
కార్పొరేషన్ కమిషనర్‌కు ప్రమాదం
పాకాల : కారు వెనుక టైరు పంక్చర్ కావడంతో చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ కారు ఫల్టీలు కొట్టింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం సాయంత్రం చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళుతుండగా పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిపై మండల పరిధిలోని గాదంకి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో కమిషనర్‌తో పాటు సీసీ అమర్నాథ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. వేగంగా వెళుతున్న కారు టైరు ఒక్కసారిగా పంక్చర్ కావడంతో కారు మూడు ఫల్టీ లు కొట్టి ప్రయాణిస్తు న్న మెయిన్ రోడ్డు నుంచి సర్వీసు రోడ్డుకు చేరుకుంది. అదే మార్గంలో పూతల పట్టు ఎమ్మెల్యే మురళి కారులో ప్రయాణిస్తున్న ఆయన పీఏ భాను ప్రమాదాన్ని గమనించి చికిత్స నిమిత్తం ఇద్దర్నీ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు.