుబడ్డ మహిళల్లో చిత్తూరుకు చెందిన సునీత, తేజేశ్వరి ఉన్నారన్నారు. సునీత అనే మహిళకు పొన్నియమ్మ గుడివీధిలోని వినోద్ మెడికల్ షాపు, సుధా మెడికల్ షాపుకు సంబంధాలున్నాయని తెలిపారు. వినోద్ మెడికల్ షాపు నిర్వాహకుడు వినోద్ సునీత భర్తన్నారు. ఈ షాపును భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కొన్నేళ్లుగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఈ షాపులో గాలించగా అబార్షన్ల కిట్లు గుర్తించామన్నారు. అలాగే వాడిన కిట్లు కూడా దొరికాయన్నారు. పెయిన్ కిలర్స్ ముందులు లభ్యమైనట్టు తెలిపారు. అంతకు ముందు చిరంజీవి అనే వ్యక్తి ఈ షాపును నడిపాడన్నారు. అతన్ని కూడా విచారించామన్నారు. డ్రగ్స్ అధికారులకు ఎలాంటి అనుమతి లేకుండా చిరంజీవి, వినోద్‌కు ఈ షాపు అప్పగించినట్లు తెలుసుకున్నామన్నారు. దీంతో వినోద్, చిరంజీవిపై కేసు నమోదు చేయడంతో పాటు షాపును సీజ్ చేసినట్టు వెల్లడించారు. సుధా మెడికల్ షాపులో కూడా తనిఖీలు చేపట్టామన్నారు. ఈ షాపులో మందులు, మాత్రల విక్రయాలకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేవన్నారు. ఇక శ్రుంగార సామార్థ్యాన్ని పెంచే మాత్రలు బయటపడ్డాయన్నారు. వాటి విక్రయాలకు సంబంధించిన బిల్లులు లేవని, త్వరలో నోటీసులు ఇచ్చి తగు చర్యలు తీసుకంటామని ఆయన పేర్కొన్నారు. -
ఖాళీల గుర్తింపునకు కసరత్తు
● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీచర్ల ఖాళీలకు కుస్తీ ● ఇప్పటి వరకు 7 వేల పోస్టులు గుర్తింపు చిత్తూరు కలెక్టరేట్ : పాఠశాలలు పున:ప్రారంభమయ్యేలోపు టీచర్ల ఉద్యోగోన్నతులు, బదిలీలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. త్వరలో టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల చేయనుండడంతో ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వేసవి సెలవుల్లో కుటుంబీకులకు దూరంగా ఉంటూ కసరత్తు చేస్తున్నా ఉన్నతాధికారుల నుంచి ఛివాట్లు తప్పడం లేదని విద్యాశాఖ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా కుస్తీ గత వారం రోజులకు పైగా చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని బదిలీల కసరత్తు నిర్వహిస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్ 2 హెచ్ఎంలు ఒకే పాఠశాలలో ఐదేళ్లు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు, ఎస్జీటీలు ఎనిమిదేళ్లు ఒకే చోట పనిచేస్తే విధిగా బదిలీ కావాల్సి ఉంటుంది. వీరితో పాటు మిగిలిన టీచర్లు, హెచ్ఎంలు ఐచ్ఛిక బదిలీకి దరఖాస్తులు చేసుకోవచ్చు. జిల్లాలో కచ్చితంగా బదిలీ కావాల్సిన గ్రేడ్–2 హెచ్ఎంలు, ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు 4,478 మంది వరకు ఉన్నారు. 7 వేల ఖాళీల గుర్తింపు కసరత్తులో ఈ నెల 15వ తేదీ వరకు 7 వేల పోస్టుల వరకు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. క్లియర్ వెకెన్సీలు 1,500, ఎనిమిది, ఐదేళ్లు పూర్తయిన ఖాళీలు 3 వేలు, సర్ప్లస్, కొత్త పోస్టులు 500, పాఠశాలల పున:వ్యవస్థీకరణ కసరత్తులో కొత్తగా, సర్ప్లస్, బదలాయింపు పోస్టులు 2 వేలు మొత్తం 7 వేల వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గుర్తించినట్లు విద్యాశాఖ అధికారులు సూచించారు. ఈ ఖాళీల సంఖ్య కసరత్తు పూర్తి అయ్యే సరికి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమాచారం క్లియర్ ఖాళీ పోస్టులు: 1,500 8/5 సంవత్సరాలు పూరైన పోస్టులు: 3,000 సర్ప్లస్, కొత్త పోస్టులు: 500 పున:వ్యవస్థీకరణలో గుర్తించిన పోస్టులు: 2,000 ఇప్పటి వరకు గుర్తించిన ఖాళీ పోస్టులు: 7,000 పకడ్బందీగా కసరత్తు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సూచించిన ప్రకారం బదిలీలు, ఉద్యోగోన్నతుల కసరత్తు పకడ్బందీగా చేపడుతున్నాం. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోస్టుల ఖాళీల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశాం. – వరలక్ష్మి, డీఈవో, చిత్తూరు -
కాపుగాసి..
రోగులకు మెరుగైన వైద్యం ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి సుధారణి ఆదేశించారు. చిత్తూరు మార్కెట్లో ధరలు రకం కిలో ధర రూ. బెనీషా : 30 చందూర : 11-20 అల్పోన్సో : 25 తోతాపురి : 8 రాలిపోయిన తోతాపురి : 4-6 తమిళనాడు క్రిష్ణగిరి మార్కెట్లో.. రకం కిలో ధర రూ. తోతాపురి : 10-15 బెనీషా : 30-35 చందూర : 15-25 అల్పోన్సో : 30 రాలిపోయిన తోతాపురి : 8 పకడ్బందీగా పది సప్లిమెంటరీ ...‘ఆడ’నే చంపేస్తాం! చిత్తూరు నగరం లింగనిర్ధారణకు అడ్డాగా మారింది. అధికారుల మధ్య సమన్వ యలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. శుక్రవారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2025జిల్లాలో కూటమికి చెందిన గుజ్జు పరిశ్రమలు మామిడి రైతులకు షాకిస్తున్నాయి. అధిక ధరకు కాయలు కొనుగోలు చేసి తక్కువ ధరకు తెచ్చినట్టు విషప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం కోత దశకు వచ్చిన కాయలను కూడా తక్కువ ధరకే కొనుగోలు చేయాలని కుయుక్తులు పన్నుతున్నాయి. ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లోని రేట్లను బూచీగా చూపి రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. రోజురోజుకీ మామిడి ధరలు తగ్గించేస్తూ అన్నదాతను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ఈ విషప్రచారంపై కూటమి ప్రభుత్వం స్పందిస్తుందో.. లేదా రైతులను నట్టేట ముంచేసి నేతలకు వత్తాసు పలుకుతుందో వేచి చూద్దాం మరి! చిత్తూరు రూరల్(కాణిపాకం): జిల్లాలో 56 వేల హెక్టార్ల మేర మామిడి సాగవుతోంది. మొత్తం 54,7320 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చేది. అయితే ఈ సారి అన్ని రకాలు కలిపి 6,45,234 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి రావొచ్చని అధికారుల అంచనా. ఇందులో టేబుల్ రకం 16,105 హెక్టార్లకు గాను 1,45,960 మెట్రిక్ టన్నులు, తోతాపురి 39,895 హెక్టార్లకు 6,45,234 టన్నుల వరకు రావొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం టేబుల్ రకాలు కోతకొచ్చాయి. కాయలు కోసి రైతు మార్కెట్‌కు చేరుస్తుండగా.. అక్కడి రేట్లు చూసి దిగాలు చెందుతున్నారు. భారీగా దిగుమతి గత నెల నుంచి జిల్లాలో కొన్ని గుజ్జు పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. కేరళ నుంచి అల్పోన్సో రకం కాయలను దిగుమతి చేసుకుని గుజ్జు తయారీని ప్రారంభించాయి. మొదట్లో రోజుకు 90 టన్నుల వరకు దిగుమతి చేసుకునేవి. ఇప్పుడు ఈ రకం కాయలు 150 టన్నులకు పైగా దిగుమతి చేసుకుయింటున్నాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి తోతాపురి రకం కాయలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించాయి. అక్కడ రాలిపోయిన కాయలను కూడా వదలడం లేదు. విజయవాడలో తోతాపురి కేజీ రూ.11కు కొనుగోలు చేసి ఇక్కడ రూ.7, రూ.8కే కొనుగోలు చేశామని కొన్ని గుజ్జు పరిశ్రమలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇదంతా కూటమి పార్టీకి చెందిన పరిశ్రమదారులు చేస్తున్న విషప్రచారమేనని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రైతుల కష్టాన్ని జ్యూస్‌లాగా పిండేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రికి మంచి ఆఫర్ ఇచ్చి మామిడి ఫలాన్ని దోచుకునేందుకు కుట్రపన్నినట్టు చెబుతున్నారు. రైతుల్లో గుబులు గతంలో కంటే ఈసారి మామిడి దిగుబడి పర్వాలేదనిపిస్తోంది. కొన్ని చోట్ల మంచి దిగుబడి కూడా వస్తోంది. కాయలు కూడా నాణ్యవంతంగా ఉన్నాయి. టేబుల్ రకాలతోపాటు తోతాపురి కూడా మంచి సైజు వచ్చింది. తోతాపురి పది రోజుల్లో కోత కోసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో మామిడి ధరలు ఆరంభంలోనే తగ్గించేయడంతో పలువురు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మరో వైపు పల్ప్ ఎగుమతుల ప్రభావం, యుద్ధాలు, బ్యాంకు రుణాలు, ఇతరత్రా సమస్యలను సాకుగా చూపిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్మామిడి రైతులను అయోమయానికి గురిచేస్తున్న గుజ్జు పరిశ్రమలు బయట మార్కెట్లో తక్కువ ధరకు తెచ్చినట్టు విష ప్రచారం అదే ధరకు ఇక్కడి కాయలు కొనుగోలు చేయాలని పన్నాగం కోతకు రాకముందే కూటమి నేతల కొత్త ప్రయోగం గందరగోళానికి గురవుతున్న అన్నదాతలు జిల్లా సమాచారం మామిడి హెక్టార్లు దిగుబడి అంచనా రకం మెట్రిక్ టన్నుల్లో తోతాపురి 39,895 49,9274 నీలం 5,818 64,991 అల్పోన్సో 3,127 26,404 బేనీషా 3,895 28,867 మల్లిక 1,740 13,919 ఇతర రకాలు 1,526 11,779 అన్యాయం చేయొద్దు ఎకరాకు పైగా మాకు మామిడితోట ఉంది. అప్పు చేసి ప్రతిసారీ పంటను కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ సారి పంట బాగానే వచ్చింది. గాలీవానకు కొంత నష్టమైంది. ఉన్న పంటను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నాం. ఈ సమయంలో రేట్లు తగ్గించేయడం విడ్డూరంగా ఉంది. ధర నిర్ణయం విషయంలో రైతులకు మేలు చేకూరాలి. ఆ రకంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. –వెంకటేష్, ఎస్ఆర్పురం మండలం రైతులకు గిట్టుబాటయ్యేలా చూస్తాం తోతాపురి రకం కోతకొచ్చేందుకు 10, 15 రోజులు పడుతుంది. బయట జిల్లాలకు సంబంధించిన కాయలను కొనకూడదని ఫ్యాక్టరీ యజమానులకు చెప్పాం. వాళ్లు కూడా సహకరిస్తున్నారు. ఈ సారి దిగుబడి, నాణ్యత బాగుంది. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తాం. రైతులను ఇబ్బంది పెట్టించాలని చూస్తే కచ్చితంగా చర్యలు చేపడుతాం. – మధుసూదన్ రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, చిత్తూరు -
అభివృద్ధిని విస్మరించి!
హామీలు అటకెక్కించి.. ఎన్నికల హామీలు నెరవేర్చని చంద్రబాబు ● అక్రమ వ్యాపారాలే కూటమి ప్రభుత్వ అజెండా ● కుప్పానికి రూ.1200 కోట్ల పనులు ఎక్కడ? ● ఏడాది పాలనపై కుప్పం ఎమ్మెల్సీ భరత్ ధ్వజం కుప్పం: ‘ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలతో రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను ఒక్కటీ అమలు చేయలేదు.. విద్య, వైద్యం అందక పేదలు అల్లాడిపోతున్నారు. తన సొంత ని యోజకవర్గం కుప్పంలో అభివృద్ధి జాడేలేదు. సమయం వచ్చినప్పుడు ప్రజలు కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని కుప్పం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏడాది పాలనపై ఆయన గళం ఇప్పారు. ఇంకా ఏమన్నారంటే..! తుస్‌మన్న సూపర్ సిక్స్ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయకపోగా, వాటిపై ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనని చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. తన స్వార్థం కోసం దేవుళ్లను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. ప్రశ్నిస్తే కేసులు బనాయిస్తారని భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. ఎక్కడ చూసినా అక్రమాలు, అక్రమార్జనే టీడీపీ ఎజెండాగా మారిపోయింది. విచ్చలవిడిగా దోచుకుతింటున్నారే తప్ప ఏమాత్రం ప్రజలను పట్టింకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని పక్కనబెట్టేశారు. అమరావతిని భుజాన వేసుకుని ప్రజల నోరుకొడుతున్నారు. రూ.1,200 కోట్లు ఏమయ్యాయి? కుప్పం నియోజకవర్గ అభివృద్ధి కోసం కూట మి ప్రభుత్వం రూ.1,200 కోట్లు మంజూరు చేసినట్టు జబ్బలు చరుస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. వైఎస్సార్సీపీ హయాంలో వేసిన మురుగునీటి కాలువలు, రోడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసింది శూన్యమే. ని యోజకవర్గంలో బియ్యం, ఇసుక, గ్రానైట్ అక్రమ వ్యాపారాలు మితిమీరుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ టీడీపీ నాయకులు దోచుకుతింటున్నారు. గతంలో విమానాశ్రయం కోస 1,500 ఎకరాలు స్వాధీనం చేసుకుని ఒక్క పనీ చేపట్టలేదు. ప్రస్తుతం అధనంగా పారిశ్రామిక కారిడార్ నిర్మాణం అంటూ రైతుల వద్ద నుంచి వ్యవసాయ భూములను లాక్కున్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో భూములు కోల్పోయి చాలా మంది రోడ్డునపడ్డారు. పారిశ్రామక కారిడార్ పేరిట భూములు లాక్కునే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం. కుప్పంలో శ్రుతిమించుతున్న టీడీపీ ఆగడాలు కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రామ కుప్పం ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నా ప్రలోభాలు పెట్టి ఆరుగురు ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకున్నారు. అడ్డదారిలో ఎంపీపీ పీఠాన్ని కై వసం చేసుకున్నారు. అదేవిధంగా కుప్పం మున్సిపాలిటీలోనూ వైస్సార్సీపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నా కౌన్సిలర్లను ప్రలోభాలు, భయభ్రాంతులకు గురిచేసి తమ వైపుకు తిప్పుకున్నారు. ఈ రెండు ఎన్నికల్లోనూ దొడ్డిదారిన టీడీపీ గెలిచినా నైతిక విజయం మాత్రం వైఎస్సార్సీపీదే. -
డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : ఎస్పీకేఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీకేఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో 53 సీట్లు, తమిళనాడు రాష్ట్రం సేలంలో 12, కర్ణాటక రాష్ట్రం గడగ్‌లో 2 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. సంబంధిత శిక్షణ కేంద్రాల్లో మూడేళ్ల పాటు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఈ శిక్షణలో చేరదలిచిన వారు 10వ తరగతి, తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు. బీసీ, జనరల్ కేటగిరిలో జూలై 1వ తేదీ నాటికి 15 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు, ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. మూడేళ్ల కోర్సులో ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఒకేషనల్ (టెక్స్టైల్స్), ఐటీఐ (రెండేళ్లు) కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు నేరుగా డిప్లొమా ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు www.iihtvgr.com వెబ్సైట్లో పరిశీలించాలని కలెక్టర్ కోరారు. ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం తనిఖీ శ్రీరంగరాజపురం : మండలంలోని వెలుగు కార్యాలయంలో నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని డీఆర్డీఏ అధికారి శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పంచడానికి ఈ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. మహిళలకు ఉచిత టైలరింగ్, ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఆమె వెంట ఎంపీడీఓ మోహన్‌మురళి, ఏపీఎం రోజా, టైలరింగ్ శిక్షణ అధికారి గీతాకుమారి, భాను పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయ లక్ష్యం రూ.980.17 కోట్లు చిత్తూరు కార్పొరేషన్: రిజిస్ట్రేషన్ శాఖ చిత్తూరు, తిరుపతి జిల్లాల 2025–26 ఆదాయ లక్ష్యం రూ.980.17 కోట్లుగా నిర్ణయించినట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ గిరిబాబు తెలిపారు. ఆయన గురువారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడారు. తిరుపతి జిల్లా వార్షిక ఆదాయ లక్ష్యం రూ.762 కోట్లని తెలిపారు. అందులో అత్యధికంగా రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి రూ.153 కోట్లు, అత్యల్పంగా చిన్నగొట్టిగల్లు కార్యాలయానికి రూ.6.73 కోట్లు లక్ష్యంగా పెట్టినట్టు తెలిపారు. చిత్తూరు జిల్లాలో రూ.218.17 కోట్లు లక్ష్యం కాగా అత్యధికంగా చిత్తూరు అర్బన్ (ఆర్వో) సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి రూ.77.79 కోట్లు, అత్యల్పంగా కార్వేటినగరం కార్యాలయానికి రూ.10.88 కోట్లుగా నిర్దేశించినట్టు వెల్లడించారు. గత సంవత్సరం తిరుపతి జిల్లా ఆదాయ లక్ష్యం రూ.626 కోట్లు కాగా రూ.521 కోట్లు వచ్చిందన్నారు. చిత్తూరు జిల్లా లక్ష్యం రూ.181.78 కోట్లు కాగా రూ.144.50 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. 19న వైస్ ఎంపీపీ ఎన్నిక తవణంపల్లె: తవణంపల్లె మండల వైస్ ఎంపీపీ ఎన్నిక కోసం ఈనెల 13న నోటిఫికేషన్ జారీ చేసినట్లు స్థానిక ఇన్చార్జి ఎంపీడీఓ, అసిస్టెంట్ ఎన్నికల అధికారి రాఘవేంద్రరాజు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డీపీఓ సుధాకర్ పర్యవేక్షణలో ఈనెల 19న సోమవారం ఉదయం 11 గంటలకు చేతులు ఎత్తే పద్ధతిలో తవణంపల్లె మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని 15 ఎంపీటీసీలకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. మండలంలో మొత్తం 14 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు ఉండగా.. ఒకరు టీడీపీ ఎంపీటీసీ ఉన్నారు. వైస్ ఎంపీపీ ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. -
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 35 పరీక్ష కేంద్రాల్లో నాల్గవ రోజు గురువారం ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా సాగినట్లు డీఐఈవో డా.ఆదూరు శ్రీనివాసులు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం నిర్వహించిన మొదటి సంవత్సర పరీక్షకు జనరల్ విభాగంలో 5,767 మందికిగాను 5,572 మంది విద్యార్థులు హాజరు కాగా 195 మంది గైర్హాజరయ్యారని, వొకేషనల్ విభాగంలో 286 మందికిగాను 259 మంది హాజరుకాగా 27 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం జనరల్ పరీక్షలో 910 మందికి గాను 869 మంది, వొకేషనల్ విభాగంలో 112 మందికి గాను 103 మంది హాజరైనట్టు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పీసీఆర్ జనరల్, ఒకేషనల్ కళాశాలలను తనిఖీ చేయగా, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు దయానందరాజు, బాలసుబ్రహ్మణ్యం, శరత్చంద్రశేఖర్ ఆయా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని వెల్లడించారు. -
TTD: తిరుమలలో సిఫారసు లేఖల పునరుద్ధరణ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 14 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు. బుధవారం అర్ధరాత్రి వరకు 74,020 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,190 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.27 కోట్ల ఆదాయం వచ్చింది. టికెట్లు లేని వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన భక్తులను అనుమతించమని వెల్లడించింది. ఏపీ, తెలంగాణ నేతల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు తాత్కాలిక నిర్ణయం: టిటిడితిరుమల, 2025, మే 13: తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు మాత్రమే తాత్కాలికంగా టిటిడి నిర్ణయం తీసుకుంది.ఈ నెల 15వ తేదీ నుండి సదరు నేతల సిఫార్సు లేఖలను మాత్రమే టిటిడి అనుమతించనుంది. అయితే మిగిలిన వారి సిఫార్సు లేఖల పై అంతకు ముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది . నియమావళి ప్రకారం అనుమతి పొందిన భక్తులకు ఈ నెల 16వ తేదీ నుండి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. -
సేవల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు 21వ ర్యాంకు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు, మాతా శిశు ఆరోగ్యం తదితర 11 అంశాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు రాష్ట్రంలో 21వ ర్యాంకు వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి తెలిపారు. 11 అంశాల్లోనూ గ్రీన్ మార్క్‌లోనే ఉన్నామన్నారు. ఇందుకు గాను 76.6 మార్కులు వచ్చాయన్నారు. మరింతగా వైద్య సేవలను విస్తృతం చేసి జిల్లాకు మంచిపేరు తీసుకొస్తామని ఆమె పేర్కొన్నారు. నెమళ్ల మృత్యుగీతం – రైల్వే విద్యుత్ లైన్లకు తగిలి పడిపోతున్న వైనం కుప్పం రూరల్ : కుప్పం మండలం, పెద్దబంగారునత్తం పరిసరాల్లో నెమళ్లు రాలిపోతున్నాయి. పెద్దబంగారునత్తం సమీపంలోని మార్వాడ సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద నెమళ్లు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఆహారం కోసం అక్కడి నుంచి రైల్వే ట్రాక్ దాటుకుని ఇటువైపు పొలాల్లోకి వస్తున్నాయి. బెంగళూరు – చైన్నె రైల్వే లైన్ దాటుకుని రావాల్సి ఉంది. ఈ క్రమంలో నెమళ్లు రైల్వే విద్యుత్ లైన్లకు తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడుతున్నాయి. నిత్యం ఒకటి రెండు నెమళ్లు పడిపోయి దర్శనమిస్తున్నాయి. నిత్యం నెమళ్లు రైల్వే ట్రాక్‌పై పడిి ఉండడాన్ని చూసి స్థానికుల మనసు కలిచి వేస్తోంది. అటవీశాఖ అధికారులు అయినా నెమళ్లు ఇటు వైపుకు రాకుండా చూడాలని కోరుతున్నారు. అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లిలోని ఐసీడీఎస్ చిత్తూరు రూరల్ ప్రాజెక్టు పరిధిలోని మూడు అంగన్వాడీ పోస్టులకు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ శ్యామ్సుగుణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు నగర పరిధిలోని జాన్సన్ గార్డెన్లో మినీ అంగన్వాడీ కార్యకర్త, లెనిన్ నగర్లో సహాయకురాలు, గుడిపాల మండలంలోని రామభద్రపురంలో సహాయకురాలు పోస్టు ఖాళీలున్నాయన్నారు. వీటిని భర్తీ చేసేందుకు ఈనెల 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని, 24వ తేదీ సాయంత్రంతో స్వీకరణ ముగుస్తుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను పూర్తి చేసి కొంగారెడ్డిపల్లి ప్రాంతంలోని చిత్తూరు ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. వేరుశనగ విత్తన కేటాయింపు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలోని వ్యవసాయశాఖ డివిజన్ల వారీగా వేరుశనగ విత్తన కేటాయింపు చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా జిల్లాకు 60 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కావాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ప్రభుత్వం 25977.6 క్వింటాళ్ల కాయలను కేటాయించింది. అధికారులు వ్యవసాయశాఖ డివిజన్ వారీగా కేటాయింపు చేశారు. చిత్తూరు డివిజన్‌కు 8540.4, నగరికి 2421.0 క్వింటాళ్లు, పుంగనూరుకు 7941.0 క్వింటాళ్లు, పలమనేరుకు 7075.5 క్వింటాళ్ల మేర కేటాయించినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. కాగా ఇంత వరకు వేరుశనగ విత్తన రాయితీ ధర నిర్ధారణ కాలేదని తెలుస్తోంది. మెరుగైన వైద్య సేవలందించాలి కార్వేటినగరం : సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కత్తెరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి మాట్లాడుతూ.. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి దీర్ఘకాలిక రోగులను గుర్తించి వారికి కావాల్సిన మందులను అందించాలని ఆదేశించారు. అలాగే కుష్ఠు, ఆస్త్మా రోగులను ముందుస్తుగా గుర్తించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా ఇమ్యునైజేషన్‌కు సంబంధించిన యూ–విన్ పోర్టల్‌ను ఓపెన్ చేసి పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వర్షాలకు ఉరుస్తుందని సిబ్బంది అధికారి దృషికి తీసుకెళ్లడంతో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో మరమ్మతులు చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాఽధికారులు, సిబ్బంది, ఆశా వర్కర్లు పలువురు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమి.. అడిగేదెవరు
కార్వేటినగరంలో రూ.ల క్షలు విలువ జేసే ప్రభుత్వ భూమిని కూటమి నేతలు దర్జాగా ఆక్రమిస్తున్నారు.వన మహోత్సవం చిత్తూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో ఎస్వీ అగ్రికల్చర్ విద్యార్థులు వన మహోత్సవాన్ని నిర్వహించారు.గురువారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2025చిత్తూరు రూరల్ (కాణిపాకం) : పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటున్న కొందరు ప్రబుద్ధులు డబ్బుకు దాసోహమవుతున్నారు. కాసుల కక్కుర్తికి కడుపులోని ఆడబిడ్డలను కడతేరుస్తున్నారు. లింగ నిర్ధారణ నేరమని చెప్పాల్సిన వైద్యులే ముఠాలుగా ఏర్పడి అక్రమ దందాకు పాల్పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలకు ఒడిగడుతున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. కడుపులోనే చిదిమేస్తున్నారు. జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు గుట్టుగా చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి పలు స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రి నిర్వాహకులు, వారి సహాయకులు కడుపులో పెరుగుతోంది ఆడబిడ్డా, మగబిడ్డా అనేది ప్రసవానికి ముందే నిర్ధారిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో బాలురతో పోలిస్తే బాలికల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తేలితే వెంటనే అబార్షన్లు చేయించడంతో బాలికల సంఖ్య క్రమేణా తక్కువగా ఉంటోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా ఈ ఏడాది కాలంలో 28,584 మంది జన్మిస్తే 15,212 మంది మగపిల్లలు, 13,372 మంది ఆడ పిల్లలు జన్మించారు. సరిహద్దు ప్రాంతాలు చిత్తూరు వైపు... జిల్లాలో స్కానింగ్ సెంటర్లు నడుపుతున్న కొందరు తల్లి గర్భంలోనే మరణ శాసనం లిఖిస్తున్నారు. ప్రధానంగా చిత్తూరు, పలమనేరు, నగరి, కుప్పం తదితర ప్రాంతాల్లోని స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఆర్ఎంపీలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యుల సహాయకులు స్కానింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ వివరాలు వెల్లడిస్తున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి పక్క రాష్ట్రానికి కూడా పాకింది. తమిళనాడు, కర్ణాటక నుంచి వందల సంఖ్యలో గర్భిణులు లింగ నిర్ధారణ కోసం జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఆడ అయితే శుక్రవారం, అమ్మవారి పేర్లు, అమ్మవారి చిత్రపటాలు చూపించడం, డాక్టరమ్మ, మైనస్, వంటి పదాలతో సూచిస్తున్నారు. మగబిడ్డ అయితే సోమవారం, ప్లస్, దేవుడి బొమ్మలు చూపి లింగ నిర్ధారణ విషయాలను బయటపెడుతున్నారు. ఇష్టారీతిగా అబార్షన్లు జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో దావాఖానల నిర్వాహకులు ఇష్టారీతిగా అబార్షన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వివాహేతర సంబంధాల వల్ల గర్భందాల్చిన మహిళలు, ఇతర కారణాలతో మరికొందరు అబార్షన్లకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గర్భిణులు ఆరోగ్యపరంగా తప్పనిసరి పరిస్థితుల్లో అబార్షన్లు చేయించుకుంటే వైద్యాధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాల్సి ఉండగా, నిబంధనలను పట్టించుకోవడం లేదు. దీనిపై అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు ఆడబిడ్డ అయితే కడుపులోనే చిదిమేస్తున్న వైనం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గర్భిణులు చిత్తూరుకు.. తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పలుమార్లు ఫిర్యాదులు పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జిల్లాలో స్కానింగ్ సెంటర్ వివరాలు మొత్తం స్కానింగ్ సెంటర్లు 78 చిత్తూరు 37 పలమనేరు 22 కుప్పం 14 నగరి 05జిల్లాలో జననాల సంఖ్య సంవత్సరం మగపిల్లలు ఆడపిల్లలు 2021-22 15,703 14,182 2022-23 15,061 14,186 2023-24 15,212 13,372 అమ్మగా .. అక్కగా..చెల్లిగా..అర్ధాంగిగా.. అనేక పాత్రల్లో చెయ్యి పట్టి నడిపించే ఆడబిడ్డకు ఆపదొచ్చింది.. ఆడపిల్ల భారమనుకొని కడుపులోనే మరణ శాసనం లిఖిస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడుతున్న కొందరు వైద్యులు , స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో పసి మొగ్గలను కడుపులోనే చిదిమేస్తున్నారు. ఇందు కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.. డబ్బులు ముట్టజెబితే జిల్లాలోని పలు స్కానింగ్ కేంద్రాల్లో సులువుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి పుట్టబోయేది.. ఆడ..మగ ప్రసవానికి ముందే వెల్లడిస్తుండడంతో సరిహద్దు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున లింగ నిర్ధారణ పరీక్షలకు జిల్లాకు తరలివస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. నిబంధనలు ఇవీ.. కడుపులో పెరుగుతున్న బిడ్డకు జన్యుపరమైన లోపాల కోసం, శిశువు పెరుగుదల ఎలా ఉందో తెలుసుకునేందుకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలి. కడుపులోని బిడ్డ ఆడ, మగ ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదు. లింగ నిర్ధారణకు సహకరించిన వారికి 3 నెలల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి ఇదే తప్పు చేసిన వారికి అయిదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించే అవకాశం ఉంది. వైద్యులు దోషులుగా తేలితే లైసెన్స్‌ను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సిఫార్సు చేసి అనుమతి రద్దు చేసే అవకాశం ఉంది. గర్భంలోని శిశువుకు లింగ నిర్ధారణ చేయమని కోరినా మూడేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టాల్సిన అవసరం ఉంది. కాగా ఈ అక్రమ లింగ నిర్ధారణపై సాక్షిలో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. చిత్తూరు నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ లింగ నిర్ధారణ కేంద్రాన్ని కలెక్టర్ సుమిత్‌కుమార్ బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని గుట్టును రట్టు చేశారు. ఆస్పత్రి వివరాలు ఇలా.. జిల్లా ఆస్పత్రి 01 ఏరియా ఆస్పత్రులు 04 సీహెచ్‌సీలు 08 పీహెచ్‌సీలు 50 అర్బన్ హెల్త్ సెంటర్లు 15 ప్రైవేటు ఆస్పత్రులు 1,500 ఆర్ఎంపీలు 2,000 లింగ నిర్ధారణ చేస్తే చర్యలు : కలెక్టర్ చిత్తూరు రూరల్ (కాణిపాకం) : గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని అటువంటి పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. బుధవారం చిత్తూరు నగరం లోని 9వ వార్డు భరత్ నగర్ కాలనీ నందు ఒక ప్రైవేటు ఇంట్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి వచ్చిన వారిని డెకాయిట్ ఆపరేషన్‌లో భాగంగా గుర్తించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు వచ్చిన 9 మందిని గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో గర్భస్థ లింగ నిర్ధారణ చేసే సంబంధిత పరికరాలను, ఇంటిని సీజ్ చేసి కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిర్వహించడం చట్టరీత్యా నేరమని తెలిసినా కూడా ఇలా చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరాలే ఆసరాగా.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట విరుద్ధ్దమని బోర్డులు ప్రదర్శిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పలువురు అర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులు, ఆశా కార్యకర్తలు, కొంత మంది వ్యక్తులను నియమించుకొని పలువురు లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దంపతుల అవసరాలను ఆసరాగా చేసుకొని దాదాపు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పరీక్షల కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తొలి కాన్పులో ఆడపిల్ల పుట్టి రెండు, మూడోసారి గర్భందాల్చిన మహిళలు లింగ నిర్ధారణకు అధికంగా వస్తున్నారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
