రేషన్‌ బండ్లను కొనసాగించాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బండ్లను కొనసాగించాలని నిరసన

May 23 2025 2:13 AM | Updated on May 23 2025 2:13 AM

రేషన్

రేషన్‌ బండ్లను కొనసాగించాలని నిరసన

● ఇంటింటా రేషన్‌కు కూటమి మంగళం ● ఎండీయూ వాహనాలు రద్దు ● చౌక దుకాణాల ద్వారానే ఇక సరుకులు ● అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కార్డుదారులు

కూటమి ప్రభుత్వం బియ్యం పంపిణీ బండికి బ్రేకులు వేసింది. ఇంటింటా రేషన్‌కు మంగళం పాడింది. రేషన్‌ వాహనాలను రద్దు చేసింది. ప్రభుత్వం దెబ్బకు అయిదేళ్లుగా సేవలు అందించిన (ఎండీయూ) మొబైల్‌ డిస్టిబ్యూటరీ యూనిట్లు నిలిచిపోనున్నాయి. వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి బతుకులు రోడెక్కనున్నాయి. ఈ నిర్ణయంతో చంద్రబాబు నైజమేంటో మరోసారి ప్రజలకు తేటతెల్లమైంది. దీనిపై కార్డుదారులు, ఎండీయూ వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రేషన్‌ షాపునకు వెళ్లాల్సిందే..

హామీలివ్వడం అధికారంలోకి వచ్చాక గాలికొదిలేయడం చంద్రబాబుకు పరిపాటే. తాజాగా ఇంటింటికి సరుకులు అందించే ఎండీయూ వాహనాలను రద్దు చేసి, మళ్లీ పాత పద్ధతిలో సరుకులు ఇస్తామని ప్రకటించారు. జిల్లాలో 1390 రేషన్‌ షాపులు ఉన్నాయి. వీటి కింద 5.40 లక్షల కార్డుదారులు ఉన్నారు. వారందరికీ 9వేల మెట్రిక్‌ టన్నుల మేర రేషన్‌ను పంపిణీ చేయాలి. దానికోసం వైఎస్సార్‌సీపీ 336 ఎండీయూ వాహనాలను పెట్టి ఇంటింటికీ సరుకులు పంపిణీ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాహనాల భారాన్ని భరించలేక ఏకంగా రద్దు చేసేసి పాత పద్ధతిలో పంపిణీ చేస్తామంటోంది. అంటే ప్రజలు రేషన్‌ షాపుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తుంది.

ఇంటింటి సేవలకు మంగళం

కూటమి ప్రభుత్వం సంక్షేమాన్నే కాదు ప్రజలకు ఇవ్వాల్సిన సేవలను కూడా వదిలేస్తోంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. సేవలు అందుకోవడం ప్రజల హక్కు అని భావించి.. సామాన్యుడి ఇంటి వద్దకే అనేక సేవలు అందజేసింది. వలంటీర్ల ద్వారా ప్రజలకు ఏం అవసరమో గుర్తించి, వాటిని నేరుగా అందజేసింది. సంక్షేమ పథకాలతో పాటు అధికారిక సేవలను ఇంటి చెంతకే చేర్చింది. 15 వేల మందికి పైగా వలంటీర్ల ద్వారా ప్రజలకు 539 సేవలు అందించింది. రేషన్‌ అందించడం కోసం వాహనాలను ఏర్పాటు చేసి వేల మందికి ఉపాధి చూపించింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చీ రావడంతోనే వలంటీర్‌ వ్యవస్థను తీసేసింది. ప్రతి పౌర సేవకు వీధివీధితోనూ ఐదేళ్లుగా అనుబంధం పెనవేసుకున్న రేషన్‌ బండ్లు ఆగిపోనున్నాయి. సామాన్యుడి ఇంటి వద్దకే వచ్చి సరుకులు అందించిన ఈ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇక రేషన్‌ కోసం డిపో ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే.

రోడ్డున పడిన ఆపరేటర్లు

జిల్లాలో ఎండీయూ వాహనాలపై ఆపరేటర్లతో పాటు సిబ్బంది ఆధారపడి ఉన్నారు. ఒక్కో వా హనానికి నెలకు రూ.18 వేల వరకు వచ్చేది. 1500 నుంచి 2000 ఇళ్ల వరకు సరుకులు నేరుగా పంపిణీ చేసేవారు. వీరంతా ఇప్పుడు రోడ్డున పడాల్సిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. వాస్తవంగా ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం గడువు ఉంది. కానీ ఉన్న ఫలంగా వాహనాలను ఆపేయడంతో వారి పరిస్థితి దయనీయంగా త యారైంది. వారంతా ఆందోళన చెందుతున్నారు. రోడ్డెక్కడానికి సిద్ధమవుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆపరేటర్‌లపై పగబట్టి ప్రతికారం తీర్చుకుంటోంది. జీతాల్లో కోతలు పెట్టించి నానా అవస్థలకు గురిచేసింది.

రేషన్‌ పంపిణీ చేస్తున్న ఆపరేటర్‌ (ఫైల్‌)

ఇంటి నుంచి కాలు కదపకుండా.. కష్టం తెలియకుండా గడప వద్దే రేషన్‌ అందించిన ఘనత గత ప్రభుత్వ చరిత్ర.. నేటి కూటమి ప్రభుత్వంలో ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పునకు కిలోమీటర్ల కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి .. గంటల తరబడి చౌక దుకాణం ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నేడు కార్డుదారులు ఎదుర్కోవాల్సి రావడంతో కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదల కోసం గత వైస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక్కో పథకాన్ని కూటమి సర్కారు నిర్వీర్యం చేస్తుండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు వేల మంది ఎండీయూ ఆపరేటర్లు నేడు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. – కాణిపాకం

రేషన్‌ బండ్లను కొనసాగించాలని నిరసన 1
1/1

రేషన్‌ బండ్లను కొనసాగించాలని నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement