పార్టీలకతీతంగా పనిచేయండి
చిత్తూరు కార్పొరేషన్ : ప్రజల సొమ్ముతో చేసే పనులకు పార్టీల ముద్ర వేసి అడ్డుపడవద్దని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల ఏఓలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మండల స్థాయిలో సక్రమంగా పనిచేయకపోవడంతో గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు చేయించడం వదిలేసి రాజకీయముద్ర వేసుకోవద్దని హితువు పలికారు. మండల స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్‌లో సమస్యలు వచ్చిన వాటిని నమోదు చేయకుండా ఏఓలు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. దీంతో అక్కడ పట్టించుకోవడం లేదని జిల్లా స్థాయిలో ఫిర్యాదులు ఇస్తున్నారన్నారు. పనులను క్షేత్ర స్థాయిలో కనీసం పరిశీలించడం లేదని తెలుస్తోందన్నారు. ఇంత అధ్వానంగా పనిచేస్తే ఎలా అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మండలాల్లో దాదాపు 10–15 పనులను పరిశీలిస్తారని వాటిని చూడటానికి మీకు ఓపిక లేదా అని సీఈఓ ప్రశ్నించారు. తూర్పు మండలాల్లో 500 అడుగులు లోతులో బోరు వేస్తున్నట్లు బిల్లులు పెట్టడం చూసి విస్తుపోతున్నామన్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద దళితవాడల్లో వసతుల కల్పన పై ఎందుకు శ్రద్ధపెట్టడం లేదన్నారు. పంచాయతీరాజ్ పరిధిలో 5 ఏళ్లు దాటిన ప్రతి ఉద్యోగిని బదిలీ చేస్తామని సృష్టం చేశారు. రెండేళ్లు దాటిన వారు రిక్వెస్టు, మ్యూచువల్ మేరకు మార్పు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ జుబేదా తదితరులు పాల్గొన్నారు.
● ఏఓలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జెడ్పీ సీఈఓ
పార్టీలకతీతంగా పనిచేయండి