చౌడేపల్లె : వైఎస్సార్సీపీ, మమ్మలను నమ్ముకొన్న కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం..ఎవరూ అధైర్యపడకండి అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం చౌడేపల్లె మండల పర్యటనలో భాగంగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకొంటున్న పార్టీ కార్యకర్త బయ్యప్పల్లెకు చెందిన జగ్జీవన్రెడ్డిను పెద్దిరెడ్డి పరామర్శించారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో పార్టీ కోసం సైనికుల్లా పనిచేస్తున్న కార్యకర్తలు, నేతలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పడిన కష్ట నష్టాలు తెలుసని రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట చిత్తూరు మాజీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు దామోదరరాజు, వైస్ ఎంపీపీలు నరసింహులు యాదవ్, సుధాకర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, మాజీ సింగిల్ విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి తదితరులున్నారు. కార్యకర్తలు, నేతలతో ఆత్మీయ పలకరింపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
కూటమి ప్రభుత్వంలో దళితులకు అన్యాయం
కార్వేటినగరం : కూటమి ప్రభుత్వంలో దళితులకు న్యాయం కరువైందని మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి పేర్కొన్నారు. బుధవారం తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి దళితులను అణగదొక్కడమే లక్ష్యంగా వ్యవహరిస్తారని ఆరోపించారు. చంద్రబాబు గత చరిత్ర చూస్తే చుండూరు, కారంచేడు ఘటనలు మరవక ముందే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒక దళిత గ్రామాన్నే వెలివేయడం దారుణం అన్నారు. ఇంత జరుగుతున్నా అగ్ర కులస్తులపై కూటమి ప్రభుత్వం ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇటీవల శ్రీరంగరాజపురం మండలం పుల్లూరు దళితవాడ ప్రజలు టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతో దళిత గ్రామంలో అగ్రవర్ణ కులస్తులు విరుచుకుపడి ఇళ్లను, ఇంట్లోని విలువైన వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా.. దళితులకు ఏసీలు, కూలర్లు, ప్రిజ్‌లు అవసరమా అంటూ దుర్బాషలాడుతూ ధ్వంసం చేశారన్నారు. ఇంత జరిగినా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అడుగడుగునా దళితులకు అవమానం తప్పడం లేదని ఆరోపించారు. దళితులు ఆర్థికంగా, రాజకీయంగా అధికారకంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన తెలిపారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
శాంతిపురం : మండలంలోని కడపల్లి పంచాయతీ శివపురంలో నిర్మించిన సీఎం చంద్రబాబు నివాసాన్ని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం పరిశీలించారు. ఈనెల 25న ఇక్కడ గృహ ప్రవేశం కోసం సీఎం వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఎస్పీ పర్యటించారు. ఇంటిని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీఎం పర్యటన రూట్ మ్యాప్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఫైర్ సేఫ్టీ, అంబులెన్స్, పార్కింగ్ తదితర సౌకర్యాల ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్లపై స్థానిక పోలీసులు, ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుప్పం డీఎస్పీ పార్థసారధి, రూరల్, అర్బన్ సీఐలు మల్లేష్ యాదవ్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు 250 మెట్రిక్ టన్నుల దాణా చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాకు 250 మెట్రిక్ టన్నుల పశువుల దాణా కేటాయింపు జరిగిందని, వారంలో రోజుల్లో పంపిణీ ప్రారంభిస్తామని జిల్లా పశుసంవర్థకశాఖ జేడీ అరీఫ్ తెలిపారు. ఇందులో భాగంగా 31 మండలాల నుంచి కావాల్సిన రైతు వివరాలను సేకరిస్తున్నామన్నారు. దాణా పూర్తి ధర రూ.22 అయితే పాడి రైతుకు 50 శాతం రాయితీతో రూ. 11 అందిస్తామని పేర్కొన్నారు. ఈనెల 17కు హుండీ లెక్కింపు చిత్తూరు రూరల్(కాణిపాకం) : కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీ లెక్కింపు వాయిదా వేసినట్లు ఈఓ పెంచల కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం జరగాల్సిన ఈ లెక్కింపు ఈనెల 17వ తేదీకి వాయిదా వేశామన్నారు. భక్తులు, ఆలయ అధికారులు, సిబ్బంది ఈ విషయాన్ని గమనించాలని ఆయన పేర్కొన్నారు. -
వాహనాన్ని ఢీకొని కారు దగ్ధం
తవణంపల్లె : స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం స్పీడ్ బ్రేకర్ వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని కారు ఢీకొంది. దీంతో కారులో హఠాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. మంటలను ఆర్పేందుకు స్థానికులు, పోలీసు సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా.. తిరుపతికి చెందిన తేజ, మరో వ్యక్తితో కలిసి టి.పుత్తూరులో గంగ జాతరకు విచ్చేశారు. ఉత్సవాలను ముగించుకొని తిరిగీ ఇంటికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో తవణంపల్లె పోలీస్ స్టేషన్ ఎదుట స్పీడు బ్రేకర్ వద్ద రెండు వాహనాలు మెల్లగా దాటుతుండగా వెనుక వైపు నుంచి వచ్చిన కారు ఐషర్ వాహనాన్ని ఢీకొంది. దీంతో కారులో ఉన్న ఇద్దరు బయటకు దిగేశారు. కొంత సేపటికే కారులో హఠాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీనిపై తవణంపల్లె పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని వివరించారు.కాలువలో పడి వృద్ధుడి మృతి బైరెడ్డిపల్లె : మండలంలోని కామినేపల్లె గ్రామానికి చెందిన శంకరప్ప (80) మురుగు నీటి కాలువలో పడి బుధవారం మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు ..కామినేపల్లె గ్రామానికి చెందిన శంకరప్పకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బైరెడ్డిపల్లె వద్ద వెళుతుండగా మెయిన్‌రోడ్డు సమీపంలోని మురుగు నీటి కాలువలో అదుపు తప్పి పడి మృతి చెందాడు. పంచాయతీ సిబ్బంది గమనించి మృతి చెందిన వృద్ధుడిని బయటకు తీశారు. చుట్టు పక్కల ప్రాంతాల వారు గుర్తించి కామినేపల్లె శంకరప్పగా నిర్ధారించారు. విషయం కుటుంబ సభ్యులకు తెలియజేసి మృతదేహాన్ని అప్పగించారు.వడదెబ్బతో వ్యక్తి మృతిపుత్తూరు : మున్సిపాలిటి 20వ వార్డు నెత్తం దళితవాడకు చెందిన జి.బలరాం(64) బుధవారం వడదెబ్బ తగిలి మృత్యువాత పడినట్లు గ్రామస్తులు తెలిపారు. బుధవారం ఒక్కసారిగా విరేచనాలు, వాంతులు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయాకు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఏపీఆర్జేసీ, పాలిసెట్‌లో ‘విశ్వం’ జయకేతనం
తిరుపతి ఎడ్యుకేషన్ : ఏపీఆర్జేసీ, పాలిసెట్ ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారని సంస్థ అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి తెలిపారు. ఏపీఆర్జేసీలో వై.దేదీప్య రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, కె.మునిరూపేష్ 7వ ర్యాంకు, జె.అంజలి 9వ ర్యాంకు, మనీషా 10వ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. అలాగే రేవంత్, అబ్దుల్ ఖాదర్, యోగి, సమత, భవ్యశ్రీ గీతిక, రోషన్, ట్వింకిల్, సంతోష్, భువన, కార్తికేయ తదితరులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. పాలిసెట్ ఫలితాల్లో ఎం.కావ్య 120మార్కులకు 117మార్కులు సాధించి బాలికల విభాగంలో జిల్లా స్థాయి ఉత్తమ ర్యాంకును సాధించినట్లు తెలిపారు. కిమ్యశ్రీ 116, కె.నిత్యశ్రీ 114, అబ్దుల్ ఖాదర్ 113, సుజినిరెడ్డి, చాతుర్య, రాజకుమారీ 112, ఎన్.రోషన్ 111, చేతన్‌రెడ్డి 110, జస్మిత 109మార్కులతో జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు వివరించారు. రాణించిన విద్యార్థులను అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్‌రెడ్డి, కరస్పాండెంట్ తులసీ విశ్వనాథరెడ్డి అభినందించారు. -
గృహ నిర్మాణాల పురోగతిలో అలసత్వం వద్దు
● అర్హత ఉన్నవారికి ఇళ్ల పట్టాలు ● పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష చిత్తూరు కలెక్టరేట్ : గృహ నిర్మాణాల పురోగతిలో అలసత్వం వీడాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణ ప్రక్రియలో ఆసక్తి ఉన్న లబ్ధిదారులను గుర్తించి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాల ప్రక్రియలో లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, రుణాల మంజూరుపై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. గృహ నిర్మాణాలు ప్రారంభించి త్వరితిగతిన పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మొత్తం 77,366 గృహాలు మంజూరు కాగా ఇందులో 50,539 గృహాలు పూర్తి అయినట్లు తెలిపారు. బిల్లుల మంజూరులో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదన్నారు. ఏవైనా ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్, ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. అర్హత ఉన్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు జిల్లాలో అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఇళ్ల పట్టాలు కచ్చితంగా మంజూరు చేయాలని అడిషనల్ సీసీఎల్ఏ ప్రభాకర్‌రెడ్డి కలెక్టర్‌ను కోరారు. జిల్లా పరిధిలో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నిర్వహిస్తున్న రీ సర్వే కసరత్తును ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామన్నారు. రీ సర్వే ప్రక్రియలో ప్రతి ఫైల్‌ను జేసీ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ భూములు, కోర్టు కేసులకు సంబంధించిన భూములు పరిశీలించి రీ సర్వే ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మోహన్‌కుమార్, ఏఓ కులశేఖర్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమి.. అడిగేదెవరు!
– దర్జాగా కూటమి నేతల ఆక్రమణ సాక్షి టాస్క్‌ఫోర్స్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, గ్రావెల్ తోపాటు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమణలు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్వేటినగరం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 419/2లో రూ.లక్షలు విలువ జేసే ప్రభుత్వ భూమిని పార్టీ కార్యాలయ నిర్మాణం పేరుతో ఆక్రమణకు దిగారు. ఈ మేరకు కూటమి నాయకులు బుధవారం భూమి చదును చేసే పనులు చేపట్టారు. అయితే అదే సర్వే నంబర్ పక్కనే ఉన్న రైతులు పనులను అడ్టుకుని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే భూమిలో ఉపాధి పథకం నిధులతో పారంఫాండ్ల పనులు చేపట్టారు. అయినప్పటికీ కూటమి నాయకులు పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూల్చి ప్రభు త్వ భూములను దర్జాగా ఆక్రమిస్తున్నారు. అడిగిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ను వివరణ కోరగా సర్వే నంబర్ 419/2లో చెట్లను నరికి భూమిని చదును చేస్తున్నట్లు రైతులు సమాచారం ఇచ్చారని, వెంటనే పనులను నిలిపి వేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన న్యాయవాది తొలగింపు
పలమనేరు : న్యాయ విద్యకు సంబంధించి నకిలీ ఽధ్రువపత్రాలను సమర్పించి బార్ కౌన్సిల్‌ను మోసం చేసి పలమనేరు కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న జి. సుబ్రమణ్యంను రాష్ట్ర బార్ కౌన్సిల్ నుంచి వెంటనే తొలగించినట్లు ఏపీ బార్ కౌన్సిల్ కార్యదర్శి పద్మలత బుధవారం ఆదేశాలను జారీ చేశారు. ఆ మేరకు ఉత్తర్వులు స్థానిక కోర్టుకు పంపారు. న్యాయవాదులుగా బార్ కౌన్సిల్లో అర్హత లేకున్నా తప్పుడు ధ్రువపత్రాలతో ఎల్ఎల్బీ పూర్తి చేసినట్లు నకిలీ పత్రాలను అందజేసినట్లు పరిశీలనలో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది అక్రమంగా పలు కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నట్టు గుర్తించిన బార్ కౌన్సిల్ తక్షణమే వీరిపై వేటు వేసింది. ఇందులో భాగంగా పలమనేరు కోర్టులో రిజిస్ట్రర్ చేసుకున్న జి. సుబ్రమణ్యంపై వేటు పడింది. దీనిపై మరింత విచారణ చేపట్టి వీరికి ఏ కళాశాల నుంచి నకిలీ సర్టిఫికెట్లు అందాయి? ఎలా ఎన్రోల్ చేసుకున్నారో కూపీ లాగనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పలమనేరులో సంచలనం రేకెత్తించింది. నేడే డీఎస్సీ దరఖాస్తుకు ఆఖరు గడువు తిరుపతి సిటీ : టీచర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వ విడుదల చేసిన డీఎస్సీ–2025కు ద రఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియ నుంది. ఈనెల 30వ తేదీ నుంచి హాల్‌టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకును అవకాశం ఉంటుంది. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. శ్రీవారి దర్శనానికి 3 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 74,477 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,294 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ. 2.84 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 2 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వస్తే క్యూలో అనుమతించమని స్పష్టం చేసింది. -
కొనసాగుతున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని 35 పరీక్ష కేంద్రాల్లో మూడో రోజు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష లు ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఐఈఓ డా. ఆదూరు శ్రీనివాసులు అన్నారు. బుధవారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం నిర్వహించిన జనరల్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో 7568 మందికి గాను 7252 మంది విద్యార్థులు హాజరు కాగా 315 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్‌లో 348 మందికి 320 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరైనట్లు వివరించా రు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్స రం జనరల్ పరీక్షలో 1556 మందికి 1468 మంది విద్యార్థులు హాజరు కాగా 88 మంది పరీక్షకు హా జరు కాలేదన్నారు. ఒకేషనల్‌లో 119 మందికి 108 మంది హాజరయ్యారన్నారు. జిల్లాలోని సదుం, సోమల ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సందర్శించినట్లు ఆయన తెలిపారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు దయానందరాజు, బాలసుబ్రహ్మణ్యం, శరత్చంద్ర శేఖర్లు 11 కేంద్రాలను, ప్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు 16 కేంద్రాలను తనిఖీలు చేశారన్నారు. -
‘ష్యూర్ సక్సెస్’ నీట్ లాంగ్ టర్మ్
తిరుపతి రూరల్ : తిరుపతి సమీపంలోని తాటితోపు వద్ద సుమిత్ర టవర్స్‌లో శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారు ప్రత్యేకంగా రూపొందించిన నీట్ ష్యూర్ సక్సెస్ ప్రోగ్రామ్‌ను బుధవారం ప్రకటించారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు కరెస్పాండెంట్ శేషారెడ్డి తెలిపారు. ఈ పోస్టర్లను విడుదల చేశారు. అభ్యాసం, విద్యార్థులకు మెరుగైన గుణాత్మక శిక్షణను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 90 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు నీట్–2026లో 500మార్కులకు తక్కువ వస్తే 50శాతం ఫీజు రీఫండ్ చేస్తామని స్పష్టం చేశారు. వివరాలకు అకాడమీ సెంటర్, లేదా 9133380222 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
అంగరక్షకులకు అప్రమత్తత అవసరం
చిత్తూరు అర్బన్: ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల వద్ద అంగరక్షకులు (గన్‌మాన్)గా విధులు నిర్వర్తిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మణికంఠ ఆదేశించారు. గత మూడు రోజులుగా జిల్లాలోని అధికారులు, ప్రముఖులు, రాజకీయ నాయకుల వద్ద పనిచేస్తున్న అంగ రక్షకులకు ఇస్తున్న వృత్యంతర శిక్షణ కార్యక్రమం మంగళవారం ముగిసింది. చిత్తూరులోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ రాష్ట్ర డీఎస్పీ అంకారావుతో కలిసి ఎస్పీ ముగింపు సమావేశంలో మాట్లాడారు. అంగరక్షకులంటేనే బాధ్యతతో కూడుకున్న విధులుగా గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రతీ ఒక్క ప్రముఖుడినీ కాపాడడమే బాధ్యతగా పనిచేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం, సమయ పాలన, కమ్యునికేషన్స్పై కనీస అవగాహన ఉండాలన్నారు. సమావేశంలో ఏఆర్ ఏఎస్పీ శివానందకిషోర్, ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, ఆర్ఐ సుధాకర్ పాల్గొన్నారు. -
ఒలింపిక్‌లో స్వర్ణమే లక్ష్యం
● ఇప్పటికే జర్మన్ మథాయ్ కిక్ బాక్సింగ్‌లో గెలుపు ● జాతీయ స్థాయిలో రెండు పతకాలు ● ఒలింపిక్ వైపు దూసుకెళ్తున్న అన్వేష్ కుప్పంరూరల్: అసలే పేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని వైనం. తల్లి బెంగళూరులో కూరగాయల వ్యాపారం. తండ్రి చిరు వ్యాపారి. కానీ ఎక్కడ కుంగిపోలేదు. కిక్ బాక్సింగ్‌లో ఒలింపిక్ విజేత విజేందర్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకుని ఇప్పటికే రెండు జాతీయ, మరో మూడు క్లబ్‌స్థాయి పతకాలు సాధించాడు. తాజాగా జర్మనీలో జరిగిన ఫిబో మథాయ్ పోటీల్లో సిల్వర్ పథకం సాఽధించాడు. ఒలింపిక్ పతకమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు కుప్పం మండలం, పైపాళ్యం గ్రామానికి చెందిన యువకుడు అన్వేష్. ఇంతింతై..! అన్వేష్ తల్లి దవళేశ్వరి బెంగళూరులో కూరగాయల వ్యాపారం, తండ్రి ప్రభాకర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహాయకారిగా జీవనం సాగిస్తున్నారు. అన్వేష్‌కు మొదటి నుంచి కిక్ బాక్సింగ్ అంటే ఇష్టం. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే కిక్ బ్యాక్సింగ్పై మక్కువ పెంచుకున్నాడు. అతని ఆశయం, ఆలోచన గుర్తించిన తండ్రి ప్రభాకర్ ఆ దిశగా ప్రోత్పాహం అందించాడు. ప్రస్తుతం కుప్పం వికాస్ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అన్వేష్‌కు వారాంతం శని, ఆదివారాల్లో బెంగళూరులోని ఏకేఎఫ్సీ అకాడమీలో కోచ్ కుమార్ వద్ద శిక్షణ ఇప్పిస్తున్నాడు. గత మూడేళ్లలో రాటుదేలాడు. 2023లో కనకపురలో నేషనల్ చాంపియన్ షిప్, 2024లో మైపూరులో జరిగిన నేషనల్ చాంపియన్ షిప్లో అన్వేష్ సిల్వర్ మెడల్ సాధించాడు. క్లబ్ స్థాయిలో జరిగిన పోటీల్లో ఇప్పటికే ఒక గోల్డ్, 2 సిల్వర్ మెడళ్లు సాధించాడు. ఫిబో మెడల్‌తో గుర్తింపు... 2024 ఆగస్టులో జర్మనీలో జరిగిన మథాయ్ కిక్ బాక్సింగ్ పోటీల్లో అన్వేష్ సిల్వర్ మెడల్ సాధించాడు. దీంతో ఒక్కసారిగా కిక్ బాక్సింగ్ అభిమానుల కళ్లన్నీ అన్వేష్‌పై పడ్డాయి. ప్రభుత్వం సాయం అందిస్తే మరిన్ని పతకాలు సాధిస్తానని చెబుతున్నాడు. కనీసం స్పోర్ట్స్ ష్కాలర్షిప్లైనా అందించాలని కోరుతున్నారు. జర్మనీ ఫిబో చాంపియన్ ఫిప్పులో బహుమతి సాధించిన అన్వేష్విజేందర్సింగ్ నాకు ఆదర్శం 2008 బీజింగ్ ఒలింపిక్‌లో కిక్ బాక్సింగ్‌లో పతకం సాధించిన విజేందర్ సింగ్ బెనివాల్ నాకు ఆదర్శం. ఆయన తరహాలో కిక్ బాక్సింగ్‌లో రాణిస్తా. దేశానికి, తల్లిదండ్రులకు పేరు తేవాలని ఉంది. ఇప్పటికే బెంగళూరులోని అన్ని క్లబ్బు స్థాయిల్లో రాణించా. జాతీయ స్థాయిలో మూడు పథకాలు సాధించా. ఒలింప్లో పథకం సాధించడమే లక్ష్యం. – అన్వేష్, యువ బాక్సింగ్ క్రీడాకారుడు, పైపాళ్యం -
వైభవంగా తిరుపతి గంగ జాతర
● భక్తులతో హోరెత్తిన ఆలయం ● భక్తి శ్రద్ధలతో పొంగళ్ల నివేదన ● జాతర చివరి రోజున పోటెత్తిన భక్తులు ● గంగజాతర వేషాలతో పులకించిన తిరునగరి తిరుపతి కల్చరల్ : శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈనెల 6వ తేదీ రాత్రి చాటింపుతో మొదలైన గంగ జాతర వారం రోజుల పాటు అత్యంత కోలాహలంగా సాగింది. రోజువారీ విభిన్న వేషాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం జాతర చివరి రోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో గంగమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసింది. సోమవారం అర్ధరాత్రి అమ్మవారికి మహాశాంతి అభిషేకం తర్వాత అమ్మవారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మొక్కుబడిలో భాగంగా వేపాకు చీరలతో గంగమ్మను దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. జాతర చివరిరోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు విశేష సంఖ్యలో భక్తులు వివిధ పౌరాణిక, జానపద, సీ్త్ర వేషాలు ధరించి తిరు నగరిలోని పురవీధుల్లో సందడి చేశారు. భక్తజనంతో గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాలు సందడి నెలకొంది. ఆలయ అధికారులు, పోలీసులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. జాతరను పురస్కరించుకుని ఆలయం వద్ద భక్తులు మజ్జిగ, అంబళ్లు పంపిణీ చేశారు. గంగమ్మ విశ్వరూప దర్శనంతో పులకించనున్న భక్తజనం శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవంలో చివరిరోజు బుధవారం తెల్లవారుజామున విశ్వరూపంతో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలోని అమ్మవారి విశ్వరూప కొడిస్తంభం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బంకమట్టితో సర్వాంగ సుందరంగా అమ్మవారి విశ్వరూప ప్రతిమ కొలువు తీరనుంది. అమ్మవారి విశ్వరూప ప్రతిమ చంపను పేరంటాల వేషధారుడు బుధవారం తెల్లవారుజామున నరకడంతో జాతర సమాప్తం అవుతుంది. -
గవర్నెన్స్‌ను సద్వినియోగం చేసుకోండి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్న్స్లో పౌర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇందుకు ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ 9552300009ను కేటాయించినట్టు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ వాట్సాప్ నెంబర్ 95523 00009 మనమిత్ర పేరుతో సేవ్ చేసుకొని ఆ నంబర్ కి హాయ్ అని సందేశం పంపి ప్రభుత్వ సేవలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. డీఎల్డీవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. బాలికల భద్రతకు కిశోర వికాసం గంగాధర నెల్లూరు : బాలికల భద్రతే కిశోర వికాసం లక్ష్యమని జిల్లా లీగల్ అడ్వైజర్ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు మండల పరిధిలోని అప్పిరెడ్డికండిగ గ్రామంలో మంగళవారం అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలికల సంరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, చైల్డ్ హెల్ప్ లైన్ నం.1098 తదితర అంశాలపై అవగాహన కల్పించారు. డీసీపీఓ స్టాప్ షణ్ముగం, నెల్లేపల్లి మహిళా పోలీస్ మౌనిక, అంగన్వాడీ కార్యకర్తలు నిర్మల, ప్రమీల, చిట్టెమ్మ, పావని పాల్గొన్నారు. -
పంచలోహ విగ్రహం చోరీ
పాలసముద్రం : మండలంలోని వెంగళరాజుకుప్పం పంచాయతీ, కొత్తూరు గ్రామంలో వెలసిన గంగమ్మగుడిలో పంచలోహ విగ్రహం తోపాటు హుండీలో నగదు, మైక్‌సెట్ చోరీ చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. చిత్తూరు– బలిజకండ్రిగ జాయతీ రహదారి కొత్తూరు గ్రామ సమీపంలో గంగమ్మ గుడిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గర్భగుడి తలుపులు పగులగొట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలైన్ కట్ చేసి డీవీఆర్‌తోపాటు పంచలోహ విగ్రహాన్ని చోరీ చేశారు. అలాగే హుండీలో సుమారు రూ.20 వేల వరకు నగదు, మైక్‌సెట్ తీసుకెళ్లారు. ఎస్ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిత్తూరు నుంచి క్లూస్‌టీమ్‌ను రప్పించి క్షుణ్ణంగా పరిశీలించారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృతి
శ్రీరంగరాజపురం : ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని పి.వి.పురం గ్రామంలో చోటుచేసుంది. స్థానికుల కథనం.. పి.వి.పురం గ్రామానికి చెందిన ఎస్.సురేష్, నందిని దంపతుల రెండవ కుమారుడు ఎస్.కార్తీక్ (8) మంగళవారం మధ్యాహ్నం స్నేహితులతో కలసి గ్రామ సమీపంలో ఉన్న కుశస్థలి నదిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత నేర్చుకుంటూ అకస్మాత్‌గా నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కార్తీక్‌ను బయటకు తీశారు. అప్పటికే కార్తీక్ మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా కార్తీక్ తల్లి నందిని ఇటీవలే మృతి చెందారు. బంధువుల ఆర్తనాదాలు చూపరులను కంటతడి పెట్టించాయి. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి కార్వేటినగరం: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొల్లాగుంట ఏఎడబ్ల్యూ సమీపం చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. మండలంలోని కొటార్వేడు గ్రామానికి చెందిన చిన్నబ్బ కుమారు ఎ.గిరిబాబు(29), తమిళనాడులోని తిరుత్తణికి చెందిన దివ్య(మౌనిక)తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. అనారోగ్యం కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లింది. మంగళవారం సాయంత్రం భార్యను చూసేందుకు గిరిబాబు తిరుత్తణికి ద్విచక్ర వాహనంలో బయల్దేరాడు. మార్గమధ్యంలో కొల్లాగుంట ఏఎడబ్ల్యూ సమీపం చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై పుత్తూరు నుంచి చిత్తూరుకు ఇనుప కమ్మీల(స్టీల్) లోడ్డుతో వెళ్తున్న లారీ గిరిబాబును వెనుక నుంచి ఢీకొట్టింది. ఆపై సుమారు పది అడుగుల వరకు లాక్కెళ్లింది. గిరిబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్య మూడు నెలల గర్భిణిగా ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజ్‌కుమార్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
చక్రస్నానం.. భక్తజన పునీతం
● నేడు పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు సమాప్తం గంగవరం: మండలంలోని టీటీడీ అనుబంధ కీలపట్ల శ్రీకోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం చక్రస్నానం వైభవోపేతంగా జరిగింది. వేకువజామున స్వామివారికి సుప్రభాతసేవ, తోమాలసేవ, అర్చన తదితర నిత్య కై ంకర్యాల అనంతరం భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీకోనేటిరాయస్వామివారు తిరుచ్చిపై గ్రామ మాడ వీధుల్లో ఉరేగుతూ పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ కంకణబట్టార్ నరసింహాచార్యులు ఆధ్వర్యంలో ఉభయదారులకు, చక్ర తాళ్వారుకు స్నపన తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు చక్ర తాళ్వారుకు పుష్కరిణిలో అవబృథస్నానం చేయించారు. అదే సమయంలో అశేష భక్తులు గోవింద నామస్మరణలతో పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి ధ్వజావరోహణం కార్యక్రమంతో తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. నేడు బుధువారం సాయంత్రం శ్రీవారి పుష్పయాగం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. డిప్యూటీ స్పెషల్ గ్రేడ్ ఈఓ వరలక్ష్మి, ఏఈవో గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ నీరుకుండ గజేంద్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ
చిత్తూరు కలెక్టరేట్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా సాగుతున్నట్టు డీఐఈఓ డా.ఆదూరు శ్రీనివాసులు తెలిపారు. రెండో రోజు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఉదయం మొదటి సంవత్సరం జనరల్‌లో 5,584 మందికిగాను 5,369 మంది విద్యార్థులు హాజరైనట్టు తెలిపారు. 215 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్‌లో 540 మందికి 494 మంది హాజరుకాగా 46 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం జనరల్ పరీక్షలో 555 మందికి 511 మంది హాజరుకాగా 44 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. ఒకేషనల్‌లో 139 మందికి 125 మంది హాజరుకాగా 14 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. జిల్లాలోని కార్వేటినగరం, చవటగుంట, పెనుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల కేంద్రాలను తాను, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు దయానందరాజు, బాలసుబ్రహ్మణ్యం, శరత్చంద్రశేఖర్ 10 కేంద్రాలను, ప్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ 9 కేంద్రాలను తనిఖీ చేసినట్టు డీఐఈఓ వెల్లడించారు. దరఖాస్తుల ఆహ్వానం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని యువత సివిల్ డిఫెన్స్ వలంటీర్లుగా విధులు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న వారు మై భారత్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి బీ.ప్రదీప్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖలోని మై భారత్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా యువత దేశానికి ఉపయోగపడే విధంగా, అత్యవసర పరిస్థితుల్లో, సంక్షోభ సమయాల్లో కీలకపాత్ర పోషించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న భద్రతా సమస్యల దృష్ట్యా బలమై న సహజ ఆధారిత ప్రతిస్పందన యంత్రాగాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువత భాగస్వామ్యంతో రెస్క్యూ తరలింపు, ప్రథమ చికిత్స, అత్యవసర సంరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, పునరావాస ప్రయత్నాల్లో సహాయం చేయడం వంటి సేవల్లో వలంటీర్లు కీలకపాత్ర పోషిస్తారన్నారు. ఇప్ప టికే మై భారత్ వెబ్సైట్లో రిజిస్టర్ అయిన మై భారత్ వలంటీర్లు, దేశానికి సేవ చేయాలను కునే ఆసక్తి ఉన్న యువత www.mybharay. gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా కేంద్రంలోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. రిజిస్ట్రేషన్లు డల్ చిత్తూరు కార్పొరేషన్: జాతరను పురస్కరించుకొని నగరంలో రిజిస్ట్రేషన్లు మందగించాయి. పండుగ, మంగళవారం కావడంతో ఎక్కువగా లావాదేవీలు జరగలేదు. కార్యాలయాలు బోసిపోయాయి. చిత్తూరు అర్బన్, రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజూ దాదాపు 50కి తక్కువ కాకుండా డ్యాకుమెంటేషన్లు జరిగేవి. కానీ పండుగ రోజు కావడంతో పెద్దగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ఆసక్తి చూపలేదు. చిత్తూరు అర్బన్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో 7 రిజిస్ట్రేషన్లు జరగగా రూ.36,000 ఆదాయం వచ్చింది. చిత్తూరు రూరల్ కార్యాలయంలో 9 డ్యాకుమెంట్లుకుగాను రూ.75 వేలు వచ్చింది. పలువురిపై సస్పెన్షన్ వేటు కుప్పం: క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు వైఎస్సార్సీపీ నాయకులపై సస్పెన్షన్ వేటు వేసినట్టు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు 1వ వార్డు కౌన్సిలర్ జగదీష్, 3వ వార్డు కౌన్సిలర్ అరవింద్, 4వ వార్డు కౌన్సిలర్ రాజమ్మ, 8వ వార్డు కౌన్సిలర్ చంద్రమ్మ, 13వ వార్డు కౌన్సిలర్ హంస, 14 వార్డు కౌన్సిలర్ మునుస్వామి, 15వ వార్డు కౌన్సిలర్ తిలవతి, 17వ వార్డు కౌన్సిలర్ దేవకి, 21 వార్డు కౌన్సిలర్ లావణ్య, 24 వార్డు కౌన్సిలర్ సయ్యద్అలీలను వైస్సార్సీపీ నుంచి బహిష్కరించినట్టు పేర్కొన్నారు. వీరితో పాటు శాంతిపురం జెడ్పీటీసీ శ్రీణివాసులు, వసనాడు మాజీ సర్పంచ్ మురళి, మొరసనపల్లె గ్రామానికి చెందిన నీలా జగదీష్, రామకుప్పానికి చెందిన ఆరేల్ల జయప్ప, చీలేపల్లి రవి, ఎస్.కె.సర్దార్ బాషాతో పాటు పలువురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
