
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 35 పరీక్ష కేంద్రాల్లో నాల్గవ రోజు గురువారం ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా సాగినట్లు డీఐఈవో డా.ఆదూరు శ్రీనివాసులు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం నిర్వహించిన మొదటి సంవత్సర పరీక్షకు జనరల్ విభాగంలో 5,767 మందికిగాను 5,572 మంది విద్యార్థులు హాజరు కాగా 195 మంది గైర్హాజరయ్యారని, వొకేషనల్ విభాగంలో 286 మందికిగాను 259 మంది హాజరుకాగా 27 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం జనరల్ పరీక్షలో 910 మందికి గాను 869 మంది, వొకేషనల్ విభాగంలో 112 మందికి గాను 103 మంది హాజరైనట్టు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పీసీఆర్ జనరల్, ఒకేషనల్ కళాశాలలను తనిఖీ చేయగా, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు దయానందరాజు, బాలసుబ్రహ్మణ్యం, శరత్‌చంద్రశేఖర్ ఆయా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని వెల్లడించారు.