
ఇళ్లను కూల్చేందుకు కుట్ర
గత 30 ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లను కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నారని యాదమరి మండలం, దాసరపల్లి గ్రామ పంచాయతీ ఆది ఆంధ్రవాడ ప్రజలు వాపోయారు. ఈ మేరకు వారు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలోని సర్వే నం.343/2 డీలో ఎకరా ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఆ భూమిలో గత 30 ఏళ్లుగా కొన్ని కుటుంబాలు గృహాలు నిర్మించుకుని నివసిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం తమ ఇళ్లను కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నారని వాపోయారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.