అంగరంగ వైభవంగా చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర
చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరకు జనం పోటె త్తారు. గంగమ్మా.. మమ్మేలు మాయమ్మా..! అంటూ ప్రణమిల్లారు. కర్పూర హారతులు పట్టి, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మ రికొందరు అంబళ్లు పోసి అమ్మవారిని వశం చేసుకున్నారు. కాగా బుధవారం జరిగే నిమజ్జనానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు గంగజాతర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. గంగోరి తల్లి పలు ప్రాంతాల్లో సింహ వానంపై ఆశీనులై భక్తులను కనువిందు చేశారు. భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. వినూత్న వేషధారణతో మొక్కులు తీర్చు కున్నారు. నడివీధిలో కొలువుదీరిన గంగమ్మతల్లికి తొలుత వంశపార్యపర్య ధర్మకర్తలు విశేష పూజలు చేసి జాతరను ప్రారంభించారు. గంగమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారికి నైవే ద్యంగా అంబిలి, పిండి వంటలను సమర్పించారు. గిరింపేట, సంతపేట, దొడ్డిపల్లి, కొంగారెడ్డిపల్లి, కట్టమంచి తదితర ప్రాంతాల్లో జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాగా చిత్తూరులో రెండో రోజు ఏటా అమ్మవారిని నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో బుధవారం 4 గంటల సమయంలో నడివీధి గంగమ్మ నిమజ్జనానికి బయలుదేరనున్నారు. వంశపారంపర్య ధర్మకర్తలు అమ్మవారికి సారె సమర్పించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.గంగమ్మ సేవలో మంత్రిచిత్తూరు నడి వీధిగంగమ్మను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి దర్శించుకున్నారు. సారె సమర్పించి అమ్మవారి హారతి అందుకున్నారు. అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చుడా చైర్మన్ కఠారి హేమలత, నాయకులు పాల్గొన్నారు.నేడు నిమజ్జనం.. ట్రాఫిక్ మళ్లింపుచిత్తూరులో బుధవారం జరిగే గంగమ్మ నిమజ్జనానికి పోలీ సు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. మధ్యాహ్నం 2 నుంచి ట్రాఫిక్ మళ్లింపు ప్రక్రియను చేపట్టనుంది. భారీ వాహనాలను రెడ్డిగుంట జంక్షన్ మీదుగా ఇరువారం, కాణిపాకం జంక్షన్, మురకంబట్టు జంక్షన్, సాంబయ్యకండ్రిగ మీదుగా మళ్లించనున్నారు. వేలూరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను రెడ్డిగుంట జంక్షన్ నుంచి కాణిపాకం మీదుగా మురకంబట్టు జంక్షన్, ఎల్జీబీ టవర్ మీదుగా ఆర్టీసీ బస్టాండుకు మళ్లించనున్నారు. ఇదే మాదిరిగానే పలమనేరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను కాణిపాకం క్రాస్ నుంచి ఆర్టీసీ బస్టాండుకు చేరుకునేలా చర్యలు చేపట్టారు. పలమనేరు నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలను ఇరువారం జంక్షన్ వరకు పరిమితం చేయనున్నారు. వేలూరు నుంచి వచ్చే ప్రైవేటు బస్సులు రెడ్డిగుంట జంక్షన్లో నిలుపుదల చేయనున్నారు. తిరుపతి –వేలూరు, బెంగళూరు వైపు నుంచి వచ్చే ప్రైవేటు బస్సులన్నీ మురకంబట్టు బైపాస్ నుంచి మళ్లించి ఇరువారం జంక్షన్ మీదుగా వెళ్లేందుకు చర్యలు చేపట్టారు. అలాగే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లే వారు దర్గా సర్కిల్ మీదుగా చేరుకోవచ్చని పోలీసులు పేర్కొన్నారు.గంగమ్మ సేవలో ఎస్పీ దంపతులుచిత్తూరు నగరంలోని ప లు ప్రాంతాల్లో కొలువుదీరిని అమ్మవారిని ఎస్పీ మణికంఠ చందోలు దంపతులు దర్శించుకున్నా రు. వారికి జాతర నిర్వా హకులు కర్పూర హారతులు పట్టి సత్కరించా రు. గిరింపేటలో డిప్యూ టీ మేయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రముఖులకు అమ్మవారి దర్శనం కల్పించి పసుపు, కుంకుమ అందించారు. సంతపేట వంశపారంపర్య ధర్మకర్త భూపేష్గోపీనాథ్ దగ్గరుండి ప్రముఖులకు స్వామి దర్శనం కల్పించారు. కొంగారెడ్డిపల్లిలో శంకర్ ప్రముఖులకు అమ్మవారి మాల, నిమ్మకాయ, ప్రసాదం అందించారు.గంగమ్మకు సారె సమర్పణచిత్తూరు నగరంలోని కట్టమంచి, సంతపేట, శంకరయ్యగుంట, అగ్రహారం ప్రాంతాల్లో కొలువుదీరిన గంగమ్మకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి సతీమణి ఇందుమతి సారె సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శిఽంచి మొక్కులు తీర్చుకున్నారు. జాతర నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికి అమ్మవారి ప్రసాదం తదితరాలను అందజేశారు. కార్పొరేటర్ హరిణిరెడ్డి, నాయకులు అగ్రహారం సత్య, సంతపేట నారాయణ, మనోహర్‌రెడ్డి మనోజ్‌రెడ్డి, అంజలిరెడ్డి, అన్బు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా అనీషారెడ్డి
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకురాలు నూతన కాల్వ అనీషారెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి నియామకపు ఉత్తర్వులను విడుదల చేశారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో అనీషారెడ్డి, ఆమె భర్త నూతన కాల్వ శ్రీనాథరెడ్డి పార్టీలో చేరారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. వారి సేవలను గుర్తిస్తూ మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి సూచనల మేరకు ఆమెకు పదవి వచ్చేలా చర్యలు చేపట్టారు. అనీషారెడ్డి మాట్లాడుతూ పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. తనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు వైఎస్.జగన్మోహన్రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, మిథున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
అయ్యోర్ల బదిలీకి కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయ్యోర్ల బదిలీకి జిల్లా విద్యాశాఖ కసరత్తు చేపడుతోంది. ఒకే పాఠశాలలో ఐదేళ్లు పనిచేసిన హెచ్ఎంలు, ఎనిమిదేళ్లు నిండిన మిగిలిన కేడర్ల టీచర్లకు బదిలీలు తప్పనిసరిగా ఉంటాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 4,478 మంది టీచర్ల బదిలీ! ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఒకే పాఠశాలలో పనిచేస్తూ ఐదేళ్లు నిండిన హెచ్ఎంలు, ఎనిమిదేళ్లు నిండిన మిగిలిన కేడర్ల టీచర్లకు బదిలీలు తప్పనిసరిగా ఉండనున్నాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో 4,478 మందికి తప్పనిసరిగా బదిలీలు ఉండొచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నారు. రెండేళ్లు నిండినవారు సైతం బదిలీలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో దాదాపు 10 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. బడులు తెరిచే లోపు..! ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పున:ప్రారంభమయ్యే లోపు బదిలీలు, ఉద్యోగోన్నతులు పూర్తిచేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొదటగా పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ చేపట్టనున్నారు. ఈ మేరకు ఈనెల 13న రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం బదిలీలు, ఉద్యోగోన్నతులు వరుసగా చేపట్టాలని నిర్ణయించారు. జిల్లాలో మే నెలాఖరు వరకు పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయుల ఖాళీలు వెంటనే ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయుల నుంచి సేకరించడం మొదలు పెట్టారు. రెండు రోజుల్లో ఏకేడర్లో ఎన్ని ఖాళీలు, ఎక్కడెక్కడ ఉన్నాయో తేల్చేలా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రేషనలైజేషన్ ప్రక్రియ 117 జీవోకు ప్రత్యామ్నాయంగా జీవో ను విడుదల చేశారు. ఆ జీవో ఆధారంగా టీచర్ల పోస్టులను రేషనలైజేషన్ ప్రక్రియలో దాదాపు పూర్తి చేశారు. దీంతో ఎక్కడెక్కడ ఏ పోస్టు అవసరం ఉంటుందో ఒక నిర్ధారణకొచ్చారు. రేషనలైజేషన్‌లో ఆయా చోట్ల పోస్టు కోల్పోయే టీచర్లు రేషనలైజేషన్ పాయింట్లు, పాత స్టేషన్ పాయింట్లు ఏదో ఒకదాన్ని తీసుకునే అవకాశం కల్పించనున్నారు. -
వెకేషన్ జడ్జిగా సూర్యనారాయణమూర్తి
చిత్తూరు లీగల్: జిల్లాలోని అన్ని న్యాయస్థానాలకు వెకేషన్ జడ్జిగా మదనపల్లె రెండవ అదనపు జిల్లా జడ్జి సూర్యనారాయణమూర్తి వ్యవహరించనున్నారు. న్యాయస్థానాలకు వేసవి సెలవులు కావడంతో ఉమ్మడి జిల్లాలో ఈ నెల 20, 28 తేదీ చిత్తూరు, 15, 22 తేదీల్లో తిరుపతి, 19, 27 తేదీల్లో మదనపల్లె, 14, 21, 26 తేదీల్లో పీలేరు, 16, 23 తేదీల్లో శ్రీకాళహస్తి కోర్టులకు కేసుల విచారణ నిమిత్తం సూర్యనారాయణ మూర్తి హాజరు కానున్నారు. 20న సార్వత్రిక సమ్మె చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో ఈనెల 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ, సీఐటీయూ, సీపీఐ జిల్లా కార్యదర్శులు కోదండయ్య, సురేంద్ర, నాగ రాజు పిలుపునిచ్చారు. మంగళవారం చిత్తూరులో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. లేబర్ కోడ్లను రద్దుచేసి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. 12వ పీఆర్సీ అమలు చేయాలని, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కరించాలన్నారు. ఆశ, అంగన్వాడి, మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. నాయకులు షకీలా, బా లసుబ్రమణ్యం, సతీష్, జ్యోతి, అయ్యప్ప, బాలాజీరావు, చిట్టెమ్మ పాల్గొన్నారు. -
బోయకొండలో అల్లుకుపోయిన అవినీతి అనకొండలు
బోయకొండ గంగమ్మ ఆలయంలో అవినీతి అనకొండలు అల్లుకుపోయాయి. ఓ వైపు వేలం పాటదారులు డబ్బులు చెల్లించకపోయినా ప్రశ్నించే వారే లేకుండా పోయారు. ఈఓ కూటమి నేతలకు వత్తాసు పలుకుతూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానానికి రావాల్సిన సొమ్ము వసూలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.సాక్షి టా్స్క్ఫోర్సు: పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలంలోని బోయకొండ గంగమ్మ దేవస్థానం కూటమి నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. నిబంధనలు తుంగలో తొక్కి అమ్మవారి సొమ్ముతోపాటు అధిక ధరలు పెంచి భక్తుల జేబులు గుల్ల చేయడం నిత్యకృత్యంగా మారుతోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు దిగడం రివాజుగా మారుతోంది. దేవస్థానం వద్ద వివిధ హక్కులపై ఏడాది పాటు లీజుకిస్తూ నిర్వహించిన వేలం పాటల ద్వారా రూ.4.63 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ వేలంలో హక్కులు పొందిన టీడీపీ నేతలు సుమారు రూ.2 కోట్లకు పైగా నగదు చెల్లించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంపై సంబంధిత ఆలయ ఈఓ ఏకాంబరం పట్టీపటనట్టు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.అసలేం జరిగిందంటే!బోయకొండ ఆలయం వద్ద ఏడాదిపాటు వివిధ హక్కులను లీజుకిస్తూ మార్చి 10, 11 తేదీల్లో వేలం పాట నిర్వహించారు. ఇందులో కొన్ని వాయిదా పడడంతో వాటికి మార్చి 28న ఆలయ పరిపాలనా కార్యాలయంలో ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో వేలం పాటలు, సీల్డ్ టెండర్లు నిర్వహించారు. ఈ వేలం పాటలు ఏకపక్షంగా కూటమి నేతల అనుచరులే దక్కించుకున్నారు.నిబంధనలకు పాతరబోయకొండ ఆలయం వద్ద నిబంధనలు ఏవీ అమలు కావడంలేదు. వేలం పాటలో పాల్గొన్న వ్యక్తి హెచ్చుపాట దారుడి నుంచి మొత్తాన్ని అప్పటికప్పుడే దేవస్థానానికి జమ చేయాల్సి ఉన్నా ఈఓ ఆ దిశగా చర్యలు చేపట్ట లేదు. మూడు దశలుగా జరిగిన వేలం పాటల్లో ఆలయానికి రూ.4.63 కోట్ల ఆదాయం చేకూరింది. హెచ్చుపాటదారుడి నుంచి నగదు జమ చేయకుండా లీజు హక్కు అనుభవిస్తున్నాడు. సుమారు రూ.2 కోట్లకు పైగా వేలం లీజుదారుల నుంచి నగదు రావాల్సి ఉన్నా అధికారులు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడం గమనార్హం.మొదటి పాటదారులు చెల్లించకుంటేవేలం జరిగిన రోజు సాయంత్రం వరకు హెచ్చుపాటదారుడు నగదు చెల్లించకుంటే మొదటి పాటదారుడు నుంచి చెల్లించిన డిపాజిట్టును ఆలయ ఖాతాలో జమ చేసుకోవాలి. ఆ లీజు విషయమై వేలంలో రెండవ పాటదారుడునికి వేలం లీజు ఇవ్వాలని దేవస్థానం వారే నిబంధనలు పెట్టారు. కానీ ఇవేవీ అమలు కాకపోవడంతో ఆలయ ఆదాయానికి గండిపడుతోంది.అందరూ కూటమి నేతలేవేలం పాటదారులందరూ కూటమి నేతలే. బోయకొండను వారికి రిసిచ్చేసినట్టు ఉందన్న విమర్శలున్నాయి. కలెక్టర్, దేవదాయశాఖ కమిషనర్ స్పందించి ఆలయ ఆదాయానికి గండి పడకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.వేలం పాటలతో ఆలయానికి రావాల్సిన ఆదాయం ఇలా..కొండపై కొబ్బరికాయల విక్రయం, పూజా సామ గ్రి విక్రయించుకొనే హక్కు – రూ.52.5 లక్షలుపూలు, నిమ్మకాయల హారాలు, వడిబాలు, చీరలు, జాకెట్ పీసులు విక్రయించుకునే హక్కు – రూ.42 లక్షలుదేవస్థానం, పంచాయతీకి చెందిన టోల్ గేటు నిర్వహించుకునే హక్కు – రూ.68.5 లక్షలుపెద్దభోగం, చిన్నభోగం సేకరించి నిర్వహించుకునే హక్కు– రూ.86.15 లక్షలుభక్తాదులు సమర్పించే చీరలు, రవికలు, పావడా పీసులు సేకరించుకొనే హక్కు – రూ.46.5 లక్షలుకొండపైన క్యాంటీన్, ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్ విక్రయించుకునే హక్కు– రూ.20.90 లక్షలుకొండ కింద క్యాంటీన్, ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్ విక్రయించుకునే హక్కు – రూ.6.35 లక్షలుకొండపైన నాలుగు దుకాణాల్లో పవిత్ర దారాలు, టాయ్స్, ఫొటోలు, కలకండ విక్రయించుకునే హక్కు – రూ.69 లక్షలుకోళ్లు విక్రయించుకునే హక్కు– రూ.6.80 లక్షలుఫొటోలు తీసుకొనే హక్కు – రూ.1.79 లక్షలుకొబ్బరి పై చిప్పలు సేకరించుకునే హక్కు – రూ.7.4 లక్షలుతలనీలాలు సేకరించుకొనే హక్కు – రూ.24.6 లక్షలుక్లాక్ రూములు, సెల్‌ఫోన్ లగేజీ నిర్వహించుకొనే హక్కు – రూ.18.2పేపరు కవర్లు, బ్యాగులు విక్రయించుకునే హక్కు– రూ.6.6 లక్షలుపాదరక్షలు భద్రపరుచుకునే హక్కు – రూ.2.4 లక్షలుదేవస్థానం స్థలంలో తాత్కాలిక అంగళ్లు ఏర్పాటు, వ్యాపారం చేసుకునే హక్కు రూ.3.26 లక్షలు -
అయ్యా.. మా మొర ఆలకించరా?
కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు ● ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 234 అర్జీలు ● వినతులు స్వీకరించిన కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా.. మా మొర ఆలకించండి’ అంటూ అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో గత రెండు వారాల తర్వాత ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించగా.. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అర్జీదారులు తరలివచ్చారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో మోహన్‌కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి మొత్తం 232 అర్జీలు వచ్చాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అర్జీలను సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలన్నారు. మూడు నెలల పాటు పలమనేరు డివిజన్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించామన్నారు. చిత్తూరులో నిర్వహించిన పీజీఆర్ఎస్లో దాదాపు 250 అర్జీలు వచ్చాయన్నారు. ఇందులో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నట్టు వెల్లడించారు. పలమనేరులో పీజీఆర్ఎస్ నిర్వహించడం వల్ల పలమనేరు డివిజన్ నుంచి అందే అర్జీల సంఖ్య తగ్గినట్టు పేర్కొన్నారు. శ్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించండి శ్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించాలని చిత్తూరు రూరల్ మండలం, బీఎన్‌ఆర్‌పేట రెవెన్యూ, అనంతాపురం ఎస్సీ కాలనీ వాసులు కోరారు. ఈ మేరకు వారు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ గ్రామానికి చెందిన సుకన్య, కవిత తదితరులు మాట్లాడారు. గత 40 ఏళ్లుగా శ్మశానవాటికకు వినియోగిస్తున్న స్థలంలో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు. జెడ్పీ నిధులతో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. -
రగులుతున్న తమ్ముళ్లు!
నామినేటెడ్ పోస్టుల భర్తీపై టీడీపీ సీనియర్ నేతలు తీవ్రమైన అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవలందిస్తే కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తే అసలు గుర్తింపే లేకుండా పోయిందని వాపోతున్నారు. ఎన్నికల ముందు కండువా కప్పుకున్న వారికే పదవులు కేటాయించడంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు నాయకులు తమ స్థాయికి తగని పోస్టులు కట్టబెట్టడంపై కినుక వహిస్తున్నారు. ఇంతకాలం ఎదురుచూసినందుకు ఇంతగా అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు గుర్తింపు, గౌరవం రెండూ లేవని కొందరు టీడీపీ నేతలు మధనపడుతున్నారు. మొదటి నుంచి పార్టీ విజయం కోసం పనిచేసిన తమను కాదని ఎన్నికల ముందు చేరిన వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడంపై మండిపడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అతి ముఖ్యమైన తుడా చైర్మన్ పదవిని డాలర్స్ దివాకర్‌రెడ్డికి, మొన్న డీసీసీబీ చైర్మన్ పోస్టును అమాస రాజశేఖరరెడ్డికి ఇవ్వడంతో నామినేటెడ్ పదవులన్నీ దాదాపు భర్తీ పూర్తయినట్లేనని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ రెండు పదవులు తమకే వస్తాయని ఆశగా ఎదురుచూసిన టీడీపీ సీనియర్ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. ఇక నామినేటెడ్ పదవుల్లో ఆశించేందుకు ఏమీ లేకుండా పోయినట్లేనని ఆగ్రహంగా ఉన్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో టీడీపీలో అనేక మంది సీనియర్ నేతలు ఉన్నారు. అలాగే టీడీపీ కోసం తెరవెనుక నుంచి పనిచేసిన కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. వారంతా ముందుగా టీటీడీ పాలకమండలి సభ్యత్వం కోసం పోటీపడ్డారు. అలా ఆశించిన వారిలో జిల్లాకు చెందిన టీడీపీ నేతలెవరికీ టీటీడీ పాలకమండలిలో చోటు దక్కలేదు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ద్వారా బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ పోస్టును ఎగరేసుకుపోయారు. ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీనే నమ్ముకునిఏళ్లుగా ఎదురుచూస్తున్న వారందరికీ భంగపాటు తప్పలేదు. చిత్తూరు జిల్లాలోనూ.. చిత్తూరు జిల్లా పరిధిలోని కుప్పం, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు, నగరి నియోజక వర్గాల్లో పదుల సంఖ్యలో ఉన్న టీడీపీ నాయకులందరికీ కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపించింది. డీసీసీబీ చైరర్మన్ పదవి కోసం మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చాలా నమ్మకంగా ఉన్నారు. జిల్లాలో సీనియర్ నాయకుల్లో ప్రథముడు. టీడీపీనే నమ్ముకుని ఉన్నారు. అయితే దొరబాబుని కాదని, అమాస రాజశేఖరరెడ్డికి చైర్మన్ గిరీ కట్టబెట్టారు. ఆయన గతంలో డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న సమయంలో అడ్డగోలుగా కుప్పం నియోజక వర్గానికి నిధులు కేటాయించారే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు, లోకేష్ మళ్లీ అమాసకే డీసీసీబీని కట్టబెట్టారు. అమాస కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరినట్లు కూడా పెద్దగా ప్రచారం లేదు. అదే విధంగా టీడీపీ కోసం పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు కూడా లేవని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో మిగిలింది కాణిపాకం, బోయకొండ పాలకమండళ్లు మాత్రమే. ఆయా బోర్డుల చైర్మన్, సభ్యత్వం కోసం అనేక మంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. అందులోనైనా న్యాయం జరుగుతుందా? లేదా? అని పలువురు టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల పందేరంపై అసంతృప్తి గుర్తింపు.. గౌరవం లేదని సీనియర్ నేతల ఆవేదన ప్రాధాన్యత లేని పోస్టులు కట్టబెట్టడంపై మండిపాటు తిరుపతి, చిత్తూరు జిల్లాల టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలుసీనియర్లందరికీ అవమానం తిరుపతికి చెందిన ఎన్టీఆర్ రాజు కుటుంబం ఎన్నో ఏళ్ల నుంచి టీటీడీ బోర్డు సభ్యత్వం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఈ సారి కూడా ఆ కుటుంబానికి దక్కలేదు. తిరుపతిలో టీడీపీ అంటే గుర్తొచ్చే నాయకుల్లో ముందు వరుసలో ఉండేది నరసింహయాదవ్. టీడీపీ సీనియర్ నేతగా పచ్చ చొక్కా తప్ప మరొకటి ధరించని నరసింహయాదవ్ మరో పర్యాయం తుడా చైర్మన్ పదవిని ఆశించారు. అయితే ఆయనకు ప్రాధాన్యం లేని పదవిని కట్టబెట్టి తీవ్రంగా అవమానించారు. టీడీపీలో మరో నేత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ఆమె ఎమ్మెల్సీ లేదా టీటీడీ పాలకమండలి సభ్యత్వం, అది కూడా కాకుంటే తుడా చైర్మన్ పదవిని ఆశించారు. అయితే ఈ మూడింటిలో ఏదీ దక్కలేదు. అస్సలు ఎలాంటి ప్రాధాన్యత లేని, ఆ పదవి ఒకటి ఉందనే విషయం తెలియని గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టును ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు, ఆమె అనుచరులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తిరుపతి జిల్లాలో అతిముఖ్యమైన తుడా చైర్మన్ పదవిని రియల్ ఎస్టేట్ వ్యాపారికి కట్టబెట్టడంపై టీడీపీలోని అనేక మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దివాకర్‌రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయని, అందుకు సంబంధించిన వివరాలతో అమరావతికి లేఖ పంపినట్లు తెలిసింది. పార్టీ కోసం నమ్మకంగా పనిచేస్తున్నా తమను గుర్తించలేదంటూ కొందరు నాయకులు అధిష్టానంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అదే విధంగా శాప్ చైర్మన్ రవినాయుడుపైనా కొందరు టీడీపీ నేతలు అమరావతికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తిరుపతి జిల్లాలో మిగిలిన శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి కోసం పలువురు టీడీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. -
ఇళ్లను కూల్చేందుకు కుట్ర
గత 30 ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లను కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నారని యాదమరి మండలం, దాసరపల్లి గ్రామ పంచాయతీ ఆది ఆంధ్రవాడ ప్రజలు వాపోయారు. ఈ మేరకు వారు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలోని సర్వే నం.343/2 డీలో ఎకరా ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఆ భూమిలో గత 30 ఏళ్లుగా కొన్ని కుటుంబాలు గృహాలు నిర్మించుకుని నివసిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం తమ ఇళ్లను కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నారని వాపోయారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. -
మేత బీడును కాపాడండి
ఎన్నో ఏళ్లుగా పశువులు, మేకలు, గొర్రెలు మేపుకుంటున్న భూమిని కొందరు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్ఆర్పురం మండలం, ఆర్ఆర్పురం ఎస్టీ కాలనీ వాసులు పే ర్కొన్నారు. ఈ మేరకు వారు కలెక్టర్‌కు సమస్యను వివరించారు. తమ గ్రామ పరిధిలో సర్వే నం.170లో 18/2లో ఉన్న భూమిని మోతుబారి రైతు కుటుంబీకులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విచారించి న్యాయం చేయాలని వారు కోరారు. గుడి వద్ద మద్యం షాపు వద్దు గుడి వద్ద ఉన్న మద్యం షాపును తొలగించాలని వెదురుకుప్పం మండలం, పచ్చికాపలం గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించారు. తమ గ్రామంలో చర్చి, మాతమ్మ గుడికి సమీపంలో మద్యం షాపు ఉందన్నారు. ఆ దారిలో ఆలయాలకు వెళ్లే సమయంలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. -
పాఠశాలను మార్చకండి
తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మార్చకండి అంటూ పుంగనూరు మండలం, మరసనపల్లెకు చెందిన గ్రామస్తులు రమణప్ప తదితరులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో అర్జీ అందజేశారు. మరసనపల్లె గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని, ఆ పాఠశాలలో ప్రస్తుతం 22 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. త్వరలో ఆ పాఠశాలలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను దూరప్రాంతంలో ఉన్న ఈడిగపల్లెకు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అలా మారిస్తే తమ పిల్లలు కిలోమీటరు వరకు కాలినడకన నడిచి పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. తమ గ్రామంలోనే పాఠశాలను కొనసాగించాలని కలెక్టర్‌ను కోరారు. -
అరటి సాగులో అద్భుతాలు
గ్రూపు –1లో తప్పినా.. సాగులో సక్సెస్ ● తండ్రికి అండగా నిలవాలని నిర్ణయం ● అరటి సాగు చేపట్టి అద్భుతాలు సృష్టిస్తున్న యువకుడు కుప్పంరూరల్: గ్రూప్–1లో తప్పినా.. సాగులో సక్సెస్ అయ్యాడు కుప్పం మండలం, గుల్లేపల్లి గ్రామానికి చెందిన యువకుడు జ్ఞానప్రకాష్. అరటి సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తండ్రికి తోడూనీడగా ఉంటూ శభాష్ అనిపించుకుంటున్నాడు. మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ కుప్పం మండలం, గుల్లేపల్లి గ్రామానికి చెందిన జ్ఞానప్రకాశ్ బీ.ఏ వరకు చదువుతున్నాడు. తన తండ్రి రెవెన్యూశాఖలో చిరుద్యోగి. గ్రూపు –1 అధికారి కావాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నాడు. 2023లో గ్రూపు –1 పరీక్ష రాసి సఫలీకృతుడు కాలేకపోయాడు. దీంతో తన తండ్రికి తోడుగా నిలవానుకున్నాడు. తనకున్న ఐదు ఎకరాల పొలంలో అరటి సాగుకు ఉపక్రమించాడు. రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టి 2.5 ఎకరాల్లో పచ్చివాల, 2.5 ఎకరాల్లో యాలక్కి రకాలు సాగుచేశాడు. ప్రస్తుతం పంట మరో నెలలో చేతికి రానుంది. కుప్పం మార్కెట్లో యాలక్కి కిలో రూ.70, పచ్చివాల రూ.30 ధర పలుకుతోంది. ఈ లెక్కన జ్ఞానప్రకాష్కి రూ.25 లక్షల వరకు ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంది. తోడైన దేవుడు యువకుడు పడుతున్న కృషికి దేవుడు కూడా తోడయ్యాడు. కుప్పం ప్రాంతంలో వెయ్యికిపైగా అడుగుల లోతుకు బోరు వేసినా నీరు వచ్చే పరిస్థితి లేదు. కానీ జ్ఞానప్రకాశ్ అరటి సాగుకు రెండు బోర్లు తవ్వగా.. కేవలం 105, 160 అడుగుల్లోన్నే పుష్కలంగా నీరు లభించింది. పాడి సాగులో మరో లక్ష ఆదాయం గత ఏడాది నుంచి జ్ఞానప్రకాష్ పాడి పెంపకం కూడా చేపట్టాడు. అరటి తోటలో వచ్చే పశుగ్రాసం, అరటి ఆకులు దాణాగా వినియోగిస్తున్నాడు. తండ్రి సహకారంతో రూ.5 లక్షలు ఖర్చు చేసి 10 పాడి ఆవులను పెంచుతున్నాడు. ప్రస్తుతం రోజూ ఆవులు పూటకు 75 లీటర్ల లెక్కన రెండు పూటలా 150 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. నెలకు రూ.1.2 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. గ్రూపు –1 ఆఫీసర్ కావాలనుకున్నా మా తండ్రి రెవెన్యూ శాఖలో చిరుద్యోగి. ఆయన పడుతున్న బా ధలు చూడలేక చిన్నప్పటి నుంచే గ్రూపు –1 ఆఫీసర్ కావాలనుకున్నా. మొదటి ప్రయత్నంలో ఒక్క పరీక్ష పోయింది. మరో పరీక్ష కోసం ఎదురు చూస్తు న్నా. ఇంతలో ఎలాగైనా తండ్రికి తోడుగా నిలవాలనుకున్నా. అదుకే 5 ఎకరాల పొలంలో రూ.5 లక్షలు వెచ్చించి అరటి సాగు చేపట్టా. వ్యాపారులు వచ్చి టోకుగా రూ.25 లక్షలకు తోటను అడుగుతున్నారు. బయట మార్కెట్‌కు తరలిస్తే మరింత లాభం వచ్చే అవకాశం ఉంది. – జ్ఞానప్రకాష్, యువ రైతు, గుల్లేపల్లి, కుప్పం మండలం -
జాతరకు కట్టుదిట్టమైన భద్రత
● చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో గంగ జాతర జరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్టు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఆయన సోమవారం చిత్తూరులోని ఏఆర్ మైదానంలో జాతర విధులు కేటాయించిన పోలీసు అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. చిత్తూరు జాతరకు దాదాపు 500 మంది పోలీసులను వినియోగిస్తున్నామని తెలిపారు. అలాగే డ్రోన్ కెమెరాలు, బాడీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టినట్టు తెలిపారు. ట్రాఫిక్‌ను నిత్యం పర్యవేక్షించడంతోపాటు వాహనాల మళ్లింపుపై దృష్టి పెట్టాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే అనుమానం ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం జాతర ధర్మకర్త లావణ్యతో కలిసి నగరంలోని పలు ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాజశేఖర్ రాజు, శివానందకిషోర్, డీఎస్పీలు సాయి నాథ్, సయ్యద్ మొహ్మద్ అజీజ్, చిన్నికృష్ణ, మహబూబ్ బాష, సీఐలు మహేశ్వర, నెట్టికంటయ్య తదితరులు పాల్గొన్నారు సదుం తహసీల్దార్‌గా జయప్రకాష్ చిత్తూరు కలెక్టరేట్: సదుం తహసీల్దార్‌గా కుప్పం డివిజనల్ పరిపాలనాధికారిగా పనిచేస్తున్న జయప్రకాష్‌ను నియమిస్తూ సోమ వారం కలెక్టర్ సుమిత్కుమామార్ ఉత్తర్వులు జారీచేశారు. అక్కడ ఇన్చార్జ్ తహసీల్దార్‌గా ఉన్న హుస్సేన్ అవినీతినిరోధకశాఖ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఆ పోస్టుకు జయప్రకాష్‌ను నియమించారు. -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి
కుప్పం రూరల్: అనుమానాస్పద స్థితిలో చెరువులో పడి గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రామకుప్పం చెరువులో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం.. సుమారు 65 సంవత్సరాల వయస్సు కలిగిన వృద్ధురాలు నాలుగు రోజుల క్రితం చెరువులో పడిన మృతి చెందినట్టు తెలుస్తోంది. ఐదు అడుగుల ఎత్తు కలిగి, ఎర్రగులాబీ రంగు చీర, వంకాయ పువ్వు రంగు పావడా, ఆకుపచ్చ, తెలుపు రంగుల పూసల హారం ధరించి ఉంది. రెండు చేతులపై పచ్చబొట్లు ఉన్నాయి. మృతురాలు వివరాలు ఎవరికై నా తెలిస్తే 9440900703 నంబర్లో సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రమాద వశాత్తు చెరువులో పడిందా.. లేక ఎవరైనా కొట్టి చంపి చెరువులో పడేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
అరటి సాగులో అద్భుతాలు
అరటి సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నాడు రామకుప్పం మండలానికి చెందిన యువరైతు జ్ఞానప్రకాష్. జిల్లాకు ఆరు సబ్స్టేషన్ల మంజూరు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాకు ఆరు సబ్స్టేషన్లు మంజూరైనట్టు ట్రాన్స్‌కో ఎస్ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. చిత్తూరు నగరం, గుడిపాల, యాదమరి, తవణంపల్లె, పెద్దపంజాణి, శాంతిపురం మండలాలకు ఒక్కో సబ్‌స్టేషన్ కేటాయించారన్నారు. ఒక సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.4 కోట్ల మేర మంజూరు చేశారని చెప్పారు. స్థలం ఎంపిక చేసి ఉన్నతాధికారులకు నివే దిక ఇస్తే నిర్మాణానికి టెండర్లు పిలవనున్నట్లు వివరించారు. ఆక్రమణలపై తనిఖీలు కుప్పం: మండలంలోని కుంజేగానూరు గ్రామ రెవెన్యూకు సంబంధించి గుట్ట పోరంబోకు కబ్జాపై ‘సాక్షి’లో ‘కుంజేగానూరులో భూచోరులు’ శీర్షికన ఆదివారం వార్త వెలువడింది. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించారు. ఆక్రమణలకు గురైన గుట్టపోరంబోకును సోమవారం పరిశీలించారు. డీకేటీ పట్టా ఉన్నా క్రయవిక్రయాలు చేయరాదన్నారు. ఓ రైతు పొలానికి ఆనుకుని ఉన్న మిట్ట పోరంబోకులో ఎవరికీ అనుమతులు లేవని, అది పశువుల మేత బీడుగా రికార్డుల్లో ఉందన్నారు. అక్కడ కట్టడాలు కట్టి కబ్జాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. – 8లో -
మా మొర ఆలకించరా?
