
స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం పాఠశాలలో శనివారం సైనిక్, నవోదయ పోటీ పరీక్షల అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్సీ ఎంవీ.రామచంద్రారెడ్డి, అపుస్మా రాష్ట్ర అడకమిక్ కోఆర్డినేటర్ వీఆర్.రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ సైనిక్, నవోదయ, మిలటరీ స్కూల్స్ తదతర పోటీ పరీక్షల్లో విశ్వం విద్యార్థులు సీట్లు సాధిస్తుండడం గర్వకారణమని తెలిపారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న విశ్వం విద్యాసంస్థను అభినందించారు. విశ్వం విద్యాసంస్థ అధినేత ఎన్.విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ గత 34 ఏళ్లుగా అనుభజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యా బోధన అందిస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత సమాచారానికి 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో విశ్వం విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.