
అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలు
తవణంపల్లె: గ్రామీణ ప్రాంత ప్రజలకు అరగొండ అపోలో హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలతో సరసమైన ధరలకు మోకాళ్ల కీళ్లు, తుంటి మార్పిడి (ఆర్థోపెడిక్) శస్త్ర చికిత్సలు చేయడమే లక్ష్యమని ఆర్థోపెడిక్ చీఫ్ కన్సల్టెంట్, సీనియర్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ మదన్‌మోహన్ రెడ్డి డైరెక్ట్ యాంటీరియర్ వెల్లడించారు. శనివారం మండలంలోని అరగొండ అపోలో హాస్పిటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యాధునిక ఇమేజింగ్, స్పెషల్‌జ్డ్ ఇన్‌స్ట్రుమెంట్లతో శిక్షణ పొందిన ఆర్థోపెడిక్ సర్జన్లచేత శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్(డీఏఏ), వైద్య నిపుణులచేత చైన్నె అపోలో హాస్పిటల్లో శస్త్ర చికిత్సలు నిర్వహించి అద్భుతమైన ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అరగొండ అపోలో హాస్పిటల్లో హిప్ రీప్లేస్‌మెంట్ కోసం డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ అనే అత్యాధునిక, మిరిమల్లి ఇన్వేసివ్ టెక్నిక్‌ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. కండరాలకు(మజిల్స్‌కు) హాని కాకుండా శస్త్ర చికిత్స అనంతరం నొప్పి తక్కువగా ఉంటుందని వివరించారు. ఆస్టియోఆర్ర్‌థెటిస్ రుమటాయిడ్ ఆర్ర్‌థెటిస్, హిమ ప్రాక్చర్ వంటి సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఇది మంచి అవకాశమన్నారు. అరగొండ అపోలో హాస్పిటల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్(డీఏఏ)ని జిల్లాలోని గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఆర్థోపెడిక్ సర్జన్ నిపుణులు డాక్టర్ కార్తీక్‌రెడ్డి, డాక్టర్ ప్రవీణ్, అనస్టీయాలజీ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీనివాసన్ సోమసుందరమ్, పీఆర్‌ఓ కమ్రుద్దీన్ పాల్గొన్నారు.