‘అయ్యా.. మా మొర ఆలకించండి. సమస్యలు పరిష్కరించండి’ అంటూ పలువురు అధికారులకు మొరపెట్టుకున్నారు. మంగళవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2025చిత్తూరు అర్బన్: అన్నదాత ఖర్చు తగ్గించుకుని లాభాసాటి వ్యవసాయం చేసేందుకు ప్రభుత్వం వ్యవసాయ పరికరాలు అందచేయడం పరిపాటి. ఈ క్రమంలో రైతులకు అవసరమైన పరికరాలను అందించాలని కూటమి ప్రభుత్వం భావించింది. వ్యవసాయానికి అవసరమైన యంత్రపరికరాలు ఇవ్వడానికి జిల్లాకు రూ.2.85 కోట్ల వ్యయంతో 1,645 పరికరాల కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆ పరికరాల కొనుగోలుకు చాలా మంది రైతులు ఆసక్తి చూపడం లేదు. అనుకున్నదొక్కటి బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే రాయితీపై ఇస్తున్న పరికరాల ధర ఎక్కువగా ఉండడమే రైతులు వీటిని వద్దనడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. రాయితీపోను రైతులకు వచ్చే లబ్ధి చాలాతక్కువగా ఉంది. ఫలితంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యవసాయశాఖ అధికారులు నానాపాట్లు పడుతున్నారు. ఓ వైపు జిల్లా యంత్రాంగం రోజువారీ సమీక్షలు చేస్తూ లక్ష్యం మేరకు రైతులతో రాయితీ పరికరాలు కొనుగోలు చేయించాలని నిర్దేశించారు. ఇదేంది ఇలా జరిగిందబ్బా! రైతుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ట్రాక్టరు ఆధారిత పరికరాలకు కేటాయించిన రాయితీ సొమ్మును తైవాన్ స్ప్రేయర్లు వంటివాటికి వాడుకునేలా ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ప్రభుత్వం అందించే రాయితీ పరికరాలు తీసుకోవడానికి రైతులు పోటీపడి ముందుకు వస్తారనుకుంటే పరిస్థితి భిన్నంగా ఉందని మండలాల్లోని వ్యవసాయ అధికారులు వాపోతున్నారు. మండలానికి ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. రొటావేటర్లు, హైడ్రాలిక్ రివర్స్ నాగళ్లు, ట్రాక్టర్ ఆధారిత పనిముట్లను రైతులు కొనుగోలు చేయడం లేదు. 40 శాతం మంది దూరం సేద్యానికి అవసరమైన యంత్ర సాయం వ్యక్తిగతంగా అందించేందుకు పరికరాలు ఆయా మండలాలకు చేరుస్తున్నారు. తొలుత జిల్లాలోని 36 మండలాల్లో అన్నదాతలకు రొటావేటర్లు, పవర్ టిల్లర్స్, బ్యాటరీ స్పేయర్లు, పవర్ వీడర్లు అందించేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగానే పరికరాలు అవసరమైన వారి నుంచి వివరాలు సేకరించి అధికారులు ఆన్లైన్ చేయించారు. ఐదెకరాల లోపు భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ, మహిళ, సన్న, చిన్నకారు రైతులకు వీటిని కేటాయించారు. జిల్లాకు 1,645 యూనిట్ల పరికరాల కేటాయింపే లక్ష్యంగా చేసుకున్నారు. కానీ ఇప్పటివరకు వరకు 1,016 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అంటే 40 శాతం మంది రైతులు రాయితీ పరికరాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా ఇప్పటికే గడువు ముగిసినా, లక్ష్యం చేరువుకాకపోవడంతో మిగిలిన యూనిట్లకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. – 8లో– 8లోన్యూస్రీల్సబ్సిడీ వ్యవసాయ పరికరాలపై అనాసక్తి రాయితీ పరికరాల కొనుగోలుకు ఆసక్తి చూపించని రైతులు మార్కెట్ ధరతో పోలిస్తే తక్కువ లబ్ధే కారణం మళ్లీ దరఖాస్తుకు అవకాశమిచ్చిన యంత్రాంగంజిల్లాలో రాయితీ పరికరాల లక్ష్యాలు పరికరం కేటాయింపు వచ్చిన పరికరాలుట్రాక్టర్ 740 582రోటావేటర్ 94 76బ్యాటరీస్పేయర్లు 280 256 పవర్ వీడర్లు 109 89 బ్రష్కట్టర్లు 08 02 వపర్ టిల్లర్స్ 02 02‘రైతులకు నిత్యం అవసరమైన రొటావేటర్ పరికరానికి వ్యవసాయశాఖ నిర్ణయించిన ధర రూ.1,51,980. ప్రభుత్వం ఇస్తున్న రాయితీ రూ.50 వేలు. రైతు చెల్లించాల్సింది రూ.1.02 లక్షలు. కానీ ఇదే పరికరం మార్కెట్ ధర రూ.1.20 లక్షలు. రాయితీ ఇచ్చినా ధరలో పెద్దగా తేడా లేకపోవడంతో మంచి కంపెనీ నుంచి రొటావేటర్ కొనుక్కోవచ్చని రైతులు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఇస్తున్న రాయితీ పరికరాలపై పెద్దగా ఆసక్తి చూపించలేకపోతున్నారు.’ .. ఇది ఒక్క రొటావేటర్ పరిస్థితే కాదు.. కూటమి ప్రభుత్వం అందజేస్తున్న స బ్సిడీ వ్యవసాయ పనిముట్ల రేట్లన్నీ ఇదేవిధంగా ఉండడంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. బయట మార్కెట్లో మంచి కంపెనీకి చెందిన పరికరాలు కొనుగోలు చేయొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోలేక అధికారులు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. కావాల్సినవి తెప్పిస్తాం జిల్లాలో రూ.2.85 కోట్ల రాయితీపై 1,645 వ్యవసాయ పరికరాలు అందించేలా చూస్తున్నాం. ఇప్పటికే కొన్ని చోట్ల పరికరాలు ఇచ్చేశాం. కొందరు రైతులు పరికరాల కొనుగోలుపై ఆసక్తి చూపకపోవడంతో వాళ్లకు ఏ పరికరాలు కావాలో వాటిని తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. – మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
● జాతరకు సర్వం సిద్ధం
చిత్తూరు గ్రామదేవత గంగమ్మ తల్లి జాతరకు సర్వం సిద్ధమైంది. గంగమ్మ తల్లిని మంగళవారం వేకువ జామున కొలువుదీర్చనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో భారీ ఏర్పాట్లు చేపట్టారు. సంతపేట, కొంగారెడ్డిపల్లి. ఓబన్నపల్లి, గిరింపేట, కట్టమంచి ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో తొలిపూజ జరగనుంది. దొడ్డిపల్లిలో సోమవారం అర్ధరాత్రి నుంచే అమ్మవారు ఇంటింటా వెళ్లి పూజలు అందుకోకున్నారు. మంగళవారం ఉదయం ఆయా వీధుల్లో కొలువుదీరనున్నారు. – చిత్తూరు రూరల్ (కాణిపాకం) -
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
చిత్తూరు కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్ ధ్వజమెత్తారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి పాలనలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా ఎటువంటి రక్షణా లేదన్నారు. మాజీ మహిళా మంత్రి విడుదల రజనీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడి, చేయి చేసుకోవడం దారుణమన్నారు. మహిళల ఆత్మగౌరవం కాపాడతామని చెప్పే కూటమి నాయకులు ఏమైపోయారని నిలదీశారు. సీఐ సుబ్బనాయుడు ఆమె పట్ల దురుసుగా ప్రరవర్తించడం సిగ్గుచేటన్నారు. ఒక బీసీ ప్రజాప్రతినిధిపై ఇలా ప్రరవర్తించడం సరికాదన్నారు. మాజీ మంత్రి వద్ద ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్టు చేయాలంటే వారెంట్ లేదా ఎఫ్ఐఆర్ చూపాలని, ఎటువంటి నోటీసులూ లేకుండా అరెస్టు చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పోలీసులు ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి కక్ష్య సాధింపుపై ఉన్న శ్రద్ధ సంక్షేమంపై లేదని దుయ్యబట్టారు. అనంతరం నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు అంజలిరెడ్డి, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షురాలు సరళమేరీ, గుడిపాల మండల అధ్యక్షుడు ప్రకాష్, నాయకులు నారాయణలు మాట్లాడారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఏ సంక్షేమ పథకమూ అమలు చేయలేదన్నారు. రజనీపై అనుచితంగా ప్రవర్తించిన సీఐ సుబ్బనాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, ఎంపీటీసీ ప్రతిమారెడ్డి, నాయకులు నౌషద్, చల్లాముత్తు, గిరి, చంద్ర, మదన్, కవిత, బిందు, శాంతి, దీనదయాళ్, భువన, రాజేష్, హరీషారెడ్డి, రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. -
ఏఐ వైద్యం.. ప్రమాదకరం!
జిల్లా సమాచారం జిల్లా ప్రభుత్వాస్పత్రి 01 ఏరియా ఆస్పత్రి 04 సీహెచ్‌సీలు 08 అర్బన్ హెల్త్ సెంటర్లు 15 పీహెచ్‌సీలు 50 ● బంగారుపాళ్యంకు చెందిన ఓ గృహిణి ఇంట్లో పనులు చేస్తూ కాలుజారి పడింది. యూట్యూబ్‌లో చూసి సెల్ఫ్ మెడికేషన్ వాడడం మొదలు పెట్టింది. నాలుగు రోజుల తర్వాత కూడా నొప్పి తగ్గకపోగా.. కాలు వాపు మరింత పెరిగింది. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. నెల రోజుల పాటు చికిత్సనందించారు. బిల్లు కూడా అధిక మొత్తంలో వేశారు. గాయమైన మొదట్లోనే వైద్యుడ్ని సంప్రదించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికులు సూచించారు. ● చిత్తూరు నగరంలోని రాజేంద్ర అనే వ్యక్తి గుండె నొప్పిగా ఉందని ఓ ప్రైవేటు డాక్టర్‌ను ఆశ్రయించాడు. ఆ డాక్టర్ (జూనియర్ డాక్టర్) క్షుణంగా పరిశీలించారు. ఇతర సమస్యలపైనా ఆరా తీశారు. తర్వాత ఆ నొప్పి ఆధారంగా.. ఏఐలో సర్చ్ చేశారు. వాటి ఆధారంగా కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి మాత్రలు ఇచ్చారు. గుండె నొప్పి తగ్గకపోగా కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చాయి. ● చిత్తూరు నగరానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి ఒళ్లు నొప్పులతో బాధపడుతూ మాత్రల కోసం గూగుల్‌ను ఆశ్రయించాడు. వాటిని వేసుకున్న తర్వాత కూడా నొప్పులు తగ్గకపోగా జ్వరం వచ్చింది. వారం రోజుల తర్వాత ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి సరైన చికిత్సనందిస్తే కాస్త కోలుకున్నాడు. .. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. చాలా మంది తమ సమస్యలకు సంబంధించి గూ గుల్, యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్నారు. అక్కడ సూచిస్తున్న మందులు వాడి ప్రాణాల మీద కు తెచ్చుకుంటున్నారు. ఇలా సొంత వైద్యం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇప్పుడు ఏ సూచన కావాలన్నా.. ఏ విషయం తెలుసుకోవాలన్నా.. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)నే ఫాలో అవుతున్నారు. ఆరోగ్య విషయంలో కూడా దాన్నే నమ్ముకోవడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. కొందరు చాట్‌జీపీటీలో ఏ రోగానికి ఏ మాత్రలు వాడలో వెతుకుతూ.. అధిక డోసులు కలిగిన మందులు వాడేస్తున్నారు. ఫలితంగా కొత్త రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. చివరికి రోగం ముదిరి ప్రాణాల మీదకి రాగానే ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. అలెర్జీ ఉన్న వారికి గూగూల్ చెప్పిన మందులు వాడడం వల్ల శరీరంలో తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఏర్పడి రోగం ముదురుతుంది. సెల్ఫ్ మెడికేషన్ కేసులకు జిల్లా నిలయంగా మారింది. ఈ తరహా వాడకం వల్ల రోగాలు ముదిరి చివరి దశలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. తిరుపతి స్విమ్స్, రుయా, చిత్తూరు జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో నిత్యం ఉండే ఓపీ సేవల్లో సగానికి పైగా కేసులు ఇలాంటి తరహాలోనే ఉంటున్నాయి. ఇందులో ప్రధానంగా నడివయస్సు వారే అధికంగా ఉండడం గమనార్హం. అందులోనూ విద్యావంతులు కూడా ఉంటున్నారు. సొంత వైద్యానికి ప్రాధాన్యం చిన్నరోగానికే వైద్యుని వద్దకు వెళితే డబ్బులు ఖర్చు అవుతాయని చాలామంది భావిస్తున్నారు. అందుకే ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటర్నెట్, మెడికల్ దుకాణాలు, ఇరుగు పొరుగు వారి సలహాలతో కావాల్సిన మందులు కొని వాడుతున్నారు. నాలుగు రోజుల వరకు సమస్య తగ్గకుండా విషమిస్తే గానీ ఆస్పత్రికి వెళ్లడం లేదు. సీజనల్ వ్యాధుల విషయంలోనూ ఇదే తంతు. మలేరియా, డెంగీ లక్షణాలు ఉన్నా తేలిగ్గా తీసుకోవడం, రోగం ముదిరిన తర్వాత ఆస్పత్రిలో చేరుతున్నారు. వైద్య పరీక్షల్లో రోగం తీవ్రత తెలిసి బెంబేలెత్తిపోతున్నారు. గూగుల్, చాట్ జీపీటీల వాడకం వల్ల నిండు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో విద్యావంతులతో పాటు డాక్టర్లు సైతం ఏఐ ముసుగులోనే విచ్చలవిడిగా మందులు వాడి రోగాల పాలు ఏఐ సూచనలు మాత్రమే.. ట్రీట్మెంట్ చేయదంటున్న వైద్యులు ఆన్లైన్ వైద్యం మంచిది కాదు జనం టెక్నాలజీ మీద పడిపోతున్నారు. ఏం కావాలన్నా ముబైల్ ఫోన్లో సర్చ్ చేసి చూస్తున్నారు. ముఖ్యంగా వైద్యం విషయంలో ఈ రకమైన ప్రయత్నాలు వద్దు. ఏఐ డయోగ్నోసిస్లో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేతప్ప వైద్యం చేయదు. డబ్బులు ఖర్చవుతాయని ఇలాంటి ట్రిక్స్ చేస్తే.. అనారోగ్య సమస్యలు తప్పవు. డాక్టరు సలహాతోనే మందులు వాడాలి. – అశోక్‌కుమార్, వైద్యనిపుణులు, చిత్తూరు -
దైవదర్శనానికి వెళ్తూ ప్రమాదం
రొంపిచెర్ల : తమిళనాడులోని అరుణాచలం దైవదర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన తిరుపతి–మదనపల్లె జాతీయ రహదారిలో జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ కడప యర్రముక్కపల్లెకు చెందిన రమణ కుటుంబ సభ్యులు ఏడుగురు అరుణాచలం ఆలయ దర్శనం కోసం ఆదివారం బయలుదేరారు. చిత్తూరు మీదుగా వెళ్లాల్సిన వారు తిరుత్తణికి వెళ్లి అక్కడ దేవుని దర్శనం చేసుకుని మళ్లీ అరుణాచలం పోదామని వెళ్తుండగా రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు బస్టాప్ వద్ద తిరుపతి నుంచి రాయచోటికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, అరుణాచలం వెళ్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రమణ (59), భార్య రాధ(55), చైతన్య(16), రేష్మిక (4) గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో చికిత్స కోసం పీలేరు ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన మహిళ రాధ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దైవ దర్శనానికి వెళ్తూ జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, కారు రెండు దెబ్బతిన్నాయి. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శిఽంచి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు.. కారు ఢీ : మహిళ మృతి ముగ్గురికి గాయాలు -
తుడా చైర్మన్‌గా దివాకర్‌రెడ్డి
తిరుపతి తుడా:తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) చైర్మన్‌గా డాలర్స్ దివాకర్ రెడ్డి పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 నామినేటెడ్ పోస్టుల ను భర్తీ చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లా పరిధిలో నలుగురికి చోటు లభించింది. ఆశావహులకు భంగపాటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ సీనియర్ నాయకులు మబ్బుదేవనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి నుంచి శంకర్‌రెడ్డి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఆశీస్సులతో బడి సుధాయాదవ్, నగిరి నియోజకవర్గానికి చెందిన ఓ కాంట్రాక్టర్ తుడా చైర్మన్ కోసం పోటీ పడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సైతం చివరి వరకు పైరవీలు చేశారు. అనేక మంది ఆశావహులు పోటీపడి భంగపడ్డారు. చివరికి మంత్రి లోకేష్ ఆశీస్సులతో దివాకర్ రెడ్డికే తుడా చైర్మన్‌గిరి దక్కింది. నామినేటెడ్ పదవులు ప్రకటించడంతో తిరుపతిలోని టీడీపీ ముఖ్యనేతలంతా అసంతృప్తిలో ఉన్నారు. అసంతృప్తిలో సీనియర్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నాలుగు నామినేటెడ్ పదవులను ప్రకటించారు. ఇందులో తుడా చైర్మన్ సహా మిగిలిన పోస్టుల భర్తీ పై అసంతృప్తి సెగలు వ్యక్తమవుతున్నాయి. తమకు పనికిరాని పదవులు కట్టబెట్టారని మండిపడుతున్నారు. ఈ పదవులు నాలుక మీద గీసుకునేందుకు కూడా పనికిరావని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పార్టీ అధిష్టానం పై రగిలిపోతున్నారు. నామినేటెడ్ పదవుల్లో పలువురికి చోటు చిత్తూరు అర్బన్: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కూటమి నాయకులకు పదవులు వరించాయి. ఇందులో రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా కుప్పంకు చెందిన రాజశేఖర్, రాష్ట్ర గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా తిరుపతికి చెందిన సుగుణమ్మ, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా తిరుపతికి చెందిన దివాకర్‌ను, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా తిరుపతికి చెందిన పసుపులేటి హరిప్రసాద్‌ను నియమించింది. బంగారు నగలు అప్పగింత చిత్తూరు అర్బన్ : పోగొట్టుకున్న బంగారు నగలను ఓ వ్యక్తి పోలీసుల సమక్షంలో ఆదివారం బాధితుడికి అప్పగించారు. చిత్తూరు వన్‌టౌన్ పోలీసుల వివరాల మేరకు గంగాధర నెల్లూరు మండలానికి చెందిన కాంట్రాక్టర్ యోగానందం జ్యోతి ట్రేడర్స్‌లో రెండు బ్యాగుల బియ్యం కొనుగోలు చేశారు. ఈ బ్యాగులను కారులో పెడుతున్న సమయంలో బంగారు ఆభరణాల బ్యాగును మరిచి..రోడ్డుపైనే పెట్టేసి బెంగుళూరు వెళ్లిపోయాడు. ఇంటికెళ్లి చూసే సరికి ఆ నగల బ్యాగు కనిపించకుండా పోయింది. దీంతో బాధితుడు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ఆ ప్రాంతంలో ఓ చిన్న షాపు నడుపుతున్న వినాయకం ఆ బంగారు ఆభరణాల బ్యాగును భద్రపరిచినట్లు గుర్తించారు. పోగొట్టుకున్న 240 గ్రాముల బంగారు ఆభరణాల బ్యాగును బాధితుడికి అప్పగించారు. ఈ సందర్భంగా వినాయకంను అభినందించి రూ. 5 వేల నగదును బహుమతిగా అందజేశారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలి చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులు క్రీడల్లో రాణించాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంజయ్ గాంధీ నగర్లో ఉన్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్ బాలికల గురుకుల పాఠశాలలో వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముంబయికి చెందిన హై 5 బాస్కెట్ బాల్ ఫౌండేషన్ ఏప్రిల్ 26 నుంచి మే 11 వరకు బాస్కెట్ బాల్ వేసవి రెసిడెన్షియల్ శిక్షణ నిర్వహించారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి అవసరమైన ఖర్చులు మొత్తం ఫౌండేషన్ నిర్వహించిందని తెలిపారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు ఫౌండేషన్ నిర్వహించిన శిక్షణ శిబిరం అభినందనీయమన్నారు. అనంతరం వేసవి శిక్షణ కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పి చిన్నికష్ణ, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెంగల్రాయ నాయుడు, హై 2 ఫౌండేషన్ మేనేజర్ స్నేహిత, జయ సూర్య పాల్గొన్నారు. -
బుల్లెట్ ట్రైన్.. భూసేకరణ షురూ!
