కుప్పం రూరల్: అనుమానాస్పద స్థితిలో చెరువులో పడి గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రామకుప్పం చెరువులో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం.. సుమారు 65 సంవత్సరాల వయస్సు కలిగిన వృద్ధురాలు నాలుగు రోజుల క్రితం చెరువులో పడిన మృతి చెందినట్టు తెలుస్తోంది. ఐదు అడుగుల ఎత్తు కలిగి, ఎర్రగులాబీ రంగు చీర, వంకాయ పువ్వు రంగు పావడా, ఆకుపచ్చ, తెలుపు రంగుల పూసల హారం ధరించి ఉంది. రెండు చేతులపై పచ్చబొట్లు ఉన్నాయి. మృతురాలు వివరాలు ఎవరికై నా తెలిస్తే 9440900703 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రమాద వశాత్తు చెరువులో పడిందా.. లేక ఎవరైనా కొట్టి చంపి చెరువులో పడేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.