సంస్కరణల పేరుతో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న అశాసీ్త్రయ విధానాలను క్షేత్రస్థాయిలో టీచర్లు ఎండగడుతున్నారు. టీచర్ల సమస్యలు, డిమాండ్‌ల పరిష్కారం కాకపోయే సరికి ఈనెల 21వ తేదీన ఉమ్మడి చిత్తూరు డీఈఓ కార్యాలయాలు ముట్టడిస్తామంటూ ఇటీవల అన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. మంగళవారం ప్రభుత్వం తరపున మరోమారు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోనా శశిధర్ సంఘం నాయకులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో డిమాండ్‌లు ఏ మాత్రం పరిష్కారం కాకపోయినప్పటికీ ముట్టడి వాయిదా వేస్తున్నట్లు సంఘాల నాయకులు ప్రకటించారు. దీంతో జిల్లాలోని టీచర్లు ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం సాధించారని ముట్టడి వాయిదా వేశారంటూ ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెలుగులు జిమ్ముతున్న విద్యావ్యవస్థను కారుచీకటిగా మార్చేసింది. తాజాగా పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ పేరుతో తొమ్మిది రకాల బడులను తెరపైకి తెచ్చింది. ఈ విధానం వల్ల క్షేత్రస్థాయిలో విద్యార్థులకు, టీచర్లకు తీరని నష్టం కలుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పాఠశాలల పునర్‌వ్యవస్థీకరణ పేరుతో విలీనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి పేద విద్యార్థులు తమ గ్రామాల నుంచి కి.మీ దూరం నడిచి మరొక పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదెక్కడి న్యాయం
కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న వింత ధోరణిపై టీచర్లు, తల్లిదండ్రులు, పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఈడీ చదివిన అభ్యర్థులు ఎస్జీటీ పరీక్ష రాసేందుకు అవకాశం లేదు. అలాంటప్పుడు బీఈడీ చదివి స్కూల్ అసిస్టెంట్‌లుగా విధులు నిర్వహిస్తున్న టీచర్లు ప్రాథమిక పాఠశాలల్లో ఎలా బోధిస్తారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
ముట్టడి వాయిదాపై తీవ్ర విమర్శలు
ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక సంఘం నాయకులు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో నిర్వహించిన చర్చలతో ఒరిగిందేమి లేదు. అయినప్పటికీ బుధవారం నిర్వహించాల్సిన డీఈఓ కార్యాలయాల ముట్టడిని వెనక్కి తీసుకోవడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. క్షేత్రస్థాయిలో టీచర్ల సంఘ నాయకుల తీరుపట్ల భగ్గుమంటున్నారు.
సంఘం నేతలపై టీచర్ల మండిపాటు చర్చలతో ఒరిగిందేమి లేదంటున్న టీచర్లు మోడల్ ప్రైమరీ హెచ్‌ఎంలుగా ఎస్‌ఏల నియామకం అశాసీ్త్రయం డీఈఓ కార్యాలయాల ముట్టడి వాయిదాపై టీచర్ల ఆగ్రహం
19 డిమాండ్‌లలో
కొన్నే పరిష్కారం
ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు 19 రకాల డిమాండ్‌లను కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టారు. అయితే ఈనెల 20 న నిర్వహించిన చర్చల్లో కొన్ని మాత్రమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవి కూడా కపట హామీలే. కీలక డిమాండ్‌లైన ఇంగ్లీష్ కు సమాంతరంగా తెలుగు, ఇతర మైనర్ మీడియంలను కొనసాగించి టీచర్ల ను అలాగే కొనసాగించాలన్న డిమాండ్ ను తిరస్కరించారు. ఉన్నత పాఠశాలల్లో 1:35 నిష్పత్తిని అమలు చేయాలని, 45 మంది విద్యార్థులు దాటాక రెండో సెక్షన్ ఏర్పాటు పైనా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మోడల్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలుగా స్కూల్ అసిస్టెంట్‌లను నియమించడం అశాసీ్త్రయం. అయితే ఆ డిమాండ్‌ను పరిష్కరించలేదు.
చర్చలు సాగింది వీటిపైనే..
క్షేత్ర స్థాయిలో టీచర్లు మ్యాన్యువల్, వెబ్ కౌన్సిలింగ్ అంటూ రెండు గ్రూపులుగా విడిపోయారు. ఈ విధానం కొందరికి నష్టం కానుంది.
49 తర్వాత 50 రోల్ ఉంటేనే రెండవ సెక్షన్ అని అన్నారు. దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే అలాంటి స్కూల్స్ చాలా తక్కువగా ఉంటాయి. దీంతో ఉపయోగమేమి లేదు.
1,2 తరగతులతో ఉండే ఫౌండేషన్ స్కూల్ లో సంఖ్య 20 దాటిన స్కూల్స్ భూతద్దం పెట్టి వెతికితే మండలానికి ఒకటి, రెండు ఉంటాయి. కొన్ని మండలాల్లో అయితే ఒక్కటీ ఉండే అవకాశం లేదు.
ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎంల విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య ఇప్పట్లో తేలే అంశం కాదు.. దీంతో ఎన్ని హామీలు ఇచ్చినా నమ్మే ప్రసక్తి లేదని టీచర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఉద్యోగోన్నతుల మాట ఎక్కడా ప్రస్తావించ లేదు.
ఎస్జీటీలకు మాత్రమే మ్యాన్యువల్ కౌన్సెలింగ్ మిగిలిన వారికి వెబ్ కౌన్సెలింగ్ ఇదెక్కడి న్యాయం.
తాత్కాలికంగా వాయిదా
ఈనెల 21న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేపట్టాల్సిన ముట్టడిని తాత్కాలికంగా వాయిదా వేశాం. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన చర్చల్లో కొన్ని డిమాండ్‌లు పరిష్కరిస్తామన్నారు. దీంతో తాత్కాలికంగా వాయిదా వేశాం.
– జీవీ, రమణ, యూటీఎఫ్
రాష్ట్ర కార్యదర్శి, చిత్తూరు జిల్లా.
ప్రభుత్వం మొండి వైఖరి
ప్రస్తుత కూటమి ప్రభుత్వం టీచర్లపై మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. గత ప్రభు త్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తె లుగు మాధ్యమం, మాతృభాష తప్పనిసరిగా ఉండాలని అప్పట్లో గగ్గోలు పెట్టారు. ప్రభుత్వం ప్రస్తుతం స్కూల్స్‌లో తెలుగు మీడియం పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు.
– రెడ్డిశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌టీఏ రాష్ట్ర ట్రెజరర్, చిత్తూరు జిల్లా
ఏం సాధించారని వాయిదా!
ఏం సాధించారని వాయిదా!