
‘కుంకీల’తో కట్టడయ్యేనా!
● రేపు జిల్లాకు కుంకీ ఏనుగులు ● క్యాంపులో పూర్తిస్థాయిలో జరగని పనులు ● రవాణాకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ● 22వ తేదీకి పలమనేరు క్యాంపు చేరేలా ఏర్పాట్లు
మేతపై తప్పని గుబులు
● సాధారణంగా ఓ కుంకీ ఏనుగు రోజుకి 900 లీటర్ల నీరు, 10 హెక్టార్లలో మేత అవసరం ఉంది. ఆహారం తిన్నాక ఇవి రోజుకు 5 మైళ్ల దాకా సంచరిస్తుంటాయి. వీటికి మేతగా రావి, మర్రి, జువ్వి, వెదరు, నేపియర్ గడ్డి, చెరుకు, అరటి మేతగా కావాలి. కానీ ఇవన్నీ ఇక్కడ ఇంకా సిద్ధం కాలేదు. మరోవైపు వంద ముద్దల రాగి సంగటి, బెల్లంతో కలిపిన వరిధాన్యం, వరిగడ్డి ఉండలను పొద్దున పెట్టాలి. ఈ నాలుగు ఏనుగుల మేత కోసమే నెలకు రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
● జిల్లాకు రానున్న కుంకీలను పలమనేరు మొసళ్లమడుగు ఎలిఫెంట్ క్యాంపులో పెట్టనున్నారు. ఇందుకోసం అటవీ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎఫ్‌ఓ భరణి తెలిపారు. కొద్ది రోజులు కర్ణాటక మావటిలు జిల్లా వాతావరణం ఏనుగులు అలవాటు పడే వరకు ఇక్కడ ఉంటారు. ఏనుగులను మచ్చిక చేసుకొని వాటికి తగిన శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపనున్నట్లు డీఎఫ్‌ఓ భరణి తెలిపారు.
పలమనేరు/చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య దశాబ్దాలుగా ఉంది. అడవిని దాటుతున్న ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని మొసలిమడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టు పనులను చేపడుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఆరు కుంకీ ఏనుగులు గురువారం పలమనేరు ఎలిఫెంట్ క్యాంపునకు చేరుకోనున్నాయి.
కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల కోసం కర్ణాటక రాష్ట్రంతో ఎంఓయూ చేసుకొంది. అందులో భాగంగా బుధవారం సాయంత్రం కర్ణాటక నుంచి మన రాష్ట్రానికి కుంకీలను అందించనున్నారు. అక్కడ నుంచి సాయంత్రం అవి ప్రత్యేక వాహనంలో బయలుదేరనున్నాయి. విద్యుత్ లైన్లు తగలకుండా రవాణా సమయంలో సరఫరా ఆపివేయాలని అటవీ అధికారులు ట్రాన్స్‌కో అధికారులను కోరారు. గురువారం సాయంత్రంలోపు పలమనేరు ఎలిఫెంట్ క్యాంప్‌కు వీటిని తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.
6 ఏనుగుల పేర్లు ఇలా..
6 కుంకీ ఏనుగులను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంలు..ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు బుధవారం ఏనుగులను అందజేయనున్నారు. మాస్తి, దేవ, రంజన్, కరుణా, కృష్ణ, అభిమన్యు అనే పేర్లు గల కుంకీ ఏనుగులను ఏపీకి పంపనున్నారు.
ఏనుగుల గుంపు వచ్చినప్పుడు..
ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. ఏనుగులను తరిమికొట్టడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. కొన్ని సార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగునే రక్షించడానికి వీటిని ఉపయోగిస్తారు.

‘కుంకీల’తో కట్టడయ్యేనా!

‘కుంకీల’తో కట్టడయ్యేనా!