జైళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

జైళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం

May 20 2025 1:50 AM | Updated on May 20 2025 1:50 AM

జైళ్ల

జైళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం

పోలీసు, న్యాయ వ్యవస్థలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందనే విమర్శలొస్తున్నాయి. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జిల్లా కారాగారంతో పాటు మొత్తం 10 జైళ్లు ఉండగా ప్రస్తుతం అవి ఆరుకే పరిమితమయ్యాయి. పుత్తూరు, చంద్రగిరి, పలమనేరు, వాల్మీకిపురంలోని జైళ్లు శిథిలావస్థకు చేరడంతో వాటిని తొలగించారు. వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తామని శిలాఫలకాలు వేసిన పాలకులు నిర్మాణ పనులను దశాబ్దాలుగా గాలికి వదిలేశారు.

పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 10 జైళ్లు ఉండగా ఇందులో తిరుపతి, మదనపల్లె, పీలేరులోని సబ్‌జైళ్లు మాత్రం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిర్మించినవి. మిగిలినవన్నీ బ్రిటీష్‌ కాలంలో నిర్మించినవే. వీటిలో కొన్ని శిథిలావస్థకు చేరుతుండడంతో వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని భావించిన జైళ్లశాఖ అధికారులు పుత్తూరు, పలమనేరు, వాల్మీకిపురం, చంద్రగిరి సబ్‌జైళ్లను మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జైళ్ల సంఖ్య ఆరుకే పరిమితమయ్యాయి. మూసివేసిన పుత్తూరులో సబ్‌జైల్‌ స్థానంలో నూతన భవన నిర్మాణానికి నందిమంగళం రెవెన్యూ లెక్క దాఖలాలోని సర్వే నంబర్‌ 242/22లో 2 ఎకరాల భూమిని రాష్ట్ర జైళ్ల శాఖకు స్థానిక రెవెన్యూ శాఖ కేటాయించింది. ఈ మేరకు 2010 జూన్‌ 18న అప్పటి జైళ్ల శాఖ ఐజీ గోపీనాఽథ్‌రెడ్డి నూతన జైలు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. పలమనేరులోని జైలును సైతం మూసివేసిన అధికారులు ఆ స్థలంలో పెట్రోల్‌ బంకు నిర్మాణ పనులు ప్రారంభించారు. అలాగే వాల్మీకిపురంలోని జైలును మూసివేసి తిరుపతి–మదనపల్లె మార్గంలో రూ.4 కోట్ల అంచనాతో జైలు నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఈ భవన నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తయిన తర్వాత అర్థాంతరంగా ఆగిపోయి ఏళ్లు గడుస్తుండడంతో కొత్త భవనం సైతం శిథిలావస్థకు చేరుతోంది. అలాగే చంద్రగిరిలోని కారాగారం శిథిలావస్థకు చేరడంతో దానినీ మూసివేశారు. ఇలా ఉన్న జైళ్లను తొలగించడంతో పుత్తూరు సబ్‌కోర్టు ద్వారా శిక్షలు పడిన ఖైదీలను 70 కిలోమీటర్ల దూరంలోని సత్యవేడు సబ్‌జైలుకు, అలాగే పలమనేరు, వాల్మీకిపురం కోర్టుల్లో శిక్షలు పడిన ఖైదీలను పీలేరులోని సబ్‌జైలుకు తరలిస్తున్నారు. ఇది పోలీసులతో పాటు ఖైదీలకు, వారి కుటుంబీకులకు వ్యయ ప్రయాసలతో కూడుకుంటోంది. అలాగే జైళ్లలోని గదులు చాలక ఖైదీలను ఎక్కువ మందిని ఒకే సెల్‌లో నిర్బంధించాల్సిన పరిస్థితి. ఈ దుస్థితి 15 ఏళ్లుగా ఉంటున్నా పాలకులు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు.

ప్రతిపాదనలు పంపించాం

వాల్మీకిపురంలో జైలు నిర్మాణానికి 2012లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో రూ.4 కోట్లు మంజూరైంది. తొలిదశలో రూ.2 కోట్లు విడుదల కాగా అంత వరకు పనులు జరిగి ఆగిపోయాయి. ఇటీవలే కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. పలమనేరులోని జైలును 15 ఏళ్ల క్రితమే మూసివేశారు. 40 సెంట్లు మాత్రమే ఉన్న ఆ స్థలంలో నూతన జైలు నిర్మాణానికి అవకాశం లేదు. ఇక్కడ స్థలాన్ని ఐఓసీ పెట్రోల్‌ బంకుకు కేటాయించాం. పలమనేరులోనే మరోచోట జైలు నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కావాలని జిల్లా కలెక్టర్‌ను నివేదిక సమర్పించాం. అది పరిశీలనలో ఉంది. పుత్తూరులో జైలు నిర్మాణానికి నిధులు మంజూరు కావల్సి ఉంది.

వాల్మీకిపురంలో నూతన జైలు భవన నిర్మాణ దుస్థితి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జైళ్ల కేంద్రాలు

చిత్తూరు

(జిల్లా కారాగారం)

పుత్తూరు

తిరుపతి పలమనేరు

మదనపల్లె చంద్రగిరి

మూసివేసిన కేంద్రాలు

పీలేరు వాల్మీకిపురం

శ్రీకాళహస్తి

సత్యవేడు

పుత్తూరు, చంద్రగిరి, పలమనేరు, వాల్మీకిపురం జైళ్లు మూసివేత

దశాబ్దాలు గడుస్తున్నా ఊసేలేని కొత్త జైళ్ల నిర్మాణం

పట్టించుకోని పాలకులు

ఖైదీలకు మెరుగైన సేవలు

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న జైళ్లలో 306 మంది ఖైదీలు ఉన్నారు. ఒక్క చిత్తూరు జిల్లా కారాగారంలోనే 130 మంది ఖైదీలు ఉన్నారు. ఇక్కడ ఓపెన్‌ స్కూల్‌ నడుపుతున్నాం. గత ఏడాది 11 మంది, ఈ ఏడాది ఐదుగురు పదవ తరగతి పరీక్షలు రాసి ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారు. అన్ని జైళ్లలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ కింద శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పొందిన వారికి కలెక్టర్‌ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశాం. శిక్షణ పొందిన వారు జైలు నుంచి విడుదల అయ్యాక బ్యాంకు రుణాలు పొంది కొత్త జీవితం ప్రారంభించవచ్చు. రోజూ అన్ని జైళ్లలో ఖైదీలతో యోగా, వ్యాయామం చేయిస్తున్నాం. మహిళా ఖైదీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. – ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా జైలు అధికారి, చిత్తూరు.

జైళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం 1
1/3

జైళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం

జైళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం 2
2/3

జైళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం

జైళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం 3
3/3

జైళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement