కాణిపాక ఆలయ హుండీ ఆదాయం రూ.1.75 కోట్లు
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీ ఆదాయం రూ.1.75 కోట్లు వచ్చినట్టు ఈఓ పెంచలకిషోర్ తెలిపా రు. గోసంరక్షణ హుండీ ద్వారా రూ.10,569, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.41,660 వచ్చింది. యూఎస్‌ఏ 208 డాలర్లు, సింగపూర్ 112 డాలర్స్, మలేషియా 32 రింగిట్స్, యూఏఈ 170 దిర్హామ్స్ వచ్చాయి. బంగారం 49 గ్రాములు, వెండి 1.425 కిలోలు వచ్చింది. ఏఈవోలు రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, నాగేశ్వరరావు, కోదండపాణి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.
యువకుడి అరెస్ట్
చౌడేపల్లె: బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. శనివారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆమినిగుంట పంచాయతీ, నూనెముద్దనపల్లెకు చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన నాగేంద్ర మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడన్నారు. ఈ విషయమై గ్రామంలో పంచాయితీ నిర్వహించి విఫలం కావడంతో బాధితురాలు పోలీసులను ఏప్రిల్ 8న ఆశ్రయించిందని, గర్భవతిని చేయడంతోపాటు ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తామని, కులం పేరుతో దూషించినట్లు పేర్కొందని తెలిపారు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అరెస్ట్ చేసిన యువకుడిని పుంగనూరు కోర్టుకు తరలించారు. ఎస్‌ఐ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
తప్పిన పెను ప్రమాదం
పలమనేరు: మండలంలోని బేలుపల్లి క్రాస్ వద్ద శుక్రవారం రాత్రి ఓ కంటైనర్, కారు ఢీకొన్న ప్రమాదంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ వైపు వర్షం కురుస్తుండగా తమిళనాడు నుంచి భారీ పరికరంతో కంటైనర్ పలమనేరుకు వస్తోంది. ముందుగా వెళుతున్న కారు ఆగడంతో వెనుకనున్న కంటైనర్ ఉన్నట్టుండి ఆపే ప్రయత్నం చేయగా.. భారీ వాహనం ఆగకుండా కారును ఢీకొంది. కంటైనర్ ముందున్న క్యాబిన్ నుజ్జునుజ్జయ్యింది. కారు వెనుక వైపు భాగం దెబ్బతింది. లారీ డ్రైవర్ కంటైనర్‌లోంచి దూకి ప్రాణాలను కాపాడుకోగా కారులోని వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
కాణిపాక ఆలయ హుండీ ఆదాయం రూ.1.75 కోట్లు
కాణిపాక ఆలయ హుండీ ఆదాయం రూ.1.75 కోట్లు


