శ్రీరంగరాజపురం : పిడుగుపడి రెండు పాడి ఆవులు మృతి చెందిన సంఘటన మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు కృష్ణమూర్తి కథనం మేరకు అకాల వర్షం కారణంగా ఇంటి పరిసరాలలో చెట్టుకింద రెండు పాడి ఆవులను కట్టి వేయగా వర్షం కారణంగా పిడుగు పడి ఆవులు మృతి చెందాయన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు.
ఐసెట్‌లో తిరుపతి విద్యార్థుల హవా
తిరుపతి సిటీ: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు నిర్వహించిన ఐసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్‌కు తిరుపతి జిల్లా వ్యాప్తంగా 2,759 మంది విద్యార్థులు హాజరుకాగా 2,627 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో పురుషులు 1296 మంది, 1331 మంది మహిళలు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది జిల్లాలో మహిళలదేపైచేయిగా నిలిచింది.
7, 10 ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులు
ఐసెట్ ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా టాప్‌టెన్‌లో 7వ, 10వ ర్యాంకులను తిరుపతి జిల్లాకు చెందిన విద్యార్థులు కై వసం చేసుకున్నారు. ఇందులో తిరుపతి నగరం సమీపంలోని వేదాంతపురానికి చెందిన వి అజయ్‌కుమార్ 7వ ర్యాంకు సాధించారు. ఈయన శ్రీసిటీ ఐఐఐటీలో బీటెక్ పూర్తి చేశారు. అజయ్‌కుమార్ తండ్రి వి మదనమోహన్ గాజులమండ్యం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. సూళ్లూరు పేట, మన్నూర్‌పోలూరుకు చెందిన మహిళా రైతు లక్ష్మీ కుమారుడు మహేంద్ర సాయి 10వ ర్యాంక్ సాధించాడు. ఈ విద్యార్థి ఆంధ్ర యూనివర్సిటీలో ఇటీవల బీటెక్ పూర్తి చేశాడు.