● జాతరకు సర్వం సిద్ధం
చిత్తూరు గ్రామదేవత గంగమ్మ తల్లి జాతరకు సర్వం సిద్ధమైంది. గంగమ్మ తల్లిని మంగళవారం వేకువ జామున కొలువుదీర్చనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో భారీ ఏర్పాట్లు చేపట్టారు. సంతపేట, కొంగారెడ్డిపల్లి. ఓబన్నపల్లి, గిరింపేట, కట్టమంచి ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో తొలిపూజ జరగనుంది. దొడ్డిపల్లిలో సోమవారం అర్ధరాత్రి నుంచే అమ్మవారు ఇంటింటా వెళ్లి పూజలు అందుకోకున్నారు. మంగళవారం ఉదయం ఆయా వీధుల్లో కొలువుదీరనున్నారు.
– చిత్తూరు రూరల్ (కాణిపాకం)


