
పాఠశాల స్థలంలో నిర్మాణాలొద్దు
● అడ్డుకున్న గ్రామస్తులు
శ్రీరంగరాజపురం : పాఠశాల స్థలంలో ఆ పాఠశాలతో సంబంధం లేని నిర్మాణాలు చేపట్టరాదంటూ.. స్థానిక సర్పంచ్ విజయ, గ్రామాస్తులు అడ్డుకున్నారు. స్థానుకుల కథనం.. మండలంలోని వెంకటాపురం రెవెన్యూ పరిధిలోని పోదలపల్లి గ్రామంలో సర్వే నం.213/16లో ఎకరం 13 సెంటు భూమిని ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. ప్రస్తు తం ఇక్కడ ప్రాథమిక పాఠశాల నడుస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలను మరింత అభివృద్ధి చేశారు. మిగిలిన ఖాళీ స్థలంలో అప్పటి తహసీల్దార్ షబ్బీర్‌బాషా 05 సెంటు భుమిని అంగన్‌వాడీ కేంద్రానికి కేటాయించారు. పక్కా భవనం కూడా మంజూరైంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాగానే శనివారం ఎమ్మెల్యే వ్యక్తిగత పీఏ దాము పొదలపల్లి గ్రామానికి కమిటీ హాలు మంజూరైందంటూ పనులు ప్రారంభించారు. స్థానిక సర్పంచ్, గ్రామస్తులు ఆ పనులను అడ్డుకున్నారు. పాఠశాల స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని పేర్కొన్నారు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే పీఏ ‘నాకు అనుతులు ఉన్నాయి.. ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నాయి.. ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు పెట్టిస్తా’నాంటూ రెచ్చిపోయారు. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందిచి పాఠశాల స్థలాన్ని రక్షించాలని కోరారు.