● సచివాలయాల్లో ఎల్ఏ వివరాల ప్రదర్శన ● మార్కెట్ రేటుపై నాలుగురెట్లు ఎక్కువగా పరిహారం కోరుతున్న రైతులు ● నిర్ధారణ కాని అలైన్మెంట్లు పలమనేరు : బుల్లెట్ ట్రైన్ మార్గానికి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 70 కి.మీలలో భూసేకరణ పనులు ఊపందుకున్నాయి. చైన్నె–బెంగళూరు– మైసూరు బుల్లెట్ ట్రైన్ మార్గానికి మూడు రాష్ట్రాల్లో 435 కిలోమీటర్లలో పనులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆ మేరకు జిల్లాలోని పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లోని బైరెడ్డిపల్లి, పలమనేరు, బంగారుపాళెం, గుడిపాల మండలాల్లోని ఈ మార్గం వెళ్లే గ్రామాలకు సంబంధించిన సచివాలయాల్లో భూములు కోల్పోనున్న రైతుల పేరు, సర్వే నంబరు, ఎంత మేర భూసేకరణ చేస్తారనే విషయాలను తెలుపుతూ నోటీసులను ప్రదర్శించారు. కర్ణాటక రైతుల మాదిరిగానే పరిహారం బెంగళూరు– చైన్నె ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కోసం గతంలో ఇదే ప్రాంతంలో రైతుల నుంచి భూములను సేకరించారు. ఇందులో చాలా మంది రైతులకు గిట్టుబాటు అవార్డు దక్కలేదని వారు న్యాయస్థానాలను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ (నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్) అధికారులు, కర్ణాటకలోని కోలారు డీసీ (డిస్ట్రిక్ కలెక్టర్) ద్వారా జరిపిన భూసేకరణ కార్యక్రమంలో అక్కడి రైతులు మార్కెట్ ధరపై నాలుగు రెట్లు ఎక్కువగా నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని భూములు కోల్పోయే రైతులు సైతం తమకు కర్ణాటక రైతులు తరహాలోనే తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సచివాలయాల్లో పెట్టిన భూసేకరణ నోటీసులు అలైన్మెంట్ల గందరగోళం బుల్లెట్ ట్రైన్ కోసం ఇప్పటికే సర్వేకోసం హైవే మాగ్నిట్యూడ్ కంపెనీ, ట్రాఫిక్ కోసం పీకే ఇంజినీర్స్, అలైన్మెంట్ కోసం ట్రాన్స్‌లింక్, ఫైనల్ అలైన్మెంట్ కోసం ఆర్వీ అసోషియేట్స్, సర్వేకోసం సుబుది టెక్నాలజీస్, ఎస్ఐఏ కోసం ఓవర్సీస్ మిన్టెక్ కంపెనీలు పనులు చేపట్టారు. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటి దాకా రెండు అలైన్మెంట్లపై సర్వే చేపట్టారు. అయితే వీటిల్లో దేన్ని నిర్ధారిస్తారో ఇంకా సృష్టం కాలేదని సమాచారం. భూసేకరణ వివరాలు ప్రదర్శన పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలం కంభంపల్లి, గడ్డూరు, రామణపల్లి, గంగినాయనిపల్లి, బేలుపల్లి, పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి, సముద్రపల్లి, పెంగరగుంటల మీదుగా బంగారుపాళెం మండలంలోని గొల్లపల్లి, బోడబండ్ల, మహాసముద్రం, గుడిపాల మండలంలోని మాధవరం, జంగాళపల్లి, చిత్తూరు మండలంలోని ఇరువారం, కలెక్టర్ ఆఫీసు, గువ్వకల్లుల మీదుగా తమిళనాడులోకి బుల్లెట్ ట్రైన్ ప్రవేశిస్తుంది. ఈ గ్రామాలకు సంబంధించిన సచివాలయాల్లో ఇప్పటికే భూములు కోల్పోయే రైతుల పేర్లు, వారి మొత్తం విస్తీర్ణం, అందులో ఎల్ఏ విస్తీర్ణాలను తెలుపుతూ వివరాలను అక్కడి నోటీసు బోర్డులౖపై ప్రదర్శించారు. ఆ మేరకు జిల్లాలో 70 కిలోమీటర్ల మేర ఈ బుల్లెట్ ట్రైన్ మార్గం వెళ్లనుంది. -
నేడు పోలీసు గ్రీవెన్స్
చిత్తూరు అర్బన్ : నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. పే..ద్దపాము చౌడేపల్లె : చౌడేపల్లె మండలం పెద్దకొండామర్రి పంచాయతీ కోటూరు సమీపంలోని పంట పొలంలో వేసిన గుడిసెలో తొమ్మిది అడుగుల పొడవు గల భారీ జెర్రిపోతును ఆదివారం గుర్తించారు. పొలం యజమానులు భయంతో అక్కడే చంపేశారు. -
● తొలకరి సీజన్లో పిడుగులు పడే అవకాశం ● పిడుగుపాటుతో పెను ప్రమాదం ● అప్రమత్తతే శ్రీరామరక్ష
పాలసముద్రం: వేసవిలో ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరడంతోపాటు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో ఇటీవల అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఉరుములతో కూడిన పిడుగులు పడుతున్నాయి. మనుషులతోపాటు మూగజీవాలు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో పిడుగు మాట వింటేనే భయమేస్తోంది. మెరుపు మెరిసి బలంగా ఉరిమిందటే ఎక్కడో ఓ చోటు పిడుగు పడే ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఉరుము ఉరిమిందంటే పొలాల్లోని రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు పిడుగు భయంతో చెట్ల చాటుకు పరుగులు తీస్తారు. ఒక్కొక్కసారి అదే వారి ప్రాణం మీదకు తీసుకొస్తుంది. చెట్లు ఎత్తుగా ఉండడంతో పిడుగులు ఎక్కువగా వాటిని ఆకర్షిస్తాయి. ఈ విషయం తెలియక చెట్ల కిందకు వెళ్లి పిడుగుపాటుతో చనిపోయినవారు జిల్లాలో లేకపోలేదు. అలాంటి వారిలో రైతులు, రైతు కూలీలే ఎక్కువగా ఉంటున్నారు. అయితే ఇటీవల పిడుగులు ఏ ప్రాంతంలో ఏ సమయంలో పిడుగు పడే ప్రమాదం ఉందో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుగానే పసిగట్టి తెలియజేస్తున్నారు. దీంతో కొంతవరకు నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తే పిడుగు ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. ఆరు బయట ఉండకూడదు ఉరుములు, మెరుపులు, వర్షం కురిసే సమయంలో ఎత్తైన కొండలు, అటవీ ప్రాంతాలు, మైదానాలు, పొలాల్లో ఉండకూడదు. అలాగే పొడవైన చెట్ల కింద ఉండకూడదు. ఒకే చోట గుంపుగా ఉండకూడదు. గొడుగులు వాడకూడదు. చేతిలో పలుగు, పార లాంటి ఇనుప వస్తువులు పెట్టుకోకూడదు. పిడుగు బారి నుంచి తప్పించుకునేందుకు నివాస గృహాలే మేలు. – హేమలత, ప్రిన్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల అప్రమత్తంగా ఉండాలి మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పిడుగుపాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పొలాల్లో ఉన్న రైతులు, కూలీలు సాధ్యమైనంత తొందరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద, ఎత్తెన ప్రదేశాల్లో, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఉండకూడదు. – హనుమంతరావు, జిల్లా ఇమ్యూనేజేషన్ ఆఫీసర్, చిత్తూరు పాటించాల్సింది ఇవి.. వర్షం పడుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎత్తైన చెట్లు, సెల్ టవర్లు, స్తంభాలు, కొండలు వద్దకు వెళ్లకూడదు. ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలి. కంప్యూట ర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, విద్యుత్ స్టవ్‌లు, ఇతర విద్యుత్తు పరికరాలు ఉపయోగించకూడదు. వర్షం కురిసినప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉరుములతో కూడిన వర్షం వస్తున్నప్పుడు నీటితో కూడిన పనులు చేయకూడదు. గుంపులుగా ఉండకుండా దూరంగా ఉండాలి. ముఖ్యంగా పొలాల్లో పనిచేయడం, పశువులను మేపడం, చేపలు పట్టడం వంటివి చేయకూడదు. -
సిద్దంపల్లిలో చైన్ స్నాచింగ్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు మండలం సిద్దంపల్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు (తాళిబొట్టు గొలుసు) అపహరించారు. పోలీసుల వివరాల మేరకు ఇలా...సిద్దంపల్లి గ్రామానికి చెందిన వెంకటాద్రినాయుడు భార్య ధనలక్ష్మి ఇంటి బాల్కనీలో పడుకున్నారు. అర్ధరాత్రి వచ్చిన దొంగలు వీధిలైట్లు ఆఫ్ చేసి ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె మెడలో బంగారు గొలుసును చోరీ చేశారు. ఈ చోరీలో సగం గొలుసు మాత్రం దొంగ చేతికి చిక్కింది. ఇంతలో మంచంపై పడుకున్న బాధితురాలి కొడుకు కేకలు పెట్టడంతో మిగిలిన సగం గొలుసును వదిలి దొంగ గోడ దూకి పరారయ్యాడు. బాధితురాలు చిత్తూరు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా చోరీకి గురైన గొలుసు మొత్తం 27 గ్రాములు..అందులో సుమారు 10 గ్రాముల గొలుసు భాగాన్ని దొంగ చోరీ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
18 ఏళ్ల సేవలపై వేటు !
పుత్తూరు : మున్సిపాలిటిలో 18 ఏళ్లుగా జనన, మరణాల చూసే రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికురాలు కృష్ణ జయంతిని ఎలాంటి తప్పు చేయకున్నా.. కేవలం కక్ష సాధింపుతో తొలగించి ఆమె జీవితాన్ని నడిరోడ్డు మీదకు లాగారు. గత నెల 8వ తేదీన కృష్ణ జయంతిని సెలవుపై వెళ్లాలని కమిషనర్ మంజునాథగౌడ్ ఆదేశించారు. తాను ఏదైనా తప్పు చేశానా? నన్ను రావొద్దనడానికి గల కారణాలను చెప్పాలని ఆమె ప్రాధేయపడింది. నాపై ఒత్తిడి ఉంది.. మళ్లీ చెప్పే వరకు ఆఫీసుకు రావద్దంటూ కమిషనర్ చెప్పడంతో ఆమె మౌనంగా వెనుదిరిగారు. ఇది జరిగి నెల కావస్తుండగా ఈ లోపు తిరిగి విధుల్లో చేరడానికి ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా ఫలితం శూన్యం. గేట్‌పుత్తూరుకు చెందిన జేసీబీ బాబు అనే వ్యక్తి తన కుటుంబంతో ఉన్న వ్యక్తిగత గొడవలకు రాజకీయ రంగు పులిమి తనను ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని జయంతి ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో సుమారు రెండు దశాబ్దాలుగా రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణజయంతిని విధుల నుంచి తప్పించడంపై ఏపీ మున్సిపల్ ఇంజినీరింగ్–టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలగింపు! రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకు కమిషనర్ చర్యలు కక్ష సాధింపే కారణమంటున్న బాధితురాలు -
కిక్కిరిసిన కాణిపాకం
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు కిక్కిరిశారు. సెలవులు కావడంతో భక్తులు స్వామి దర్శనార్థం ఉదయం నుంచే క్యూ కట్టారు. ఉచిత, శ్రీఘ్ర, అతిశీఘ్ర, వీఐపీ దర్శన క్యూలైన్లు అన్నీ కిటకిటలాడాయి. దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. క్యూలో ఉన్న భక్తులకు అల్పాహారం అందజేశారు. ప్రముఖులు వచ్చినా భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన సేవలు కల్పించారు.నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదికచిత్తూరు కలెక్టరేట్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.ఆన్లైన్లో పోస్టుల మెరిట్ జాబితాచిత్తూరు రూరల్ (కాణిపాకం):జిల్లా వైద్య విధా న పరిషత్‌లో పలు పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితాను ఆన్లైన్ ఉంచినట్లు డీసీహెచ్ఎస్ పద్మాంజలి తెలిపారు. ఎంపికై న వారి కి మంగళవారం ఉదయం 9 గంటలకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులకు ఫోన్‌కాల్ ద్వారా తెలియజేశామని, కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని పేర్కొన్నారు.జనారణ్యంలోకి దుప్పివెదురుకుప్పం : మండలంలోని పచ్చికాపల్లంలో ఆదివారం సమీప అటవీ ప్రాంతం నుంచి ఓ దుప్పి వచ్చింది. రక్త గాయాలతో ఉండగా గమనించిన స్థానిక రైతు ఇంటికి తీసుకెళ్లి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి దుప్పిని స్వాధీనం చేసుకొని చికిత్స చేయించి అడవిలో వదిలారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
● నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ● పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు ● జిల్లాలో 35 పరీక్ష కేంద్రాలు ● హాజరుకానున్న 15,377 విద్యార్థులుచిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఇంటర్మీడియట్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. ఈనెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను లోపలికి అనుమతించరాదని బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. జిల్లాలోని పరీక్షలు నిర్వహించే 35 పరీక్ష కేంద్రాల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని ఆన్లైన్న్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షించనున్నారు. జిల్లా సమాచారం మొదటి సంవత్సరం విద్యార్థులు (జనరల్) 10,236 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు (జనరల్) 3,724 మొదటి సంవత్సరం (ఒకేషనల్) 810 ద్వితీయ సంవత్సరం (ఒకేషనల్) 607 మొత్తం విద్యార్థులు 15,377 పరీక్ష కేంద్రాలు 35ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశాం. పరీక్షల నిర్వహణలో తప్పిదాలు చోటు చేసుకుంటే కఠిన చర్యలుంటాయి. కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరిగినా సీఎస్, డిపార్ట్మెంటల్ అధికారులదే బాధ్యత. – శ్రీనివాసులు, ఇంటర్మీడియట్ డీఐఈవో, చిత్తూరు -
ఇష్టారాజ్యంగా మింగేస్తున్నారు!
చెరువు చుట్టూ పదూళ్లకు ఆదరువు.. చెరువే మనుగడకు ఆధారం..తొలకరికి ఆవాసం.. సిరులకు ప్రాకారం.. చెరువే సమస్తం.. మన నేస్తం.. అలాంటి నీటి వనరులను అభివృద్ధి చేసి వినియోగించుకోవాలి. అయితే వాటికి రక్షణ లేకుండా పోతోంది. పైగా అవి అక్రమణలకు అడ్డాగా మారుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు కళ్లున్న ధృతరాష్ట్రుల్లా చేష్టలుడిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫలితంగా వందలాది ఎకరాల విస్తీర్ణంతో అలరారే చెరువులు చిక్కి శల్యమై.. చివరకు కనుమరుగవుతున్నాయి. కబ్జాలకు కారణాలివే.. ● అధికార యంత్రాంగం ఉదాసీనత. ● చెరువుల సరిహద్దులు నిర్దేశించకపోవడం. ● చిత్తూరు, తిరుపతి నగరాల్లో భూములకు భారీ డిమాండ్ రావడం. ● తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లను అడ్డుకోలేక పోవడం. ● రెవెన్యూ, ఇరిగేషన్, పురపాలక, నగరపాలక అధికారుల మధ్య సమన్వయలోపం. ● చట్టంలోని లొసుగుల కారణంగా ఆక్రమణలు గుర్తించినా తొలగించే పరిస్థితి లేకపోవడం. ● చెరువును పూడ్చి అందులో అక్రమంగా నిర్మించి న నివాసాలకు విద్యుత్,నీటి వసతి కల్పించడం. ● అధికార పార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులే పలుచోట్ల చెరువుల్లో వెంచర్లు వేయడం. ● వరదలొచ్చి మునిగినప్పుడే తప్ప మిగిలిన సమయాల్లో అధికారులు ఆక్రమణలపై దృష్టి పెట్టకపోవడం. చిత్తూరు కలెక్టరేట్ : చెరువు అంటేనే రైతాంగానికి, నీటి నిల్వలకు కల్పతరువు. కానీ అవే చెరువులు మరికొద్ది రోజుల్లో పుస్తకాల్లో మాత్రమే చదువుకునే స్థితికి చేరుకునేలా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కబ్జాలకు గురవుతున్నాయి. రెండు జిల్లాల్లో వేల సంఖ్యలో చెరువులు ఆక్రమణల చెరలో పడినట్లు చెరువుల పరిరక్షణ సమితి సభ్యులు వెల్లడిస్తున్నారు. ఈ లెక్కన కనిపించకుండా పోవడానికి మరెంతో కాలం పట్టేట్టు లేదు. ఇటీవల పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో చెరువుల పరిరక్షణకు తీసుకొచ్చిన హైడ్రా చట్టం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కారు చెరువులు కబ్జాకు గురవుతున్నా చూసీ చూడనట్టు మిన్నకుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణల పర్వం ఇలా.. ● చిత్తూరు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోని గిరింపేట గంగినేని చెరువు నగరంలో ప్రధానమైనది. ఇది 45 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఇప్పటికే 10 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి.. చెరువు సమీపంలో 125–1 సర్వే నంబర్‌తో 1975లో డీకేటీ పట్టా ఇచ్చారు. దాన్ని మళ్లీ అధికారులే 1978లో రద్దు చేశారు. అలాగే నగర శివారులోని జడియం చెరువు, కట్టమంచి చెరువు, దుర్గానగర్ కాలనీలోని కుమ్మరివాని కుంట చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోని చెరువుల్లో దాదాపు 75 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. ● నగరి నియోజకవర్గంలోని వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం చెరువు ఆక్రమణకు గురైంది. ఆ చెరువు మొత్తం విస్తీర్ణం 487 ఎకరాలు. అందులో 48 ఎకరాలు, 439 ఎకరాలకు మునక పట్టాలు ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జీవో నంబర్ 188 ప్రకారం చెరువులో నీరు లేనప్పుడు మాత్రమే రైతులు సాగు చేయాలి. అయితే స్థానిక టీడీపీ నాయకుడు చెరువులో గ్రావెల్ పోసి లెవల్ చేసుకుని దాదాపు 2 ఎకరాలు ఆక్రమించుకున్నారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. ● తిరుపతి నగరంలోనే 8 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పార్టీలకు చెందిన నేతలు పోటాపోటీగా ఆక్రమించేస్తున్నారు. కొందరు నేతలు రెవెన్యూ అధికారులకు ముందే చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఖాళీగా ఉన్న చెరువు స్థలాన్ని ఆక్రమిస్తున్నాం. దాని జోలికి రాకండి అంటూ ఆదేశిస్తున్నారు. దీంతో కొందరు రెవెన్యూ అధికారులు ఆక్రమణలపై తమకు సమాచారం ఉన్నప్పటికీవాటి జోలికి వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నాచెరువు 77.46 ఎకరాలు, శెట్టిపల్లె చెరువు 55.25 ఎకరాలు, చెన్నాయగుంట 52.56 ఎకరాలు, పాన్ చెరువు 49.40 ఎకరాలు, కొరమీనుగుంట 32.20 ఎకరాలు, పూలవాని గుంట 23.82 ఎకరాలు, గొల్లవాని గుంట 29.04 ఎకరాలు, మంగళం చెరువు 75.98 ఎకరాలు ఉంది. మొత్తంగా 8 చెరువుల విస్తీర్ణం 395.71 ఎకరాలు అయితే ఇందులో 100 ఎకరాలకు పైగానే ఆక్రమణలకు గురైంది. ● తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం జంగాలపల్లెలోని సాగునీటి చెరువు 15 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆ చెరువు స్థలాన్ని నాయుడుపేటకు చెందిన వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ● తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు చెరువు విస్తీర్ణం సుమారు 156 ఎకరాలు. అందులో 50 ఎకరాల వరకు రైతులు ఆక్రమించుకుని సాగు చేస్తున్నారు. ● తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాళెంలోని చెరువు ఆక్రమణకు గురవుతోంది. సర్వే నంబర్ 839లోని 11 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది . అది రోడ్డుకు ఆనుకుని ఉండడంతో అక్రమంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. అధికారులు ఈ విషయం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ● చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో మొత్తం 787 చెరువులున్నాయి. ఇందులో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు (100 ఎకరాల విస్తీర్ణం ఉన్నవి) 57 వరకు ఉన్నాయి. చిన్నపాటి కుంటలు 60 వరకు ఆక్రమణలకు గురై కనుమరుగయ్యాయి. మిగిలిన వంద చెరువులు 10 నుంచి 30 శాతం వరకు కబ్జాల బారిన పడ్డాయి. ఈ చెరువుల కింద ఆయకట్టు గతంలో 20 వేల హెక్టార్లుగా ఉండగా ఇప్పుడు 2 వేల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేస్తున్నారు. ● సత్యవేడు మండలం మాదనపాళెం గ్రామంలోని చెరువు ఆక్రమణ చెరలో చిక్కుకుంది. కొందరు అక్రమార్కులు దర్జాగా ఇళ్ల నిర్మాణం చేపట్టేశారు. మాదనపాళెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 839లో 11 ఎకరాల విస్తీర్ణంలో ఇరిగేషన్ చెరువు ఉంది. దీని ఆయకట్టు భూములను శ్రీసిటీ సెజ్‌కు కేటాయించారు. ఇదే అదునుగా కబ్జాదారులు రెచ్చిపోయి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. చిట్టమూరు మండలం జంగాలపల్లి చెరువులో ఆక్రమణలుఆక్రమణలో చిత్తూరు జిల్లా కేంద్రంలోని గంగినేనిచెరువు తిరుపతి జిల్లా కేంద్రంలో ఆక్రమణలో చెన్నాయగుంట చెరువుకబ్జాకు గురైన సత్యవేడు మండలం మాదనపాలెం గ్రామ చెరువుఅడిగేదెవరు.. ఆపేదెవరు? చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెరిగిపోతున్న చెరువుల హద్దులు నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు యథేచ్ఛగా ప్లాట్లు వేసి విక్రయాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులుచిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పట్టణాలు, నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఆక్రమణదారులు చెరువుల్ని మింగేస్తున్నారు. వందల సంఖ్యలో జల వనరులు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు తాగునీటి అవసరాలు తీర్చిన వాటిలో కొన్ని ఆక్రమణల పాలై కనుమరుగు కాగా మరికొన్ని మురుగునీటి కాసారాలుగా మారుతున్నాయి. గట్లు, కాలువతోపాటు చెరువుల భూములను ప్లాట్లుగా మార్చేస్తున్నా రు. చెరువుల్లో ఏర్పాటు చేసిన వెంచర్లతో రూ.వందల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది. 2వేల వరకు కబ్జా కోరల్లో..! చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మొత్తం 8,063 చెరువులు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో దాదాపు 2 వేల చెరువులు ఆక్రమణలకు గురైనట్లు తెలుస్తోంది. వీటిలో అత్యధికంగా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన కబ్జాలే ఎక్కువ. సామాన్యుడు చెరువు గట్టుపై చిన్న పాక వేస్తే అధికారులు వెంటనే స్పందిస్తారు. ఆగమేఘాలపై వాటిని తొలగించేస్తారు. అదే ఆక్రమణలకు పాల్పడిన కూటమి ప్రజాప్రతినిధుల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
రిజిసే్ట్రషన్లకు అగచాట్లు
రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లాలోని క్రయ, విక్రయదారులకు చుక్కలు చూపిస్తోంది. నెలలు గడుస్తున్నా స్టాంపు పేపర్ల సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆస్తుల కొనుగోలు, విక్రయాలు చేసేవారు అగచాట్లు పడుతున్నారు. సమస్య కొన్ని నెలలుగా ఉన్నా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్టాంపుల కొరతను సాకుగా చూపి వెండార్లు ధరలు రెట్టింపు చేశారు. కొంత మంది రూ.100 స్టాంపును రూ.200కు విక్రయిస్తున్నారు. గత్యంతరం లేక అధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని క్రయ విక్రయదారులు వాపోతున్నారు. ●పిచ్చాటూరు వెళ్లి కొన్నా.. మా ఆస్తుల సెటిల్మెంట్కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చింది. అయితే అవసరమైన స్టాంప్ పేపర్లు నగరిలో లేవు. రిజిష్ట్రార్ కార్యాలయంలో రెండు పత్రాలు మాత్రమే ఇచ్చారు. దీంతో తిరుపతి జిల్లా పిచ్చాటూరుకు వెళ్లి స్టాంప్ పేపర్లు కొనుగోలు చేశా. ప్రింటింగ్‌లో ఏదైనా పొరపాటు జరిగితే మళ్లీ స్టాంపులు కొనాల్సి వస్తుందేమోననే భయంతో రెండు పేపర్లు అదనంగానే కొనాల్సి వచ్చింది. – గురుమూర్తి, టివి కండ్రిగ, నగరి మండలం ఈ–స్టాంపులతోనూ చేసుకోవచ్చు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి సబ్ రిజిస్ట్ష్ట్రార్ కార్యాలయాలకు స్టాంపులు అందుతాయి. సమస్య వారి దృష్టికి తీసుకెళ్లగా త్వరలో పంపుతామని చెప్పారు. రూ.10, రూ.20 స్టాంపులు ఇస్తున్నాం. ఇవేకాకుండా ఈ–స్టాంపులతో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. – సత్యప్రసాద్, సబ్ రిజిస్ట్రార్, కార్వేటినగరం ● నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల కొరత ● స్టాంపు ధరలకు రెక్కలు ● రెట్టింపు ధరలు వసూలు చేస్తున్న వెండార్లు ● కొన్ని నెలలుగా కొరతతో అవస్థలు ● స్టాంపులు చేతికొచ్చాకే స్లాట్ బుకింగ్‌లు నగరి : స్థిరాస్తుల రిజిస్ట్రేషన్, ఒప్పందాలు, ధ్రువీకరణలు, న్యాయపరమైన లావాదేవీలకు వినియోగించే రూ.100, రూ.50, రూ.20, రూ.10 విలువ గల స్టాంపు పేపర్లకు కొరత ఏర్పడింది. చిత్తూరు, చిత్తూరు రూరల్, నగరి, పలమనేరు, పుంగనూరు, కార్వేటినగరం, కుప్పం, బంగారుపాళెం 8 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్లతో నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే ప్రస్తుతం స్టాంపుల కొరత కారణంగా రిజిస్ట్రేషన్లకు ప్రజలు అగచాట్లు పడుతున్నారు. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెండు స్టాంపులకు మించి ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మరికొన్ని కార్యాలయాల్లో రూ.100, రూ.50 స్టాంపులు లేక రూ.20, రూ.10 స్టాంపులు మాత్రమే అందిస్తున్నారు. స్టాంప్ వెండర్స్ వద్ద కూడా స్టాంపులు లభించడం లేదు. నిలిచిన సరఫరా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నాసిక్ ముద్రణాలయానికి అవసరమైనంత ఇండెంట్ పంపించి నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌లను తెప్పిస్తుంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిసారి ముందస్తుగా 20 శాతం వరకు సరుకు నిల్వ చేసి మిగతాది జిల్లా రిజిస్ట్రార్ సరఫరా చేస్తోంది. స్టాక్ పూర్తి కాకముందే ఇండెంట్ పెట్టి తెప్పించుకోవడం ఆనవాయితీ. అయితే అక్కడ చెల్లించాల్సిన బకాయిలు ఉండటంతోనే స్టాంప్ పేపర్లు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు పరుగులు రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల కొరత ఉండటంతో తక్కువగా జరిగే కార్యాలయాలకు పరుగులు తీసి అక్కడి నుంచి స్టాంప్ పేపర్లు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. అలా తెచ్చుకున్న పేపర్లు ప్రింట్ తీయడంలో పొరపాటు జరిగితే మళ్లీ పేపర్ల కోసం తంటాలు పడాల్సి వస్తోంది. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ క్రయ విక్రయదారులకు చుక్కలు చూపిస్తోంది. స్టాంపుల కోసం తిరగలేనివారు ఒకటి రెండు పేపర్లతో పాటు తెల్లబాండ్ పేపర్లు వాడి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించేస్తున్నారు. నెలలు గడుస్తున్నా స్టాంప్ పేపర్ల కొరత సమస్య పరిష్కారం కాకపోవడం ఆస్తులు కొనుగోలు, విక్రయాలు చేసేవారికి ఇబ్బందికరంగా మారింది. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. నాడు రాద్దాంతం.. నేడు ఆధారం గత ప్రభుత్వం ఈ–స్టాంపు విధానాన్ని ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ రాద్దాంతం చేసింది. ఫిజికల్ నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల కంటే ఈ–స్టాంపులు చూడటానికి జిరాక్స్ పేపరు మాదిరిగా ఉందని ప్రింటర్ నుంచి తీసే ఈ–స్టాంపు పేపరుపై అక్షరాలు కొద్ది కాలానికే చెరిగిపోతాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు లభించకపోవడంతో ఈ– స్టాంపులను వాడుకోవాలని కూటమి ప్రభుత్వం సూచిస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ–స్టాంప్‌ల ధరలకు రెక్కలు వచ్చాయి. స్టాంపు ధరకు రెట్టింపు ఇచ్చి కొనాల్సిన పరిస్థితి ఉంది. అధిక ధర వసూలు కొందరు వెండార్ల వద్ద పాత స్టాక్ ఉన్నప్పటికీ డిమాండ్ సృష్టిస్తూ అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. రూ.10 స్టాంపు రూ.50కి రూ.100 స్టాంపు రూ.200కు విక్రయాలు జరుపుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ధర ఎక్కువైనా తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. డిమాండ్‌కు తగిన విధంగా స్టాంపులు లభించని పరిస్థితి నెలకొంది. దీంతో స్థిరాస్తి దస్తావేజులు మినహా మిగిలిన అన్ని లావాదేవీలు లభించే కొద్దిపాటి పేపర్లతోనే కొనసాగుతున్నాయి. ఆ నిల్వలు ఖాళీ అవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. -
చంద్రగిరి వద్ద డివైడర్‌ను డీకొట్టిన బస్సు
చంద్రగిరి: తిరుపతి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టడంతో 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలు.. తిరుపతి అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి తమిళనాడులోని వేలూరు నుంచి తిరుమలకు ప్రయాణికులతో బయలుదేరింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో చంద్రగిరి నియోజకవర్గం అగరాల నారాయణ కళాశాల వద్దకు వచ్చేసరికి బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. దాదాపు 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. బస్సు డ్రైవర్ రాజారెడ్డి, కండక్టర్ లక్ష్మీనారాయణ, ప్రయాణికులు శ్రావణ్‌కుమార్, దీపారాణి, నితీశ్‌కుమార్, అక్షయ్‌కుమార్, తిరుసడై, తేజస్విని, రామ్‌లక్ష్మి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మరికొందరిని చంద్రగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
తప్పులు దొర్లకుండా.. నష్టం కలగకుండా
● బదిలీలు, ఉద్యోగోన్నతుల కసరత్తు వేగవంతం ● ఉమ్మడి చిత్తూరు జిల్లా కసరత్తు ప్రక్రియలో విద్యాశాఖ నిమగ్నం ● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న ప్రక్రియ ● పర్యవేక్షించిన చిత్తూరు, తిరుపతి డీఈవోలు వరలక్ష్మి, కేవీఎన్ కుమార్ చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో టీచర్ల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ త్వరలో నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో ముందస్తు కసరత్తును చిత్తూరు విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. శనివారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ కసరత్తు నిర్వహించారు. ఈ ప్రక్రియలో తప్పులు దొర్లకుండా..ఉపాధ్యాయులకు నష్టం కలగకుండా విద్యాశాఖ అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ కసరత్తులో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల విద్యాశాఖ అధికారులు, డీవైఈఓలు, ఎంఈఓలు పాల్గొన్నారు. పకడ్బందీగా చర్యలు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 66 మండలాల్లో త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియ ఉమ్మడి చిత్తూరు పరిధిలో నిర్వహించనుండడంతో చిత్తూరు విద్యాశాఖ అధికారులు, సిబ్బంది నిద్ర లేని రాత్రులు గడుపుతూ కసరత్తు చేపడుతున్నారు. ఈ ప్రక్రియలో ఏ ఒక్క పోస్టును బ్లాక్ చేయకుండా కసరత్తు నిర్వహిస్తున్నారు. గత నాలుగు నెలలుగా నిర్వహిస్తున్న టీచర్ల సీనియారిటీ, ఖాళీల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ ప్రక్రియలో కీలక ఘట్టం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నిర్ధిష్టమైన ఖాళీలు (క్లియర్ వేకెన్సీలు) చూపే ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియను చిత్తూరు డీఈఓ వరలక్ష్మి, తిరుపతి డీఈఓ కేవీఎన్ కుమార్, డీఈఓ కార్యాలయ ఏడీ వెంకటేశ్వరరావు, డీవైఈఓలు ఇందిర, బాలాజీ, లోకేశ్వరరెడ్డి, 66 మండలాల ఎంఈఓలు, పర్యవేక్షించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న టీచర్ల వివరాలు ప్రభుత్వ యాజమాన్యంలో విధులు నిర్వహిస్తున్న టీచర్లు 598 మండల పరిషత్, జెడ్పీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టీచర్లు 13,969 నగరపాలక కార్పొరేషన్ పరిధిలో: 454 మున్సిపాలిటీ పరిధిలో: 433 మొత్తం విధులు నిర్వహిస్తున్న టీచర్లు: 15,454 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండాల్సిన టీచర్ల పోస్టుల వివరాలు ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని మంజూరు పోస్టులు 723 మండల పరిషత్, జిల్లా పరిషత్ పరిధిలో మంజూరు పోస్టులు 15,552 నగరపాలక కార్పొరేషన్ మంజూరు పోస్టులు 589 మున్సిపాలిటీ పోస్టులు 508 మొత్తం పోస్టులు 17,372ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఖాళీల వివరాలు ప్రభుత్వ యాజమాన్యంలో ఖాళీలు 125 ఎంపీపీ, జెడ్పీ పరిధిలోని ఖాళీలు 1583 నగరపాలక కార్పొరేషన్‌లోని ఖాళీలు 135 మున్సిపాలిటీ పరిధిలోని ఖాళీలు 75 మొత్తం ఖాళీలు 1,918 6 వేల ఖాళీలు చూపే అవకాశం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల వ్యాప్తంగా ప్రస్తుతం 1,918 ఖాళీలున్నాయి. అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రక్రియలో 6 వేల వరకు ఖాళీలు చూపించే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ అధికారుల వెల్లడిస్తున్నారు. అలాగే ఉద్యోగోన్నతులు, మిగిలిన ఖాళీలకు తాజాగా నిర్వహించే డీఎస్సీలో వచ్చే టీచర్లను భర్తీ చేసేందుకు కసరత్తు చేపడుతున్నారు. క్లియర్ వేకెన్సీల వివరాల ఆధారంగా మొదట్లో బదిలీ ప్రక్రియ నిర్వహిస్తారు. ఆ తర్వాత 1:2 విధానంలో ఉద్యోగోన్నతుల జాబితా విడుదల చేయనున్నారు. -
