
మా మొర ఆలకించరా?
‘అయ్యా.. మా మొర ఆలకించండి. సమస్యలు పరిష్కరించండి’ అంటూ పలువురు అధికారులకు మొరపెట్టుకున్నారు.
మంగళవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2025
చిత్తూరు అర్బన్: అన్నదాత ఖర్చు తగ్గించుకుని లాభాసాటి వ్యవసాయం చేసేందుకు ప్రభుత్వం వ్యవసాయ పరికరాలు అందచేయడం పరిపాటి. ఈ క్రమంలో రైతులకు అవసరమైన పరికరాలను అందించాలని కూటమి ప్రభుత్వం భావించింది. వ్యవసాయానికి అవసరమైన యంత్రపరికరాలు ఇవ్వడానికి జిల్లాకు రూ.2.85 కోట్ల వ్యయంతో 1,645 పరికరాల కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆ పరికరాల కొనుగోలుకు చాలా మంది రైతులు ఆసక్తి చూపడం లేదు.
అనుకున్నదొక్కటి
బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే రాయితీపై ఇస్తున్న పరికరాల ధర ఎక్కువగా ఉండడమే రైతులు వీటిని వద్దనడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. రాయితీపోను రైతులకు వచ్చే లబ్ధి చాలాతక్కువగా ఉంది. ఫలితంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యవసాయశాఖ అధికారులు నానాపాట్లు పడుతున్నారు. ఓ వైపు జిల్లా యంత్రాంగం రోజువారీ సమీక్షలు చేస్తూ లక్ష్యం మేరకు రైతులతో రాయితీ పరికరాలు కొనుగోలు చేయించాలని నిర్దేశించారు.
ఇదేంది ఇలా జరిగిందబ్బా!
రైతుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ట్రాక్టరు ఆధారిత పరికరాలకు కేటాయించిన రాయితీ సొమ్మును తైవాన్ స్ప్రేయర్లు వంటివాటికి వాడుకునేలా ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ప్రభుత్వం అందించే రాయితీ పరికరాలు తీసుకోవడానికి రైతులు పోటీపడి ముందుకు వస్తారనుకుంటే పరిస్థితి భిన్నంగా ఉందని మండలాల్లోని వ్యవసాయ అధికారులు వాపోతున్నారు. మండలానికి ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. రొటావేటర్లు, హైడ్రాలిక్ రివర్స్ నాగళ్లు, ట్రాక్టర్ ఆధారిత పనిముట్లను రైతులు కొనుగోలు చేయడం లేదు.
40 శాతం మంది దూరం
సేద్యానికి అవసరమైన యంత్ర సాయం వ్యక్తిగతంగా అందించేందుకు పరికరాలు ఆయా మండలాలకు చేరుస్తున్నారు. తొలుత జిల్లాలోని 36 మండలాల్లో అన్నదాతలకు రొటావేటర్లు, పవర్ టిల్లర్స్, బ్యాటరీ స్పేయర్లు, పవర్ వీడర్లు అందించేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగానే పరికరాలు అవసరమైన వారి నుంచి వివరాలు సేకరించి అధికారులు ఆన్‌లైన్ చేయించారు. ఐదెకరాల లోపు భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ, మహిళ, సన్న, చిన్నకారు రైతులకు వీటిని కేటాయించారు. జిల్లాకు 1,645 యూనిట్ల పరికరాల కేటాయింపే లక్ష్యంగా చేసుకున్నారు. కానీ ఇప్పటివరకు వరకు 1,016 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అంటే 40 శాతం మంది రైతులు రాయితీ పరికరాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా ఇప్పటికే గడువు ముగిసినా, లక్ష్యం చేరువుకాకపోవడంతో మిగిలిన యూనిట్లకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
సబ్సిడీ వ్యవసాయ పరికరాలపై అనాసక్తి
రాయితీ పరికరాల కొనుగోలుకు ఆసక్తి చూపించని రైతులు
మార్కెట్ ధరతో పోలిస్తే తక్కువ లబ్ధే కారణం
మళ్లీ దరఖాస్తుకు అవకాశమిచ్చిన యంత్రాంగం
జిల్లాలో రాయితీ పరికరాల లక్ష్యాలు పరికరం కేటాయింపు వచ్చిన పరికరాలు
ట్రాక్టర్ 740 582
రోటావేటర్ 94 76
బ్యాటరీస్పేయర్లు 280 256
పవర్ వీడర్లు 109 89
బ్రష్‌కట్టర్లు 08 02
వపర్ టిల్లర్స్ 02 02
‘రైతులకు నిత్యం అవసరమైన రొటావేటర్ పరికరానికి వ్యవసాయశాఖ నిర్ణయించిన ధర రూ.1,51,980. ప్రభుత్వం ఇస్తున్న రాయితీ రూ.50 వేలు. రైతు చెల్లించాల్సింది రూ.1.02 లక్షలు. కానీ ఇదే పరికరం మార్కెట్ ధర రూ.1.20 లక్షలు. రాయితీ ఇచ్చినా ధరలో పెద్దగా తేడా లేకపోవడంతో మంచి కంపెనీ నుంచి రొటావేటర్ కొనుక్కోవచ్చని రైతులు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఇస్తున్న రాయితీ పరికరాలపై పెద్దగా ఆసక్తి చూపించలేకపోతున్నారు.’
.. ఇది ఒక్క రొటావేటర్ పరిస్థితే కాదు.. కూటమి ప్రభుత్వం అందజేస్తున్న స బ్సిడీ వ్యవసాయ పనిముట్ల రేట్లన్నీ ఇదేవిధంగా ఉండడంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. బయట మార్కెట్‌లో మంచి కంపెనీకి చెందిన పరికరాలు కొనుగోలు చేయొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోలేక అధికారులు ఆపసోపాలు పడాల్సి వస్తోంది.
కావాల్సినవి తెప్పిస్తాం
జిల్లాలో రూ.2.85 కోట్ల రాయితీపై 1,645 వ్యవసాయ పరికరాలు అందించేలా చూస్తున్నాం. ఇప్పటికే కొన్ని చోట్ల పరికరాలు ఇచ్చేశాం. కొందరు రైతులు పరికరాల కొనుగోలుపై ఆసక్తి చూపకపోవడంతో వాళ్లకు ఏ పరికరాలు కావాలో వాటిని తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం.
– మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

మా మొర ఆలకించరా?

మా మొర ఆలకించరా?

మా మొర ఆలకించరా?