
మామిడితోటపై ఏనుగుల దాడి
బంగారుపాళెం: మండలంలోని మొగిలిలో శుక్రవారం రాత్రి మామిడితోటపై ఏనుగులు దాడి చేశాయని బాధిత రైతు తెలిపాడు. గ్రామానికి చెందిన శ్రీనివాసులుకు గౌనిచెరువు వద్ద మామిడితోట ఉంది. సమీపంలోని కౌండిన్య అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు మామిడితోటలోకి ప్రవేశించి చెట్ల కొమ్మలను విరిచి కాయలను కొరికి నేలపాలు చేశాయని తెలిపారు. పంట చేతికందే సమయంలో ఏనుగులు తోటపై దాడి చేసి నష్టపరిచాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఏనుగులు తరచూ రైతుల మామిడి తోటలపై దాడులు సాగిస్తున్నట్లు తెలిపారు. అటవీశాఖాధికారులు ఏనుగులు పంటలపైకి రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కుక్కల దాడిలో జింక మృతి
పాలసముద్రం: మండలంలోని కన్నికాపురం సమీపంలోని వంకలో శనివారం కుక్కల దాడిలో జింక మృతి చెందింది. వేసవి కారణంగా అడవిలో నీరు లేకపోవడంతో కన్నికాపురం దళితవాడకు సమీపంలోని వంకలో నీరు తాగడానికి వచ్చిన జింకను గమనించిన వీధి కుక్కలు మూకుమ్మడిగా దానిపై దాడి చేసి, గాయపరిచాయి. దీంతో జింక మృతి చెందింది.

మామిడితోటపై ఏనుగుల దాడి