భావప్రకటన స్వేచ్ఛపై ఎదురుదాడి
తిరుపతి సిటీ: ‘ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు. రాష్ట్రంలో అలాంటి హక్కుకు భంగం కలిగేలా ఘటనలు జరగడం ప్రమాదకరం. పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలు చట్ట విరుద్ధం. ప్రభుత్వం చేసే తప్పును ఎత్తి చూపితే కేసులు, భయభ్రాంతులకు గురిచేసేలా దాడులు చేయడంలో ఆంతర్య మేమిటో అర్థంకాని పరిస్థితి. రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థల హవా కొనసాగుతోంది. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదు. సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. ఉద్యోగ, ఉపాధి రంగాలపై దృష్టి లే దు’..అని మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏడాదిగా సాగుతు న్న పాలనపై తన అభిప్రాయాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఇంకా ఏమన్నారంటే.. బలహీన పడుతున్న విద్యావ్యవస్థ రాష్ట్రంలో పాఠశాలలు బలహీన పడే పరిస్థితి నెలకొంది. 9 రకాల పాఠశాలల ఏర్పాటు అనే కాన్సెఫ్ట్‌తో ప్రభుత్వం నూతన సంస్కరణలను ప్రవేశపెట్టింది. దీంతో వందల సంఖ్యలో పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది. సుమారు 10వేల ఉపాధ్యాయ పోస్టులు సర్ప్లస్ కానున్నాయి. గత ప్రభుత్వంలో మ్యాథ్స్, ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు ఇచ్చిన ప్రమోషన్లు రద్దు కానున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు సంస్థలు విలయతాండవం చేయనున్నాయి. ప్రైవేటు యూనివర్సిటీలను ప్రొత్సహించడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాడు–నేడు పథకంతో గత ప్రభుత్వం పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించింది. మరికొన్ని పాఠశాలల్లో మౌలికవసతులను కల్పించాల్సి ఉంది. వాటిని పట్టించుకోవడం లేదు. 17 మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని గత ప్రభుత్వ చర్యలు తీసుకుంటే, కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వక్తుల చేతుల్లో పెట్టడం సరైన పద్ధతి కాదు. డీఎస్సీపై ఆంక్షలు దారుణం మెగా డీఎస్సీ పేరుతో 16 వేల పోస్టులకు పైగా విడుదల నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం అందులో ఆంక్షలు విధించడం దారుణం. అభ్యర్థుల వయోపరిమితి 47కు పెంచాల్సిన అవసరం ఉంది. అభ్యర్థుల ప్రిపరేషన్‌కు కనీసం 90 రోజులు గడువు ఇవ్వాలి. అర్హతల పేరుతో మార్కుల శాతం పరిగణనలోని తీసుకునేలా నిబంధనలు విధించారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ప్రతి జిల్లాకు వేర్వేరుగా ప్రశ్న పత్రాలు ఇవ్వాలి. తప్పు ఎత్తిచూపే హక్కు మీడియాకుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహార శైలి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉంది. భావప్రకటనా స్వేచ్ఛపై ఎదురుదాడికి దిగుతోంది. ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపే హక్కు పత్రికలకు, మీడియాకు ఉంది. అలాంటి వాటిని స్వీకరించి తప్పులను సరిదిద్దుకోవాలి. కానీ అలా జరగకపోగా మీడియా ప్రతినిధులపైన, కలం కార్మికులపైన దాడులు చేయడం దారుణం. భయపెట్టడం, కేసులు బనాయించడం దారుణం. ప్రతికా చ్ఛను హరించడం రాజ్యాంగ విరుద్ధం. పేరుకుపోయిన ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు అవస్థలు పడుతున్న విద్యార్థులు 20 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలండర్ ఏదీ? రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు రంగాల హవా సంక్షేమం గాలికి వదిలేశారు తప్పును ఎత్తి చూపితే కేసులు, దాడులా? ‘సాక్షి’తో మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు సంక్షేమం గాలికే కూటమి ప్రభుత్వం అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. రైతులకు అన్నదాత సుఖీభవ, ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకాలు నిర్వీర్యమయ్యాయి. వాటి ప్రస్తావనే ఎత్తడం లేదు. పీ4, స్వరాంధ్ర 2.0 అంటూ స్వప్నలోకంలో ప్రగతి జరుగుతున్నట్లు ఉంది. రాబోయే నాలుగేళ్లలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్న గ్యారంటీ లేదు. 20 లక్షల ఉద్యోగాల మాటేంటో? నిరుద్యోగులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి రూ.3వేలు, 20 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండ్ విడుదల హామీలు ఏమయ్యా యో. ప్రైవేటు రంగాలలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు పారిశ్రామిక, ఐటీ రంగాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలలో సుమారు 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలి. -
కుంజేగానూరులో భూచోళ్లు
కుప్పం: పశువులకు మేతకు సౌకర్యంగా ఉన్న గుట్ట పొరంబోకుపై కొందరు కూటమి నేతల కన్ను పడింది. గుట్టకు ఆనుకుని ఉన్న డీకేటీ భూములను చూపిస్తూ గుట్ట పొరంబోకును చదును చేసి లేఅవుట్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. జేసీబీలు, ట్రాక్టర్లను పెట్టి చదును చేసి లేఅవుట్‌గా మార్చి ప్లాట్లు వేసి, లాభార్జన గడించే పనిలో కూటమి నేతలు నిమగ్నమయ్యారు. గుట్టపొరంబోకు చదును మండలంలోని కుంజేగానూరు రెవెన్యూ పరిధిలో బస్టాండ్ వద్ద 2.40 ఎకరాల గుట్టపొరంబోకు స్థలం ఉంది. ఈ భూమిలో కుంజేగానూరు, ఎన్.కొత్తపల్లి, నూటకుంటకు చెందిన గ్రామాల్లోని పశుపోషకులు పశువుల మేత బీడుగా ఉపయోగిస్తున్నారు. కుంజేగానూరు బస్టాండ్‌కు ఎదురుగా రోడ్డు పక్కన ఉండడంతో ఈ భూములపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. దీన్ని ఎలాగైన కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేపట్టా రు. తమ అనుభవంలో ఉన్నట్లు కొందరు టీడీపీ నేత లు నకిలీ రికార్డులు సృష్టించి, స్వయం ఉపాధి కోసం రెండు దుకాణాల రూములను నిర్మిస్తున్నారు. 2.40 ఎకరాల గుట్ట పొరంబోకును చదును చేసి ప్లాట్లుగా మార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇది ఇ లా ఉండగా మరోవైపు గరికచీనేపల్లెకు చెందిన ఓ టీడీపీ ప్రధాన నేత కుంజేగానూరుకు వెళ్లే ఆవుల ఓనిని పూర్తిగా చదును చేసి, బొప్పాయి పంటను సాగు చేస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పశువులను అటవీ ప్రాంతంలో మేతకు తీసుకువెళ్లేందుకు ఈ ఆ వులఓనిగా వినియోగించేవారు. టీడీపీ నేత దాన్ని ఆక్రమించడంతో వారు ఇక్కట్లు పడుతున్నారు. ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం టీడీపీ నేత ఆవుల ఓని చదును చేసి, పొలంలో క లుపుకుని బొప్పాయి సాగు చేస్తున్నారని గతంలో రెవెన్యూ అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీన్ని ఆసరాగా చేసుకుని మరికొందరు టీడీపీ నేతలు గుట్టపొరంబోకు కబ్జా కు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ శాఖాధికారులకు ఫిర్యాదు చేయగా తాము డీకేటీ పట్టా పొందామని రికార్డులు చూపిస్తూ వ్యవహరిస్తునట్లు సమాచారం. ఉన్న తాధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని కోరుతున్నారు. -
మామిడితోటపై ఏనుగుల దాడి
బంగారుపాళెం: మండలంలోని మొగిలిలో శుక్రవారం రాత్రి మామిడితోటపై ఏనుగులు దాడి చేశాయని బాధిత రైతు తెలిపాడు. గ్రామానికి చెందిన శ్రీనివాసులుకు గౌనిచెరువు వద్ద మామిడితోట ఉంది. సమీపంలోని కౌండిన్య అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు మామిడితోటలోకి ప్రవేశించి చెట్ల కొమ్మలను విరిచి కాయలను కొరికి నేలపాలు చేశాయని తెలిపారు. పంట చేతికందే సమయంలో ఏనుగులు తోటపై దాడి చేసి నష్టపరిచాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఏనుగులు తరచూ రైతుల మామిడి తోటలపై దాడులు సాగిస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖాధికారులు ఏనుగులు పంటలపైకి రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కుక్కల దాడిలో జింక మృతి పాలసముద్రం: మండలంలోని కన్నికాపురం సమీపంలోని వంకలో శనివారం కుక్కల దాడిలో జింక మృతి చెందింది. వేసవి కారణంగా అడవిలో నీరు లేకపోవడంతో కన్నికాపురం దళితవాడకు సమీపంలోని వంకలో నీరు తాగడానికి వచ్చిన జింకను గమనించిన వీధి కుక్కలు మూకుమ్మడిగా దానిపై దాడి చేసి, గాయపరిచాయి. దీంతో జింక మృతి చెందింది. -
వరసిద్ధుడి సేవలో ఆర్టీఐ కమిషనర్
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారిని శనివారం రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ (ఆర్టీఐ) చావలి సునీల్‌కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయాధికారు లు ఘన స్వాగతం పలికి, స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనం పలికి, ప్రసాదం, స్వామి వారి చిత్రపటం అందజేశారు. అర్ధగిరి క్షేత్రంలో పౌర్ణమి వేడుకలు రేపు తవణంపల్లె: మండలంలోని అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీన పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ హనుమంతురావు తెలిపారు. ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అ లంకరణ, పూజలు నిర్వహిస్తామన్నారు. 11 గంటలకు ఆలయ మండపంలో స్వామివారికి సుదర్శన హోమం శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. రాత్రి 7.30 గంటలకు ప్రాకారోత్సవం వైభవంగా జరుగుతుందని పేర్కొన్నారు. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చెక్కభజనలు, భక్తి కీర్తనల సంగీత కచేరి ఉంటుందన్నారు. కాణిపాకంలో భక్తుల రద్దీ కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వేకువజామున స్వామివారికి అభిషేక పూజలు చేసి, భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, వీఐపీ దర్శన సేవ క్యూలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక రేపు చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12 వ తేదీన కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లాధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. -
గోసంరక్షణ ట్రస్టుకు విరాళాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని గోసంరక్షణ ట్రస్టు కు ఇద్దరు దాతలు శనివారం రూ.లక్ష వంతు న విరాళాలు ఇచ్చారు. గుంటూరుకు జిల్లాకు చెందిన సూరిశెట్టి రమేష్ రూ.లక్ష నగదును ఆలయాధికారులకు అందజేశారు. ఆలయాధికారులు దాతకు స్వామివారి దర్శనం కల్పించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే చైన్నెకు చెందిన దాత కలవకుంట ప్రత్యోత్ రూ.లక్ష నగదు ఆలయాధికారులకు అందజేశారు. ఆలయ సిబ్బంది కోదండపాణి దాత కుటుంబానికి ప్రత్యేక దర్శనం కల్పించారు. పెళ్లి పేరుతో వంచన పుంగనూరు: పట్టణానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసగించిన యువకుడిపై ఆమె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామసముద్రం మండలం చింపరపల్లెకి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అదే మండలంలోని ఓ యువతి తండ్రితో ఆర్థిక లావాదేవిలు అడ్డు పెట్టుకుని అధిక వడ్డీలకు అప్పు ఇచ్చి ఇల్లు రాసుకున్నాడు. ఇలా మోసం చేస్తూ నిలదీసినందుకు యువతిని ప్రేమ పేరుతో మోసగించి, గర్భవతిని చేశాడని ఆమె పోలీసులకు కిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
వెరిటాస్ సైనిక్ స్కూల్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి
● దేశ రక్షణకు విద్యార్థులను తయారు చేయడమే వెరిటాస్ లక్ష్యం ● వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బీ.శేషారెడ్డి తిరుపతి కల్చరల్: తిరుపతిలో గత 22 ఏళ్లుగా బీఎస్ఆర్ విద్యాసంస్థల ద్వారా క్రమశిక్షణతో కూడి విద్య తో పాటు వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు విద్యార్థుల ఉన్నతికి, దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి కేద్రం ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ అను మతి పొందడం జరిగిందని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బీ.శేషారెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించడంతోపాటు 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అత్యుత్తమమైన విద్యాప్రమాణాలతో విద్యార్థులకు విద్యతో పాటు శారీరక, మానసిక, మానవీయ విలువలతో కూడిన విద్యనందిస్తున్నట్టు తెలిపారు. రాబోవు కాలంలో ప్రభుత్వ సైనిక్ స్కూలు అనుసంధానంతో కరికులం, యాక్టివిటీస్, కాంపిటీషన్స్ వంటి అన్ని సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇకపై ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ పరీక్షల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించిన సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. విద్యాసంస్థలో ప్లస్–1 ఇంటర్ మీడియట్‌తో స్పెషల్ ఎన్డీఏను ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో వెరిటాస్ సైనిక్ స్కూల్ డైరెక్టర్లు బీ.శ్రీకర్‌రెడ్డి, బీ.సందీప్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇక జగమర్ల గ్రామానికి మహర్దశ ●
● దార్థి అభ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ద్వారా అభివృద్ధి ● జిల్లాలో పలమనేరు మండలంలోని జగమర్ల ఎంపిక ● యానాదుల జీవన ప్రమాణాల పెంపునకు కేంద్రం చర్యలు ● విద్యాభివృద్ధికి ప్రత్యేక పాఠశాలలు, ఉపాధికి పెద్దపీట ●దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గిరిజన గ్రామాల అభివృద్ధి కల సాకారం కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దార్థి అభ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం అందుకు ఊపిరి పోయ నుంది. ఈ పథకం అమలుకు పలమనేరు మండలంలోని జగమర్ల ఎంపికైంది. దీంతో ఆ పల్లె ప్రగతి పథంలో నడవనుంది. ఆనందంగా ఉంది ఎక్కువగా ఎస్టీలున్న తమ గ్రామం జనజాతీయ గ్రా మ్గా ఎంపిక కావడం ఆ నందంగా ఉంది. ఆ నిధుల తో మా గ్రామం బాగుపడుతుందని అనుకుంటున్నాం. ఇక్కడున్న యానాదుల అభ్యున్నతి విద్యతోనే సాధ్యమని నమ్ముతున్నా. – విజయ్, సర్పంచ్, జగమర్ల, పలమనేరు మండలం 6 కిలోమీటర్ల రోడ్డు వేస్తే అభివృద్ధి మా గ్రామస్తులు పండించిన పంటను బంగారుపాళెం, పుంగనూరు, చౌడేపల్లి, సోమలకు తరలించాలంటే పలమనేరు హైవేలోకెళ్లి బంగారుపాళెం వెళ్లాలి. సోమల, చౌడేపల్లికి వెళ్లాలంటే పలమనేరుకు వెళ్లి చౌడేపల్లి, పుంగనూరు చుట్టుకుని వెళ్లాల్సివస్తోంది. అదే తుంబకుప్పం రోడ్డు పనులు జరిగితే రైతులకు చాలా మేలుగా జరుగుతుంది. – రెడ్డెప్పరెడ్డి, జగమర్ల, పలమనేరు మండలం పలమనేరు: అభివృద్ధిలో వెనుకబడి ఎక్కడో విసిరేసినట్టున్న గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్రం నడుం బిగించింది. అన్ని గ్రామాలతో స మానంగా గిరిజన గ్రామాలను సైతం అభివృద్ధి చేసి, గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దార్థి అభ జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని గత ఏడాది గాంధీ జయంతి రోజున ప్రారంభించింది. దేశంలోని 63 వేల గిరిజన గ్రామాల్లో ఐదు కోట్ల మందికి లబ్ధి చేకూరేలా రూ.80 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. చిత్తూరు జిల్లాలోని జగమర్ల, మొగిలిపొదరేవులు, కల్లిగుట్ట గ్రామాలను పరిశీలించి, వీటిలో అత్యంత వెనుకబడిన పల మనేరు మండలంలోని జగమర్ల గ్రామాన్ని తొలిదశలో ఎంపిక చేసినట్టు జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి మూర్తి తెలిపారు. పట్టి పీడిస్తున్న రోడ్డు సమస్య ఇదీ.. దేవళంపెంట(యానాదికాలనీ) నుంచి తుంబకుప్పం గ్రామానికి కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే. ప్రస్తుతానికి ఈ రహదారి మట్టిరోడ్డుగా ఉంది. ఈ మార్గంలో వాహనా లు వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉంది. ఈ రోడ్డును బాగు చేసి, తారు రోడ్డుగా మార్చితే పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, బంగారుపాళెం, తవణంపల్లె, సోమల మండలాలకు రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది. అలాగే పీలేరు, పూతలపట్టు, తవణంపల్లె, సదుం, సోమల, చౌడేపల్లెకు వెళ్లేందుకు జగమర్ల గిరిజనులకు అనుకూలంగా ఉంటుంది. ఇక పలమనేరు, బంగారుపాళెం, తవణంపల్లె, సోమల, పెద్దపంజాణి మండలాలలోని ఆరు మారుమూల అటవీ గ్రామాలకు రాకపోకల సౌకర్యం కలుగుతుంది. గ్రామంలో ఏమి చేస్తారంటే.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధుల ద్వారా గ్రామంలో విద్యకు పెద్దపీట వేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక రెసిడెన్షియల్ గిరిజన పాఠశాల ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఉపాధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనుంది. గ్రామంలో ఎక్కువగా చేసే పనులను గుర్తించి, వాటిని పెంచి జీవనోపాది పెంచే కార్యక్రమాలు చేపట్టనుంది. గిరిజన కార్పొరేషన్ ద్వారా అటవీ ఉత్పత్తుల అమ్మకాలు, పాడి పరిశ్రమ అభివృద్ధిలాంటివి ఉంటాయి. -
పూతలపట్టులో మాక్ డ్రిల్
పూతలపట్టు (కాణిపాకం): పూతలపట్టు మండలంలో శనివారం అడిషనల్ ఎస్పీ శివా నంద కిషోర్ పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. గ్యాస్ యూనిట్ వంటి కీలక ప్రదేశాల్లో ఉగ్రదాడులు జరిగినప్పుడు ఉద్యోగులు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, సైరన్లు మోగినప్పుడు అనుసరించాల్సిన భద్రతా ప్రోటో కాల్, బాంబు బెదిరింపుల సమయంలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ చర్యలు, అలాగే హెల్త్, ఫైర్ రె స్పాన్స్ టీమ్‌ల పాత్రను ఈ డ్రిల్‌లో ప్రాక్టికల్‌గా చూపించారు. ఐఓసీఎల్ వంటి ఇంధన సంస్థలు ఉగ్రవాదులకు లక్ష్యంగా మారే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలు అత్యంత కీలకమని పోలీసు అధికారులు పేర్కొన్నారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులు, ప్యాకెట్లు, పరికరాలను సిబ్బంది తాకకూడదని, వెంటనే పోలీసులకు లేదా బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డీఎస్పీలు సాయినాథ్, ఏఆర్ డీఎస్పీలు చిన్ని కృష్ణ, పూతలపట్టు సీఐ కృష్ణ మోహన్ తదిరతులు పాల్గొన్నారు. -
అంతా నా ఇష్టం!
● డీఎస్పీ వాహనాన్ని లాగేసుకున్నా నోరెత్తకూడదు ● యూనియన్ ఆఫీస్‌ను ఖాళీ చేయించేందుకు యత్నం ● ‘బాస్’కు వాస్తవాలు చెప్పలేక కుమిలిపోయిన ఖాకీలు ● చిత్తూరు ‘ఏఆర్’లో ‘సూపర్‌బాస్’గా చెలామణి చిత్తూరు అర్బన్: ఆర్ముడు రిజర్వు (ఏఆర్)..లా అండ్ ఆర్డర్. పోలీసుశాఖకు ఈ రెండూ గుండెకాయ, మెదడు లాంటివి. ఏ ఒక్క విభాగంలో చిన్న తేడా వచ్చినా.. ఒకరి ఒంటెద్దు పోకడతో ఇంకొకరికి ఇబ్బందులు తప్పవు. చిత్తూరు పోలీసుశాఖలోని ఏఆర్ విభాగంలో ‘చిన్నబాస్’గా చలామణి అవుతున్న ఓ వ్యక్తి ఏకంగా తనకు తానే ‘సూపర్‌బాస్’ అనుకుని భ్రమలో ఉన్నతాధికారులపైనే కాలు దువ్వాడు. విషయం ‘బాస్’ ఎదుట కక్కలేక, తమలో తాము మింగలేక చాలా మంది ఖాకీ అధికారులు లోలోపల కుమిలిపోయారు. ఉదయించిన ‘భాస్కరు’డు అస్తమించిక తప్పదన్నట్లు.. ఇప్పుడు ఆ వ్యక్తి చేసిన ఒక్కో ఘన కార్యం వెలుగులోకి వస్తోంది. ఎవరైనా లెక్కలేదంతే.. జిల్లా పోలీసుశాఖలో ఎస్పీ తరువాత ఏఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఆర్డర్ వారీగా ఉంటారు. ఇందులో ఓ కానిస్టేబుల్ డీఎస్పీతో మాట్లాడాలంటే ఓ విధానం ఉంది. అదే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌తో మాట్లాడలన్నా ఓ పద్ధతి ఉంటుంది. కానీ ఏఆర్‌లో పనిచేసే ఓ వ్యక్తి ఏకంగా ఏఎస్పీలనే నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో మాట్లాడుతున్నట్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇక డీఎస్పీ అంటే అస్సలు లెక్కలేదు. కనీసం తనతోటి ర్యాంకు ఉన్న వ్యక్తితో ప్రవర్తించే తీరు కూడా వివాదస్పదమే. జిల్లా పోలీసుశాఖలో పనిచేసే ఓ డీఎస్పీ తనకు ఆరోగ్యం బాగాలేదని సెలవుపై వెళ్లారు. ఈ సమయంలో వాహనాన్ని హెడ్‌క్వార్టర్‌కు అప్పగించారు. తిరిగొచ్చి వాహనం అడిగితే, ఎవరూ సమాధానం చెప్పలేదు. తీరా విచారిస్తే ఆ సూపర్‌బాస్ డీఎస్పీ వాహనాన్ని మరో ప్రాంతానికి పంపేసినట్లు తెలుసుకున్నారు. ఇప్పటికే తనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రయాణానికి అనుగుణంగా ఉండేందుకు రూ.లక్ష వరకు తన వాహనానికి ఖర్చు చేశానని, దాన్ని తిరిగి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినా ఆ వ్యక్తి అస్సలు పట్టించుకోలేదని సమాచారం. అసలు తనకు ఎందుకు ఫోన్ చేశారంటూ ఎదురు ప్రశ్నించి, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆ అధికారి కుంగిపోయి తనకు జరిగిన అవమానం ఎవరికీ చెప్పకుండా మదనపడిపోతున్నారు. నీడను కూల్చే యత్నం.. నాలుగు వేల మందికి పైగా సిబ్బంది ఉన్న పోలీసుశాఖకు జిల్లా కేంద్రంలో యూనియన్ కార్యాలయం పెట్టుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఎవరైనా ఖాకీలు వస్తే యూనియన్ ఆఫీస్‌లో కాసేపు సేదతీరి, తమతోటి సిబ్బందిని పలకరించడానికి ఓ నీడ ఉందనే ఆనందంలో ఉన్నారు. కానీ యూనియన్ వాళ్లతో గిట్టని ఆ ‘సూపర్‌బాస్’ ఏకంగా ఆ కార్యాలయాన్నే ఖాళీ చేయాలని నిశ్చయించుకున్నారు. ఏఆర్ కార్యాలయం లోపల యూనియన్ ఆఫీస్ ఎలా పెట్టుకుంటారని, దీన్ని ఖాళీ చేయాలని ఖాకీలపైనే ఒత్తిడి తీసుకొచ్చాడు. విషయం ఎవరికి చెప్పుకోవాలో, ఏం చెబితే ఏం జరుగుతుందోనని యూనియన్ నాయకులు సైతం నోరెత్తలేదు. తీరా విషయం బాస్‌కు తెలియడంతో ఆయన కల్పించుకోవడంతో యూనియన్‌కు నిలవడానికి నీడైనా దొరికినట్లయ్యింది. అన్నింటికీ ఒక్కటే కారణం.. ‘ఏయ్ నేను ఇంతకు ముందు ఎక్కడ పనిచేశానో తెలుసా..? సీఎం పేషీకు ఫోన్ చేయమంటావా..?’ అనే మాటలు అందరి నోళ్లు మూయించేశాయి. మరి ఆ పేషీ నుంచే ‘సూపర్‌బాస్’కు మళ్లీ జిల్లాలో పనిచేయడానికి ఆదేశాలు వస్తాయో..? ఏకంగా సీఎం వద్దే బాధ్యతలు నిర్వర్తించే భాగ్యం దక్కుతుందో వేచి చూడాలి. -
చైన్ స్నాచర్ అరెస్టు
నగరి : కొంతకాలంగా నగరి, విజయపురం ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల్లో వెళుతూ ఒంటరిగా ఉన్న మహిళల మెడలో చైన్లను చోరీ చేస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న చైన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్, సీఐ విక్రమ్ లు కథనం మేరకు.. నగరి సబ్‌డివిజన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల ఛేదనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా నగరి పరిసర ప్రాంతాలు, తమిళనాడు రాష్ట్ర సరిహద్దులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పాత నేరస్తులతో పాటు, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచారు. శనివారం ఉదయం సీఐకి అందిన సమాచారం మేరకు, నాగలాపురం జంక్షన్ వద్ద విజయపురం మండలం, ఇల్లత్తూరుకు చెందిన అజిత్ (27)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా ఆనంతప్పనాయిడుకండ్రిగ, విజయపురం మండలం పన్నూరు సబ్‌స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనంలో వచ్చి మహిళల మెడలో చైన్ స్నాచింగ్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అతని వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఒక అపాచీ మోటార్ సైకిల్, చోరీ చేసిన సుమారు రూ.4 లక్షల విలువైన 45 గ్రాముల బరువు రెండు బంగారు బొందు చైన్లులు స్వాధీనం చేసుకున్నారు. అజిత్ అరెస్టులో ప్రతిభ కనబరిచిన సిబ్బంది లోకనాథం, గణేష్, ధన కోటి, రమేష్‌ను అభినందించడంతోపాటు వారికి రివార్డులు అందించారు. నూతన కార్యవర్గం చిత్తూరు కార్పొరేషన్: పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా పరిషత్ యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కమిటీ వివరాలను ఎన్నికల అధికారి పీఎంఆర్ ప్రభాకర్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా సురేష్ కుమార్, ఉపాధ్యక్షులుగా చలపతిరెడ్డి, సుజాత, లక్ష్మీపతి, కార్యదర్శిగా రాజేంద్రన్, సహాయ కార్యదర్శులుగా రూప్‌సాగర్, బాలకృష్ణ్ణ ఎన్నికయ్యారు. అలాగే కార్యనిర్వహక కార్యదర్శిగా చక్రవర్తి, కోశాధికారిగా వాసుదేవరావు, జిల్లా కౌన్సిలర్లుగా గిరిధర్‌రెడ్డి, శశిధర్ చౌదరి, చంద్రశేఖర్‌రెడ్డి, తులసీరామ్, దస్తగిరిసాహెబ్, సుష్మకీర్తి, శ్రీనివాసులు, హరీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. ఎన్నికలకు పరీశీలకులుగా చెంచురత్నం, చక్రపాణి వ్యవహరించారు. -
అవకతవకలు జరిగితే కఠిన చర్యలు
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి దర్శన సేవల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆలయ ఈఓ పెంచలకిషోర్ హెచ్చరించారు. వరసి ద్ధి వినాయకస్వా మి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం అన్ని విభా గాల అధికారులు, సిబ్బంది, అర్చకులతో ఆయన సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అందరూ అ కింత భావంతో పనిచేయాలన్నారు. భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. దర్శ నార్థం సిబ్బందికి ఎవరైనా తెలిసిన వ్యక్తులు వస్తే కచ్చితంగా టికెట్లు తీసుకోవాలన్నా రు. దర్శన విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు ఉంటాయన్నా రు. ఆలయ అదాయ పెంపు విషయంలో ప్రతి ఒక్కరూ దేవస్థానానికి సహకరించాలన్నారు. ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనంజయ ప్రసాద్, సూపరింటెండెంట్ కోదండపాణి పాల్గొన్నారు. ఇక బయోమెట్రిక్‌తో పత్రాల అందజేత చిత్తూరు కార్పొరేషన్: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పత్రాలు ఇక బయోమెట్రిక్ అయ్యాక ఇవ్వాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ హరినారాయణన్ మురుగన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాక్షిగా బయోమెట్రిక్ పెట్టిన వారికి తతంగం ముగిశాక బయోమెట్రిక్ పెట్టించుకుని పత్రాలు అందజేసేవారు. ప్రస్తుతం అలా కాకుండా క్రయ, విక్రయదారుల్లో ఎవరైనా ఒకరు కచ్చితంగా బయోమెట్రిక్ పెడితేనే పత్రాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో సబ్రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అక్రమ సోదాలు అన్యాయం
చిత్తూరు కలెక్టరేట్ : సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసులు అక్రమ సోదాలు అన్యాయ మని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు మండిపడ్డారు. ఆ సంఘం నాయకులు శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బి ప్రకాష్ మాట్లాడుతూ కొన్ని రోజులుగా పలు పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు దాడులకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధానాలు ప్రస్తుతం అమలు చేయడం దారుణమన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు జయరాజ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులకు రక్షణ లేకుండా పోతోందన్నారు. కలంపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదన్నారు. ఆ విషయం తెలిసనప్పటికీ పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పరిమితులను దాటి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తాజాగా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఏకపక్షంగా సోదాలు చేయడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘ నాయకులు కృపానందరెడ్డి, యాదవేంద్రరెడ్డి, హరిప్రసాద్, కేశవులు, బాలసుబ్రహ్మణ్యం, ఉమాశంకర్, కుపేంద్ర, తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు అనైతికం పుంగనూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని, ఇది అనైతికమని పాత్రికేయులు ఆరోపించారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో అక్రమ తనిఖీలను ఖండిస్తూ శుక్రవారం పుంగనూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు నిరసన తెలిపారు. ఈ మేరకు తహసీల్దార్ రాముకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ లోపాలను సాక్షి దినపత్రికలో ప్రచురిస్తుండడాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సోదాలు చేయడం బాధకరమన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించడమే ధ్యేయంగా జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు వాపో యారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మహమ్మద్ సైపుల్లా, నియోజకవర్గ అధ్యక్షుడు సతీష్‌కుమార్, ఎన్.రసూల్, మర్రిబాబు, కోటారెడ్డి ప్రసాద్, జగదీష్, కృష్ణమూర్తి, రెడ్డెప్ప, జావీద్, పురుషోత్తం, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏపీడబ్ల్యూజేఎఫ్ ధర్నా జిల్లావ్యాప్తంగా పాత్రికేయుల ఆందోళనలుజర్నలిస్టులపై దాడులు మానుకోవాలి చౌడేపల్లె: కూటమి ప్రభుత్వం జర్నలిస్టులపై దాడులు మానుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు నాగరాజ, రామారావు డిమాండ్ చేశారు. శుక్రవారం సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో అక్రమంగా సోదాలు చేయడం తగదన్నారు. జర్నలిస్టులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జూనియర్ అసిస్టెంట్ భార్గవికు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రసూల్, సుబ్రమణ్యంసింగ్, మురళి, హరిప్రసాద్, శ్రీనివాసులు, చిన్నా, రమేష్, వెంకటేష్, పెద్దన్న, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో ముమ్మర తనిఖీలు
