
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తవణంపల్లె: తిరుపతి– బెంగళూరు హైవేలో గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు తవణంపల్లె ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. ఆయన కథనం.. మండలంలోని తిరుపతి– బెంగళూరు హైవేలో జేఎంఆర్ దాబా సమీపంలో గుర్తుతెలియని సుమారు 32 ఏళ్ల వ్యక్తి రోడ్డు దాటుతుండగా శనివారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ క్రమంలో సదరు వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని ఆచూకీ లభించలేదు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం చిత్తూరు హాస్పిటల్‌కు తరలించారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే 9440900685లో సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు.