
‘డెప్యుటేషన్‌లను కొనసాగిస్తున్నాం’
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వైద్య విధాన పరిషత్‌లో డెప్యుటేషన్లను కొనసాగిస్తున్నామని డీసీహెచ్‌ఎస్ పద్మాంజలి ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షి దినపత్రికలో గురువారం డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో వర్గపోరు పేరిట కథనం ప్రచురితమైంది. దీనిపై ఆమె స్పందించారు. డెప్యుటేషన్ విషయంపై ఆస్పత్రి అధికారులు, కార్యాలయ అధికారులతో మాట్లాడారు. తప్పిదాలను తెలుసుకున్నారు. డెప్యుటేషన్ల రద్దు చేస్తూ ఇచ్చిన ఆర్డర్లను వెనక్కు తీసుకున్నారు. ఈ డెప్యుటేషన్లు యథావిధిగా కొనసాగుతాయన్నారు. కార్యాలయంలోని అధికారులు, సిబ్బందిని పిలిచి కార్యాలయానికి చెడ్డపేరు రాకుండా చూడాలని, విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆమె హెచ్చరించారు.