101 కేసుల నమోదు చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో గురువారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఎస్పీ మణికంఠ చిత్తూరు నగరంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాలను తనిఖీ చేశారు. రోడ్లపై తిరుగుతున్న వాహనాలను సైతం తనిఖీ చేశారు. ప్రజల భద్రతను మెరుగుపరచి, నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో 1,781 వాహనాలను తనిఖీ చేయగా, నిబంధన లు పాటించని 101 మందిపై కేసులు నమోదు చే శారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 9 మందిపై, చౌడేపల్లెలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టారు. పెద్దపంజాణిలో సరైన బిల్లులేకుండా సరఫరా చేస్తున్న 10 వేల లీ టర్ల డీజిల్ ట్యాంకర్‌ను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. లోక్ అదాలత్ వాయిదా చిత్తూరు అర్బన్: చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం జరగాల్సిన జాతీయ లోక్‌అదాలత్‌ను అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఎస్.భారతి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అదాలత్‌ను జూలై 5వ తేదీన నిర్వహించన్నుట్లు పేర్కొన్నారు. కక్షిదారులు సహకరించాలని కోరారు. ఎన్సీడీ సర్వే పూర్తి చేయండి చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎన్సీడీ సర్వే వే గవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని డీఎంఅండ్హెచ్ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో చాలా పీహెచ్‌సీల పరిధిలో ఎన్సీడీ సర్వే చేయడంలో సిబ్బంది అలసత్వం వహిస్తున్నారన్నారు. ఎందుకంతా నిర్లక్షమని, సర్వే త్వరితగతినగా పూర్తి చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆర్సీహెచ్ఐడీ, అభ ఐడీకి అనుసంధాన ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని ఆమె సూచించారు. -
పటిష్టంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 12వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని ఇంటర్మీడియట్ ఆర్జేడీ, డీఐఈఓ శ్రీనివాసులు వెల్లడించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కణ్ణన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల నిర్వహణపై ఛీప్, డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ పరీక్షలకు జిల్లాలో 35 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ పరీక్షలకు 15,377 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణ చాలా ముఖ్యమైనవన్నారు. పరీక్షల నిర్వహణలో అనుభవం ఎంతో నేర్పిస్తుందన్నారు. ద్విచక్ర వాహనాల్లో ప్రశ్నపత్రాలు తీసుకెళ్లవద్దు ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విచక్ర వాహనాల్లో తీసుకెళ్లకూడదని పరీక్షల డీఈసీ కన్వీనర్ దయానందరాజు వెల్లడించారు. చెడ్డపేరు తెచ్చుకోకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణ విధులు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ప్రతి ఏడాది పరీక్షల నిర్వహణ తీరు ఒకటే అయినప్పటికీ కొత్త కొత్త నిబంధనలు వస్తుంటాయని చెప్పారు. పరీక్ష కేంద్రంలో చీఫ్, డిపార్ట్మెంట్ అధికారులే బాస్‌లని తెలిపారు. విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థినీ తనిఖీ చేసిలోనికి పంపాలన్నారు. ప్రాంగణంలో చిట్టీలు లేకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. పోలీసులు గేట్ లోపల సెల్‌ఫోన్ వినియోగించకూడదని తెలిపారు. సెట్ పరిశీలనలో జాగ్రత్తలు ముఖ్యం ఏ రోజుకు ఆరోజు ఉన్నతాధికారులు సూచించే ప్రశ్నపత్రాల సెట్ విషయంలో అత్యంత జాగ్రత్తలు వహించాలని డీఐసీ సభ్యుడు శరత్ చంద్ర అన్నారు. పరీక్షల నిర్వహణలో చెక్లిస్ట్ను అనుసరించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు ముందుగా చేరుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాలు తీసుకెళ్లేటప్పుడు సెట్ నంబర్లను జాగ్రత్తగా పరిశీలించుకుని తీసుకెళ్లాలన్నారు. ప్రశ్నపత్రాలు తక్కువ రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ప్రశ్నాపత్రాలు ఇచ్చే సమయంలో మీడయం విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
ట్రస్టులకు విరాళం
కాణిపాకంలోని నిత్యాన్నదానం, గోసంరక్షణ ట్రస్టులకు దాతలు శుక్రవారం నగదు విరాళాలు అందజేశారు.శనివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2025చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసు శాఖలో జరుగుతున్న పరిణామాలపై ఆ శాఖలో విస్తృత చర్చ నడుస్తోంది. ప్రధానంగా ఏ ఇద్దరు ఖాకీలు ఒక చోట కలిసినా ఇటీవల పోలీసుశాఖలో చోటు చేసుకుంటున్న బదిలీలపై మాట్లాడుకుంటున్నా రు. తాజాగా స్పెషల్ బ్రాంచ్‌లో సీఐగా పనిచేస్తున్న భాస్కర్, మోటారు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ఎంటీఓ) భాస్కర్‌పై బదిలీ వేటు పడింది. వీరిద్దరూ ఏదో ఒక స్టేషన్‌కు బదిలీ అయివుంటే పెద్దగా చర్చ నడిచేదికాదు. కానీ ఇద్దరికీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం గురించే ఏవేవో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎస్బీ సీఐ ఎన్.భాస్కర్‌ను ఏకంగా కర్నూల్ రేంజ్ వేకెంట్ రిజర్వుకు (వీఆర్), ఎంటీఓ జి.భాస్కర్‌ను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆద్యంతం వివాదాస్పదం.. ఎంటీఓ.. జిల్లా పోలీసుశాఖలో పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టనే చెప్పాలి. పోలీసుశాఖలోని వాహనాల పర్యవేక్షణ, వీటికి ఉపయోగించే ఇంధనం, పోలీసు వాహనాలకు డ్రైవర్ల కేటాయింపు వంటి పనులను చూసుకుంటే సరిపోతుంది. కానీ ఇపుడా పరిస్థితి లేదు. ఎంటీఓ అంటేనే పోలీసు ఉన్నతాధికారిని కాకా పట్టడం, ఏయే సబ్–డివిజన్లో ఇన్స్పెక్టర్ ఎవర్ని కలుస్తున్నాడు..? ఎస్ఐ సెలవు పెట్టి ఎక్కడికి వెళుతున్నాడు..? డీఎస్పీ పనితీరు ఎలా ఉంది..? లాంటి విషయాలపై ఉన్నతాధికారులకు చాడీలు చెప్పడం, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిపై ఆరోపణలు చేయడం, యూనియన్ నాయకులపై పెత్తనం చెలాయించడం లాంటి పనులపైనే దృష్టి పెడుతున్నారు. తల్లిలాంటి ఏఆర్ విభాగంలో ఏఎస్పీల నుంచి డీఎస్పీలు, తోటి ఆర్ఐలు ఉన్నతాధికారులనే ఎదిరించే స్థాయికి వెళ్లిపోయారు. ఇక ఏఆర్ అధికారులు వాహనాలు అడిగితే అమర్యాదగా మాట్లాడడం, పైగా చోరీ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను తన వద్దకు తెప్పించుకోవడం, కుటుంబ సభ్యుల్ని అందులో ఎక్కించుకుని రోడ్లపై తిరుగుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వీటిపై ఏఆర్‌తోపాటు లా అండ్ ఆర్డర్ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తినట్టు సమాచారం. ఇదికాదన్నట్లు మొత్తం ఆర్ముడు రిజర్వు (ఏఆర్) విభాగం తన కనుసన్నల్లోనే పనిచేయాలన్నట్లు ‘సూపర్ బాస్’గా చెలామణి అవుతూ ఓ వెలుగు వెలిగిన సందర్భం. చిత్తూరులోని పోలీసు ఏఆర్ కార్యాలయం – 12లో– 12లోన్యూస్రీల్పంచాయతీలకు రూ.1.38 కోట్లు విడుదల చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పంచాయతీలకు రాష్ట్ర గ్రాంట్‌గా తొలి త్రైమాసికానికి రూ.1.38 కోట్లు నిధులు విడుదల చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తల సరి ఆదాయం(పర్‌క్యాపిటా) కింద రూ.15,05, 785, వృతి పన్ను రూ.36,33,196, సర్పంచుల గౌర వేతనాలకు రూ. 86,95,992, లైబ్రరీ గ్రాంటు రూ.673 కలిపి రూ.1.38 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఆయా పంచాయతీల ఖాతాల్లో ఈ నెల 12, 13వ తేదీల్లో జమ చేయనున్నట్లు పంచాయతీ అధికారులు తెలిపారు. గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతి జిల్లాలోని 26 మంది గ్రేడ్ –3 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్– 2 పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిని ఖాళీలున్న గ్రేడ్ –2 గ్రామ పంచాయతీల్లో నియమించనున్నట్లు పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛ హరణ ఆటవిక చర్య చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం ఆటవిక చర్య అని భారతీయ తెలుగు రచయితల సమాఖ్య జాతీయ గౌరవాధ్యక్షుడు మర్రిపూడి దేవేంద్రరావు స్పష్టం చేశారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సాక్షి దినపత్రిక సంపాదకుడు ఆర్.ధనంజయరెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వమండా పోలీసులు సోదాలు చేయడం నీతిమాలిన చర్య అని ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ పరిరక్షణలో భాగమైన ఒక స్తంభాన్ని కూల్చేయాలనుకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే సాక్షి దినపత్రికపై కక్ష సాధింపు చర్యలకు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా రాష్ట్ర గవర్నర్ చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్పీపై కోపమే కారణమా? చిత్తూరు స్పెషల్ బ్రాంచ్‌లో బదిలీలు అంటే ‘బాస్’ కల్పించుకుంటే తప్ప జరగదు. అలాంటిది బాస్‌కు చెప్పా పెట్టకుండా ఓ సీఐ స్థాయి అధికారికి ఇక్కడి నుంచి తప్పించడం, అదే బాస్‌కు నీడలా నడిచిన ఎంటీఓపై బదిలీ వేటు వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికితోడు ‘ప్రత్యేక విభాగం’లో పనిచేసే మరో అధికారి ఇతర జిల్లాలో పనిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. చిత్తూరు ఎస్పీ మణికంఠ కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా ప్రవర్తించడం పలువురు అధికారపార్టీ ఎమ్మెల్యేలకు నచ్చడంలేదు. ఈయన్ని బదిలీ చేయాలని కూటమి నేతలు బాహాటంగానే మాట్లాడుతున్నారు. ఒకరు జూన్‌లో ఎస్పీ బదిలీ అవుతారంటే, 15 రోజుల్లో వెళ్లిపోతారని మరొకరు ప్రచారం చేస్తున్నారు. ముందు ఎస్పీ మార్కు వేసుకున్న అధికారులను ఇప్పటి నుంచే తప్పించడానికి కూటమి నేతలు కంకణం కట్టుకున్నట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. జిల్లా పోలీసు శాఖలో ఏదో జరిగిందని.. అసలేమి జరుగుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల మూకుమ్మడి పోలీసుల బదిలీలు.. తాజాగా ఎస్బీ సీఐ, ఎంటీఓల బదిలీ జరగడం.. పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై పోలీసులు గుసగుసలాడుతున్నారు. ఏమి జరుగుతుంది.. ఎందుకిలా జరుగుతుంది.. అన్న చర్చ నడుస్తోంది. స్పెషల్ బ్రాంచ్ సీఐ.. ఎంటీఓపై బదిలీ వేటు ఇద్దరికీ పోస్టింగులు ఇవ్వని యంత్రాంగం బదిలీలపై చిత్తూరు పోలీసుశాఖ సర్వత్రా చర్చ ‘సూపర్ బాస్’గా దూసుకెళ్లడమే కారణమా? దారి తప్పిన ఎస్బీ.. ఇక పోలీసుశాఖలో ఎస్పీ తరువాత కీలకమైన విభాగం స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ). జిల్లాలో స్టేషన్ల పనితీరు ఎలా ఉంది.? ఎక్కడ ఎలాంటి సమస్యలున్నాయి? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు ఎవరు..? రాజకీయ నాయకులతో సమస్యలొస్తే తీసుకునే చర్యలపై ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే విషయాలను ఎప్పటికప్పుడు ఎస్పీకి చేరవేయడమే ఎస్బీ ప్రధాన కర్తవ్యం. కానీ ఇటీవల కాలంలో పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో అధికారపార్టీ నేతలు నిర్వహిస్తున్న పేకాట క్లబ్బుల్లో వాటాలు, అక్రమ గ్రానైట్ తరలింపులో మామూళ్లు, కబేళాలకు తరలించే పశువుల లారీల్లో చిలక్కొట్టుడు లాంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో ఏం జరిగినా కుర్చీ వేసుకుని మరీ కూర్చుని వేలు పెడుతున్నారని, ఎస్బీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కూటమి పార్టీ ఎమ్మెల్యే బంధువును అక్కడి నుంచి తప్పించి.. తన అనుచరుడికి పోస్టింగ్ ఇప్పించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఓ దశలో ఎస్బీ కూడా ‘సూపర్‌బాస్’గా వ్యవహరించడం చాలా మంది అధికారులకు మింగుడుపడలేదు. వీటిపై ఏకంగా అధికారపార్టీ ఎమ్మెల్యే డీఐజీకి ఫిర్యాదు చేయడంతో వేటుపడినట్లు సమాచారం. -
తక్షణం పీఆర్సీ కమిషన్ వేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్‌ను ప్రకటించాలని ఏపీటీఎఫ్ 1947 జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆ సంఘం నాయకులు తమ డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విద్యాధరిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. జీఓ 117 కు ప్రత్యామ్నంగా తీసుకొచ్చిన 9 రకాల పాఠశాలలు గందరగోళంగా ఉన్నాయన్నారు. పాత విధానంలో 1 నుంచి 5 తరగతుల ప్రాథమిక పాఠశాలలు, 1 నుంచి 8 ప్రాథమికోన్నత పాఠశాలలు, 6 నుంచి 10 ఉన్నత పాఠశాలలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి ముక్తార్ అహ్మద్ మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. 12 వ వేతన సవరణ కమిషన్ వెంటనే ఏర్పాటు చేసి, మధ్యంతర భృతి 30 శాతం ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం టీచర్ల డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు చంద్రశేఖర్‌నాయుడు, చంద్రన్, జగదీష్, మధు, తులసి, అప్జల్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
చైర్మన్ గిరి.. వరించేదెవరినో?
కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ పదవి ఆశావహులను ఊరిస్తోంది. ఎవరికి వారు తమకే పదవి వ స్తుందని, ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నా రు. కూటమి సర్కారు మాత్రం ఎటూ తేల్చ కుండా నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది. దీంతో ఆ కుర్చీ ఎవరికి దక్కుతుందోనని ద్వితీయ శ్రేణి కూటమి నేతలు వేచి చూస్తున్నారు. కాణిపాకం: అతిపెద్ద ఆలయాల్లో ఒకటైనా వరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో అర్థం కాని పరిస్థితి. పాలకమండలి ప్రకటించే విషయంలో అదిగో..ఇదిగో అంటూ ప్రభుత్వం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది. ఆలయ పాలకమండలి చైర్మన్ పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారు. మాజీ చైర్మన్‌కు మళ్లీ పట్టమంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆర్థికంగా మంచి పలుకుబడి ఉన్నవాళ్లకే ఇస్తే ఆలయాభివృద్ధికి దోహద పడతారనే వాదనలు మరోవైపు గట్టిగా వినిపిస్తున్నాయి. కొత్తగా ఎస్సీ సామాజిక వర్గానికి చైర్మన్ పదవి ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు చర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. చతుర్ముఖ పోటీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి వరకు ఉన్న పాలక వర్గం రాజీనామా చేసింది. అప్పటి నుంచి కొత్త పాలక వర్గం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయ మాజీ చైర్మన్ మణినాయుడు, కూటమి నేతలు పూర్ణచంద్ర, మధుసూదన్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు కుర్చీ కోసం పోటీపడుతున్నారు. ఈ తరుణంలో మళ్లీ తానే చైర్మన్ అంటూ మణినాయుడు బహిరంగంగానే అందరికీ చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు, కొందరు నేతల మద్దతు ఉండడంతో మణినాయుడుకే చైర్మన్ పదవి ఇస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం చైర్మన్ మణినాయుడుకే ఇవ్వాలని కొందరు ప్రతిపాదించారు. అయితే అధిష్టానం ఒక్క మణినాయుడు పేరు కాదు.. ఆయనతోపాటు మరో ముగ్గురు, నలుగురు పేర్లు ఇవ్వాలని చెప్పింది. దీంతో ఆ నలుగురి పేర్లను తెరపైకి తీసుకొచ్చారు. ఆ నలుగురిలో మణినాయుడు తరువాత చైర్మన్ పదవి కోసం పూర్ణ గట్టిగా పోటీపడుతున్నారు. ఇప్పుడు ఎవరికి ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కాణిపాక దేవస్థానం కాణిపాకం పాలకమండలి ఏర్పాటులో జాప్యం? అదిగో..ఇదిగో అంటూ నాన్చుతున్న ప్రభుత్వం నలుగురి మధ్య తీవ్ర పోటీ ఆశావహుల్లో ఉత్కంఠ ఆలస్యం వెనుక ఆంతర్యమేమిటో? కాణిపాకం దేవస్థాన చైర్మన్ పదవి ప్రకటన విషయంలో ఆలస్యం జరుగుతోంది. ఆలస్యం వెనుక ఆంతర్యం ఏమిటోనని ఆశావాహులు, ఉభయకర్త లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మణినాయుడికి ఇస్తారా? ఇవ్వరా అనే అను మానాలు పుట్టుకొస్తున్నాయి. మరో ముగ్గురిలో ఆర్థి కంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులకు ఇస్తే బా గుంటుందని పలువురు భావిస్తున్నారు. ఇక కొత్త గా ఎస్సీ సామాజిక వర్గానికి కట్టబెడతారని మరోవైపు ప్రచారం జరుగుతోంది. ఎప్పటి నుంచో ఉన్న ఈ ప్రతిపాదనను అధిష్టానం పరిశీలనలో పెట్టి నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విష యంపై ప్రజాప్రతినిధి కూడా సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది నిజం కాదని.. ఇక్కడ ఎీస్సీ సామాజిక వర్గం మాటే ఉండదని పలువురు ఈ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. ఈ గందరగోళం నడుమ స్థానికంగా ఉన్న వ్యక్తిని కాదని బయట వ్యక్తులకు ఇస్తారని కొందరు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు జిల్లాలో కేటాయించిన పలు నామినేటెడ్ పదవులు ఆశావహులకు కాకుండా ఊహించని వ్యక్తుల ఇవ్వడం కూడా కాణిపాకం చైర్మన్ పదవి ఆశిస్తున్న ఆశావహుల్లో గుబులు పుట్టిస్తోంది. -
బాబు పాలన అధ్వాన్నం
● కుప్పం ద్రవిడ వర్సిటీలో ఏడాదిగా జీతాలు ఇవ్వలేదు ● టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై బాబు స్పందించాలి ● కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ డిమాండ్ తిరుపతి కల్చరల్: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా లేదని, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీలో ఏడాదిగా జీతాలు ఇవ్వలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ చింతామోహన్ విమర్శించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆయన టీటీడీ పరిపాలన భవనం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిగా టీటీడీ పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో 30 సార్లుకు పైగా ఆందోళనలు చేపట్టామన్నారు. టీటీడీలో పని చేసే అర్చకులు, శాశ్వత ఉద్యోగులు, వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అలిపిరి నుంచి పేరూరు వరకు 400 ఎకరాలు టీటీడీ భూములున్నాయని, ఆ భూముల్లో ఒక్కొక్కరికి ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు తిరుమల కొండకు ఎన్నోసార్లు వచ్చి వెళ్లారని, అయితే కొండపై సుమారు 500 దుకాణాలున్నా వాటిలో ఒక్కరైనా ఎస్సీ, ఎస్టీ ఉన్నారా? అని ప్రశ్నించారు. జనాభా నిష్పత్తి ప్రకారం 500 దుకాణాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై చంద్రబాబు వెంటనే స్పందించి న్యాయం చేయాలన్నారు. అలాగే టీటీడీలో పనిచేసే ఎన్ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ద్రవిడ వర్సిటీలో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ఎస్వీయూలో ప్రొఫెసర్లకు కూడా మూడు నెలలుగా జీతాలు అందలేదన్నారు. ఉద్యోగులకు నెల నెలా సక్రమంగా జీతాలు ఇవ్వలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. శ్రీసిటీని కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని, 250 కంపెనీలు ఏర్పాటు చేశామని, వేల మందికి ఉద్యోగాలు తామే ఇచ్చామని తెలిపారు. నిన్న ఒక మంత్రి శ్రీసిటీకి వచ్చి వెళ్లారని, ఆయన పర్యటన గురించి ఢంకా బజాయించుకుంటూ పేపర్లో గొప్పగా కథనాలు రాయించుకున్నాడని ఎద్దేవా చేశా రు. కాంగ్రెస్ హయాంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఇందిరమ్మ ఇళ్లకు పసుపు రంగు వేయించడం దౌర్భాగ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు యార్లపల్లి గోపి, వెంకటేష్, ముని శోభ, తేజోవతి, కుమార్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. -
12న డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన
చిత్తూరు కలెక్టరేట్ : విద్యాశాఖ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఈ నెల 12వ తేదీన డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టనున్న ట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ అన్నారు. ఈ మేరకు నిరసన కార్యక్రమానికి సంబంధించి ముందస్తు నోటీసును శుక్రవారం డీఆర్వో మోహన్‌కుమార్, డీఈఓ వరలక్ష్మికి అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యాశాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం నిర్లక్షధోరణి ప్రదర్శిస్తుందన్నారు. విద్యాశాఖ చేపడుతున్న పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ, ఏ విధమైన స్పష్టమైన జీఓలు లేకుండానే రోజుకో వింత ఆలోచనలతో ఉపాధ్యాయుల సర్దుబాటు తీవ్ర ఆందోళనకు లోను చేస్తోందన్నారు. వారం వారం ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సమావేశాల్లో సమస్యలు వెల్లడిస్తున్నా ఏ మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ సమస్యలు చెలరేగుతున్నాయన్నారు. బదిలీలు, ఉద్యోగోన్నతుల సమస్యలు పరిష్కరించాలని పదే పదే చెబుతున్నా ఏ మాత్రం న్యాయం జరగడం లేదన్నారు. ఉపాధ్యాయుల ఆందోళనను గమనించి సమస్యలు పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమశేఖరనాయుడు, మణిగండన్, గౌరవాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సహధ్యక్షులు రెడ్డెప్పనాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్పీ బాషా, తదితరులు పాల్గొన్నారు. -
అన్నదానం, గోసంరక్షణ ట్రస్టులకు విరాళాలు
కాణిపాకం: శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోని అన్నదానం, గోంసరక్షణ ట్రస్టులకు శుక్రవారం దాత కుటుంబాలు నగదు విరాళం చేశాయి. హైదరాబాద్‌కు చెందిన దాత బాలాజీ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు మొత్తం రూ.1.73 లక్షలు నగదు విరాళం ఇచ్చారు. ఇందులో అన్నదాన ట్రస్టుకు రూ.62వేలు, గోసంరక్షణ ట్రస్టుకి రూ.1.11 లక్షల చొప్పున్న అందజేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన సత్య నారాయణ రమాదేవి కుటుంబసభ్యులు గోసంరక్షణ ట్రస్టుకు రూ. 50వేలు, నిత్యాన్నదానం ట్రస్ట్కకు రూ.50 వేలు మొత్తం రూ. ఒక లక్ష విరాళం ఇచ్చారు. ఈ నగదును అందుకున్న ఆలయ ఏఈఓ రవీంద్రబాబు వారికి స్వామి వారి దర్శనం కల్పించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 10 మందికి జరిమానా చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన పది మందికి రూ.లక్ష జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్స్‌పల్ జూనియర్ సివిల్ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం పది మందిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పరిశ్రమల స్థాపనకు భూముల పరిశీలన శాంతిపురం: రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలో ప్రతిపాదిత విమానాశ్రయ సమీపంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు శుక్రవారం భూములను పరిశీలించారు. అడిడాస్, నైక్ కంపెనీల ప్రతినిధులు దండికుప్పం, అమ్మవారిపేట, విజలాపురం, మణీంద్రం, కిలాకిపోడు ప్రాంతాల్లో పర్యటించారు. కడా ప్రాజెక్టు ఆఫీసర్ వికాస్ మర్మత్, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు, శాంతిపురం తహసీల్దార్ శివయ్య కంపెనీల ప్రతినిధులను తీసుకువచ్చి భూములను చూపారు. అందుబాటులోని భూములు, సేకరించనున్న భూముల వివరాలను అధికారులు పారిశ్రామిక ప్రతినిధులకు వివరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
బాల్యవివాహాలను నిరోధించాలి
చిత్తూరు కలెక్టరేట్ : బాల్య వివాహలను నిరోధించాలని 8వ డివిజన్ సచివాలయ మహిళా పోలీసు సునీత అన్నారు. శుక్రవారం నగరంలోని వెంగళరావు కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ యుక్త వయసు బాలికల భవిష్యత్‌కు కిశోరి వికాసం కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మేనరికాలు, ఆచారాల పేరుతో బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్య వివాహాలు చేసి బాలికల జీవితాలను బుగ్గిపాలు చేయకూడదన్నారు. ప్రేమ పేరుతో మోసగించడం, నమ్మి వెంట వచ్చిన వారిని చిత్రహింసలు పెట్టడం, బాలికల ప్రాణాలకు ముప్పు కలిగేలా వ్యవహరించడం నేటి సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలని చెప్పారు. బాలికలు తమకు తాము కాపాడుకునేలా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలన్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా భయాందోళన చెందకూడదన్నారు. బాలికలు కౌమార దశలో వచ్చే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పకుండా తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అరుణ, అంగన్వాడీ కార్యకర్త చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రైతులతో కలెక్టర్ చర్చలు
కుప్పం: రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు ఇవ్వమని ఆందోళన వ్యక్తం చేసిన రైతులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ చర్చలు జరిపారు. శుక్రవారం కడా పీడీ కార్యాలయంలో రామకుప్పం, శాంతిపురం మండల్లోని అమ్మారిపేట, 30–సొన్నేగానిపల్లి, దండికుప్పం, కిలాకిపోడు, మణీంద్రం, బందలగుట్ట, కడచినకుప్పం, విజలాపురం గ్రామాల్లోని రైతులతో చర్చించారు. గతంలో విమానాశ్రయం కోసం ప్రభుత్వం ఇప్పటికే భూములు తీసుకుందని, ఉన్న కొద్దోగొప్పో భూములను ఇండస్ట్రియల్ పార్కు కోసం తీసుకుంటే తమ జీవనం దుర్భరమైపోతుందని కలెక్టర్‌తో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమకందరికీ ఎకరా, 50 సెంట్లు పొలం మాత్రమే ఉందని, ఆ పొలంలో పశుగ్రాసం సాగుతో పాడి పరిశ్రమ ద్వారా జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ప్రభుత్వం పరిశ్రమల కోసం ఉన్న కొంత భూమిని కూడా లాక్కుంటే తమ జీవనం కష్టతరమవుతుందన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ పరిశ్రమలు రావడంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, రైతులు అభివృద్ధికి సహకరించాలని సూచించారు. భూములు నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, కోల్పోయిన భూములకు మెరుగైన నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై పలువురు రైతులు అసహనం వ్యక్తం చేస్తూ తమ భూములు ఇవ్వలేమని చెప్పినట్లు సమాచారం. ప్రత్యేకంగా ప్రతి రైతుతో చర్చించి, సర్దుబాటు చేస్తామంటూ కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. గోడు విన్నవించుకున్న రైతులు న్యాయం చేస్తామన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ -
వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై టీడీపీ కార్యకర్త దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: ౖవెఎస్సార్ సీపీ సానుభూతి పరులపై టీడీపీ కార్యకర్త దాడులు చేశాడు. పాత కక్షలతో ఇంటి అరుగుపై కూర్చున్న వ్యక్తిపై బులెట్ లో దూసుకెళ్లి, గుద్ది గాయ పరిచాడు. ఆపై కుటుంబసభ్యులపై దౌర్జన్యం చేసి, చితకబాది భయ బ్రాంతులకు గురి చేసిన ఘటన చిత్తూరు మండలం 36.గొల్లపల్లిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. చిత్తూరు మండలం 36.గొల్లపల్లికి చెందిన సుందరయ్య తన ఇంటి అరుగుపై కూర్చుని ఉన్నారు. ఇది గమనించిన టీడీపీకి చెందిన పవన్ బులెట్ పై అతివేగంగా అతని పైకి దూసుకొచ్చాడు. దీంతో సుందరయ్యకు గాయాలయ్యాయి. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆ యువకుడిని ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ ఆ యువకుడు సుందరయ్య మామ వజ్రాలు మందడి వీపుపై ఇనుప వస్తువుతో చితకబాదాడు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రిలో చేరారు. మళ్లీ ఆ యువకుడు చిత్తూరులోని కొందరు అల్లరి మూకలను రప్పించి, బాధితుడి ఇంట్లోని మహిళలు, వృద్ధులపై దాడి చేశాడు. ఆ కుటుంబం ఎప్పుడు ఏం చేస్తారని భయపడుతోంది. కాగా నిందితుడు ఎన్నికల సమయంలో కూడా ఓ వ్యక్తిపై దాడిచేసి తలపై గాయపరిచాడు. దీనిపై కేసు కూడా నమోదైంది -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చౌడేపల్లె: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించిన సంఘటన శుక్రవారం పుంగనూరు మార్గంలోని చిన్న యల్లకుంట్ల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చౌడేపల్లె మండలం పొదలపల్లె సమీపంలోని ఓ రైతుకు చెంది మామిడితోటకు యానాది రెడ్డెప్ప(35) కాపలాగా ఉన్నాడు. అతనికి భార్య రాజేశ్వరి, ఐదుగురు పిల్లలు ఉన్నారు. గురువారం రాత్రి పెద్దయల్లకుంట్ల సమీపంలోని ఓ మామిడితోటలో కాపలాగా ఉన్న తన అక్క సిద్ధమ్మ వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న భార్యాపిల్లలతో కలిసి గురువారం రాత్రి భోజనం చేసి, తాను కాపలా ఉన్న మామిడితోట వద్దకు వెళ్లేందుకు రెడ్డెప్ప చౌడేపల్లె– పుంగనూరు మార్గంలోని పొదలపల్లె సమీపంలో రోడ్డుపైకి వచ్చాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని వాహనం ఈడ్చుకుని వెళ్లి, కొద్ది దూరంలోని పొదల చాటున పొలాల్లోకి పడేసి ఉడాయించారు. అటు వైపుగా వెళ్లే పాదచారులు గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అదుపుతప్పి లారీ బోల్తా శ్రీరంగరాజపురం : అదుపుతప్పి ఆయిల్ ప్యాకెట్లు తరలిస్తున్న లారీ బోల్తా పడిన సంఘటన మండలంలోని గంగమ్మగుడి వద్ద చో టు చేసుకుంది. పోలీ సుల కథనం మేరకు.. చైన్నె నుంచి చిత్తూరుకు ఆయిల్ ప్యాకెట్ల లోడ్‌తో శుక్రవారం ఓ లారీ బయలుదేరింది. లారీ చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిలోని శ్రీరంగరాజపురం మండలం ఆరిమాను గ్రామానికి సమీపంలోని గంగమ్మ గుడి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. జూద స్థావరాలపై దాడులు 9 మంది జూదరుల అరెస్టు వెదురుకుప్పం : జూదస్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేసి, 9 మంది జూదరులను అరెస్టు చేసిన సంఘటన మండలంలోని జక్కదొన అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని జక్కదొన అటవీ ప్రాంతంలో కొంతమంది జూదం ఆడుతున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీనిపై స్పందించిన ఇన్చార్జ్ ఎస్ఐ సుమన్ తన సిబ్బందితో కలసి జూద స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. ఆ సమయంలో జూదం ఆడుతున్న 9 మందిని అరెస్టు చేసి, రూ.15,830 స్వాధీనం చేసుకున్నట్లు ఇన్చార్జ్ ఎస్ఐ సుమన్ తెలిపారు. ఎవరైన జూదం ఆడిన, సారా కాసినా కఠిన చర్యలు తప్పవని అన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఆర్వో మోహన్‌కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి పలు శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. సంబంధిత శాఖల అధికారులు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 35 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పరీక్ష కేంద్రాల్లో 170 కళాశాలలకు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 10,236, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3,724, ఒకేషనల్ మొదటి సంవత్సరం 810, ద్వితీయ సంవత్సరం 607 మొత్తం 15,377 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరందరికీ పరీక్షల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేసి, గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించాలని తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థుల రాకపోకలకు సమస్యలు లేకుండా ఆర్టీసు బస్సులు సకాలంలో నడపాలన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర వైద్యసేవలకు కేంద్రాల వద్ద ఏఎన్ఎంలను నియమించాలన్నారు. మొదటి సంవత్సరం పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ఐఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
