
విశ్వరూపం.. దివ్యతేజం
● అమ్మవారిని దర్శించుకున్న సీఎం దంపతులు ● విచిత్ర వేషధారణలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు ● జనసంద్రంగా మారిన ఆలయ ప్రాంగణం
కుప్పం : శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర సందర్భంగా బుధవారం అమ్మవారి విశ్వరూప దర్శనం కనులపండుగగా జరిగింది. శిరస్సు ఊరే గింపు ముగించుకుని అమ్మవారి ఆలయంలో విశ్వరూప దర్శనం ఏర్పాటు చేశారు. ఏడాదికి ఒక్కసా రి మాత్రమే జరిగే విశ్వరూప దర్శనాన్ని తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆ లయ ప్రాంగణం కిక్కిరిసింది. పొంగళ్లు, పిండితో తయారు చేసిన దీపాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని వజ్ర కిరీటం, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది ప్రత్యేక దర్శ నం కోసం రూ.100, రూ.200 టికెట్లు పెట్టి వీ ఐపీలకు దర్శన సౌకర్యం కల్పించారు.
అమ్మవారిని దర్శించుకున్న సీఎం దంపతులు
ముఖ్యమంత్రి చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి బుధవారం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దర్శనం చేసుకున్నారు. బుధవారం ఉదయం చంద్రబాబు 12.30 గంటలకు బెంగళూరు నుంచి కుప్పంలోని ద్రవిడ వర్సిటీ హెలీప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి దేవస్థానానికి చేరుకున్నారు. అనంతరం 2 గంటలకు బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు.

విశ్వరూపం.. దివ్యతేజం