జాబితాలో మృతుల ఓట్లు తొలగించండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో మృతుల ఓటర్లను తొలగించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమా ర్ గాంధీ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శక ఓటర్ల జాబితా తయారీకి చర్యలు చేపట్టాలన్నారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో వైద్యఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని మృతుల ఓట్లను తొలగించాలన్నారు. జిల్లాలో ఎన్సీడీ 3.0 సర్వే చేస్తున్నట్లు తెలిపా రు. ఈ సర్వేలో ప్రతి కుటుంబంలోని వివరాలను సేకరిస్తున్నారన్నారు. ఫారం 6 కు 3,595 దరఖాస్తులు అందగా 2,297, ఫారం 7 లో 3,034 దరఖాస్తులు అందగా అందులో 1,889, ఫారం 8 లో 5,304 దరఖాస్తులకు 4,177 దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు. మృతి చెందిన, మల్టిపుల్ ఓటర్లను జాబితాను తొలగించేలా, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో నూతన ఓటర్లకు కార్డుల పంపిణీ, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటర్ల జాబితాలో పేర్ల మార్పునకు సంబంధించిన అంశాలను పరిశీలించాలని వివిధ పార్టీల ప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో డీఆర్వో మోహన్‌కుమార్, వైఎస్సార్ సీపీ పార్టీ తరఫున ఉదయ్‌కుమార్, ఇతర పార్టీల నుంచి బాలసుబ్రహ్మణ్యం, సురేంద్రకుమార్, యశ్వంత్, అట్లూరి శ్రీనివాసులు, పరదేశి, భాస్కర్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ వాసుదేవన్ పాల్గొన్నారు. -
7 రకాల రేషన్ కార్డుల సేవలకు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పౌరసరఫరాల శాఖకు సంబంధించి 7 రకాల రేషన్‌కార్డుల సేవల కు అవకాశం కల్పించారని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పౌరసరఫరాల శాఖకు సంబంధించిన 7 రకాల రేషన్‌కార్డుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో కొత్తరేషన్ కార్డులు, బియ్యం కార్డులో సభ్యుల చేర్పులు, మార్పులు (బర్త్, పెళ్లి), బియ్యం కార్డు నుంచి సభ్యుల విభజన, బియ్యం కార్డులో సభ్యుల పేర్లు తొలగింపు (మృతులు మాత్రమే), కార్డులు సరెండర్, బియ్యం కార్డులో చిరునామా మార్పు, తప్పుడుగా నమోదైన ఆధార్ సీడింగ్ దిద్దుబాటుకు అవకాశం కల్పించారు. జిల్లాలో ఇప్పటికీ ఏ రేషన్కార్డులోను నమోదు కాని అర్హత కలిగిన పేదలు కొత్త రేషన్‌కార్డుకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు కార్డు ఉండి ఏవైనా సవరణలుంటే దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో 7,707.484 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించగా మే, 2025 నెలకు గాను 8,642.431 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏ రేషన్షాపులోనైనా బియ్యం ఇంకా అవసరం ఉంటే సంబంధిత తహసీల్దార్ స్పష్టమైన నివేదికను పంపాలని ఆదేశించారు. రేషన్‌కార్డు లబ్ధిదారులు తమకు అందాల్సిన రేషన్ ను సంబంధిత ఎండీయూ వాహన ఆపరేటర్, రేషన్‌షాపు డీలర్ వద్ద పొందాలని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. విభిన్నప్రతిభావంతులకు ఉచిత డీఎస్సీ శిక్షణ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా విభిన్నప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న విభిన్న ప్రతిభావంతులు ఈ నెల 11 వ తేదీ లోపు www.mdfc.apefss.in (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎండీఎఫ్సీ.ఏపీఈఎఫ్ఎస్ఎస్.ఇన్) వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 40 శాతం వైకల్యం ఉన్న అంధులు, బధిరులు, శారీరక విభిన్నప్రతిభావంతులు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులని ఆయన వెల్లడించారు. బోయకొండ హుండీ రాబడి రూ.63.89 లక్షలు చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం నిర్వహించిన హుండీ కానుకలు లెక్కింపు ద్వారా ఆలయానికి రూ.63.89 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏకాంబరం తెలిపారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూ.63,89,617, బంగారం 40 గ్రాములు, వెండిి 470 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. విదేశీ కరెన్సీ7 నోట్లు లభించినట్లు తెలిపారు. ఈ ఆదాయం 42 రోజులు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు అని ఈఓ చెప్పారు. అలాగే రణభేరి గంగమ్మ ఆల య హుండీ ద్వారా రూ.40,463 నగదు ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో ఇన్స్పెక్టర్ శశికుమార్, ఆలయ, బ్యాంకు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కాలకూటమిపై
విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో అక్రమ తనిఖీలకు నిరసనగా భగభగ మండే భానుడికి దీటుగా పాత్రికేయలోకం కూటమి సర్కారు తీరుపై నిప్పులు చెరిగింది. పత్రికా స్వేచ్ఛ హరింపునకు నిరసనగా పదం పదం కలిపి కదం తొక్కింది. మీడియా గొంతు నొక్కె చర్యలు తగవని గర్జించింది. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తుందని ధ్వజమెత్తింది. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వం● సాక్షి ఎడిటర్ నివాసంలో ఖాకీల జులుంపై నిరసన ● చిత్తూరులో డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చిన ఏపీయూడబ్ల్యూజే చిత్తూరులో డీఎస్పీకి వినతిపత్రం అందజేస్తున్న ఏపీయూడబ్ల్యూజే, ప్రెస్‌క్లబ్ నేతలు చిత్తూరు అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలో పాత్రికేయులపై దాడులు, తప్పుడు కేసులు బనాయిస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లోకనాథన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అశోక్‌కుమార్ ఆరోపించారు. సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు తనిఖీలు చేయడం, అనుమతి లేకుండా సోదాలు చేయడం ఆయన మాససిక స్థైర్యాన్ని దెబ్బతీయడమేనన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ గురువారం ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే), చిత్తూరు ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరసన తెలిపారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారథిలా ఉన్న మీడియా రంగంపై ఇలా కక్షసాధింపు చర్యలకు పాల్పడడం రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు. ధనంజయరెడ్డిపై ఇప్పటికే తప్పుడు కేసులు పెట్టారని, ఇది కోర్టు పరిధిలో ఉండగా.. నేడు ఇంట్లోకి చొరబడి ఆయన కుటుంబ సభ్యులను సైతం ఇబ్బందులు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. అనంతరం చిత్తూరు డీఎస్పీ సాయినాథ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రమేష్‌బాబు, ఉపాధ్యక్షుడు శివప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్, జిల్లా కమిటీ సభ్యులు సురేష్, సీనియర్ పాత్రికేయు లు శివ, గజపతి, బాలసుందరం, హరీష్, రాజేష్, సాయి, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. మీడియాపై బెదిరింపు ధోరణి మంచిది కాదుపలమనేరు: మీడియాపై పోలీసుల బెదిరింపు ధోరణి మంచిది పద్ధతి కాదని ప్రెస్‌క్లబ్ నేతలు అన్నారు. పోలీసులు విజయవాడలోని సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లోకి ఎలాంటి నోటీసులు లేకుండా చొరబడి అమానుషంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ పలమనేరు ప్రెస్‌క్లబ్ జర్నలిస్టులు గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఇన్చార్జ్ ఏఓ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏదో కేసులో ముద్దాయిలు అపార్ట్మెంట్లో ఉన్నారనే సమాచారంతో ఆ భవన సముదాయంలోని అన్ని ఇళ్లను తనిఖీలు చేస్తున్నామని భయపెట్టడం పద్ధతి కాదన్నారు. గౌరవప్రదమైన ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిపైనే పోలీసులు జులం ఇలా ఉంటే ఇక రాష్ట్రంలోని సామాన్యుల పరిస్థితి ఎమిటని ప్రశ్నించారు. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడంతోపాటు సమాజంలో ఆయన పరువు ప్రతిష్టలకు విఘాతం కల్పించే రీతితో పోలీసులు వ్యవవహరించడం తగదన్నారు. ఎలాంటి కేసులు లేకున్నా కేవలం సాక్షి మీడియాను అణగదొక్కేందుకు ఇలాంటి దాడులు చేయడం సమంజసం కాదన్నారు. ఇది కేవలం సాక్షి ఎడిటర్‌పై మాత్రమే జరిగింది కాదని, భవిష్యత్తులో మొత్తం మీడియాపై ఇలాంటి ఆంక్షలు, దాడులు, బెదిరింపులు కొనసాగే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోందన్నారు. ప్రజాసామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా పరిరక్షణకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలే ఇలాంటి దిగజారుడు చర్యలు దిగడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్యామ్, దిలీప్, రెడ్డెప్ప, మణి, రమేష్, మోహన్‌మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఢీసీసీబీ
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవి పచ్చనేతల మధ్య చిచ్చు పెట్టింది. కూటమి సర్కారు ఆ పదవిని ఓ నేతకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసినా.. ఆ కుర్చీని ఆశిస్తున్న ఆశావహులు కేటాయింపు చెల్లదని.. దాన్ని రద్దు చేసి, తమకే ఇవ్వాలని ఓ సీనియర్ నేత వర్గం పట్టుపడుతోంది. దీంతో డీసీసీబీ కుర్చీకి కుమ్ములాట జరుగుతోంది.డీసీసీబీ కార్యాలయంచితూరు రూరల్ (కాణిపాకం): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) చైర్మన్ పదవి కేటాయింపు జరిగినా ఆ కుర్చీపై తెలుగు తమ్ముళ్లు ఢీ అంటే ఢీ అని కుమ్ములాడుతున్నారు. దీంతో పదవి దక్కించుకున్న అమాసకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఆ పేరును కూటమి ప్రభుత్వం ప్రకటించినా.. సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏకంగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రిని నిలదీశారు. చైర్మన్ పదవిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆశించినా.. డీసీసీబీ పదవిని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆశించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన ఈ పదవిని ఆశిస్తున్నారు. దీంతో డీసీసీబీ చైర్మన్ పదవి దొరబాబుకే వస్తుందని అందరూ ఊహించారు. ఆయన అనుచరులతోపాటు, డీసీసీబీ అధికార వర్గం సైతం చైర్మన్ కుర్చీ దొరబాబుకేనని అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆయనకు కాకుండా ఎవరూ ఊహించని విధంగా అమాసకు చైర్మన్ పదవి కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. మళ్లీ అమాసకే... కూటమి ప్రభుత్వం గతనెల 28వ తేదీన అమాస రాజశేఖర్‌రెడ్డికి డీసీసీబీ పదవిని కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2006 నుంచి 2019 మధ్యకాలంలో పలుమార్లు ఈయనే చైర్మన్ కుర్చీలో కూర్చున్నారు. 13 ఏళ్ల పాటు డీసీసీబీ పదవిని అనుభవించారు. మళ్లీ ఈ పదవిని అమాసకు కట్టబెట్టేందుకు కూటమి నేతలు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి, నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ చక్రం తిప్పారనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు గతంలో బ్యాంకు తరఫు రూ.కోటి చెక్కును అందించిన విషయం, కుప్పంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు బ్యాంకు నిధులు కేటాయింపు అమాసకు కలిసొచ్చిందని కొందరు సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన పదవి కాలంలో అవసరం లేని భవన నిర్మాణం, వాస్తు దోషం పేరుతో గుడి నిర్మించిన ఘనత, రైతుల ధనం దుర్వినియోగం చేశారనే ఆరోపణలను మళ్లీ వారు వేలెత్తి చూపుతున్నారు. అమాసకు ఎలా ఇస్తారు? అమాసకు మళ్లీ డీసీసీబీ చైర్మన్ పదవి కట్టబెట్టడంపై కూటమిలో కుమ్ములాట మొదలైంది. ఆశావాహులు, సీనియర్ నేతలు ఈ పదవి కేటాయింపుపై నిప్పులు చెరుగుతున్నారు. మంగళవారం డీఆర్సీ మీటింగ్‌కు హాజరైనా జిల్లా రవాణాశాఖ మంత్రి రాం ప్రసాద్‌రెడ్డి ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అమాసకు ఎలా పదవి ఇస్తారంటూ నిలదీశారు. పార్టీకి కష్టపడిన వారికి ఇవ్వకుండా మళ్లీ అమాసకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించారు. చైర్మన్ పదవిని మార్చాలని భీష్మించారు. సీనియర్లకు ఇవ్వాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వచ్చేవారికి పదువులు ఇవ్వడం విడ్డూరమంటూ విరుచుపడ్డారు. దీంతో మంత్రి అధిష్టానం దృష్టికి తీసుకెళతానని వాళ్ల మధ్య నుంచి తప్పుకున్నారు. డీసీసీబీగా చైర్మన్ పదవి అమాస రాజశేఖర్‌రెడ్డికి కేటాయింపు జీర్ణించుకోలేని తమ్ముళ్లు మంత్రిని నిలదీసిన మాజీ ఎమ్మెల్సీ, పలువురు నేతలు పార్టీలోని సీనియర్లకు ఇవ్వాలి డిమాండ్చైర్మన్ ప్రమాణస్వీకారం వేళ.. డీసీసీబీ చైర్మన్ పదవి అమాసకు కేటాయించి, వారం రోజులు దాటింది. దీంతో చైర్మన్ పగ్గాలు చేపట్టేందుకు అమాస సిద్ధమవుతున్నారు. కార్యాలయానికి రంగులు వేయిస్తున్నారు. ఆయన చాంబర్‌కు కొత్త హంగులు దిద్దించుకుంటున్నారు. త్వరలో ప్రమాణాస్వీకారానికి ముహుర్తం ఖరారు చేయనున్నారు. ఈ తరుణంలో చైర్మన్ పదవిపై పేచీ పెట్టేందుకు కొందరు సిద్ధపడడం చర్చనీయాంశంగా మారింది. అమాసకు ఆ పదవి లేకుండా చేయాలని కొందరు బహిరంగంగా పట్టుబడడంతో అమాస వర్గం మల్లగుల్లలు పడుతోంది. ముహుర్తానికి ముందే మార్పునకు చూడాలని ఓ సీనియర్ నేత గట్టిగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయోనని ప్రేక్షక పాత్ర పోషిస్తున్న కూటమి నేతలు ఎదురుచూస్తున్నారు. -
ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడి
గంగాధర నెల్లూరు: తక్కువ పెట్టుబడితో ఆయిల్ పామ్ సాగు చేసి అధిక దిగుబడులు పొందవచ్చ ని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కా ర్యాలయంలో గురువారం నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆయిల్ పామ్ సాగు చేసిన నాలుగేళ్లకే రైతులు లాభాల బాట పడతారని, అంతవరకు అంతర పంటలతో రైతులు దిగుబడులు పొందవచ్చన్నారు. ఆయిల్‌పామ్ అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చని, రైతులకు మొక్కలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పీడీ బాలసుబ్రమణ్యం, మండల ఉద్యాన అధికారి లోకేష్, వ్యవసాయధికారి భవాని పాల్గొన్నారు. మద్యం షాపులో ఘర్షణ ● ఎనిమిది మందిపై కేసు నమోదు నగరి : నగరి సమీపంలోని కీళపట్టు వద్ద బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ కేసులో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ విక్రమ్ గురువారం తెలిపారు. ఒక వర్గంలో అమృతరాజ్ నాడార్, మైకెల్ సహ నలుగురిపైన, మరో వర్గంలో కుమరేశన్, రాజాసహ నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు. మద్యం షాపులో జరిగిన చిన్న గొడవ చిలికి చిలికి రెండు వర్గాల ఘర్షణకు దారి తీసిందన్నారు. కేసును డీఎస్పీ పర్యవేక్షిస్తున్నారన్నారు. బాలుడిపై కుక్కల దాడి పుంగనూరు: పట్టణంలోని దూళ్లవాళ్లఇండ్లలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. గురువారం ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడిని కుక్కలు కరిచాయి. గాయ పడిన బాలుడిని స్థానికులు గుర్తించి బాలుడిని తల్లిదండ్రులతో కలసి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతున్నాడు. -
అప్పుల బాధ తాళలేక యువ రైతు ఆత్మహత్య
చౌడేపల్లె: అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఎస్ అగ్రహారంలో గురువారం చోటు చేసకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని ఏ.కొత్తకోట పంచాయతీ ఎస్ అగ్రహారం గ్రామానికి చెందిన కమలాకర్, హేమలత దంపతులకు లోకేష్(27) కుమారుడు ఉన్నాడు. కమలాకర్ లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. కొన్నేళ్ల కిందట పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాకర్ మృతి చెందాడు. దీంతో లోకేష్ తన తల్లి హేమలతతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవని సాగించేవాడు. ఇటీవల తమ పొలంలోని 5ఎకరాల్లో టమాట పంట సాగు చేశాడు. పంట సాగు కోసం రూ.లక్షలు ఖర్చు చేశాడు. అలాగే ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఈఎంఐల తాకిడి అధికం కావడంతో ఆర్థిక భారం అధికమైంది. సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులు తీర్చలేక, ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతూ గ్రామంలో చీటీల నిర్వాహకుల నుంచి సైతం డబ్బులు తీసుకున్నాడు. అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు అధికం కావడంతో ఆ విషయం తల్లి హేమలతకు తెలియడంతో లోకేష్‌ను మందలించింది. దీంతో గ్రామానికి సమీపంలోని యల్లమ్మ గుంత సమీపంలోని చింతచెట్టుకు ఉరి వేసుకున్నాడు. చెట్టు కొమ్మకు వేళాడుతున్న లోకేష్ ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరుకు తరలించి తల్లి హేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కంట తడిపెట్టించిన పోన్ స్టేటస్.. లోకేష్‌కు చెందిన ఐపోన్లో స్టేటస్‌కు ఐయామ్ సారీ అంటూ దుఖంతో పెట్టిన స్టేటస్ చూసిన స్థానికులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. లోకేష్ ఎంత పని చేశావయ్యా అంటూ రోదించారు. -
స్కెచ్‌లో దర్శనం
నేలపై మాయం..● రాజు కాలువ కబ్జా కథకుప్పంరూరల్: కూటమి ప్రభుత్వం రాగానే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలు వచ్చాయి. కొంత మంది అక్రమార్కులు అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తుండగా, మరికొంత మంది చుట్టు పక్క ఉన్న డీకేటీ, ప్రభుత్వ స్థలాలు, రాజు కాలువలను కలుపుకుని లే అవుట్ వేశారు. ప్రశ్నించాల్సిన అధికారులు ఏటు వైపు నుంచి ఒత్తిళ్లు వస్తాయోనని మిన్నకుండిపోతున్నారు. దీంతో కాలువలు, ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. కుప్పం పట్టణానికి అనుకుని ఉన్న ఏరియా ఆస్పత్రి ఎదురుగా ఉన్న చీమనాయనపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 99/3లో కొంత మంది రియల్ వ్యాపారులు లే అవుట్ వేశారు. జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఈ స్థలం ఎంతో విలువైనదిగా గ్రహించిన రియల్టర్లు 99/3లో ఉన్న రాజు కాలువను సైతం ఆక్రమించుకున్నారు. రాజు కాలువ వారు కొనుగోలు చేసిన స్థలం మధ్యన ఉండడంతో మట్టి పోసి రాజుకాలువను మాయం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా లే అవుట్ రాళ్లను పూడ్చి అమ్మకానికి సిద్ధం చేశారు. రాజుకాలువ నేలపై మాయమై, లే అవుట్ స్కెచ్‌లో ప్రత్యక్షమైంది. ఇలా కాలువ పూడ్చి వేసి, విలువైన స్థలాన్ని రికార్డుల్లో మాత్రం అలాగే ఉంచారు. దీంతో భారీ వర్షాలు వస్తే నీరు బయటికి పోకుండా అక్కడే నిలువ ఉండిపోయే ప్రమాదం ఉంది. నివాస గృహాలు ఏర్పాటు చేసుకుంటే ఎగువ నుంచి వచ్చే నీరు బయటికి పోలేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రమాదం ఉందని తెలిసి, అందులోను నిత్యం రాష్ట్రం, జిల్లాస్థాయి అధికారులు రాకపోకలు సాగించే జాతీయ రహదారి పక్కన విలువైన రాజుకాలువను అక్రమిస్తే రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కడా పీడీ అయినా స్పందించి రాజుకాలువను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. రాజుకాలువను ఆక్రమించి వేసిన లే అవుట్ -
అధైర్యపడొద్దు... వచ్చేది మన ప్రభుత్వమే
కుప్పంరూరల్: అధైర్య పడొద్దు... 2029లో వచ్చేది మన ప్రభుత్వమే.. ప్రతి కార్యకర్తకూ న్యాయం చేసే బాధ్యత నాది...అని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కుప్పం నాయకులతో అన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన్ని కలిసి కుప్పం నాయకులతో సుధీర్ఘంగా చర్చించారు. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు, దాడులు ఎక్కువయ్యాయని కుప్పం నాయకులు జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోయారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదని, వచ్చేది మన ప్రభుత్వమే అని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత తనది చెప్పారు. ఎవరెవరు అన్యాయం చేశారో వారిని గుర్తు పెట్టుకోవాలని, వారికి రెండింతలు తిరిగి ఇస్తామని చెప్పారు. అధికారులైనా, నాయకులైనా ఎవరినినైనా వదిలేదిలేదన్నారు. అధికారులు రిటైర్డ్ అయినా, నాయకులు సముద్రాలకు అవతల వెళ్లి దాక్కున్న తీసుకువచ్చి శిక్ష వేస్తామని భరోసా ఇచ్చారు. స్థానిక ఇన్చార్జ్ స్థానికంగానే ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల కాలంలో దాడులకు గురైన వారిని ఒకసారి విజయవాడకు తీసుకురావాలని చెప్పినట్లు నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎమ్మెల్సీ భరత్, సెంథిల్‌కుమార్, కుప్పం నియోజకవర్గ నాలుగు మండలాల నేతలు పాల్గొన్నారు. కుప్పం సమస్యలు మాజీ సీఎం దృష్టికి.. బైరెడ్డిపల్లె: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పం నియోజకవర్గ ప్రజలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులను కుప్పం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మొగసాల రెడ్డెప్ప మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో కుప్పం, రామకుప్పం మండలాలకు సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని, సమస్యలను మాజీ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కుప్పం నేతలతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి సారూ!
● రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు అపస్ నేతల వినతి చిత్తూరు కలెక్టరేట్ : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ కోరారు. గురువారం విజయవాడలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నేతలతో కమిషనర్ నిర్వహించిన స మావేశంలో ఆయన పలు సమస్యలపై చ ర్చించారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజుకు ఆ సంఘం నేత లు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షు లు బాలాజీ విలేకరులతో మాట్లాడారు. తొలుత హెడ్మాస్టర్ బదిలీలు, హెచ్ఎంల ఉద్యోగోన్నతులు, తర్వాత స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల ఉద్యోగోన్నతులు బదిలీలు ని ర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సు ముఖత చూపించారన్నారు. ఉద్యోగోన్నతు ల ప్రక్రియలో ఖాళీలను గుర్తించాక 1:2 ప్రాతిపదికన సీనియార్టీ జాబితా ప్రకటించి, అందరూ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఇస్తారన్నారు. రెండేళ్లలోపు ఉద్యోగ విరమణ పొందే వారుంటే మినహాయింపు ఇస్తారని చెప్పారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉద్యోగోన్నతులకు త్వరలో నిర్ణయం ప్రకటిస్తారన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒకే ప్రాతిపదికన టీచర్లను కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ప్రధానంగా ఫౌండేషన్ స్కూళ్లలో 1:20 ప్రకారం టీచర్లను నియమించాలని డిమాండ్ చేశామన్నారు. బేసిక్ ప్రైమరీ స్కూల్స్‌లో కనీసం ఇద్దరు టీచర్లు నియమించాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని కోరామన్నారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45 దాటితే అదనపు సెక్షన్ కింద పరిగణించాలన్నారు. ప్రతి 30 మంది విద్యార్థులకు రెండో సెక్షన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. తెలుగు మీడియం కొనసాగించాలన్నారు. ఉపాధ్యాయుల పనిభారం 30 పీరియడ్లకు మించకుండా చర్యలు చేపట్టాలన్నారు. హైస్కూల్ ప్లస్ పీజీటీలకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. 610 జీఓలో వివిధ జిల్లాల్లో 18 ఏళ్లుగా ఉద్యోగోన్నతులు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పీడీలకు న్యాయం చేయాల ని కోరారు. పాఠశాల రోల్ మార్చి 31 నాటికి కాకుండా ఏప్రిల్ 7 వరకు తీసుకోవాలన్నారు. అంతర్ జిల్లాల బదిలీ సైతం నిర్వహించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. -
యాదమరి పీహెచ్సీలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వైద్యులు
యాదమరి: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ మౌనిక సందర్శించారు. గురువారం ఆమె మండలంలోని బుడిగిపెంట గ్రామానికి చెందిన విజయదీప్(14)అనే బాలుడిని పరిశీలించారు. రెండు నెలలు క్రితం పలురకాల ఆరోగ్య రుగ్మతలతో చిత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అక్కడ చికిత్స అనంతరం బాలుడికి సంబంధించిన ఆరోగ్య నివేదికలను జిల్లా వైద్యాధికారులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు పంపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి క్రమంలో ఇక్కడికి వచ్చిన డాక్టర్.. కాన్పు సమయంలో అందించిన వ్యాధి నిరోధక టీకాలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలుడికి ఎలాంటి సమస్య లేదని, కేవలం సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా అతను కొంత కాలం పలు రుగ్మతలతో ఇబ్బంది పడ్డాడని, ఎటువంటి సమస్య లేదని తేల్చి చెప్పారు. అనంతరం గ్రామంలోని రెండేళ్లలోపు చిన్నారులకు అందించిన వాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. రేషన్ బియ్యం స్వాధీనం యాదమరి: అక్రమంగా నిల్వ ఉంచి 10 టన్నుల రేషన్ బియ్యాన్ని స్థానిక పోలీసులు దాడులు చేసి, స్వాధీనం చేసుకున్నారు. గురువారం మండలంలోని పుల్లయ్యగారిపల్లిలో పురుషోత్తం నాయుడికి సంబంధించిన ప్రైవేటు భవనాన్ని కొంత మంది మొక్కజొన్న వ్యాపారం చేస్తామని లీజుకు తీసుకున్నారు. అయితే అందులో యాదమరికి చెందిన అబ్దుల్ సలాం, పలమనేరుకు చెందిన చెంగల్ రాయులు, కర్ణాటకకు చెందిన రోషన్, ప్రదీప్ అనే వ్యక్తులు రేషన్ బియ్యం నిల్వ చేసి, అక్రమ రవాణా చేస్తున్నారని స్థానిక తహసీల్దార్‌కు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక ఎస్ఐ ఈశ్వర్ తన బృందంతో మెరుపు దాడులు చేసి, ఆ భవనంలో నిల్వ ఉంచిన 10 టన్నుల రేషన్ బియ్యం, క్వాలిస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ అక్రమ రేషన్ బియ్యం నిల్వకు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పకడ్బందీగా ఆరోగ్య కార్యక్రమాలు చిత్తూరు రూరల్ (కాణిపాకం): జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి ఆదేశించారు. గురువారం ఆమె చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. గర్భిణులకు పక్కాగా సేవలు అమలు చేయాలని సూచించారు. వారి నమోదు విషయంలో అలసత్వం వద్దని, ప్రసవ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. జన ఔషధిని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. -
గిరిజన గ్రామాన్ని అభివృద్ధి చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ధర్తీ ఆబా జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో గిరిజన గ్రామ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని డీఆర్ఓ మోహన్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో గిరిజన శాఖ ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ధర్తీ ఆబా జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో జిల్లాలోని పలమనేరు మండలం జగమర్ల గిరిజన గ్రామాన్ని సమగ్ర, స్థిరమైన అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. జగమర్ల గ్రామంలో మౌలిక సదుపాయాల పెంపు, ఆరోగ్యం, విద్య, జీవనోపాధిలో కీలకమైన అంశాలను గుర్తించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. జగమర్ల గ్రామానికి డీఆర్డీఏ, విద్య, వైద్యం, ఐసీడీఎస్, గ్రామీణ నీటి సరఫరా, పీఆర్, జిల్లా పంచాయతీ, వ్యవసాయ అనుబంధ, విద్యుత్, టెలీ కమ్యూనికేషన్స్, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శాఖల అధికారులు వెళ్లి పరిశీలించాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారి అందజేసే 144 అంశాల ఫార్మాట్‌ను సంబంధిత శాఖల అధికారులు వివరాలు నింపి పంపాలన్నారు. సంబంధిత శాఖలు అందజేసే వివరాలపై కలెక్టర్ ప్రతి నెలా జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో చర్చిస్తారన్నారు. ఆయా శాఖలు అందజేసే వివరాలను కేంద్రప్రభుత్వానికి పంపుతామన్నారు. అదేవిధంగా పలమనేరులో మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.